1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:35,786 --> 00:00:40,207
కోవిడ్-19 ఒక మహమ్మారి అని
ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

4
00:00:40,290 --> 00:00:44,127
"ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి"
అనే ఆదేశాన్ని నేను జారీచేస్తున్నాను.

5
00:00:44,211 --> 00:00:46,672
…దాదాపు నగరవాసులందరినీ పూర్తిగా

6
00:00:46,755 --> 00:00:49,424
ఇంట్లోనే ఉండమని ఆదేశిస్తున్నాను.

7
00:00:49,508 --> 00:00:53,262
ఈరోజు సాయంత్రం, నేను ఒక సూచన ఇవ్వాలి.

8
00:00:53,345 --> 00:00:55,264
మీరు ఇంట్లోనే ఉండాలి.

9
00:00:57,558 --> 00:01:02,354
మార్చి 2020.
ప్రాణాంతక వైరస్ ప్రపంచం మొత్తం పాకింది.

10
00:01:02,437 --> 00:01:04,982
ఉండగలిగితే ఇంట్లోనే ఉండండి

11
00:01:05,065 --> 00:01:08,819
రాత్రికి రాత్రే,
మన జీవితాలకు అంతరాయం కలిగింది.

12
00:01:14,533 --> 00:01:16,201
కానీ మనం ఆగగానే...

13
00:01:17,536 --> 00:01:22,583
ప్రకృతి ప్రపంచంలో
చెప్పుకోదగ్గ మార్పులు మొదలయ్యాయి.

14
00:01:25,919 --> 00:01:27,546
స్వచ్ఛమైన గాలి.

15
00:01:29,923 --> 00:01:31,550
శుభ్రమైన నీరు.

16
00:01:33,135 --> 00:01:38,974
దశాబ్దాలుగా చూడని పద్ధతుల్లో జంతువులు
వృద్ధి చెందడం ప్రారంభించాయి.

17
00:01:41,894 --> 00:01:46,607
ఐదు ఖండాల్లో లాక్ డౌన్ ప్రారంభం నుండీ
చిత్రీకరణ చేపట్టి...

18
00:01:48,692 --> 00:01:52,154
ప్రకృతి అసాధారణ స్పందనను
మేము రికార్డు చేశాం.

19
00:02:01,121 --> 00:02:04,833
తమ పిల్లలతో సముద్రంలో భారీ జీవులు
నూతన మార్గాల్లో సంప్రదించడం దగ్గర నుండి...

20
00:02:08,920 --> 00:02:13,675
తమ కూనలు మనుగడ సాగించే అవకాశాలను
చిరుతలు రూపాంతరం చేసుకోవడం…

21
00:02:14,343 --> 00:02:17,429
తల్లి కావడానికి ఇంతకు మించిన సమయం లేదు.

22
00:02:18,430 --> 00:02:24,019
రికార్డు బ్రేకింగ్ స్థాయిలో
పెంగ్విన్ ల బ్రీడింగ్ సీజన్ వరకూ.

23
00:02:26,939 --> 00:02:32,152
వన్యప్రాణుల జీవితాల్లో, వాటి ప్రపంచంలో
మనిషి ప్రమేయం తగ్గితే

24
00:02:32,778 --> 00:02:37,199
ఎలాంటి మార్పులు జరుగుతాయో తొంగి చూడడానికి
ఇదొక ప్రత్యేక అవకాశం.

25
00:02:37,950 --> 00:02:41,578
భారీ పరిమాణాల్లో జరిగిన
ప్రపంచవ్యాప్త ప్రయోగం ఇది.

26
00:02:43,163 --> 00:02:47,459
ఇది భూమి మారిన సంవత్సరం.

27
00:03:00,222 --> 00:03:04,351
వ్యాఖ్యాత
డేవిడ్ అటెన్బరో

28
00:03:05,894 --> 00:03:11,483
లాక్ డౌన్ మొదలైన గంటలలోగా,
ఎక్కువమంది నిశ్శబ్దాన్ని గమనించే ఉంటారు.

29
00:03:11,567 --> 00:03:12,818
రేడియో సిటీ మ్యూజిక్ హాల్

30
00:03:14,236 --> 00:03:19,199
ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్
శబ్ద కాలుష్యం 70% వరకూ తగ్గిపోగా,

31
00:03:19,283 --> 00:03:22,452
కొత్త శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి...

32
00:03:25,581 --> 00:03:26,999
...పక్షి పాట.

33
00:03:31,503 --> 00:03:33,547
శాన్ ఫ్రాన్సిస్కో
యు.ఎస్.ఎ

34
00:03:33,630 --> 00:03:35,257
మెట్రో జనాభా 47 లక్షలు

35
00:03:35,340 --> 00:03:37,426
ఈ వైట్ క్రౌన్డ్ పిచుకలు

36
00:03:37,509 --> 00:03:41,346
ఆశ్చర్యకరమైన పనిచేస్తూ
నిశ్శబ్దానికి అలవాటు పడుతున్నాయి.

37
00:03:43,640 --> 00:03:46,476
గోల్డెన్ గేట్ బ్రిడ్జి సమీపంలో నివసించే

38
00:03:46,560 --> 00:03:50,480
వీటి పాట కార్ల హోరులో
వినిపించకుండా పోయింది.

39
00:03:52,482 --> 00:03:57,362
కానీ ప్రస్తుతం ఇక్కడి ట్రాఫిక్
1950లలో ఉన్నంత తక్కువ స్థాయికి చేరడంతో,

40
00:03:58,614 --> 00:04:04,244
ఈ పిచ్చుకలు జతకోసం చేసే శబ్దాలలో కొత్త
రాగాలు కనిపెట్టి పరిశోధకులు అబ్బురపడ్డారు.

41
00:04:06,788 --> 00:04:11,877
కాబట్టి, కొన్నేళ్ళపాటు ఈ పక్షులకు మంచి
బ్రీడింగ్ సీజన్ ఉంటుందనే ఆశించవచ్చు.

42
00:04:17,548 --> 00:04:20,552
తగ్గింది కేవలం శబ్ద కాలుష్యం మాత్రమే కాదు.

43
00:04:22,304 --> 00:04:28,310
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం తగ్గిన వేగం
ఊహించనిది.

44
00:04:30,229 --> 00:04:31,438
కొద్ది రోజులలోనే,

45
00:04:31,522 --> 00:04:36,944
40 ఏళ్ళలో ఎన్నడూ లేని ఉత్తమమైన
గాలి నాణ్యతని లాస్ ఏంజిల్స్ చవిచూసింది.

46
00:04:39,112 --> 00:04:44,243
చైనా అంతటా, వాతావరణంలో విష వాయువుల
స్థాయులు సగానికి పడిపోయాయి.

47
00:04:46,245 --> 00:04:52,125
ప్రపంచంలోనే ప్రమాదకరస్థాయిలో కాలుష్యం
బారినపడిన కొన్ని ప్రాంతాలున్న ఇండియాలో...

48
00:04:53,585 --> 00:04:56,213
లాక్ డౌన్ విధించిన కేవలం 12 రోజుల్లోనే...

49
00:04:56,713 --> 00:04:59,216
జలంధర్ - ఇండియా
జనాభా 10 లక్షలు

50
00:04:59,299 --> 00:05:01,510
...ఒక ఉత్కంఠభరితమైన దృశ్యం ప్రత్యక్షమైంది.

51
00:05:01,593 --> 00:05:04,471
మేము ఉదయం టిఫిన్ చేయడానికి
టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాం,

52
00:05:04,555 --> 00:05:06,014
అప్పుడు మా నాన్న హడావుడిగా
అక్కడికి వచ్చారు.

53
00:05:06,098 --> 00:05:07,391
అన్షుల్ చోప్రా

54
00:05:07,474 --> 00:05:10,060
అప్పుడాయన, "డాబా మీదికి రండి.
పర్వతాలు కనిపిస్తున్నాయి" అన్నారు.

55
00:05:10,143 --> 00:05:12,521
ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ అన్షుల్

56
00:05:12,604 --> 00:05:15,858
ఈ హడావుడి దేనిగురించో చూద్దామని
డాబా పైకి వెళ్ళాడు.

57
00:05:16,817 --> 00:05:19,236
జనం తమ ఇళ్ళ పైకప్పుల మీద నుంచుని,

58
00:05:19,319 --> 00:05:21,822
"వావ్. వావ్. పర్వతాలు. పర్వతాలు" అని
అరుస్తున్నారు.

59
00:05:21,905 --> 00:05:24,533
నేను ఊపిరి బిగపట్టి, అటు చూశాను.

60
00:05:27,327 --> 00:05:30,455
ఆకాశం స్వచ్చంగా ఉండడంతో,
జీవితంలో మొట్టమొదటిసారిగా,

61
00:05:30,539 --> 00:05:32,124
మేము హిమాలయాలను చూడగలిగాం.

62
00:05:33,041 --> 00:05:35,210
200ల కిలోమీటర్ల దూరంలో,

63
00:05:35,294 --> 00:05:38,046
30 ఏళ్ళనుండీ వాయు కాలుష్యం

64
00:05:38,130 --> 00:05:41,842
వెనుక దాగున్న భూమ్మీది ఎత్తైన పర్వతాలు,

65
00:05:41,925 --> 00:05:43,468
ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి.

66
00:05:44,469 --> 00:05:45,888
నేను నా కళ్ళని నమ్మలేకపోయాను.

