1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:18,240 --> 00:00:20,760
ఫుట్‌బాల్ ఈ దేశంలో మతం లాంటిది.

4
00:00:22,880 --> 00:00:25,760
నాకు తెలిసిన అందరూ ఏఫ్ఎల్ ఫుట్‌బాల్ ఆడారు.
నీవూ ఆడావు.

5
00:00:27,240 --> 00:00:28,120
నాకు ప్రతిభ ఉంది.

6
00:00:29,240 --> 00:00:31,720
నేను పడిన కష్టానికి, నా త్యాగానికి

7
00:00:31,800 --> 00:00:33,880
నాకు ఎలాంటి చింత లేదు.

8
00:00:35,120 --> 00:00:37,960
ఓలాఫ్లిన్, రెండుసార్లు
ఆల్ ఆస్ట్రేలియా ఆటగాడు.

9
00:00:38,040 --> 00:00:39,280
ఎంతో గొప్ప ఆటగాడు.

10
00:00:39,360 --> 00:00:41,400
నేను ఒక ఆట తరువాత, మరొకటి ఆడాను.

11
00:00:41,480 --> 00:00:44,800
ఇండిజీనస్ టీమ్ ఆఫ్ ద సెంచరీ స్టార్‌కు
500వ గోల్.

12
00:00:44,880 --> 00:00:46,840
మైఖేల్ ఓలాఫ్లిన్, అత్యత్భుతం.

13
00:00:47,640 --> 00:00:49,080
అది మా జీవితాన్ని మార్చింది.

14
00:00:49,640 --> 00:00:53,560
మైఖేల్ ఓలాఫ్లిన్‌కు ఎంతో అద్భుతమైన రోజు,
అతను సిడ్నీ స్వాన్స్‌కు

15
00:00:53,640 --> 00:00:55,520
300 ఆటలు ఆడిన మొదటి వ్యక్తి.

16
00:00:55,600 --> 00:00:57,320
ఆటలు మనుషులను దగ్గర చేస్తాయి.

17
00:00:59,160 --> 00:01:02,440
ఏఎఫ్ఎల్ ఫుట్‌బాల్ అనే ఆటను ఆడుతున్నాము.

18
00:01:04,600 --> 00:01:08,320
మైదానంలో ఉన్నప్పుడు,
మీరు కుటుంబానికి, సమాజానికి ప్రతినిధులు.

19
00:01:09,520 --> 00:01:12,080
అది భారం కాదు,
అది అద్భుతం, నాకు శక్తినిచ్చేది.

20
00:01:19,600 --> 00:01:22,160
ఆస్ట్రేలియాలో జాతి వివక్షత
ఇంకా సజీవంగా ఉంది...

21
00:01:22,240 --> 00:01:26,040
మైదానంలో జరిగేది, సమాజంలో జరిగేదానికి

22
00:01:26,120 --> 00:01:28,840
అంటే కంచెకు అవతల జరిగేదాని ప్రతిబింబం.

23
00:01:30,000 --> 00:01:32,920
ఆదిమవాసులు కాని చాలామంది,
"దానిని అధిగమించు" అంటారు.

24
00:01:33,000 --> 00:01:36,560
అది ఎల్లవేళలా జరుగుతుంటే
దాన్ని అధిగమించ లేరు.

25
00:01:36,640 --> 00:01:38,600
నాకు 12 ఏళ్ళ లోపే అది ఎదురైంది.

26
00:01:38,680 --> 00:01:41,520
అది నా జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది,
నిరాశగా ఉంటుంది.

27
00:01:41,600 --> 00:01:42,680
ఎడ్డీ బెట్స్
ఏఎఫ్ఎల్

28
00:01:42,760 --> 00:01:43,840
బాధగా ఉంటుంది.

29
00:01:43,920 --> 00:01:47,240
గత వారం, దానికి ముందువారం
నాపై జాతి వివక్షత చూపారు.

30
00:01:49,280 --> 00:01:51,840
నేను విసిగిపోయాను. పోరాడి విసిగి పోయాను.

31
00:01:53,240 --> 00:01:56,480
70,000 మంది జనం ముందు ఆట ఆడుతున్నప్పుడు,

32
00:01:56,560 --> 00:02:00,800
కంచె అవతల నుండి కోతి లేదా ఆదిమవాసి
లేదా నల్ల కుక్క అని ఎవరైనా అరుస్తుంటే,

33
00:02:00,880 --> 00:02:03,280
నేను నీరుగారిపోతాను.

34
00:02:03,360 --> 00:02:07,120
అది మొదలుపెట్టేందుకు ఆదిమవాసులకు
శక్తి ఎక్కడనుండి వస్తుంది?

35
00:02:07,200 --> 00:02:08,480
అది చాలా పెద్ద పని.

36
00:02:10,120 --> 00:02:11,200
టారిన్ థామస్.

37
00:02:11,280 --> 00:02:14,920
మన యువతరం
ఈ దేశాన్ని భవిష్యత్తులోకి నడిపిస్తుంది.

38
00:02:15,000 --> 00:02:17,600
మైఖేల్ వాల్టర్స్,
అతను అది జరిగేలా చేస్తాడు.

39
00:02:17,680 --> 00:02:20,280
అది సరళమైనది,
మన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.

40
00:02:20,360 --> 00:02:23,480
ఇంకా నయం కావాల్సింది చాలా ఉంది.

41
00:02:23,560 --> 00:02:25,120
ఒక ముద్ర వేసి,

42
00:02:25,200 --> 00:02:27,840
మెరుగైన చోటు కనుగొన్నాక వెళ్ళాలి.

43
00:02:34,760 --> 00:02:37,440
వారియర్స్ ఆన్ ద ఫీల్డ్

44
00:02:37,560 --> 00:02:41,720
2021 సర్ డగ్ నికల్స్ రౌండ్

45
00:02:46,720 --> 00:02:51,000
పెద్దవుతుంటే, మా అంకుల్స్, నాన్న,
అమ్మ నన్ను మ్యాచ్‌లకు లాక్కెళ్ళేవారు.

46
00:02:51,080 --> 00:02:52,960
అది చూస్తూ, అందులో పాల్గొనడంతో,

47
00:02:53,040 --> 00:02:55,440
నేను త్వరగా నేర్చుకున్నాను.

48
00:02:55,520 --> 00:02:56,560
టికెట్ దొరికిందా?

49
00:02:56,640 --> 00:02:57,840
-లేదు.
-నీ ముఖం...

50
00:02:58,760 --> 00:02:59,760
నేను ఏం చేయలేను.

51
00:03:00,840 --> 00:03:04,000
కానీ, ఆహ్, ఇక్కడ ఒక కిక్ కొట్టవచ్చు.

52
00:03:04,080 --> 00:03:05,440
హే, అందరూ, ఎలా ఉన్నారు?

53
00:03:05,520 --> 00:03:07,680
నేను మరో ఆటకు వెళ్ళి, మరో కిక్ పొందవచ్చు.

54
00:03:07,760 --> 00:03:09,200
"నేనిది చేయగలను" అనుకుంటాను.

55
00:03:09,280 --> 00:03:11,360
నువ్వు కూడా ఇందులో ఉన్నావా? ఇదిగో.

56
00:03:11,440 --> 00:03:12,320
ఏం పరవాలేదు.

57
00:03:12,640 --> 00:03:14,760
నా ముందు ఒక ఫుట్‌బాల్ ఉంది,

58
00:03:14,840 --> 00:03:16,800
నాకు దానితో ఏం చేయాలో తెలుసు.

59
00:03:16,880 --> 00:03:18,760
మీరు ఎలా ఉన్నారు? హే, సోదరా.

60
00:03:18,840 --> 00:03:20,320
హే, బాబు. హలో.

61
00:03:20,400 --> 00:03:23,560
అది చాలా సహజంగా, చాలా సులభంగా వచ్చింది.

62
00:03:23,640 --> 00:03:25,000
హే, ఎలా ఉన్నావు?

63
00:03:25,080 --> 00:03:26,440
కలవడం బాగుంది. బాగున్నావా?

64
00:03:26,520 --> 00:03:28,280
ఫుట్‌బాల్ అనుభూతి, అది ఎగరడం,

65
00:03:28,360 --> 00:03:31,400
నాకు కనిపిస్తుంది,
"అది అటువైపు లేదా అటు వైపు వెళుతుంది."

66
00:03:31,480 --> 00:03:33,200
నాకు తెలియదు, అది కేవలం...

67
00:03:33,280 --> 00:03:34,720
అది చాలా సహజంగా ఉంది.

68
00:03:35,400 --> 00:03:37,480
చూడు, అక్కడ భయంకరం, కదా?

69
00:03:37,560 --> 00:03:39,800
అతనిని భయంకరంగా చేయాలి, కదా?

70
00:03:39,880 --> 00:03:43,160
ఆ తరువాత, మీరు వెళ్ళి ప్రొఫెనల్‌గా మారితే,

71
00:03:43,240 --> 00:03:45,120
చూసుకోవాల్సిన పనులు ఉన్నాయి.

72
00:03:49,280 --> 00:03:51,680
గడిగాల్ ల్యాండ్‌లో
కలిసికట్టుగా ఉంటాం

73
00:03:52,880 --> 00:03:54,440
ఏఎఫ్ఎల్ ఫుట్‌బాల్ నియమాలు...

74
00:03:56,760 --> 00:03:59,200
...ఏఎఫ్ఎల్ ఫుట్‌బాల్‌కు
ఏ నియమాలు లేకపోవడమే.

75
00:04:04,680 --> 00:04:05,800
అది వెనుకకు వస్తుంది.

76
00:04:06,480 --> 00:04:08,520
అతను మంచి ఆట ఆడుతున్నాడు.

77
00:04:08,600 --> 00:04:10,640
ఒక్కో జట్టులో 18 మంది ఆటగాళ్ళు,

78
00:04:10,720 --> 00:04:13,400
అందరూ బంతిని పొందేందుకు
ఒక చోటు చూసుకుంటున్నారు.

79
00:04:13,480 --> 00:04:16,800
అది హాట్ పొటాటో ఆట లాగా.
బంతి మైదానమంతా తిరుగుతుంటుంది.

80
00:04:16,880 --> 00:04:18,480
నైపుణ్యం చాలా విశిష్టమైనది.

81
00:04:18,600 --> 00:04:22,920
ఒక స్టేడియంలో 70,000 మందితో
మూసేయబడి ఉండడం, అది అసాధారణం.

82
00:04:29,320 --> 00:04:31,920
అవును, నాకు ఇది ఇష్టం,
నా కుటుంబానికి ఇష్టం,

83
00:04:32,000 --> 00:04:34,720
మా సమాజానికి ఇష్టం,
ఆస్ట్రేలియాకు అది ఇష్టం.

84
00:04:34,800 --> 00:04:36,880
గాలిలోకి ఎగిరింది.
పార్కర్ అందుకున్నాడు.

85
00:04:36,960 --> 00:04:38,400
కుడి బూటులో ఇరుసులు ఉన్నాయి.

86
00:04:38,480 --> 00:04:40,280
తను గోల్ కొట్టాడు, వాళ్ళకు మూడోది.

87
00:04:46,000 --> 00:04:48,280
అడిలైడ్

88
00:04:54,480 --> 00:04:56,160
నేను మా అమ్మను ఎలా వివరిస్తానో?

89
00:04:57,120 --> 00:05:01,520
మ్యూరియల్ చాలా దృఢమైన సంకల్పం,
చాలా పట్టుదల కలది.

90
00:05:02,120 --> 00:05:03,000
నేను అనుకోవడం...

91
00:05:03,440 --> 00:05:06,880
నేను అనుకోవడం ఆమె
చాలా క్రమశిక్షణతో, కఠినంగా కనిపిస్తుంది.

92
00:05:06,960 --> 00:05:07,800
హలో!

93
00:05:07,880 --> 00:05:10,680
కానీ లోపల చాలా మృదువుగా ఉంటుంది.

94
00:05:12,120 --> 00:05:13,200
-హలో.
-హలో.

95
00:05:13,280 --> 00:05:14,760
-ఎలా ఉన్నావు?
-బాగున్నాను.

96
00:05:14,840 --> 00:05:17,120
-నిన్ను చూడడం బాగుంది, అవును.
-హే, మిత్రమా.

97
00:05:17,200 --> 00:05:19,680
మేము చేసే ప్రతిదానిలో ఆసక్తి చూపుతుంది.

98
00:05:19,760 --> 00:05:23,160
అది క్రీడలైనా, బడి అయినా,
అది ఏదైనా సరే,

99
00:05:23,240 --> 00:05:24,960
ఆమె ఎప్పుడూ ఉండేది, అందుకని...

100
00:05:25,480 --> 00:05:28,640
కానీ ఆమె అద్భుతం, అద్భుతమైన అమ్మ.

101
00:05:30,440 --> 00:05:31,840
మీ వాళ్ళను కలవడం బాగుంది.

102
00:05:31,920 --> 00:05:33,840
-హే? బాగున్నావా?
-అంతా బాగుంది, హా.

103
00:05:33,920 --> 00:05:35,000
నీ పర్యటన ఎలా ఉంది?

104
00:05:35,080 --> 00:05:38,400
అది దారుణమైన, సుదీర్ఘ ప్రయాణం,
మొత్తానికి ఇక్కడికి వచ్చాం.

105
00:05:40,120 --> 00:05:42,240
డెరిక్‌ను రిక్కీ తీసుకువస్తాడనుకుంటా.

106
00:05:42,320 --> 00:05:44,600
-అవునా?
-సాలిస్‌బరీ నార్త్‌కు వెళతారు.

107
00:05:44,680 --> 00:05:45,720
అది బాగుంటుంది.

