1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.BZ

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.BZ

3
00:00:40,000 --> 00:00:43,500
సోనాక్షి సిన్హా

4
00:00:43,708 --> 00:00:47,083
జ్యోతిక

5
00:00:47,416 --> 00:00:50,291
అశుతోష్ గోవారికర్

6
00:01:02,541 --> 00:01:07,125
ఒక వ్యక్తి నేరం చేసినా,
చేయకపోయినా చట్టం పట్టించుకోదు.

7
00:01:08,500 --> 00:01:14,458
నేరం నిరూపితమైందా, లేదా అన్నదే
దానికి ముఖ్యం.

8
00:01:31,833 --> 00:01:33,708
నేను అమాయకుడిని, శ్యామ్‌జీ.

9
00:01:36,208 --> 00:01:37,458
మీకు ఆ విషయం తెలుసు కదా?

10
00:01:38,916 --> 00:01:41,083
నేను నా పని మాత్రమే చేశాను.

11
00:01:41,166 --> 00:01:42,333
ధైర్యం కోల్పోవద్దు.

12
00:01:43,166 --> 00:01:44,875
మనం హైకోర్టులో అప్పీల్ చేద్దాం.

13
00:01:45,625 --> 00:01:46,666
ఎలా?

14
00:01:48,458 --> 00:01:49,875
ఆ ఖర్చు ఎలా భరించగలను?

15
00:01:56,333 --> 00:01:57,625
అయిపోయింది.

16
00:02:00,333 --> 00:02:01,625
అంతా అయిపోయింది.

17
00:02:20,375 --> 00:02:27,333
సిస్టమ్

18
00:02:55,875 --> 00:02:59,166
హై కోర్టు

19
00:03:05,291 --> 00:03:06,708
జరగండి.

20
00:03:08,666 --> 00:03:09,750
జరగండి. మన్నించాలి.

21
00:03:12,333 --> 00:03:14,916
-నేహా మేడమ్.
-ధన్యవాదాలు.

22
00:03:47,875 --> 00:03:48,875
మన్నించాలి.

23
00:04:06,541 --> 00:04:07,541
ధన్యవాదాలు.

24
00:04:32,958 --> 00:04:34,583
కేసు వివరాలు
స్టేట్ వర్సెస్ జగ్దీష్ సింగ్

25
00:04:38,458 --> 00:04:40,958
-ఓ, హాయ్, ఆత్మారామ్.
-ఓ, హాయ్, నేహా.

26
00:04:41,958 --> 00:04:44,458
సారీ, నేను… ట్రయల్ మొదటి రోజు కదా.

27
00:04:45,000 --> 00:04:47,125
నాకు కొంచెం పరీక్షల భయంలా అనిపిస్తోంది.

28
00:04:48,625 --> 00:04:50,083
నీకు కంగారుగా లేదా?

29
00:04:50,166 --> 00:04:52,375
ఫలితాలు వచ్చే రోజు భయపడతారని అనుకున్నా.

30
00:04:52,458 --> 00:04:53,625
ఇప్పుడే కంగారు పడుతున్నావు.

31
00:04:56,250 --> 00:04:59,833
అబ్బా, డిఫెన్స్ లాయర్‌ని చూస్తుంటే
సిలబస్ అంతా చదివేసిన టాపర్‌లా ఉన్నాడు.

32
00:04:59,916 --> 00:05:01,166
అది కూడా నాలుగు సార్లు.

33
00:05:01,708 --> 00:05:02,875
ప్రశాంతంగా ఉండు.

34
00:05:03,458 --> 00:05:04,791
కొంచెం నీళ్లు తాగు.

35
00:05:10,208 --> 00:05:11,541
అహ్లావత్ సర్ వస్తున్నారు.

36
00:05:12,833 --> 00:05:14,041
అందరూ లేచి నిలబడండి.

37
00:05:14,125 --> 00:05:16,375
గౌరవనీయ న్యాయమూర్తి గారు వస్తున్నారు.

38
00:05:22,583 --> 00:05:26,583
స్టేట్ వర్సెస్ జగ్దీష్ సింగ్ కేసు
విచారణ ప్రారంభమవుతోంది.

39
00:05:26,666 --> 00:05:31,041
సర్, అక్టోబర్ 3 రాత్రి,
నా పరిధిలోని ఎక్లిప్స్ అనే

40
00:05:31,125 --> 00:05:35,625
నైట్ క్లబ్ గురించి
నాకు ఇన్ఫార్మర్ నుండి ఫోన్ వచ్చింది.

41
00:05:35,708 --> 00:05:39,583
ఆ క్లబ్‌లో డ్రగ్స్ అమ్మకాలు, వాడకం
జరుగుతున్నాయని అతను చెప్పాడు.

42
00:05:40,125 --> 00:05:42,875
అందుకే ఆ రాత్రి 11:30 గంటలకు
పూర్తి పోలీసు బలగంతో

43
00:05:44,708 --> 00:05:46,250
నేను రైడ్ చేశాను.

44
00:05:49,291 --> 00:05:50,875
అక్కడ మీకు ఏం దొరికింది?

45
00:05:50,958 --> 00:05:52,500
క్లబ్ దాదాపు ఖాళీగా ఉంది.

46
00:05:52,958 --> 00:05:55,833
అందుకే నేను బాత్‌రూమ్‌ని తనిఖీ చేశాను.
అక్కడే పార్టీ జరుగుతుంది.

47
00:05:56,500 --> 00:05:57,583
ఓ వాష్‌రూం లాక్ చేసుంది.

48
00:05:57,666 --> 00:05:59,583
మేము తలుపు కొట్టి,
బయటకు రమ్మని చెప్పాం.

49
00:05:59,666 --> 00:06:04,125
లోపల ఉన్న వ్యక్తి స్పందించకపోవడంతో,
తలుపులు పగలగొట్టాం.

50
00:06:04,791 --> 00:06:06,791
లోపల ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు?

51
00:06:06,875 --> 00:06:08,250
అక్కడ కూర్చున్న వ్యక్తి.

52
00:06:08,333 --> 00:06:09,625
మిస్టర్ జగ్దీష్ సింగ్.

53
00:06:09,708 --> 00:06:11,000
ఎక్లిప్స్ బార్ యజమాని.

54
00:06:11,083 --> 00:06:14,791
అయితే, పద్ధతి ప్రకారం,
మీరు మెడికల్ టెస్ట్ చేయించారా?

55
00:06:14,875 --> 00:06:15,916
హా, కచ్చితంగా.

56
00:06:16,791 --> 00:06:18,625
అతని రక్తంలో కొకైన్ ఉన్నట్లు తేలింది.

57
00:06:18,708 --> 00:06:21,333
రైడ్‌లో ఇంకేవైనా ఆధారాలు దొరికాయా?

58
00:06:21,416 --> 00:06:23,000
హా, మా తనిఖీలో

59
00:06:23,083 --> 00:06:25,750
మాకు బార్ క్యాబినెట్‌లో
100 గ్రాముల కొకైన్ దొరికింది.

60
00:06:26,333 --> 00:06:27,458
ధన్యవాదాలు.

61
00:06:27,541 --> 00:06:29,166
ఇక ప్రశ్నలు లేవు, యువరానర్.

62
00:06:34,666 --> 00:06:37,166
ఇన్‌స్పెక్టర్ రాఠీ, నేను సరిగ్గా వింటే,

63
00:06:37,250 --> 00:06:39,916
నా క్లయింట్ బాత్‌రూమ్‌లో ఉన్నాడని
మీరు చెప్పారు.

64
00:06:40,000 --> 00:06:41,916
మీ చెవులు చాలా షార్ప్‌గా ఉన్నాయి.

65
00:06:42,000 --> 00:06:43,208
సరిగ్గానే విన్నారు.

66
00:06:43,291 --> 00:06:46,000
బాత్‌రూమ్ తలుపు కొట్టినప్పుడు,
మీరు పోలీసులు అని చెప్పారా?

67
00:06:46,083 --> 00:06:47,875
ఖచ్చితంగా చెప్పాను.

68
00:06:47,958 --> 00:06:49,666
మేము పోలీసులు అని చెప్పడానికి సిగ్గెందుకు?

69
00:06:51,125 --> 00:06:52,041
నిశ్శబ్దంగా ఉండండి.

70
00:06:52,125 --> 00:06:53,666
మిమ్మల్ని వ్యక్తిగత ప్రశ్న అడగవచ్చా?

71
00:06:54,333 --> 00:06:55,375
అడగండి.

72
00:06:55,458 --> 00:06:58,000
ఒకవేళ మీరు టాయిలెట్‌లో ఉన్నప్పుడు
ఎవరైనా తలుపు కొడితే,

73
00:06:58,083 --> 00:06:59,833
మీరు తలుపు తీస్తారా?

74
00:06:59,916 --> 00:07:02,625
నా వ్యక్తిగత విషయాలను
అంత బహిరంగంగా ఉంచను, సర్.

75
00:07:04,416 --> 00:07:05,416
నిశ్శబ్దం.

76
00:07:06,291 --> 00:07:09,458
మీ రిపోర్ట్ ప్రకారం, క్లబ్‌లో
100 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

77
00:07:09,541 --> 00:07:12,083
103 గ్రాములు, ఖచ్చితంగా చెప్పాలంటే.

78
00:07:12,166 --> 00:07:15,208
-కానీ అది బార్ ఏరియాలో దొరికింది, కదా?
-అవును.

79
00:07:15,291 --> 00:07:18,166
అంటే క్లబ్ సిబ్బందిలో ఎవరైనా
డ్రగ్స్ అమ్ముతూ ఉండవచ్చుగా?

80
00:07:19,375 --> 00:07:21,666
ఆ ప్యాకెట్ మీద నా క్లయింట్ వేలిముద్రలు
ఏమైనా దొరికాయా?

81
00:07:21,750 --> 00:07:22,916
లేదు.

82
00:07:23,000 --> 00:07:25,625
డ్రగ్స్ దొరికిన చోట నా క్లయింట్
జగ్దీష్ సింగ్ ఎక్కడైనా కనిపించారా?

83
00:07:26,375 --> 00:07:27,541
లేదు, సర్.

84
00:07:27,625 --> 00:07:29,791
అంటే ఆ ప్యాకెట్‌ని
అక్కడ ఎవరైనా పెట్టి ఉండవచ్చు.

85
00:07:29,875 --> 00:07:31,250
ఇన్‌స్పెక్టర్ రాఠీ, మీతో సహా.

86
00:07:32,083 --> 00:07:33,000
అభ్యంతరం.

87
00:07:33,083 --> 00:07:34,750
-తిరస్కరించబడింది.
-తిరస్కరించబడింది.

88
00:07:42,416 --> 00:07:45,083
మిస్టర్ సింగ్, మీ బ్యాక్ ఆఫీసుకు
ఇంకా ఎవరికి ప్రవేశం ఉంది?

89
00:07:45,166 --> 00:07:47,000
అది నిషేధిత ప్రాంతం కాదు, మేడం.

90
00:07:47,083 --> 00:07:48,125
అందరికీ అనుమతి ఉంటుంది.

91
00:07:48,208 --> 00:07:49,583
మీరు కూడా రావచ్చు.

92
00:07:49,666 --> 00:07:51,458
కానీ నేను అక్కడికి వెళ్లడం చాలా తక్కువ.

93
00:07:51,541 --> 00:07:52,916
కొన్నిసార్లు వారాల తరబడి వెళ్లను.

94
00:07:54,375 --> 00:07:56,916
ఖచ్చితంగా మీ సిబ్బందిని గమనించడానికి
మీకు ఒక మార్గం ఉంటుందిగా?

95
00:07:57,458 --> 00:08:00,833
మాకు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి,
కానీ అవి కొంతకాలంగా పనిచేయడం లేదు.

96
00:08:01,500 --> 00:08:02,458
వాటిని మార్చాల్సి ఉంది,

97
00:08:02,541 --> 00:08:06,666
కానీ మిగతా వ్యాపారాలతో
ఈమధ్య చాలా బిజీగా ఉన్నాను.

98
00:08:06,750 --> 00:08:07,666
నిజమేలే.

99
00:08:08,291 --> 00:08:09,458
యువరానర్, ఇది చాలా విచిత్రం.

100
00:08:09,541 --> 00:08:11,958
సీసీటీవీ కెమెరాలు అవసరమైనప్పుడు
అవి ఎప్పుడూ పనిచేయవు.

101
00:08:14,750 --> 00:08:18,625
అంటే, మి. సింగ్, ఆ రోజు మీరు బార్ ఏరియాను
ఉపయోగించారో లేదో తెలుసుకునే మార్గం లేదా?

102
00:08:18,708 --> 00:08:19,958
యువరానర్, అబ్జెక్షన్‌.

103
00:08:20,041 --> 00:08:21,458
-సమర్ధన.
-సమర్థన.

104
00:08:22,166 --> 00:08:23,916
ప్రతివాది నేరం చేసి ఉండవచ్చని

105
00:08:24,000 --> 00:08:26,916
నిరూపించడమే ప్రాసిక్యూషన్
బాధ్యత కాదు.

106
00:08:27,000 --> 00:08:30,083
ఆ వ్యక్తే ఈ నేరం చేశాడని మీరు నిరూపించాలి.

107
00:08:32,666 --> 00:08:34,125
ఇక ప్రశ్నలు లేవు, యువరానర్.

108
00:08:34,208 --> 00:08:35,625
ఈ రోజుకు విచారణ వాయిదా వేస్తున్నాం.

109
00:08:35,708 --> 00:08:39,000
ముగింపు వాదనల కోసం రేపు ఉ 9:00లకు
కోర్టు మళ్లీ ప్రారంభమవుతుంది.

110
00:08:42,375 --> 00:08:44,666
-నేహ!
-హలో, సర్.

111
00:08:44,750 --> 00:08:46,625
ఈ కేసును నీ నుండి తీసేసుకుంటున్నాను.

112
00:08:47,333 --> 00:08:48,250
సర్…

113
00:08:48,333 --> 00:08:49,625
దయచేసి అలా చేయకండి.

114
00:08:49,708 --> 00:08:52,291
నన్ను పోరాడనివ్వండి.
మనం ఇప్పటికీ ఈ కేసులో గెలవగలం.

115
00:08:52,375 --> 00:08:53,666
గెలవడం గురించి మర్చిపో.

116
00:08:53,750 --> 00:08:56,000
జగ్గీని రిహాబ్‌కు పంపించగలిగితే
అదే పెద్ద అద్భుతం.

117
00:08:56,625 --> 00:08:58,541
ప్లీజ్, సర్. ఒక్క చివరి అవకాశం ఇవ్వండి.

118
00:08:58,625 --> 00:09:00,375
నేను మిమ్మల్ని నిరాశపరచను.

119
00:09:05,291 --> 00:09:06,875
దీని గురించి నేను ఆలోచించాలి.

120
00:09:08,541 --> 00:09:09,500
సర్!

121
00:09:10,458 --> 00:09:12,583
ఆయన మాటలు పట్టించుకోకు.

122
00:09:12,666 --> 00:09:13,958
ఆయనకు ఎప్పుడూ ఇంతే కోపం.

123
00:09:14,625 --> 00:09:15,750
ప్రశాంతంగా ఉండు.

124
00:09:15,916 --> 00:09:18,041
హై కోర్టు

125
00:09:18,125 --> 00:09:19,875
-…మరుసటిసారి.
-అవును.

126
00:09:19,958 --> 00:09:21,000
అదంతా సోది.

127
00:09:21,083 --> 00:09:22,250
అతన్ని బాగా హ్యాండిల్ చేశావు.

128
00:09:22,333 --> 00:09:23,208
ధన్యవాదాలు.

129
00:09:23,291 --> 00:09:25,083
సర్, సర్, సర్. ఒక్క ప్రశ్న, సర్.

130
00:09:25,166 --> 00:09:26,541
-ఒక్క ప్రశ్న.
-చెప్పండి.

131
00:09:26,625 --> 00:09:28,750
దయచేసి ఒక్కొక్కరుగా అడగండి. ఒక్కొక్కరుగా.

132
00:09:28,833 --> 00:09:32,083
మి. రాజవన్ష్, ఈ రోజు తీర్పు గురించి
మీరు ఏమంటారు?

133
00:09:33,166 --> 00:09:36,041
నా క్లయింట్ విక్రమ్ బజ్రాల్‌ను
కోర్టు నిర్దోషిగా విడుదల చేసినందుకు

134
00:09:36,125 --> 00:09:38,375
నాకు చాలా సంతోషంగా ఉంది.

135
00:09:39,291 --> 00:09:40,583
కోర్టులను న్యాయ దేవాలయాలు అని

136
00:09:41,375 --> 00:09:43,875
ఎందుకు అంటారో చెప్పేందుకు
ఈ తీర్పే నిదర్శనం.

137
00:09:44,916 --> 00:09:46,416
కానీ, సర్, ఇది మొదటిసారి కాదు.

138
00:09:46,500 --> 00:09:49,666
మీ క్లయింట్‌పై అనేకసార్లు
భూకబ్జా ఆరోపణలు వచ్చాయి.

139
00:09:51,791 --> 00:09:54,666
మన దేశం చాలా రంగాల్లో
ఇంకా ఎందుకు వెనుకబడి ఉందో మీకు తెలుసా?

140
00:09:55,500 --> 00:09:59,833
ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇతరుల
విజయాన్ని చూసి స్ఫూర్తి పొందరు.

141
00:10:00,375 --> 00:10:01,541
అసూయ పడతారు.

142
00:10:02,958 --> 00:10:05,875
ఈ కేసు మూలం కూడా
కేవలం అసూయ మాత్రమే.

143
00:10:05,958 --> 00:10:07,250
ధన్యవాదాలు. సెలవు.

144
00:10:07,333 --> 00:10:09,166
ఇకపై ప్రశ్నలు లేవు. ధన్యవాదాలు.

145
00:10:10,000 --> 00:10:11,541
మీ నాన్న అసలు వేరే లెవెల్.

146
00:10:12,291 --> 00:10:13,875
ఆయన ఎప్పుడూ ఓడిపోడు.

147
00:10:15,125 --> 00:10:17,083
అయన దగ్గర పని చేయాలంటే అర్హత ఏమిటి?

148
00:10:18,541 --> 00:10:22,041
ప్రాసిక్యూషన్ తరపున తగినన్ని కేసులు గెలిచి
నీ విలువ నిరూపించుకో.

149
00:10:22,125 --> 00:10:23,750
అప్పుడు నిన్ను పరిగణనలోకి తీసుకోవచ్చు.

150
00:10:24,458 --> 00:10:27,375
నువ్వు ఆయనతో మాట్లాడితే,
నాకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తాడు.

151
00:10:29,541 --> 00:10:33,125
నేను చెప్పిన నియమాలు
ఆయన సొంత కూతురికి వర్తిస్తాయి.

152
00:10:33,666 --> 00:10:35,875
నా స్నేహితుడిగా
నీకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు.

153
00:10:36,666 --> 00:10:37,666
పదా వెళ్దాం.

154
00:10:44,375 --> 00:10:47,125
సారిక రావత్

155
00:11:09,708 --> 00:11:11,750
-నా మెరుపు సుందరి ఎలా ఉంది?
-అమ్మా!

156
00:11:11,833 --> 00:11:14,125
-ఇదిగో మన బాస్ వచ్చేశారు.
-ఆంటీ?

157
00:11:14,208 --> 00:11:15,583
అరే, మీరు వచ్చేశారా!

158
00:11:16,291 --> 00:11:18,583
ఈ రోజు ఎలా గడిచింది?
ఏవైనా ఇబ్బందులు?

159
00:11:19,291 --> 00:11:20,791
అవేమీ లేవు.

160
00:11:21,583 --> 00:11:24,791
మేమందరం కలిసి టీవీ చూస్తూ
ఎంజాయ్ చేశాం. అంతేకదా?

161
00:11:25,958 --> 00:11:27,708
నేను కొంచెం రాజ్‌మా వండాను.

162
00:11:27,791 --> 00:11:29,666
తాలింపు వేసి పంపిస్తాను.

163
00:11:29,750 --> 00:11:31,708
-థాంక్యూ, ఆంటీ.
-సరే.

164
00:11:31,791 --> 00:11:34,000
కుసుమ్, నీ సైన్స్ పరీక్షకు
ఫలితాలు వచ్చాయా?

165
00:11:34,083 --> 00:11:35,791
హా. 96.

166
00:11:36,500 --> 00:11:37,833
అబ్బో. చూపించు.

167
00:11:43,000 --> 00:11:44,750
అరే, ఇది పట్టుకో, ఇది పట్టుకో.

168
00:11:46,208 --> 00:11:47,625
నువ్వు ఏం దాస్తున్నావు?

169
00:11:49,500 --> 00:11:50,333
ఇదా?

170
00:11:50,416 --> 00:11:52,916
ఇది సైన్స్ ఫెయిర్ కోసం ఫామ్ అంతే.

171
00:11:53,000 --> 00:11:55,875
అమ్మానాన్నల సంతకం తీసుకురమ్మని
మేడం చెప్పారు.

172
00:11:57,916 --> 00:11:59,125
నువ్వు దీనికి ఎంపికయ్యావా?

173
00:11:59,666 --> 00:12:01,333
అవును, కానీ నాకు వెళ్లాలని లేదు.

174
00:12:02,708 --> 00:12:04,666
విన్నారా? ఆమెకు వెళ్లాలని లేదంట.

175
00:12:04,750 --> 00:12:06,791
లేదు, ఇది ఖరీదైనది.

176
00:12:06,875 --> 00:12:08,833
పైగా మనం పూణే వెళ్లాల్సి ఉంటుంది.

177
00:12:08,916 --> 00:12:11,125
నాన్న లేకుండా నేను ఎలా నిద్రపోతాను?

178
00:12:11,208 --> 00:12:12,583
నాకు చాలా భయంగా ఉంటుంది.

179
00:12:16,708 --> 00:12:18,083
నిన్ను చూస్తే భూతమే భయపడుతుంది.

180
00:12:18,666 --> 00:12:21,375
ఖర్చుల గురించి నేను చూసుకుంటాలే.
నీ చదువు మీద దృష్టి పెట్టు.

181
00:12:23,833 --> 00:12:24,833
ఏంటి?

182
00:12:25,375 --> 00:12:28,125
మీరిద్దరూ కలిసి
ఏవేవో కధలు చెప్తూ ఉ౦టారు.

183
00:12:28,208 --> 00:12:29,958
కధలా? విను.

184
00:12:30,041 --> 00:12:32,166
ఆమె చాలా కష్టపడి చదివి
96 మార్కులు తెచ్చుకుంది.

185
00:12:32,250 --> 00:12:33,458
తర్వాత తిట్టుకోవచ్చు.

186
00:12:34,291 --> 00:12:35,625
ముందు తనకు బహుమతి ఇవ్వాలి.

187
00:12:35,708 --> 00:12:36,916
కుసుమ్, ఇదిగో.

188
00:12:37,625 --> 00:12:38,500
ఏం బహుమతి?

189
00:12:39,291 --> 00:12:40,416
ఐస్ క్రీమ్?

190
00:12:40,500 --> 00:12:41,333
ఐస్ క్రీమ్.

191
00:12:42,875 --> 00:12:44,208
ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుంది?

192
00:12:44,291 --> 00:12:47,291
మీరు మిఠాయి తినడానికి తనను సాకు చేశారా?
మీకు పడదని తెలుసు కదా.

193
00:12:47,916 --> 00:12:49,375
ఎప్పుడో ఒకసారి పర్లేదుగా?

194
00:12:49,458 --> 00:12:52,041
-ఐదు!
-అవునా? ఇప్పుడు డాక్టర్ అయిపోయావా?

195
00:12:52,666 --> 00:12:53,625
వెళ్లు.

196
00:12:53,708 --> 00:12:54,916
నీకు చాక్లెట్ బార్,

197
00:12:55,000 --> 00:12:56,708
-నాన్నకు మ్యాంగో బార్ తీసుకురా.
-సరే.

198
00:12:56,791 --> 00:12:58,625
-నిజమే కదా?
-అవును.

199
00:12:59,583 --> 00:13:00,500
వెళ్లు.

200
00:13:03,708 --> 00:13:08,166
"ప్లీజ్, సర్, నేను ఈ కేసును గెలవగలను."

201
00:13:14,833 --> 00:13:16,166
సమాధానం లేదు.

202
00:13:29,833 --> 00:13:31,458
"అర్ధరాత్రి వరకు కష్టపడుతున్నాను."

203
00:13:31,541 --> 00:13:33,125
మేడం, మూసేసే సమయం అయింది.

204
00:13:34,083 --> 00:13:37,125
మీ సెల్ఫీలు తర్వాత తీసుకోవచ్చు.
మా ట్రైన్ మిస్ అవుతుంది.

205
00:13:40,000 --> 00:13:41,583
అమ్మ
జవాబిచ్చేందుకు పక్కకు జరపండి

206
00:13:59,375 --> 00:14:00,708
అందరూ కాసేపు విరామం తీసుకోండి.

207
00:14:04,166 --> 00:14:08,666
లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు ఇక్కడకు
వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.

208
00:14:08,750 --> 00:14:14,833
మా లా ఫర్మ్ రాజవన్ష్ లీగల్‌ను స్థాపించి
నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి.

209
00:14:18,375 --> 00:14:23,041
ఈ 25 ఏళ్లలో
మా ఫర్మ్ సాధించిన అతిపెద్ద విజయం ఏమిటంటే

210
00:14:23,125 --> 00:14:27,083
ఈ పార్టీలో మా క్లయింట్లు ఎవరూ లేరు.

211
00:14:28,416 --> 00:14:32,291
కేవలం స్నేహితులు, శ్రేయోభిలాషులే ఉన్నారు.

212
00:14:35,583 --> 00:14:39,291
నేను, మా కుటుంబం మీ అందరికీ
ధన్యవాదాలు చెబుతున్నాం.

213
00:14:39,375 --> 00:14:43,708
మీరు అందరూ లేకుండా
సరే, ఇది అసాధ్యమని నేను చెప్పను,

214
00:14:44,708 --> 00:14:46,708
కానీ ఖచ్చితంగా కొంచెం కష్టమయ్యేది.

215
00:14:46,791 --> 00:14:48,166
-హా, బాగా చెప్పారు.
-అందుకే…

216
00:14:49,625 --> 00:14:52,333
-చీర్స్!
-చీర్స్!

217
00:15:02,416 --> 00:15:04,583
-హాయ్.
-హాయ్.

218
00:15:07,625 --> 00:15:10,000
-సెక్సీగా కనిపిస్తున్నావు.
-సెక్సీనా?

219
00:15:10,541 --> 00:15:12,916
ఊరుకో! నా నుండి
కంపు కొట్టడం లేదని ఆశిస్తాను.

220
00:15:13,000 --> 00:15:15,333
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీసులో
కనీసం ఏసీ కూడా లేదు.

221
00:15:15,416 --> 00:15:17,083
-అది నమ్మగలవా?
-నిజంగానా?

222
00:15:21,250 --> 00:15:22,958
నాకైతే, నీ వాసన భలేగా ఉంది.

223
00:15:24,541 --> 00:15:26,666
ఎందుకంటే నువ్వు ప్రభుత్వ బడి రకం.

224
00:15:26,750 --> 00:15:29,083
అందుకే నీకు ప్రభుత్వ లాయర్లు
సెక్సీగా కనిపిస్తారు.

225
00:15:31,000 --> 00:15:32,500
-పద.
-వెళదాం.

226
00:15:34,833 --> 00:15:37,625
హాయ్. పార్టీ చాలా బాగుంది.

227
00:15:37,708 --> 00:15:38,541
అయితే?

228
00:15:39,125 --> 00:15:42,000
నీ రోజు ఎలా గడిచింది,
మిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్?

229
00:15:42,083 --> 00:15:43,208
ఇ౦త దారుణంగా.

230
00:15:43,291 --> 00:15:44,791
దాని గురించి అంతా మర్చిపోవాలి.

231
00:15:44,875 --> 00:15:46,666
ప్రిన్సెస్! ఇదిగో వచ్చేశావు.

232
00:15:46,750 --> 00:15:49,125
హాయ్, నాన్నా. సారీ, ఆలస్యమైంది.

233
00:15:49,208 --> 00:15:50,291
అభినందనలు.

234
00:15:50,375 --> 00:15:52,750
-ధన్యవాదాలు, నీకు కూడా.
-ధన్యవాదాలు.

235
00:15:54,333 --> 00:15:58,333
సర్, నేను నేహాకు ఇక్కడ మేమంతా
తనను ఎంత మిస్ అవుతున్నామో చెబుతున్నాను.

236
00:16:00,000 --> 00:16:02,750
మా ఫర్మ్‌లో పార్టనర్ కావాలంటే,
ఆమె స్వతంత్రంగా ఎదగాలి.

237
00:16:02,833 --> 00:16:04,000
ఖచ్చితంగా, సర్.

238
00:16:04,083 --> 00:16:06,333
నేను కూడా
చాలా ఏళ్లు ప్రభుత్వ లాయర్‌గా పనిచేశాను.