67
00:05:45,971 --> 00:05:49,725
ఇన్నాళ్ళ నుండీ కాలుష్యం వెనక హిమాలయాలు
అక్కడే ఉన్నాయి.

68
00:05:51,935 --> 00:05:56,523
అన్షుల్ ఈ సందర్భాన్ని తీసిన
ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.

69
00:05:57,608 --> 00:05:59,276
మనం ఆగిన మరుక్షణం,

70
00:05:59,359 --> 00:06:04,865
భూమి తిరిగి ఊపిరి పీల్చుకోవడం
ప్రారంభించిందనడానికి ఇదో స్పష్టమైన ఉదాహరణ.

71
00:06:10,495 --> 00:06:13,832
లాక్ డౌన్ వారాల తరబడి కొనసాగింది.

72
00:06:13,916 --> 00:06:16,043
4 వారాలు

73
00:06:16,126 --> 00:06:20,172
ప్రయాణ ఆంక్షలు మన కదలికల్ని
మరింత కట్టడి చేశాయి.

74
00:06:21,131 --> 00:06:24,468
మీరు తీసుకోవాలని ప్లాన్ చేసిన
సెలవుల్ని కాన్సిల్ చేసుకోండి.

75
00:06:24,551 --> 00:06:27,346
పాసెంజర్ల సంఖ్య,
పాసెంజర్ల బుకింగ్స్ తగ్గిపోయాయి.

76
00:06:27,429 --> 00:06:29,556
విమాన ప్రయాణాలు దారుణంగా పడిపోయాయి.

77
00:06:29,640 --> 00:06:32,726
ప్రపంచవ్యాప్తంగా సుమారు 90% తగ్గిపోయాయి.

78
00:06:33,519 --> 00:06:35,187
2020 ఏప్రిల్ నెలలో

79
00:06:35,270 --> 00:06:40,526
గత ఏడాదితో అదే నెలతో పోల్చితే,
అంతర్జాతీయ పర్యాటకులు

80
00:06:40,609 --> 00:06:42,778
11కోట్ల 40 లక్షలు తక్కువగా ఉన్నారు.

81
00:06:44,571 --> 00:06:50,827
స్పెయిన్ లో, పర్యాటకుల సంఖ్య
70 లక్షల నుండి సున్నాకు పడిపోయింది.

82
00:06:53,664 --> 00:06:55,666
ఫ్లోరిడా - యు.ఎస్.ఎ
జనాభా రెండు కోట్ల 20 లక్షలు

83
00:06:55,749 --> 00:07:00,546
ఫ్లోరిడాలో వసంతకాల సెలవుల్లో జనంతో
కిక్కిరిసిపోయి ఉండే బీచులు...

84
00:07:01,505 --> 00:07:03,131
వెలవెలబోయాయి.

85
00:07:06,385 --> 00:07:11,056
అంతరించే దశలో ఉన్న ఒక సముద్ర జీవి
తన జనాభాను పెంచుకోవడానికి

86
00:07:11,139 --> 00:07:12,933
ఇది సరైన అవకాశమా?

87
00:07:21,066 --> 00:07:24,611
ప్రతి రెండు లేదా మూడేళ్ళకొకసారి
ఆడ సముద్ర తాబేళ్లు

88
00:07:24,695 --> 00:07:27,739
గుడ్లు పెట్టేందుకు తాము పొదగబడిన

89
00:07:27,823 --> 00:07:29,658
తీరాలకు చేరుకుంటాయి.

90
00:07:32,077 --> 00:07:36,498
విశ్వవ్యాప్తంగా,
తాబేళ్ల సంఖ్య వేగంగా తరిగిపోతూనే ఉంది,

91
00:07:36,582 --> 00:07:41,128
నిరంతరం బిజీగా ఉండే బీచుల్లో అవి గుడ్లు
పెట్టడానికి ఇష్టపడకపోవడం అందుకు ఒక కారణం.

92
00:07:46,091 --> 00:07:47,301
కానీ ఈ ఏడాది...

93
00:07:48,760 --> 00:07:49,970
పరిస్థితి వేరుగా ఉంది.

94
00:07:53,140 --> 00:07:56,518
స్థానిక పరిశోధకులతో కలిసి పనిచేస్తున్న
మా కెమెరామెన్ కు,

95
00:07:56,602 --> 00:07:59,938
జూనో బీచిలో చిత్రించే అదృష్టం దొరికింది...

96
00:08:01,190 --> 00:08:05,819
ప్రపంచంలోనే అత్యంత దట్టంగా లాగర్ హెడ్
తాబేళ్లు గుడ్లు పొదిగే ప్రాంతాల్లో ఇదొకటి.

97
00:08:10,866 --> 00:08:12,826
బ్రీడింగ్ సీజన్ ప్రారంభం కాగానే,

98
00:08:14,578 --> 00:08:18,081
తన జీవితంలో మొదటిసారిగా ఈ ఆడ తాబేలు

99
00:08:18,916 --> 00:08:21,752
ప్రశాంతంగా గుడ్లను పెట్టగలిగింది.

100
00:08:38,018 --> 00:08:40,020
రాబోయే మరికొద్ది వారాల్లో,

101
00:08:40,102 --> 00:08:42,397
మరిన్ని వందలాది తాబేళ్లు అదేపని చేస్తాయి.

102
00:08:47,694 --> 00:08:50,572
మనుషులు కల్పిస్తున్న విఘతాలే తాబేళ్ల
పునరుత్పత్తికి

103
00:08:50,656 --> 00:08:53,659
పెద్ద సమస్యగా ఉన్నాయని
ఎంతోకాలంగా భావించడం తెలిసిందే.

104
00:08:56,286 --> 00:09:00,374
కానీ ఈసారి మాత్రమే మొదటిసారిగా
ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో

105
00:09:00,457 --> 00:09:02,459
పరిశోధించడం సాధ్యపడింది.

106
00:09:08,006 --> 00:09:11,260
ప్రతి ఉదయం, ఈ పరిశోధకుల బృందం

107
00:09:11,343 --> 00:09:14,972
గూళ్ళకు దారి తీసిన తాబేళ్ల
అడుగుజాడలను లెక్కించారు.

108
00:09:18,350 --> 00:09:20,185
గత పదేళ్లుగా,

109
00:09:20,269 --> 00:09:23,438
లాగర్ హెడ్ తాబేళ్ళు పెట్టే గూళ్ళ సగటు

110
00:09:23,522 --> 00:09:26,650
సక్సెస్ రేటు కేవలం 40 శాతానికి పడిపోయింది.

111
00:09:27,401 --> 00:09:31,864
అవి బీచ్ పై విజయం సాధించగలిగాయా?

112
00:09:32,614 --> 00:09:34,783
మనుషులకు బీచుల్లో ప్రవేశం
నిషేధించబడినపుడు,

113
00:09:34,867 --> 00:09:38,412
గతంలో ఎన్నడూ చూడని విధంగా వాటి సంఖ్య
ఒక్కసారిగా 61 శాతానికి పెరిగింది.

114
00:09:38,495 --> 00:09:39,955
డాక్టర్ జస్టిన్ పెర్రల్ట్
తాబేళ్ల పరిశోధకుడు

115
00:09:41,707 --> 00:09:44,376
ఇదొక అసాధారణ పెరుగుదల.

116
00:09:51,425 --> 00:09:56,138
అదనంగా ఒక గూడు అంటే అర్థం
మరో వంద లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు అని,

117
00:09:56,221 --> 00:10:00,767
అవి పెరిగి సొంతగా పునరుత్పత్తి చేయగల
సామర్ధ్యం సంతరించుకుంటాయి.

118
00:10:03,145 --> 00:10:06,565
మనిషి అస్తిత్వంలోకి రాకముందు
లక్షలాది ఏళ్ళుగా చేస్తూ వచ్చిన పనిని,

119
00:10:06,648 --> 00:10:09,109
బీచులు మూసేసేసరికి,

120
00:10:09,943 --> 00:10:13,614
ఈ జంతువులు మరింత విజయవంతంగా
నిర్వర్తించగలిగాయి.

121
00:10:42,226 --> 00:10:44,478
ఆరు వేల కిలోమీటర్ల అవతల,

122
00:10:44,561 --> 00:10:46,355
అమెరికా పశ్చిమ తీరం వెంట...

123
00:10:49,900 --> 00:10:54,780
అలల అడుగున ప్రశాంతత భారీ సముద్రజీవులకు

124
00:10:55,697 --> 00:10:57,824
అవకాశాన్ని తెరిచింది.

125
00:10:59,993 --> 00:11:01,995
సౌత్ ఈస్ట్ అలాస్కా
యు.ఎస్.ఎ

126
00:11:02,079 --> 00:11:03,580
వార్షిక సందర్శకులు 13 లక్షలు

127
00:11:03,664 --> 00:11:07,334
ఆహారం కోసం ప్రతి ఏడాదీ, 10,000లకు పైగా

128
00:11:07,417 --> 00:11:08,710
హంప్ బ్యాక్ తిమింగలాలు హవాయి నుండి

129
00:11:10,796 --> 00:11:14,633
ఈ అలాస్కా తీరాలకు వలస వస్తాయి.

130
00:11:23,183 --> 00:11:25,769
సాధారణంగా, ఈ జలాల్ని ఇవి ఏడాదికి
పది లక్షలమంది

131
00:11:25,853 --> 00:11:29,690
సందర్శకుల్ని మోసుకెళ్ళే ఓడలతో
పంచుకోవాల్సి ఉంటుంది.