108
00:05:47,480 --> 00:05:50,560
అప్పట్లో ఆ క్రీడలో చాలా ఆసక్తి ఉండేది,

109
00:05:50,640 --> 00:05:53,240
ఇంకా ఫుట్‌బాల్, నేను అనుకోవడం మైఖేల్,

110
00:05:53,320 --> 00:05:56,880
అప్పడు చాలా చిన్నవాడు కావడంతో,
కేవలం ఆ ఉత్సాహాన్ని,

111
00:05:56,960 --> 00:05:59,520
కుటుంబ సమావేశాలను గ్రహించాను,

112
00:05:59,600 --> 00:06:01,920
కేవలం సహజంగా వరం పొందాడు

113
00:06:02,000 --> 00:06:05,480
బంతిని తీసుకోవడం,
తన సోదరులు, కజిన్స్ ఇంకా అంకుల్స్‌తో

114
00:06:05,560 --> 00:06:08,520
బంతిని అంతటా తన్నడం.

115
00:06:08,600 --> 00:06:11,680
-ఎప్పుడూ ఫుట్‌బాల్ ఉండేది.
-ఎప్పుడూ ఉండేది.

116
00:06:14,760 --> 00:06:17,680
-ఎన్నో విరిగిపోయిన కిటికీలు.
-విరిగిపోయిన కిటికీలు...

117
00:06:17,760 --> 00:06:19,000
కంచె దాటిన బంతులు.

118
00:06:19,560 --> 00:06:21,400
కంచె దూకి బంతులు తెచ్చుకోవడం.

119
00:06:22,760 --> 00:06:24,200
కుటుంబం చాలా ముఖ్యం,

120
00:06:24,280 --> 00:06:27,480
వాళ్ళు ఎప్పుడైనా, ఎక్కడైనా సహకరించారు.

121
00:06:27,560 --> 00:06:30,400
ఎందుకంటే మైఖేల్‌ది చాలా పెద్ద కుటుంబం.

122
00:06:31,040 --> 00:06:32,800
డజన్ల మంది కజిన్లు ఉన్నారు.

123
00:06:32,880 --> 00:06:35,440
-ఎవరైనా వచ్చినప్పుడు...
-ఫుట్‌బాల్ ఆడేవాళ్ళు.

124
00:06:35,520 --> 00:06:38,360
"అంకుల్, రండి,
బంతిని కొట్టండి" అని అనేవాడిని.

125
00:06:38,440 --> 00:06:41,560
కొన్నిసార్లు కళ్ళు ఎగరేసినా
నీతో బంతిని కొట్టేవాళ్ళు.

126
00:06:41,640 --> 00:06:43,360
-అయితే, అదెలా ఉండేదంటే...
-అవును.

127
00:06:43,440 --> 00:06:46,480
నేను వెళ్ళే ప్రతిచోటకు,
దుకాణానికి, బంతితో వెళ్ళేవాడిని.

128
00:06:46,560 --> 00:06:49,480
ఎక్కడికైనా.
బడికి తీసుకెళ్ళేవాడిని, అన్నిచోట్లకు.

129
00:06:49,560 --> 00:06:51,360
కచ్చితంగా. స్కూల్ బస్‌కు కూడా.

130
00:06:51,440 --> 00:06:53,920
మేము అదృష్టవంతులం ఎందుకంటే మేమున్న చోట,

131
00:06:54,000 --> 00:06:57,120
ఇక్కడ ఒక ఆంటీ, అంకుల్ ఉండేవారు,
వీధి చివర,

132
00:06:57,200 --> 00:06:58,560
బామ్మ వీధి చివర ఉండేది,

133
00:06:58,640 --> 00:07:01,640
ఇక్కడ సాలిస్‌బరీ నార్త్ ప్రాంతంలో అందరూ

134
00:07:01,720 --> 00:07:03,480
పరస్పరం చూసుకుంటారు.

135
00:07:04,800 --> 00:07:09,040
అంటీలు, అంకుల్స్ దగ్గర నుండి ఆ ప్రయాణంలో
నేర్చుకునే పాఠాలు కొన్ని,

136
00:07:09,120 --> 00:07:12,800
ముఖ్యంగా ఫుట్‌బాల్ పరంగా,
మనల్ని మనం చూసుకోవడం,

137
00:07:12,880 --> 00:07:14,240
ఎక్కువ మద్యపానం చేయకపోవడం,

138
00:07:14,560 --> 00:07:16,960
అవి నేను త్వరగా నేర్చుకునేలా చేశాయి.

139
00:07:17,840 --> 00:07:21,040
క్రీడల్లో చాలా విషయాల్లో
జాతివివక్షతతో మాట్లాడతారు,

140
00:07:21,400 --> 00:07:24,960
కానీ అది ఎప్పుడూ ఇలాంటిదే,
"నీ ఆటను చెడగొట్టుకోకు.

141
00:07:25,040 --> 00:07:26,560
"ఫుట్‌బాల్‌పై దృష్టి పెట్టు."

142
00:07:26,640 --> 00:07:29,760
కొన్నిసార్లు పోరాడాలని అనిపించేది, కాని...

143
00:07:29,840 --> 00:07:32,000
అది దిగమింగుకుని, దృష్టి పెట్టాలి.

144
00:07:32,080 --> 00:07:34,480
నేన ఫుట్‌బాల్ మైదానంలో
ఎంత ఆవేశంగా ఉంటానో,

145
00:07:34,560 --> 00:07:38,000
ఒక ఎదిగే జూనియర్‌గా,
ఎన్నో పేర్లు పెట్టి పిలిచినా,

146
00:07:38,080 --> 00:07:41,800
నాకు తెలుసు, మా బామ్మ, అమ్మా చూస్తూ,
వాళ్ళు ఇలా అనుకుంటారు,

147
00:07:42,640 --> 00:07:45,440
"ఊరుకో, గొడవపడకు.
వెళ్ళు, ఫుట్‌బాల్ ఆడు" అని.

148
00:07:46,160 --> 00:07:49,600
సాలిస్‌బరీ నార్త్, ఎస్ఏ

149
00:07:54,000 --> 00:07:55,720
నాకు అది ముందుగానే తెలుసు...

150
00:07:56,280 --> 00:07:57,840
మేమున్న చోట,

151
00:07:58,280 --> 00:08:01,920
మాకు సవాళ్ళు ఉన్నాయని,
ఎక్కువ డబ్బు లేదు, ఇంకా...

152
00:08:07,160 --> 00:08:11,280
అందుకని, జనం, కచ్చితంగా మావాళ్ళు,
ఎల్లప్పుడూ క్లబ్‌కు వస్తూ పోతూ ఉంటారు.

153
00:08:11,480 --> 00:08:14,960
అది నేను గడిపేచోటు,
మంచి స్నేహితులను చేసుకునే చోటు,

154
00:08:15,040 --> 00:08:18,200
వేసవిలో క్రికెట్,
శీతాకాలంలో ఫుట్‌బాల్ ఆడే చోటు.

155
00:08:18,280 --> 00:08:22,240
అందరి దగ్గరా ఫుట్‌బాల్ ఉండేది,
అది ఆడేవాళ్ళను కనుగొనడం సులభం.

156
00:08:22,760 --> 00:08:23,880
ఏది ప్రేమించకూడదు?

157
00:08:27,960 --> 00:08:31,240
బహుశా నాకు 12 ఏళ్ళు వచ్చేవరకు లేదు,

158
00:08:31,320 --> 00:08:33,600
తరువాత జట్టులకు ప్రాతినిధ్యం వహించాను,

159
00:08:33,680 --> 00:08:35,800
"నేనిది బాగా చేస్తున్నాను" అనుకున్నాను.

160
00:08:35,880 --> 00:08:38,000
ఇలా చెప్పింది మా అమ్మ అనుకుంటా,

161
00:08:38,080 --> 00:08:41,960
"ఫుట్‌బాల్ ఆడేందుకు ఆటగాళ్ళకు
చాలా డబ్బు చెల్లిస్తారు." నా మతిపోయింది.

162
00:08:42,040 --> 00:08:44,600
ఫుట్‌బాల్ ఆడితే
డబ్బు చెల్లిస్తారని తెలియదు.

163
00:08:44,680 --> 00:08:47,040
అది నా మతి పోగొట్టింది,
నేను "ఏంటి?" అన్నాను.

164
00:08:47,120 --> 00:08:51,040
ఇక అంతే.
నేను నా మనసులో, ఫుట్‌బాల్, అనుకున్నాను,

165
00:08:51,720 --> 00:08:54,560
నేను ఆడగలను, చాలా బాగా ఆడగలను,

166
00:08:55,080 --> 00:08:58,920
మా కుటుంబం ఉన్న స్థితిని మార్చగలను.

167
00:09:02,080 --> 00:09:03,680
ఒక గదిలో ఐదుగురు అబ్బాయిలు,

168
00:09:03,760 --> 00:09:06,760
అన్నీ బంక్ బెడ్లు,
మా కజిన్లు నేల మీద పడుకున్నారు.

169
00:09:06,840 --> 00:09:08,920
"మా అమ్మకు ఒక ఇల్లు కొనివ్వగలను."

170
00:09:09,000 --> 00:09:11,720
లేదా "నేను బాగా ఆడితే
ఏదైనా చేయవచ్చు" అనుకున్నాను.

171
00:09:11,800 --> 00:09:14,760
వాడు ఇంకా హై స్కూల్లో, 12వ సంవత్సరంలో,

172
00:09:15,760 --> 00:09:18,280
ఇక్కడకు స్వాన్స్ పర్యటనకు వచ్చారు.

173
00:09:19,320 --> 00:09:22,760
"వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు?
వీళ్ళకు ఏం కావాలి?" అనుకున్నాం.

174
00:09:22,840 --> 00:09:25,240
ఏం ఆశించాలో మాకు తెలియలేదు.

175
00:09:25,320 --> 00:09:27,400
"అబ్బో" అనుకున్నానంతే.

176
00:09:27,480 --> 00:09:29,480
నాకు చాలా ఉత్సాహంగా ఉంది, భయంగా ఉంది.

177
00:09:29,560 --> 00:09:32,120
-అది ఈ భిన్నమైన విషయాలు.
-అవును.

178
00:09:32,200 --> 00:09:36,240
ఒక స్థానిక కాలనీ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి
ఒక ఏఎఫ్ఎల్ వాతావరణంలోకి వెళితే

179
00:09:36,320 --> 00:09:38,320
అంతా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

180
00:09:38,400 --> 00:09:39,360
మొత్తం వ్యవస్థకే...

181
00:09:40,760 --> 00:09:43,240
-వ్యవస్థకు ఒక షాక్.
-అందరమూ భయపడ్డాము.

182
00:09:45,560 --> 00:09:48,920
సాలిస్‌బరీ నార్త్ నుంచి
సిడ్నీకి మారటం ఒక పెద్ద అడుగు.

183
00:09:49,000 --> 00:09:51,320
మొదటి వారం తర్వాత నా పని అయిపోయింది.

184
00:09:51,400 --> 00:09:53,960
నేను అడిలైడ్‌కు
తిరిగి వెళ్ళి అమ్మతో ఉంటూ,

185
00:09:54,040 --> 00:09:57,560
స్థానికంగా పనిచేస్తూ సాలిస్‌బరీ నార్త్
కోసం ఆడటానికి తయారయ్యాను.

186
00:09:57,640 --> 00:10:01,160
కానీ నా జీవితంలో శక్తివంతులైన వారిలో
ఒకరైన మా అమ్మ చెప్పింది,

187
00:10:01,240 --> 00:10:03,160
"ఇక్కడ నీకు ఏమీ లేదు. ఉండు.

188
00:10:03,240 --> 00:10:06,000
"ఇది వదులుకోకూడని అవకాశం.

189
00:10:06,800 --> 00:10:09,120
"అందరికీ ఇలాంటి అవకాశం దొరకదు."

190
00:10:11,000 --> 00:10:12,360
మెల్‌బోర్న్

191
00:10:13,800 --> 00:10:15,720
నేను టారిన్ థామస్ వంక చూశాను,

192
00:10:15,800 --> 00:10:19,120
అతనిది కూడా
అచ్చం నా కథలాగానే అనిపిస్తుంది.

193
00:10:19,640 --> 00:10:23,120
కఠినమైన నివాసప్రాంతం,
అతను తన ఇంటినుంచి ఎంతో దూరం వచ్చాడు

194
00:10:23,920 --> 00:10:25,840
తన కలను నెరవేర్చుకోవటం కోసం.

195
00:10:26,600 --> 00:10:29,280
అతను ఒక్కడే, 50లోనే ఉన్నాడు.

196
00:10:29,920 --> 00:10:31,120
టారిన్ థామస్.

197
00:10:31,720 --> 00:10:33,800
ఒక కుర్రాడిగా చూస్తే, టారిన్...

198
00:10:34,440 --> 00:10:36,440
గొప్పవాడు, ఉత్సాహవంతుడు,

199
00:10:36,520 --> 00:10:39,760
పోటీ తత్వం, కష్టపడే తత్వం ఉంది.

200
00:10:48,000 --> 00:10:49,720
అతనిలో ఉన్న తపన,

201
00:10:49,800 --> 00:10:53,120
తను ఇవాళ ఉన్న స్థాయికి
తీసుకెళ్ళిందని నా అభిప్రాయం.

202
00:10:53,200 --> 00:10:55,880
ప్రతిభావంతుడైన యువ రూ,
బంతిని సరైన చోటుకు పంపాడు.

203
00:10:55,960 --> 00:10:58,560
నార్త్ జట్టుకు ఇది నిజంగా ఒక శుభారంభం.

204
00:10:58,640 --> 00:11:02,400
రెండు గోల్స్ కొట్టేసింది,
క్యాట్స్ జట్టు రెండు గోల్స్ వెనుకబడింది.

205
00:11:09,840 --> 00:11:12,280
టారిన్, అతనిని నేను దూరంనుంచి చూశాను.

206
00:11:13,320 --> 00:11:16,240
ప్రస్తుతానికి అతనిని చూస్తే,
నిలకడగా ఆడుతున్నాడు.

207
00:11:16,640 --> 00:11:20,200
మంచి ఆటగాళ్ళకు,
అద్భుతమైన ఆటగాళ్ళకు అదే తేడా.

208
00:11:20,840 --> 00:11:24,720
మళ్ళీ ఒక గోల్.
ప్రేక్షకులలో ఉత్సాహం పెల్లుబికింది.