239
00:16:06,416 --> 00:16:07,541
మళ్లీ మొదలుపెట్టారు.

240
00:16:09,000 --> 00:16:11,958
-సర్, నేను… వెళ్లి డ్రింక్ తీసుకుంటాను.
-తప్పకుండా.

241
00:16:12,041 --> 00:16:12,916
మీకు ఏమైనా కావాలా?

242
00:16:13,000 --> 00:16:14,333
-వద్దు, ధన్యవాదాలు.
-సరే.

243
00:16:16,041 --> 00:16:17,750
ఏంటి, నాన్నా, ఇది?

244
00:16:17,833 --> 00:16:19,666
ఏదైనా రివర్స్ నెపోటిసిమా?

245
00:16:20,583 --> 00:16:23,416
నేను మీ కూతురిని కావడంతో,
నాకు పరిస్థితులు కష్టంగా ఉండాలా?

246
00:16:24,083 --> 00:16:25,541
అలాగని సులభంగా కూడా ఉండకూడదు.

247
00:16:26,666 --> 00:16:31,541
ఏదైనా చాలా సులభంగా దొరికితే,
దానికి నువ్వు విలువ ఇవ్వవు.

248
00:16:33,083 --> 00:16:36,125
నేహ, చరిత్రలో సామ్రాజ్యాలను నిర్మించడానికి

249
00:16:36,208 --> 00:16:39,166
జీవితాంతం ఎంతగానో కష్టపడ్డ
ఎంతో మంది గొప్ప చక్రవర్తులను చూశాం,

250
00:16:39,250 --> 00:16:42,375
కానీ వాళ్ల పిల్లలు వాటిని
రెప్పపాటులో పోగొట్టుకున్నారు.

251
00:16:43,833 --> 00:16:45,083
మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?

252
00:16:45,875 --> 00:16:47,333
ఆ అయోగ్యులైన పిల్లల్లో ఒకదాన్ననా?

253
00:16:48,041 --> 00:16:49,458
అస్సలు అయోగ్యమేమీ కాదు.

254
00:16:49,541 --> 00:16:51,500
కానీ నీ విలువను ఇప్పటికీ నిరూపించుకోవాలి.

255
00:16:53,625 --> 00:16:56,916
నువ్వు ఈ ఫర్మ్‌లో పార్టనర్‌గా చేరినప్పుడు,

256
00:16:57,416 --> 00:17:01,333
అది నీ అర్హత వల్ల వచ్చిందని
అందరికీ తెలియాలి.

257
00:17:02,375 --> 00:17:04,375
మీ ఉద్దేశం ప్రకారం,
నాకు ఎప్పుడు అర్హత వస్తుంది?

258
00:17:05,458 --> 00:17:06,375
మనం బేరాలాడుతున్నామా?

259
00:17:08,166 --> 00:17:09,166
ఎప్పటిలాగే.

260
00:17:10,250 --> 00:17:11,250
మంచిది.

261
00:17:13,666 --> 00:17:14,750
పది కేసులు.

262
00:17:15,791 --> 00:17:17,500
పది కేసులు గెలువు.

263
00:17:22,291 --> 00:17:23,625
సమ్మతమే.

264
00:17:24,416 --> 00:17:26,125
ఒక్క కేసు కూడా ఓడిపోకుండా.

265
00:17:26,750 --> 00:17:28,833
ఏదో మెలిక ఉంటుందని
నాకు తెలుసు. ఎప్పటిలాగే.

266
00:17:30,958 --> 00:17:31,791
సమ్మతమే.

267
00:17:32,625 --> 00:17:33,541
సరే.

268
00:17:34,416 --> 00:17:36,500
అయితే, ఈ రోజు కోర్టులో ఎలా జరిగింది?

269
00:17:37,250 --> 00:17:38,333
బాగుంది.

270
00:17:38,416 --> 00:17:39,625
నిజానికి, చాలా బాగుంది.

271
00:17:39,708 --> 00:17:41,166
కానీ, దానికి విరుద్ధంగా విన్నా.

272
00:17:42,041 --> 00:17:44,083
-హే, చెల్లీ.
-హాయ్.

273
00:17:44,166 --> 00:17:49,083
చెప్పాలంటే, ఈ కేసు కూడా
పోయేలా ఉందని ఎవరో చెప్పారు…

274
00:17:50,708 --> 00:17:51,791
అంతే కదా?

275
00:17:52,625 --> 00:17:53,833
ఎప్పుడూ ఒక దారి వెతుకుతాంగా?

276
00:17:55,125 --> 00:17:55,958
అవును.

277
00:17:56,208 --> 00:17:59,166
-వెతుకుతాం.
-నీకు చెప్పానుగా, రెండే ఐస్ క్యూబ్స్.

278
00:17:59,250 --> 00:18:02,291
-ఇవి ఎన్ని ఉన్నాయి? లెక్కపెట్టగలవా?
-మన్నించండి, సర్.

279
00:18:04,041 --> 00:18:09,791
రవి, వీళ్లకు ఒక్క పని కూడా సరిగ్గా
చేయడం రాదు, నీకు చెబుతున్నాను.

280
00:18:16,666 --> 00:18:19,000
కానీ మిస్టర్ రాజవన్ష్,

281
00:18:20,041 --> 00:18:23,541
గత 25 ఏళ్లలో
మీరు ఎన్ని కేసులు గెలిచారు?

282
00:18:24,375 --> 00:18:27,708
నిజం చెప్పాలంటే,
నిజం కాకుండా వేరే ఏదీ చెప్పకపోతే,

283
00:18:28,708 --> 00:18:30,458
ఓడిపోయిన కేసులను
లెక్కపెట్టడం చాలా సులభం.

284
00:18:32,625 --> 00:18:34,750
విక్రమ్ అంకుల్, మీకు ఇది తెలియకపోవచ్చు,

285
00:18:34,833 --> 00:18:38,250
కానీ మా లా ఫర్మ్‌కు
మీరే మొదటి విఐపి క్లయింట్.

286
00:18:38,333 --> 00:18:40,541
-నా మాట నిజమే కదా, నాన్నా?
-ఖచ్చితంగా, నిజం.

287
00:18:40,625 --> 00:18:45,125
కానీ మీరు మరిన్ని ముఖ్యమైన కేసులు కూడా
డీల్ చేస్తున్నారని అనుకున్నాను.

288
00:18:45,208 --> 00:18:46,875
నీది ఫిర్యాదు కాదని ఆశిస్తాను.

289
00:18:47,458 --> 00:18:49,333
అలా చేయలేను.

290
00:18:49,416 --> 00:18:52,166
ఇక, నేను చెప్పేది ఏంటంటే
రెండు ఐస్ క్యూబ్స్…

291
00:18:52,250 --> 00:18:53,500
-విక్రమ్, విక్రమ్.
-ఏంటి?

292
00:18:53,583 --> 00:18:54,791
నువ్వు ఇక ఇంటికి వెళ్లాలి.

293
00:18:55,708 --> 00:18:56,875
-అక్షయ్.
-సర్.

294
00:18:56,958 --> 00:18:58,375
-రాత్రయింది.
-రండి, సర్, నాతో రండి.

295
00:18:58,458 --> 00:18:59,875
ప్లీజ్ సర్, ఈ కేసును గెలవగలను.

296
00:18:59,958 --> 00:19:01,416
పూజ? పూజ…

297
00:19:03,583 --> 00:19:04,958
పూజ ఎక్కడ?

298
00:19:05,041 --> 00:19:07,208
హే, నువ్వు వచ్చావని ఎందుకు చెప్పలేదు?

299
00:19:07,291 --> 00:19:09,125
అమ్మా, నేను మీ దగ్గరికే వస్తున్నా, కానీ…

300
00:19:09,208 --> 00:19:11,833
కానీ లాయర్లు వాదించుకోవడం మొదలుపెట్టారు.

301
00:19:11,916 --> 00:19:13,500
వీటిని కోర్ట్ రూమ్ కోసం దాచుకో.

302
00:19:14,125 --> 00:19:15,875
పద, ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం.

303
00:19:15,958 --> 00:19:18,000
-ఇవాళ మీ నాన్నకు ప్రత్యేకమైన రోజు.
-సరే.

304
00:19:24,791 --> 00:19:26,791
అహ్లావత్ సర్
చివరి అవకాశం లేదా అంతా ముగిసినట్టే.

305
00:19:26,875 --> 00:19:28,125
అందరూ నవ్వండి.

306
00:19:35,958 --> 00:19:37,916
ఇది వాళ్ల అద్భుతమైన బర్గర్.

307
00:19:38,000 --> 00:19:40,375
కానీ నేను మీకు చూపించాలనుకుంటున్నది ఇదే.

308
00:19:40,458 --> 00:19:43,833
ప్రస్తుతం నాకు ఇష్టమైనది,
వాళ్ల చాయ్ లాటే.

309
00:19:44,583 --> 00:19:45,916
చాలా బాగుంటుంది.

310
00:19:46,000 --> 00:19:48,208
కేఫ్ రోస్టెడ్ చాయ్ లాటే.

311
00:19:48,291 --> 00:19:50,000
ఇనాయ కొఠారి ఆమోదించింది, సరేనా?

312
00:19:50,750 --> 00:19:52,250
రోస్టెడ్ కేఫ్.

313
00:19:53,166 --> 00:19:55,291
ఫ్యామిలీ - ఆలోక్
factlinejournal.co.org చదవండి

314
00:19:56,291 --> 00:19:59,166
"కోర్టులో ఆ నక్కకు
ఇప్పటికీ ఓటమి ఎదురవదలేదు."

315
00:20:01,166 --> 00:20:04,291
"రాజవన్ష్ కూతురు
ప్రాసిక్యూటర్‌గా విఫలమవుతోంది."

316
00:20:06,000 --> 00:20:07,500
నాకో పేరు ఉందిరా, వెధవా.

317
00:20:08,208 --> 00:20:09,958
"రాఘవ్ శ్రీవాస్తవ."

318
00:20:18,083 --> 00:20:19,250
-అరే…
-సారీ, మేడం.

319
00:20:19,333 --> 00:20:20,708
ఆమె హఠాత్తుగా వచ్చేసింది.

320
00:20:22,250 --> 00:20:25,000
-మీరు బాగానే ఉన్నారా?
-సారీ, తొందరలో ఉన్నాను. బస్సు లేట్ అయింది.

321
00:20:25,083 --> 00:20:27,625
పర్వాలేదు. నేను కూడా
కోర్టుకే వెళ్తున్నాను. పద.

322
00:20:49,875 --> 00:20:51,958
నా పేరు సారిక. సారిక రావత్.

323
00:20:52,583 --> 00:20:53,750
నేహ రాజవన్ష్.

324
00:21:03,916 --> 00:21:05,666
ప్రాసిక్యూషన్‌లో పని ఎలా ఉంది?

325
00:21:06,625 --> 00:21:08,125
ఎలా ఉంది అంటే…

326
00:21:08,208 --> 00:21:10,541
ఖచ్చితంగా ఇది వేరుగా ఉంది.
కానీ కొంచెం కష్టంగా కూడా.

327
00:21:10,625 --> 00:21:12,041
అవును, అది నిజమే.

328
00:21:12,125 --> 00:21:13,583
డిఫెన్స్ లాయర్లకు పని కొంచెం తేలిక.

329
00:21:14,208 --> 00:21:16,875
వాళ్లు తమ క్లయింట్ నిర్దోషిత్వాన్ని
నిరూపించాల్సిన అవసరం లేదు.

330
00:21:16,958 --> 00:21:20,250
వాళ్లపై ఉన్న ఆధారాలు సరిపోవని
చూపిస్తే సరిపోతుంది.

331
00:21:20,333 --> 00:21:21,250
గణితం
ఇంటి వద్ద ట్యూషన్

332
00:21:21,333 --> 00:21:26,000
ఇక ప్రాసిక్యూటర్ ఆ నేరాన్ని ఎటువంటి
సందేహం లేకుండా నిరూపించాల్సి ఉంటుంది.

333
00:21:26,083 --> 00:21:27,166
ఇది కష్టమే.

334
00:21:27,250 --> 00:21:30,041
అందుకే, ఒకవేళ ఓడిపోయినా,
ధైర్యం కోల్పోవద్దు.

335
00:21:30,625 --> 00:21:32,166
నేను ఓడిపోతానని అనుకుంటున్నావా?

336
00:21:34,750 --> 00:21:37,541
అది న్యాయమూర్తి నిర్ణయించాలి.

337
00:21:37,625 --> 00:21:39,250
మనకు రెండు రోజుల్లో తెలుస్తుంది.

338
00:21:48,125 --> 00:21:50,250
అన్నా, కారును ఎడమ వైపు ఆపండి.

339
00:21:58,291 --> 00:21:59,875
నేను ఒకటి చెప్పవచ్చా, మేడం?

340
00:21:59,958 --> 00:22:02,958
ప్రాసిక్యూటర్లు తరచుగా నేరస్తుడు
ఏం చేశాడనే దానిపై దృష్టి పెడతారు.

341
00:22:03,750 --> 00:22:07,041
కానీ వాళ్లు ఉద్దేశ్య పూర్వకంగా
చేయనిది ఏమిటో దానిని పట్టించుకోరు.

342
00:22:08,458 --> 00:22:09,625
లిఫ్ట్‌కు ధన్యవాదాలు.

343
00:22:20,125 --> 00:22:22,250
ఒక సీసీటీవీ పనిచేయడం లేదు.

344
00:22:22,333 --> 00:22:23,208
వీడియో లేదు

345
00:22:47,541 --> 00:22:50,125
యువరానర్, డిఫెన్స్ వాదనల ప్రకారం,

346
00:22:50,208 --> 00:22:52,083
ఎక్లిప్స్ బార్ యజమాని
మిస్టర్ జగ్దీష్ సింగ్‌కు

347
00:22:52,166 --> 00:22:55,833
తన ప్రాంగణంలో డ్రగ్స్ అమ్ముతున్నారని కానీ,

348
00:22:55,916 --> 00:23:00,125
తన ఆఫీసులో 103 గ్రాముల కొకైన్
దొరికిందని కానీ తెలియదు.

349
00:23:03,958 --> 00:23:06,000
తమ బార్ ఏరియాలో సీసీటీవీ కెమెరా

350
00:23:06,083 --> 00:23:09,750
కొంతకాలంగా పనిచేయడం లేదని
జగ్దీష్ సింగ్ స్వయంగా అంగీకరించారు.

351
00:23:09,833 --> 00:23:13,000
ఆ విషయం తెలిసినా సరే,
ఆయన దాన్ని రిపేర్ చేయడానికి ఏమీ చేయలేదు.

352
00:23:15,000 --> 00:23:19,875
2006 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్
యాక్ట్, సెక్షన్ 66 స్పష్టంగా చెబుతోంది,

353
00:23:19,958 --> 00:23:23,125
ఒక కంపెనీ లేదా రెస్టారెంట్‌లో
నేరం జరిగినప్పుడు,

354
00:23:23,208 --> 00:23:26,166
ఆ జరిగిన నేరానికి
ఒకవేళ యజమాని నిర్లక్ష్యం కారణమైతే,

355
00:23:26,250 --> 00:23:29,541
అప్పుడు ఆ నేరానికి యజమానే బాధ్యత వహించాలి,

356
00:23:29,625 --> 00:23:31,125
అలాగే దానికి తగిన శిక్ష అనుభవించాలి.

357
00:23:33,250 --> 00:23:34,458
అంతే, యువరానర్.

358
00:23:40,166 --> 00:23:41,958
ఆధారాలు, సాక్ష్యాలన్నీ
పరిగణనలోకి తీసుకుని

359
00:23:42,041 --> 00:23:44,208
ఈ కోర్టు ప్రతివాది జగ్దీష్ సింగ్‌ను

360
00:23:44,291 --> 00:23:47,791
డ్రగ్స్ కలిగి ఉండటం, అక్రమ రవాణా వంటి
రెండు ఆరోపణల్లో దోషిగా నిర్ధారిస్తోంది.

361
00:23:48,291 --> 00:23:49,416
క్లబ్‌లో డ్రగ్స్ వాడకం

362
00:23:49,500 --> 00:23:52,708
అమ్మకాలను సులభతరం చేయడానికి,
సీసీటీవీ కెమెరాల వైఫల్యం అనేది

363
00:23:52,791 --> 00:23:56,916
ఉద్దేశపూర్వక ఎత్తుగడ అని
ఈ కోర్టు నమ్ముతోంది.

364
00:23:57,000 --> 00:23:58,916
అందుకుగాను జగ్దీష్ సింగ్‌కు
పదేళ్ల జైలు శిక్ష

365
00:23:59,000 --> 00:24:02,375
అలాగే ₹2,00,000 జరిమానాను
ఈ కోర్టు విధిస్తోంది.

366
00:24:04,000 --> 00:24:07,083
యువరానర్, నన్ను ఇరికించారు!
నాకు వాటితో ఎలాంటి సంబంధం లేదు, సర్!

367
00:24:07,708 --> 00:24:09,291
ఏదైనా చేయి, మల్హోత్రా!

368
00:24:10,041 --> 00:24:12,458
-మల్హోత్రా, ఏదైనా మాట్లాడు!
-కంగారు పడకు. నేను చూసుకుంటాను.

369
00:24:26,625 --> 00:24:27,666
హాయ్.

370
00:24:29,500 --> 00:24:30,875
అభినందనలు.

371
00:24:30,958 --> 00:24:33,416
అభినందనలు అందుకోవాల్సింది నువ్వు.

372
00:24:33,500 --> 00:24:36,250
-ఎందుకు?
-నీ సలహా పనిచేసింది.

373
00:24:36,333 --> 00:24:37,333
నీకు నిజంగా రుణపడి ఉన్నా.

374
00:24:38,583 --> 00:24:41,708
ఒకవేళ దాన్ని సహాయంగా భావిస్తే,
నాకు ఒక కప్పు టీ ఇప్పిస్తే సరిపోతుంది.

375
00:24:42,708 --> 00:24:44,958
కానీ ఈ రోజు కాదు.
నేను చాలా తొందరలో ఉన్నాను.

376
00:24:45,041 --> 00:24:46,416
కానీ నువ్వు ఇప్పుడే చెప్పావు…

377
00:24:46,500 --> 00:24:48,041
అంత తొందర వద్దు, సారిక గారు.

378
00:24:48,125 --> 00:24:50,833
ఈ రోజు కోర్టులో జరిగిన డ్రామా గురించి
నాకు ఇంకా చెప్పలేదు.

379
00:24:50,916 --> 00:24:52,666
ఏవైనా గొడవలా? హింసా?

380
00:24:54,583 --> 00:24:55,666
ఓహ్, మిస్ రాజవన్ష్.

381
00:24:56,500 --> 00:24:59,375
హలో. నేను రాఘవ్. కోర్టు రిపోర్టర్.

382
00:25:00,291 --> 00:25:04,083
వచ్చేసారి ట్రాన్స్‌క్రిప్ట్ అడిగినప్పుడు,
పాత రెండు వాటికి పేమెంట్ చేయి.

383
00:25:05,583 --> 00:25:07,208
సారిక గారు, డిజిటల్ ఇండియాకు స్వాగతం.

384
00:25:07,291 --> 00:25:08,750
పేమెంట్ కోసం యూపీఐ చెక్ చేసుకోండి.

385
00:25:11,750 --> 00:25:15,708
మిస్ రాజవన్ష్, నా ఆర్టికల్
మీకు నచ్చలేదని నాకెందుకు అనిపిస్తోందే?

386
00:25:17,708 --> 00:25:20,375
హెడ్‌లైన్‌లోనే అంతా ఉంది.
ఆర్టికల్ చదవడానికే పనికిరాదని.

387
00:25:20,458 --> 00:25:23,416
రాయడంలో గొప్పగా ఏదైనా చేయ౦డి.
అప్పుడు అది చదవడానికి బాగుంటుంది.

388
00:25:23,500 --> 00:25:24,333
ఏమంటారు?

389
00:25:26,833 --> 00:25:28,500
-తర్వాత టీ తాగుదామా?
-సరే.

390
00:25:28,583 --> 00:25:31,333
-టీనా? దేనికోసం?
-ట్రాన్స్‌క్రిప్ట్ చదువుకో౦డి.

391
00:25:31,416 --> 00:25:33,625
రాయడం ఎలాగూ రాదు,
కానీస౦ చదవడం వచ్చని ఆశిస్తున్నాను.

392
00:25:34,541 --> 00:25:36,000
సరే, ఉంటాను.

393
00:25:37,833 --> 00:25:40,583
సారిక మేడం, ఆమెకు టీ కాదు,
నిమ్మరసం ఇవ్వండి.

394
00:25:40,666 --> 00:25:41,875
-పదండి.
-ఆమె కోపం తగ్గడానికి.

395
00:25:44,458 --> 00:25:47,083
-అందరికీ హలో. హాయ్, అమ్మా.
-హలో, బంగారం.

396
00:25:47,166 --> 00:25:48,458
రా. కూర్చో.

397
00:25:48,541 --> 00:25:50,625
ఎవరో ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు.

398
00:25:52,208 --> 00:25:54,000
నువ్వు గెలిచావని మాత్రం చెప్పకు.

399
00:25:55,291 --> 00:25:56,750
అవును, గెలిచాను.

400
00:25:57,375 --> 00:26:00,916
ఢిల్లీ కోర్టులలో రాజవన్ష్ అనే పేరు
సరిపోతుందని నా అభిప్రాయం.

401
00:26:01,000 --> 00:26:02,000
నిజమే కదా, నాన్నా?

402
00:26:04,250 --> 00:26:05,333
కొంచెం తిను, అమ్మా.

403
00:26:05,416 --> 00:26:07,250
ఈ రోజు శుక్రవారం, నేను ఉపవాసం ఉంటాను.

404
00:26:07,333 --> 00:26:08,833
అప్పుడే శుక్రవారం వచ్చేసిందా?

405
00:26:09,666 --> 00:26:13,916
ఒక్కసారి విజయం రుచి చూశావు,
దాన్ని ఒక అలవాటుగా మార్చుకో.

406
00:26:14,500 --> 00:26:15,541
నా ప్లాన్ కూడా అదే.

407
00:26:15,625 --> 00:26:18,583
నాకు అక్కడి నుండి బయటపడాలని ఉంది.
అక్కడ చాలా అపరిశుభ్రంగా ఉంటుంది.

408
00:26:18,666 --> 00:26:22,083
అరే ఊరుకో. మన ఫర్మ్‌లో చేరకముందు
నేనుు కూడా అక్కడ పనిచేశాను.

409
00:26:22,166 --> 00:26:24,250
నీకు వేరు. నువ్వు మగాడివి.

410
00:26:24,333 --> 00:26:25,166
మీ ఆడవాళ్లు.

411
00:26:25,250 --> 00:26:28,083
సమానత్వం కోసం మాటలాడుతారు,
మళ్లీ ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు.

412
00:26:28,166 --> 00:26:29,375
అంత తేడా ఏముంది?

413
00:26:29,458 --> 00:26:31,166
నువ్వు నిలబడి ఉచ్చ పోసుకోగలవు.

414
00:26:31,250 --> 00:26:33,208
ఆపండి. భోజనాల దగ్గర ఇవన్నీ వద్దు.

415
00:26:33,291 --> 00:26:34,916
-అయితే వాడిని ఆపమను.
-ఓరి దేవుడా!

416
00:26:35,000 --> 00:26:35,958
ఆలోక్.

417
00:26:36,041 --> 00:26:37,875
నేను కోర్టు ట్రాన్స్‌క్రిప్ట్ చదివాను.

418
00:26:39,083 --> 00:26:40,333
బాగా వాదించావు, ప్రిన్సెస్.

419
00:26:41,250 --> 00:26:42,750
కానీ నీ ముగింపు వాదన?

420
00:26:43,250 --> 00:26:44,208
అదే ఈ కేసుకు మలుపు.

421
00:26:44,791 --> 00:26:46,041
మత్తుమందులకు బదులుగా

422
00:26:46,125 --> 00:26:48,625
నిర్లక్ష్యం విషయంలో తాము ఇరుక్కుపోతామని
డిఫెన్స్ ఊహించలేదు.

423
00:26:49,750 --> 00:26:54,000
బాక్సింగ్‌లో ఒక సామెత ఉంటుంది,
ఏ దెబ్బ అయితే వస్తుందని ఊహించవో,

424
00:26:54,083 --> 00:26:55,791
అదే నిన్ను ఎక్కువగా గాయపరుస్తుంది.

425
00:26:56,666 --> 00:26:57,541
బాగా ఆడావు.

426
00:26:58,125 --> 00:26:59,125
రైతా?

427
00:27:00,875 --> 00:27:02,500
కొంచెం తీసుకుంటావా?

428
00:27:04,583 --> 00:27:05,625
-ఇంకొంచెం సలాడ్?
-అవును.

429
00:27:18,833 --> 00:27:20,833
మేడం, కొంచెం పక్కకు జరుగుతారా?
అవును, అంతే.

430
00:27:34,083 --> 00:27:35,958
405ఏబీ పాత ఢిల్లీ

431
00:27:43,625 --> 00:27:44,875
నాకో విషయం చెప్పు.

432
00:27:44,958 --> 00:27:46,583
నాకు ఎందుకు సహాయం చేశావు?

433
00:27:46,666 --> 00:27:48,083
సహాయమా?

434
00:27:48,166 --> 00:27:49,625
నా అభిప్రాయం పంచుకున్నాను అంతే.

435
00:27:49,708 --> 00:27:51,083
దానికి వ్యతిరేకంగా ఏ చట్టం లేదు.

436
00:27:51,750 --> 00:27:52,791
అయినా సరే.

437
00:27:54,375 --> 00:27:58,500
చిన్నపాటి సాంకేతిక లోపాలను వెతుక్కుని
పెద్ద లాయర్లు తమ క్లయింట్లను కాపాడటం చూశా.

438
00:27:59,541 --> 00:28:02,875
అందుకే ఇది న్యాయం జరగడానికి సహాయపడితే,
అందులో తప్పేముంది?

439
00:28:02,958 --> 00:28:05,250
కోర్టులు న్యాయం చేస్తాయని నువ్వు నమ్మవా?

440
00:28:07,125 --> 00:28:08,458
మేడం, న్యాయం అనేది…

441
00:28:09,375 --> 00:28:10,708
అది దేవుడి లాంటిది.

442
00:28:11,583 --> 00:28:12,833
దొరకడం చాలా కష్టం.

443
00:28:14,000 --> 00:28:15,250
కోర్టులు న్యాయం చేయవు.

444
00:28:15,333 --> 00:28:17,291
అవి కేవలం అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తాయి.

445
00:28:18,291 --> 00:28:19,916
సరిగ్గా మా నాన్న లాగే మాట్లాడుతున్నావు.

446
00:28:20,916 --> 00:28:24,041
ఆయన చెబుతుండగా విన్నానేమో.
నేను ఆయన్ని కోర్టులో చాలా సార్లు చూశాను.

447
00:28:28,125 --> 00:28:29,416
బాగుంది, కదా?

448
00:28:29,500 --> 00:28:31,625
ఇది ఇనాయ కొఠారి ఆమోదించింది.

449
00:28:31,708 --> 00:28:33,833
-ఎవరు?
-ఇనాయ కొఠారి.

450
00:28:33,916 --> 00:28:36,291
ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.
ఆమెను ఫాలో అవుతాను.

451
00:28:38,458 --> 00:28:39,791
పట్టించుకోకు.

452
00:28:41,291 --> 00:28:43,083
నాకు ఇంకో కేసులో సహాయం చేయగలవా?

453
00:28:43,875 --> 00:28:45,666
ప్రమోద్ మిశ్రా. ప్రభుత్వ అధికారి.

454
00:28:45,750 --> 00:28:47,458
ఒక వేశ్యతో గడిపాడనేది అతనిపై ఆరోపణ.

455
00:28:48,375 --> 00:28:49,458
నేను చేయలేను, మేడం.

456
00:28:50,000 --> 00:28:51,375
కోర్టు బయట నాకు జీవితం ఉంది.

457
00:28:51,458 --> 00:28:54,500
నాకు ఒక చిన్న కూతురు ఉంది.
నేను ఆమెతో సమయం గడపాలి.

458
00:28:56,541 --> 00:28:59,625
మరి కోర్టు బయట ఉన్న ఈ జీవితం కోసం
నీకు డబ్బు అవసరం లేదా?

459
00:29:00,416 --> 00:29:01,416
కేసుకు ₹10,000 ఇస్తే?

460
00:29:03,666 --> 00:29:06,708
రాజవన్ష్‌కి ఒక సాధారణ స్టెనోగ్రాఫర్
సహాయం ఎందుకు?

461
00:29:06,791 --> 00:29:09,166
కేసు గెలవడానికి సహాయపడే
ఏ సహాయమైనా సాధారణం కాదు.

462
00:29:10,416 --> 00:29:12,416
గెలవడానికా లేక న్యాయం చేయడానికా?

463
00:29:12,500 --> 00:29:13,916
గెలవడానికి.

464
00:29:14,000 --> 00:29:15,291
నా భవిష్యత్తుకు ఇదే ఆధారం.

465
00:29:15,958 --> 00:29:17,916
అంతేకాకుండా, న్యాయం అనేది
"దేవుడి లాంటిది."

466
00:29:18,000 --> 00:29:19,666
అది "దొరకడం కష్టం."

467
00:29:21,791 --> 00:29:22,791
నేనే ఎందుకు?

468
00:29:24,083 --> 00:29:27,833
ప్రాసిక్యూషన్, డిఫెన్స్ రెండు వైపుల నుండి
కొన్ని ఉత్తమ కేసులను చూసుంటావు.

469
00:29:28,708 --> 00:29:30,833
ఆ అనుభవం అందరికీ ఉండదు.

470
00:29:30,916 --> 00:29:34,208
నేను ఆ అనుభవాన్ని డబ్బుతో కొనగలిగితే,
అందులో నష్టం ఏముంది?

471
00:29:36,791 --> 00:29:37,875
₹20,000.

472
00:29:38,958 --> 00:29:40,333
కోర్టు సమయం తర్వాత పని చేస్తాం.

473
00:29:40,416 --> 00:29:42,666
రాత్రి 7:00 గంటలకు. వారాంతాలలో సెలవు.

474
00:29:43,541 --> 00:29:44,625
నాకు సమ్మతమే.

475
00:29:44,708 --> 00:29:47,416
కానీ, మేడం, కోర్టులో ఎవరికైనా
ఈ విషయం తెలిస్తే,

476
00:29:47,916 --> 00:29:49,000
నా ఉద్యోగం పోతుంది.

477
00:29:49,083 --> 00:29:50,458
నన్ను నమ్ము.

478
00:29:50,541 --> 00:29:51,750
ఎవరికీ తెలియదు.

479
00:29:54,833 --> 00:29:56,791
ఏం జరిగింది?
నీకు చాయ్ లాటే నచ్చలేదా?

480
00:29:56,875 --> 00:29:59,083
-ఇది కొంచెం చేదుగా ఉంది.
-చేదుగా ఉందా?

481
00:29:59,166 --> 00:30:00,666
నేను వెళ్లాలి. సారీ.

482
00:30:01,333 --> 00:30:03,458
-టీ కోసం ధన్యవాదాలు.
-నిజంగానా?

483
00:30:04,708 --> 00:30:06,166
సారిక, నీ ఫోన్.

484
00:30:07,291 --> 00:30:08,625
-సారీ.
-ఫైల్.

485
00:30:10,583 --> 00:30:11,583
సరే.

486
00:30:44,541 --> 00:30:45,458
ఇదేదో తేడాగా ఉంది!

487
00:30:45,541 --> 00:30:46,958
నీకు ఇంతకంటే మంచి చోటు దొరకలేదా?

488
00:30:47,500 --> 00:30:49,083
ఎవరైనా పోలీసులకు ఫోన్ చేస్తే?

489
00:30:50,083 --> 00:30:52,333
అయితే? వాళ్లు ఏం చేస్తారు?

490
00:30:53,500 --> 00:30:57,541
సెక్షన్ 294, బహిరంగ ప్రదేశంలో
అసభ్య ప్రవర్తన?

491
00:30:57,625 --> 00:31:00,958
పోలీసులకు సింపుల్‌గా చెబుతాను,
ఇక్కడ అసభ్యత పుష్కలంగా ఉంది,

492
00:31:01,708 --> 00:31:02,583
కానీ పబ్లిక్ లేరని.

493
00:31:05,458 --> 00:31:07,166
చాలా కొంటెవాడివి.

494
00:31:07,250 --> 00:31:09,208
నీకు ఇదంతా కేవలం కార్లలోనే చేయడం ఇష్టమా?

495
00:31:09,291 --> 00:31:10,291
లేదు.

496
00:31:11,250 --> 00:31:14,541
బస్సులు, రైళ్లు, విమానాలు…

497
00:31:20,208 --> 00:31:21,541
నన్ను చాలా సంతోషపెడతావు.

498
00:31:24,208 --> 00:31:26,083
నువ్వు నన్ను ఇంకా సంతోషపెడతావు.

499
00:31:32,708 --> 00:31:34,083
డార్లింగ్.

500
00:31:37,125 --> 00:31:39,041
ఆమె వాళ్ల అమ్మగారి ఇంటికి వెళ్లింది.

501
00:31:39,125 --> 00:31:41,041
ఈ 2-3 నెలలు నేను పూర్తిగా నీవాడినే.

502
00:31:41,125 --> 00:31:42,916
నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా నాకు కాల్ చేయి.

503
00:31:43,666 --> 00:31:45,083
నీకు ఎవరు కావాలి?

504
00:31:45,166 --> 00:31:46,500
కొడుకా లేక కూతురా?

505
00:31:46,583 --> 00:31:48,666
నా భార్యకు కొడుకు కావాలి.

506
00:31:48,750 --> 00:31:51,916
కానీ అబ్బాయిలతో వేగడం చాలా కష్టం.
అమ్మాయిలు అమాయకులు. నాకు కూతురిష్టం.

507
00:31:52,000 --> 00:31:53,166
లక్ష్మణ్
నీకు ఆలస్యం అవుతుందా?

508
00:31:54,291 --> 00:31:56,916
నీకు ఒక కూతురు పుట్టినప్పుడు
నీ ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి.

509
00:31:58,083 --> 00:31:59,333
ఇంకా కాసేపు ఉంటావా?

510
00:32:00,041 --> 00:32:02,666
నీ భార్య ఇంట్లో లేదు,
కానీ నా భర్త ఇంట్లోనే ఉన్నాడు.

511
00:32:02,750 --> 00:32:04,750
అయితే కనీసం నిన్ను ఇంటి దగ్గర దించుతాను.

512
00:32:06,208 --> 00:32:08,083
మనకు మరికొంత సమయం దొరుకుతుంది.

513
00:32:09,458 --> 00:32:11,375
నువ్వు మగాడివి. ఒక పోలీసువి.

514
00:32:11,458 --> 00:32:13,791
నీ పొరుగువారు ఒక్క మాట కూడా అనరు.

515
00:32:13,875 --> 00:32:16,833
కానీ నా పొరుగువారు?
వాళ్ల నోళ్లు ఆగవు.

516
00:32:16,916 --> 00:32:18,208
నన్ను ఇక వెళ్లనివ్వు.

517
00:32:22,041 --> 00:32:23,833
కనీసం అక్కడికి వెళ్లాక
మెసేజ్ చేస్తావా?

518
00:32:23,916 --> 00:32:26,875
-నీకు మరీ ఇబ్బంది కాకపోతే, డార్లింగ్.
-చేస్తాను.

519
00:32:27,541 --> 00:32:28,833
ఖచ్చితంగా చేస్తాను.

520
00:32:29,333 --> 00:32:30,458
సారిక.

521
00:32:33,250 --> 00:32:35,250
"నేను నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి."

522
00:32:35,333 --> 00:32:38,125
"రాజవన్ష్ కూతురు అని మాత్రమే
అనిపించుకోకూడదు."

523
00:32:39,375 --> 00:32:43,000
""నేహ రాజవన్ష్ ఈ కేసు గెలవడానికి
అద్భుతమైన ఎత్తుగడ వేసింది."

524
00:32:43,083 --> 00:32:45,000
"బాగా వాదించారు."

525
00:32:51,458 --> 00:32:53,000
సందర్శకుల సమయం 3:30 వరకు మాత్రమే.

526
00:32:53,083 --> 00:32:54,291
రేపు రండి.

527
00:33:20,500 --> 00:33:21,500
రుక్సానా,

528
00:33:22,541 --> 00:33:23,833
నా పేరు నేహ.

529
00:33:26,750 --> 00:33:28,625
నిన్ను కొన్ని ప్రశ్నలు అడగవచ్చా?

530
00:33:32,750 --> 00:33:34,000
నీ వయసు ఎంత?

531
00:33:36,333 --> 00:33:37,333
పంతొమ్మిది.

532
00:33:39,625 --> 00:33:41,666
పింకీ నిజంగానే నీ పిన్ని అవుతుందా?

533
00:33:49,083 --> 00:33:51,166
రుక్సానా, నీకు సహాయం చేయాలనుకుంటున్నాను.

534
00:33:52,041 --> 00:33:54,041
నువ్వు నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చావంటే…

535
00:33:54,125 --> 00:33:56,791
ప్లీజ్, అక్కా, నేను ఇంటికి వెళ్లిపోవాలి.

536
00:33:57,541 --> 00:34:01,000
అక్కా, ప్లీజ్ నన్ను ఇంటికి పంపించండి.
నాకు ఇక్కడ ఉండాలని లేదు, ప్లీజ్.

537
00:34:02,000 --> 00:34:03,125
ప్లీజ్, అక్కా.

538
00:34:04,333 --> 00:34:06,458
ప్లీజ్, అక్కా,
నన్ను ఇంటికి పంపించండి, ప్లీజ్.

539
00:34:13,875 --> 00:34:15,541
-చెప్పండి, నేహ మేడం?
-సారిక,

540
00:34:15,625 --> 00:34:17,166
నువ్వు ఇప్పుడు నా ఇంటికి రాగలవా?

541
00:34:17,250 --> 00:34:19,041
-సరే.
-నేను నీకు చిరునామా పంపుతున్నాను.

542
00:34:19,125 --> 00:34:21,583
-వచ్చేస్తాను.
-ధన్యవాదాలు.

543
00:34:36,666 --> 00:34:39,583
బాబాయ్, దయచేసి మాకు కొంచెం టీ తీసుకురండి.

544
00:34:41,708 --> 00:34:45,166
ఇలాంటి ఇళ్లను తరచుగా బయట నుండి చూశాను.
లోపలికి రావడం ఇదే మొదటిసారి.

545
00:34:45,750 --> 00:34:46,583
చాలా బాగు౦ది.

546
00:34:46,666 --> 00:34:48,208
ఈ రోజు నీకు టీ కూడా నచ్చుతుంది.

547
00:34:48,291 --> 00:34:49,583
ఈసారి లాటే కాదు.

548
00:34:51,708 --> 00:34:52,541
ధన్యవాదాలు.

549
00:34:54,250 --> 00:34:56,708
అన్నట్టు, రుక్సానా చాలా భయపడిపోయి ఉంది.

550
00:34:56,791 --> 00:34:58,791
ఆ "కథిత్" సెక్స్ వర్కర్,

551
00:34:58,875 --> 00:35:01,291
-మనకు సహాయం చేయగలదా?
-ఏంటి?

552
00:35:01,375 --> 00:35:03,375
మేడం, మనం నీ హిందీ మీద కొంచెం పని చేయాలి.

553
00:35:03,458 --> 00:35:04,708
మేడం వద్దు. నేహ అని పిలువు.

554
00:35:04,791 --> 00:35:06,458
ఇంకా ఆగు, దాని అర్థం నాకు తెలుసు.

555
00:35:06,541 --> 00:35:08,875
"కథిత్" అంటే ఆరోపితం, అవునా?

556
00:35:09,666 --> 00:35:11,125
కానీ అలా ఎందుకు అంటున్నావు?

557
00:35:11,625 --> 00:35:16,166
ప్రాస్టిట్యూషన్, లేదా వేశ్యావృత్తి విషయంలో
కొన్ని వింత చట్టాలు ఉన్నాయి.

558
00:35:17,291 --> 00:35:19,666
యువరానర్, ఒకవేళ నా క్లయింట్

559
00:35:19,750 --> 00:35:23,791
ప్రమోద్ మిశ్రా, నిజంగానే ఆ అమ్మాయితో
శృంగారంలో పాల్గొన్నాడని మనం నమ్మినా,

560
00:35:24,375 --> 00:35:27,791
అది వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విషయం.

561
00:35:27,875 --> 00:35:29,833
అందులో చట్టవిరుద్ధం ఏమీ లేదు.

562
00:35:31,250 --> 00:35:33,708
బహిరంగంగా వేశ్యావాటికకు వెళ్లాడనే ఆరోపణ
ఇక్కడ చెల్లదు.

563
00:35:38,541 --> 00:35:40,875
డిఫెన్స్ వాదన చాలా బలహీనంగా ఉంది.

564
00:35:40,958 --> 00:35:43,208
వాళ్లు కేపీకేజీ రోడ్డులోని
వేశ్యావాటికలో దొరికారు.

565
00:35:43,291 --> 00:35:45,458
అది వేశ్యావాటిక అని ఎలా నిరూపిస్తావు?

566
00:35:45,541 --> 00:35:48,166
పదిహేను పూలమాలలు ఇవ్వు.
సరైన రేటు చెప్పు.

567
00:35:48,250 --> 00:35:51,125
దర్యాప్తు అధికారి తన సాక్ష్యంలో
దాన్ని వేశ్యావాటిక అన్నాడు.

568
00:35:51,833 --> 00:35:52,833
కాదు.

569
00:35:53,500 --> 00:35:55,666
అది వేశ్యావాటిక అని
తను నమ్ముతున్నానని చెప్పాడు.

570
00:35:57,375 --> 00:35:58,291
త్వరగా ఇవ్వు.

571
00:35:58,375 --> 00:35:59,916
మేడం డబ్బులు ఇస్తారు.

572
00:36:00,000 --> 00:36:01,166
₹120, మేడం.

573
00:36:01,250 --> 00:36:07,250
యువరానర్, స్క్రీన్ మీద ఉన్న డాక్యుమెంట్లు
పోలీసులు రైడ్ చేసిన ఆ ఇంటివి.

574
00:36:08,333 --> 00:36:13,291
ఈ పత్రాల ప్రకారం,
ఆ ఇంటి యజమాని మిస్ పింకీ,

575
00:36:13,375 --> 00:36:15,333
ఆమె రుక్సానాకు పిన్ని కూడా.

576
00:36:16,625 --> 00:36:18,541
ఒక పురుషుడు, ఒక మహిళ.

577
00:36:18,625 --> 00:36:20,041
ఇద్దరూ వయోజనులు.

578
00:36:20,125 --> 00:36:23,041
వాళ్లు తమ ఖాళీ సమయంలో,
ఒక మూసి ఉన్న గదిలో ఏం చేస్తారు అనేది,

579
00:36:23,125 --> 00:36:27,375
ప్రార్థన చేసుకుంటారా, టీవీ చూస్తారా,
పేకాట ఆడతారా, లేదా ఇంకేదైనా చేస్తారా,

580
00:36:28,125 --> 00:36:29,958
దాంతో చట్టానికి ఎలాంటి సంబంధం లేదు.

581
00:36:37,541 --> 00:36:39,750
ఇది సరిపోదు. మనకు ఇంకా కావాలి.

582
00:36:39,833 --> 00:36:41,250
-మేడం, త్వరగా రండి.
-ఇదిగో.

583
00:36:46,041 --> 00:36:47,208
ఆ అమ్మాయి.

584
00:36:47,291 --> 00:36:48,833
ఆమె ఏమైనా సహాయపడగలదా?

585
00:36:56,625 --> 00:36:58,333
ఒక విషయం ఉంది.

586
00:36:58,416 --> 00:37:00,041
ఆమె మైనర్ అని నా అంచనా.

587
00:37:00,750 --> 00:37:03,291
కానీ ఆమె జనన ధృవపత్రం ప్రకారం,
ఆమెకు 19 ఏళ్లు.

588
00:37:04,458 --> 00:37:07,000
డాక్యుమెంట్లు ఫోర్జరీ చేయవచ్చు. అవునా?

589
00:37:11,958 --> 00:37:13,375
నా దళం ఎలా ఉంది?

590
00:37:13,458 --> 00:37:14,708
దళం బాగుంది.

591
00:37:15,416 --> 00:37:16,875
-ఓ, నువ్వు వచ్చేశావు!
-అవును.

592
00:37:16,958 --> 00:37:18,708
త్వరగా రెడీ అయి బయటకు రా.

593
00:37:18,791 --> 00:37:21,208
-ఈ రోజు ఎలా గడిచింది?
-చాలా అలసిపోయాను.

594
00:37:21,291 --> 00:37:23,291
రోజంతా నడుస్తూనే ఉన్నాను.
ఇప్పుడే ఇంటికి వచ్చాను.

595
00:37:23,375 --> 00:37:25,666
నువ్వు చాలా అందమైన పూలు తెచ్చావు!

596
00:37:25,750 --> 00:37:27,916
బహుశా వీళ్లు కలిసే పని చేస్తున్నారేమో.

597
00:37:31,458 --> 00:37:32,708
నేహ, లోపలికి రా.

598
00:37:34,750 --> 00:37:36,208
ఈయన నా భర్త లక్ష్మణ్.

599
00:37:36,833 --> 00:37:39,083
అలాగే నా కూతురు, నా మెరుపు సుందరి, కుసుమ్.

600
00:37:39,708 --> 00:37:42,166
-ఏం సుందరి?
-నా మెరుపు సుందరి.

601
00:37:42,833 --> 00:37:44,791
-హాయ్.
-హాయ్.

602
00:37:47,458 --> 00:37:49,666
అబ్బో, ఇది చాలా బాగుంది.

603
00:37:49,750 --> 00:37:51,041
దీన్ని ఎవరు చేశారు?

604
00:37:53,708 --> 00:37:56,083
జీవితంలో రంగులు లేకపోవచ్చు,
కానీ గోడలు అలా ఉండక్కర్లేదు.

605
00:37:57,208 --> 00:37:58,541
నేను పకోడీలు తీసుకువస్తాను.

606
00:37:58,625 --> 00:38:00,583
-పకోడీలేనా?
-అవును.

607
00:38:03,416 --> 00:38:05,500
-నిన్ను ఒకటి అడగవచ్చా?
-తప్పకుండా.

608
00:38:06,541 --> 00:38:08,375
-అతనికి ఏమైంది?
-అదొక ప్రమాదం.

609
00:38:08,458 --> 00:38:09,458
కుసుమ్.

610
00:38:10,125 --> 00:38:11,250
అది ఆయన తప్పు కాదు.

611
00:38:11,833 --> 00:38:12,833
ఇదిగో.

612
00:38:13,833 --> 00:38:16,541
నువ్వు ఇంత పెద్ద బాధ్యతను మోస్తున్నట్టు
ఎప్పుడూ అనిపించవు.

613
00:38:17,541 --> 00:38:20,000
కుటుంబ సమయం నీకు ఎందుకంత ముఖ్యమో
నాకిప్పుడు అర్థమైంది.

614
00:38:26,333 --> 00:38:27,666
నేను చేయగలిగినది చేస్తున్నా.

615
00:38:28,458 --> 00:38:31,083
కుసుమ్ భవిష్యత్తు బాగుండాలన్నదే నా కోరిక.

616
00:38:33,875 --> 00:38:35,916
-ఇదిగో, నాన్నా.
-ధన్యవాదాలు.

617
00:38:38,000 --> 00:38:41,791
ఆమె చాలా చిన్నది,
కానీ తన తండ్రిని ఎంత బాగా చూసుకుంటుందో.

618
00:38:42,875 --> 00:38:45,083
అబ్బో, భలే చక్కగా కనిపిస్తున్నావు!

619
00:38:47,708 --> 00:38:50,083
-నేను 15 నిమిషాల్లో వచ్చేస్తాను.
-సరే.

620
00:38:55,916 --> 00:38:58,083
-జై మాతా దీ!
-జై మాతా దీ!

621
00:39:00,333 --> 00:39:01,375
ప్రసాదం తీసుకో.

622
00:39:07,083 --> 00:39:10,708
ఆ అమ్మాయి మైనర్ అని నిరూపించగలిగితేనే
మనకు గెలిచే అవకాశం ఉంటుంది.

623
00:39:13,083 --> 00:39:14,125
ఇప్పటికే ఆ పనిలో ఉన్నాను.

624
00:39:22,916 --> 00:39:26,416
డాక్టర్, ఒక ఎక్స్-రేను పరీక్షించి
ఓ వ్యక్తి వయస్సును నిర్ధారించగలరా?

625
00:39:28,750 --> 00:39:31,666
పిల్లల ఎముకలలో,
ముఖ్యంగా మణికట్టు, వేళ్లలో,

626
00:39:32,708 --> 00:39:35,958
రెండు వైపులా పెరిగే జోన్‌లుంటాయి.
వైద్య పరిభాషలో ఇవి "గ్రోత్ ప్లేట్స్."

627
00:39:36,541 --> 00:39:40,291
పిల్లలు పెద్దవుతుంటే, ఈ గ్రోత్ ప్లేట్స్
కుచించుకుపోవడం ప్రారంభిస్తాయి.

628
00:39:40,375 --> 00:39:42,833
వయోజన వయస్సు వచ్చేసరికి
అవి పూర్తిగా అదృశ్యమవుతాయి.

629
00:39:44,541 --> 00:39:47,750
ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా,
ఇక్కడున్న ఇవి గ్రోత్ ప్లేట్స్.

630
00:39:49,541 --> 00:39:53,541
మీ నైపుణ్య అభిప్రాయం ప్రకారం,
ఈ వ్యక్తి వయస్సు ఎంత ఉండవచ్చు?

631
00:39:53,625 --> 00:39:55,958
ఈ ఎక్స్-రే ప్రకారం, సుమారు 16 ఏళ్లు.

632
00:39:56,041 --> 00:39:58,208
సుమారు 16.

633
00:39:58,916 --> 00:40:00,041
ధన్యవాదాలు, డాక్టర్.

634
00:40:03,791 --> 00:40:04,958
అంతే, యువరానర్.

635
00:40:09,541 --> 00:40:10,500
డాక్టర్ గారు,

636
00:40:11,166 --> 00:40:14,958
రోగి ఎముకల అభివృద్ధి అనేది
వాళ్ల జన్మకుండలి చెప్పగలదా?

637
00:40:15,541 --> 00:40:17,250
అంటే ఖచ్చితమైన పుట్టిన తేదీ లాంటివి?

638
00:40:18,250 --> 00:40:20,041
కొన్ని కేసులలో అది సాధ్యం కాకపోవచ్చేమో,

639
00:40:20,125 --> 00:40:23,583
ఎముకల అభివృద్ధి రోగి వాస్తవ వయస్సును
సూచించకపోవడానికి అవకాశం లేదా?

640
00:40:23,666 --> 00:40:26,958
అవును, అవకాశం ఉంది,
కానీ అది చాలా అరుదు.

641
00:40:27,041 --> 00:40:28,291
కానీ అవకాశం అయితే ఉంది కదా?

642
00:40:28,375 --> 00:40:31,666
అవును, ఎముకల పెరుగుదల నెమ్మదిగా ఉంటే,
అది సాధ్యమే.

643
00:40:32,250 --> 00:40:35,125
అంటే రుక్సానా ఎముకల అభివృద్ధి
నెమ్మదిగా ఉంటే,

644
00:40:35,208 --> 00:40:37,583
ఆమెకు 19 ఏళ్లు ఉండవచ్చని
మీరు అంగీకరిస్తున్నారా?

645
00:40:46,208 --> 00:40:47,041
అవును…

646
00:40:47,125 --> 00:40:48,333
అంతే, యువరానర్.

647
00:41:01,666 --> 00:41:03,916
కచ్చితంగానా?

648
00:41:09,583 --> 00:41:11,666
రాఘవ్, అసలేం చేస్తున్నావు?
నీకేమైనా పిచ్చి పట్టిందా?

649
00:41:11,750 --> 00:41:13,625
-నాకు ఏం పంపించావు?
-హలో, హలో.

650
00:41:13,708 --> 00:41:15,583
అది నువ్వు అనుకుంటున్నది కాదు.

651
00:41:15,666 --> 00:41:16,750
కనీసం అదేంటో చూడు.

652
00:41:20,208 --> 00:41:21,625
లోడ్ అవుతోంది…

653
00:41:22,750 --> 00:41:25,291
లేదు, లేదు, ఏడవకు. ఏడవకు.

654
00:41:25,375 --> 00:41:26,833
ప్లీజ్, నాకు ఇష్టం లేదు.

655
00:41:26,916 --> 00:41:29,583
-ఇది చెడ్డది కాదు. నీకు నచ్చుతుంది.
-ప్లీజ్, వద్దు, అంకుల్.

656
00:41:29,666 --> 00:41:31,083
-నీ వయసు ఎంత?
-పదిహేను.

657
00:41:31,166 --> 00:41:33,958
-ఆ వయసు అంటే ఎంజాయ్ చేయాలి!
-నాకు చేయాలని లేదు.

658
00:41:34,041 --> 00:41:37,500
-నీకు నచ్చుతుంది. నన్ను నమ్ము.
-ప్లీజ్, అంకుల్, ప్లీజ్. నన్ను వదిలేయండి.

659
00:41:37,583 --> 00:41:39,000
నీకు చాక్లెట్ ఇస్తాను.

660
00:41:39,083 --> 00:41:41,000
ప్లీజ్, అంకుల్, వద్దు.
నాకు ఇలా చేయాలని లేదు.

661
00:41:41,083 --> 00:41:44,791
-ఇటు రా. నా మాట విను.
-ప్లీజ్, నన్ను వదిలేయండి.

662
00:41:45,458 --> 00:41:46,583
యువరానర్, అభ్యంతరం.

663
00:41:47,166 --> 00:41:48,500
ఇది ఆలస్యంగా అందించిన సాక్ష్యం.

664
00:41:48,583 --> 00:41:50,583
అభ్యంతరం తిరస్కరించబడింది. ఇక కూర్చోండి.

665
00:41:57,083 --> 00:42:00,666
ఈ కోర్టు
ప్రమోద్ మిశ్రాను దోషిగా నిర్ధారిస్తోంది.

666
00:42:00,750 --> 00:42:06,208
మైనర్ పై అత్యాచారం చేసినందుకు గాను,
ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 20 ఏళ్లు,

667
00:42:06,291 --> 00:42:10,958
అలాగే అసహజ శృంగారానికి
ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం,

668
00:42:11,041 --> 00:42:12,875
10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం.

669
00:42:13,666 --> 00:42:16,416
ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేయబడతాయి.

670
00:42:33,333 --> 00:42:34,375
సారిక.

671
00:42:36,375 --> 00:42:37,958
మరోసారి ఆలోచించు.

672
00:42:39,041 --> 00:42:40,000
దేని గురించి?

673
00:42:40,916 --> 00:42:43,291
రాజవన్ష్ కూతురితో నీ ఒప్పందం గురించి.

674
00:42:43,375 --> 00:42:44,666
కంగారు పడకు.

675
00:42:44,750 --> 00:42:46,250
నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.

676
00:42:47,125 --> 00:42:48,125
జాగ్రత్త.

677
00:42:50,541 --> 00:42:52,708
కొంత అదనపు డబ్బు వస్తో౦ది.
అందులో తప్పేముంది?

678
00:42:54,291 --> 00:42:56,416
మనం కుసుమ్‌ను సైన్స్ ఫెయిర్‌కు పంపాలి.

679
00:43:05,041 --> 00:43:06,625
నువ్వు ఎప్పుడూ అది మిస్ అవ్వవా?

680
00:43:11,041 --> 00:43:12,208
నిద్రపో.

681
00:43:39,208 --> 00:43:40,416
వెండిలానే ఉంది.

682
00:43:41,875 --> 00:43:43,416
పూర్తయింది, మేడం.

683
00:43:43,500 --> 00:43:46,166
సరే. ఈ రోజుకు పని అయిపోయింది.

684
00:43:46,250 --> 00:43:48,208
ప్రతి ప్రశ్నను రెండుసార్లు చదువు.

685
00:43:48,291 --> 00:43:50,250
నీకు శుభం కలగాలి.

686
00:43:50,333 --> 00:43:52,458
-ధన్యవాదాలు, మేడం. బై.
-బై.

687
00:43:56,166 --> 00:43:57,291
హలో, మేడం.

688
00:43:57,375 --> 00:43:59,166
హా, నేను కాసేపటిలో వచ్చేస్తాను, మేడం.

689
00:44:00,083 --> 00:44:02,166
నేహ, నువ్వు ఒక స్టార్‌లా ఉన్నావు!

690
00:44:02,250 --> 00:44:03,250
దానికి చీర్స్!

691
00:44:03,333 --> 00:44:04,416
-చీర్స్!
-నిజం.

692
00:44:05,208 --> 00:44:07,708
నాకో విషయం చెప్పు.
నీకు ఆ వీడియో ఎలా దొరికింది?

693
00:44:09,416 --> 00:44:10,916
నువ్వు మా గురించి ఏమనుకున్నా,

694
00:44:11,000 --> 00:44:13,791
మా జర్నలిస్టులు సోర్స్‌లను బయటపెట్టేంత
అనైతికంగా ప్రవర్తించము.

695
00:44:14,500 --> 00:44:16,750
నిజం చెప్పాలంటే, ప్రస్తుతం
హోటల్ గదులు, ఛేంజింగ్ గదులు,

696
00:44:16,833 --> 00:44:18,083
స్పై కెమెరాలు అంతటా ఉన్నాయి.

697
00:44:18,625 --> 00:44:19,750
అది నిజమే.

698
00:44:23,583 --> 00:44:24,916
సారిక.