132
00:11:36,280 --> 00:11:39,366
కానీ ఇప్పుడు ప్రతి ఓడ రద్దు కావడంతో...

133
00:11:40,284 --> 00:11:45,163
నీటి అడుగున 25 రెట్లు ప్రశాంతంగా మారింది.

134
00:11:46,832 --> 00:11:51,837
ఈ ప్రశాంతతలో, నీటి అడుగున
మైక్రోఫోన్లు వాడే శాస్త్రజ్ఞులు

135
00:11:51,920 --> 00:11:54,381
గొప్ప మార్పును రికార్డు చేశారు.

136
00:11:55,132 --> 00:11:58,427
హంప్ బ్యాక్ తిమింగలాలు ఒకదానితో ఒకటి
మరింత తరచుగా...

137
00:12:00,637 --> 00:12:02,806
కొత్త పద్ధతుల్లో మాట్లాడుకుంటున్నాయి.

138
00:12:04,725 --> 00:12:07,144
అదీ, ఈ తిమింగలాలు ఇంతసేపు
ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం...

139
00:12:07,227 --> 00:12:08,812
క్రిస్టీన్ గాబ్రియేల్
తిమింగలాల పరిశోధకురాలు

140
00:12:08,896 --> 00:12:11,315
...నిజానికి చాలా ఉత్సాహభరితంగా,
చెప్పాలంటే కదిలించేలా ఉంది.

141
00:12:11,982 --> 00:12:14,651
ఒకటి అరవగానే, ఆ తర్వాత ఒక తల్లి, పిల్ల.

142
00:12:14,735 --> 00:12:16,570
నా ఉద్దేశం, నేను ఇంతవరకూ అలాంటిది వినలేదు.

143
00:12:18,113 --> 00:12:21,074
ఒక రద్దీగా ఉన్న బార్లో
మీ స్నేహితులతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే

144
00:12:21,158 --> 00:12:22,492
ఎలా ఉంటుందో ఊహించుకోండి.

145
00:12:22,576 --> 00:12:25,162
కష్టంగా ఉంటుంది, ఎక్కువగా మాట్లాడరు,
మాట్లాడాలని అనుకున్నా, అరవాల్సి వస్తుంది.

146
00:12:25,245 --> 00:12:26,246
డాక్టర్ సుజీ టీర్లింక్
తిమింగలాల పరిశోధకురాలు

147
00:12:26,330 --> 00:12:28,999
కానీ ఒకవేళ మీరు నిశ్శబ్దంగా,
ప్రశాంతంగా ఉన్న

148
00:12:29,082 --> 00:12:30,751
కాఫీ షాపులో కూర్చుని ఉంటే,

149
00:12:30,834 --> 00:12:34,880
మీరు మరింత విస్తృతమైన,
మంచి సంభాషణ చేయగలుగుతారు.

150
00:12:38,842 --> 00:12:41,720
కానీ మరింత ఆశ్చర్యానికి
గురిచేసే విషయం ఒకటి ఉంది.

151
00:12:45,182 --> 00:12:50,270
ఇప్పుడు తిమింగలాలు, మరింత దూరప్రాంతాలకు
ఎలాంటి అంతరాయాలు లేకుండా సంభాషించగలవు.

152
00:12:50,854 --> 00:12:55,067
ఇలాంటి కొన్ని తల్లులు, తమ పిల్లలను
ఒంటరిగా వదిలివెళతాయి.

153
00:12:55,901 --> 00:12:58,403
ఎంతో అరుదైన దృశ్యం.

154
00:13:01,823 --> 00:13:03,825
తల్లి ఇపుడు ఆహార వేటకోసం వెళ్ళగలదు,

155
00:13:03,909 --> 00:13:09,164
అవసరమైనపుడు తన పిల్ల పిలిచే పిలుపు తనకు
వినబడుతుందనే నమ్మకం ఇప్పుడు దానికి ఉంది.

156
00:13:15,546 --> 00:13:18,841
పాలిచ్చే తల్లి వీలైనంత ఎక్కువగా
తినాల్సి ఉంటుంది,

157
00:13:20,092 --> 00:13:24,096
అందుకు ఉత్తమ మార్గం మిగిలిన
పెద్ద తిమింగలాలతో కలిసి వేటాడటం.

158
00:13:30,143 --> 00:13:32,271
తిమింగలాలు నీటి అడుగుకు డైవ్ చేసి...

159
00:13:34,439 --> 00:13:36,984
వృత్తాకారంలో నీటి బుడగలను ఊదుతాయి...

160
00:13:39,152 --> 00:13:42,030
భారీ మొత్తంలో చేపలు ఒకచోట
పోగయ్యేలా చేసి...

161
00:13:44,825 --> 00:13:47,786
వేలాదిగా నోట్లో కుక్కేసుకుంటాయి.

162
00:13:53,333 --> 00:13:56,545
ప్రకృతిలోని రమణీయ దృశ్యాలలో ఇదీ ఒకటి.

163
00:14:10,017 --> 00:14:12,186
ప్రశాంతత తోడురాగా,

164
00:14:12,269 --> 00:14:17,024
హంప్ బ్యాక్ తల్లులు ఈ విధంగా మరింత తరచుగా
జట్టు కట్టి సహకరించుకోగలుగుతున్నాయి.

165
00:14:18,025 --> 00:14:20,402
ఈ ఏడాది, అవి యదేచ్ఛగా తిరగగలుగుతున్నాయి.

166
00:14:20,485 --> 00:14:24,114
కోరుకున్నది, కోరుకున్న చోట,
కోరుకున్నప్పుడల్లా చేస్తున్నాయి.

167
00:14:24,781 --> 00:14:26,283
గత సంవత్సరాల్లో,

168
00:14:26,366 --> 00:14:30,370
అతికొద్దిగా ఏడు శాతం పిల్లలు మాత్రమే
పెద్దవి కాగలుగుతున్నాయి.

169
00:14:31,538 --> 00:14:35,709
కానీ ఈ సీజన్ లో, మరెన్నో మనగలగడానికి
అన్ని అవకాశాలూ ఉన్నాయి.

170
00:14:37,836 --> 00:14:40,964
గత కొద్ది ఏళ్ళుగా తిమింగలాల మనుగడ
ప్రశ్నార్థకం అవుతున్న...

171
00:14:41,048 --> 00:14:42,299
జానెట్ నీల్సన్
తిమింగలాల పరిశోధకురాలు

172
00:14:42,382 --> 00:14:45,761
...ఈ అత్యవసర తరుణంలో, ఈ మహమ్మారి
వాటికి కొంత సాంత్వన చేకూర్చింది.

173
00:14:49,348 --> 00:14:54,561
నీటి అడుగున శబ్ద స్థాయుల్లో
కలిగిన మార్పులు అలాస్కాను దాటిపోయాయి.

174
00:14:57,064 --> 00:15:02,903
లాక్ డౌన్ మొదలైన మూడునెలల్లో ప్రపంచవ్యాప్త
షిప్పింగ్ ట్రాఫిక్ 17 శాతం పడిపోయింది,

175
00:15:03,695 --> 00:15:07,115
అన్ని మహా సముద్రాలలో
జీవుల జీవితాలు మెరుగుపడ్డాయి.

176
00:15:07,199 --> 00:15:10,160
హర్రాకి గల్ఫ్
న్యూజిలాండ్

177
00:15:11,453 --> 00:15:13,539
న్యూజిలాండ్ తీరాల్లో ఉన్న డాల్ఫిన్స్

178
00:15:13,622 --> 00:15:16,250
అవి కమ్యూనికేషన్ చేసే దూరాన్ని మూడురెట్లు
పెంచుకున్నాయి.

179
00:15:20,003 --> 00:15:21,338
శాలిష్ సముద్రం
కెనడా

180
00:15:21,421 --> 00:15:26,552
వ్యాంకోవర్లో ఓడల రొద నాలుగు
రెట్లు తగ్గిందనీ, తద్వారా కిల్లర్ వేల్స్

181
00:15:27,219 --> 00:15:30,264
సోనార్ సాయంతో మరింత సమర్థవంతంగా

182
00:15:30,347 --> 00:15:33,016
వేటాడగలుగుతున్నాయని పరిశోధకులు
రికార్డు చేశారు.

183
00:15:48,407 --> 00:15:51,201
మహమ్మారి బారినపడి మూడు నెలలైంది.

184
00:15:51,285 --> 00:15:52,452
3 నెలలు

185
00:15:52,536 --> 00:15:57,332
యునైటెడ్ స్టేట్స్ లో, దాదాపు సగం మంది
ఉద్యోగులు ఇంటి దగ్గరనుండి పనిచేస్తున్నారు.

186
00:15:57,416 --> 00:16:01,044
ప్రపంచవ్యాప్తంగా,
పావు భాగం వ్యాపారాలు మూతపడ్డాయి.

187
00:16:03,005 --> 00:16:06,925
బార్లు, రెస్టారెంట్లు, కెఫెలు
తాత్కాలికంగా మూతబడ్డాయి.

188
00:16:07,885 --> 00:16:12,514
అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే,
రిటైల్ వ్యాపారం మూతపడింది.

189
00:16:13,599 --> 00:16:17,311
అంతా వదిలివేసినట్లుగా,
చుట్టూ ఎవ్వరూ లేనట్లుగా అనిపిస్తోంది.