209
00:11:24,800 --> 00:11:27,120
దాని విషయంలో కొంత బాధ్యత ఉంది,

210
00:11:27,200 --> 00:11:29,720
అతను తన గొంతును మరింత బిగ్గరగా చేస్తాడు

211
00:11:29,800 --> 00:11:32,840
అతనిలో మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.

212
00:11:33,360 --> 00:11:35,560
నేను ఎక్కువగా మాట్లాడేరకం కాదు.

213
00:11:35,640 --> 00:11:37,920
నా ఆటే మాట్లాడుతుందని అనుకుంటాను.

214
00:11:38,320 --> 00:11:39,680
బాగా ఆడాడు. థామస్.

215
00:11:40,160 --> 00:11:41,720
టారిన్ థామస్ మలుపు తిరిగాడు,

216
00:11:41,880 --> 00:11:43,200
తన్నాడు, గోల్స్.

217
00:11:45,400 --> 00:11:47,280
మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ,

218
00:11:49,200 --> 00:11:53,480
నా పూర్వీకులను, నాకంటే ముందు
వచ్చిన నా సోదరులను తలుచుకుంటాను.

219
00:11:57,320 --> 00:11:58,840
నా జెర్సీతో
బయటకొచ్చి ఆడి,

220
00:11:58,920 --> 00:12:02,240
మైదానంలో నా కథను
జనానికి చెప్పగలగటం నాకు గర్వకారణం.

221
00:12:02,320 --> 00:12:04,440
అతను టారిన్ థామస్‌ను ఢీకొట్టాడు.

222
00:12:04,520 --> 00:12:06,640
దూసుకుపోయాడు.

223
00:12:06,720 --> 00:12:08,360
ఫార్వర్డ్‌లో ఎవరూ అడ్డులేరు.

224
00:12:10,880 --> 00:12:12,120
ముందువైపుకు
దూసుకుపోయాడు.

225
00:12:19,000 --> 00:12:22,480
ఈ యువకుడికి ఎంతో కాలం లీగ్‌లో

226
00:12:22,560 --> 00:12:26,960
చాలా మంచి ఆటగాడిగా ఉండగల
అపారమైన సామర్థ్యం ఉంది, అది అతను,

227
00:12:27,040 --> 00:12:30,480
అతని కుటుంబం మిగిలిన జీవితమంతా
స్థిరంగా ఉండేలా చేస్తుంది.

228
00:12:33,720 --> 00:12:35,120
సిడ్నీ

229
00:12:39,520 --> 00:12:42,480
డూన్‌సైడ్, ఎన్ఎస్‌డబ్ల్యూ

230
00:12:48,520 --> 00:12:51,040
ఎదిగే వయసులో నాది చాలా మంచి జీవితం.

231
00:12:51,120 --> 00:12:53,320
కచ్చితంగా, నాకు ఎక్కువ ఏం లేదు, కానీ...

232
00:12:55,280 --> 00:12:57,640
అమ్మా, నాన్న నాకోసం అన్నీ చేశారు.

233
00:12:58,840 --> 00:13:01,480
అవును, అంటే, ఇక్కడ డూన్‌సైడ్‌లో,

234
00:13:01,560 --> 00:13:04,280
మీరు మంచి మార్గంలోనైనా నడుస్తారు లేదా

235
00:13:06,680 --> 00:13:07,880
చెడ్డ మార్గంలోనైనా.

236
00:13:08,440 --> 00:13:10,240
శీతాకాలంలో, ఫుట్‌బాల్,

237
00:13:10,800 --> 00:13:12,760
వేసవిలో, అథ్లెటిక్స్ ఆడేవాళ్ళం.

238
00:13:13,840 --> 00:13:16,160
అందుకని, మేము ఎప్పుడూ ఆపేవాళ్ళం కాదు.

239
00:13:16,520 --> 00:13:18,440
క్రీడలు ఆడడం ఎప్పుడూ ఆపలేదు.

240
00:13:18,520 --> 00:13:19,840
టారిన్ బామ్మ

241
00:13:19,920 --> 00:13:21,680
క్రీడలు మరిన్ని క్రీడలు.

242
00:13:21,760 --> 00:13:23,160
పతకాల మీద పతకాలు.

243
00:13:24,520 --> 00:13:25,640
వెళ్ళు, టారిన్!

244
00:13:25,720 --> 00:13:26,760
గర్వించదగిన,

245
00:13:27,520 --> 00:13:28,760
గర్వించదగిన బామ్మ...

246
00:13:30,080 --> 00:13:31,120
నేను కాగలను.

247
00:13:31,200 --> 00:13:34,040
నాకు నా మనుమడు ఉన్నాడు,
వాడిని టీవీలో ప్రతి వారాంతం,

248
00:13:34,680 --> 00:13:36,680
ఏఎఫ్ఎల్ ఆడడం చూస్తాను.

249
00:13:36,760 --> 00:13:39,320
యూనియాక్. తన ముందు
కేవలం ఒక ఆటగాడే ఉన్నాడు.

250
00:13:39,720 --> 00:13:41,200
అది థామస్...

251
00:13:51,160 --> 00:13:53,400
అది నాకు మొదటిసారి బడిలో జరిగింది.

252
00:13:53,480 --> 00:13:56,320
నన్ను "నల్ల కుక్క" అన్నారు.

253
00:13:57,560 --> 00:13:59,640
నిజానికి దానర్థం నాకు తెలియదు,

254
00:14:00,040 --> 00:14:01,960
కానీ అది సరైనది కాదని అనిపించింది.

255
00:14:02,040 --> 00:14:05,680
అప్పట్లో, మేము ఎప్పుడూ,

256
00:14:05,760 --> 00:14:08,880
బడిలో మా ఆదిమజాతి గురించి మాట్లాడలేదు.

257
00:14:10,800 --> 00:14:12,920
అదేదీ నాకు నేర్పించలేదు.

258
00:14:14,960 --> 00:14:17,040
నాకు ఈరోజు మనుమళ్ళు
మనుమరాళ్ళు ఉన్నారు.

259
00:14:18,080 --> 00:14:20,440
వాళ్ళు తమ జాతి
తెలుసుకోవాలని అనుకుంటారు.

260
00:14:21,000 --> 00:14:22,320
మాది కమిలరాయ్ జాతి,

261
00:14:23,200 --> 00:14:25,000
మా చిహ్నం బల్లి.

262
00:14:28,240 --> 00:14:31,240
నావరకు, జనం మాకు మనసు ఉండదని అనుకుంటారు.

263
00:14:33,240 --> 00:14:35,560
అది కేవలం మా చర్మ రంగు వలనే.

264
00:14:36,600 --> 00:14:39,560
నేను మా అమ్మ, సోదరులు, సోదరీమణులకు

265
00:14:39,640 --> 00:14:42,040
మంచి జీవితాన్ని ఇచ్చేందుకు
ఏదైనా చేస్తాను.

266
00:14:43,000 --> 00:14:44,880
వాళ్ళు నాకోసం అన్నీ చేశారు.

267
00:14:46,520 --> 00:14:49,720
టారిన్ ఒక ఊదాహరణగా నిలిచాడు,
ముందు చెప్పినట్లుగా,

268
00:14:51,280 --> 00:14:52,400
మార్పుకు రాయబారి.

269
00:14:53,240 --> 00:14:54,520
మాకు మార్పు అవసరం.

270
00:14:56,880 --> 00:14:59,280
కానీ ఇది చేయడానికి

271
00:15:00,040 --> 00:15:03,000
టారిన్ లాంటి వాళ్ళు ఉండడం
నాకు గర్వంగా ఉంది.

272
00:15:06,360 --> 00:15:07,320
భావగర్భితమైనది.

273
00:15:08,160 --> 00:15:09,000
క్షమించాలి.

274
00:15:13,520 --> 00:15:16,160
నార్త్ మెల్‌బోర్న్ కమ్యూనిటీ సెంటర్

275
00:15:19,040 --> 00:15:20,320
అది అద్భుతంగా ఉంది.

276
00:15:20,400 --> 00:15:21,720
నీకు ఎలా ఉంది, మిత్రమా?

277
00:15:21,800 --> 00:15:24,120
నా వెన్నులో రోమాలు నిక్కపొడుచుకున్నాయి.

278
00:15:24,200 --> 00:15:27,440
సంధి గౌరవం

279
00:15:31,000 --> 00:15:32,440
నాకు చాలా గర్వంగా ఉంది.

280
00:15:32,840 --> 00:15:35,040
నడుస్తూ వెళుతుంటే, నాకింకా పులకరిస్తుంది.

281
00:15:36,920 --> 00:15:39,480
నాకు అక్కడ "సంధి"
ఇంకా "గౌరవం" కనిపిస్తుంది.

282
00:15:40,080 --> 00:15:42,440
ఇంకా అద్భుతమైన ఫోజ్ కూడా.

283
00:15:42,520 --> 00:15:45,360
వాళ్ళు ఆటకు ముందు
ఒక మోకాలి మీద నిలబడడం నచ్చింది.

284
00:15:45,440 --> 00:15:47,520
జనం అందరూ ఒక మోకాలి మీద నిలబడ్డారు.

285
00:15:51,720 --> 00:15:54,800
అందుకని, నేను అనుకోవడం
అది చాలా శక్తివంతమైనది, ఆ స్వరం.

286
00:15:54,880 --> 00:15:57,320
ముఖ్యంగా నా ఫోటో గోడ మీద ఉండడం.

287
00:15:57,400 --> 00:16:01,880
అది నిజంగా జాత్యహంకారం వద్దు అని చెప్పే
సమాజానికి సంబంధించినది.

288
00:16:03,280 --> 00:16:04,840
అందుకని, కేవలం మేము,

289
00:16:04,920 --> 00:16:07,600
నల్లవాళ్ళమే కాదు, అందరూ ఒకటిగా ఉన్నారు.

290
00:16:07,680 --> 00:16:10,880
మేము ఒక పెద్ద సమాజం,
అందరూ కలిసికట్టుగా వచ్చారు.

291
00:16:10,960 --> 00:16:14,880
అది భంగిమ మాత్రమే, కానీ అక్కడ అమెరికాలో
అది ఏం సూచిస్తుందంటే,

292
00:16:14,960 --> 00:16:18,320
బ్లాక్ లైవ్స్ మ్యాటర్
ఉద్యమం మొదలైన చోటును.

293
00:16:18,400 --> 00:16:21,760
అది ఇప్పుడు
ప్రపంచం అంతటా వ్యాప్తి చెందింది.

294
00:16:21,840 --> 00:16:25,720
ఇక్కడ ప్రాతినిధ్యం, ఉత్తర మెల్‌బోర్న్,
మీ ఫుట్‌బాల్ క్లబ్‌కే కాదు,

295
00:16:25,800 --> 00:16:28,160
కానీ దేశం అంతటా ఉన్న మీ వాళ్ళకు.

296
00:16:30,560 --> 00:16:33,920
అది ఎంతోమందికి
ఎన్నో విధాలుగా అనిపిస్తుంది.

297
00:16:34,000 --> 00:16:38,600
కానీ నావరకు, ఇది శక్తి, సంస్కృతి గురించి.
ఇది సరిగ్గా అక్కడ పైన ఉంది.

298
00:16:39,200 --> 00:16:40,760
నేను ముందు ఉండాలనుకున్నాను,

299
00:16:40,840 --> 00:16:44,000
ఇదివరకటి ఆటగాళ్ళు మాకోసం
మొదలుపెట్టింది కొనసాగించాలి.

300
00:16:45,640 --> 00:16:47,080
ముందుకు కొనసాగుతూ ఉండాలి.

301
00:16:47,160 --> 00:16:49,080
నీ పట్ల గర్వంగా ఉంది. బాగా చేశావు.

302
00:16:49,160 --> 00:16:51,640
నిన్ను చూసుకున్నది చాలు, మిత్రమా.
పద వెళదాం.

303
00:17:07,920 --> 00:17:09,600
ఎలా ఉన్నావు, బాగున్నావా?

304
00:17:09,680 --> 00:17:11,480
-నిన్ను చూడడం సంతోషం.
-ఎలా ఉన్నావు?

305
00:17:11,560 --> 00:17:15,160
ఈ రోజు అక్కడ ఒక అద్భుతమైన,
స్వదేశీ ప్రతిభ ఆడుతుంది.

306
00:17:15,960 --> 00:17:18,480
నువ్వు అది నీ ప్రయాణంలో చూశావా?

307
00:17:18,560 --> 00:17:20,880
ఒక స్వదేశీ చరిత్రకారుడిగా, మిత్రమా,

308
00:17:20,960 --> 00:17:24,400
నేను ఆటను, అన్ని నియమాలను,
అన్ని క్రీడలను అనుసరించాను.

309
00:17:24,480 --> 00:17:27,480
వాస్తవం ఏంటంటే, చరిత్రాత్మకంగా,
మనకు అవకాశం లేకపోయింది.

310
00:17:27,560 --> 00:17:30,160
అడ్డంకులు ఉండేవి.
జాత్యహంకారం ఉండేది.

311
00:17:30,240 --> 00:17:34,600
60ల చివర నుండి 70ల వరకు
మనకు ఆ అవకాశమే లేకపోయింది.

312
00:17:34,680 --> 00:17:37,080
కానీ మనం మౌలికంగా
ఆ తలుపులను బద్దలుకొట్టాము

313
00:17:37,160 --> 00:17:40,360
ఎందుకంటే మన సమాజంలో ఉన్న
అద్భుతమైన ప్రతిభ ఇంకా

314
00:17:40,440 --> 00:17:42,040
అద్భుతమైన ఆటగాళ్ళ కారణంగా.

315
00:17:42,120 --> 00:17:44,320
ఒకసారి ఆలోచన రాగానే,
ఇక వెనుకకు చూడలేదు.

316
00:17:44,400 --> 00:17:45,560
లోపలే ఉంచాడు, ఎడ్డీ.

317
00:17:45,640 --> 00:17:46,960
అతను అది లోపలే ఉంచాడు!

318
00:17:47,040 --> 00:17:48,720
ఓహ్, ఎడ్డీ బెట్స్‌ను చూడండి!