699
00:44:28,291 --> 00:44:30,958
అబ్బో, మీరిద్దరూ అప్పుడే స్నేహితులైపోయారా?

700
00:44:31,041 --> 00:44:33,833
అతను నన్ను ఇలాగే పొగుడుతూ రాస్తుంటే,
ఈ స్నేహం కొనసాగుతుంది.

701
00:44:34,333 --> 00:44:36,708
-ఇంత చిన్న గ్లాసులో నీళ్లా?
-అవి నీళ్లు కాదు!

702
00:44:40,375 --> 00:44:41,750
అది టెకీలా.

703
00:44:41,833 --> 00:44:43,208
ఇంకొకటి తీసుకో. బాగుంటుంది.

704
00:44:43,291 --> 00:44:45,250
ఇది నేహ సక్సెస్ పార్టీ!

705
00:44:46,250 --> 00:44:47,250
నువ్వు బాగానే ఉన్నావా?

706
00:44:47,333 --> 00:44:49,416
-మంటగా ఉంది, మంటగా ఉంది!
-మండనివ్వు. రా!

707
00:44:49,916 --> 00:44:51,291
-మంటగా ఉంది!
-లైట్ తీసుకో!

708
00:44:55,291 --> 00:44:56,791
నువ్వే అద్దానివి

709
00:44:56,875 --> 00:44:58,875
నువ్వే అద్దానివి

710
00:44:58,958 --> 00:45:00,875
నీ ప్రతిబింబం నీవే

711
00:45:00,958 --> 00:45:02,750
నువ్వే నువ్వే

712
00:45:02,833 --> 00:45:03,666
నువ్వే అద్దానివి

713
00:45:03,750 --> 00:45:09,250
రా, అందరికీ
ఈ ఆత్మ నీడలను తొడుగుదాం

714
00:45:11,291 --> 00:45:17,000
కళ్లు మూసుకున్నా
అవి నిన్ను గుర్తిస్తాయిగా

715
00:45:17,875 --> 00:45:21,541
ఒకటే భూమి, ఒకటే ఆకాశం

716
00:45:21,625 --> 00:45:26,041
ఒక లోకంలో ఎన్నో ప్రపంచాలు

717
00:45:26,125 --> 00:45:32,000
రా, అందరికీ
ఈ ఆత్మ నీడలను తొడుగుదాం

718
00:45:33,791 --> 00:45:35,333
కొందరు నదిని పంచుకుంటారు

719
00:45:35,416 --> 00:45:37,416
కొందరు సూర్యుడి వెలుగును

720
00:45:37,500 --> 00:45:39,041
అవే రెండు కళ్లు

721
00:45:39,125 --> 00:45:41,333
కానీ చూసే విధానమే వేరు

722
00:45:41,416 --> 00:45:42,916
కొందరు దోమలు తోలుతుంటే

723
00:45:43,000 --> 00:45:44,833
కొందరు చుక్కలు లెక్కెడతారు

724
00:45:44,916 --> 00:45:46,833
ఆ దివ్యమైన ప్రేమ జ్యోతి లేనిదే

725
00:45:46,916 --> 00:45:49,000
నా వంటి ప్రతిబింబాన్ని ఎవరూ ఆవిష్కరించలేరు

726
00:45:49,083 --> 00:45:54,416
రా, అందరికీ
ఈ ఆత్మ నీడలను తొడుగుదాం

727
00:45:56,708 --> 00:46:02,541
కళ్లు మూసుకున్నా
అవి నిన్ను గుర్తిస్తాయి

728
00:46:03,208 --> 00:46:07,208
ఒకే భూమి, ఒకే ఆకాశం

729
00:46:07,291 --> 00:46:11,958
ఒకే లోకంలో ఎన్నో ప్రపంచాలు

730
00:46:12,666 --> 00:46:14,666
నువ్వే అద్దానివి

731
00:46:14,750 --> 00:46:16,458
నువ్వే అద్దానివి

732
00:46:16,541 --> 00:46:18,458
నువ్వే నా ప్రతిబింబానివి

733
00:46:18,541 --> 00:46:20,291
నువ్వే నువ్వే

734
00:46:20,375 --> 00:46:22,083
నువ్వే అద్దానివి

735
00:46:22,166 --> 00:46:24,041
నువ్వే అద్దానివి

736
00:46:24,125 --> 00:46:27,750
ఎంతో ధీరురాలిగా వచ్చేశావు

737
00:46:28,500 --> 00:46:29,750
కొందరు నదిని పంచుకుంటారు

738
00:46:29,833 --> 00:46:31,541
కొందరు సూర్యుడి వెలుగును

739
00:46:31,625 --> 00:46:33,166
మిశ్రా దోషిగా గుర్తింపు

740
00:46:33,250 --> 00:46:34,083
అవే రెండు కళ్లు

741
00:46:34,166 --> 00:46:36,083
కానీ చూసే విధానమే వేరు

742
00:46:41,958 --> 00:46:44,041
-హాయ్, అమ్మా.
-హాయ్.

743
00:46:44,125 --> 00:46:46,916
-కుసుమ్, షూస్!
-ఈ రోజు ఆమె నాకు హాయ్ చెప్పలేదు.

744
00:46:52,541 --> 00:46:53,958
ధన్యవాదాలు, ధన్యవాదాలు, అమ్మా!

745
00:46:54,041 --> 00:46:56,583
అంతగా ధన్యవాదాలు చెబితే
నాకు అరగదు.

746
00:46:56,666 --> 00:46:59,125
నేహ ఆంటీకి ధన్యవాదాలు చెప్పు.
ఆవిడే నీకు పుస్తకాలు కొనిచ్చారు.

747
00:46:59,208 --> 00:47:00,583
ధన్యవాదాలు, నేహ ఆంటీ.

748
00:47:02,208 --> 00:47:04,083
ఇక వెళ్లి ఆ సైన్స్ ఫెయిర్‌లో అదరగొట్టు.

749
00:47:04,583 --> 00:47:05,666
నువ్వు గెలవాలని కోరుకుంటా.

750
00:47:05,750 --> 00:47:06,750
అవును.

751
00:47:08,083 --> 00:47:09,583
నువ్వూ గెలవాలని కోరుకుంటున్నాను, నేహ.

752
00:47:11,708 --> 00:47:13,250
కొందరు నదిని పంచుకుంటారు

753
00:47:13,333 --> 00:47:15,291
కొందరు సూర్యుడి వెలుగును

754
00:47:15,375 --> 00:47:17,291
అవే రెండు కళ్లు

755
00:47:17,375 --> 00:47:19,416
కానీ చూసే విధానమే వేరు

756
00:47:19,500 --> 00:47:20,833
కొందరు దోమలు తోలుతుంటే

757
00:47:20,916 --> 00:47:23,083
కొందరు చుక్కలు లెక్కెడతారు

758
00:47:23,166 --> 00:47:25,083
ఆ దివ్యమైన ప్రేమ జ్యోతి లేనిదే

759
00:47:25,166 --> 00:47:26,833
నా వంటి ప్రతిబింబం
ఎవరూ ఆవిష్కరించలేరు

760
00:47:29,000 --> 00:47:32,041
సర్, మీ డైలాగ్‌ను
కొంచెం ఎనర్జీతో చెప్పగలరా?

761
00:47:33,375 --> 00:47:34,666
ఖచ్చితంగా, ఆ పని చేస్తాను.

762
00:47:34,750 --> 00:47:36,458
డైలాగ్ చెప్పేటప్పుడు తడబడకండి. సరేనా?

763
00:47:37,916 --> 00:47:38,750
నిశ్శబ్దం!

764
00:47:38,833 --> 00:47:40,750
సరే. యాక్షన్.

765
00:47:41,500 --> 00:47:43,750
మెరుగైన జీవితాల నిర్మాణానికి అంకితం!

766
00:47:43,833 --> 00:47:44,916
కట్.

767
00:47:45,000 --> 00:47:46,375
-క్లాప్.
-దీని కోసమా?

768
00:47:46,458 --> 00:47:47,458
అవును.

769
00:47:48,166 --> 00:47:49,333
హాయ్.

770
00:47:50,875 --> 00:47:52,333
ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు!

771
00:47:53,208 --> 00:47:55,958
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఇది నాకు చాలా ముఖ్యం.

772
00:47:57,666 --> 00:47:59,333
మనం దీని తర్వాత కలుస్తున్నాం, అవునా?

773
00:47:59,416 --> 00:48:00,458
ధన్యవాదాలు అప్పుడు చెప్పు?

774
00:48:02,625 --> 00:48:03,791
కానీ ఏ సమయానికి, సర్?

775
00:48:07,250 --> 00:48:09,166
మి. బజ్రాల్? సర్, ఏ సమయానికి?

776
00:48:12,750 --> 00:48:13,708
రేయాన్!

777
00:48:18,750 --> 00:48:21,500
సారిక మేడం, ఈ రోజు మీరు త్వరగా వచ్చారు.

778
00:48:21,583 --> 00:48:24,000
ఎలాగూ వచ్చానుగా,
మన క్లాస్ ముగించేద్దామా?

779
00:48:25,791 --> 00:48:28,083
-కానీ, మేడం…
-నువ్వు తర్వాత ఆడుకోవచ్చు.

780
00:48:28,166 --> 00:48:30,166
ఈ రోజు 10 నిమిషాలు త్వరగా ముగిద్దాం.

781
00:48:30,250 --> 00:48:31,708
-సరే.
-పద.

782
00:48:31,791 --> 00:48:33,541
బై, ఫ్రెండ్స్. కలుద్దాం.

783
00:48:36,625 --> 00:48:38,916
రవి, మా ఇంటికి రా, బాబూ.

784
00:48:39,500 --> 00:48:41,333
పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా లేవు.

785
00:48:58,958 --> 00:48:59,958
హాయ్.

786
00:49:01,500 --> 00:49:03,583
ఇంత ఆలస్యంగా ఇక్కడ ఏంటి? ఏమైంది?

787
00:49:03,666 --> 00:49:05,500
అక్షయ్, పోలీస్ రిపోర్ట్.
మనం త్వరగా వెళ్లాలి.

788
00:49:06,458 --> 00:49:07,458
సరే, సర్.

789
00:49:08,833 --> 00:49:10,333
మళ్లీ పార్టీ చేసుకుంటున్నావా, అంతేనా?

790
00:49:12,750 --> 00:49:16,208
ప్రతి విజయానికి నేను పార్టీ చేసుకుంటే,
ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు.

791
00:49:17,250 --> 00:49:18,250
కంగారు పడకండి, నాన్నా.

792
00:49:18,916 --> 00:49:20,875
పది విజయాలకు
కేవలం ఒక కేసు దూరంలోనే ఉన్నాను.

793
00:49:23,291 --> 00:49:26,916
తర్వాతి కేసు కూడా మిగతా వాటిలాగే
సులభంగా ఉంటుందని అంత ధీమాగా ఉండకు.

794
00:49:29,250 --> 00:49:31,291
-గుడ్ నైట్.
-గుడ్ నైట్.

795
00:49:32,208 --> 00:49:33,625
-గుడ్ నైట్.
-గుడ్ నైట్.

796
00:49:37,083 --> 00:49:40,416
హ్యాష్ ట్యాగ్ "ఇనాయ కొఠారికి న్యాయం"
విషయానికి వస్తే

797
00:49:40,500 --> 00:49:43,250
ఇప్పుడు ఇదే సోషల్ మీడియా అంతటా
ట్రెండింగ్‌లో ఉంది.

798
00:49:43,333 --> 00:49:46,875
తూర్పు ఢిల్లీలోని సూర్య నివాస్ టవర్స్‌లో
ఇనాయ కొఠారి మృతదేహం లభ్యమైంది.

799
00:49:46,958 --> 00:49:50,458
ఇనాయ కొఠారి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్,
అలాగే ఆహార విమర్శకురాలు.

800
00:49:50,541 --> 00:49:52,791
మా సమాచారం ప్రకారం, ఇనాయ కొఠారి

801
00:49:52,875 --> 00:49:54,708
ఫ్యాన్‌కు ఉరివేసుకుని
ఆత్మహత్య చేసుకున్నారు.

802
00:49:54,791 --> 00:49:57,000
ప్రేమ వైఫల్యమే
దీనికి కారణమని భావిస్తున్నారు.

803
00:49:57,083 --> 00:49:59,916
"ఇనాయ ఆత్మకు శాంతి కలగాలి."

804
00:50:00,000 --> 00:50:05,416
"చాలా మంది జీవితాల్లో రుచిని నింపావు."

805
00:50:06,958 --> 00:50:07,958
నేహ.

806
00:50:08,041 --> 00:50:09,416
అహ్లావత్ సర్ నిన్ను పిలిచారు.

807
00:50:10,666 --> 00:50:12,125
వస్తున్నాను.

808
00:50:14,041 --> 00:50:15,791
-చెప్పండి, సర్.
-కూర్చో.

809
00:50:15,875 --> 00:50:17,166
హైకోర్టు
ప్రధాన ప్రాసిక్యూటర్

810
00:50:19,625 --> 00:50:22,000
ఇనాయ కొఠారి కేసు గురించి నీకు ఏం తెలుసు?

811
00:50:22,500 --> 00:50:24,083
వార్తలలో వచ్చినంత వరకే తెలుసు.

812
00:50:25,333 --> 00:50:26,458
ఏసీపీ కుమార్.

813
00:50:27,041 --> 00:50:28,166
ఓహో, హలో, సర్.

814
00:50:28,250 --> 00:50:29,875
ఆయనే ఈ కేసును డీల్ చేస్తున్నారు.

815
00:50:29,958 --> 00:50:32,833
ఆమెను ఆన్‌లైన్‌లో ఫాలో అయ్యేదాన్ని.

816
00:50:32,916 --> 00:50:35,083
ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని
నేనెప్పుడూ అనుకోలేదు.

817
00:50:36,166 --> 00:50:37,333
అది ఆత్మహత్య కాదు.

818
00:50:38,250 --> 00:50:39,250
అది హత్య.

819
00:50:39,916 --> 00:50:42,958
మా దర్యాప్తు ప్రకారం,
అది ఆత్మహత్యగా కనబడేలా చేశారు.

820
00:50:47,333 --> 00:50:48,375
సర్, నాకు ఈ కేసు కావాలి.

821
00:50:49,208 --> 00:50:50,333
అందుకే ఇక్కడ ఉన్నావు.

822
00:50:52,291 --> 00:50:54,541
-అనుమానితులు ఎవరైనా ఉన్నారా?
-ఉన్నారు.

823
00:50:55,625 --> 00:50:56,625
విక్రమ్ బజ్రాల్.

824
00:50:57,750 --> 00:50:59,583
-ఆ బిల్డర్.
-విక్రమ్ అంకుల్?

825
00:51:00,250 --> 00:51:01,250
ఏమైనా సమస్యా?

826
00:51:02,000 --> 00:51:02,833
లేదు, సర్.

827
00:51:03,333 --> 00:51:06,208
బజ్రాల్ తరపున ఎవరు వాదిస్తారో
నీకు తెలుసని నేను అనుకుంటున్నాను.

828
00:51:07,166 --> 00:51:08,291
రేపు మాట్లాడుకుందాం.

829
00:51:09,666 --> 00:51:11,166
నువ్వు ఈ కేసు తీసుకోవడం లేదు.

830
00:51:11,250 --> 00:51:12,125
అంతే.

831
00:51:12,916 --> 00:51:14,916
నేను మీ దగ్గర పని చేయడం లేదని
మీరు మర్చిపోయారేమో.

832
00:51:15,000 --> 00:51:16,500
నాకు మీ అనుమతి అవసరం లేదు.

833
00:51:16,583 --> 00:51:17,500
నేహ!

834
00:51:17,583 --> 00:51:20,000
నీకేమైనా పిచ్చి పట్టిందా?
నాన్నకు వ్యతిరేక౦గా పోరాడుతావా?

835
00:51:21,000 --> 00:51:22,750
అన్నయ్యా, ప్లీజ్, ఇందులో జోక్యం చేసుకోకు.

836
00:51:22,833 --> 00:51:24,291
జోక్యం చేసుకోకు అంటే అర్థం ఏంటి?

837
00:51:24,375 --> 00:51:26,416
ఇది హై-ప్రొఫైల్ కేసు అని
అర్థం చేసుకోగలను.

838
00:51:27,208 --> 00:51:28,625
నువ్వు ఈ కేసులో భాగం అవ్వచ్చు.

839
00:51:29,416 --> 00:51:30,958
నాకు తోటి వకీలుగా ఉండు.

840
00:51:31,666 --> 00:51:33,416
ఇప్పటికే నీ సామర్థ్యం నిరూపించుకున్నావు.

841
00:51:35,333 --> 00:51:36,333
మనం బేరాలు ఆడుతున్నామా?

842
00:51:36,416 --> 00:51:37,666
ఏంటి?

843
00:51:39,583 --> 00:51:41,875
మనం బేరాలు ఆడుతున్నామా?

844
00:51:44,125 --> 00:51:45,708
ఏం నిరూపించాలనుకుంటున్నావు, నేహ?

845
00:51:46,625 --> 00:51:48,541
కోర్టులో నాతో పోరాడగలవని నిరూపించాలనా?

846
00:51:48,625 --> 00:51:50,333
నేను చేయలేనని అనుకుంటున్నారా?

847
00:51:50,416 --> 00:51:51,916
ఊరుకో, నేహ.

848
00:51:52,708 --> 00:51:54,041
నువ్వు తెలివైనదానివని అనుకున్నా.

849
00:51:54,666 --> 00:51:56,125
అసలు ఏం జరుగుతుందో చూడలేకపోతున్నావా?

850
00:51:56,208 --> 00:51:58,500
అహ్లావత్ స్వయంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్.

851
00:51:58,583 --> 00:52:00,208
కానీ అతనికి నన్ను ఎదుర్కోవడానికి భయం.

852
00:52:00,291 --> 00:52:02,000
అందుకే నిన్ను కవచంలా వాడుకుంటున్నాడు.

853
00:52:02,500 --> 00:52:06,000
సొంత కూతురు ముందు
నేను తడబడతానని అతను అనుకుంటున్నాడు.

854
00:52:06,791 --> 00:52:08,083
ఇది చాలా చవకబారు వ్యవహారం.

855
00:52:08,708 --> 00:52:10,291
అహ్లావత్ ఎప్పుడూ చేసేదిదే.

856
00:52:10,375 --> 00:52:12,250
ఇది చవకబారు వ్యవహారమని అనుకుంటున్నారా?

857
00:52:12,333 --> 00:52:15,875
నాకు కూడా కొంచెం మర్యాద ఇవ్వండి, నాన్నా.
నా మీద మీకు అసలు నమ్మకం లేదా?

858
00:52:15,958 --> 00:52:17,416
ఈ విషయం ఆలోచించు, నేహ.

859
00:52:18,083 --> 00:52:21,833
అంత పెద్ద హై-ప్రొఫైల్ కేసును అనుభవం లేని
లాయర్‌కు అతను ఎందుకు ఇస్తున్నాడు?

860
00:52:23,041 --> 00:52:24,125
నమ్మలేని విషయం.

861
00:52:24,208 --> 00:52:27,666
నేను ఎన్ని కేసులు గెలిచినా,
నేను అర్హురాలినని మీరింకా అనుకోవడం లేదు.

862
00:52:27,750 --> 00:52:29,333
బయట అందరికీ వినిపిస్తోంది.

863
00:52:30,291 --> 00:52:31,958
ఇప్పుడు దేని గురించి గొడవ?

864
00:52:32,041 --> 00:52:34,291
నేను మంచి లాయర్‌నని నాన్న అనుకోవడం లేదు.

865
00:52:34,375 --> 00:52:37,000
ఖచ్చితంగా నువ్వు మంచి లాయర్‌వే.
నీ పెంపకం అలాంటిది…

866
00:52:37,083 --> 00:52:38,958
నా పెంపకంతో మీకు ఎలాంటి సంబంధం లేదు.

867
00:52:39,041 --> 00:52:40,166
మీకెప్పుడూ సమయం ఉండేది కాదు.

868
00:52:40,250 --> 00:52:41,375
-చూసుకుంది అమ్మే.
-ఆపండి!

869
00:52:41,916 --> 00:52:42,916
చాలు!

870
00:52:49,708 --> 00:52:50,708
ఒక విషయం తెలుసా?

871
00:52:51,958 --> 00:52:54,583
ఇప్పటి వరకు ఈ కేసు తీసుకోవాలా వద్దా అని
నాకు సందేహం ఉంది.

872
00:52:57,083 --> 00:52:58,083
కానీ ఇప్పుడు ఖచ్చితం.

873
00:53:00,583 --> 00:53:02,625
నేను ఈ కేసు తీసుకుంటున్నాను.

874
00:53:04,708 --> 00:53:05,750
ఇదే చేయాలనుకుంటున్నావా?

875
00:53:06,291 --> 00:53:07,458
నాకు ఎదురు వెళ్తావా?

876
00:53:07,541 --> 00:53:09,458
రవి, నువ్వు నీ కూతురితో మాట్లాడుతున్నావు!

877
00:53:09,541 --> 00:53:11,958
లేదు, నేను
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో మాట్లాడుతున్నాను.

878
00:53:13,833 --> 00:53:15,250
అయితే, మిస్ ప్రాసిక్యూటర్,

879
00:53:15,791 --> 00:53:20,375
గుర్తుంచుకో, మిగతా లాయర్ల కంటే
నేను నీతో ఇంకా కఠినంగా ఉండబోతున్నాను.

880
00:53:21,375 --> 00:53:23,250
ఎందుకంటే, ఒక సీనియర్ లాయర్‌గా,

881
00:53:23,333 --> 00:53:25,500
లాయర్‌గా ఎలా ఉండాలో చూపించడం నా బాధ్యత.

882
00:53:26,625 --> 00:53:29,750
అలాగే ఒక తండ్రిగా,
గౌరవంగా ఎలా ఉండాలోనని.

883
00:53:32,041 --> 00:53:33,166
కోర్టులో కలుద్దాం.

884
00:53:41,958 --> 00:53:43,000
నేహ, బుజ్జీ.

885
00:53:43,083 --> 00:53:44,791
నా మాట విను.

886
00:53:45,291 --> 00:53:47,291
మనం పని చూసుకుందామా, ఆలోక్?

887
00:53:50,125 --> 00:53:51,125
సరే, నాన్నా.

888
00:53:58,958 --> 00:54:00,458
తండ్రికి తగ్గ కూతురు.

889
00:54:01,166 --> 00:54:03,625
నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు.

890
00:54:03,708 --> 00:54:06,375
నువ్వు, మీ నాన్న
ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు.

891
00:54:07,375 --> 00:54:09,208
ఎప్పుడూ కలుపుతూ ఉంటావు కూడా.

892
00:54:11,041 --> 00:54:12,458
ఇది ప్రతిరోజూ జరిగే వాదన కాదు.

893
00:54:12,541 --> 00:54:15,458
ఇది ఇంకా దారుణం కావచ్చు.
నువ్వు ఇందులో ఇరుక్కోవడం నాకిష్టం లేదు.

894
00:54:16,041 --> 00:54:17,041
అందుకే వెళుతున్నాను.

895
00:54:33,625 --> 00:54:35,375
రవి, ప్లీజ్ ఆమెను ఆపు.

896
00:54:36,250 --> 00:54:39,666
ఇది కేవలం వృత్తిపరమైన పోటీ అని,
వ్యక్తిగతం కాదని ఆమెకు చెప్పు.

897
00:54:41,000 --> 00:54:42,000
పోటీయా?

898
00:54:42,541 --> 00:54:43,791
తనతోనా?

899
00:54:44,916 --> 00:54:47,916
ఏవో కొన్ని కేసులు గెలవగానే, కోర్టులో
నన్ను ఎదుర్కోగలనని అనుకుంటోందా?

900
00:54:49,666 --> 00:54:51,083
నువ్వేం కంగారు పడకు, రేణుక.

901
00:54:51,833 --> 00:54:54,458
కోర్టులో తన భ్రమలను
పటాపంచలు చేయనివ్వు.

902
00:54:54,541 --> 00:54:57,583
అప్పుడు తనే ఇంటికి తిరిగి వస్తుంది,
నేను హామీ ఇస్తున్నాను.

903
00:55:12,416 --> 00:55:13,708
నేహ!

904
00:55:42,500 --> 00:55:43,500
ఏంటి, అమ్మా?

905
00:55:43,583 --> 00:55:45,291
నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా?

906
00:55:45,916 --> 00:55:47,416
కంగారు పడకు. నేను బాగుంటాను.

907
00:56:09,791 --> 00:56:10,916
అదే.

908
00:56:12,166 --> 00:56:13,333
-ఎంత?
-₹95.

909
00:56:14,208 --> 00:56:15,208
ఇటు రా.

910
00:56:43,125 --> 00:56:45,583
ఇంత తక్కువ సమయంలో
నేను ఇవి మాత్రమే ఏర్పాటు చేయగలిగాను.

911
00:56:45,666 --> 00:56:46,791
పర్వాలేదుగా?

912
00:56:46,875 --> 00:56:48,333
పర్లేదు, బాగుంది.

913
00:56:48,416 --> 00:56:50,666
నువ్వు ఇలాంటి జీవితానికి
అలవాటు లేదని తెలుసు.

914
00:56:50,750 --> 00:56:52,583
నాకు ప్రాసిక్యూటర్‌గా ఉండే
అలవాటు కూడా లేదు.

915
00:57:15,625 --> 00:57:17,125
నువ్వంటే మాకిష్టం, తల్లీ.

916
00:57:17,208 --> 00:57:18,583
నువ్వంటే కూడా నాకిష్టం, అమ్మా.

917
00:57:22,833 --> 00:57:26,041
ఫ్యామ్
నిష్క్రమి౦చి తొలగించండి

918
00:57:30,583 --> 00:57:35,000
కోర్టులో నువ్వు ఎదుర్కోబోయే వ్యక్తిని,
నువ్వు అంతకుముందు ఎప్పుడూ చూసి ఉండవు.

919
00:57:35,083 --> 00:57:36,916
గెలవడం ఒక్కటే అతని లక్ష్యం కాదు.

920
00:57:37,000 --> 00:57:40,375
మిస్టర్ రాజవన్ష్ ప్రత్యర్థిని
ఎంత దారుణంగా అణచివేయాలని చూస్తారంటే,

921
00:57:41,041 --> 00:57:42,875
వాళ్లు మళ్లీ కోలుకోలేరు.

922
00:57:43,666 --> 00:57:45,000
కంగారు పడకండి, సర్.

923
00:57:45,083 --> 00:57:46,875
నేను మిమ్మల్ని నిరాశపరచను.

924
00:57:46,958 --> 00:57:48,625
నువ్వు పూర్తి సన్నద్ధతతో ఉండాలి.

925
00:58:27,083 --> 00:58:29,791
ఇది ఆత్మహత్య కాదని
మీరు ఎందుకు అనుకుంటున్నావు?

926
00:58:30,500 --> 00:58:31,583
రెండు కారణాల వల్ల.

927
00:58:32,333 --> 00:58:34,833
మొదటిది, అక్కడ ఎలాంటి
సూసైడ్ నోట్ దొరకలేదు,

928
00:58:34,916 --> 00:58:37,166
సాధారణంగా ఆత్మహత్య కేసుల్లో అది ఉంటుంది.

929
00:58:37,791 --> 00:58:40,458
రెండవది, ఈ గాయాల గుర్తులను చూడండి.

930
00:58:40,958 --> 00:58:44,333
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే,
శరీర బరువు

931
00:58:44,416 --> 00:58:46,666
ఎక్కువగా పడే ప్రాంతంలోనే
ఈ మచ్చలు పడతాయి.

932
00:58:46,750 --> 00:58:48,791
అంటే మెడ వెనుక, లేదా పక్క భాగాల్లో.

933
00:58:48,875 --> 00:58:52,083
కానీ ఇక్కడ గుర్తులు గొంతు చుట్టూ ఉన్నాయి.

934
00:58:52,166 --> 00:58:55,666
ఎవరైనా గొంతు పిసికి చంపినప్పుడే
ఇలా జరుగుతుంది.

935
00:58:57,458 --> 00:58:59,041
మరి బజ్రాల్‌ను అరెస్ట్ చేయడానికి కారణం?

936
00:58:59,125 --> 00:59:02,041
ఇనాయ ఇంట్లో మాకు ఈ ఫోటోలు దొరికాయి.

937
00:59:02,875 --> 00:59:05,416
ఈ ఫోటోలు తీసిన ఫోన్ కానీ,

938
00:59:05,500 --> 00:59:08,583
బజ్రాల్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి
వాడిన ఫోన్ కానీ మాకు దొరకలేదు.

939
00:59:08,666 --> 00:59:12,916
ఖచ్చితంగా బజ్రాల్ దాన్ని ధ్వంసం చేసుండాలి,
లేదా ఎక్కడైనా దాచి ఉండాలి.

940
00:59:13,000 --> 00:59:15,166
నిజమే. అతను అంత పెద్ద వ్యాపారవేత్త.

941
00:59:15,791 --> 00:59:17,000
అంత తెలివితక్కువ పని చేయడు.

942
00:59:17,083 --> 00:59:19,666
కానీ అతను ఈ ఫోటోలను
కనిపెట్టకపోవడం మనకు కలిసొచ్చింది.

943
00:59:20,291 --> 00:59:22,916
బజ్రాల్‌ను ఘటనా స్థలంతో కలిపే
ఇతర ఆధారాలు ఏమైనా ఉన్నాయా?

944
00:59:23,000 --> 00:59:23,833
ఉన్నాయి.

945
00:59:23,916 --> 00:59:28,375
అక్కడ మాకు పగిలిన గాజు ముక్క దొరికింది.

946
00:59:28,458 --> 00:59:30,333
బహుశా గొడవ సమయంలో
అది పగిలి ఉండవచ్చు.

947
00:59:30,416 --> 00:59:32,416
దానిపై బజ్రాల్ వేలిముద్రలు ఉన్నాయి.

948
00:59:32,500 --> 00:59:36,041
హత్య జరిగిన సమయంలో
బజ్రాల్ ఆ భవనంలో ఉన్నట్లు

949
00:59:36,125 --> 00:59:39,125
మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది,
ఇంకా సాక్షులు ఉన్నారు.

950
00:59:40,375 --> 00:59:42,875
విక్రమ్ బజ్రాల్ ఈ కేసును
మనకు ప్లేటులో పెట్టి వడ్డించినట్టుంది.

951
00:59:43,541 --> 00:59:46,000
నీ ఓపెనింగ్, క్లోజింగ్ స్టేట్‌మెంట్స్ మీద
దృష్టి పెట్టు.

952
00:59:49,041 --> 00:59:50,875
దీని గురించి బజ్రాల్ ఏమంటున్నాడు?

953
00:59:50,958 --> 00:59:53,208
నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు.

954
00:59:55,125 --> 00:59:56,291
నన్ను ఇరికించారు.

955
00:59:57,083 --> 00:59:57,958
సరే.

956
00:59:58,666 --> 01:00:01,250
మరి ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో
నువ్వు ఏం చేస్తున్నావు?

957
01:00:01,750 --> 01:00:03,208
నా మెసేజ్‌లు చెక్ చేయండి.

958
01:00:03,291 --> 01:00:06,375
డబ్బు తీసుకురమ్మన్న వ్యక్తి
ఆ భవనం టెర్రస్ మీదకు నన్ను రమ్మన్నారు.

959
01:00:06,458 --> 01:00:07,583
అందుకే నేను వెళ్లాను.

960
01:00:07,666 --> 01:00:09,375
వేరే సూచనలు ఏవీ లేవా?

961
01:00:09,458 --> 01:00:11,833
నేను 30 నిమిషాలు వేచి చూశాను.

962
01:00:11,916 --> 01:00:12,833
ఎవరూ రాలేదు.

963
01:00:12,916 --> 01:00:14,916
మెసేజ్‌లు కూడా రావడం ఆగిపోయాయి.

964
01:00:15,000 --> 01:00:16,333
అందుకే నేను వెళ్లిపోయాను.

965
01:00:16,958 --> 01:00:20,958
దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా,
నేను ఆ సమయమంతా టెర్రస్ మీదే ఉన్నాను.

966
01:00:21,833 --> 01:00:22,833
నన్ను నమ్ము.

967
01:00:24,458 --> 01:00:28,208
పోలీస్ రిపోర్ట్ ప్రకారం,
నువ్వు కొన్ని ఆధారాలను ధ్వంసం చేశావు.

968
01:00:29,375 --> 01:00:31,875
నీకు మెసేజ్‌లు పంపేందుకు
ఉపయోగించిన ఆ ఫోన్

969
01:00:33,083 --> 01:00:35,208
ఆ బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తి
ఇంట్లో కూడా దొరకలేదు.

970
01:00:35,958 --> 01:00:37,625
ఇప్పుడు జాగ్రత్తగా సమాధానం చెప్పు.

971
01:00:37,708 --> 01:00:39,666
నీకు అది ఎలా తెలిసిందో చెప్పక్కర్లేదు,

972
01:00:40,250 --> 01:00:42,875
కానీ, ఆ ఫోన్ ఎక్కడ ఉందో
అసలు నీకు ఏమైనా తెలుసా?

973
01:00:42,958 --> 01:00:46,333
నన్ను ఎవరు బ్లాక్‌మెయిల్
చేస్తున్నారో కూడా నాకు తెలియనప్పుడు,

974
01:00:46,416 --> 01:00:49,000
ఆ ఫోన్ ఎక్కడ ఉందో నాకెలా తెలుస్తుంది?

975
01:00:51,708 --> 01:00:53,000
దయచేసి నన్ను నమ్ము.

976
01:00:53,083 --> 01:00:54,875
సరే. నేను చెప్పేది ఏంటంటే,

977
01:00:54,958 --> 01:00:57,208
నువ్వు ఇక్కడ చెప్పేది మన మధ్యే ఉంటుంది.

978
01:00:57,291 --> 01:01:00,416
కానీ దయచేసి,
నాతో పూర్తిగా నిజాయితీగా ఉండు.

979
01:01:02,791 --> 01:01:04,958
రవి, నీకు నేను ఎంతకాలంగా తెలుసు?

980
01:01:06,541 --> 01:01:08,958
సోదరా, ఆ అమ్మాయి ఎవరో కూడా
నాకు తెలియదు!

981
01:01:09,041 --> 01:01:10,666
నేను ఆమెను ఎందుకు చంపుతాను?

982
01:01:13,083 --> 01:01:14,250
నన్ను దీని నుండి బయట పడేయండి.

983
01:01:16,125 --> 01:01:18,750
ఇక, ప్లీజ్, నన్ను కాపాడండి.

984
01:01:22,083 --> 01:01:23,916
పోలీసులు ఆ ఫోన్ కనిపెట్టలేకపోయారు.

985
01:01:24,000 --> 01:01:25,375
అంటే అదింకా ఎవరి దగ్గరో ఉంది.

986
01:01:26,083 --> 01:01:27,625
మనం ఆ ఫోన్ కనిపెట్టాలి, అక్షయ్.

987
01:01:28,291 --> 01:01:30,500
నీ డిటెక్టివ్‌లలో ఉత్తములను
ఆ పనిలో పెట్టు.

988
01:01:30,583 --> 01:01:32,625
అది ఎవరి ఫోన్, అలాగే విక్రమ్‌కు

989
01:01:32,708 --> 01:01:34,750
ఆ మెసేజ్‌లు ఎవరు పంపించారో
మనం తెలుసుకోవాలి.

990
01:01:34,833 --> 01:01:35,958
అలాగే, సర్.

991
01:01:36,041 --> 01:01:38,625
నీకు ఏమనిపిస్తోంది?
విక్రమ్ బజ్రాల్ నిజం చెబుతున్నాడనా?

992
01:01:39,416 --> 01:01:41,625
బ్లాక్ మెయిల్ విషయాన్ని
అతను ఒప్పుకున్నాడు.

993
01:01:41,708 --> 01:01:43,666
నిర్దోషినని అంటూనే,
హత్యకు కారణం ఒప్పుకున్నాడు.

994
01:01:43,750 --> 01:01:44,750
అది వింతగా లేదా?

995
01:01:44,833 --> 01:01:46,583
అతను బ్లాక్‌మెయిల్‌ను ఎలా దాచగలడు?

996
01:01:46,666 --> 01:01:49,333
పోలీసులకు ఆ ఫోటోలు దొరికాయి కదా?

997
01:01:49,416 --> 01:01:52,166
తనను ఇరికించారని
అతను కథ అల్లుతున్నాడు.

998
01:01:52,750 --> 01:01:54,666
ఆయన చాలా ఏళ్లుగా
మా కుటుంబానికి స్నేహితుడు.

999
01:01:55,333 --> 01:01:58,208
అతని ప్రవర్తన కొంచెం వింతగా ఉన్నా,
హంతకుడిలా మాత్రం అనిపించలేదు.

1000
01:01:59,000 --> 01:02:01,583
అతనికి అక్రమ సంబ౦ధాలు ఉన్నటు
ఎప్పుడైనా అనిపి౦చి౦దా?

1001
01:02:01,666 --> 01:02:03,458
వదిలేయ్. ఎవరికైనా అఫైర్‌లు ఉండవచ్చు.

1002
01:02:03,541 --> 01:02:04,583
నీకయినా సరే.

1003
01:02:05,708 --> 01:02:06,833
నా ఉద్దేశం…

1004
01:02:07,416 --> 01:02:10,208
నా ఉద్దేశం, ఒక హత్యను
అఫైర్‌తో ఎలా పోలుస్తావు?

1005
01:02:11,041 --> 01:02:15,875
లేదు… మనం అందరం మన అసలు స్వరూపాన్ని
దాచుకుంటామని చెప్పడమే నా ఉద్దేశం.

1006
01:02:19,166 --> 01:02:20,750
-నా ఖాతాలో రాసుకో.
-సరే.

1007
01:02:21,666 --> 01:02:22,500
పోలీస్.

1008
01:02:23,083 --> 01:02:25,583
అండర్‌కవర్ పోలీస్.

1009
01:02:25,666 --> 01:02:27,166
పోలీస్. అండ…

1010
01:02:28,708 --> 01:02:30,458
పర్వాలేదులే, అంత చెడ్డ జోక్ ఏమీ కాదు.

1011
01:02:31,041 --> 01:02:32,041
నీ ఫోన్ ఇవ్వు.

1012
01:02:33,083 --> 01:02:33,916
ఇవ్వు.

1013
01:02:37,916 --> 01:02:38,916
ఏంటి?

1014
01:02:40,083 --> 01:02:41,458
మన మధ్య ఈ సంబంధం ఉందిగా?

1015
01:02:42,500 --> 01:02:43,500
ఇక్కడితో ముగిసిపోయింది.

1016
01:02:45,541 --> 01:02:46,375
ఏంటి?

1017
01:02:46,875 --> 01:02:49,666
పోలీసులు కూడా కాల్పులు జరిపే ముందు
హెచ్చరిక ఇస్తారు.

1018
01:02:49,750 --> 01:02:51,625
నేరుగా నా గుండెల్లో కాల్చావు,
హెచ్చరిక లేకుండా.

1019
01:02:52,458 --> 01:02:54,458
మనం ఏదో దరఖాస్తు చేసుకుని
ఇది మొదలుపెట్టలేదు కదా.

1020
01:02:55,416 --> 01:02:57,458
నేనేమైనా తప్పు చేశానా?

1021
01:02:58,166 --> 01:02:59,500
మనం ఇద్దరం తప్పు చేశాం.

1022
01:03:00,666 --> 01:03:02,166
మనం ఇద్దరం పెళ్లయిన వాళ్లం.

1023
01:03:04,083 --> 01:03:05,916
గ్రహించడానికి నీకు చాలా సమయం పట్టింది.

1024
01:03:06,833 --> 01:03:07,708
విను.

1025
01:03:07,791 --> 01:03:10,291
మన పెళ్లిళ్లు అలాగే కొనసాగుతాయి.
ఇది కూడా కొనసాగనివ్వు, ప్లీజ్.

1026
01:03:10,958 --> 01:03:12,916
నన్ను వాడుకున్నావా?

1027
01:03:15,083 --> 01:03:16,333
నీకు నచ్చింది అనుకో.

1028
01:03:23,583 --> 01:03:24,583
ఛీ!

1029
01:03:26,583 --> 01:03:28,166
కేసు నంబర్ 112.

1030
01:03:28,250 --> 01:03:30,250
ఢిల్లీ కోర్టు వర్సెస్ విక్రమ్ బజ్రాల్.

1031
01:03:30,333 --> 01:03:32,625
నేరపూరిత మానవహత్య ఆరోపణలు.

1032
01:03:34,000 --> 01:03:35,583
ప్రతివాది తరపున ఎవరు వాదిస్తున్నారు?

1033
01:03:35,666 --> 01:03:38,166
నేను, రవి రాజవన్ష్, యువరానర్.

1034
01:03:41,166 --> 01:03:42,000
ప్రాసిక్యూషన్?

1035
01:03:43,916 --> 01:03:45,166
నేహ రాజవన్ష్, యువరానర్.

1036
01:03:49,625 --> 01:03:51,083
సరే, కొనసాగించండి.

1037
01:03:51,166 --> 01:03:52,458
ప్రతివాది నేరం ఒప్పుకుంటున్నాడా?

1038
01:03:53,958 --> 01:03:55,125
నిర్దోషిని, యువరానర్.

1039
01:03:55,750 --> 01:03:58,541
డిఫెన్స్ బెయిల్ దరఖాస్తును సమర్పించింది.

1040
01:03:59,166 --> 01:04:00,625
యువరానర్, గౌరవంగా చెబుతున్నాను,

1041
01:04:00,708 --> 01:04:03,875
బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు.
ప్రతివాదిపై హత్య ఆరోపణలు ఉన్నాయి.

1042
01:04:04,666 --> 01:04:07,166
ముద్దాయికి, నేరస్తునికి మధ్య తేడా ఉంటుంది.

1043
01:04:07,708 --> 01:04:10,916
నేను ప్రాసిక్యూషన్‌కు ఇలాంటి
ప్రాథమిక సూత్రాలను వివరించాల్సి వస్తే,

1044
01:04:11,416 --> 01:04:13,333
మనం కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తాం.

1045
01:04:14,333 --> 01:04:16,083
ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే

1046
01:04:16,166 --> 01:04:18,791
నా క్లయింట్ భారత్ వదిలి పారిపోతారని
ప్రాసిక్యూషన్ భయపడితే,

1047
01:04:18,875 --> 01:04:21,000
నేను కోర్టుకు హామీ ఇస్తున్నాను,

1048
01:04:21,083 --> 01:04:24,708
మిస్టర్ విక్రమ్ బజ్రాల్ చాలా గౌరవనీయమైన,
అలాగే చట్టాన్ని గౌరవించే పౌరుడు…

1049
01:04:24,791 --> 01:04:26,625
-యువరానర్…
-…మన దేశ న్యాయ వ్యవస్థపై

1050
01:04:26,708 --> 01:04:28,500
ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది.

1051
01:04:29,708 --> 01:04:31,541
యువరానర్, మిస్టర్ బజ్రాల్‌కు ఉన్న

1052
01:04:31,625 --> 01:04:34,333
అధికారం, పలుకుబడి గురించి
ప్రాసిక్యూషన్‌కు కూడా తెలుసు.

1053
01:04:34,416 --> 01:04:36,250
-అవును.
-ఒకవేళ తనకు బెయిల్ మంజూరు చేస్తే,

1054
01:04:36,333 --> 01:04:38,166
అతను ఈ విచారణను ప్రభావితం చేయవచ్చు.

1055
01:04:38,250 --> 01:04:40,291
అవును, అతను పెద్ద వ్యాపారవేత్త.

1056
01:04:40,375 --> 01:04:41,333
అది నేరం కాదు.

1057
01:04:41,416 --> 01:04:42,875
నిజానికి, అతని బాధ్యతలు

1058
01:04:42,958 --> 01:04:46,458
కేవలం అతని కుటుంబానికి మాత్రమే
పరిమితం కాలేదు.

1059
01:04:46,541 --> 01:04:49,750
ఆయన తన ఉద్యోగులకు,
ఇంటి కొనుగోలుదారులకు కూడా బాధ్యత వహించాలి.

1060
01:04:49,833 --> 01:04:50,666
యువరానర్, ఇది…

1061
01:04:50,750 --> 01:04:53,083
ఇవి జైలు నుండి నెరవేర్చలేరు.

1062
01:04:53,166 --> 01:04:55,541
-ఇది చాలా పెద్ద రిస్క్, యువరానర్.
-చాలు.

1063
01:04:56,625 --> 01:04:59,708
ఈ కోర్టు ప్రతివాది
బెయిల్ దరఖాస్తును అంగీకరిస్తూ,

1064
01:05:00,291 --> 01:05:02,416
బెయిల్ మొత్తాన్ని
₹2,00,000గా నిర్ణయిస్తోంది.

1065
01:05:03,000 --> 01:05:08,041
మిస్టర్ బజ్రాల్ తన పాస్‌పోర్ట్‌ను కూడా
ఈ కోర్టుకు అప్పగించాల్సి ఉంటుంది.

1066
01:05:09,208 --> 01:05:10,208
ధన్యవాదాలు, రవి.

1067
01:05:14,541 --> 01:05:15,541
ప్రిన్సెస్.

1068
01:05:18,208 --> 01:05:20,375
-సర్, నేను మీ పెద్ద అభిమానిని.
-ఆత్మా!

1069
01:05:21,000 --> 01:05:22,000
సర్.

1070
01:05:24,875 --> 01:05:27,041
నేను ప్రిన్సెస్ అని పిలవడం
తను ఇష్టపడేది.

1071
01:05:28,833 --> 01:05:30,375
మిమ్మల్ని కూడా ఇష్టపడేది, నాన్నా.

1072
01:05:39,125 --> 01:05:41,041
-అలాగా.
-అనిత, క్యాలెండర్ అప్‌డేట్ చేయి.

1073
01:05:41,125 --> 01:05:41,958
సర్?

1074
01:05:43,208 --> 01:05:46,875
మి. బజ్రాల్‌ను బ్లాక్ మెయిల్ మెసేజ్‌లు
పంపేందుకు ఉపయోగించిన సిమ్ కార్డ్

1075
01:05:46,958 --> 01:05:48,541
కొన్ని రోజుల క్రితం
డీయాక్టివేట్ అయింది.

1076
01:05:48,625 --> 01:05:52,166
కానీ, సర్, మేము ఐఎంఈఐ నంబర్‌ను
ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

1077
01:05:52,250 --> 01:05:54,250
కానీ సమస్య ఏమిటంటే,
అది కనిపించడం లేదు.

1078
01:05:54,750 --> 01:05:58,291
బహుశా ఆ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయుండాలి,
లేదా ధ్వంసం చేయబడి ఉండాలి, సర్.

1079
01:05:59,041 --> 01:06:00,500
అది ఎవరి ఫోన్ అని మనకు తెలుసా?

1080
01:06:00,583 --> 01:06:02,541
దాని నమోదిత యజమాని
ఖిర్కీ గ్రామంలో

1081
01:06:03,083 --> 01:06:04,500
దగ్గర నివసించే అబ్దుల్లా షేక్.

1082
01:06:04,583 --> 01:06:06,750
తన ఫోన్ ఏడాది క్రితం
చోరీ అయిందని అ౦టున్నాడు.

1083
01:06:06,833 --> 01:06:08,375
-విక్రమ్.
-ఏంటి?

1084
01:06:08,458 --> 01:06:10,666
ఎవరి మీదైనా అనుమానం ఉందా?
ఇలా చేయగలవారు ఎవరైనా?

1085
01:06:12,291 --> 01:06:14,333
-లేదు, రవి.
-సరే.

1086
01:06:15,500 --> 01:06:18,208
నువ్వు ఎవరితోనైనా గొడవపడి ఉంటే
వాళ్ల పేర్లు,

1087
01:06:18,291 --> 01:06:21,375
అలాగే ఏ మహిళతోనైనా సంబంధం ఉంటే
వాళ్ల పేర్లు,

1088
01:06:21,458 --> 01:06:22,666
నాకు ఆ జాబితా కావాలి.

1089
01:06:23,291 --> 01:06:24,750
నిజంగానా?

1090
01:06:24,833 --> 01:06:25,833
అందరి పేర్లా?

1091
01:06:34,291 --> 01:06:36,375
-ఓరి దేవుడా, బాగానే ఉన్నావా?
-బాగున్నా.

1092
01:06:39,166 --> 01:06:40,291
ఇరవై ఐదు నిమిషాలు.

1093
01:06:40,875 --> 01:06:44,958
విక్రమ్ బజ్రాల్ తాను ఇక్కడ
45 నిమిషాలు వేచి ఉన్నానని చెబుతున్నాడు.

1094
01:06:45,666 --> 01:06:47,250
మన లెక్క ప్రకారం, ఈ సమయంలోనే

1095
01:06:47,333 --> 01:06:49,666
అతను మెట్లు దిగి
ఎనిమిదో అంతస్తుకు వెళ్లి,

1096
01:06:49,750 --> 01:06:54,083
ఇనాయను హత్య చేసి
మళ్లీ అదే మెట్ల ద్వారా పైకి రావాలి.

1097
01:06:54,166 --> 01:06:55,125
ఎలా?

1098
01:06:55,208 --> 01:06:56,666
అతను కోహ్లీ అంత ఫిట్‌గా ఉన్నాడా?

1099
01:06:57,375 --> 01:06:58,750
తన మాట నిజమే.

1100
01:06:58,833 --> 01:07:01,125
బజ్రాల్ వయస్సు ఇతనికి రెట్టింపు,
అలాగే గుండె జబ్బు ఉంది.

1101
01:07:01,208 --> 01:07:02,250
ఇది చూడండి.

1102
01:07:05,333 --> 01:07:06,625
తను అలసిపోయినట్టు ఉన్నాడా?

1103
01:07:07,208 --> 01:07:12,333
ఒకవేళ అతను నిజంగా 20 అంతస్తులు దిగి,
ఇనాయను హత్య చేసి మళ్లీ పైకి ఎక్కి ఉంటే,

1104
01:07:12,416 --> 01:07:16,541
మనం ఇనాయ పోస్ట్‌మార్టం రిపోర్టుతో పాటు
ఇతనిది కూడా చర్చించాల్సి వచ్చేది.

1105
01:07:18,791 --> 01:07:19,791
పదండి.

1106
01:07:21,166 --> 01:07:26,583
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, అతను
సా. 5:30 నుండి 6:15 వరకు ఇక్కడే ఉన్నాడు.

1107
01:07:30,583 --> 01:07:35,250
ఇంకా ఇనాయ పోస్ట్‌మార్టం రిపోర్టు ప్రకారం,
ఆమె కూడా అదే సమయంలో హత్య చేయబడింది.

1108
01:07:37,000 --> 01:07:39,083
ఇలా ఊహించు,
ఇక్కడ ఒక ఇంటి ధర ఎంత ఉంటుంది?

1109
01:07:39,166 --> 01:07:41,083
₹50-60,000.

1110
01:07:41,166 --> 01:07:42,041
వేలల్లోనా?

1111
01:07:42,541 --> 01:07:44,375
నేననేది కొనడం గురించి,
అద్దె కాదు.

1112
01:07:45,291 --> 01:07:46,500
నాలుగు కోట్లు.

1113
01:07:47,875 --> 01:07:50,791
నా జీతం ప్రకారం అయితే, కొనడం గురించి,
నా బుర్ర ఆలోచించడం కూడా మానేసింది.

1114
01:07:52,041 --> 01:07:53,791
నాలుగు కోట్లు.

1115
01:07:54,416 --> 01:07:56,000
నువ్వేమైనా కొనాలని అనుకుంటున్నావా?

1116
01:07:56,875 --> 01:07:58,916
మన జీతాలో పెద్ద తేడా ఏమీ లేదు.

1117
01:07:59,916 --> 01:08:01,041
ఇది ఇనాయ ఇల్లు.

1118
01:08:01,625 --> 01:08:02,541
ఇది ఆమె సొంతం.

1119
01:08:03,000 --> 01:08:05,875
ఒక చిన్న బ్లాగర్ ₹4 కోట్ల విలువైన ఇంటిని
ఎలా కొనగలిగింది?

1120
01:08:06,500 --> 01:08:07,500
అది చాలా సులభం.

1121
01:08:07,583 --> 01:08:09,416
విక్రమ్ బజ్రాల్ వంటి
వారిని బ్లాక్మెయిల్ చేసి.

1122
01:08:12,333 --> 01:08:13,333
పదా వెళదాం.

1123
01:08:16,416 --> 01:08:17,500
రేపటి కోసం సిద్ధమేనా?

1124
01:08:19,250 --> 01:08:21,000
ఇవాళ సూర్య నివాస్ టవర్స్‌కు వెళ్లాను.

1125
01:08:21,625 --> 01:08:23,125
అక్కడ ట్యూషన్ చెబుతావు కదా?

1126
01:08:23,708 --> 01:08:24,875
నీ పోస్టర్ చూశాను.

1127
01:08:25,708 --> 01:08:27,250
అవును, అక్కడ నాకొక స్టూడెంట్ ఉన్నాడు.

1128
01:08:27,333 --> 01:08:28,375
రేయాన్.

1129
01:08:28,458 --> 01:08:31,500
చాలా మంచి పిల్లాడు,
కానీ గణితంలో సున్నా.

1130
01:08:32,583 --> 01:08:34,166
అక్కడ ఇనాయను ఎప్పుడైనా చూశావా?

1131
01:08:34,250 --> 01:08:36,125
చూసినా సరే, నాకు తెలియదు.

1132
01:08:36,208 --> 01:08:38,875
ఈ బ్లాగర్ల గురించి నాకు పెద్దగా తెలియదు.

1133
01:08:41,250 --> 01:08:42,333
రేపటి గురించి భయంగా ఉందా?

1134
01:08:44,166 --> 01:08:45,000
నిజం చెప్పాలంటే,

1135
01:08:46,416 --> 01:08:47,583
కొంచెం భయంగా ఉంది.

1136
01:08:48,750 --> 01:08:50,916
అందుకే నా ఓపెనింగ్ స్టేట్‌మెంట్
మళ్లీ సరిచేసుకుంటున్నా.

1137
01:08:51,583 --> 01:08:52,916
అంతా బాగా జరుగుతుంది.

1138
01:08:56,500 --> 01:08:59,458
యువరానర్, ఇనాయ కొఠారి
ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్.

1139
01:08:59,958 --> 01:09:01,208
ఫుడ్ బ్లాగింగ్‌తో పాటు,

1140
01:09:01,291 --> 01:09:04,541
ఆమె తన సోషల్ మీడియాలో
వివాదాస్పద కథనాలను కూడా షేర్ చేసేది.

1141
01:09:05,125 --> 01:09:07,875
అందులో ఒకటి మిస్టర్ విక్రమ్ బజ్రాల్
అక్రమ సంబంధం గురించి.

1142
01:09:07,958 --> 01:09:11,250
విక్రమ్ బజ్రాల్ సంబంధం గురించి
ఇనాయకు తెలిసిన వెంటనే, ఆమె అతన్ని

1143
01:09:11,333 --> 01:09:12,708
బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించింది.

1144
01:09:13,291 --> 01:09:16,416
రియల్ ఎస్టేట్ ప్రపంచంలో మిస్టర్ బజ్రాల్‌కు
ఎంతటి పేరు ఉందో మనందరికీ తెలుసు.

1145
01:09:16,500 --> 01:09:19,166
ఆయన ఏదైనా డీల్ మాట్లాడుతున్నప్పుడు

1146
01:09:19,250 --> 01:09:21,625
అవతలి వారు
ఆయన షరతులను అంగీకరించకపోతే,

1147
01:09:21,708 --> 01:09:24,375
వారు మళ్లీ ఏ డీల్ చేయలేనంత
అసమర్థులుగా మారిపోతారని అంటారు.

1148
01:09:24,458 --> 01:09:28,125
ఈ కేసులో, ఇనాయ కొఠారి విషయంలో కూడా
సరిగ్గా అదే జరిగిందని నిరూపించే

1149
01:09:28,208 --> 01:09:31,500
కొన్ని వాస్తవాలను
మేము కోర్టు ముందు ఉంచుతాం.

1150
01:09:31,583 --> 01:09:34,291
ఈ రహస్య డీల్ షరతులను ఇనాయ కొఠారి

1151
01:09:34,375 --> 01:09:36,541
మిస్టర్ బజ్రాల్‌తో కలిసి నిర్ణయిస్తోంది.

1152
01:09:36,625 --> 01:09:38,458
ఇంకా తన స్వభావానికి అనుగుణంగా,

1153
01:09:38,541 --> 01:09:41,208
మిస్టర్ బజ్రాల్ సమస్యకు మూలాన్ని
అంతం చేశారు.

1154
01:09:41,833 --> 01:09:43,000
ఇది, యువరానర్,

1155
01:09:43,083 --> 01:09:46,500
క్రూర ఉద్దేశంతో,
ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య.

1156
01:09:47,875 --> 01:09:49,125
అంతవరకే.

1157
01:09:53,750 --> 01:09:54,750
యువరానర్,

1158
01:09:55,708 --> 01:09:59,000
ప్రాసిక్యూషన్ ఓపెనింగ్ స్టేట్‌మెంట్‌ను
నేను చాలా శ్రద్ధగా విన్నాను.

1159
01:09:59,083 --> 01:10:00,250
డిఫెన్స్ లాయర్‌గా,

1160
01:10:00,333 --> 01:10:04,041
వారి ప్రతి ఆరోపణ
తప్పు అని నిరూపించడంనా బాధ్యత.

1161
01:10:04,125 --> 01:10:05,791
కానీ తమ ఓపెనింగ్ స్టేట్‌మెంట్‌లో

1162
01:10:05,875 --> 01:10:08,625
ఇంత నిజాయితీగా ఉన్నందుకు
నేను వారిని అభినందించాలి.

1163
01:10:09,416 --> 01:10:11,541
మిస్టర్ విక్రమ్ బజ్రాల్

1164
01:10:11,625 --> 01:10:14,958
చాలా పేరున్న వ్యాపారవేత్త అని
ప్రాసిక్యూషన్ చెప్పిన మాటతో ఏకీభవిస్తాను.

1165
01:10:15,041 --> 01:10:17,041
అతను దూకుడుగా, నిర్దయగా ఉంటాడు.

1166
01:10:17,541 --> 01:10:18,875
తను అలాగే ఉండాలి కూడా.

1167
01:10:18,958 --> 01:10:22,416
ఏదేమైనా అతను వ్యాపారం నడుపుతున్నాడు,
ఏదో ఛారిటీ లేదా వృద్ధాశ్రమం కాదు.

1168
01:10:23,000 --> 01:10:24,500
ప్రాసిక్యూషన్ సరిగ్గానే చెప్పారు,

1169
01:10:24,583 --> 01:10:28,166
వివాహం అయినా సరే,
మిస్టర్ బజ్రాల్‌కు వివాహేతర సంబంధం ఉంది.

1170
01:10:28,250 --> 01:10:29,666
అది నిజమా?

1171
01:10:30,291 --> 01:10:31,291
ఖచ్చితంగా.

1172
01:10:32,208 --> 01:10:34,208
తన భార్యను మోసం చేసినందుకు
అతను ఖచ్చితంగా దోషి.

1173
01:10:34,791 --> 01:10:37,083
ఇది అతని గౌరవాన్ని దెబ్బతీస్తుందా?

1174
01:10:37,166 --> 01:10:38,000
ఖచ్చితంగా.

1175
01:10:38,083 --> 01:10:43,083
కానీ కేవలం తన గౌరవాన్ని కాపాడుకోవడానికి
ఇనాయ కొఠారిని చంపడం అనేది

1176
01:10:43,166 --> 01:10:45,416
అతను చేయని నేరం.

1177
01:10:45,500 --> 01:10:49,500
మిస్టర్ విక్రమ్ బజ్రాల్ నేరస్థుడు కాదు,
ఖచ్చితంగా హంతకుడు కాదు.

1178
01:10:50,083 --> 01:10:54,458
అలాగే ఈ హత్యను ఆత్మహత్యగా
చిత్రీకరించిన విధానం చూస్తుంటే,

1179
01:10:55,083 --> 01:10:58,833
ఇది కేవలం ఎవరో మూర్ఖులు,
నిర్లక్ష్యంగా ఉండేవారు చేసిన పనిలా ఉంది.

1180
01:10:58,916 --> 01:11:01,333
నేను, నా క్లయింట్
దాన్ని అవమానంగా భావిస్తున్నాం.

1181
01:11:01,416 --> 01:11:04,500
ఎందుకంటే నా క్లయింట్ విక్రమ్ బజ్రాల్
లక్ష తప్పులు చేసుండవచ్చు,

1182
01:11:04,583 --> 01:11:07,125
కానీ నిర్లక్ష్యం, మూర్ఖత్వం అనేవి
వాటిలో లేవు.

1183
01:11:08,750 --> 01:11:09,791
అంతే, యువరానర్.

1184
01:11:13,083 --> 01:11:14,916
యువరానర్, ఆధారాలు పరిస్థితుల
ఆధారంగా ఉన్నాయి,

1185
01:11:15,000 --> 01:11:16,416
కానీ హత్యకు గల కారణం స్పష్టం.

1186
01:11:16,500 --> 01:11:19,416
ఇనాయ అపార్ట్‌మెంట్‌లో
మాకు మిస్టర్ బజ్రాల్ ఫోటోలు దొరికాయి.

1187
01:11:19,500 --> 01:11:22,291
నేనెంత శ్రద్ధగా వింటున్నానో,
ప్రాసిక్యూషన్ నా అంత శ్రద్ధగా

1188
01:11:22,958 --> 01:11:24,291
వినడం లేదని నా అభిప్రాయం.

1189
01:11:24,875 --> 01:11:28,125
ఆ ఫోటోలు, అన్ని ఆధారాలు
అక్కడ కావాలని పెట్టబడ్డాయి.

1190
01:11:29,500 --> 01:11:32,083
వారికి ఫోటోలు దొరికాయి,
కానీ ఫోన్ ఎందుకు దొరకలేదు?

1191
01:11:32,166 --> 01:11:34,833
ఆ ఫోటోలు తీయడానికి, నా క్లయింట్‌ను
బ్లాక్‌మెయిల్ చేసిన ఫోన్.

1192
01:11:34,916 --> 01:11:37,916
హత్య తర్వాత బజ్రాల్
ఆ ఫోన్‌ను ధ్వంసం చేసి ఉండవచ్చు.

1193
01:11:38,791 --> 01:11:39,791
"ఉండవచ్చా"?

1194
01:11:40,291 --> 01:11:41,500
"ఉండవచ్చు…"

1195
01:11:41,583 --> 01:11:44,416
ప్రాసిక్యూషన్ వాదన అంతా
"ఉండవచ్చు" అనే దానిపైనే ఆధారపడి ఉంది.

1196
01:11:44,500 --> 01:11:45,750
కానీ అసలు విషయం ఏమిటంటే,

1197
01:11:45,833 --> 01:11:49,208
మిస్టర్ విక్రమ్ బజ్రాల్‌కు
ఇనాయ కొఠారి ఎవరో కూడా తెలియదు.

1198
01:11:49,291 --> 01:11:50,625
వాస్తవం ఏమిటంటే,

1199
01:11:50,708 --> 01:11:56,125
ఆ భవనం సీసీటీవీ ఫుటేజీలో మిస్టర్ బజ్రాల్
లోపలికి వెళ్లడం, బయటకు రావడం కనిపిస్తోంది.

1200
01:11:56,208 --> 01:11:59,416
ఆ కాంప్లెక్స్‌లో 150 ఫ్లాట్‌లున్నాయి,
కేవలం ఇనాయది మాత్రమే కాదు.

1201
01:12:00,000 --> 01:12:01,000
ఇది వాస్తవం.

1202
01:12:01,583 --> 01:12:02,625
ఇక మరొక వాస్తవం ఏమిటంటే,

1203
01:12:02,708 --> 01:12:06,166
బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తి
విక్రమ్ బజ్రాల్‌ను టెర్రస్ మీదకి పిలిచాడు.

1204
01:12:06,250 --> 01:12:10,666
కానీ అతను ఇనాయ ఫ్లాట్‌కే వెళ్లాడనేది
వాస్తవం కాదు, అది కేవలం ఊహ మాత్రమే.

1205
01:12:12,041 --> 01:12:14,500
ఘటనా స్థలంలో మాకు
మిస్టర్ బజ్రాల్ వేలిముద్రలు దొరికాయి.

1206
01:12:14,583 --> 01:12:17,250
హత్యకు ముందు అక్కడ గొడవ జరిగింది,

1207
01:12:17,333 --> 01:12:20,750
మరి ఆ ఇల్లంతా వెతికితే, ఒక్క గ్లాసు మీదే
విక్రమ్ బజ్రాల్ వేలిముద్రలు ఎలా దొరికాయి?

1208
01:12:21,750 --> 01:12:23,500
ఆ గ్లాసు కూడా

1209
01:12:23,583 --> 01:12:25,833
కావాలని అక్కడ పెట్టిన సాక్ష్యం అని
మీరు అనుకోరా?

1210
01:12:27,000 --> 01:12:29,583
యువరానర్, డిఫెన్స్ మాటలు నమ్మాల్సి వస్తే,

1211
01:12:29,666 --> 01:12:31,833
విక్రమ్ బజ్రాల్ ఇనాయ కొఠారిని
హత్య చేయలేదు,

1212
01:12:31,916 --> 01:12:34,125
మిస్టర్ బజ్రాల్‌ను
ఇనాయ కొఠారి బ్లాక్ మెయిల్ చేయలేదు.

1213
01:12:35,291 --> 01:12:38,958
యువరానర్,
ఇనాయ కొఠారి మరణించిన తర్వాత కూడా,

1214
01:12:39,041 --> 01:12:42,541
ఆమెను ఒక బ్లాక్ మెయిలర్‌గా
ముద్ర వేసి కించపరచడం అనేది

1215
01:12:42,625 --> 01:12:44,541
చాలా దురదృష్టకరం.

1216
01:12:45,416 --> 01:12:49,041
హత్య ఇంకా బ్లాక్ మెయిల్,
ఇవన్నీ ఒకే వ్యక్తి చేసిన పని అని

1217
01:12:49,125 --> 01:12:53,750
డిఫెన్స్ ఖచ్చితంగా ఉంది,
మేము దీన్ని నిరూపిస్తాము.

1218
01:12:53,833 --> 01:12:56,791
నా క్లయింట్‌ను ఇరికించడానికి
ఇదంతా ప్లాన్ చేయబడింది.

1219
01:12:57,333 --> 01:12:59,291
ఈ విచారణను కొత్త కోణంలో

1220
01:12:59,375 --> 01:13:02,458
దర్యాప్తు చేయాలని
నేను పోలీసులను కోరుతున్నాను.

1221
01:13:02,541 --> 01:13:06,666
మృతురాలికిస ఆమె కుటుంబానికి
న్యాయం చేకూర్చడానికి ఇది అవసరం.

1222
01:13:08,041 --> 01:13:09,208
అంతే, యువరానర్.

1223
01:13:15,958 --> 01:13:17,625
"డేవిడ్ వర్సెస్ గొలాయత్."

1224
01:13:17,708 --> 01:13:19,625
"తండ్రీకూతుళ్లు ముఖాముఖి తలపడుతున్నారు."

1225
01:13:20,750 --> 01:13:23,791
ఇది ఇనాయ బ్యాంక్ స్టేట్‌మెంట్.

1226
01:13:23,875 --> 01:13:25,500
2016 నాటిది.

1227
01:13:25,583 --> 01:13:27,750
ఇదే ఏడాది ఆమె ఇల్లు కొనింది.

1228
01:13:27,875 --> 01:13:29,041
నువ్వు చెప్పింది నిజమే.

1229
01:13:29,125 --> 01:13:31,416
ఆ సమయంలో ఆమె ఖాతాలో
₹3,00,000 మాత్రమే ఉన్నాయి.

1230
01:13:31,500 --> 01:13:34,208
బ్యాంకులో మూడు లక్షలు పెట్టుకుని,
ఆమె ₹4 కోట్ల ఇల్లు ఎలా కొంది?

1231
01:13:34,291 --> 01:13:38,208
ఇక ఆమె బ్యాంకు నుండి
"నిధుల నిరూపణ" లెటర్ ఇవ్వాల్సి ఉంది,

1232
01:13:38,958 --> 01:13:39,833
కానీ ఇవ్వలేదు.

1233
01:13:40,458 --> 01:13:41,916
బహుశా ఆమె తల్లిదండ్రులు ఇచ్చారేమో?

1234
01:13:42,000 --> 01:13:44,166
అందరూ నా లాగే పేద కుటుంబం నుండి రారుగా.

1235
01:13:44,875 --> 01:13:47,125
ఆమె తండ్రి బరేలీలో
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు.

1236
01:13:48,041 --> 01:13:50,083
అయితే, బిల్డర్ ఆమెకు బహుమతిగా ఇచ్చాడా?

1237
01:13:50,166 --> 01:13:52,583
"ఇదిగో, తీసుకో. చాలా అవసరంలో
ఉన్నట్టు కనిపిస్తున్నావు."

1238
01:13:53,333 --> 01:13:55,041
బహుశా ఆ బిల్డర్‌కే
ఆమె అవసరం ఉండాలి.

1239
01:13:55,125 --> 01:13:56,541
ఎవరా బిల్డర్?

1240
01:13:59,125 --> 01:13:59,958
బజ్రాలా?

1241
01:14:00,041 --> 01:14:01,208
నిజం.

1242
01:14:02,000 --> 01:14:03,625
తనెందుకు ఆమెకు ఫ్లాట్ బహుమతిగా ఇస్తాడు?

1243
01:14:09,041 --> 01:14:11,125
ట్విస్టెడ్ బార్ కేస్ గురించి
ఎప్పుడైనా విన్నావా?

1244
01:14:12,833 --> 01:14:13,666
ఏంటి?

1245
01:14:15,375 --> 01:14:17,500
ట్విస్టెడ్ బార్ అగ్నిప్రమాద కేసులో
కీలక సాక్షి

1246
01:14:17,583 --> 01:14:19,166
రెస్టారెంట్ సూపర్‌వైజర్‌పై
బ్లాగర్ నింద

1247
01:14:22,375 --> 01:14:26,708
"ఆరోపణలు: అజాగ్రత్తతో హత్య,
నేరపూరిత నిర్లక్ష్యం…"

1248
01:14:33,041 --> 01:14:34,125
హాయ్.

1249
01:14:34,833 --> 01:14:36,000
నిన్ను ఇబ్బంది పెడుతున్నానా?

1250
01:14:37,333 --> 01:14:38,333
పని చేస్తున్నావా?

1251
01:14:39,875 --> 01:14:41,583
నువ్వు పని చేయకపోతేనే ఆశ్చర్యపోతాను.

1252
01:14:43,625 --> 01:14:45,416
మనం కలిసి చాలా రోజులైంది.

1253
01:14:46,083 --> 01:14:49,625
నా మీద బె౦గపెట్టుకుని తి౦డి
తిప్పలు వదులుకున్నావేమో అనుకున్నాను.

1254
01:14:49,708 --> 01:14:51,583
అందుకే, నీకోసం భోజనం తీసుకువచ్చాను.

1255
01:14:57,750 --> 01:14:58,750
అయితే…

1256
01:15:00,375 --> 01:15:01,375
ఎలా సాగుతోంది?

1257
01:15:01,875 --> 01:15:03,666
ఇక్కడికి పని గురించి మాటలకోసం వచ్చావా?

1258
01:15:28,833 --> 01:15:29,833
అక్షయ్?

1259
01:15:30,416 --> 01:15:31,666
అసలేం చేస్తున్నావు నువ్వు?

1260
01:15:31,750 --> 01:15:34,750
మా నాన్నను మెప్పించడానికి
నా దగ్గర సమాచారం దొంగిలిస్తున్నావా?

1261
01:15:34,833 --> 01:15:37,083
ఆయన సంతోషించి
నీకు ప్రమోషన్ ఇస్తాడనా?

1262
01:15:37,583 --> 01:15:38,750
ఛీ.

1263
01:15:38,833 --> 01:15:41,333
ఆయనకు ఏం చెబుతావు? సమాచారం
ఎలా దొరికిందంటే ఏం చెబుతావు?

1264
01:15:42,958 --> 01:15:44,041
ఏమనుకుంటున్నావు?

1265
01:15:44,625 --> 01:15:45,833
ఈ ఆలోచన ఎవరిదని?

1266
01:15:52,666 --> 01:15:58,041
యువరానర్, మిస్టర్ బజ్రాల్‌కు పంపిన
మెసేజ్‌లను మేము ట్రాక్ చేశాం.

1267
01:15:58,125 --> 01:16:01,541
ముందుగా సిమ్ కార్డును, దాని ద్వారా
ఫోన్‌ను కనిపెట్టాం.

1268
01:16:02,916 --> 01:16:06,916
సెల్యులార్ టవర్ ట్రయాంగులేషన్ పద్ధతితో
ఫోన్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించాం.

1269
01:16:07,625 --> 01:16:08,833
ఆ బ్లాక్‌మెయిల్ మెసేజ్‌లు

1270
01:16:09,458 --> 01:16:13,708
పంపిన సమయంలో
అసలు ఆ ఫోన్ ఎక్కడ ఉంది,

1271
01:16:13,791 --> 01:16:16,666
తద్వారా ఆ బ్లాక్‌మెయిలర్
ఎక్కడ ఉన్నాడో మేము తెలుసుకున్నాం.

1272
01:16:17,250 --> 01:16:18,541
సరళంగా చెప్పాలంటే, యువరానర్,

1273
01:16:18,625 --> 01:16:22,666
ఒకవేళ మి. విక్రమ్ బజ్రాల్‌ను ఇనాయ
ఆ ఫోన్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికి వాడితే,

1274
01:16:23,416 --> 01:16:24,958
ఆమె చాలా జాగ్రత్తగా ఉండేది.

1275
01:16:25,041 --> 01:16:28,875
ఆ ఫోన్ ఎప్పుడూ ఆమె దగ్గరే ఉండేది.
కానీ ఇక్కడ అలా జరగలేదు.

1276
01:16:29,708 --> 01:16:30,583
చాలా సమయాలలో,

1277
01:16:30,666 --> 01:16:34,333
ఆ ఫోన్ ఇనాయ ఇంటికి
చాలా దూరంలో ఉన్నట్లు గుర్తించాం.

1278
01:16:34,416 --> 01:16:38,000
చివరికి రాత్రిపూట ఇనాయ
ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ ఫోన్ బయట ఉంది.

1279
01:16:39,166 --> 01:16:42,958
ఆ ఫోన్ లొకేషన్ తరచుగా
ఆర్‌కే పురంలో ఉన్నట్లు ఉంటోంది.

1280
01:16:43,666 --> 01:16:44,833
ముఖ్యంగా రాత్రివేళల్లో.

1281
01:16:45,583 --> 01:16:46,416
అందుకే ఇది స్పష్టం.

1282
01:16:46,500 --> 01:16:49,041
అది ఇనాయ పని కాదు. మరెవరో చేశారు.

1283
01:16:49,125 --> 01:16:51,708
మరెవరో మిస్టర్ బజ్రాల్‌ను
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.

1284
01:16:54,125 --> 01:16:57,750
యువరానర్, అసలు హత్య కేసు నుండి
దృష్టి మళ్లించడానికే

1285
01:16:57,833 --> 01:17:00,333
డిఫెన్స్ వారు
ఈ బ్లాక్‌మెయిల్ థియరీ వాడుతున్నారు.

1286
01:17:00,916 --> 01:17:04,791
ఇనాయ మరెవరితోనైనా కలిసి
ఈ పని చేసి ఉండవచ్చు కదా?

1287
01:17:05,500 --> 01:17:07,375
ఏదేమైనా, అసలు విషయం ఏమిటంటే,

1288
01:17:07,458 --> 01:17:11,458
ఇనాయ హత్య జరిగిన సమయంలో
మిస్టర్ బజ్రాల్ ఆ భవనంలోనే ఉన్నారు,

1289
01:17:11,541 --> 01:17:14,791
అలాగే ఆ హత్య చేయడానికి
అతనికి బలమైన కారణం ఉంది.

1290
01:17:18,083 --> 01:17:20,750
ఆధారాలు ఇక్కడే ఉన్నాయి, యువరానర్.
మీరు చూడవచ్చు.

1291
01:17:20,833 --> 01:17:22,541
హత్యకు కారణం ఎలా ఉంటుంది?

1292
01:17:22,625 --> 01:17:25,583
నా క్లయింట్‌కు బాధితురాలితో
అంతకుముందు ఎలాంటి సంబంధం లేదు.

1293
01:17:25,666 --> 01:17:27,291
సంబంధం ఉంది, యువరానర్.

1294
01:17:27,375 --> 01:17:31,083
తొమ్మిది ఏళ్ల క్రితం, "ట్విస్టెడ్" అనే
హుక్కా బార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

1295
01:17:31,166 --> 01:17:32,541
ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు.

1296
01:17:32,625 --> 01:17:37,333
యజమాని నిర్లక్ష్యం కారణంగా జరిగిన
మానవహత్య కేసు నమోదైంది.

1297
01:17:37,416 --> 01:17:40,500
ఆ యజమాని మరెవరో కాదు,
స్వయంగా మిస్టర్ విక్రమ్ బజ్రాల్.

1298
01:17:40,583 --> 01:17:41,875
-అక్షయ్, త్వరగా.
-సరే.

1299
01:17:41,958 --> 01:17:43,000
అభ్యంతరం.

1300
01:17:43,083 --> 01:17:45,708
యువరానర్, ఈ కేసుల మధ్య సంబంధం ఏమిటి?

1301
01:17:45,791 --> 01:17:48,166
-సంబంధం ఉంది, యువరానర్.
-అది తొమ్మిది ఏళ్ల క్రితం జరిగింది.

1302
01:17:48,250 --> 01:17:50,583
నా క్లయింట్ ఆ కేసులో
నిర్దోషిగా విడుదలయ్యారు, యువరానర్.

1303
01:17:50,666 --> 01:17:53,125
ప్రాసిక్యూషన్ అసలు విషయానికి వస్తుందా?
ఏమైనా ఉంటే?

1304
01:17:53,208 --> 01:17:56,000
యువరానర్, ఇనాయ కొఠారి
ఆ కేసులో కీలక సాక్షి.

1305
01:17:56,083 --> 01:17:58,041
కానీ ఆమె ఒక్కతే సాక్షి కాదు.

1306
01:17:58,125 --> 01:17:59,500
ఇంకా చాలా మంది ఉన్నారు.

1307
01:17:59,583 --> 01:18:03,750
అంతమాత్రాన నా క్లయింట్
ప్రతి సాక్షితో టచ్‌లో ఉన్నారని అర్థం కాదు.

1308
01:18:03,833 --> 01:18:06,250
ప్రతి సాక్షితో కాదు, కానీ ఆయన ఇనాయతో
ఖచ్చితంగా టచ్‌లో

1309
01:18:06,333 --> 01:18:08,333
ఉన్నారని నమ్మడానికి
మా దగ్గర బలమైన కారణముంది.

1310
01:18:09,166 --> 01:18:12,125
సూర్య నివాస్ టవర్స్‌లోని
ఇనాయ కొఠారి ఫ్లాట్,

1311
01:18:12,208 --> 01:18:15,833
మిస్టర్ విక్రమ్ బజ్రాల్ ఆమెకు
ఇచ్చిన బహుమతి సాయానికి ప్రతిఫలంగా.

1312
01:18:18,041 --> 01:18:21,458
యువరానర్, 2016 నుండి 2017 వరకు
మిస్టర్ బజ్రాల్ ఆఫీసులోని

1313
01:18:21,541 --> 01:18:27,333
అన్ని కమ్యూనికేషన్లు, డాక్యుమెంట్లు,
మెయిల్స్ లేదా మెసేజ్‌లను

1314
01:18:27,416 --> 01:18:30,041
కోర్టుకు సమర్పించాలని కోరుతూ
మేము ఈ పిటిషన్ వేస్తున్నాం.

1315
01:18:31,541 --> 01:18:33,750
ఇది చాలా అసాధారణమైన అభ్యర్థన, యువరానర్.

1316
01:18:35,125 --> 01:18:37,375
హత్య కూడా సాధారణ నేరం కాదు, యువరానర్.

1317
01:18:40,166 --> 01:18:43,916
ఈ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించడానికి
డిఫెన్స్‌కు ఏమైనా అభ్యంతరం ఉందా?

1318
01:18:47,916 --> 01:18:51,250
ఆ పత్రాలు ఎనిమిది, తొమ్మిది ఏళ్ల నాటివి.

1319
01:18:52,291 --> 01:18:56,083
మా దగ్గర ఉంటే, ఆ రికార్డులను పంచుకోవడంలో
మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

1320
01:18:56,166 --> 01:18:57,291
యువరానర్,

1321
01:18:57,375 --> 01:19:01,291
నిన్ననే మిస్టర్ సురేష్ నాయర్ అనే వ్యక్తి
మిస్టర్ బజ్రాల్ ఆఫీసుకు, అంటే

1322
01:19:01,375 --> 01:19:05,250
సూర్య నివాస్ టవర్స్ ఆఫీసుకు కాల్ చేసి,
తన కన్వేయన్స్ డీడ్ కోసం కాపీ అడిగారు.

1323
01:19:05,333 --> 01:19:08,125
నేను మి. బజ్రాల్ టీమ్‌ను
ఈ విషయంలో అభినందించాలి,

1324
01:19:08,208 --> 01:19:12,000
ఎందుకంటే వారు ఒక్క రోజులోనే
అతనికి ఆ డీడ్‌ను ఈమెయిల్ చేశారు.

1325
01:19:12,625 --> 01:19:14,583
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే,

1326
01:19:14,666 --> 01:19:18,125
మిస్టర్ నాయర్ ఆ అపార్ట్‌మెంట్‌ను
2016లో కొన్నారు.

1327
01:19:18,208 --> 01:19:20,541
అంటే ఇనాయ కొఠారి కంటే ఒక నెల ముందు.

1328
01:19:20,625 --> 01:19:22,750
రికార్డుల నిర్వహణ విషయంలో

1329
01:19:22,833 --> 01:19:26,875
డిఫెన్స్‌కు ఎలాంటి సందేహాలు ఉండకూడదని
నేను ఇవన్నీ చెబుతున్నాను.

1330
01:19:28,666 --> 01:19:31,958
మాకు ఆ పత్రాలను పంచుకోవడంలో
ఎలాంటి ఇబ్బంది లేదు.

1331
01:19:33,000 --> 01:19:36,750
మాకు కొంత సమయం ఇవ్వాలని
కోర్టును కోరుతున్నాం.

1332
01:19:36,833 --> 01:19:40,458
డిఫెన్స్ ఈ డాక్యుమెంట్లను వీలైనంత త్వరగా
కోర్టుకు సమర్పించాలి.

1333
01:19:40,958 --> 01:19:42,250
ధన్యవాదాలు, యువరానర్.

1334
01:19:59,083 --> 01:20:00,250
హల్వా?

1335
01:20:00,333 --> 01:20:02,750
నీ కోసమే ప్రత్యేకంగా
డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను.

1336
01:20:06,875 --> 01:20:10,041
ఇదిగో. ఏసీపీ కుమార్
"ట్విస్టెడ్ బార్" కేసు ఫైళ్లను పంపారు.

1337
01:20:16,416 --> 01:20:17,416
స్టేట్ వర్సెస్ విక్రమ్

1338
01:20:17,500 --> 01:20:20,666
"ట్విస్టెడ్ బార్ కేసులోని వ్యక్తులు"

1339
01:20:20,750 --> 01:20:22,875
"విక్రమ్ బజ్రాల్, యజమాని."

1340
01:20:30,458 --> 01:20:32,791
"విక్రమ్ బజ్రాల్, యజమాని."

1341
01:20:32,875 --> 01:20:35,791
"జగ్దీష్ సింగ్, మేనేజర్."

1342
01:20:36,708 --> 01:20:39,041
"రామ్నాథ్ ధామీ, సూపర్‌వైజర్."

1343
01:20:39,833 --> 01:20:41,875
"ఇనాయ కొఠారి, ప్రత్యక్ష సాక్షి."

1344
01:20:48,750 --> 01:20:50,833
"రామ్నాథ్ జైలులో ఉరి వేసుకున్నాడు."

1345
01:20:51,583 --> 01:20:53,958
ఈ కేసులన్నీ నా దగ్గరికే ఎలా వచ్చాయి?

1346
01:20:58,750 --> 01:21:01,583
అందరూ ట్విస్టెడ్ బార్ కేసుతో
సంబంధం ఉన్నవారే.

1347
01:21:02,833 --> 01:21:05,000
అలాగే ఈ కేసులన్నీ నావే.

1348
01:21:06,000 --> 01:21:08,875
ఈ కేసులన్నీ నాకే రావడం
నీకు వింతగా అనిపించడం లేదా?

1349
01:21:09,541 --> 01:21:10,916
అలా జరుగుతుంటాయి.

1350
01:21:11,000 --> 01:21:12,583
పెద్ద విషయం ఏమీ కాదు.

1351
01:21:13,708 --> 01:21:17,833
లేదు, నా ఉద్దేశం, ఈ ముగ్గురు ఇంకా ఇనాయ,
అందరికీ ట్విస్టెడ్ బార్ కేసుతో సంబంధముంది,

1352
01:21:18,416 --> 01:21:22,208
అందులో మిస్టర్ విక్రమ్ బజ్రాల్ నిందితుడు,
దానికి మా నాన్న డిఫెన్స్ లాయర్.

1353
01:21:23,458 --> 01:21:27,541
తొమ్మిది ఏళ్ల తర్వాత,
వాళ్లందరినీ నేను ప్రాసిక్యూట్ చేయడమా?

1354
01:21:28,166 --> 01:21:29,833
ఇది కేవలం కాకతాళీయం అవలేదుగా?

1355
01:21:30,458 --> 01:21:33,958
నువ్వు అహ్లావత్ మీద ఎలాంటి ఆరోపణలు
చేస్తున్నావో నీకు అర్థమవుతోందా?

1356
01:21:34,958 --> 01:21:37,166
నన్ను నమ్ము, దీని గురించి మర్చిపో.

1357
01:21:37,250 --> 01:21:38,583
నీ కేసు మీద దృష్టి పెట్టు.

1358
01:21:46,208 --> 01:21:47,208
నాన్నా.

1359
01:21:51,625 --> 01:21:53,958
-ఏమిటివి?
-విక్రమ్ అంకుల్ ఫోన్ రికార్డులు.

1360
01:21:54,750 --> 01:21:56,958
2016 ట్విస్టెడ్ బార్ కేసు తర్వాతవి.

1361
01:21:57,791 --> 01:21:59,166
ఇవి ఇనాయ కొఠారివి.

1362
01:21:59,250 --> 01:22:02,791
ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఉన్న
ఈ నంబర్లు ఇనాయ కొఠారివి.

1363
01:22:03,833 --> 01:22:06,666
ఇంకా ఈ ఇతర నంబర్లు
విక్రమ్ అంకుల్ ఆఫీసువి,

1364
01:22:06,750 --> 01:22:08,041
అతని పర్సనల్ లైన్‌వి.

1365
01:22:09,166 --> 01:22:10,583
మీరు ఇది నమ్మరు, నాన్నా.

1366
01:22:12,708 --> 01:22:14,208
ఇది ఆ అపార్ట్‌మెంట్ సేల్ డీడ్.

1367
01:22:15,583 --> 01:22:16,958
ఆ మూర్ఖుడు!

1368
01:22:19,125 --> 01:22:23,791
సాక్షులతో నేరుగా కాంటాక్ట్
పెట్టుకోవద్దని వాడిని హెచ్చరించాను.

1369
01:22:27,125 --> 01:22:30,333
నాన్నా, మీకు ఈ విషయం ముందే తెలుసా?

1370
01:22:35,750 --> 01:22:39,250
విక్రమ్ అంకుల్ నిజంగానే ఇనాయను
హత్య చేశాడని మీరు అనుకుంటున్నారా?

1371
01:22:41,291 --> 01:22:43,791
ప్రశ్న అతను హత్య చేశాడా లేదా అనేది కాదు.

1372
01:22:44,333 --> 01:22:47,791
ప్రాసిక్యూషన్ దాన్ని నిరూపించగలదా
లేదా అన్నదే ప్రశ్న.

1373
01:22:50,541 --> 01:22:52,208
ఈ సేల్ డీడ్ విక్రమ్ అంకుల్,

1374
01:22:52,291 --> 01:22:54,875
ఇనాయ మధ్య జరిగిన
ఆర్థిక లావాదేవీలకు స్పష్టమైన ఆధారం.

1375
01:22:56,541 --> 01:23:00,500
నేహకు ఈ పత్రాలు దొరకకూడదు.

1376
01:23:01,666 --> 01:23:04,500
కానీ కోర్టు ఆర్డర్ ఉంది కదా, నాన్నా?
మనం అన్ని ఆధారాలు ఇవ్వాలి.

1377
01:23:05,583 --> 01:23:06,500
మనం ఇస్తాం.

1378
01:23:07,000 --> 01:23:08,583
కానీ అలా ఇస్తే ఆట ముగిసినట్టే.

1379
01:23:12,125 --> 01:23:13,416
కోర్టు ఆర్డర్ ఏమిటి?

1380
01:23:14,125 --> 01:23:17,583
ఆ కాలానికి సంబంధించిన
అన్ని అధికారిక పత్రాలను పంచుకోవాలని.

1381
01:23:18,291 --> 01:23:20,333
కాబట్టి మనం అన్ని పత్రాలను పంచుకుంటాం.

1382
01:23:20,416 --> 01:23:24,625
ప్రతి బిల్లు, ప్రతి మెమో,
ప్రతి చిన్న కాగితం.

1383
01:23:24,708 --> 01:23:25,833
ఇలా ఊహించు

1384
01:23:27,500 --> 01:23:29,375
లక్షలాది కాగితాల సముద్రంలో వెతకడం.

1385
01:23:30,000 --> 01:23:32,416
వాళ్లకు కావాల్సిన ఆ ఒక్క కాగితం
అందులో కలిసి కనబడకపోవడం

1386
01:23:33,458 --> 01:23:34,500
చాలా సులభం.

1387
01:23:35,541 --> 01:23:36,708
అంతే.

1388
01:23:42,041 --> 01:23:42,875
నీ ఆలోచన ఏంటి?

1389
01:23:45,125 --> 01:23:47,041
నేను ఇక్కడికి లాయర్ అవ్వడానికి వచ్చాను.

1390
01:23:47,125 --> 01:23:49,041
మీ నాన్న నన్ను కూలీలా మార్చేశారు.

1391
01:23:52,125 --> 01:23:53,500
ఇందులో ఏమీ లేదు.

1392
01:23:54,250 --> 01:23:55,916
ఎన్ని బాక్సులు ఉన్నాయో చూడు!

1393
01:23:56,583 --> 01:23:58,916
ఈ బాక్సులలోనే మన ఆధారం ఉంది,
దాన్ని మనం కనిపెట్టాలి.

1394
01:23:59,000 --> 01:24:00,083
మనమా? లేక నేనా?

1395
01:24:00,166 --> 01:24:01,375
వెళ్తున్నావని అర్థమైంది.

1396
01:24:01,458 --> 01:24:04,166
సారీ. నేను నీకు సహాయం చేసేదాన్నే,
కానీ ఒకరిని కలవాలి.

1397
01:24:04,250 --> 01:24:05,166
అది చాలా ముఖ్యం.

1398
01:24:06,291 --> 01:24:09,250
సరే వెళ్లు, కానీ గుర్తుంచుకో,

1399
01:24:09,333 --> 01:24:12,375
నువ్వు నన్ను వదిలేసి వెళ్తున్న
ఈ క్షణం నుండి,

1400
01:24:12,458 --> 01:24:14,583
నువ్వు తిరిగి వచ్చేటప్పటికి
నేను అక్కడే ఉంటాను.

1401
01:24:17,541 --> 01:24:18,958
కానీయ్, ఆత్మారామ్.

1402
01:24:20,625 --> 01:24:22,208
నీ శక్తినంతా ఉపయోగించు.

1403
01:24:26,375 --> 01:24:27,458
ఆత్మా, నేహ ఎక్కడ?

1404
01:24:58,000 --> 01:25:01,500
చూడు, తప్పు కంపెనీదే అని
స్పష్టంగా తెలుస్తోంది.

1405
01:25:01,583 --> 01:25:03,041
ఆఫీసు
త్రిపాఠీ - అడ్వకేట్

1406
01:25:03,125 --> 01:25:06,458
కానీ ఈ కేసు ఏళ్ల తరబడి సాగుతుందని
నేను నిన్ను హెచ్చరించాలి.

1407
01:25:07,541 --> 01:25:11,000
కంపెనీకి డబ్బుకు గానీ,
లాయర్లకు గానీ కొదవ లేదు.

1408
01:25:11,083 --> 01:25:12,833
నీకు చివరికి వచ్చే పరిహారం,

1409
01:25:12,916 --> 01:25:17,083
నువ్వు కోర్టులో ఖర్చు చేసే సమయం,
డబ్బు కంటే తక్కువ ఉండవచ్చు.

1410
01:25:19,125 --> 01:25:20,125
బాగా ఆలోచించుకో.

1411
01:25:21,458 --> 01:25:22,458
సరే.

1412
01:25:32,583 --> 01:25:33,708
శ్యామ్‌జీ?

1413
01:25:35,666 --> 01:25:38,208
రామ్‌నాథ్ చాలా నిజాయితీ గల కుర్రాడు.

1414
01:25:38,291 --> 01:25:40,083
ఉచిత న్యాయ సేవ
శ్యామ్ త్రిపాఠి

1415
01:25:40,166 --> 01:25:41,916
అతను తన పని మాత్రమే చేశాడు.

1416
01:25:44,458 --> 01:25:47,541
పెద్ద మనుషులు
అతన్ని బలిపశువును చేశారు.

1417
01:25:48,708 --> 01:25:50,000
నా శాయశక్తులా ప్రయత్నించాను.

1418
01:25:50,083 --> 01:25:55,041
కానీ మీ నాన్న వంటి లాయర్లకు
కోర్టులో అన్ని కిటుకులు తెలుసు,

1419
01:25:56,166 --> 01:25:58,458
తేదీలు మార్పించడం నుండి
సాక్షులను కొనడం వరకు.

1420
01:25:59,125 --> 01:26:01,125
రామ్‌నాథ్‌కు అసలు అవకాశం కూడా దక్కలేదు.

1421
01:26:01,875 --> 01:26:04,833
ఆ పేదవాడి కుటుంబం చితికిపోయింది.

1422
01:26:06,958 --> 01:26:08,666
అతని బావగారు కూడా అక్కడే పని చేసేవాడు.

1423
01:26:09,958 --> 01:26:11,041
అతని పేరు ఏంటి?

1424
01:26:12,000 --> 01:26:15,458
రెస్టారెంట్ యజమానిగా మారిన విక్రమ్ బజ్రాల్
ట్విస్టెడ్ హుక్కా బార్ ప్రారంభం

1425
01:26:19,958 --> 01:26:21,875
సారిక - స్టెనో

1426
01:26:26,000 --> 01:26:27,916
బజ్రాల్ ఎక్కడ

1427
01:26:31,333 --> 01:26:33,875
సాక్షులను విక్రమ్ బజ్రాల్ ప్రభావితం
చేశాడని నిపుణుల సందేహం.

1428
01:26:33,958 --> 01:26:36,500
హే, నేనేమీ నిరాశలో ఉన్నానని చెప్పడం లేదు,

1429
01:26:37,291 --> 01:26:39,958
కానీ, ఈ గందరగోళంలో
ఒక్క కాగితం కనిపెట్టడం అసాధ్యం.

1430
01:26:44,791 --> 01:26:45,791
హే, చెల్లీ.

1431
01:26:49,666 --> 01:26:50,500
జరుగు.

1432
01:26:54,000 --> 01:26:55,125
-హలో, సర్.
-ఎలా ఉన్నావు?

1433
01:26:55,208 --> 01:26:56,541
-బాగున్నాను.
-హాయ్.

1434
01:26:58,791 --> 01:27:00,125
ఇది నీ ఐడియానా?

1435
01:27:00,666 --> 01:27:02,125
నేను టీ బ్రేక్ తీసుకుంటాను.

1436
01:27:03,791 --> 01:27:06,541
అక్కడ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారో
నీకు బాగా తెలుసు.

1437
01:27:08,208 --> 01:27:09,791
అంటే నాన్న నిన్ను పంపించారా?

1438
01:27:11,375 --> 01:27:12,375
అమ్మ.

1439
01:27:16,208 --> 01:27:17,500
ఆమె ఎందుకు రాలేదు?

1440
01:27:18,375 --> 01:27:19,750
నాన్న ఇంట్లోనే ఉన్నారు.

1441
01:27:19,833 --> 01:27:20,958
ఆమె కోఫ్తాలు వండింది.

1442
01:27:21,625 --> 01:27:23,125
అందుకే డెలివరీ బాయ్‌లా నేనొచ్చా.

1443
01:27:23,208 --> 01:27:24,291
పాత రికార్డులు

1444
01:27:24,375 --> 01:27:26,333
నువ్వు డెలివరీ బాయ్‌వి,
నేను కస్టమర్‌ని.

1445
01:27:26,416 --> 01:27:28,750
సరే. అమ్మ వంటను
నేను చాలా మిస్ అవుతున్నాను.

1446
01:27:28,833 --> 01:27:30,000
సేల్ డీడ్‌లు
బ్యాలెన్స్ షీట్లు

1447
01:27:30,916 --> 01:27:33,708
-బాక్సులను తిరిగి ఇచ్చేయ్.
-హా, నేను తిట్లు తినాలనుకోను.

1448
01:27:34,250 --> 01:27:36,250
ఆమెకు తన బాక్సులంటే ఎంత ఇష్టమో
నీకు తెలుసుగా.

1449
01:27:36,333 --> 01:27:37,500
ఫోన్ రికార్డులు
2015-2016

1450
01:27:37,583 --> 01:27:42,833
తెలుసు. నేనవి తిరిగి ఇవ్వడం మర్చిపోతే,
నా కంటే ఎక్కువ బాక్సులను మిస్ అవుతుంది.

1451
01:27:44,458 --> 01:27:45,291
నిజం.

1452
01:27:45,375 --> 01:27:49,375
కొన్నిసార్లు అమ్మ మనకంటే తన బాక్సులనే
ఎక్కువగా ప్రేమిస్తుందని నాకు అనిపిస్తుంది.

1453
01:27:50,500 --> 01:27:51,750
ఆమెను చాలా మిస్ అవుతున్నా.

1454
01:27:55,375 --> 01:27:58,291
-ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నావు?
-ఇదిగో.

1455
01:27:59,916 --> 01:28:02,166
సరే, కలుద్దాం.

1456
01:28:02,250 --> 01:28:03,375
కలుద్దాం.

1457
01:28:07,333 --> 01:28:08,500
నేను ఒకటి చెప్పవచ్చా?

1458
01:28:13,958 --> 01:28:15,125
నిన్ను చూస్తే నాకు చాలా అసూయ.

1459
01:28:20,458 --> 01:28:22,666
నాన్నను ఎదిరించి నిలబడటం

1460
01:28:24,500 --> 01:28:25,625
అంత సులభం కాదు.

1461
01:28:28,000 --> 01:28:30,166
నేను కనీసం దాని గురించి కల కూడా కనలేను.

1462
01:28:32,125 --> 01:28:33,500
నిజంగానా?

1463
01:28:35,916 --> 01:28:37,666
నిజానికి, ఇలా చేయాలని చాలా ఆలోచించాను…

1464
01:28:40,583 --> 01:28:42,458
కానీ నాకు ధైర్యం సరిపోలేదు.

1465
01:28:53,250 --> 01:28:56,958
నాన్నను ఇలా ఎదిరించినందుకు
నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంది.

1466
01:29:04,125 --> 01:29:05,125
నీకు మంచి జరగాలి.

1467
01:29:11,041 --> 01:29:12,041
ఎక్కువగా సిగరెట్లు తాగకు.

1468
01:29:15,333 --> 01:29:16,833
నువ్వు జాగ్రత్త.

1469
01:29:38,083 --> 01:29:38,916
ఇది…

1470
01:29:39,000 --> 01:29:40,500
ఈ ఫైల్ ఇక్కడ ఏం చేస్తోంది?

1471
01:29:45,250 --> 01:29:46,541
దొరికింది!

1472
01:29:46,625 --> 01:29:47,625
నాకు దొరికింది!

1473
01:29:50,166 --> 01:29:53,166
విక్రమ్ బజ్రాల్ నేరుగా జైలుకు
వెళ్లడానికి కావాల్సిన టికెట్ దొరికింది.

1474
01:30:01,625 --> 01:30:03,458
ఏమైంది? నువ్వు సంతోషంగా ఉన్నట్టు లేవు.

1475
01:30:04,041 --> 01:30:06,291
లేదు, నేను సంతోషంగానే ఉన్నాను.
కాకపోతే కొంచెం అలసిపోయాను.

1476
01:30:06,375 --> 01:30:07,541
రేపు చాలా ముఖ్యమైన రోజు.

1477
01:30:07,625 --> 01:30:09,625
ఇక పని ఆపేద్దాం.

1478
01:30:20,208 --> 01:30:26,000
సారిక స్టెనో

1479
01:30:35,416 --> 01:30:36,833
నీకు ఎప్పటి నుండో కాల్ చేస్తున్నా.

1480
01:30:36,916 --> 01:30:38,083
ఎందుకు ఆన్సర్ చేయడం లేదు?

1481
01:30:39,625 --> 01:30:43,083
విక్రమ్ బజ్రాల్‌కు ఇనాయ తెలుసని
మన దగ్గర ఆధారం ఉంది.

1482
01:30:43,166 --> 01:30:44,208
నిజంగానా?

1483
01:30:45,583 --> 01:30:47,333
అయితే మనం హత్యకు కారణాన్ని నిరూపించవచ్చు.

1484
01:30:48,625 --> 01:30:51,333
నాకు ఇది ప్రత్యక్షంగా చెప్పాలనుకున్నావా?
అందుకే ఫోన్ ఎత్తలేదా?

1485
01:30:53,625 --> 01:30:55,375
ఇంకో విషయం ఉంది.

1486
01:30:56,041 --> 01:30:57,291
ఏంటి?

1487
01:30:57,375 --> 01:30:59,541
ఇనాయను విక్రమ్ బజ్రాల్ చంపలేదు.

1488
01:31:00,458 --> 01:31:01,500
అంటే ఏమంటున్నావు?

1489
01:31:02,125 --> 01:31:03,916
అమ్మా, నాన్న నిన్ను పిలుస్తున్నారు.

1490
01:31:04,000 --> 01:31:06,416
నేను డాన్స్ క్లాస్‌కు వెళ్తున్నాను.

1491
01:31:24,125 --> 01:31:26,041
-టీ.
-ధన్యవాదాలు.

1492
01:31:26,125 --> 01:31:27,583
అరే, నేహ, లోపలికి రా.

1493
01:31:27,666 --> 01:31:28,666
టీ తాగు.

1494
01:31:29,333 --> 01:31:30,291
రా, కూర్చో.

1495
01:31:31,333 --> 01:31:34,041
ఆమెను విక్రమ్ బజ్రాల్ చంపకపోతే,
మరి ఎవరు చంపారు?

1496
01:31:44,375 --> 01:31:45,208
నువ్వే.

1497
01:31:48,458 --> 01:31:49,500
ఏం పిచ్చి మాటలు ఇవి.

1498
01:31:50,500 --> 01:31:52,750
నేను ఆమెను ఎందుకు చంపుతాను?
పిచ్చి మాటలు.

1499
01:31:54,125 --> 01:31:55,958
సారిక, నేను శ్యామ్‌జీని కలిశాను.

1500
01:32:04,250 --> 01:32:06,125
అతని బావగారు కూడా అక్కడే పని చేసేవాడు.

1501
01:32:07,166 --> 01:32:08,375
అతని పేరు ఏంటి?

1502
01:32:10,041 --> 01:32:10,875
లక్ష్మణ్.

1503
01:32:10,958 --> 01:32:13,291
ఆ ప్రమాదం అతన్ని
జీవితాంతం వికలాంగుడిని చేసింది.

1504
01:32:13,375 --> 01:32:15,125
పాపం రామ్‌నాథ్ చెల్లెలు…

1505
01:32:16,875 --> 01:32:19,750
తన అన్నను కాపాడుకోవడానికి
ఆమె చేయని ప్రయత్నం లేదు.

1506
01:32:24,416 --> 01:32:30,083
కానీ… పేదల అరుపులను డబ్బు తొక్కేస్తుంది.

1507
01:32:30,166 --> 01:32:31,166
సర్!

1508
01:32:36,458 --> 01:32:37,458
సర్!

1509
01:32:58,208 --> 01:33:00,875
జగ్దీష్ సింగ్‌ను డ్రగ్స్ కేసులో
నువ్వే ఇరికించావని నాకు తెలుసు.

1510
01:33:08,125 --> 01:33:09,250
ఆమె నీకు ఏం చెప్పింది?

1511
01:33:10,041 --> 01:33:11,875
ఆమె సూచనల మేరకే జగ్గీని ఇరికించాను.

1512
01:33:12,625 --> 01:33:14,500
నేనే డ్రాయర్‌లో డ్రగ్స్ పెట్టాను.

1513
01:33:14,583 --> 01:33:15,916
జాలితో ఆమెకు సహాయం చేశాను.

1514
01:33:16,416 --> 01:33:18,250
ఇప్పుడు ఆమె ప్రపంచమంతటికీ
ఆ విషయం చెబుతోంది.

1515
01:33:18,833 --> 01:33:19,958
చివరికి నేను బాధపడ్డాను.

1516
01:33:23,083 --> 01:33:25,625
మరి ప్రమోద్ మిశ్రాకు వ్యతిరేకంగా ఉన్న
వీడియో సాక్ష్యం?

1517
01:33:25,708 --> 01:33:27,208
నువ్వే దాన్ని రాఘవ్‌కు ఇచ్చావు.

1518
01:33:35,666 --> 01:33:38,333
ఆ వీడియో నీకు ఎక్కడ దొరికిందని
నేను సారికను అడిగాను.

1519
01:33:39,208 --> 01:33:41,125
ఆమె నా డైలాగ్‌నే నాకు తిరిగి చెప్పింది.

1520
01:33:41,208 --> 01:33:42,625
"నేను నా సోర్స్‌లను బయటపెట్టను."

1521
01:33:50,625 --> 01:33:52,083
నీకు అంతా తెలుసని అనుకుంటున్నావు.

1522
01:33:53,750 --> 01:33:55,666
కానీ నేను ఇది ఎందుకు చేశానో నీకు తెలియదు.

1523
01:33:58,583 --> 01:33:59,583
నాకు తెలుసు.

1524
01:34:00,583 --> 01:34:01,833
నేను కేసు ఫైళ్లు చదివాను.

1525
01:34:02,791 --> 01:34:03,833
కేసు ఫైళ్లు.

1526
01:34:04,833 --> 01:34:06,208
ఇది కల్పిత కథ కాదు,

1527
01:34:07,500 --> 01:34:09,625
మేము ఎవరో రాసిన పాత్రలం కాదు.

1528
01:34:11,041 --> 01:34:15,041
నువ్వు కొన్ని కాగితాలు చదివేసి
మా జీవిత కథ నీకు తెలుసని అనుకోకు.

1529
01:34:25,333 --> 01:34:27,750
ఇటువైపు, ఇటువైపు! త్వరగా!
బయటకు వెళ్లండి! పరుగెత్తండి!

1530
01:34:31,000 --> 01:34:33,083
నా అన్న ప్రాణాలతో ఉన్న,
ఊపిరి పీల్చే మనిషి.

1531
01:34:34,541 --> 01:34:36,458
తన పనిని నిజాయితీగా చేశాడు.

1532
01:34:38,416 --> 01:34:40,458
తప్పు జగ్గీది, బజ్రాల్‌ది.

1533
01:34:42,000 --> 01:34:43,125
కానీ జైలుకు వెళ్లింది ఎవరు?

1534
01:34:44,833 --> 01:34:45,666
అతను పేదవాడు.

1535
01:34:46,541 --> 01:34:47,958
అతన్ని చాలా సులభంగా ఇరికించారు.

1536
01:34:49,458 --> 01:34:52,250
యువరానర్, ఫైర్ ఎగ్జిట్ ఖాళీగా ఉండేలా
చూడాలని రామ్‌నాథ్‌కు

1537
01:34:52,333 --> 01:34:54,208
స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.

1538
01:34:54,958 --> 01:34:58,000
కానీ అతను అక్కడ టేబుళ్లు వేశాడు.
అతను ఆదేశాలు పాటించలేదు.

1539
01:35:04,166 --> 01:35:05,458
నేను అక్కడే ఉన్నాను.

1540
01:35:07,208 --> 01:35:09,083
అక్కడ టేబుళ్లు వేయాలన్నది జగ్గీ ఆలోచన.

1541
01:35:09,166 --> 01:35:11,833
సర్, ఇక్కడ టేబుళ్లు వేస్తే
ఫైర్ ఎగ్జిట్ బ్లాక్ అవుతుంది.

1542
01:35:11,916 --> 01:35:13,000
నాకు నీతులు చెప్పకు.

1543
01:35:13,083 --> 01:35:14,916
నేను చెప్పింది చేయి లేదా బయటకు వెళ్లు.

1544
01:35:15,000 --> 01:35:16,958
మూర్ఖుడు! నాకు ఏం చేయాలో చెబుతాడు!

1545
01:35:17,041 --> 01:35:18,666
సర్, ఫైర్ ఎగ్జిట్ బ్లాక్ అవుతుంది.

1546
01:35:19,333 --> 01:35:22,166
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుండి
బజ్రాల్ పొందిన లైసెన్స్ ప్రకారం

1547
01:35:22,666 --> 01:35:25,458
కేవలం మూడో వంతు రూఫ్ మీద మాత్రమే
నిర్మాణం చేయాలి.

1548
01:35:26,166 --> 01:35:27,875
మిగతాది ఖాళీగా ఉండాలి.

1549
01:35:27,958 --> 01:35:32,958
కానీ అతను మిగతా రెండు వంతుల మీద కూడా
నిర్మాణం చేశాడు.

1550
01:35:39,541 --> 01:35:41,625
రామ్‌నాథ్, ఇటు!
వాళ్లను ఇటు నుండి బయటకు తీసుకెళ్లు!

1551
01:35:41,708 --> 01:35:43,333
అటువైపు! త్వరగా!

1552
01:35:43,416 --> 01:35:45,291
జాగ్రత్త! త్వరగా! త్వరగా!

1553
01:35:46,625 --> 01:35:48,083
ఇటు వైపు!

1554
01:35:48,166 --> 01:35:49,708
ఆ దారి మూసేసి ఉంది. ఇటు వైపు!

1555
01:35:50,666 --> 01:35:52,000
-పరుగెత్తండి!
-పరుగెత్తండి!

1556
01:35:53,625 --> 01:35:54,875
వెళ్లండి!

1557
01:36:36,791 --> 01:36:40,958
వాళ్లకు తమ ఉద్యోగుల గురించి గానీ,
కస్టమర్ల గురించి గానీ పట్టింపు లేదు.

1558
01:36:41,041 --> 01:36:44,791
విక్రమ్ బజ్రాల్‌కు లాభాలు మాత్రమే ముఖ్యం.

1559
01:36:46,375 --> 01:36:49,000
అందుకే నువ్వు వాళ్లందరినీ
తప్పుడు కేసుల్లో ఇరికించావా?

1560
01:36:49,083 --> 01:36:51,750
వాళ్లు నా అన్నను
తప్పుడు కేసులో ఇరికించారు!

1561
01:36:54,750 --> 01:36:56,666
అతను జైలులో ఉరివేసుకుని చనిపోయాడు.

1562
01:36:59,375 --> 01:37:01,541
వాళ్లలో ఎవరికైనా బాధ కలిగిందనుకుంటున్నావా?

1563
01:37:04,791 --> 01:37:05,916
దీనికి ఏళ్లు పట్టింది.

1564
01:37:07,083 --> 01:37:08,708
నేను ఒక్కొక్కరిని గమనించాను.

1565
01:37:09,375 --> 01:37:11,500
వాళ్ల బలహీనతలు తెలుసుకున్నాను.

1566
01:37:12,125 --> 01:37:15,125
ఆ తర్వాతే, వాళ్ల పతనాన్ని ప్లాన్ చేశాను.

1567
01:37:17,000 --> 01:37:19,375
వాళ్లు జైలులో మగ్గాలని కోరుకుంటాను.

1568
01:37:20,291 --> 01:37:22,875
ఇవి ఎన్ని ఉన్నాయి? లెక్కపెట్టగలవా?

1569
01:37:22,958 --> 01:37:24,500
సారీ, సర్, నేను మారుస్తాను.

1570
01:37:26,041 --> 01:37:27,708
సారిక మేడం, మీ పని పూర్తయింది.

1571
01:37:48,500 --> 01:37:50,291
నువ్వు ఇనాయను చంపావు.

1572
01:37:51,166 --> 01:37:52,333
ఆమె చేసిన నేరమేంటి?

1573
01:37:53,333 --> 01:37:54,708
ఆమె చేసిన నేరమేంటి?

1574
01:37:59,708 --> 01:38:02,791
విక్రమ్ బజ్రాల్ అప్పటికే
మిగతా సాక్షులందరినీ కొనేశాడు.

1575
01:38:03,875 --> 01:38:07,541
మా ఆశలన్నీ, ప్రాసిక్యూషన్ కేసు అంతా

1576
01:38:08,458 --> 01:38:10,708
ఇనాయ సాక్ష్యం మీదనే ఆధారపడి ఉన్నాయి.

1577
01:38:11,375 --> 01:38:13,208
ఆ సమయంలో సారిక గర్భంలో
కుసుమ్ ఉంది.

1578
01:38:13,750 --> 01:38:15,791
పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి

1579
01:38:17,291 --> 01:38:19,625
ఇనాయ కోర్టులో నిజం చెబుతానని చెప్పింది.

1580
01:38:23,083 --> 01:38:25,291
అయితే, మిస్ ఇనాయ కొఠారి, నువ్వు ఏం చూశావు?

1581
01:38:26,583 --> 01:38:31,708
క్లబ్ రద్దీగా ఉందని,
ఫైర్ ఎగ్జిట్ ముందు టేబుళ్లు వేసినందుకు

1582
01:38:31,791 --> 01:38:34,250
రామ్‌నాథ్‌ను జగ్దీష్ సింగ్
తిట్టడం నేను చూశాను.

1583
01:38:34,833 --> 01:38:36,958
ఆ టేబుళ్లను తీసేయమని
జగ్దీష్ సింగ్ అతనికి చెప్పారు.

1584
01:38:37,041 --> 01:38:39,125
అతను తీశాడా లేదా?

1585
01:38:47,208 --> 01:38:49,458
జగ్దీష్ సింగ్ వెంటనే
క్లబ్ నుండి వెళ్లిపోయారు.

1586
01:38:49,958 --> 01:38:51,916
రామ్‌నాథ్ ఆ టేబుళ్లను తీయించలేదు.

1587
01:38:55,833 --> 01:38:56,833
ఇది అన్యాయం.

1588
01:38:58,291 --> 01:38:59,375
ఇది అన్యాయం.

1589
01:39:25,625 --> 01:39:27,333
మా ఇల్లు నాశనమైంది.