190
00:16:18,395 --> 00:16:20,731
ప్రపంచంలో ప్రముఖ నగరాలన్నింటిలో,

191
00:16:20,814 --> 00:16:24,985
ప్రజలు నడవడం 90 శాతానికి పైగా
తగ్గిపోయింది.

192
00:16:27,196 --> 00:16:29,531
పట్టణ కేంద్రాలు ఎడారుల్లా మారిపోగానే...

193
00:16:29,615 --> 00:16:31,450
నగర జీవనాన్ని

194
00:16:31,533 --> 00:16:35,370
తమకు అనుగుణంగా మార్చుకున్న జంతువుల
అరుదైన చిత్రాలు బయటపడ్డాయి.

195
00:16:37,039 --> 00:16:39,041
సెయింట్ లూసియా
సౌత్ ఆఫ్రికా

196
00:16:39,124 --> 00:16:42,169
గ్యాస్ స్టేషన్ కి విచ్చేసిన ఒక హిప్పో.

197
00:16:46,173 --> 00:16:47,424
టెల్ అవివ్
ఇస్రాయిల్

198
00:16:47,508 --> 00:16:50,219
స్థానిక పార్కులో ఎంజాయ్ చేస్తున్న నక్కలు.

199
00:16:53,847 --> 00:16:55,057
శాన్ టియాగో
చిలీ

200
00:16:55,140 --> 00:16:58,101
పేవ్మెంట్ మీద చక్కర్లు కొడుతున్న
చిరుతపులి.

201
00:17:06,068 --> 00:17:10,196
అయితే ఒక జంతువు మాత్రం తనదైన చాతుర్యంతో,
ఈ నిర్మానుష్యమైన

202
00:17:10,280 --> 00:17:12,657
నగర ప్రాంతాలకు అనుగుణంగా మారిపోయింది.

203
00:17:16,869 --> 00:17:19,205
నారా
జపాన్

204
00:17:19,289 --> 00:17:22,084
వార్షిక సందర్శకులు కోటీ 30 లక్షలు

205
00:17:25,253 --> 00:17:29,591
సుమారు 1300 సంవత్సరాలుగా,

206
00:17:29,675 --> 00:17:32,845
నారా నగరం సికా జింకలకు నిలయం.

207
00:17:36,223 --> 00:17:39,059
ఆహారం కోసం అవి ఆధారపడిన పచ్చిక బయళ్ళలో
అధికభాగాన్ని

208
00:17:39,142 --> 00:17:41,812
బిల్డింగులు ఆక్రమించాయి.

209
00:17:41,895 --> 00:17:45,440
సాధారణంగా సిగ్గరులైన ఈ జంతువులు
ఒక పరిష్కారాన్ని కనిపెట్టాయి.

210
00:17:48,735 --> 00:17:55,367
నారా దేవాలయాల్ని సందర్శించే కోటీ 30 లక్షల
మందిని ఈ జింకలు లక్ష్యంగా చేసుకున్నాయి...

211
00:17:56,952 --> 00:17:59,955
కాస్తంత గౌరవాన్ని ప్రదర్శిస్తే చాలు,
బోలెడు రుచికరమైన...

212
00:18:02,082 --> 00:18:03,917
తినుబండారాలు దొరుకుతాయని గ్రహించాయి.

213
00:18:08,463 --> 00:18:13,010
బియ్యపు పొట్టుతో చేసే బిస్కెట్లు
వాటి ఆహారంలో కీలక భాగం అయ్యాయి.

214
00:18:22,978 --> 00:18:25,522
కానీ ఈ పరిస్థితిని మహమ్మారి మార్చివేసింది.

215
00:18:32,154 --> 00:18:35,699
రాత్రికి రాత్రే వాటికిష్టమైన తినుబండారాలు
అదృశ్యం అయ్యాయి.

216
00:18:40,996 --> 00:18:44,208
జనం లేకపోతే బిస్కెట్లు
ఎక్కడినుండి వస్తాయి.

217
00:18:53,133 --> 00:18:56,678
జింకలు తిండిలేక అల్లాడే
పరిస్థితి రావొచ్చు.

218
00:18:56,762 --> 00:19:00,974
కానీ పాతతరంలో ఉన్న కొన్నిటికి
ఒక ప్లాన్ సిద్ధంగా ఉంది.

219
00:19:06,104 --> 00:19:10,025
దేవాలయం ప్రాంగణం నుండి ఒక గుంపుకి
బయటికి దారి చూపించాయి.

220
00:19:10,526 --> 00:19:12,945
కానీ ఎక్కడికి వెళుతున్నాయో
వాటికి తెలిసినట్లే కనబడుతోంది.

221
00:19:21,161 --> 00:19:23,789
అవి ఒక పెద్ద రోడ్డు దిగువకు...

222
00:19:26,124 --> 00:19:29,336
నగరంలోని నిర్మాణాల లోతుల్లోకి
చొచ్చుకుపోయాయి.

223
00:19:40,889 --> 00:19:44,643
కానీ విస్తరించిన ఈ పట్టణంలో
వాటికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది?

224
00:19:52,734 --> 00:19:55,153
రెండున్నర కిలోమీటర్లు నడిచిన తర్వాత...

225
00:19:56,989 --> 00:19:58,991
ఆ గుంపు ఒక చోట ఆగింది.

226
00:20:04,454 --> 00:20:09,459
ప్రశాంతమైన ఈ ప్రాంతం ఒకప్పుడు
అవి పచ్చిక మేసిన మైదానాల్లో ఒక భాగం.

227
00:20:10,586 --> 00:20:12,713
ఆశ్చర్యకరంగా, ఒకప్పుడు అది తాము గడ్డిమేసిన

228
00:20:12,796 --> 00:20:16,592
ప్రాంతమని ఈ ముసలి జింకకి గుర్తుంది.

229
00:20:23,807 --> 00:20:26,268
వాటికి కావలసినవన్నీ అది అందించింది:

230
00:20:26,852 --> 00:20:30,439
స్వచ్ఛమైన గడ్డి, ఆకులు, మూలికలు.

231
00:20:35,152 --> 00:20:36,570
తరువాతి వారాలలో,

232
00:20:36,653 --> 00:20:41,992
అవి ఇప్పటికీ మిగిలిఉన్న ఈ భూభాగంపై
ఆధారపడతాయి.

233
00:20:44,286 --> 00:20:48,207
జనం లేకపోవడం వల్ల మరో ఉపయోగం జరిగింది.

234
00:20:50,250 --> 00:20:55,589
ఈ కొత్త డైట్ వాటిని ఆరోగ్యకరంగా మార్చిందని
శాస్త్రజ్ఞులు కనుగొన్నారు...

235
00:20:57,674 --> 00:21:01,678
తక్కువ సందర్శకులుంటే
తక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలుంటాయి,

236
00:21:02,346 --> 00:21:04,056
అవి జింకల్ని చంపగలవు.

237
00:21:09,728 --> 00:21:13,273
మన ఉనికి కారణంగా జంతువులు ప్రయోజనం
పొందుతున్నట్లు కనిపించినప్పటికీ...

238
00:21:16,109 --> 00:21:19,738
ఎక్కువ సందర్భాల్లో,
మనం లేకుంటేనే అవి సంతోషంగా జీవిస్తాయి.

239
00:21:30,958 --> 00:21:33,085
లాక్ డౌన్ మొదలై నాలుగు నెలలు పూర్తయ్యాయి,
మనం లేని ప్రతిచోటా...

240
00:21:33,168 --> 00:21:35,128
బోనోస్ ఐరిస్ - అర్జెంటినా
జనాభా కోటీ 52 లక్షలు

241
00:21:35,212 --> 00:21:39,633
...మనం వదిలివేసిన చోటు జంతుజాలానికి
సరికొత్త అవకాశాలను తెరుస్తోంది.

242
00:21:46,765 --> 00:21:48,225
అర్జెంటినాలో...

243
00:21:49,268 --> 00:21:51,562
సాధారణంగా సిగ్గరులైన కేపిబారా

244
00:21:51,645 --> 00:21:55,524
ధనికుల అందమైన తోటల మీద దాడి చేశాయి...

245
00:21:57,317 --> 00:22:00,821
ఒకప్పుడు తమ ఇల్లైన చిత్తడి నేలపై
దాన్ని నిర్మించారు.

246
00:22:04,032 --> 00:22:08,829
వాస్తవానికి తమ సొంతమైన దాన్ని ఎంజాయ్
చేయనివ్వకుండా ఏదీ ఆపగలదని అనిపించడం లేదు.

247
00:22:27,472 --> 00:22:28,682
అదీ...

248
00:22:30,392 --> 00:22:31,727
దాదాపు ఏదీ ఆపలేదు.

249
00:22:39,234 --> 00:22:44,781
మన ఉనికి లేకుండా ఎంతకాలం ఉంటే,
అంత సాహసోపేతంగా జంతువులు తయారవుతాయి.

250
00:22:46,366 --> 00:22:49,995
ఆఫ్రికాలో సఫారీ సీజన్ రద్దయినప్పుడు...

251
00:22:50,954 --> 00:22:52,497
ఉమ్పుమలాంగా - సౌత్ ఆఫ్రికా
వార్షిక సందర్శకులు 42 లక్షలు

252
00:22:52,581 --> 00:22:55,417
…ఒక ప్రాణాంతక వేటగాడు నియమాలను
తిరగరాస్తుంది.