319
00:17:49,520 --> 00:17:51,600
అద్భుతమైన సూపర్ స్టార్!

320
00:17:53,320 --> 00:17:56,120
క్రీడలు, మనకు,
మార్పును, గుర్తింపును కోరుకునే

321
00:17:56,200 --> 00:17:59,120
మన గొంతును నడిపించే వాహనం.

322
00:17:59,200 --> 00:18:01,920
కానీ ఇక్కడ, కచ్చితంగా దేశవ్యాప్తంగా,

323
00:18:02,000 --> 00:18:05,680
ఎక్కడైతే ఆదివాసీల హక్కుల కోసం జరిగిన
పోరాట సుదీర్ఘ చరిత్ర ఉంది.

324
00:18:05,760 --> 00:18:09,440
60లు దాటి వచ్చాము, గొప్ప సామాజిక
మరియు రాజకీయ మార్పుల సమయం.

325
00:18:11,440 --> 00:18:15,840
ఆదివాసీల కోసం విద్యార్థుల చర్యలు

326
00:18:15,920 --> 00:18:18,240
చార్లీ పెర్కిన్స్ ఇంకా ఫ్రీడం రైడ్.

327
00:18:18,320 --> 00:18:20,880
66లో వేవ్ హిల్ దగ్గర గురిండ్జీ వెళ్ళారు.

328
00:18:20,960 --> 00:18:23,000
1967 రిఫరెండం.

329
00:18:23,080 --> 00:18:26,520
92 శాతం జనాభా
మనకు మద్దతుగా నిలిచింది.

330
00:18:26,600 --> 00:18:28,440
72 టెంట్ ఎంబసీ.

331
00:18:28,520 --> 00:18:31,600
ఆదివాసీ ఉద్యమం మొదట్లో,
నమ్మశక్యం కాని విధంగా,

332
00:18:31,680 --> 00:18:34,920
100 ఏళ్ళ క్రితం,
ఆఫ్రికన్ అమెరికన్ సంబంధాలు,

333
00:18:35,000 --> 00:18:38,280
ఆఫ్రికన్ అమెరికన్ ప్రభావం,
ఆఫ్రికన్ అమెరికన్ స్ఫూర్తి.

334
00:18:38,360 --> 00:18:40,600
వాళ్ళు ప్రమాదం అంటారు,
మేము హత్య అంటాము!

335
00:18:40,680 --> 00:18:42,040
బ్లాక్ లైవ్స్ మ్యాటర్

336
00:18:42,120 --> 00:18:43,760
ఆగండి కాల్చకండి

337
00:18:44,080 --> 00:18:46,560
వాళ్ళు ప్రమాదం అంటారు,
మేము హత్య అంటాము!

338
00:18:47,280 --> 00:18:51,040
మేము టీవీలో జార్జ్ ఫ్లాయిడ్‌కు
ఇంకా ఆ చోట ఉన్న మిగిలిన చాలామందికి

339
00:18:51,120 --> 00:18:53,160
ఏం జరిగిందో చూశాము కాబట్టి,

340
00:18:53,240 --> 00:18:56,400
అది చాలా భయంకరమైన ఘటన.

341
00:18:56,480 --> 00:18:59,000
ఆ తరువాత మేము ఇక్కడ నిలబడ్డాం,

342
00:18:59,080 --> 00:19:01,520
నా ఉద్దేశం, న్యూకాజిల్,
బ్రిస్బేన్, సిడ్నీ,

343
00:19:01,600 --> 00:19:04,000
మెల్‌బోర్న్‌లో వేలాది మంది జనం ర్యాలీలు.

344
00:19:04,080 --> 00:19:07,640
మీడియాకు సంబంధించి
అది మమ్మల్ని తిరిగి అందులో ఉంచింది.

345
00:19:07,720 --> 00:19:09,880
మేము తిరిగి వెళ్ళవచ్చు

346
00:19:09,960 --> 00:19:12,440
రాయల్ కమీషన్‌ను
నల్లవారి మరణాలకు కస్టడీలోకి

347
00:19:12,520 --> 00:19:14,200
తీసుకోవాలి లేదా అది కొనసాగుతోంది.

348
00:19:14,280 --> 00:19:17,520
బయటకు లాగిన ఆ విషయాలను,

349
00:19:17,600 --> 00:19:22,000
అవసరమని భావించిన వాటిని
అమలు చేయడం విస్మరించారు.

350
00:19:22,080 --> 00:19:25,200
ఈరోజు నువ్వు వేసుకున్న జెర్సీ,
మేము గర్వంగా వేసుకుంటాము,

351
00:19:25,280 --> 00:19:28,000
అలాగే స్థానిక సహోదరులు కాని వారు,

352
00:19:28,080 --> 00:19:29,480
స్థానిక రౌండ్‌లో ఉన్నారు.

353
00:19:36,080 --> 00:19:37,720
మా ప్రజలకు అపురూపమైనది.

354
00:19:37,800 --> 00:19:40,480
మా సంస్కృతి ప్రదర్శనకు
పెద్ద వేదిక దొరికింది.

355
00:19:41,120 --> 00:19:44,200
-అది నీకు ఎంత ముఖ్యము?
-అది స్ఫూర్తి, గౌరవం.

356
00:19:47,000 --> 00:19:49,240
మార్న్‌గ్రూక్ రౌండ్ అనేది

357
00:19:49,320 --> 00:19:52,040
స్థానిక పురుషులు, మహిళలు పోటీ పడే విధంగా

358
00:19:52,120 --> 00:19:54,560
ఆటగాళ్ళు అందరికీ ప్రత్యేక రౌండ్.

359
00:19:54,640 --> 00:19:57,560
ప్రతి ఆటగాడు స్వదేశీ డిజైన్ ఉన్న

360
00:19:57,640 --> 00:19:59,760
తమ జెర్సీతో బయటకు వచ్చి,

361
00:19:59,840 --> 00:20:03,680
మా ఫుట్‌బాల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం
వహించాలని అనుకుంటాడు.

362
00:20:08,480 --> 00:20:11,280
మార్న్‌గ్రూక్ ఆట,
జంతు చర్మంలో బొగ్గును నింపి

363
00:20:11,360 --> 00:20:13,600
కలిపి కుట్టి దానితో ఆడుకునే

364
00:20:13,680 --> 00:20:16,320
తెగలు ఉన్నాయి.

365
00:20:16,440 --> 00:20:18,760
బంతి అంతటా వెళుతుంది.

366
00:20:18,840 --> 00:20:21,480
ఒక 50 నుండి 60 మంది జనం

367
00:20:21,560 --> 00:20:24,360
బంతి అందుకునే ప్రయత్నం చేస్తారు.

368
00:20:27,440 --> 00:20:29,840
ఏఎఫ్ఎల్ వ్యవప్థాపకుడు
ఇది చూసి ఇలా అన్నాడు,

369
00:20:29,920 --> 00:20:32,160
"ఇది అద్భుతం, చాలా వేగం...

370
00:20:32,600 --> 00:20:34,280
"ఇందులో చాలా యాక్షన్ ఉంది."

371
00:20:34,360 --> 00:20:36,840
ఏఎఫ్ఎల్ ఆట దానిలో నుండి పుట్టింది.

372
00:20:37,080 --> 00:20:41,000
ఇప్పుడు మా మందిలో ఆట ఆడే
అనేక ఆటగాళ్ళు ఉన్నారు.

373
00:20:41,080 --> 00:20:44,280
ఇది ప్రకాశించాల్సిన సమయం,
ఆటలో తమదైన ముద్ర వేస్తారు.

374
00:20:44,360 --> 00:20:45,560
అడుగు...

375
00:20:47,920 --> 00:20:49,840
అద్భుతంగా నిరోధించాడు.

376
00:20:58,000 --> 00:21:00,440
మొదటి ఆటకు...

377
00:21:01,720 --> 00:21:03,080
ఇంకా మతి పోతుంది.

378
00:21:04,040 --> 00:21:06,960
ఓలాఫ్లిన్ అది అందుకున్నాడు.
అతను ఏదైనా మాయ చేయగలడా?

379
00:21:07,040 --> 00:21:10,000
తిరిగి ఓలాఫ్లిన్ దగ్గరకు.
ఓలాఫ్లిన్ గోల్ కొట్టాడు.

380
00:21:10,080 --> 00:21:11,520
అత్యద్భుతం!

381
00:21:13,160 --> 00:21:15,160
నాకు తెలిసిన పెరిగేవారు చూస్తున్నారు.

382
00:21:15,240 --> 00:21:18,000
ఓలాఫ్లిన్ అది లోపలే ఉంచాడు.
అక్కడ నుండి బాగా ఆడాడు.

383
00:21:18,080 --> 00:21:19,960
మిక్కీ ఎంత మంచి ఆటగాడు!

384
00:21:20,160 --> 00:21:24,440
నాకు గుర్తుంది, మైదానంలో నన్ను చూసిన జనం,

385
00:21:24,520 --> 00:21:27,200
"అతను నిజంగా చేశాడు.

386
00:21:27,280 --> 00:21:29,840
"తను నిజంగా
టీవీలో ఆడుతున్నాడు" అని అనుకున్నారు.

387
00:21:33,120 --> 00:21:36,880
నేను అది ఎప్పటికీ మర్చిపోలేను.
మా జీవితాలు ఎప్పటికీ మారిపోయాయి.

388
00:21:37,840 --> 00:21:39,280
మంచిగా.

389
00:21:39,440 --> 00:21:43,840
నేను ఒక ఆట తరువాత, రెండోది, మూడోది,
చివరకు 300 వరకూ ఆడగలిగాను.

390
00:21:49,880 --> 00:21:51,280
మైఖేల్ ఓలాఫ్లిన్ 300

391
00:21:51,360 --> 00:21:54,320
సిడ్నీ మైదానంలో,
ఓలాఫ్లిన్ ఒక తారగా నిలిచాడు.

392
00:21:55,240 --> 00:21:57,120
మూడొందల ఆటలు.

393
00:22:01,800 --> 00:22:03,360
పెర్త్

394
00:22:08,240 --> 00:22:11,800
మైఖేల్ వాల్టర్స్ జూ. నేను చూడాలని అనుకునే
నాకు ఇష్టమైన ఆటగాడు.

395
00:22:12,080 --> 00:22:14,840
తనకు తానుగా
సహాయం చేసుకుంటాడు... వాల్టర్స్!

396
00:22:14,920 --> 00:22:16,120
ఇక ఆటలోకి వెళదాం.

397
00:22:16,200 --> 00:22:17,600
30 సెకన్లలో.

398
00:22:17,680 --> 00:22:20,120
అతను అంతటా తిరుగుతాడు.
ఎక్కడా సమయం వృథా చేయడు.

399
00:22:20,200 --> 00:22:21,880
అది కచ్చితంగా చేస్తాడు.

400
00:22:22,120 --> 00:22:24,640
ఆ ఫుట్‌బాల్ క్లబ్‌కు బాగా ఆడాడు.

401
00:22:24,720 --> 00:22:26,920
గర్వించదగ్గ ఆదివాసి

402
00:22:27,800 --> 00:22:31,120
తన స్వస్థల జనం ముందు, తన ఇంటి
మంది ముందు ఆడుతున్నాడు.

403
00:22:31,200 --> 00:22:33,160
అతనిది అద్భుతమైన కెరీర్.

404
00:22:33,440 --> 00:22:35,200
ఇదిగో మూలకు వెళుతున్నాము.

405
00:22:35,280 --> 00:22:38,080
అతను పూర్తిగా 50 లోపల ఉన్నాడు.

406
00:22:38,200 --> 00:22:39,280
మైఖేల్ వాల్టర్స్!

407
00:22:39,360 --> 00:22:41,400
ఫ్రిమాంటిల్ తీసుకుంది. వెనుక.

408
00:22:41,480 --> 00:22:42,800
వాల్టర్ చివర ఉన్నాడు.

409
00:22:43,320 --> 00:22:45,880
ఫుట్‌బాల్ నన్ను ఇబ్బందుల నుండి దూరంగా

410
00:22:45,960 --> 00:22:49,600
ఉంచేందుకు, నేను ఆధారపడే వాహనమే
కానీ, నాకు ఫుట్‌బాల్ అంటే ఇష్టం.

411
00:22:49,680 --> 00:22:52,560
నేను ప్రతి అడుగు
పై స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటాను.

412
00:22:53,360 --> 00:22:56,160
ఫ్రిమాంటిల్ డాకర్స్
నన్ను తీర్చిదద్దడం గర్వంగా ఉంది.

413
00:22:56,240 --> 00:22:57,440
ఇది పెర్త్ జట్టు.

414
00:22:57,520 --> 00:23:00,200
వాళ్ళకు స్థానిక ఆటగాళ్ళుగా
గొప్ప చరిత్ర ఉంది.

415
00:23:00,280 --> 00:23:03,480
మాకు స్థానిక ఆటగాళ్ళుగా
మా కాలంలో చాలా మంది ఉన్నారు.

416
00:23:03,560 --> 00:23:05,680
ఇంకా చాలా మంది వస్తారనడంలో సందేహం లేదు.

417
00:23:05,760 --> 00:23:09,160
అతను మ్యాచ్ గెలిపించాడు.
మైఖేల్ వాల్టర్స్, తను గోల్స్ చేశాడు.

418
00:23:09,240 --> 00:23:13,240
సన్నీకి ఆటను చదవగలగడం
అతనికి ఉన్న గొప్ప శక్తి.

419
00:23:13,320 --> 00:23:17,360
మీరు ఆట చూస్తున్నప్పుడు
అతని బుర్ర పని చేస్తూ ఉంటుంది.

420
00:23:17,440 --> 00:23:20,200
అది కొంతమంది ఆటగాళ్ళలో చూడగలం,
అది అతనిలో చూశాను.

421
00:23:20,280 --> 00:23:22,960
అతను ఎప్పుడూ అందరికంటే
ఒక అడుగు ముందుంటాడు.

422
00:23:23,040 --> 00:23:27,560
మైఖేల్ వాల్టర్స్, అతను భారీగా వచ్చాడు,
గత కొన్ని వారాలుగా ఆటలలో ముందంజలో ఉన్నాడు.

423
00:23:27,640 --> 00:23:29,080
హోమ్‌లోకి చొరబడతాడు.

424
00:23:29,160 --> 00:23:31,160
చివరి క్వార్టర్ స్పెషలిస్ట్ వచ్చాడు.

425
00:23:31,760 --> 00:23:34,120
అది ఇష్టం. మైఖేల్ వాల్టర్స్‌ను
చూడడం బాగుంది,

426
00:23:34,200 --> 00:23:36,480
అతను ఒక గొప్ప స్టార్.

427
00:23:43,040 --> 00:23:46,800
మిడ్‌వేల్, డబ్ల్యూఏ

428
00:23:49,840 --> 00:23:51,360
నాకు పెద్ద కుటుంబం ఉంది.

429
00:23:51,440 --> 00:23:55,400
మీరు ఊహించినట్టు, దగ్గరి కుటుంబం,
తల్లి తరఫు బంధువులు, తండ్రి తరఫు

430
00:23:55,480 --> 00:23:58,040
బంధువులు అందరూ ఎల్లవేళలా కలుస్తుంటారు.

431
00:23:59,440 --> 00:24:01,240
పంది మాంసంతో చేసిన శాండ్విచ్ కావాలా?

432
00:24:01,320 --> 00:24:04,040
మా అమ్మ ఎక్కువ,
ఆమె ఎక్కువ శ్రద్ధ చూసుకుంటుంది.

433
00:24:05,600 --> 00:24:08,360
ఎప్పుడూ నన్ను శిక్షణకు,
ఆటలకు తీసుకెళ్ళేది ఆమె,

434
00:24:08,440 --> 00:24:11,760
మేము అందరం కలిసి వెళ్ళేందుకు,
నా స్నేహితులను ఇంటికి పిలిచేది.

435
00:24:11,840 --> 00:24:14,160
మేము అక్కడ కొంచెం అక్కడ ప్రయత్నిద్దాము.

436
00:24:14,720 --> 00:24:18,200
ఎప్పుడూ నా ఫుట్‌బాల్ బట్టలన్నీ తనే ఉతికి,

437
00:24:18,280 --> 00:24:21,400
ఉదయం నేను నిద్ర లేచేసరికి సిద్ధంగా ఉంచేది.

438
00:24:22,080 --> 00:24:24,320
ఈ పిల్లాడు ఆడగలడని నీకు ఎప్పుడు తెలిసింది?

439
00:24:24,400 --> 00:24:25,960
నడక మొదలుపెట్టక ముందునుంచి.

440
00:24:27,200 --> 00:24:29,960
వాడు ఫుట్‌బాల్ పట్టుకుని
ఉండేవాడు. ఎల్లప్పుడు.

441
00:24:30,040 --> 00:24:31,400
అది నిరంతరం.

442
00:24:31,480 --> 00:24:33,640
ఇంట్లో, దారిలో.

443
00:24:33,720 --> 00:24:36,800
నేను అనుకోవడం,
మా ఇల్లు సాలిస్‌బరీ నార్త్‌లో ఉండేది,

444
00:24:36,880 --> 00:24:40,000
కిటికీలకు కొన్ని రంధ్రాలు ఉండేవి.
అది సాధారణంగా జరిగేదా?

445
00:24:40,080 --> 00:24:41,680
అవును, ఇద్దరు అబ్బాయిలతో.

446
00:24:43,680 --> 00:24:45,680
నా కెరీర్‌లో ఆమెది పెద్ద పాత్ర.

447
00:24:45,760 --> 00:24:48,200
ఇప్పటికి కూడా, మైదానంలో మొదట ఉండేది తనే.

448
00:24:48,280 --> 00:24:50,080
కచ్చితంగా ఆమెకు చాలా రుణపడ్డాను.

449
00:24:51,200 --> 00:24:53,560
పెరిగే వయసులో బడిలో సమస్యలు తెచ్చేవాడా?

450
00:24:53,640 --> 00:24:57,560
-అంటే, వ్యక్తిగతంగా అని కాదు, కానీ...
-జాతి వివక్షత గురించి, ఒకటి

451
00:24:57,640 --> 00:25:00,480
రెండుసార్లు నా జూనియర్ ఫుట్‌బాల్‌లో
జరిగి ఉండవచ్చు.

452
00:25:00,560 --> 00:25:04,240
బయట ఎక్కడైనా కంటే
మైదానంలో ఎక్కువ ఎదుర్కొన్నాను.

453
00:25:04,320 --> 00:25:08,840
జూనియర్‌గా బయట ఫుట్‌బాల్ మైదానంలో,
నేను అందరినీ ద్వేషించాను,

454
00:25:08,920 --> 00:25:12,720
ఎందుకంటే నాకు అర్థంకాలేదు,
నన్నెందుకు పేర్లు పెట్టి పిలిచేవారో.

455
00:25:12,800 --> 00:25:15,760
వాళ్ళు నన్ను ఆట సరిగా
ఆడనివ్వకూడదని అనుకున్నారు.

456
00:25:16,120 --> 00:25:19,120
అది ఫ్రీ కిక్ కాబోతుంది కనుక
విసుగు కొనసాగుతుంది.

457
00:25:19,200 --> 00:25:20,840
అతను గాలిలో ముద్దు ఇచ్చాడా?

458
00:25:20,920 --> 00:25:22,960
అది క్షణంలో కొనసాగింది.

459
00:25:26,240 --> 00:25:29,120
జాతి, దూషణ గురించి మాట్లాడుతుంటే,

460
00:25:29,760 --> 00:25:31,720
దానిపై నిక్కీ విన్మర్, మైఖేల్ లాంగ్

461
00:25:31,800 --> 00:25:33,560
మాట్లాడేవరకు ఎవరూ మాట్లాడలేదు,

462
00:25:33,640 --> 00:25:37,120
వారికి ముందు కనీసం మా ఆటగాళ్ళు,
సిద్ జాక్సన్స్, పాలీ ఫార్మర్స్

463
00:25:37,200 --> 00:25:40,160
వాళ్ళు ప్రేమించే ఈ ఆటను ఆడేందుకు
నరకం చూసినా కూడా.

464
00:25:40,240 --> 00:25:43,680
వాళ్ళు ఈ ఆట వారికి తిరిగి ప్రేమను
ఇవ్వలేదని భావించేలా చేశారు.

465
00:25:46,240 --> 00:25:48,800
ఆటగాళ్ళ నుండి అది నిరంతరం ఎదుర్కొన్నారు.

466
00:25:48,880 --> 00:25:51,840
అంపైర్లు ఏమీ చేయలేదు,
జనం నుండి అది ఎదుర్కొన్నారు.

467
00:25:51,920 --> 00:25:54,000
అది అంతటా ఉండి, అది...

468
00:25:54,080 --> 00:25:55,800
అది భరించారు.

469
00:25:55,880 --> 00:25:58,520
"మైదానంలో ఏది జరిగినా అది మైదానం వరకే."

470
00:25:59,040 --> 00:26:01,920
"మీ నల్లవాళ్ళు
అది భరించాల్సిందే" అన్నట్టు.

471
00:26:02,000 --> 00:26:05,320
దానితో కొంతమందికి కొంత
అసాధారణమైన ధైర్యంతో

472
00:26:05,400 --> 00:26:09,360
"అది దారుణం.
ఇకపై అది మేము భరించము" అనేవాళ్ళు.

473
00:26:09,440 --> 00:26:12,960
మ్యాచ్ చివరి క్షణాలలో
గూడ్స్ చేసే జాతి వివక్ష దూషణ

474
00:26:13,040 --> 00:26:15,280
విజయాన్ని నీలినీడలా కమ్మేశాయి.

475
00:26:17,680 --> 00:26:21,800
వాళ్ళు ఎంత దృఢమైన,
తట్టుకోగల సామర్థ్యం కలిగిన వారో ఊహించలేను.

476
00:26:21,880 --> 00:26:25,160
ఫుట్‌బాల్ మైదానం వారి పని చేసే చోటు.

477
00:26:25,240 --> 00:26:27,480
విన్మర్: నల్లవాడిని, అందుకు గర్వంగా ఉంది

478
00:26:27,560 --> 00:26:30,840
నిక్కీ జెర్సీ తీసుకోవడం చూసినప్పుడు
నేను చిన్నవాడిని,

479
00:26:30,920 --> 00:26:33,760
ఎక్కడ చూసినా అదే ఉండడం గుర్తుంది.

480
00:26:34,880 --> 00:26:39,440
అతను ఇంత స్ఫూర్తిదాయకంగా
కావడానికి కారణం ఆ ఆటగాళ్ళు,

481
00:26:39,520 --> 00:26:41,480
అది ప్రతి వారం ఎదుర్కొనేవాళ్ళు.

482
00:26:47,720 --> 00:26:51,960
నాకు ఇలాంటి విగ్రహాలు చేసినప్పుడు,
మా కథలు చెప్పుకుని, జనం మా సంస్కృతిని

483
00:26:52,040 --> 00:26:54,480
వేడుక చేసుకుంటుంటే చాలా గర్వంగా ఉంటుంది.

484
00:26:54,560 --> 00:26:59,720
నిక్కీ లాంటి వాళ్ళు మాకు
మార్గం సుగమం చేయడం నాకు గర్వంగా ఉంది.

485
00:27:00,360 --> 00:27:03,960
ఆ బాధ్యతను యువ ఆటగాళ్ళకు
అందించడం కూడా మా కర్తవ్యం.

486
00:27:04,040 --> 00:27:06,480
అతను చేసిన దానికి మాత్రమే కాదు,

487
00:27:06,560 --> 00:27:09,680
మా సంస్కృతి పట్ల కూడా
గర్వంగా ఉందనడంలో సందేహం లేదు.

488
00:27:13,200 --> 00:27:17,680
క్రీడలు జాతి వివక్ష పరంగా
చాలా చర్చలలో మార్పు తీసుకువచ్చాయి.

489
00:27:17,760 --> 00:27:21,760
ఏఎఫ్ఎల్ భారీగా
క్రీడలో వైవిధ్యాన్ని ప్రోత్పహించింది

490
00:27:21,840 --> 00:27:25,520
ఇంకా ఇతర ప్రాంతంలో సంభాషణలు సృష్టించడం

491
00:27:25,600 --> 00:27:28,920
అవి కొన్నిసార్లు, ఇతర పనిచోట్లలో,
అది చేయడం కష్టంగా ఉంటుంది.

492
00:27:30,000 --> 00:27:34,120
నిక్కీ విన్మర్స్ భరించిన
ఆ ఒత్తిడి అంతటినీ ఎదుర్కోవడం,

493
00:27:34,200 --> 00:27:35,640
అది చాలా కష్టం.

494
00:27:35,720 --> 00:27:37,400
నిక్కీ, మైఖేల్ లాంగ్‌లు

495
00:27:37,480 --> 00:27:40,320
వాళ్ళు అనుభవించినది, పడిన కష్టం.

496
00:27:41,560 --> 00:27:45,240
నేను ఫుట్‌బాల్ మైదానంలో
ప్రతిసారి నా ప్రతిభను ప్రదర్శించి

497
00:27:45,320 --> 00:27:47,320
ఆట గెలవాలని అడుగుపెడతాను, అలాగే

498
00:27:47,400 --> 00:27:50,680
తరువాతి తరాన్ని ముందుకు నడిపించి,
ఆదర్శంగా నిలవాలని కూడా.

499
00:27:57,520 --> 00:27:59,440
బుష్‌బీ వీధి

500
00:28:09,760 --> 00:28:11,360
నా సంస్కృతిలో నేను గర్వించేది,

501
00:28:11,440 --> 00:28:14,840
ఫుట్‌బాల్ మైదానంలోకి వెళ్ళే పరంగా,
అది అతిపెద్ద ఉద్ధరణ.

502
00:28:26,680 --> 00:28:29,240
స్థానిక పిల్లలు వచ్చి,

503
00:28:29,320 --> 00:28:31,600
ఆధిపత్యంతో అసలైన ఫుట్‌బాల్ ఆడి,

504
00:28:31,680 --> 00:28:34,200
వారికి, వారి కుటుంబాలకు
ఒక కెరీర్ ఏర్పర్చాలి.

505
00:28:34,280 --> 00:28:36,000
విస్తరించు. దాన్ని సాగదీయి.

506
00:28:36,640 --> 00:28:40,600
వీధిలో నడుస్తుంటే, జనం మన పేరు
పిలుస్తుంటే ఎప్పుడూ బాగుంటుంది.

507
00:28:40,680 --> 00:28:45,400
చిన్న పిల్లలు వీపు పైన నా నంబరుతో
తిరుగుతుంటే చాలా బాగుంటుంది.

508
00:28:49,160 --> 00:28:50,120
ఏం జరుగుతోంది?

509
00:28:50,480 --> 00:28:51,520
ఏమీ లేదు.

510
00:28:51,600 --> 00:28:52,960
ఏం లేదు. ఎలా ఉన్నావు?

511
00:28:53,040 --> 00:28:54,480
మైఖేల్ ఓలాఫ్లిన్ వచ్చాడు.

512
00:28:54,560 --> 00:28:56,640
-ఎలా ఉన్నావు?
-కలవడం సంతోషం, సోదరా

513
00:28:56,720 --> 00:28:58,400
పరిసరాలు చూపిస్తున్నాడు.

514
00:28:58,480 --> 00:28:59,960
అతని చోటు చూపిస్తున్నాడు.

515
00:29:00,040 --> 00:29:01,800
ఇక్కడ ఫ్రిమాంటిల్ అభిమాని ఎవరు?

516
00:29:03,040 --> 00:29:04,280
వెస్ట్ కోస్ట్ అభిమానులు?

517
00:29:05,040 --> 00:29:06,360
సిడ్నీ స్వాన్స్ అభిమానులు?

518
00:29:06,440 --> 00:29:08,040
మీరు వెళ్ళిపోవచ్చు.

519
00:29:08,800 --> 00:29:10,400
లేదు, మీరు ఆడుతున్నారు.

520
00:29:13,360 --> 00:29:15,840
మా కుటుంబం,
మేము బలమైన, స్థానికులం.

521
00:29:16,160 --> 00:29:18,040
మేము ఎక్కడినుండి వచ్చామో తెలుసు.

522
00:29:18,120 --> 00:29:21,120
వాళ్ళు ఎప్పుడూ దేశానికి తిరిగి వెళతారు,
దక్షిణం వైపుకు

523
00:29:21,200 --> 00:29:24,000
ఆల్బనీ ఇంకా దక్షిణ ప్రాంతాలన్నీ వెళతారు.

524
00:29:24,080 --> 00:29:28,080
ఆ ప్రాంతాల పట్ల మా ప్రేమలో సందేహమే లేదు
మా సంస్కృతి దానిలో నుండే వచ్చింది.

525
00:29:28,160 --> 00:29:29,120
ఎలా ఉన్నావు?

526
00:29:29,200 --> 00:29:31,200
ఇదివరకు మీతో నేను ఒక ఫోటో దిగాను.

527
00:29:32,640 --> 00:29:35,440
పాత తరం వారు,
మనకు దాని గురించి నేర్పించి,

528
00:29:35,520 --> 00:29:38,120
మన మూలాలు గుర్తుంచుకునేలా నాటారు.

529
00:29:38,200 --> 00:29:40,000
మూడు అనగానే అందరూ స్వాన్స్ అనాలి.

530
00:29:41,880 --> 00:29:43,800
మూడు అంటే ఫ్రియో.
ఒకటి, రెండు, మూడు!

531
00:29:43,880 --> 00:29:45,040
ఫ్రియో!

532
00:29:53,560 --> 00:29:56,480
ఏఎఫ్ఎల్‌డబ్ల్యూ అసలైన మెరిసే కాంతి.

533
00:29:56,560 --> 00:29:59,520
ఆట చుట్టూ ఈ అద్భుతమైన కోలాహలం.

534
00:29:59,600 --> 00:30:02,160
మొదటి ఆటలోనే, హాడర్ వేగం చూడండి.

535
00:30:02,240 --> 00:30:03,880
ఆమె తన మొట్టమొదటి గోల్ చేసింది!

536
00:30:03,960 --> 00:30:08,120
ఈ బలమైన, అద్భుతమైన గర్వించదగ్గ
నల్ల మహిళలు అద్భుతంగా ఉన్నారంతే.

537
00:30:08,200 --> 00:30:11,280
వాళ్ళు మన యువతరానికి స్ఫూర్తిదాయకం కూడా.

538
00:30:12,040 --> 00:30:13,280
ఎలా ఉన్నావు?

539
00:30:13,360 --> 00:30:15,640
నిన్ను కలవడం బాగుంది. ఎలా ఉన్నావు?

540
00:30:15,720 --> 00:30:18,400
చాలా బాగున్నాను.
ఇక్కడ ఉండి ఊదా రంగు వేసుకోలేదు.

541
00:30:18,480 --> 00:30:20,440
-అయ్యో లేదు.
-క్షమించు.

542
00:30:20,520 --> 00:30:23,840
ఎప్పుడూ ఉండే దానికి భిన్నం,
కానీ నేను మీ దేశంలో ఉన్నాను.

543
00:30:23,920 --> 00:30:25,480
నూన్గర్ నేల మీద.

544
00:30:25,560 --> 00:30:28,120
-అవును.
-అయితే చాలా ప్రత్యేకమైన చోటు.

545
00:30:28,200 --> 00:30:29,600
కచ్చితంగా.

546
00:30:29,680 --> 00:30:33,200
ఈ సమాజంలో ఏఎఫ్ఎల్‌డబ్ల్యూ
తన పాత్ర పోషిస్తోంది.

547
00:30:33,280 --> 00:30:36,160
అది దేశవ్యాప్తంగా చాలా బలపడుతోంది.

548
00:30:36,240 --> 00:30:37,800
పెర్త్‌లో ఉండడం ఎలా ఉంది?

549
00:30:37,880 --> 00:30:43,120
మన క్లబ్‌ను మహిళా జట్టు లేకుండా
నాకు ఊహించడం కష్టంగా ఉంది.

550
00:30:43,200 --> 00:30:45,360
-కచ్చితంగా.
-అది తగ్గుతుంది.

551
00:30:46,000 --> 00:30:48,240
అది చాలా నిశ్శబ్దంగా కూడా ఉంటుంది.

552
00:30:50,160 --> 00:30:53,000
కానీ వాళ్ళు క్లబ్‌లో, మైదానంలో,

553
00:30:53,080 --> 00:30:57,560
పరస్పరం ఇంకా అందరిలో
తీసుకొచ్చిన శక్తి అద్భుతం.

554
00:30:57,640 --> 00:31:00,120
మా యువ తరానికి స్ఫూర్తిదాయకం,

555
00:31:00,200 --> 00:31:03,720
ఈ అసాధారణమైన శక్తిగల మహిళలను,

556
00:31:03,800 --> 00:31:05,560
మాకు ఇష్టమైన ఆట ఆడుతుంటే చూడడం.

557
00:31:05,640 --> 00:31:08,080
ఎడమవైపు సునాయాసంగా వెళుతుందా?

558
00:31:08,160 --> 00:31:09,760
వెళుతుంది, బౌన్స్ సాధించింది.

559
00:31:09,840 --> 00:31:11,680
మాడీ ప్రెస్పాకిస్, చిన్నది.

560
00:31:11,760 --> 00:31:15,680
నేను ఎప్పుడూ చెబుతాను,
ఏఎఫ్ఎల్ ఫుట్‌బాల్ మా ప్రజలకు

561
00:31:15,760 --> 00:31:20,000
బడి, చదువు, ఆరోగ్య జీవనశైలి, ఉద్యోగం
గురించి తెలుసుకునే అద్భుతమైన వాహనం.

562
00:31:20,080 --> 00:31:24,000
నేను అనుకోవడం, నా విషయంలో,
త్వరగా జరిగిన విషయాలలో ఒకటి

563
00:31:24,800 --> 00:31:28,080
అది ఇతరులకు మనం అది చేయగలం అని చూపింది.

564
00:31:29,000 --> 00:31:32,240
మరీ ముఖ్యంగా,
అది మనకు చేయగలం అని చూపింది.

565
00:31:32,800 --> 00:31:35,280
మనం అది చేయగలిగితే,
ఇతరులు చేయగలరు.

566
00:31:35,680 --> 00:31:38,240
జాతీయ జనాభాలో

567
00:31:38,320 --> 00:31:40,200
3 శాతం మాత్రమే ఉన్న

568
00:31:40,280 --> 00:31:43,560
ఫస్ట్ నేషన్స్ ప్రజల ప్రాతినిధ్యం,

569
00:31:44,480 --> 00:31:48,440
ఏఎఫ్ఎల్‌లో, పురుషుల జట్లు
అలాగే మన మహిళల జట్లు,

570
00:31:48,520 --> 00:31:51,640
మనం 11 నుండి 13 శాతం మధ్యలో ఉన్నాం.

571
00:31:54,800 --> 00:31:56,760
నిజానికి, నేను అనుకోవడం, అసాధారణం

572
00:31:56,840 --> 00:31:59,280
అనే మన సంస్కృతి గురించి అనుకుంటాం,

573
00:31:59,360 --> 00:32:03,000
కానీ మన రక్తసంబంధం గురించి మాట్లాడితే,
అది దేశం గురించి చెబుతుంది.

574
00:32:03,080 --> 00:32:04,840
దేశం మిమ్మల్ని దృఢంగా చేస్తుంది.

575
00:32:04,920 --> 00:32:06,440
సంస్కృతి బలంగా చేస్తుంది.

576
00:32:09,280 --> 00:32:12,120
మాతృభూమి
పాయింట్ పియర్స్

577
00:32:28,520 --> 00:32:30,600
ఇక్కడ ఎంత కాలంగా నివసిస్తున్నావు?

578
00:32:30,680 --> 00:32:32,040
-ఈ ఇంట్లోనా?
-అవును.

579
00:32:32,120 --> 00:32:33,520
ఇరవై ఏళ్ళు, 21 ఏళ్ళు.

580
00:32:38,920 --> 00:32:40,480
ఇంకా అతి చిన్న...

581
00:32:40,560 --> 00:32:42,200
-14 మందిలో.
-14 మంది పిల్లలా?

582
00:32:42,280 --> 00:32:43,880
అంకుల్ మడ్డీ
నారుంగా

583
00:32:43,960 --> 00:32:45,520
-మా నాన్న సోదరుడా?
-అవును.

584
00:32:46,720 --> 00:32:49,720
ఇక్కడ ఏంటి ఉంది? ఇది నాకు వివరించండి.

585
00:32:51,080 --> 00:32:53,760
ఇది నా... ఎవరైనా చదవగలరా?
నువ్వు ఇది చదవగలవా?

586
00:32:53,840 --> 00:32:55,800
సరే, అది నా మినహాయింపు పత్రాలు.

587
00:32:56,400 --> 00:33:00,600
అందులో, "బతుకుదెరువు కోసం
ఆదిమవాసిగా ఉండడం

588
00:33:00,680 --> 00:33:02,400
ఆపేస్తానని చెప్పాలి" అని ఉంది.

589
00:33:02,480 --> 00:33:04,240
దాన్ని కుక్క టికెట్ అంటాము.

590
00:33:04,960 --> 00:33:08,320
-అప్పుడు మీకు ఎన్నేళ్ళు?
-నాకు అది ఇచ్చినప్పుడు మూడేళ్ళు.

591
00:33:08,640 --> 00:33:11,360
"ఒకవేళ ఏ సమయంలో అయినా
ఆదిమవాసీల రక్షణ బోర్డ్

592
00:33:11,440 --> 00:33:15,440
"పేర్కొనబడిన మైఖేల్ విక్టర్ ఓలాఫ్లిన్... "

593
00:33:15,520 --> 00:33:16,360
-మీరు.
-అవును.

594
00:33:16,440 --> 00:33:19,320
"...డిక్లరేషన్ కొనసాగించగల స్వభావం,

595
00:33:19,400 --> 00:33:23,560
"ప్రమాణాలకు తగ్గ తెలివితేటలు
మరియు అభివృద్ధి కలిగి లేడని అభిప్రాయపడితే

596
00:33:23,640 --> 00:33:27,400
"ఆదిమవాసీల రక్షణ బోర్డ్
ఈ డిక్లరేషన్‌ను రద్దు చేయగలదు."

597
00:33:27,480 --> 00:33:29,480
-నమ్మశక్యంగా లేదు.
-నువ్వు ఇది చూశావా,

598
00:33:29,560 --> 00:33:31,880
"బ్రతుకుతెరువుకోసం ఆదిమవాసీగా

599
00:33:31,960 --> 00:33:34,880
"ఉండడం ఆపేస్తే..." అని ఉంది,
అది నల్లవాళ్ళందరికా?

600
00:33:34,960 --> 00:33:36,520
చాలామంది అది సంతకం చేయాలని

601
00:33:36,600 --> 00:33:38,840
అనుకోలేదు, కానీ వాళ్ళు ఈ లక్ష్యం నుండి

602
00:33:38,920 --> 00:33:41,320
దూరంగా వారి కుటుంబాలకు మంచి జీవితం కోసం...

603
00:33:41,400 --> 00:33:43,840
-పని వెతుక్కుంటూ వెళ్ళారు.
-బయట పనిచేయడానికి.

604
00:33:43,920 --> 00:33:47,560
ఆదిమవాసిగా ఉండడం
ఆపేయడం అనేది నేను ఆలోచించేది.

605
00:33:47,640 --> 00:33:50,240
ఇది సాధారణ మినహాయింపు ధృవీకరణ పత్రం.

606
00:33:50,320 --> 00:33:53,240
అదనపు ప్రయోజనాలు:

607
00:33:53,640 --> 00:33:56,720
పట్టణంలో అరెస్ట్ కాకుండా
స్వేచ్ఛగా తిరగవచ్చు.

608
00:33:56,800 --> 00:33:57,640
అవును.

609
00:33:57,800 --> 00:34:00,480
బ్రాకెట్‌లో.
"గమనిక: కర్ఫ్యూలు వర్తిస్తాయి."

610
00:34:00,560 --> 00:34:02,120
షాప్ లేదా హోటల్‌లో ప్రవేశం.

611
00:34:02,200 --> 00:34:04,000
(సేవ అందవచ్చు, అందకపోవచ్చు.)

612
00:34:04,080 --> 00:34:04,920
అవును.

613
00:34:05,720 --> 00:34:07,000
ప్రత్యేక పరిస్థితులు.

614
00:34:07,080 --> 00:34:09,680
"ఈ మినహాయింపు ధ్రువీకరణ పత్రం పొందాలంటే,

615
00:34:09,760 --> 00:34:12,160
"ఈ క్రింది వాటికి కచ్చితంగా
కట్టుబడి ఉండాలి."

616
00:34:12,560 --> 00:34:15,800
మాతృభాషలో మాట్లాడడం - నిషిద్ధం.

617
00:34:15,880 --> 00:34:20,160
నృత్యం, సంస్కారవిధులు,
స్థానిక ఆచారాలు - నిషిద్ధం.

618
00:34:20,240 --> 00:34:24,440
తోటి స్థానికులతో సహవాసం చేయడం,
(కుటుంబంతో సహా) - నిషిద్ధం.

619
00:34:24,520 --> 00:34:26,480
సొంత కుటుంబాన్ని
కలవడానికి అనుమతించరు.

620
00:34:26,560 --> 00:34:29,240
"విశాల సమాజంలోకి సమ్మిళితం కావాలి.

621
00:34:29,320 --> 00:34:32,680
"అన్ని షరతులు నెరవేరితే
మరియు సంతృప్తికరంగా సమర్థించబడితే,

622
00:34:32,760 --> 00:34:36,520
"పర్యవేక్షణ లేకుండా పట్టణంలో
నివసించేందుకు మీరు అర్హులు."

623
00:34:37,040 --> 00:34:40,760
ఆదిమవాసుల రక్షణ చట్టం నుండి
స్వేచ్ఛగా తెల్లవారిలాగా జీవించేందుకు

624
00:34:40,840 --> 00:34:42,400
ఇది మీకు అవకాశం.

625
00:34:44,160 --> 00:34:46,120
-పిచ్చితనం.
-పూర్తిగా పిచ్చితనం.

626
00:34:46,200 --> 00:34:49,080
మార్చి 10, 1951 తేదీ.

627
00:34:49,480 --> 00:34:52,280
-ఈ ఒక్క వాక్యం నన్ను బాధించింది.
-ఏది?

628
00:34:52,360 --> 00:34:55,560
ఆదిమవాసుల రక్షణ చట్టం నుండి
స్వేచ్ఛగా తెల్లవారిలాగా

629
00:34:55,640 --> 00:34:58,200
జీవించేందుకు ఇది మీకు అవకాశం.

630
00:34:59,360 --> 00:35:01,800
ఈ మినహాయింపులు మరియు ధ్రువపత్రాలన్నీ

631
00:35:01,880 --> 00:35:06,200
ఇంకా ఈ పనులన్నీ చేయడం నిషేధించబడింది,
కానీ అందరూ కలిసి ఫుట్‌బాల్ ఆడారు.

632
00:35:06,280 --> 00:35:09,520
ఆ తర్వాత ఆట ముగియగానే,
వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళారు.

633
00:35:09,600 --> 00:35:12,160
నీ దారిలో నువ్వు వెళతావు.
నేను ఆడినప్పుడు,

634
00:35:12,240 --> 00:35:15,640
-అది 67, 66 సంవత్సరం, నేను ఆడినప్పుడు.
-సరే.

635
00:35:16,360 --> 00:35:19,360
-తరువాత నేను పబ్‌కు వెళ్ళలేకపోయాను.
-నమ్మలేకపోతున్నా.

636
00:35:20,440 --> 00:35:22,600
-అది...
-అవును.

637
00:35:22,680 --> 00:35:25,200
-అది ప్రాణాంతకం.
-అది మంచి పాత ఫోటో.

638
00:35:26,600 --> 00:35:29,840
-చాలామంది మంచి ఫుట్‌బాలర్లు ఇక్కడివాళ్ళే.
-సరే.

639
00:35:29,920 --> 00:35:33,440
ఈ యువతరం ఈ జనంతో మొదలుపెట్టారు,

640
00:35:33,520 --> 00:35:35,480
ఆ తరువాత రక్తసంబంధాలు చేరారు.

641
00:35:35,600 --> 00:35:37,560
మొదటినుంచీ, నేను చెప్పినట్లుగా...

642
00:35:37,880 --> 00:35:40,160
ఏఎఫ్ఎల్ ఫుట్‌బాల్ ఆడేందుకు అవకాశం ఇచ్చారు.

643
00:35:40,240 --> 00:35:41,760
-నేను సిడ్నీకి వెళ్ళాను.
-సరే.

644
00:35:43,120 --> 00:35:44,960
అక్కడ 25 ఏళ్ళు గడిపాను.

645
00:35:45,040 --> 00:35:47,880
మీ అమ్మ ప్రశ్న, "సిడ్నీని
ప్రోత్సహిస్తున్నావా?" అని.

646
00:35:47,960 --> 00:35:50,480
"లేదు, నేను రిచ్‌మండ్
మద్దతుదారుడిని" అన్నాను.

647
00:35:50,560 --> 00:35:52,680
నేను జట్లు ఊరికే అలా మార్చలేను.

648
00:35:52,760 --> 00:35:54,840
నేను 1959 నుండి రిచ్‌మండ్‌తో ఉన్నాను.

649
00:35:55,320 --> 00:35:59,720
సిడ్నీలో ఇంటి నుండి చాలా దూరంగా ఉన్నాక,
నేను శక్తిని పొందే ఒక్క విషయం,

650
00:35:59,800 --> 00:36:03,040
ఇక్కడికి వచ్చి వెళ్ళే నా సంబంధీకుల నుండే.

651
00:36:08,280 --> 00:36:09,280
నీ సంబంధం.

652
00:36:09,360 --> 00:36:12,080
నారుంగాతో, నారింజెరి,
కౌర్నాతో సంబంధించాలి,

653
00:36:12,160 --> 00:36:14,280
నాకు ఇంటి మీద బెంగగా ఉన్నప్పుడు

654
00:36:14,360 --> 00:36:18,120
లేదా నాకు గాయాలు అయినప్పుడు

655
00:36:18,200 --> 00:36:21,720
లేదా రూపం లేదా మరొకటైనా,
నేను చోటు గురించి ఆలోచిస్తాను...

656
00:36:25,840 --> 00:36:27,800
మీలాంటి వారి దగ్గరకు తిరిగిరావడం.

657
00:36:27,880 --> 00:36:30,960
నేను ఇంటికి చాలా దూరంగా ఉన్నాను.
కొన్ని కోల్పోయాను

658
00:36:31,040 --> 00:36:34,680
కానీ నా ప్రయాణం
మీరు గర్వించదగ్గదని తెలుసు.

659
00:36:34,760 --> 00:36:37,400
-ఇంటికి రావడానికి నీకు ఇల్లు ఉంది.
-కచ్చితంగా.

660
00:36:37,480 --> 00:36:40,320
ఆ ప్రాంతంలో ఉన్న
రక్తసంబంధీకుల పట్ల గర్వంగా ఉంది.

661
00:36:40,400 --> 00:36:41,800
నా పిల్లలకు అదే నేర్పుతాను.

662
00:36:45,720 --> 00:36:49,840
మా వేలాదిమంది తాతలు, బామ్మలు
ఈ దేశంలో నడిచారు.

663
00:36:49,920 --> 00:36:52,800
అది నా మూలాలు ఇంకా నా రక్తసంబంధాలు.

664
00:36:52,880 --> 00:36:54,160
కూరంగ్, ఎస్ఏ

665
00:36:54,240 --> 00:36:55,520
ఇది నా పూర్తి జీవితం.

666
00:36:55,880 --> 00:37:00,360
అది అక్కడ మొదలయింది,
వేలాది సంవత్సరాలుగా అక్కడే ఉంది.

667
00:37:01,080 --> 00:37:02,920
అది నా మనసులో ఉంది.

668
00:37:08,240 --> 00:37:10,240
పితృదేశం
రౌకన్

669
00:37:15,880 --> 00:37:19,000
నాకు ఇక్కడికి రావడం ఇష్టం.
ఇది అద్భుతమైన దేశం.

670
00:37:19,640 --> 00:37:23,600
కానీ నాకు ఎల్లప్పుడూ తెలిసిన, అనుబంధం ఉన్న

671
00:37:23,680 --> 00:37:26,720
రక్తసంబంధీకులు ఈ రాష్ట్రంలో తిరిగారు.

672
00:37:27,320 --> 00:37:31,000
రౌకన్ ఇంకా నారింజెరి దేశం,
మా నాన్న వాళ్ళ దేశాలు,

673
00:37:31,080 --> 00:37:33,320
నాకు కూడా అవి ప్రత్యేకమైన ప్రాంతాలు.

674
00:37:42,600 --> 00:37:45,000
హే. మైఖేల్ ఓలాఫ్లిన్.

675
00:37:45,720 --> 00:37:46,680
ఎలా ఉన్నారు?

676
00:37:46,760 --> 00:37:48,560
-నిన్ను చూడడం సంతోషం.
-నాకు కూడా.

677
00:37:49,080 --> 00:37:51,480
-ఇంటికి స్వాగతం.
-నిన్ను చూడడం బాగుంది.

678
00:37:51,560 --> 00:37:54,080
అది ఎప్పుడూ నా వాళ్ళ గురించే.

679
00:37:54,600 --> 00:37:58,280
అది ఎప్పుడూ పాయింట్ పియర్స్ గురించి,
రౌకన్ గురించి, ఇంకా

680
00:37:58,360 --> 00:38:01,000
మా వాళ్ళు అనుభవించిన అనుభవాలు,

681
00:38:01,080 --> 00:38:04,480
మాతో వ్యవహరించిన తీరుకు
మేము ఎంత ధృడంగా కావడం వరకు.

682
00:38:04,600 --> 00:38:08,800
మా ముత్తాత, మిలెరంకు,
ఇలా అనాలనే ముందు చూపు కలవాడు, "ఆగు.

683
00:38:09,280 --> 00:38:12,400
"ఈ ప్రాంతంలో
ఈ పొలాలన్నీ పుట్టుకొస్తున్నాయి."

684
00:38:12,480 --> 00:38:15,240
మా భవిష్యత్తు శాశ్వతంగా
ఎలా మారుతుందో ఆయన చూడగలగడం,

685
00:38:15,320 --> 00:38:17,520
నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది,

686
00:38:17,600 --> 00:38:19,360
అద్భుతం. ఏం ఉంది, అంకుల్?

687
00:38:19,440 --> 00:38:21,240
నాకు అది వెంటనే తెలిసింది.

688
00:38:21,320 --> 00:38:22,720
అయన మిలెరం.

689
00:38:23,280 --> 00:38:25,160
మీ ముత్తాత.

690
00:38:25,240 --> 00:38:28,520
ఆయన మొదటి తెల్ల వ్యక్తిని చూసినప్పుడు
ఆయనకు ఆరేళ్ళనుకుంటా,

691
00:38:28,600 --> 00:38:30,680
ఆయనకు తెలుసు...

692
00:38:31,640 --> 00:38:35,240
ఆయన తన తల్లిదండ్రులనుండి,
తాతయ్య బామ్మలనుండి నేర్చుకున్న జ్ఞానంతో,

693
00:38:35,600 --> 00:38:37,960
ఆయన పని వలన
నేడు మనకు నిఘంటువు ఉన్నది.

694
00:38:38,040 --> 00:38:38,880
కచ్చితంగా.

695
00:38:38,960 --> 00:38:43,040
అందుకని, ఆయన నేర్పిన
700 లేదా అంతకు మించిన పదాలు...

696
00:38:43,120 --> 00:38:45,120
-అవును.
-...అది ఎవరు చేస్తున్నారు?

697
00:38:45,200 --> 00:38:46,360
ఎవరూ చేయడం లేదు.

698
00:38:46,440 --> 00:38:49,240
అదృష్టం, మనందరం దేశమంతటా తిరిగాము,

699
00:38:49,320 --> 00:38:53,760
ఎన్నో దేశ సమూహాలు భాషను,
సాంస్కృతిక ఆచరణను,

700
00:38:53,840 --> 00:38:55,520
కోల్పోయాయని మనకు తెలుసు.

701
00:38:55,640 --> 00:38:56,480
అవును.

702
00:38:56,560 --> 00:38:58,560
మన వాళ్ళు ఎంతోమంది,

703
00:38:58,640 --> 00:39:00,960
మన తాతయ్య బామ్మలు,
మనసు విరిగిన వాళ్ళను,

704
00:39:01,040 --> 00:39:03,240
స్ఫూర్తి విచ్ఛిన్నమయిన వారని గుర్తించాం.

705
00:39:03,320 --> 00:39:07,720
అందులోనుండి కొందరు బయటపడ్డారు,
కొందరు పడలేదని మనకు తెలుసు.

706
00:39:08,320 --> 00:39:13,160
ఆ పరిస్థితి ఇప్పటికీ అలానే ఉంది. మనం ఇంకా

707
00:39:15,840 --> 00:39:17,480
అత్మహత్యలు, యువకుల ఆత్మహత్యలు,

708
00:39:17,560 --> 00:39:20,360
తాగుడు లాంటి
దారుణమైన సమస్యలతో వ్యవహరిస్తున్నాము.

709
00:39:20,440 --> 00:39:23,200
అందుకని, అది మనందరికీ సవాలే.

710
00:39:23,720 --> 00:39:25,680
మనం ఏం వదిలి వెళతాం?

711
00:39:25,760 --> 00:39:27,560
మన జీవితాలను ఎందులో పెట్టుబడి

712
00:39:27,640 --> 00:39:30,360
పెడతాం, మన తరువాతి తరం వారికి
ఏం వదిలి వెళతాం?

713
00:39:36,080 --> 00:39:39,240
మైఖేల్‌ను చూసినప్పుడు,
అతనిని చిన్న పిల్లాడిగా చూస్తాను,

714
00:39:39,320 --> 00:39:41,320
ఎందుకంటే నాకు వాళ్ళ అమ్మానాన్న తెలుసు.

715
00:39:41,400 --> 00:39:43,640
తనని సిడ్నీ తరఫున ఆడిన
మైఖేల్‌గా చూస్తాను,

716
00:39:43,720 --> 00:39:46,160
కానీ తనను భిన్నంగా కూడా చూస్తాను.

717
00:39:46,240 --> 00:39:49,000
తన జీవితంలో దాదాపుగా ప్రతి దశను చూశాను,

718
00:39:49,080 --> 00:39:50,800
అందుకని మైఖేల్ చేసేది

719
00:39:51,840 --> 00:39:54,000
అత్యద్భుతంగా ముఖ్యమైనది.

720
00:39:54,440 --> 00:39:56,480
మనకు మైఖేల్ లాంటి వాళ్ళు కావాలి.

721
00:39:56,800 --> 00:39:59,920
అతను నిజంగా ఈ తరం మిలెరం.

722
00:40:06,280 --> 00:40:08,360
తనని చూసినప్పుడు వెన్నులో చలి వస్తుంది.

723
00:40:08,440 --> 00:40:11,520
ఎలా అంటే, అందులో నేను మా నాన్నను చూడగలను.

724
00:40:11,600 --> 00:40:13,160
-సరే.
-అలాగే.

725
00:40:13,240 --> 00:40:15,400
అది చూస్తే మా నాన్న ముఖం కనిపిస్తుంది.

726
00:40:15,960 --> 00:40:17,200
-నమ్మలేను.
-అవును.

727
00:40:18,320 --> 00:40:20,000
-అతను దృఢమైన మనిషి.
-అవును.

728
00:40:20,080 --> 00:40:23,280
చాలా... కూరంగ్‌లో ఉండకపోతే,
దృఢంగా ఉండలేరు.

729
00:40:24,280 --> 00:40:26,200
దృఢత్వం ఇంకా కఠినత్వం ఉంటుంది.

730
00:40:45,040 --> 00:40:48,360
భూమి మీద ఆదిమవాసులు
అత్యంత దృఢమైన వారు.

731
00:40:48,720 --> 00:40:51,600
ఉండాలి, మనం అనుభవించినది,

732
00:40:51,680 --> 00:40:54,520
కఠినమైన ఖండంలో
ఎలా బ్రతికామన్న దానితో పోలిస్తే,

733
00:40:54,600 --> 00:40:56,880
ఆస్ట్రేలియా అనే
నమ్మశక్యంకాని ప్రాంతం,

734
00:40:56,960 --> 00:41:00,240
వేలాది సంవత్సరాలు మన వాళ్ళు
జాగ్రత్త ప్రేమగా చూసుకున్నది.

735
00:41:20,600 --> 00:41:21,880
పాయింట్ పియర్స్
"షాక్"

736
00:41:21,960 --> 00:41:25,000
నేను పెరిగేటప్పుడు
పాయింట్ పియర్స్‌లో షాక్‌లో

737
00:41:25,080 --> 00:41:27,080
ఎక్కువగా గడిపాను.

738
00:41:33,920 --> 00:41:36,280
-ఇది నిర్మించడం గుర్తుంది.
-అవును.

739
00:41:36,920 --> 00:41:39,520
నీకు 12, 13 ఏళ్ళ వయసు.

740
00:41:39,600 --> 00:41:40,520
నేను నిర్మించాను.

741
00:41:40,600 --> 00:41:43,680
మీరోజుల్లో రెండు వైపులా
రెండు ఇసుక తిన్నెలు ఉన్నాయి.

742
00:41:52,680 --> 00:41:54,680
తిరిగి దేశంలో అడుగుపెట్టినప్పుడు,

743
00:41:54,760 --> 00:41:57,280
అదంతా మళ్ళీ అనుభవించడాన్ని
వివరించడం కష్టం.

744
00:41:57,360 --> 00:41:59,400
నీకు శక్తివంతంగా అనిపిస్తుంది.

745
00:41:59,480 --> 00:42:01,760
-బామ్మ తీసుకువచ్చేది...
-ఇక్కడిదాకా.

746
00:42:01,840 --> 00:42:04,200
అవును, అంతా తిప్పేది.
మాకు దేశం చూపించేది.

747
00:42:06,440 --> 00:42:08,520
సంతోషం, మా సోదరుడి ఇల్లు కూడా.

748
00:42:08,600 --> 00:42:09,640
నీకు ఇది కావాలి.

749
00:42:10,200 --> 00:42:13,960
సంస్కృతి అంటే ఇదే.
సంస్కృతి ఏదైనా చేయడానికి శక్తిని ఇస్తుంది.

750
00:42:20,760 --> 00:42:22,840
ఇక్కడ కూర్చో, ఇది రోజంతా చూడు.

751
00:42:22,920 --> 00:42:24,120
అందంగా ఉంది కదా?

752
00:42:27,680 --> 00:42:30,640
నేను ఇక్కడికి, అక్కడికి,
అన్నిచోట్లకు వెళతాను, నీలాగా.

753
00:42:30,720 --> 00:42:32,600
కానీ ఎప్పుడూ ఇంటికి రావడం ఇష్టం.

754
00:42:32,680 --> 00:42:34,080
-పునర్‌కలయిక.
-అంతే.

755
00:42:34,160 --> 00:42:36,000
-శక్తి.
-నీకు నీవు నిజాయితీగా ఉండు.

756
00:42:36,080 --> 00:42:37,760
అదే మనం నేర్చుకోవాల్సింది.

757
00:42:38,880 --> 00:42:42,640
నీకు నువ్వు నిజాయితీగా ఉండకపోతే,
ఇంకెవరితో నిజాయితీగా ఉంటావు?

758
00:42:45,400 --> 00:42:47,320
ఇక్కడ ఇంకా కుందేళ్ళు ఉన్నాయా?

759
00:42:47,400 --> 00:42:49,200
కుందేళ్ళు, కంగారూ, అన్నీ.

760
00:42:49,280 --> 00:42:50,960
-కంగారూనా?
-అతిపెద్ద సమూహం.

761
00:42:51,040 --> 00:42:53,200
-అవన్నీ ఇక్కడి దాకా వస్తాయి.
-కంగారూలా?

762
00:43:02,160 --> 00:43:05,880
ప్రతి వారాంతం, నేను ఫుట్‌బాల్ ఆడకపోతే,
ప్రతి సెలవురోజు, అక్కడ ఉంటాం.

763
00:43:07,920 --> 00:43:10,840
నేను తిరిగి వచ్చి కొంత కాలం అవడంతో
అది చేయలేకపోయాను.

764
00:43:12,760 --> 00:43:15,320
ఎందుకంటే జీవితం ఈ ప్రయాణం చేయిస్తుంది

765
00:43:15,400 --> 00:43:18,040
అందులో మీ సొంత కుటుంబాన్ని చూసుకుంటారు.

766
00:43:21,640 --> 00:43:25,240
అది ఆదిమవాసులు కాని వారికి వివరించి,

767
00:43:25,320 --> 00:43:27,720
ఇది చెప్పు,
ఆ చోటు ఎందుకు నీకు ప్రత్యేకం?

768
00:43:32,760 --> 00:43:33,840
అంటే...

769
00:43:34,320 --> 00:43:37,760
మా వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా
వేటాడి, సమీకరించారు.

770
00:43:56,840 --> 00:43:58,280
అందుకని, అది ఇదే, సోదరా.

771
00:44:16,320 --> 00:44:18,120
మనం అక్కడ ఆ చోట నడుద్దాం.

772
00:44:21,320 --> 00:44:23,080
అక్కడ ఇసుక చూడు.

773
00:44:25,960 --> 00:44:28,040
-వాసన వస్తుందా?
-అది కోల్పోయాం, కాదా?

774
00:44:29,480 --> 00:44:31,560
-బోండైలో వచ్చే వాసనా?
-నీకు మంచిదే.

775
00:44:41,760 --> 00:44:44,000
పాయింట్ పియర్స్ గురించి తెలిసిన ఒక విషయం

776
00:44:44,880 --> 00:44:46,320
మీరు ఎక్కడ ఉన్నా సరే,

777
00:44:46,400 --> 00:44:49,720
అది మీ ఇల్లు అవుతుంది,
అక్కడికి తిరిగి వెళ్ళవచ్చు,

778
00:44:49,800 --> 00:44:52,360
అది ఏదైనా సరే, మనుషులతో మీ జీవితంలో

779
00:44:52,440 --> 00:44:55,000
జరిగేదాని గరించి మాట్లాడాలి.

780
00:44:55,080 --> 00:44:56,400
వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.

781
00:45:05,800 --> 00:45:07,200
-బాగుంది.
-అది వాసన చూడు.

782
00:45:07,280 --> 00:45:09,240
తెలుసు, ఇక్కడ నుండే వాసన చూడగలను.

783
00:45:09,320 --> 00:45:12,160
కారీ, కడాయిలో ఉల్లిపాయలు వేయించుతావా?

784
00:45:13,360 --> 00:45:14,400
అంతే.

785
00:45:16,120 --> 00:45:17,440
బామ్మ వండడం చూడండి.

786
00:45:27,640 --> 00:45:28,840
హే, అదిగో వచ్చాడు.

787
00:45:28,920 --> 00:45:30,680
హే, నువ్వు రావడం సంతోషం.

788
00:45:30,760 --> 00:45:31,680
అంకుల్ మడ్స్.

789
00:45:32,760 --> 00:45:34,080
నీ చేయి చూసుకో.

790
00:45:34,480 --> 00:45:35,520
కావాల్సినంత సమయం.

791
00:45:36,040 --> 00:45:37,800
కుర్చీ లాక్కో, అంకుల్, కూర్చో.

792
00:45:42,880 --> 00:45:44,160
నేను ఎప్పుడూ తప్పిపోను.

793
00:45:44,960 --> 00:45:48,320
ఇంటికి తిరిగి వెళ్ళడానికిి
ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళాలో తెలుసు.

794
00:45:48,400 --> 00:45:51,800
అవును, ఇక్కడ నడకకు వెళ్ళాము,
తరువాత కొండపైకి.

795
00:45:51,880 --> 00:45:53,760
-సరే.
-సరే, బాగుంది.

796
00:45:53,840 --> 00:45:54,880
సరే.

797
00:45:56,520 --> 00:45:59,160
ఆ నల్లని చిన్న ప్రదేశం చూశావా?
అక్కడ ఇసుకలోనా?

798
00:45:59,240 --> 00:46:02,400
అటు వైపు రింగ్‌కు ముందు
నల్లని భాగం చూశావా?

799
00:46:02,480 --> 00:46:04,640
అక్కడ ఒకరోజు 13 పీతలు పట్టాను.

800
00:46:05,280 --> 00:46:07,880
అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి,
నెమ్మదిగా ఇంకా...

801
00:46:10,000 --> 00:46:11,680
మనం రెండు ప్రపంచాలలో ఉన్నాం.

802
00:46:11,760 --> 00:46:14,240
తెల్లవాళ్ళ ప్రపంచం
ఇంకా ఆదిమవాసుల సమాజం,

803
00:46:14,320 --> 00:46:16,760
మన సంస్కృతిని దృఢంగా చేశారు.

804
00:46:27,080 --> 00:46:29,640
వృత్తిపరమైన దుస్తుల నుండి
వృత్తిపరమైన విజయం.

805
00:46:30,040 --> 00:46:31,640
స్వాన్స్ పని పూర్తి చేశారు.

806
00:46:36,360 --> 00:46:39,320
క్రీడలు మా వాళ్ళకు అన్నిటికీ వాహనం.

807
00:46:40,200 --> 00:46:42,840
ఆరోగ్యం, చదువు, ఉద్యోగం.

808
00:46:42,920 --> 00:46:45,560
-గొప్ప విజయం. అద్భుతం, సోదరా.
-కాలు కిందకు పెట్టు.

809
00:46:45,640 --> 00:46:48,680
జాతి వివక్షత ఉండగా
చదువు గురించి ఆలోచిస్తే,

810
00:46:49,120 --> 00:46:52,080
దానిపై ఆధిపత్యం ఉండే చోటు క్రీడ.

811
00:46:54,880 --> 00:46:57,760
ఇప్పుడు నా ఉద్యోగం,
300 ఆటలు ఆడిన రిటైర్డ్ ఆటగాడు,

812
00:46:57,840 --> 00:47:01,240
స్వాన్స్ బోర్డులో కూర్చుంటాను,
అది నేను ఆషామాషీగా తీసుకోను.

813
00:47:01,320 --> 00:47:04,120
-నువ్వు కొన్నేళ్ళ ముందు ఆడడం చూశా.
-చాలా కాలం ముందు.

814
00:47:04,200 --> 00:47:05,520
అవును, నాకు తెలుసు.

815
00:47:06,600 --> 00:47:09,360
అది నేను గౌరవప్రదమైన బ్యాడ్జీ వేసుకునేది.

816
00:47:09,440 --> 00:47:12,280
నేను సాధించిన దానికి గర్వంగా ఉంది.

817
00:47:16,440 --> 00:47:18,760
పాయింట్ పియర్స్
ఆదిమవాసుల పాఠశాల

818
00:47:19,520 --> 00:47:23,680
అయితే, సమాజానికి తిరిగి ఇవ్వడం
ఇంకా ఎప్పుడూ మనకు ఉన్నవి...

819
00:47:23,760 --> 00:47:26,240
ఆదిమవాసులు అది చేస్తారు.
అది మా రక్తంలోనే ఉంది.

820
00:47:27,600 --> 00:47:30,600
గో ఫౌండేషన్ మన జీవితాల్లో ముఖ్యమైన భాగం.

821
00:47:30,680 --> 00:47:33,600
మేము సమాజాల్లోకి వెళ్ళాము,
పాఠశాలలకు వెళ్ళాము,

822
00:47:33,680 --> 00:47:36,760
ఎప్పుడూ విద్య, ఆరోగ్యకరమైన
జీవనశైలి గురించి చెప్పాము,

823
00:47:36,840 --> 00:47:38,200
మీ అమ్మ చెప్పేది విన్నాము.

824
00:47:39,640 --> 00:47:41,560
ఎక్కడి నుండి వచ్చింది మర్చిపోకు.

825
00:47:41,640 --> 00:47:45,200
నువ్వు ఎక్కడి నుండి వచ్చింది తెలియకపోతే,
ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.

826
00:47:52,320 --> 00:47:54,560
మైఖేల్ ఓలాఫ్లిన్‌కు మూడు గోల్స్!

827
00:47:54,640 --> 00:47:56,520
అన్నీ రెండో సగంలో!

828
00:47:56,600 --> 00:47:59,280
అతని కంటే ఎక్కువ పెద్దగా ఎవరూ లేరు.

829
00:48:04,800 --> 00:48:07,240
నాకు ఆశ ఉంది. మనుషులను నమ్ముతాను.

830
00:48:07,320 --> 00:48:08,840
మా దేశాన్ని నమ్ముతాను.

831
00:48:12,800 --> 00:48:15,400
ఆ పోరాటంలో మరింత మంది చేరాలి.

832
00:48:15,480 --> 00:48:17,240
చాలామంది తమ గొంతు వినిపించాలి.

833
00:48:23,320 --> 00:48:24,560
మాకు గొంతు కావాలి.

834
00:48:25,280 --> 00:48:28,080
ఆదిమవాసుల గురించి
ఆదిమవాసులకు మించి ఎవరికీ తెలియదు.

835
00:48:29,560 --> 00:48:32,360
మాకు ఆ గౌరవం కావాలి,
మేము గౌరవం కోరుకుంటాము.

836
00:49:26,880 --> 00:49:28,880
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత

837
00:49:28,960 --> 00:49:30,960
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్