1590
01:39:29,583 --> 01:39:31,708
ఇక ఇనాయకు విక్రమ్ బజ్రాల్

1591
01:39:33,041 --> 01:39:34,833
కొత్త ఇల్లు బహుమతిగా ఇచ్చాడు.

1592
01:39:41,583 --> 01:39:43,916
రామ్‌నాథ్ ఆమె ప్రాణాలను కాపాడాడు, నేహ.

1593
01:39:45,750 --> 01:39:46,916
కానీ ఆమె అతనికి ఇచ్చేదిదేనా?

1594
01:39:48,333 --> 01:39:49,750
మరి బజ్రాల్‌ను ఎందుకు వదిలేశావు?

1595
01:39:50,541 --> 01:39:51,916
అతన్ని కూడా ఎందుకు చంపలేదు?

1596
01:39:53,375 --> 01:39:54,375
లేదు.

1597
01:39:56,541 --> 01:39:59,250
అతను తన గౌరవాన్ని కాపాడుకోవడానికి
నా అన్నను ఇరికించాడు.

1598
01:40:00,333 --> 01:40:02,375
ఆ గౌరవం మంటగలవాలి.

1599
01:40:03,833 --> 01:40:05,916
మేము ఎలాగైతే బాధపడుతున్నామో,
అతని కుటుంబం కూడా

1600
01:40:07,333 --> 01:40:08,833
అలాగే ఎందుకు బాధపడకూడదు?

1601
01:40:10,125 --> 01:40:12,125
అందుకే అతన్ని హత్య కేసులో ఇరికించావు.

1602
01:40:13,708 --> 01:40:16,541
నేను ఇన్నేళ్లు కోర్టులో పనిచేసి
నేర్చుకున్నది ఒక్కటే.

1603
01:40:17,541 --> 01:40:20,083
ఓ పెద్ద మనిషిని కూల్చాలంటే
పెద్ద నేరం కావాలి.

1604
01:40:20,666 --> 01:40:26,166
అందుకే విక్రమ్ బజ్రాల్‌ను ఇరికించడానికి
నువ్వు నీ స్వహస్తాలతో ఇనాయను చంపావు.

1605
01:40:26,500 --> 01:40:29,416
నేను నేరం చేశానా లేదా అని
చట్టానికి అనవసరం.

1606
01:40:30,833 --> 01:40:34,166
అది నిరూపితం అవుతుందా లేదా అన్నదే
దానికి ముఖ్యం.

1607
01:40:35,916 --> 01:40:37,083
ఒకవేళ నిరూపించలేకపోతే,

1608
01:40:38,208 --> 01:40:40,083
నేను నిర్దోషిని.

1609
01:40:42,166 --> 01:40:44,708
బజ్రాల్‌ను బ్లాక్‌మెయిల్ చేసింది నువ్వే.

1610
01:40:45,416 --> 01:40:48,541
ఇనాయ ఇంట్లో ఆ ఫోటోలు పెట్టింది నువ్వే.

1611
01:40:49,125 --> 01:40:51,250
హత్యకు గల కారణాన్ని సృష్టించింది నువ్వే.

1612
01:40:51,333 --> 01:40:56,000
విక్రమ్ బజ్రాల్‌ను ఇనాయ టెర్రస్ మీదకు
రమ్మని మెసేజ్ పంపింది నువ్వే.

1613
01:40:56,083 --> 01:40:58,750
నీ ప్లానింగ్‌కి వంద మార్కులు.
ఆ భవనంలో ట్యూషన్ చెబుతున్నావుగా.

1614
01:40:58,833 --> 01:40:59,708
ట్యూషన్‌లు
సారిక రావత్

1615
01:40:59,791 --> 01:41:02,291
అందుకే నీ కదలికలను
ఎవరూ పట్టించుకోలేదు.

1616
01:41:03,333 --> 01:41:04,166
రేయాన్!

1617
01:41:05,666 --> 01:41:08,166
సారిక మేడం, ఈ రోజు మీరు త్వరగా వచ్చారు.

1618
01:41:08,250 --> 01:41:10,291
ఎలాగూ వచ్చానుగా,
మన క్లాస్ ముగించేద్దామా?

1619
01:41:10,375 --> 01:41:12,666
ఈ రోజు 10 నిమిషాలు త్వరగా ముగిద్దాం.

1620
01:41:15,041 --> 01:41:18,291
ఆ తర్వాత నువ్వు నేరుగా
13వ అంతస్తుకు వెళ్లావు. రేయాన్ ఇంటికి.

1621
01:41:21,375 --> 01:41:24,333
క్లాస్ అయిపోయిన తర్వాత, ఫైర్ ఎగ్జిట్
మెట్ల ద్వారా 8వ అంతస్తుకు,

1622
01:41:24,416 --> 01:41:25,500
ఇనాయ ఇంటికి వెళ్లావు.

1623
01:41:29,208 --> 01:41:30,875
అవును, లంచ్ చాలా బాగుంది.

1624
01:41:30,958 --> 01:41:31,875
నేను మేధాను కలిశా…

1625
01:41:43,500 --> 01:41:46,500
సీసీటీవీ కెమెరా పనిచేయడం లేదని
నీకు తెలుసు.

1626
01:41:46,583 --> 01:41:48,416
అందుకే అక్కడ ఎలాంటి రికార్డింగ్ లేదు.

1627
01:41:49,833 --> 01:41:55,000
కానీ నువ్వు బిల్డింగ్ లోపలికి రావడం,
బయటకు వెళ్లడం నా దగ్గర ఉంది.

1628
01:41:58,875 --> 01:42:02,166
ఇంకా హత్య చేయడానికి
నీ దగ్గర బలమైన కారణం ఉంది.

1629
01:42:07,250 --> 01:42:08,291
నీళ్లు తీసుకువస్తాను.

1630
01:42:10,416 --> 01:42:11,458
నువ్వు బాగానే ఉన్నావా?

1631
01:42:17,833 --> 01:42:19,208
అవి పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలు.

1632
01:42:20,083 --> 01:42:21,916
నేనే హత్య చేశానని నువ్వు ఎలా నిరూపిస్తావు?

1633
01:42:31,625 --> 01:42:37,333
అందుకే విక్రమ్ బజ్రాల్‌ను ఇరికించడానికి
నువ్వు నీ స్వహస్తాలతో ఇనాయను చంపావు.

1634
01:42:37,916 --> 01:42:41,083
నేను నేరం చేశానా లేదా అని
చట్టానికి అనవసరం.

1635
01:42:41,166 --> 01:42:44,958
అది నిరూపితం అవుతుందా లేదా అన్నదే
దానికి ముఖ్యం.

1636
01:42:45,083 --> 01:42:48,208
ఒకవేళ నిరూపించలేకపోతే,
నేను నిర్దోషిని.

1637
01:42:55,791 --> 01:42:56,625
నేహ.

1638
01:42:58,958 --> 01:43:01,166
నీకు ఈ కేసులు ఇవ్వడం
ఎప్పుడూ రిస్క్ అని నాకు తెలుసు.

1639
01:43:02,333 --> 01:43:03,583
నేను తప్పు చేశాను.

1640
01:43:04,416 --> 01:43:05,625
నిన్ను తక్కువ అంచనా వేశాను.

1641
01:43:06,875 --> 01:43:08,916
ఏదేమైనా నువ్వు నీ తండ్రికి తగ్గ కూతురివి.

1642
01:43:10,375 --> 01:43:13,208
మా నాన్నను దెబ్బకొట్టడానికి
నువ్వు నన్ను వాడుకున్నావు.

1643
01:43:14,708 --> 01:43:15,958
నేను దీన్ని గుర్తుంచుకుంటాను.

1644
01:43:16,041 --> 01:43:18,916
నిజం చెప్పాలంటే,
నువ్వు అసలు ఈ ప్లాన్‌లో లేవు.

1645
01:43:19,750 --> 01:43:21,208
అంతా సిద్ధమైంది.

1646
01:43:21,291 --> 01:43:25,000
కానీ రాజవన్ష్ కూతురు ప్రాసిక్యూషన్‌లో
చేరిందని నాకు తెలిసినప్పుడు,

1647
01:43:25,875 --> 01:43:27,625
అది పై నుండి సంకేతం అని
నాకు అనిపించింది.

1648
01:43:38,375 --> 01:43:40,750
మిశ్రా కేసులో నువ్వు
నా సహాయం అడిగినప్పుడు,

1649
01:43:41,500 --> 01:43:42,750
అది కేవలం సంకేతమే కాదు,

1650
01:43:43,708 --> 01:43:46,625
అవకాశం అని
నాకు కచ్చితంగా అర్థమైంది.

1651
01:43:47,791 --> 01:43:50,333
రాజవన్ష్‌తో లెక్కలు సరిచేసుకోవడానికి.

1652
01:43:54,000 --> 01:43:55,416
నాకు ఇంకా ఒక విషయం అర్థం కాలేదు.

1653
01:43:56,500 --> 01:43:58,916
ఈ కేసులన్నీ నా దగ్గరికే వచ్చేలా
నువ్వు ఎలా చేశావు?

1654
01:44:00,208 --> 01:44:03,125
రాఠీతో మాదిరిగానే,
అహ్లావత్‌తో కూడా పడుకున్నావా?

1655
01:44:05,416 --> 01:44:07,666
మనుషులను కొనడానికి
నా దగ్గర డబ్బు లేదు,

1656
01:44:09,375 --> 01:44:12,416
అందుకే నా దగ్గర ఉన్నదాన్ని వాడుకున్నాను.

1657
01:44:20,041 --> 01:44:21,583
నీ మీద నీకే అసహ్యం అనిపించడం లేదా?

1658
01:44:22,666 --> 01:44:24,083
నువ్వు ఎలా నిద్రపోతావు?

1659
01:44:24,166 --> 01:44:26,375
విక్రమ్ బజ్రాల్‌ను కూడా
ఇదే ప్రశ్న ఎందుకు అడగవు?

1660
01:44:27,708 --> 01:44:28,958
ఇంకా అతనినే కాదు,

1661
01:44:30,500 --> 01:44:32,166
మీ నాన్నను కూడా ఎందుకు అడగవు?

1662
01:44:40,000 --> 01:44:42,000
నిన్ను వాడుకున్నది నిజమే,

1663
01:44:43,291 --> 01:44:46,666
కానీ నీ మీద నాకు
ఎలాంటి పగ లేదన్నది కూడా నిజం, నేహ.

1664
01:44:47,708 --> 01:44:50,333
ప్లీజ్, సారిక, ఇక అబద్ధాలు వద్దు.

1665
01:44:52,208 --> 01:44:53,333
ఇది అబద్ధం కాదు.

1666
01:44:55,041 --> 01:44:57,000
మిగతాది నీ ఇష్టం.

1667
01:45:00,375 --> 01:45:02,416
నీకు ఇప్పుడు అంతా తెలుసు.

1668
01:45:04,333 --> 01:45:05,458
నువ్వు ఏం చేస్తావు?

1669
01:45:52,958 --> 01:45:56,750
కేసు ముగిసే వరకు
నువ్వు ఇంటికి తిరిగిరావనుకున్నానే?

1670
01:45:57,500 --> 01:45:59,666
సరే, ఇంటికి స్వాగతం.

1671
01:46:00,791 --> 01:46:02,166
నేను తిరిగి రావడం లేదు.

1672
01:46:03,791 --> 01:46:05,500
మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను.

1673
01:46:06,375 --> 01:46:07,708
ఎవరు అడుగుతున్నారు?

1674
01:46:08,958 --> 01:46:11,875
కూతురా లేక పబ్లిక్ ప్రాసిక్యూటరా?

1675
01:46:12,458 --> 01:46:13,458
ఇద్దరూ.

1676
01:46:15,791 --> 01:46:16,791
కూర్చో.

1677
01:46:27,125 --> 01:46:28,750
మీకు ట్విస్టెడ్ బార్ కేసు గుర్తుందా?

1678
01:46:30,083 --> 01:46:31,208
దాని గురించి ఏంటి?

1679
01:46:31,791 --> 01:46:33,000
ఎవరు దోషి?

1680
01:46:33,083 --> 01:46:34,666
ఎవరు? విక్రమ్ బజ్రాల్?

1681
01:46:35,875 --> 01:46:37,375
నిర్దోషిగా అతని విడుదల నీకు తెలుసు.

1682
01:46:38,625 --> 01:46:40,333
నేను కోర్టు తీర్పు గురించి అడగడం లేదు.

1683
01:46:41,416 --> 01:46:43,333
ఆ ప్రమాదానికి అతను బాధ్యుడా?

1684
01:46:44,625 --> 01:46:47,083
నా క్లయింట్‌పై అభిప్రాయాలకు
నాకు డబ్బు ఇవ్వరు.

1685
01:46:47,958 --> 01:46:51,708
వారిని నిర్దోషిగా నిరూపించడానికే
డబ్బు ఇస్తారు.

1686
01:46:51,791 --> 01:46:53,291
కేసు గెలవడానికి.

1687
01:46:54,375 --> 01:46:55,666
మీరు ఒక లాయర్.

1688
01:46:56,958 --> 01:46:58,458
న్యాయం జరిగేలా చూడటం

1689
01:46:59,500 --> 01:47:01,458
మీ బాధ్యత కాదా?

1690
01:47:03,458 --> 01:47:05,125
అంత అమాయకంగా ఉండకు, నేహ.

1691
01:47:06,041 --> 01:47:08,500
ఇది నిజ జీవితం,
ఏదో నీతి పాఠాల క్లాస్ కాదు,

1692
01:47:08,583 --> 01:47:10,541
తప్పు ఒప్పులు
తేల్చుకోవాల్సిన అవసర౦ ఉ౦డదు.

1693
01:47:11,458 --> 01:47:15,750
ఒక వ్యక్తి నేరం చేసినా,
చేయకపోయినా చట్టం పట్టించుకోదు.

1694
01:47:16,625 --> 01:47:21,125
నేరం నిరూపితమైందా, లేదా అన్నదే
దానికి ముఖ్యం.

1695
01:48:20,666 --> 01:48:21,708
అందరూ నిలబడండి.

1696
01:48:22,458 --> 01:48:24,000
గౌరవనీయు న్యాయమూర్తి గారు వస్తున్నారు.

1697
01:48:32,625 --> 01:48:36,583
ప్రాసిక్యూషన్ నిందితుని
ప్రశ్నించడం కొనసాగించవచ్చు.

1698
01:48:56,416 --> 01:48:57,750
నేహ తల్లీ, ఎలా ఉన్నావు?

1699
01:49:01,458 --> 01:49:02,458
మిస్టర్ విక్రమ్ బజ్రాల్,

1700
01:49:03,208 --> 01:49:06,666
మీ కంపెనీ బజ్రాల్ బిల్డర్స్‌కు
సూర్య నివాస్ టవర్స్ అనే ప్రాజెక్ట్ ఉంది.

1701
01:49:06,750 --> 01:49:10,833
రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఒక పెద్ద
హౌసింగ్ కాంప్లెక్స్. ఇది నిజమేగా?

1702
01:49:12,416 --> 01:49:13,750
నిజమే.

1703
01:49:13,833 --> 01:49:16,000
దాని గురించి నేను గర్వపడతాను.

1704
01:49:16,083 --> 01:49:17,791
మీరు గర్వపడాలి కూడా.

1705
01:49:17,875 --> 01:49:21,000
అంటే, ఏదైనా రంగంలో అగ్రస్థానానికి
చేరుకోవడం అంత సులభం కాదు.

1706
01:49:21,083 --> 01:49:23,041
మీరు చాలా అడ్డంకులను ఎదుర్కొని ఉంటారు.

1707
01:49:23,125 --> 01:49:28,041
నేను పొరపాటు పడకపోతే,
మీపై 12 సివిల్ కేసులు ఉన్నాయి కదా?

1708
01:49:28,875 --> 01:49:30,458
సరే, పెద్దలు అంటారుగా,

1709
01:49:31,208 --> 01:49:35,208
వ్యాపారం విలువ అనేది
శ్రేయోభిలాషుల లెక్కతో కాదు…

1710
01:49:36,166 --> 01:49:37,958
ప్రత్యర్థుల సంఖ్య ప్రకారం ఉంటుందని.

1711
01:49:39,291 --> 01:49:40,291
అయినా సరే,

1712
01:49:40,375 --> 01:49:45,333
నాపై ఉన్న ఒక్క ఆరోపణను కూడా
ఎవరూ నిరూపించలేకపోయారు.

1713
01:49:46,500 --> 01:49:48,916
అంటే ప్రజలు మీ మీద
తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటారు.

1714
01:49:49,000 --> 01:49:50,500
ఇంకా మీ డిఫెన్స్ ప్రకారం,

1715
01:49:50,583 --> 01:49:54,291
ఈ కేసు కూడా ఒక తప్పుడు హత్యారోపణేనా?

1716
01:49:54,375 --> 01:49:55,458
అవును, ఖచ్చితంగా.

1717
01:49:55,541 --> 01:49:59,166
నేను చెప్పినట్లుగా,
మృతురాలు ఎవరో కూడా నాకు తెలియదు.

1718
01:49:59,250 --> 01:50:00,958
ఇక హత్య చేసే ప్రసక్తే లేదు.

1719
01:50:02,791 --> 01:50:05,000
మృతురాలు అంటే ఇనాయ కొఠారి గురించే కదా?

1720
01:50:06,916 --> 01:50:09,250
అవును, ఇనాయ కొఠారి.

1721
01:50:23,416 --> 01:50:24,416
యువరానర్,

1722
01:50:25,000 --> 01:50:27,125
ఇవి మిస్టర్ విక్రమ్ బజ్రాల్
ఫోన్ రికార్డులు,

1723
01:50:27,208 --> 01:50:29,041
2016-2017 మధ్య రికార్డ్ చేయబడినవి.

1724
01:50:29,125 --> 01:50:32,000
ట్విస్టెడ్ బార్ కేసు ముగిసిన తర్వాత
చాలా రోజులకు కూడా, ఈయనకు

1725
01:50:32,083 --> 01:50:34,791
ఇనాయ కొఠారికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని
ఇవి వెల్లడిస్తున్నాయి.

1726
01:50:46,708 --> 01:50:49,875
ఇక్కడ చూడండి, యువరానర్,
ఇనాయ కొఠారి బ్యాంక్ స్టేట్‌మెంట్లు.

1727
01:50:49,958 --> 01:50:53,583
ఆ సమయంలో ఆమె ఖాతాలో
దాదాపు ₹3,50,000 ఉందని సూచిస్తున్నాయి.

1728
01:50:53,666 --> 01:50:55,791
ఆమె ఈ అపార్ట్‌మెంట్‌ను కొనే అవకాశమే లేదు.

1729
01:50:55,875 --> 01:50:58,583
అయినా, ట్విస్టెడ్ బార్ కేసు ముగిసిన
కేవలం రెండు వారాలకే

1730
01:50:58,666 --> 01:51:00,125
ఆమె అందులోకి మారింది.

1731
01:51:02,625 --> 01:51:04,750
యువరానర్, ఇవి ఆ ప్రాపర్టీ పేపర్లు.

1732
01:51:04,833 --> 01:51:08,833
బజ్రాల్ బిల్డర్స్ యజమాని
మి. విక్రమ్ బజ్రాల్ స్వయంగా

1733
01:51:08,916 --> 01:51:12,541
ఈ అపార్ట్‌మెంట్‌ను ఇనాయ కొఠారికి
బహుమతిగా ఇచ్చారు.

1734
01:51:13,166 --> 01:51:15,250
మిస్టర్ విక్రమ్ బజ్రాల్‌కు

1735
01:51:15,333 --> 01:51:17,958
ఇనాయ కొఠారి ముందే తెలుసని
ఇది నిస్సందేహంగా నిరూపిస్తోంది.

1736
01:51:19,000 --> 01:51:21,333
మిస్టర్ రాజవన్ష్, డిఫెన్స్ తరపున
ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా?

1737
01:51:25,875 --> 01:51:26,958
లేవు, యువరానర్.

1738
01:51:30,791 --> 01:51:32,458
ఇక తదుపరి ప్రశ్నలు లేవు, యువరానర్.

1739
01:51:51,166 --> 01:51:54,208
కోర్టు ముందు ఉన్న ఆధారాలు అన్నింటినీ
పరిగణనలోకి తీసుకుని,

1740
01:51:54,291 --> 01:51:57,208
ఈ కోర్టు విక్రమ్ బజ్రాల్‌ను
ఇనాయ కొఠారి హత్య కేసులో

1741
01:51:57,291 --> 01:51:59,833
దోషిగా నిర్ధారిస్తోంది.

1742
01:52:00,583 --> 01:52:04,083
ఇందుకోసం ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం,

1743
01:52:04,166 --> 01:52:06,125
అతనికి జీవిత ఖైదు విధిస్తోంది.

1744
01:52:06,833 --> 01:52:10,166
అదనంగా, ఈ కేసులో బయటపడిన
కొత్త ఆధారాల ప్రకారంగా,

1745
01:52:10,250 --> 01:52:14,708
ట్విస్టెడ్ బార్ కేసును మళ్లీ తెరిచి,
దర్యాప్తును మొదటి నుండి ప్రారంభించాలని

1746
01:52:14,791 --> 01:52:18,375
ఈ కోర్టు ఆదేశిస్తోంది.

1747
01:52:30,916 --> 01:52:31,916
అంతా నీ వల్లే.

1748
01:52:32,000 --> 01:52:34,333
నేను మునిగిపోతే,
నిన్ను కూడా నాతో పాటు ముంచేస్తా.

1749
01:52:34,416 --> 01:52:35,916
మీరంతా కలిసి ఇలా చేస్తున్నారు!

1750
01:52:37,916 --> 01:52:40,541
వదలండి. నేను విక్రమ్ బజ్రాల్‌ని!

1751
01:52:52,750 --> 01:52:53,750
నేహ.

1752
01:52:56,666 --> 01:52:57,958
హలో, సర్.

1753
01:52:58,041 --> 01:52:59,041
వెళతాను, నేహ.

1754
01:53:00,916 --> 01:53:03,041
-నాన్నా, నేను కారు దగ్గర ఉంటాను.
-సరే.

1755
01:53:08,541 --> 01:53:09,541
నవ్వు.

1756
01:53:10,375 --> 01:53:12,000
నువ్వు నీ పదో కేసు గెలిచావు.

1757
01:53:12,708 --> 01:53:16,166
ట్విస్టెడ్ బార్ కేసులో మీరు బజ్రాల్‌ను
కాపాడి ఉండకపోతే,

1758
01:53:16,250 --> 01:53:18,458
ఈ రోజు మనం ఇలా ప్రత్యర్థులుగా
నిలబడేవాళ్లం కాదు.

1759
01:53:19,208 --> 01:53:20,208
అదీ ఒక రకంగా మంచిదే.

1760
01:53:20,958 --> 01:53:24,208
నేను నా మొదటి కేసును
నా సొంత కూతురి చేతిలో ఓడిపోయాను.

1761
01:53:26,500 --> 01:53:28,083
ఇక నేను నీకు ధన్యవాదాలు చెప్పాలి.

1762
01:53:28,166 --> 01:53:30,708
ఆ తప్పు చేసిన భారం
ఇప్పుడు నా భుజాల నుండి దిగిపోయింది,

1763
01:53:30,791 --> 01:53:31,791
నీ పుణ్యమా అని.

1764
01:53:33,125 --> 01:53:35,333
నాన్నా, కొన్ని భారాలు ఎప్పటికీ పోవు.

1765
01:53:36,000 --> 01:53:37,625
అవి మరొకరి భుజానికి మారుతాయి.

1766
01:53:41,583 --> 01:53:43,291
కోర్టులో బజ్రాల్ మిమ్మల్ని బెదిరించాడు.

1767
01:53:44,083 --> 01:53:45,458
తనను ప్రయత్నించనీ.

1768
01:53:45,541 --> 01:53:47,291
అతనేం చేస్తాడు? నా మీద కేసు పెడతాడా?

1769
01:53:48,458 --> 01:53:51,333
సరే, ఇప్పుడు నా దగ్గర
నాకంటే గొప్ప లాయర్ ఉంది.

1770
01:53:51,416 --> 01:53:54,125
నాకు రాజవన్ష్ లీగల్‌లో
కొత్త పార్ట్‌నర్ దొరికింది.

1771
01:53:57,041 --> 01:53:58,000
నాకు తెలియదు, నాన్నా.

1772
01:53:59,291 --> 01:54:01,916
నా భవిష్యత్తు ఏంటో నాకు ఇంకా స్పష్టత లేదు.

1773
01:54:02,833 --> 01:54:05,500
నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా,
నీ గురించి గర్వపడతాను.

1774
01:54:08,041 --> 01:54:09,333
నేహ మేడం!

1775
01:54:10,250 --> 01:54:11,375
వెళ్లు.

1776
01:54:11,458 --> 01:54:13,000
రిపోర్టర్లు నీ కోసం ఎదురుచూస్తున్నారు.

1777
01:54:15,750 --> 01:54:17,041
నేహ మేడం!

1778
01:54:17,666 --> 01:54:19,500
వెళ్లు! నీ విజయాన్ని ఆస్వాదించు.

1779
01:54:47,083 --> 01:54:49,583
నేను నీకు ధన్యవాదాలు చెప్పాలో
లేక క్షమాపణ అడగాలో తెలియడం లేదు.

1780
01:54:53,000 --> 01:54:54,708
ఏదీ అవసరం లేదు.

1781
01:54:56,041 --> 01:54:58,125
నీకు కావాల్సిన ఫలితం నీకు దక్కింది.

1782
01:55:00,541 --> 01:55:02,500
కోర్టు తీర్పు నా వైపు వచ్చింది.

1783
01:55:04,375 --> 01:55:06,541
కానీ నువ్వు నాకు న్యాయం చేశావు, నేహ.

1784
01:55:09,208 --> 01:55:10,833
ఇది న్యాయం కాదు, సారిక.

1785
01:55:12,166 --> 01:55:15,208
నువ్వు, మా నాన్న, విక్రమ్ బజ్రాల్,
మీరందరూ ఒకటే.

1786
01:55:16,458 --> 01:55:18,583
మీరందరూ చట్టాన్ని వాడుకున్నారు.

1787
01:55:21,166 --> 01:55:22,458
బహుశా నీ మాట నిజమే కావచ్చు.

1788
01:55:23,916 --> 01:55:25,208
మరి నన్ను ఎందుకు వదిలేశావు?

1789
01:55:29,583 --> 01:55:32,875
మా నాన్న చేసిన తప్పులు
నన్ను సిగ్గుపడేలా చేశాయి.

1790
01:55:35,250 --> 01:55:37,083
కుసుమ్ విషయంలో కూడా
అదే జరగడం నాకు ఇష్టం లేదు.

1791
01:55:38,833 --> 01:55:41,041
ఇది ఎక్కడో ఒకచోట ఆగాలి.

1792
01:55:41,708 --> 01:55:43,791
అందుకే, అభినందనలు.

1793
01:55:44,958 --> 01:55:46,791
నీకు కావాల్సింది నీకు దక్కింది.

1794
01:55:47,916 --> 01:55:49,125
నేను మాత్రమే నష్టపోయాను.

1795
01:55:50,333 --> 01:55:51,500
మొదట నా అన్నను,

1796
01:55:52,916 --> 01:55:54,458
ఇప్పుడు నా స్నేహితురాలిని.

1797
01:55:56,208 --> 01:55:57,375
నువ్వు రాజవన్ష్‌వి.

1798
01:55:57,458 --> 01:55:59,208
నువ్వు కూడా మీ నాన్నలాగే గెలవడం మినహా,

1799
01:56:00,166 --> 01:56:02,375
న్యాయం మీద దృష్టి పెట్టవని అనుకున్నాను.

1800
01:56:04,000 --> 01:56:05,750
కానీ ఈ రోజు నువ్వు చేసిన పనితో,

1801
01:56:05,833 --> 01:56:10,916
నీ తండ్రి పేరుతో సంబంధం లేకుండా
నీకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నావు.

1802
01:56:12,916 --> 01:56:13,750
నేహ.

1803
01:56:22,916 --> 01:56:23,916
ధన్యవాదాలు.

1804
01:56:44,125 --> 01:56:46,291
నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, మేడం.

1805
01:56:46,375 --> 01:56:49,041
నాలాంటి పేద అమ్మాయికి
మీరు ఎందుకు సహాయం చేస్తున్నారు?

1806
01:56:49,125 --> 01:56:50,541
రాజవన్ష్ లీగల్

1807
01:56:51,416 --> 01:56:52,708
ఎందుకు చేయకూడదు?

1808
01:56:52,791 --> 01:56:53,666
ధనికులైనా, పేదలైనా,

1809
01:56:55,041 --> 01:56:56,875
ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కు ఉంది.

1810
02:03:16,041 --> 02:03:18,041
సబ్‌టైటిల్ అనువాద కర్త పి. ఎస్. లక్ష్మి

1811
02:03:18,125 --> 02:03:20,125
క్రియేటివ్ సూపర్‌వైజర్‌
నిశాంతి ఈవని