253
00:22:58,086 --> 00:23:01,006
ఈ లగ్జరీ లాడ్జి ఖాళీగా ఉంది.

254
00:23:02,841 --> 00:23:07,554
అయితే కొత్త అతిధులు రావడానికి
ఎంతో కాలం పట్టదు.

255
00:23:14,811 --> 00:23:18,065
వెర్వెట్ కోతులు స్విమ్మింగ్ పూల్ పక్కన
తిష్ట వేశాయి.

256
00:23:24,112 --> 00:23:26,615
మరోవైపు ఇంపాలా, ఇంకా న్యాలా యాంటలోప్

257
00:23:27,407 --> 00:23:29,993
సలాడ్ బార్ ని ఆక్రమించాయి.

258
00:23:34,039 --> 00:23:36,124
అయితే పూర్తిగా ఎదిగిన...

259
00:23:38,168 --> 00:23:42,589
ఒక మగ చిరుతపులి ఎంతోదూరంలో లేదు.

260
00:23:49,763 --> 00:23:54,685
సాధారణంగా ఈ నిశాచర వేటగాడు పగలు కనిపించడం

261
00:23:54,768 --> 00:23:57,062
చాలా ఆశ్చర్యకరమైన విషయం.

262
00:23:57,145 --> 00:23:59,898
మా చిత్ర బృందానికి మాత్రం కాదు.

263
00:24:00,524 --> 00:24:02,192
కదలకుండా నిలబడండి, గైస్.

264
00:24:41,356 --> 00:24:42,941
రస్సెల్ మెక్లాగ్లిన్
వైల్డ్ లైఫ్ కెమెరామెన్

265
00:24:43,025 --> 00:24:46,195
నా జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు
జరిగాయి, కానీ ఇది అన్నిటినీ మించిపోయింది.

266
00:24:50,699 --> 00:24:52,117
ఆఫ్రికా అంతటా,

267
00:24:52,201 --> 00:24:56,538
60% పైగా భూభాగాన్ని చిరుతపులులు మనుషులవల్ల
కోల్పోయాయి,

268
00:24:57,122 --> 00:24:59,875
వేటాడడం మరింత సవాలుగా మారిపోయింది.

269
00:25:02,503 --> 00:25:05,088
కానీ ఇక్కడ అతిధులు ఎవరూ లేకపోవడంతో,

270
00:25:05,672 --> 00:25:08,425
ఈ చిరుతపులికి అవకాశం కనిపించింది,

271
00:25:09,134 --> 00:25:13,180
దాని ప్రవర్తనలో అసాధారణమైన
మార్పు కనిపించింది.

272
00:25:17,059 --> 00:25:19,895
అది పగటిపూట వేటాడడం మొదలుపెట్టింది.

273
00:25:29,821 --> 00:25:32,157
కొన్నిసార్లు ప్రయత్నించాల్సి
వచ్చినప్పటికీ...

274
00:25:35,244 --> 00:25:36,912
ఎంతోసేపు కష్టపడాల్సిన అవసరం లేకుండానే...

275
00:25:38,455 --> 00:25:40,457
దాని కొత్త పథకం...

276
00:25:41,041 --> 00:25:42,251
ఫలించింది.

277
00:25:49,800 --> 00:25:51,593
గత 25 ఏళ్ళలో

278
00:25:51,677 --> 00:25:55,597
చిరుతపులుల సంఖ్య 30 శాతానికి పైగా
పడిపోయింది.

279
00:25:56,557 --> 00:26:02,271
కానీ దేన్నైనా తినగల ఈ సరికొత్త లాక్ డౌన్
బఫేని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూ,

280
00:26:02,354 --> 00:26:04,356
ఈ చిరుతపులి అభివృద్ధి చెందుతోంది.

281
00:26:05,023 --> 00:26:08,694
ఈ చోటు దాదాపు పూర్తిగా దాని ఇల్లులా
మారిపోయింది. దాని ప్రైవేటు రాజ్యం.

282
00:26:24,835 --> 00:26:27,921
మహమ్మారి మొదలై ఆరు నెలలు అయింది.

283
00:26:28,005 --> 00:26:29,965
6 నెలలు

284
00:26:30,048 --> 00:26:35,262
సెప్టెంబర్ నాటికి, 40 దేశాలకు పైగా
ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నాయి.

285
00:26:37,222 --> 00:26:41,393
దాదాపు 300ల కోట్లకు పైగా ప్రజల
దైనందిన కార్యకలాపాలు ఆగిపోయాయి.

286
00:26:42,311 --> 00:26:43,645
లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్స్,

287
00:26:43,729 --> 00:26:49,484
కాన్సర్ట్స్, పండుగలు వంటి
భారీగా జనం గుమిగూడే ప్రదేశాలు,

288
00:26:49,568 --> 00:26:54,573
వాక్సిన్ వంటి నమ్మదగ్గ చికిత్స దొరికేవరకూ
తిరిగి తెరుచుకోవు.

289
00:26:56,408 --> 00:26:59,161
మనం మన కొత్త జీవితానికి అలవాటు పడే సమయంలో,

290
00:26:59,995 --> 00:27:03,207
ప్రకృతి పునరుద్ధరణ కొనసాగుతుంది.

291
00:27:04,917 --> 00:27:06,168
గంగ
ఇండియా

292
00:27:06,251 --> 00:27:08,462
ఇండియాలో, గంగానదిలో

293
00:27:08,545 --> 00:27:12,674
80 శాతానికి పైగా
ఆక్సిజన్ స్థాయులు పెరిగాయి.

294
00:27:15,177 --> 00:27:16,386
అట్లాంటిక్ తీరం
మొరాకో

295
00:27:16,470 --> 00:27:18,847
ఆఫ్రికా అట్లాంటిక్ తీరంలో,

296
00:27:19,348 --> 00:27:25,270
నీటి స్వచ్ఛత దారుణమైన స్థితి నుండి
అద్భుతమైన స్థితికి శరవేగంగా మారింది.

297
00:27:29,900 --> 00:27:34,363
మనం ఇళ్ళలోంచి బయటికి రావడానికి
మరికొంత సమయం పడుతుంది కాబట్టి,

298
00:27:34,446 --> 00:27:37,366
ఈలోగా జీవజాతుల కొత్త తరం ప్రయోజనం
పొందబోతోంది.

299
00:27:37,449 --> 00:27:38,992
కేప్ టౌన్
సౌత్ ఆఫ్రికా

300
00:27:39,076 --> 00:27:40,077
జనాభా 47 లక్షలు

301
00:27:40,160 --> 00:27:42,579
ఇక్కడి సౌత్ ఆఫ్రికన్ తీరంలో,

302
00:27:42,663 --> 00:27:47,000
కొందరు కొత్త తల్లిదండ్రులు ఉదయం
ప్రయాణానికి సిద్ధమయ్యారు.

303
00:27:53,549 --> 00:27:56,385
ఆఫ్రికన్ జాకాస్ పెంగ్విన్స్.

304
00:28:05,561 --> 00:28:09,022
అవి మనుషుల పక్కనే
తమ ఇంటిని ఏర్పాటు చేసుకున్నాయి.

305
00:28:26,540 --> 00:28:28,500
బ్రీడింగ్ సీజన్లో,

306
00:28:28,584 --> 00:28:32,421
ప్రతి ఉదయం అవి సముద్రంలో
చేపలు పట్టడానికి బయలుదేరతాయి.

307
00:28:39,970 --> 00:28:42,389
వాటి కూనలకు ఆకలి మహా ఎక్కువ.

308
00:28:43,765 --> 00:28:48,687
ప్రతిరోజూ అవి తమ శరీర బరువులో
15 శాతం బరువున్న ఆహారం తినాలి.

309
00:28:51,523 --> 00:28:55,319
అదృష్టవశాత్తూ, జాకాస్ పెంగ్విన్స్
సమర్థవంతమైన వేటగాళ్ళు...

310
00:28:56,153 --> 00:28:58,572
80 మీటర్ల లోతుకు డైవ్ చేయగలవు

311
00:28:59,406 --> 00:29:03,076
బోలెడన్ని చేపలు, ఎండ్రకాయలతో
విందు చేసుకోవచ్చు.

312
00:29:09,333 --> 00:29:13,378
అయితే ఆహారాన్ని తమ కూనల వరకూ
చేర్చడం ఒక సమస్య.

313
00:29:18,675 --> 00:29:22,513
గత సంవత్సరాల్లో,
ఈ బీచులు జనంతో నిండిపోయి ఉండేవి.

314
00:29:23,639 --> 00:29:26,517
చేపలు పట్టి పెంగ్విన్లు తిరిగి
వచ్చేసరికి...

315
00:29:27,226 --> 00:29:29,478
అవి ఇంటికి వెళ్ళాల్సిన దారి
మూసుకుపోయి ఉండేది.

316
00:29:30,812 --> 00:29:34,399
సూర్యాస్తమయం అయ్యి, జనం ఇళ్ళకు చేరే వరకూ
అవి తీరంలోనే

317
00:29:36,527 --> 00:29:38,487
వేచి ఉండాల్సి వచ్చేది.

318
00:29:47,788 --> 00:29:51,834
కానీ ఈ ఏడాది, బీచి ఎడారిలా మారింది.

319
00:29:59,758 --> 00:30:02,427
పెంగ్విన్లు పాత రొటీన్ ని వదిలేసి,

320
00:30:02,511 --> 00:30:06,390
తమ కూనల కోసం కడుపునిండా చేపలతో,
సముద్రంలో కొద్ది గంటలు

321
00:30:07,349 --> 00:30:10,143
గడిపిన వెంటనే ఇంటికి తిరిగి రావడం
మొదలుపెట్టాయి.

322
00:30:16,900 --> 00:30:22,531
చీకటి పడేందుకు ఎంతో సమయం ఉండడంతో,
అవి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళగలవు.

323
00:30:28,453 --> 00:30:33,584
కూనలు ఇప్పుడు రోజుకు రెండు మూడుసార్లు
తినగలుగుతున్నాయి.

324
00:30:36,420 --> 00:30:39,339
అవి ఆరోగ్యంగా,
చాలా వేగంగా పెరగడం మాత్రమే కాదు,

325
00:30:39,423 --> 00:30:44,970
ఇలాంటి ఎన్నో కుటుంబాలు విజయవంతంగా
కవలలను పెంచుతున్నాయి.

326
00:30:46,930 --> 00:30:49,099
మరో శుభవార్త కూడా ఉంది.

327
00:30:49,183 --> 00:30:50,684
రాబోయే కొద్ది వారాల్లో,

328
00:30:50,767 --> 00:30:56,148
కొన్ని తల్లిదండ్రులు విజయవంతంగా
మరో రౌండ్ పిల్లల్ని కంటాయి,

329
00:30:56,690 --> 00:31:00,194
దశాబ్దకాలంలో ఇలాంటి సంఘటన జరగడం
ఇదే మొదటిసారి.

330
00:31:03,572 --> 00:31:06,909
ఎన్నో ఏళ్ళుగా పెంగ్విన్లు,
ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నట్లు

331
00:31:06,992 --> 00:31:08,911
భావించడం జరిగింది.

332
00:31:12,706 --> 00:31:17,169
కానీ వాస్తవానికి,
మనం వారి జీవితాల్ని కష్టతరం చేస్తున్నాం.

333
00:31:21,548 --> 00:31:24,426
గత 30 ఏళ్ళలో, సౌత్ ఆఫ్రికాలో

334
00:31:24,510 --> 00:31:28,597
పెంగ్విన్ల సంఖ్య దాదాపు 70 శాతానికి పైగా
పడిపోవడంతో...

335
00:31:30,599 --> 00:31:33,018
మనం వాటికి ఎంత సాయం చేయగలిగితే
అంత అవసరం.

336
00:31:42,069 --> 00:31:46,406
నగరాల్లో నివసిస్తున్న జంతువుల పిల్లలు
మాత్రమే అభివృద్ధి చెందడం లేదు.

337
00:31:48,075 --> 00:31:51,495
ఇప్పటికే, ఈ ఏడాది విధించిన ఆంక్షల ప్రభావం

338
00:31:51,578 --> 00:31:55,123
ప్రపంచంలోని క్రూరమైన ప్రాంతాల్లో కూడా
కనిపిస్తుంది.

339
00:31:55,207 --> 00:31:57,417
మాసాయి మారా - కెన్యా
వార్షిక సందర్శకులు 3,00,000లకు పైగా

340
00:31:57,501 --> 00:32:01,296
తన కూనల్ని కాపాడుకోవడం కోసం ఒక పులి
తన సామర్థ్యాన్ని రూపాంతరం చెందించుకుంది.

341
00:32:04,508 --> 00:32:05,759
చిరుత.

342
00:32:11,014 --> 00:32:13,851
భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తగల ప్రాణి.

343
00:32:30,200 --> 00:32:31,660
కానీ వాటికి ఒక బలహీనత ఉంది.

344
00:32:31,743 --> 00:32:36,999
సన్నని శరీరం కారణంగా
శత్రువులకు ఉండేంత బలం వాటికి ఉండదు,

345
00:32:38,959 --> 00:32:41,420
సింహాలు, హైనాల లాగా.

346
00:32:46,133 --> 00:32:48,635
అవి చిరుత సంపాదించిన ఆహారాన్ని దొంగిలించి,

347
00:32:49,386 --> 00:32:51,722
ఏ మాత్రం సంకోచించకుండా
దాని కూనను చంపేస్తాయి.

348
00:33:02,733 --> 00:33:05,444
చిరుతలు వాటి కంట్లో పడకుండా
కొంచెం తగ్గి ఉంటాయి.

349
00:33:08,155 --> 00:33:10,157
అయితే తిండి పెట్టాల్సిన రెండు కూనలు
ఉండడంతో,

350
00:33:10,949 --> 00:33:14,995
వీటి తల్లి ప్రతి రెండు లేదా మూడు
రోజులకొకసారి వేటాడాల్సి ఉంటుంది.

351
00:33:31,720 --> 00:33:33,013
అది వేటకు వెళ్ళినపుడు,

352
00:33:33,096 --> 00:33:37,059
దాని ఆరు నెలల వయసున్న కూనలు
పొడవాటి గడ్డిలో దాక్కుని ఉంటాయి.

353
00:33:40,145 --> 00:33:45,859
కానీ వేట పూర్తయిన వెంటనే,
అది సందిగ్ధంలో పడుతుంది.

354
00:33:50,781 --> 00:33:53,158
అది వాటికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉంది,

355
00:33:53,617 --> 00:33:56,328
చంపిన ప్రాణి శరీరం లాక్కెళ్ళలేనంత
పెద్దదిగా ఉంది.

356
00:33:58,247 --> 00:34:02,459
దాన్ని వదిలేసి వెళితే, దొంగతనానికి గురయ్యే
ప్రమాదం ఉంది.

357
00:34:05,963 --> 00:34:09,466
అందుకు పరిష్కారంగా అది మృదువుగా
కీచుగొంతుతో ఒక శబ్దం చేస్తుంది...

358
00:34:10,634 --> 00:34:12,386
...తన కూనల్ని అక్కడికి రమ్మనే పిలుపు అది.

359
00:34:15,179 --> 00:34:16,389
అది జాగ్రత్తగా ఉండాలి.

360
00:34:17,099 --> 00:34:19,476
పెద్ద గొంతుతో పిలిచినా,
ఎక్కువసార్లు పిలిచినా,

361
00:34:19,560 --> 00:34:23,146
రక్షణలేని తన కూనలు
శత్రువుల కంట్లో పడే ప్రమాదం ఉంది.

362
00:34:26,483 --> 00:34:28,569
ఇలాంటి సందర్భంలోనే

363
00:34:28,652 --> 00:34:32,114
కూనలు చిరుత అరుపును వినడం కష్టమయ్యే
పరిస్థితి ఎదురవుతుంది.

364
00:34:36,284 --> 00:34:38,704
లాక్ డౌన్ ముందు సంవత్సరాల్లో,

365
00:34:38,786 --> 00:34:42,666
మాసాయి మారాకు వచ్చే పర్యాటకులు
ఖచ్చితంగా చూడాలని కోరుకునే

366
00:34:42,748 --> 00:34:44,751
విషయాల్లో ఒకటి చిరుత వేట.

367
00:34:45,585 --> 00:34:49,965
కానీ వేటాడడం పూర్తి చేసిన తల్లి చిరుత
చుట్టూ ఉన్న జనం ఒక సమస్యగా మారారు.

368
00:34:51,842 --> 00:34:54,094
ఎంతో గందరగోళంగా ఉండేది.
వాహనాలు వెళ్ళడం, రావడం.

369
00:34:54,178 --> 00:34:55,387
సాలిమ్ మండేలా
చిరుత పరిశోధకుడు

370
00:34:55,971 --> 00:34:59,349
రేడియోలో గైడ్లు మాట్లాడుతూ ఉంటారు,
జనం ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటారు.

371
00:35:00,893 --> 00:35:02,936
ఆ గొడవలో తల్లి చిరుత కూనల కోసం

372
00:35:03,020 --> 00:35:05,397
పిలిచే అరుపులు వాటికి
వినిపించకుండా పోతాయి.

373
00:35:06,064 --> 00:35:07,816
మనుగడ కోసం చిరుత ఆధారపడే

374
00:35:07,900 --> 00:35:12,321
ప్రాకృతిక సంకేతాల్ని ఆ గందరగోళం
వినబడకుండా చేస్తుంది.

375
00:35:15,699 --> 00:35:20,662
పదేపదే పిలవాల్సి రావడం అంటే
శత్రువుల్ని ఆకర్షించడమే.

376
00:35:30,589 --> 00:35:32,174
కానీ ఈ ఏడాది...

377
00:35:32,257 --> 00:35:36,220
ఈ చిరుత తల్లికి మనుషుల వల్ల
ఎలాంటి అంతరాయం కలగడం లేదు.

378
00:35:41,517 --> 00:35:45,020
ఖాళీ సవానాలో కొన్నిసార్లు పిలవగానే...

379
00:35:49,066 --> 00:35:50,943
...దాని కూనలు తల్లి పిలుపును విన్నాయి...

380
00:35:57,282 --> 00:35:59,201
తల్లి దగ్గరికి చేరుకున్నాయి.

381
00:36:03,664 --> 00:36:06,333
తల్లులు కొద్దిసార్లు మాత్రమే
పిలవడాన్ని మేము గుర్తించాం.

382
00:36:06,416 --> 00:36:09,753
ఒకటి రెండు సార్లు పిలవగానే,
కూనలు వెంటనే స్పందించాయి.

383
00:36:12,214 --> 00:36:13,924
చుట్టూ జనం లేకపోవడంతో,

384
00:36:14,007 --> 00:36:17,386
చిరుత పిల్లలు ఆరోగ్యంగా పెరగడాన్ని
ఇప్పటికే పరిశోధకులు కనిపెట్టారు.

385
00:36:19,847 --> 00:36:23,725
కోవిడ్ ముందు,
మూడింటిలో ఒక కూన మాత్రమే బతికేది.

386
00:36:23,809 --> 00:36:25,811
కానీ ప్రస్తుతం మూడు నెలలు పైబడిన

387
00:36:25,894 --> 00:36:28,021
కూనలు ఎన్నో కనిపిస్తున్నాయి,

388
00:36:28,105 --> 00:36:29,815
అది ఏ విషయాన్ని స్పష్టం చేస్తోందంటే

389
00:36:29,898 --> 00:36:33,026
ఈసారి ఎక్కువ కూనలు బతికి బట్టకడతాయి,

390
00:36:33,110 --> 00:36:34,778
అంటే ఎక్కువ చిరుతలు.

391
00:36:37,739 --> 00:36:41,952
ఆఫ్రికాలో కేవలం సుమారు 7,000ల
చిరుతలు మాత్రమే మిగిలి ఉండడంతో...

392
00:36:43,954 --> 00:36:45,831
ప్రతి కూన విలువైనదే.

393
00:37:05,309 --> 00:37:08,395
మనుషులకు ఈ ఏడాది ఎన్నో సవాళ్ళు
విసురుతూనే ఉంది...

394
00:37:08,478 --> 00:37:09,813
బ్విండి నేషనల్ పార్క్
ఉగాండా

395
00:37:09,897 --> 00:37:11,565
…అంతరించే దశలో ఉన్న ఎన్నో,
ఎన్నెన్నో జంతువులు

396
00:37:11,648 --> 00:37:15,485
మనగలగడానికి గల అవకాశాలు పెరిగాయి.

397
00:37:20,532 --> 00:37:23,535
2020 సంవత్సరంలో తక్కువ అంతరాయం ఉండడంతో,

398
00:37:23,619 --> 00:37:24,912
ఇక్కడి మౌంటైన్ గొరిల్లాలు

399
00:37:24,995 --> 00:37:28,665
పిల్లలకంటే రెట్టింపు పిల్లలకు
జన్మనిచ్చాయి.

400
00:37:34,588 --> 00:37:36,089
ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో...

401
00:37:36,173 --> 00:37:37,174
డోర్సెట్
ఇంగ్లాండ్

402
00:37:37,257 --> 00:37:42,679
...గత పదేళ్ళలో చూడని విధంగా అరుదైన
స్పైనీ సీ హార్సెస్ సంఖ్య బాగా పెరిగింది

403
00:37:43,180 --> 00:37:48,602
పడవల వల్ల వాటి సీ గ్రాస్ ఇంటికి
కలిగిన నష్టం నుండి కోలుకుంది.

404
00:37:54,024 --> 00:37:55,359
లైకిపియా
కెన్యా

405
00:37:55,442 --> 00:37:58,695
కెన్యాలో, కొమ్ముల కోసం ఈ ఏడాది
ఒక్క రైనో కూడా చంపబడలేదు.

406
00:37:59,363 --> 00:38:02,699
1999 తర్వాత ఇదే మొదటిసారి.

407
00:38:11,416 --> 00:38:14,086
లాక్ డౌన్ మొదలయ్యి పూర్తిగా
ఒక ఏడాది పూర్తయింది.

408
00:38:14,169 --> 00:38:15,337
12 నెలలు

409
00:38:15,420 --> 00:38:20,217
మనలో ఎక్కువమంది సహజ ప్రపంచంలో
సౌకర్యాన్ని పొందిన సంవత్సరం.

410
00:38:20,926 --> 00:38:25,848
ప్రపంచం ఎన్నో అసాధారణ మార్పులకు
గురైన సంవత్సరం.

411
00:38:29,059 --> 00:38:32,187
ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్
వార్షిక ఉద్గారాలు

412
00:38:32,271 --> 00:38:35,023
ఆరు శాతానికి పైగా పడిపోయాయి,

413
00:38:35,107 --> 00:38:37,568
ఆ స్థాయిలో తగ్గుదల ఇంతవరకూ జరగలేదు.

414
00:38:39,486 --> 00:38:43,824
అలాగే భూమి ఉపరితలం అడుగున కూడా ఎన్నో
గుర్తించదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి.

415
00:38:44,825 --> 00:38:48,620
ప్రయాణాల వల్ల, పరిశ్రమల వల్ల కలిగే
ప్రకంపనలు సగానికి తగ్గడంతో,

416
00:38:48,704 --> 00:38:53,458
నమోదైన చరిత్రలో ఈ కాలం భూగర్భం అత్యంత
ప్రశాంతంగా ఉన్నకాలం.

417
00:38:57,796 --> 00:39:00,716
అయితే ఈ లాక్ డౌన్ ప్రభావం ఎంతోకాలం నిలవదు.

418
00:39:02,217 --> 00:39:05,637
ప్రకృతితో మెరుగైన సహజీవనం చేసే
మార్గాలు కనిపెట్టేందుకు

419
00:39:05,721 --> 00:39:09,474
ఈ మార్పుల నుండి ఎలాంటి ప్రేరణ తీసుకోవచ్చు?

420
00:39:14,396 --> 00:39:17,900
ఇండియాలో, ఇప్పటికే కొందరు ఈ అవకాశాన్ని
ఉపయోగించుకుని,

421
00:39:17,983 --> 00:39:19,693
కొన్ని శక్తివంతమైన,

422
00:39:19,776 --> 00:39:24,156
అంతరించే దశలో ఉన్న జంతువులతో మరింత
సామరస్యంతో జీవించే ప్రయత్నం చేస్తున్నారు.

423
00:39:27,659 --> 00:39:32,164
అస్సాం - ఇండియా
జనాభా మూడుకోట్ల 60 లక్షలు

424
00:39:33,582 --> 00:39:35,626
పూర్తిగా ఎదిగిన ఆసియా ఏనుగు

425
00:39:35,709 --> 00:39:40,380
ప్రతిరోజూ 150 కిలోల ఆహారం
తినాల్సి ఉంటుంది.

426
00:39:41,590 --> 00:39:45,010
కానీ వాటి సహజ ఆవాసాల్లో కేవలం
ఐదు శాతం మాత్రమే మిగిలి ఉండడంతో,

427
00:39:45,594 --> 00:39:48,972
వాటి అరణ్య భూమి వ్యవసాయ భూములుగా
మార్చబడడంతో...

428
00:39:49,056 --> 00:39:53,685
మనుగడ కోసం ఏనుగులు ఇక్కడి పంటలపై
దాడి చేస్తాయి.

429
00:40:05,989 --> 00:40:10,035
బదులుగా, రైతులు వాటిని పొలాల నుండి
తరిమేస్తారు.

430
00:40:11,453 --> 00:40:17,376
కానీ ఇప్పటికీ వారు తమ వరి పంటలలో
సగభాగాన్ని కోల్పోవాల్సి వస్తోంది.

431
00:40:30,138 --> 00:40:32,057
మేము రాత్రి మొత్తం వాటిని

432
00:40:32,140 --> 00:40:33,892
అడవిలోకి తరిమేస్తూ గడుపుతూ ఉంటాం.

433
00:40:33,976 --> 00:40:35,394
కానీ అవి తిరిగి వస్తాయి...

434
00:40:35,477 --> 00:40:36,478
భాష్కర్ బారా

435
00:40:36,562 --> 00:40:39,606
...మేము మళ్ళీ అదే పని చేయాల్సి ఉంటుంది.

436
00:40:53,745 --> 00:40:57,040
ప్రమాదంలో ఉన్నది కేవలం
పొలాలు మాత్రమే కాదు.

437
00:41:00,043 --> 00:41:03,630
ఏనుగులు ఆహారం కోసం వెతుకుతూ
గ్రామాల్లోకి కూడా వచ్చేస్తాయి

438
00:41:03,714 --> 00:41:06,341
ఆ క్రమంలో జనాన్ని తొక్కేస్తాయి.

439
00:41:11,054 --> 00:41:12,055
దేశవ్యాప్తంగా,

440
00:41:12,139 --> 00:41:15,809
సుమారు 400 మంది మనుషులు, వంద వరకూ ఏనుగులు

441
00:41:15,893 --> 00:41:18,896
ప్రతి ఏడాది, ఈ గొడవల్లో చనిపోతూ ఉంటాయి.

442
00:41:25,819 --> 00:41:28,864
కానీ ఒక కమ్యూనిటీ కొత్త పద్దతిని
అమలుచేయడం ద్వారా

443
00:41:28,947 --> 00:41:30,657
సమస్యను పరిష్కరించాలని అనుకుంటోంది.

444
00:41:31,241 --> 00:41:34,411
లాక్ డౌన్ వల్ల సిటీల నుండి ఇళ్ళకు తిరిగి
వచ్చిన వర్కర్లు

445
00:41:34,995 --> 00:41:37,289
స్థానిక పరిరక్షణ ట్రస్ట్ నేతృత్వంలో

446
00:41:37,372 --> 00:41:41,627
చేపట్టిన ప్రాజెక్ట్ కోసం అవసరమైన అదనపు
సాయం చేయగలరు.

447
00:41:43,253 --> 00:41:45,130
లాక్ డౌన్లో మాకో గొప్ప అవకాశం దొరికింది...

448
00:41:45,214 --> 00:41:46,215
మేఘన హజారికా
పరిరక్షకురాలు

449
00:41:46,298 --> 00:41:50,010
...అడవి ఏనుగుల కోసం మొక్కలు నాటడం.

450
00:41:51,803 --> 00:41:54,890
అడవి వెంట,
వాళ్ళు కొంత భూభాగంలో వేగంగా పెరిగే

451
00:41:54,973 --> 00:42:00,020
బియ్యం, గడ్డి మొక్కలను ఏనుగులు
తినడం కోసం నాటారు.

452
00:42:02,814 --> 00:42:07,402
500 మందికి పైగా కమ్యూనిటీ
మొత్తం వచ్చి సహాయం చేశారు.

453
00:42:07,486 --> 00:42:08,529
డులు బోరా
పరిరక్షకుడు

454
00:42:09,279 --> 00:42:11,031
కొద్ది నెలల్లోనే,

455
00:42:11,114 --> 00:42:17,329
తమ భూమిలో దాదాపు 400 ఎకరాలను మార్చి,
1.6 చదరపు కిలోమీటర్ల మేర కేటాయించారు.

456
00:42:19,373 --> 00:42:22,459
ఇప్పుడు ఏనుగులను తరిమివేయడానికి బదులుగా

457
00:42:22,543 --> 00:42:25,379
వాటిని స్వాగతిస్తూ వేడుక
నిర్వహిస్తున్నారు.

458
00:42:34,346 --> 00:42:36,598
పంటలు కోతకు వచ్చాయి.

459
00:42:38,225 --> 00:42:41,854
అయితే ఏనుగులు వాటి కోసం
నాటిన గడ్డిని తింటాయా...

460
00:42:43,897 --> 00:42:46,650
...లేక రైతుల పొలాలపై దాడి చేస్తాయా?

461
00:42:51,530 --> 00:42:53,532
జనం ఇంటికి వచ్చిన అనంతరం...

462
00:42:54,950 --> 00:42:58,537
అడవి అంచున ఏదో అలజడి మొదలయింది.

463
00:43:06,712 --> 00:43:11,925
ఒకదాని తర్వాత ఒకటిగా, చెట్ల చాటు నుండి
ఏనుగులు బయటికి వచ్చాయి.

464
00:43:14,928 --> 00:43:16,263
తల్లులు.

465
00:43:17,764 --> 00:43:19,266
కూనలు.

466
00:43:19,349 --> 00:43:24,354
26 ఆకలిగొన్న ఏనుగుల విస్తారమైన కుటుంబం.

467
00:43:26,690 --> 00:43:28,358
కానీ అవి ఎంతదూరం వస్తాయి?

468
00:43:33,739 --> 00:43:36,575
అడవి అంచు వెంబడే నిలబడి...

469
00:43:38,076 --> 00:43:42,915
వాటికోసం నాటిన మొక్కలను మాత్రమే
అవి తినడం మొదలుపెట్టాయి.

470
00:43:46,126 --> 00:43:48,795
గతంలో మేము వాటిని తరిమేసే వాళ్ళం.

471
00:43:48,879 --> 00:43:50,881
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

472
00:43:50,964 --> 00:43:54,259
ఇది బాగుంది... సంతోషంగా అనిపిస్తోంది.

473
00:43:59,181 --> 00:44:01,767
కోతల కాలం గడుస్తున్న కొద్దీ...

474
00:44:01,850 --> 00:44:06,438
ఏనుగులు రైతుల పొలాల మీదకు రాలేదు

475
00:44:07,064 --> 00:44:08,982
గ్రామంలోకి కూడా రాలేదు.

476
00:44:12,486 --> 00:44:14,613
మనం ఏనుగులను ప్రేమిస్తే

477
00:44:14,696 --> 00:44:17,574
అవి తిరిగి మనల్ని ప్రేమిస్తాయి.

478
00:44:21,203 --> 00:44:22,955
అదనపు భూభాగంలో నాటిన పంట

479
00:44:23,038 --> 00:44:25,165
ఎంతో కాలంగా ఉన్న సమస్యకు దీర్ఘకాల

480
00:44:25,249 --> 00:44:27,459
పరిష్కారం చూపింది.

481
00:44:29,920 --> 00:44:32,005
ఈ పద్ధతిని ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలు

482
00:44:32,089 --> 00:44:36,844
కూడా అవలంబించడం కోసం స్థానిక
పరిరక్షణ ట్రస్ట్ ని సంప్రదిస్తున్నాయి.

483
00:44:50,274 --> 00:44:53,026
గత ఏడాదిలోకి వెనుదిరిగి చూస్తే...

484
00:44:53,110 --> 00:44:56,530
మనుషులకు ఎంతో కష్టంగా గడిచినప్పటికీ...

485
00:44:56,613 --> 00:45:01,201
ప్రకృతి ప్రపంచాన్ని, మన భవిష్యత్తుని
కాపాడుకోవడం కోసం...

486
00:45:01,285 --> 00:45:02,911
మనం ఏం నేర్చుకోగలం?

487
00:45:05,622 --> 00:45:09,001
మనం కలిసిమెలిసి ఎలా జీవించాలో ఆలోచించాలి.

488
00:45:10,085 --> 00:45:14,214
వన్యప్రాణులతో మనచోటును
పంచుకోవచ్చనే స్పృహ అందరిలో కలిగించాలి.

489
00:45:14,882 --> 00:45:16,508
మనం తిరిగి అవే తప్పుల్ని

490
00:45:16,592 --> 00:45:19,344
చేయకూడదనే జ్ఞానం మనలో కలగాలి.

491
00:45:21,263 --> 00:45:25,184
ప్రకృతి స్పందించిన తీరు, వేగం చూస్తే...

492
00:45:25,267 --> 00:45:29,021
మన జీవితాల్లో చేసే
చిన్న చిన్న మార్పులు కూడా...

493
00:45:29,104 --> 00:45:33,650
ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులలో
గొప్ప మార్పును తీసుకొస్తాయని తెలుస్తోంది.

494
00:45:37,487 --> 00:45:41,158
ప్రతి వేసవిలో కొంతకాలం నిషేధం విధించవచ్చు.

495
00:45:41,241 --> 00:45:44,077
రాత్రిళ్ళు బీచుల్ని మూసేయచ్చు.
పగలు మూయాల్సిన పనిలేదు.

496
00:45:44,161 --> 00:45:47,039
మనుషులు, జంతువులు కలిసి విజయవంతంగా

497
00:45:47,122 --> 00:45:50,417
బతకడానికి మనుషులు చేసే చిన్న
మార్పులు చాలు.

498
00:45:51,627 --> 00:45:54,546
ఓడల్ని నెమ్మదిగా వెళ్ళమని చెప్పొచ్చు,

499
00:45:54,630 --> 00:45:58,342
ఒకే గుంపుగా వెళ్ళడం ద్వారా వాటి
ప్రభావం తగ్గించవచ్చు

500
00:45:58,425 --> 00:46:01,428
నీటి అడుగున అవిచేసే శబ్దాలను, తిమింగలాలను
రక్షించవచ్చు.

501
00:46:02,304 --> 00:46:05,057
సందర్శకులు, టూర్ గైడ్లు మంచి ప్రవర్తన
కలిగి ఉండేలా

502
00:46:05,140 --> 00:46:10,437
వారికి సూచనలు చేయాలని మేము పార్క్
అధికారులను కోరుతున్నాం

503
00:46:10,521 --> 00:46:12,981
అప్పుడే ఈ జంతువుల మనుగడ నిశ్చయమవుతుంది.

504
00:46:14,066 --> 00:46:18,403
ఈ అసాధారణమైన సంవత్సరం,
'భూమి మారిన సంవత్సరం',

505
00:46:18,987 --> 00:46:22,741
వన్యప్రాణులు అభివృద్ధి చెందేందుకు
మనం సాయం చేయగలమని మాత్రమే కాక,

506
00:46:23,534 --> 00:46:25,661
మనం తలచుకుంటే,

507
00:46:26,245 --> 00:46:30,165
ఈ గ్రహాన్ని ఆరోగ్యకరంగా కూడా మార్చగలమని
తెలియజేస్తోంది.

508
00:46:31,375 --> 00:46:33,544
ఇప్పటికీ సమయం మించిపోలేదు

509
00:46:33,627 --> 00:46:37,965
కాలుష్యం తగ్గించడానికి మనం ఎంత వీలైతే
అంత తోడ్పాటు అందించాలి.

510
00:46:38,715 --> 00:46:42,302
సహజ ప్రపంచానికి దూరంగా కాకుండా...

511
00:46:44,096 --> 00:46:48,725
మన జీవితాలు లోతుగా, ఆశ్చర్యకరమైన రీతుల్లో
ఒకదానితో ఒకటి

512
00:46:48,809 --> 00:46:51,311
ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నాం.

513
00:46:53,355 --> 00:46:55,816
మనం భవిష్యత్తులో మనగలగాలంటే,

514
00:46:55,899 --> 00:46:58,902
మన గ్రహాన్ని మనతో పాటు భూమ్మీది
ప్రాణులన్నింటితో

515
00:46:59,736 --> 00:47:02,573
పంచుకునే పద్ధతులను కనిపెట్టేందుకు...

516
00:47:04,491 --> 00:47:06,869
ఇదే సరైన సమయం.

517
00:48:11,517 --> 00:48:13,519
సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ



