1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:16,767 --> 00:00:20,979
బి-17ని ఎప్పుడు చూసినా
నాకు అదే విధమైన ఉద్వేగం కలుగుతుంది.

4
00:00:21,980 --> 00:00:24,441
ఇది చాలా అందమైన యుద్ధవిమానం కదా?

5
00:00:25,150 --> 00:00:26,777
ఇది ఒక శిల్పం మాదిరిగా అనిపిస్తుంది.

6
00:00:28,195 --> 00:00:30,405
{\an8}అది గాలిలోకి ఎగిరినప్పుడు
ఆ అనుభూతి భలే ముచ్చటగా ఉంటుంది.

7
00:00:30,489 --> 00:00:32,406
{\an8}రోబర్ట్ "రోసీ" రోసెన్థాల్
పైలెట్, 100వ బాంబ్ గ్రూప్

8
00:00:37,079 --> 00:00:39,039
మనం ఫార్మేషన్ లో ఎగిరినప్పుడు...

9
00:00:42,918 --> 00:00:45,504
కొన్నిసార్లయితే వెయ్యి విమానాలతో కలిసి...

10
00:00:47,923 --> 00:00:50,384
అది చాలా అందమైన ఇంకా నాటకీయమైన దృశ్యం అవుతుంది.

11
00:00:52,636 --> 00:00:55,013
యూరప్ లోని చల్లని, నీలాకాశాలలో,

12
00:00:55,556 --> 00:00:57,224
ఒక కొత్త తరహా యుద్ధం జరిగింది

13
00:00:57,307 --> 00:01:01,228
అది అంతకుముందు ఎన్నడూ చూడని
ఒక యుద్ధ వాతావరణంలో జరిగింది.

14
00:01:01,854 --> 00:01:04,897
ప్రపంచ యుద్ధ చరిత్రలో అది ఒక విశిష్టమైన ఘట్టం.

15
00:01:04,982 --> 00:01:08,694
నభూతో న భవిష్యత్ అన్న రీతిలో జరిగింది.

16
00:01:19,246 --> 00:01:21,748
నలభై అమెరికన్ బాంబర్ బృందాలకు చెందిన
వాయుసైనికులు భారీ సంఖ్యలో

17
00:01:21,832 --> 00:01:25,544
వాయు పోరాటంలో రక్తం చిందించి ప్రాణాలు అర్పించారు.

18
00:01:26,044 --> 00:01:29,464
ఈ గ్రూపులలో ఒకటి, విపరీతమైన ఆవేశంతో
ఇంకా క్రమశిక్షణారాహిత్యంతో,

19
00:01:29,548 --> 00:01:33,677
స్వల్పకాలంలోనే తీవ్రమైన ప్రాణ నష్టాల్ని చవిచూసింది

20
00:01:33,760 --> 00:01:36,471
అందుకే దానిని The Bloody Hundredth అంటారు.

21
00:01:54,198 --> 00:01:55,699
యూరప్ లో యుద్ధం ప్రారంభం

22
00:01:55,782 --> 00:01:57,993
జర్మనీ పోలాండ్ ని ఆక్రమించింది.

23
00:01:58,076 --> 00:02:02,122
{\an8}సుమారు తొమ్మిది గంటలకు జరిగిన భారీ దాడిలో,
వార్సాపై బాంబుల వర్షం కురిపించింది.

24
00:02:02,206 --> 00:02:03,874
{\an8}వార్సా

25
00:02:06,877 --> 00:02:10,130
{\an8}తెల్లవారుజామున జర్మన్ సైన్యం
హాలాండ్ ఇంకా బెల్జియం దేశాలని

26
00:02:10,214 --> 00:02:11,924
భూమార్గంలో ఇంకా పారాచూట్ల ద్వారా ఆక్రమించింది.

27
00:02:12,007 --> 00:02:12,841
చేతులెత్తేసిన డచ్

28
00:02:14,092 --> 00:02:15,177
ఫ్రాన్స్ ఆక్రమణకి నాజీల మరో యత్నం

29
00:02:16,762 --> 00:02:18,805
{\an8}మా విధానం ఏమిటి అని అడుగుతున్నారా?

30
00:02:18,889 --> 00:02:22,142
సముద్రం, భూమి ఇంకా వాయుమార్గాలలో యుద్ధం చేయడమే.

31
00:02:22,226 --> 00:02:26,813
మానవ క్రోథాన్ని జయించలేని రాక్షస రాజ్యం మీద,

32
00:02:26,897 --> 00:02:30,943
ఇంకా అమానుష నేరాలకు పాల్పడిన హేయమైన చరిత్రపైనా
యుద్ధం చేయడమే మా లక్ష్యం.

33
00:02:31,610 --> 00:02:33,237
డైలీ న్యూస్
లండన్ పై బాంబుల దాడి

34
00:02:33,320 --> 00:02:34,571
ఫలించని నాజీ దాడి,
బ్రిటీష్ ప్రకటన

35
00:02:34,655 --> 00:02:36,657
గ్రేట్ బ్రిటన్ ఓడిపోయిన పక్షంలో,

36
00:02:36,740 --> 00:02:42,704
{\an8}యాక్సిస్ శక్తులు యూరప్, ఆసియా ఇంకా అమెరికా ఖండాల్ని
హస్తగతం చేసుకుని

37
00:02:42,788 --> 00:02:46,375
{\an8}ఆ తరువాత భూగోళంలోని ఈ అర్ధభాగంలోకి

38
00:02:46,458 --> 00:02:52,464
విపరీతమైన సైనిక ఇంకా నావిక సంపత్తిని ప్రయోగించే
సామర్థ్యాన్ని సాధిస్తాయి.

39
00:02:53,632 --> 00:02:55,509
{\an8}ఈ ఉదయం శత్రుదేశపు విమానాలు

40
00:02:55,592 --> 00:02:59,596
{\an8}పెర్ల్ హార్బర్ పై తీవ్రంగా బాంబులతో దాడి చేశాయి.

41
00:03:00,138 --> 00:03:01,515
ఇది జోక్ కాదు.

42
00:03:01,598 --> 00:03:02,683
ఇది అసలైన యుద్ధం.

43
00:03:02,766 --> 00:03:03,600
హవాయ్ మీద దాడులు

44
00:03:05,060 --> 00:03:05,894
యుద్ధం ప్రకటించబడింది

45
00:03:05,978 --> 00:03:08,272
{\an8}ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా

46
00:03:08,355 --> 00:03:11,191
{\an8}జపాన్ చేసిన దారుణమైన దాడిని

47
00:03:11,817 --> 00:03:15,946
{\an8}యుద్ధ చర్యగా ప్రకటించాలని

48
00:03:16,613 --> 00:03:18,657
నేను కాంగ్రెస్ ని అడుగుతున్నాను.

49
00:03:19,575 --> 00:03:23,120
యుద్ధాన్ని ప్రకటించిన ఇటలీ, జర్మనీ

50
00:03:32,546 --> 00:03:33,964
యుద్ధకాలంలో ఈ దశలో,

51
00:03:34,047 --> 00:03:36,925
{\an8}హిట్లర్ పాలనలోని జర్మనీ
కాంటినెంటల్ యూరప్ ని హస్తగతం చేసుకుంది.

52
00:03:37,009 --> 00:03:39,678
{\an8}గ్రేట్ బ్రిటన్ ఒంటరిగా ఇంకా బలహీనంగా ఉండి,

53
00:03:39,761 --> 00:03:44,224
నాజీలతో యుద్ధం చేస్తున్న
చివరి యూరోపియన్ ప్రజాస్వామ్య దేశంగా మిగిలింది.

54
00:03:44,766 --> 00:03:47,936
శత్రువు దాడిని ఎలా తిప్పికొట్టాలన్నదే ఇప్పుడు ప్రశ్న.

55
00:03:48,937 --> 00:03:52,191
బ్రిటన్ కి చెందిన బాంబర్ కమాండ్
1940 నుండి జర్మనీ మీద నిరాటంకంగా దాడులు చేస్తూనే ఉంది

56
00:03:52,274 --> 00:03:54,943
కానీ అవి నిష్ఫలం అవుతున్నాయి,

57
00:03:55,027 --> 00:03:59,907
రాత్రివేళల్లో దాడులు చేస్తున్నందువల్ల మైళ్ల దూరం మేరకు
లక్ష్యాలు గురి తప్పి భారీ నష్టాలు చవిచూస్తోంది.

58
00:04:01,909 --> 00:04:05,370
ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి

59
00:04:05,454 --> 00:04:07,664
నాజీల నుండి చాలా స్పష్టమైన ప్రమాదం పొంచి ఉంది.

60
00:04:07,748 --> 00:04:10,584
{\an8}కాబట్టి, ఆనాటి గొప్ప తరం, అంటే మా నాన్నగారి తరం...

61
00:04:10,667 --> 00:04:11,752
{\an8}స్టీవెన్ స్పీల్ బర్గ్
ఫిల్మ్ మేకర్

62
00:04:11,835 --> 00:04:14,004
{\an8}...దేశభక్తిని చాలా, చాలా తీవ్రంగా కలిగి ఉండేది.

63
00:04:16,548 --> 00:04:19,091
ఇప్పుడు, ఇదేదో నేను మీతో అయిష్టంగా
మాట్లాడుతున్నాను అనుకోకండి

64
00:04:19,176 --> 00:04:22,721
ఎందుకంటే నేను నాకు ఇష్టమైన అంశం గురించి
మాట్లాడాలి అనుకుంటున్నాను, అది ఆర్మీ, వాయుసేనల గురించి.

65
00:04:22,804 --> 00:04:24,348
{\an8}జేమ్స్ "జిమ్మీ" స్టివర్ట్
పైలెట్, 453వ బాంబ్ గ్రూప్

66
00:04:24,431 --> 00:04:26,350
{\an8}నాకు... నాకు బాగా అనుభవం ఉండి
మాట్లాడుతున్నాను అనుకోకండి.

67
00:04:27,142 --> 00:04:28,644
నేను సైన్యంలో చేరి ఏడాది మాత్రమే అయింది,

68
00:04:28,727 --> 00:04:31,939
కానీ నేను వాయుసేనలు చేస్తున్న కృషి గురించి
చాలా తెలుసుకున్నాను.

69
00:04:33,106 --> 00:04:34,483
దాని గురించే నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను.

70
00:04:35,692 --> 00:04:39,363
ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కి పదిహేను వేల మంది కెప్టెన్లు,

71
00:04:39,446 --> 00:04:43,784
నలభై వేల మంది లెఫ్టెనెంట్లు,
ముప్పై ఐదు వేల మంది సార్జెంట్లు అవసరం.

72
00:04:44,326 --> 00:04:47,037
అమెరికా యువకులారా, మీ భవిష్యత్తు ఆకాశంలో ఉంది.

73
00:04:47,621 --> 00:04:49,248
మీ రెక్కలు ఎదురుచూస్తున్నాయి.

74
00:04:51,250 --> 00:04:54,586
నేను కాలేజీలో రెండో సంవత్సరం మధ్యలో ఉన్నాను

75
00:04:54,670 --> 00:04:58,507
{\an8}ఇంకా అమ్మాయిల వెంటపడటం,
విస్కీ తాగడం కన్నా నాకు వేరే ఆలోచనలు ఉండేవి కావు.

76
00:04:58,590 --> 00:05:00,551
{\an8}జాన్ "లక్కీ" లకడూ
పైలెట్, 100వ బాంబ్ గ్రూప్

77
00:05:01,176 --> 00:05:04,137
ఆ సమయంలో, పెర్ల్ హార్బర్ ఘటన జరిగింది, ఆ తరువాత,

78
00:05:04,221 --> 00:05:09,685
నా తోటి సహచరులం ఏవియేషన్ క్యాడెట్లుగా చేరాం.

79
00:05:09,768 --> 00:05:11,311
అటెన్షన్!

80
00:05:12,437 --> 00:05:15,607
ఆ సమయంలో, యూదుల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉండేది.

81
00:05:15,691 --> 00:05:20,070
ఇంకా హిట్లర్, తమ ఆర్యుల దేశం
ఆధిపత్యం గురించి మాట్లాడుతుంటే,

82
00:05:20,153 --> 00:05:24,658
నాకు ఒక రకమైన విసుగు అనిపించి,
నిస్సహాయుడిగా ఉండిపోయేవాడిని.

83
00:05:24,741 --> 00:05:27,494
హఠాత్తుగా, ఆ విసుగు మాయమైపోయింది.

84
00:05:27,578 --> 00:05:29,663
అప్పుడు నేను ఏదో ఒకటి చేయగలను అనిపించింది.

85
00:05:30,163 --> 00:05:33,876
{\an8}నా దేశానికి చాలా ప్రయోజనకరమైన సేవ అందించాలంటే
పైలెట్ కావడమే మార్గం అని భావించాను.

86
00:05:33,959 --> 00:05:35,169
నియామకాల రిసెప్క్షన్ కేంద్రం

87
00:05:35,252 --> 00:05:40,090
తరువాత రోజు నేను అక్కడికి వెళ్లి
ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ గా స్వచ్ఛందంగా చేరాను.

88
00:05:43,218 --> 00:05:46,847
నియామకానికి ముందు,
వేలాదిమంది అమెరికన్ వాయుసైనికులు

89
00:05:46,930 --> 00:05:51,685
కనీసం విమానంలో ఎప్పుడూ అడుగైనా పెట్టలేదు లేదా ఉడుత కన్నా
ఎక్కువగా భయపెట్టే ఏ జంతువు మీద కాల్పులు జరుపలేదు.

90
00:05:51,768 --> 00:05:54,771
ఆ సైనికులు అమెరికాలోని నలుమూలల నుండి వచ్చారు

91
00:05:54,855 --> 00:05:57,274
ఇంకా దాదాపు ప్రతి వర్గానికి చెందిన వారు.

92
00:05:57,357 --> 00:06:01,612
అందులో హార్వార్డ్ హిస్టరీ విద్యార్థులు నుంచి
వెస్ట్ వర్జీనియా బొగ్గు గనుల కార్మికుల వరకూ ఉన్నారు.

93
00:06:01,695 --> 00:06:04,740
వాల్ స్ట్రీట్ లాయర్లు ఇంకా ఒక్లహోమా గోవుల కాపరులు.

94
00:06:05,365 --> 00:06:08,660
హాలీవుడ్ తారలు ఇంకా ఫుట్ బాల్ హీరోలు.

95
00:06:11,330 --> 00:06:13,207
క్యాడెట్లు పరీక్షలు పాస్ అయ్యారు.

96
00:06:13,290 --> 00:06:15,250
ఇంకా ఇప్పుడు, వాళ్లు ఫ్లయింగ్ పాఠాలు నేర్చుకుంటారు.

97
00:06:16,043 --> 00:06:19,421
ప్రతి ఇన్ స్ట్రక్టర్ కి నలుగురు విద్యార్థులు ఉండేవారు.

98
00:06:19,505 --> 00:06:23,342
మిగతా ముగ్గురు విద్యార్థులకూ
గతంలో ఫ్లయింట్ ట్రెయినింగ్ ఉంది, నాకు అసలు లేదు.

99
00:06:23,425 --> 00:06:25,511
నేను ఎప్పుడూ విమానం లోపలకి ఎక్కింది లేదు.

100
00:06:30,015 --> 00:06:32,935
దాదాపు పది గంటల తరువాత, మేము సోలోగా విమానం నడిపాం.

101
00:06:33,435 --> 00:06:35,521
{\an8}ఆ చక్రాలు నేలని వీడి పైకి ఎగిరాక,
మనకి సాయం చేయడానికి ఎవరూ ఉండరు.

102
00:06:35,604 --> 00:06:36,605
{\an8}జాన్ ఎ. క్లార్క్
పైలెట్, 100వ గ్రూప్

103
00:06:36,688 --> 00:06:37,648
{\an8}మనకి మనమే ఉంటాం.

104
00:06:40,025 --> 00:06:43,779
{\an8}నేను పైలెట్ గా ఫ్లాప్ అయి నావిగేటర్ గా మారాను.

105
00:06:43,862 --> 00:06:45,280
{\an8}హ్యారీ క్రోస్బీ
నావిగేటర్, 100వ బాంబ్ గ్రూప్

106
00:06:46,657 --> 00:06:47,741
నన్ను తిరస్కరించారు.

107
00:06:47,824 --> 00:06:50,994
{\an8}నన్ను ఎంపిక చేయని వ్యక్తి లెఫ్టెనెంట్ మేటాగ్ ని
నేను ఎప్పటికీ మర్చిపోను,

108
00:06:51,078 --> 00:06:53,330
{\an8}ఒక ఔత్సాహికుడైన ఫ్లయింగ్ స్టూడెంట్ ని తిరస్కరించడానికి
అది సరైన పేరు.

109
00:06:53,413 --> 00:06:54,498
{\an8}జోసెఫ్ అర్మానినీ
బంబార్డియర్, 100వ గ్రూప్

110
00:06:55,082 --> 00:06:59,670
నాకు ఒక మిలిటరీ ఇన్ స్ట్రక్టర్ ఉండేవాడు,
అతను నన్ను తిరస్కరించబోయాడు,

111
00:07:00,379 --> 00:07:02,422
కానీ అతను ఏం అన్నాడంటే,
"ఎలాగైనా నిన్ను నువ్వు చంపుకుంటావు,

112
00:07:02,506 --> 00:07:06,093
కానీ నీకు ఒక విషయం చెబుతాను,
నేను అదిగో అక్కడికి వెళ్లి ఆ చెట్టు కింద కూర్చుంటాను.

113
00:07:06,176 --> 00:07:11,515
{\an8}ఈ విమానాన్ని మూడుసార్లు పైకి ఎగిరించి పద్ధతిగా నడిపి
దాన్ని ల్యాండ్ చేయించగలిగితే, నువ్వు ఎంపిక అవుతావు.

114
00:07:12,057 --> 00:07:14,059
లేదంటే, నువ్వు ఇంటికి వెళ్లిపోతావు."

115
00:07:14,142 --> 00:07:15,394
{\an8}అమెరికన్ సైన్యం

116
00:07:16,687 --> 00:07:20,732
మేము ఉదయం ఎనిమిది గంటల నుండి
రాత్రి ఎనిమిది గంటల వరకూ విమానం నడిపేవాళ్లం.

117
00:07:20,816 --> 00:07:24,778
నిటారుగా పైకి ఎగరడం, హఠాత్తుగా విమానాన్ని తప్పించడం లాంటి
చాలా విన్యాసాల్ని చేసేవాడిని.

118
00:07:24,862 --> 00:07:27,614
ఎప్పుడైనా అరుదుగా, మేము డాగ్ ఫైట్ చేసేవాళ్లం.

119
00:07:29,616 --> 00:07:32,578
నేను చేసే పనిని మించి మరేదీ ఆ రోజుల్లో ఆస్వాదించేవాడిని కాను.

120
00:07:43,505 --> 00:07:48,427
ఫ్లయింగ్ స్కూలు నుండి అప్పుడే పట్టాలు పొందిన వారు,

121
00:07:48,510 --> 00:07:49,344
నాతో సహా నలభై మంది ఉన్నారు...

122
00:07:49,428 --> 00:07:50,846
ఏవియేషన్ క్యాడెట్
ఆఫీసర్స్ - క్లాస్ 43-బి

123
00:07:50,929 --> 00:07:53,056
...మా అందరినీ బి-17 విమానాలు నడపడానికి నియమించారు.

124
00:07:53,140 --> 00:07:55,893
అంతకుముందు ఎప్పుడూ మేము బి-17 విమానాల్ని నడపలేదు.

125
00:07:58,145 --> 00:08:01,398
ఈ బోయింగ్ ఎగిరే కోటలో పదిమంది సిబ్బంది ప్రయాణిస్తారు,

126
00:08:01,481 --> 00:08:04,401
ఇంకా ఈ సరికొత్త బాంబర్ గంటకి
483 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

127
00:08:04,484 --> 00:08:07,112
దాని ఫ్యూసలేజ్ మీద ఉన్న బొడుపులు నిజానికి మెషీన్ గన్స్.

128
00:08:07,905 --> 00:08:09,573
నాలుగు వేల హార్స్ పవర్ ఇంజన్లతో,

129
00:08:09,656 --> 00:08:13,452
ఈ విమానం దాదాపు ఐదు వేల కిలోమీటర్ల వరకూ
ఇంధనం కోసం ల్యాండ్ అయ్యే అవసరం రాదు.

130
00:08:13,535 --> 00:08:18,749
అటు రక్షణ కవచం గానూ ఇటు దాడులు చేయడానికి గానూ
డిజైన్ చేయబడిన మొదటి విమానం బి-17.

131
00:08:19,458 --> 00:08:23,754
దాడుల విషయానికి వస్తే, అది భారీ బాంబుల్ని జారవిడిచేది.

132
00:08:23,837 --> 00:08:27,299
ఇంకా దీనిని ఎగిరే కోట అని ఎందుకు అంటారంటే
దీనికి 50 క్యాలిబర్ గన్స్ చాలా అమర్చి ఉంటాయి.

133
00:08:28,884 --> 00:08:31,845
బి-17 బాంబర్ ని నడిపే అనుభూతి అద్భుతంగా ఉంటుంది.

134
00:08:32,346 --> 00:08:37,768
ఈ విమానం ఎంత బాగా స్పందించిందీ అంటే
నేను వెంటనే దీనిని సొంతం చేసుకున్నాను.

135
00:08:38,809 --> 00:08:41,313
బి-17 విమానాన్ని నడపడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.

136
00:08:42,898 --> 00:08:45,859
మేము ఐదు, ఆరు నెలల పాటు ప్రాక్టీసు శిక్షణ తీసుకున్నాం

137
00:08:45,943 --> 00:08:48,153
ఆ తరువాత విదేశీ లక్ష్యాల కోసం సంసిద్ధులం అయ్యాం.

138
00:08:50,113 --> 00:08:52,282
{\an8}1943 మే నెలలో మేము ఇంగ్లండ్ కి ప్రయాణం అయ్యాం...

139
00:08:52,366 --> 00:08:54,117
{\an8}ఫ్రాంక్ మర్ఫీ
నావిగేటర్, 100వ బాంబ్ గ్రూప్

140
00:08:54,201 --> 00:08:55,994
{\an8}...మేము ఎయిత్ ఎయిర్ ఫోర్స్ లో భాగం పంచుకోవలసి ఉంది.

141
00:08:57,955 --> 00:09:01,083
విదేశీ ప్రయాణానికి ముందు మాకు ఏం చెప్పారంటే,

142
00:09:01,875 --> 00:09:04,503
"మీరు మీ ఎడమ వైపు ఇంకా కుడి వైపు చూడండి,

143
00:09:04,586 --> 00:09:06,672
కానీ మీలో ఎవరో ఒకరు మాత్రమే తిరిగి వస్తారు."

144
00:09:07,256 --> 00:09:09,508
మేము విదేశాలకి వెళ్తున్నది మరణించడానికి.

145
00:09:25,357 --> 00:09:28,777
100వ బాంబ్ గ్రూప్ సిబ్బంది తూర్పు ఇంగ్లండ్ లోని
గ్రామీణ ప్రాంతంలో

146
00:09:28,861 --> 00:09:32,364
తమ కొత్త స్థావరానికి చేరుకుంటుండటంతో
యూరోపియన్ యుద్ధంలో కొత్త దశ మొదలయింది.

147
00:09:32,447 --> 00:09:33,991
థోర్ప్ అబోట్స్
తూర్పు ఆంగ్లియా, ఇంగ్లండ్

148
00:09:34,074 --> 00:09:36,535
పాయింట్ బ్లాంక్ దాడులు,

149
00:09:36,618 --> 00:09:38,996
ఇరవై నాలుగు గంటలు నిరాటంకంగా
దాడులు చేయడం అధికారికంగా మొదలయింది,

150
00:09:39,079 --> 00:09:42,165
పగటి పూట అమెరికన్లు బాంబు దాడులు చేసేవారు
ఇంకా రాత్రివేళల్లో బ్రిటీష్ వాయుసేన దాడులు చేసేది.

151
00:09:42,666 --> 00:09:47,004
ఆ తరువాత వచ్చే వసంతకాలంలో డి-డే ఆక్రమణ ద్వారా

152
00:09:47,087 --> 00:09:49,590
ఉత్తర యూరప్ గగనతలం మీద పూర్తి ఆధిపత్యాన్ని
సాధించడమే లక్ష్యంగా ఉండేది.

153
00:09:50,591 --> 00:09:53,302
గగనతలంలో ఆధిపత్యం సాధించకుండా,
మిత్రదేశాల కూటమి యూరప్ ఖండాన్ని ఆక్రమించలేదు.

154
00:09:53,385 --> 00:09:54,636
థోర్ప్ అబోట్స్
తూర్పు ఆంగ్లియా, ఇంగ్లండ్

155
00:09:54,720 --> 00:09:56,096
100వ బాంబ్ గ్రూప్ ప్రధాన కార్యాలయం

156
00:09:58,223 --> 00:10:01,894
అక్కడికి చేరుకుని ఒకరినొకరం
పరిచయం చేసుకుంటున్నప్పుడు,

157
00:10:01,977 --> 00:10:04,438
{\an8}కింగ్ అనే పైలెట్ నన్ను అడిగాడు,
"ఇంతకుముందు నువ్వు ఏం చేసేవాడివి?" అని.

158
00:10:04,521 --> 00:10:06,356
{\an8}రిచర్డ్ సి. కింగ్
పైలెట్, 100వ బాంబ్ గ్రూప్

159
00:10:06,440 --> 00:10:09,318
{\an8}"అంటే, ఇంతకుముందు
నేను గోవులు కాసేవాడిని" అని చెప్పాను.

160
00:10:09,401 --> 00:10:11,278
{\an8}ఓవెన్ "కౌబాయ్" రోన్
పైలెట్, 100వ బాంబ్ గ్రూప్

161
00:10:11,361 --> 00:10:15,032
{\an8}అప్పుడు అతను,
"సరే, మంచిది, ఇక నుండి నువ్వు కౌబాయ్ వి" అన్నాడు.

162
00:10:15,949 --> 00:10:17,826
మా 100వ గ్రూప్ యువకుల బృందంగా ఉండేది,

163
00:10:17,910 --> 00:10:20,913
ఇంకా అందులో కొందరు యువ కమాండర్లు
చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు.

164
00:10:20,996 --> 00:10:22,915
{\an8}గేల్ క్లెవెన్ అనే స్క్వాడ్రన్ కమాండర్...

165
00:10:22,998 --> 00:10:24,416
{\an8}గేల్ "బక్" క్లెవెన్
పైలెట్, 100వ బాంబ్ గ్రూప్

166
00:10:24,499 --> 00:10:26,084
{\an8}...ఇంకా ఎయిర్ ఎగ్జిక్యుటివ్ అయిన జాన్ ఈగన్.

167
00:10:26,168 --> 00:10:27,544
{\an8}జాన్ "బకీ" ఈగన్
పైలెట్, 100వ బాంబ్ గ్రూప్

168
00:10:27,628 --> 00:10:30,088
{\an8}ఈగన్, క్లెవెన్ స్క్వాడ్రన్ లీడర్స్ కనుక,
విమానాల్లో నడపాల్సిన పని లేదు, కానీ అదే చేసేవారు.

169
00:10:30,172 --> 00:10:31,507
{\an8}డొనాల్డ్ ఎల్. మిల్లర్
రచయిత, Masters of the Air

170
00:10:31,590 --> 00:10:33,300
{\an8}వాళ్లని అందరూ ఇష్టపడటానికి అది కూడా ఒక కారణం.

171
00:10:33,383 --> 00:10:38,180
బక్ క్లెవెన్, ఇంకా బకీ ఈగన్,
ఇద్దరూ మెడకి రుమాళ్లు కట్టుకునే వారు

172
00:10:38,263 --> 00:10:41,517
ఇంకా వాళ్ల టోపీలు తల మీద ఏటవాలుగా పెట్టుకునేవారు,

173
00:10:41,600 --> 00:10:43,519
ఇంకా చాలా ఆవేశంగా ఉండేవారు.

174
00:10:43,602 --> 00:10:46,563
{\an8}వాళ్లు ఆఫీసర్స్ క్లబ్ కి వచ్చి,

175
00:10:46,647 --> 00:10:49,650
{\an8}"లెఫ్టెనెంట్, టాక్సీ ఎక్కి ఇక్కడికి రా, నీతో మాట్లాడాలి" అనేవారు.

176
00:10:49,733 --> 00:10:50,734
{\an8}350వ బాంబ్ స్క్వాడ్రన్
నాలుగో సైట్

177
00:10:50,817 --> 00:10:52,361
{\an8}జాన్ ఈగన్, గేల్ క్లెవెన్,

178
00:10:52,444 --> 00:10:55,322
{\an8}విమానాన్ని నడపడమే వాళ్ల జీవిత లక్ష్యం.

179
00:10:55,405 --> 00:10:56,823
ఇక్కడ ఇదిగో, వాళ్లు విమానాల్ని నడుపుతున్నారు.

180
00:10:56,907 --> 00:10:59,243
{\an8}తాము ప్రేమించే దేశం కోసం తమకి ఇష్టమైన పని చేస్తూ...

181
00:10:59,326 --> 00:11:00,160
{\an8}సేత్ పారిడన్
చరిత్రకారుడు

182
00:11:00,244 --> 00:11:01,495
{\an8}...తాము నమ్మిన లక్ష్యం కోసం పాటుపడేవారు.

183
00:11:02,538 --> 00:11:05,040
క్లెవెన్ ఇంకా ఈగన్ కలిసి 100వ గ్రూప్ ని
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వాయుసేన

184
00:11:05,123 --> 00:11:09,586
జర్మన్ లుఫ్త్ వాఫేకి ధీటుగా నిలబెట్టారు,

185
00:11:09,670 --> 00:11:14,299
ఆ వాయుసేన వెటరన్ పైలెట్లు, స్పెయిన్, నార్వే, పోలాండ్,

186
00:11:14,383 --> 00:11:19,680
ఫ్రాన్స్, రష్యా, గ్రీస్, ఉత్తర ఆఫ్రికా, ఇంగ్లండ్ దేశాల మీద
దాడులు చేసిన అనుభవం గడించారు.

187
00:11:20,180 --> 00:11:23,058
{\an8}తమకి మాత్రమే గగనతలంలో ఆధిపత్యం ఉందని
అందువల్ల తమకి ఎదురులేదని నాజీలు భావించి...

188
00:11:23,141 --> 00:11:24,142
{\an8}ఫ్రాంక్లిన్ డి. రూస్వెల్ట్

189
00:11:24,226 --> 00:11:26,019
{\an8}అమెరికా అధ్యక్షుడు
1943 స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగం

190
00:11:26,103 --> 00:11:30,649
{\an8}...ప్రత్యర్థుల్ని తక్కువ అంచనా వేయడం వల్ల
ఎంత భారీ నష్టం సంభవిస్తుందో నాజీలు అర్థం చేసుకుంటారు.

191
00:11:31,191 --> 00:11:35,362
వారి ఆధిపత్యం ఇంక ఎప్పటికీ కొనసాగదు.

192
00:11:35,946 --> 00:11:41,326
నాజీలు ఇంకా ఫాసిస్టులూ ఈ శిక్షల్ని కోరుకున్నారు,

193
00:11:41,410 --> 00:11:43,328
ఇంకా వాటిని వారు పొందబోతున్నారు.

194
00:11:47,791 --> 00:11:48,834
జూన్ 1943

195
00:11:50,085 --> 00:11:51,795
డి-డేకి ఒక సంవత్సరం ముందు

196
00:11:52,379 --> 00:11:55,007
కెప్టెన్ కర్క్, కెప్టెన్ థాంప్సన్, లెఫ్టెనెంట్ బుష్కా,

197
00:11:55,090 --> 00:11:57,426
ఐవర్సన్, హాలొవే ఇంకా హాకర్స్ విమానంలో వెళ్లాల్సి ఉంది.

198
00:11:57,509 --> 00:11:58,343
త్వరగా తెమలండి.

199
00:12:02,014 --> 00:12:04,391
కమాండింగ్ ఆఫీసర్, ఆయన వచ్చి, మా ముందు నిలబడ్డాడు,

200
00:12:05,225 --> 00:12:07,519
అతను కర్టెన్ పైకి లాగాడు,

201
00:12:07,603 --> 00:12:10,063
{\an8}ఇంకా థోర్ప్ అబోట్స్ నుండి లక్ష్యం వరకూ
మార్గాన్ని సూచిస్తూ ఒక ఎర్ర రిబ్బను కట్టి ఉంది.

202
00:12:10,147 --> 00:12:12,566
{\an8}బ్రూస్ ఆల్స్ హౌస్
వెనుక భాగం గన్నర్, 100వ బాంబ్ గ్రూప్

203
00:12:13,817 --> 00:12:16,653
ఈ భవనాల సముదాయమే మీ లక్ష్యం.

204
00:12:17,404 --> 00:12:19,990
ఈ భవనాన్ని మనం గురి చూసి ధ్వంసం చేయాలి.

205
00:12:20,532 --> 00:12:24,161
మీ బాంబుల దాడి గనుక ఈ ప్రాంతంలో కేంద్రీకరిస్తే,

206
00:12:24,244 --> 00:12:27,539
ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసం కాగలదు.

207
00:12:35,214 --> 00:12:38,967
మేము జీప్ దిగి, మా సామాన్లు సర్దుకుని,

208
00:12:39,051 --> 00:12:40,969
{\an8}విమానం ఎక్కి, లోపల సర్దుకుని కూర్చున్నాం,
తరువాత దూసుకెళ్లాం.

209
00:12:41,053 --> 00:12:42,304
{\an8}రాబర్ట్ వోల్ఫ్
పైలెట్, 100వ బాంబ్ గ్రూప్

210
00:12:55,609 --> 00:12:57,653
ఆత్మరక్షణ ఫార్మేషన్ లో ఎగిరే ఆ తీరుని

211
00:12:57,736 --> 00:13:00,322
యుద్ధ పేటిక అంటారు,

212
00:13:00,405 --> 00:13:04,826
ఎందుకంటే ఒక్కొక్క విమానానికీ పదమూడు గన్స్ తో
ఆ భారీ విమానాల సమూహం యుద్ధంలో పాల్గొంటుంది,

213
00:13:04,910 --> 00:13:09,206
ఆ సమూహం వరుసగా వచ్చే శత్రుదేశ విమానాలని
ఛేదించుకుని ముందుకు వెళ్లగల సత్తాని కలిగి ఉంటుంది.

214
00:13:10,582 --> 00:13:13,252
యుద్ధభూమిలో, థండర్ బోల్ట్ విమానాలు సిద్ధంగా ఉన్నాయి.

215
00:13:18,382 --> 00:13:20,592
అవి బాంబర్లతో జత కలవడానికి బయలుదేరాయి.

216
00:13:20,676 --> 00:13:23,971
ఆ రెండు గ్రూపులూ ఇంగ్లీష్ చానెల్ మీదుగా
కలిసి స్వైరవిహారం చేసి,

217
00:13:24,054 --> 00:13:27,474
బాంబర్ విమానాల ఫార్మేషన్ కు రక్షణగా
ఫైటర్ జట్లు గస్తీ కాస్తుండగా,

218
00:13:27,558 --> 00:13:30,310
ఆ యుద్ధ విమానాల సమూహం
శత్రుదేశపు సరిహద్దులోకి జొరబడుతుంది.

219
00:13:32,229 --> 00:13:35,607
ఆ బాంబర్లకు చిన్న, చురుకైన విమానాలైన

220
00:13:35,691 --> 00:13:39,528
పి-47 థండర్బోల్ట్ లాంటి వాటితో పరిమితమైన రక్షణ లభించేది

221
00:13:39,611 --> 00:13:42,990
ఎందుకంటే వాటి ఇంధన సామర్థ్యం పరిమితం కావడం వల్ల

222
00:13:43,073 --> 00:13:45,492
జర్మనీ దేశం లోపలికి చొచ్చుకువెళ్లే క్రమంలో
అవి బాంబర్లని వీడి తిరిగి వెళ్లిపోవలసి వచ్చేది.

223
00:13:45,576 --> 00:13:47,452
వైమానిక సిబ్బందికి ఇది కొత్త ప్రపంచంగా అనిపిస్తుంది

224
00:13:47,536 --> 00:13:52,416
ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకమైన దుస్తులు లేకుండా,

225
00:13:52,499 --> 00:13:54,209
ప్రత్యేకమైన పరికరాలు లేకుండా

226
00:13:54,293 --> 00:13:57,254
తమకు అందే ఆక్సిజన్ ని లోపలికి పీల్చుకోలేక
శారీరకంగా వారు మనుగడ సాగించలేరు.

227
00:13:57,337 --> 00:14:00,591
మేము కొంత ఎత్తులోకి వెళ్లగానే,
మాకు ఆక్సిజన్ అవసరం అవుతుంది,

228
00:14:00,674 --> 00:14:03,135
అందువల్ల మేము మా ముఖానికి
ఆక్సిజన్ మాస్క్ తగిలించుకోవలసి వచ్చేది.

229
00:14:03,218 --> 00:14:05,012
ఇంకా అక్కడ విపరీతమైన చలి ఉంటుంది.

230
00:14:05,095 --> 00:14:07,431
అతిశీతల వాతావరణం.

231
00:14:07,514 --> 00:14:11,310
మేము సున్నాకి దిగువగా, మైనస్ యాభై లేదా అరవై డిగ్రీల
వాతావరణంలో యుద్ధంలో పాల్గొనేవాళ్లం.

232
00:14:17,941 --> 00:14:21,153
బి-17 బాంబర్లకు రక్షణగా

233
00:14:21,236 --> 00:14:25,282
జర్మనీ లోపలి లక్ష్యాల వరకూ ప్రయాణించే సామర్థ్యం
ఈ చిన్న ఫైటర్ విమానాలకు ఉండేది కాదు,

234
00:14:25,365 --> 00:14:27,534
దానితో మిత్రదేశాల ఫైటర్ జెట్లు
వెనక్కి తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయేవి.

235
00:14:35,334 --> 00:14:39,129
నాకు బాగా గుర్తుంది,
మేము మొదటగా ఇంగ్లీష్ ఛానెల్ దాటినప్పుడు,

236
00:14:39,213 --> 00:14:43,383
నేను కిందకి చూసి, మేము శత్రుదేశపు భూభాగం మీద
ప్రయాణిస్తున్నామని గ్రహించాను,

237
00:14:43,467 --> 00:14:45,427
అప్పుడు భయంతో గొంతు పూడుకుపోవడం
నాకు ఇంకా గుర్తుంది.

238
00:14:45,511 --> 00:14:46,845
నేను చాలా నెర్వస్ అయ్యాను.

239
00:14:49,681 --> 00:14:51,683
అదిగో నేల మీద నుండి పేల్చిన

240
00:14:51,767 --> 00:14:53,977
యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బాంబుల నల్లటి ధూళి.

241
00:14:54,770 --> 00:14:56,939
యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ అంటే అది జర్మన్ 88 గన్,

242
00:14:57,022 --> 00:15:00,067
అది ఒక షెల్ ని దాదాపు నలభై వేల అడుగుల వరకూ
పేల్చగలుగుతుంది.

243
00:15:00,150 --> 00:15:05,197
ఆ షెల్ గాలిలో పేలిపోయి, పదునైన రజనుని వెదజల్లుతుంది.

244
00:15:07,574 --> 00:15:10,661
విమానం తయారీ కోసం వాడే లోహం స్టీల్ కాదు, అల్యూమినియం.

245
00:15:10,744 --> 00:15:13,121
అందువల్ల, ఆ రజను తగిలి ఆ విమానానికి చిల్లులు పడ్డాయి.

246
00:15:15,249 --> 00:15:20,337
విమాన విధ్వంసక పేలుళ్లని
నేను అంత భారీగా చూడటం అదే మొదటిసారి,

247
00:15:20,420 --> 00:15:23,298
ఇంకా అది చాలా భయానకంగా ఉంది.

248
00:15:28,053 --> 00:15:31,682
చాలా అనుభవం ఉన్న ఇంకా చాలా ఆయుధ సంపత్తి ఉన్న

249
00:15:31,765 --> 00:15:36,061
ఇంకా చాలా సుశిక్షితులైన ప్రత్యర్థులను
మేము ఎదుర్కోవాల్సి వచ్చింది.

250
00:15:36,144 --> 00:15:39,857
వాళ్లు అప్పటికే నిపుణులు, కానీ మేము మరీ కొత్త.

251
00:15:43,902 --> 00:15:46,488
ఈ ఫార్మేషన్ లక్ష్యం దగ్గరకు చేరుకున్న సమయంలో,

252
00:15:46,572 --> 00:15:50,200
బంబార్డియర్లు గాలి వేగం ఇంకా గాలి వాటం లాంటి వివరాలను

253
00:15:50,284 --> 00:15:51,910
నోర్డెన్ బాంబ్ సైట్స్ పరికరంలో నమోదు చేశారు,

254
00:15:51,994 --> 00:15:55,455
విమానాలకు దిశానిర్దేశనం చేసే ఆ టాప్ సీక్రెట్ పరికరాలు

255
00:15:55,539 --> 00:15:59,001
బాంబులను సరైన లక్ష్యాలపై
సకాలంలో విడుదల చేయడానికి దోహదపడతాయి.

256
00:15:59,585 --> 00:16:02,546
ఈ నోర్డెన్ బాంబ్ సైట్ పరికరం,
ఇది ఎంత ఖచ్చితంగా పని చేస్తుందంటే

257
00:16:02,629 --> 00:16:07,801
దాదాపు ఇరవై వేల అడుగుల ఎత్తు నుంచి కూడా
లక్ష్యం మీద నేరుగా బాంబుల్ని ఇది జారవిడువగలదు.

258
00:16:10,596 --> 00:16:12,055
మేము బాంబులు జారవిడిచినప్పుడు,

259
00:16:12,139 --> 00:16:14,099
{\an8}మా ముందున్న యుద్ధ విమానాలు బాంబుల్ని జారవిడువడం
నేను చూశాను...

260
00:16:14,183 --> 00:16:15,517
{\an8}జీన్ బ్యాంక్ స్టన్
టోగ్లియర్, 100వ బాంబ్ గ్రూప్

261
00:16:15,601 --> 00:16:17,644
...అలాగే అద్దం ముందు భాగం పైకి వాలి

262
00:16:17,728 --> 00:16:21,231
ఆ బాంబులు భూమి మీద పడటాన్ని నేను చూస్తుండే వాడిని.

263
00:16:21,315 --> 00:16:25,569
ఆ తరువాత, అవి పేలినప్పుడు,
మేము ఆ విస్ఫోటనాల్ని కళ్లారా చూసేవాళ్లం.

264
00:16:25,652 --> 00:16:27,237
మొదటి విడత బాంబర్లు మిషన్ పూర్తి చేయగా,

265
00:16:27,321 --> 00:16:30,574
వారు చేసిన దాడులలో
నిర్దేశిత లక్ష్యం అప్పటికే పాక్షికంగా ధ్వంసం అయింది.

266
00:16:31,366 --> 00:16:34,912
ఒక విద్యుత్ ప్లాంట్, నిర్మాణంలో ఉన్న సబ్ మెరైన్లు,

267
00:16:34,995 --> 00:16:36,955
ఇంకా నీటి మధ్యలో ఉన్న యు-బోట్ స్థావరం మీద
దాడులు జరిగాయి.

268
00:16:38,957 --> 00:16:40,375
మేము బాంబుల్ని జారవిడిచాము,

269
00:16:40,459 --> 00:16:43,045
కొన్ని ఫైటర్ జెట్ల మధ్య పరస్పర దాడులు జరిగాయి,
కానీ ఎవరూ గాయపడలేదు.

270
00:16:43,629 --> 00:16:45,714
{\an8}అప్పుడు నేను అనుకున్నాను, "సరే, ఇదేమీ అంత
చెడ్డగా లేదు" అని.

271
00:16:48,509 --> 00:16:52,221
100వ బాంబర్ గ్రూప్ తొలి విడత మిషన్లు
ప్రధానంగా సముద్రతీర ప్రాంతాలలోనే సాగాయి,

272
00:16:52,304 --> 00:16:55,432
అంటే ఫ్రాన్స్ ఇంకా నార్వే దేశాలలో
సబ్ మెరైన్ స్థావరాలు ఇంకా పారిశ్రామిక ప్రదేశాలు.

273
00:16:55,516 --> 00:16:57,434
సెయింట్-నజైర్ - లీ మాన్స్ - పారిస్
లిలీ - బ్రెమన్ - హాంబర్గ్

274
00:16:57,518 --> 00:16:59,770
ఈ వాయుసేన

275
00:16:59,853 --> 00:17:02,147
నాజీ జర్మనీల యుద్ధ వ్యవస్థని ధ్వంసం చేయాలని ప్రయత్నించింది.

276
00:17:02,231 --> 00:17:05,442
విమానాల్ని ఇంకా ట్యాంకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీలే లక్ష్యాలు.

277
00:17:05,526 --> 00:17:07,194
ఇంకా బాల్ బేరింగ్స్ తయారు చేసే కర్మాగాలు కూడా.

278
00:17:07,778 --> 00:17:09,488
బ్రిటీష్ ల్యాండింగ్ స్థావరాలలో,

279
00:17:09,570 --> 00:17:11,114
వాయుమార్గంలో యుద్ధం జరగబోతోందనే వార్త
బయటకి పొక్కింది.

280
00:17:12,199 --> 00:17:14,826
చాలా యుద్ధవిమానాలు ధ్వంసం అయ్యాయి.

281
00:17:14,910 --> 00:17:19,164
మరికొన్ని విమానాలు అయితే ప్రొపెల్లర్లు పాడయి,
లేదా ల్యాండింగ్ గేర్ చెడిపోయి తిరిగి వచ్చాయి.

282
00:17:20,249 --> 00:17:23,210
బి-17 బాంబర్ విమానాలు నమ్మకమైనవనీ, సురక్షితమనీ
వాయుసైనికుల్ని క్షేమంగా తిరిగి తీసుకువస్తాయనే

283
00:17:23,292 --> 00:17:24,502
పేరు గడించాయి.

284
00:17:24,586 --> 00:17:26,630
మూడు ఇంజన్లు విఫలమయినా వాటితో క్షేమంగా తిరిగి రావచ్చు.

285
00:17:26,713 --> 00:17:30,050
దాని వెనుక భాగంలో నిలువు స్టెబిలైజర్ సగం విరిగిపడినా కూడా

286
00:17:30,133 --> 00:17:31,176
క్షేమంగా తిరిగి చేరుకోవచ్చు.

287
00:17:31,260 --> 00:17:34,054
కేవలం రెండు ఇంజన్లు పని చేసినా
అది మనల్ని సురక్షితంగా స్థావరానికి చేరుస్తుంది,

288
00:17:34,137 --> 00:17:35,472
{\an8}కొన్ని ఒక్క ఇంజన్ తో వచ్చినవి కూడా ఉన్నాయి.

289
00:17:35,556 --> 00:17:36,557
{\an8}థామస్ జెఫ్రీ
కమాండర్, 100వ గ్రూప్

290
00:17:37,307 --> 00:17:38,559
ఆగస్ట్ 17, 1943

291
00:17:39,059 --> 00:17:40,727
డి-డేకి పది నెలల ముందు

292
00:17:40,811 --> 00:17:42,646
సమాచార గది - అనుమతి లేని సిబ్బందికి ప్రవేశం లేదు

293
00:17:42,729 --> 00:17:44,940
ఎయిత్ గ్రూప్ మునుపెన్నడూ లేని విధంగా
అత్యంత భారీ దాడికి తయారు కావడంతో

294
00:17:45,023 --> 00:17:47,568
ఆ గ్రూప్ లో అన్నీ మారిపోబోతున్నాయి.

295
00:17:47,651 --> 00:17:51,363
జర్మనీ లోపల కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉండే
ష్వెయిన్ఫర్ట్ లో బాల్ బేరింగ్ కర్మాగారాల మీద

296
00:17:51,446 --> 00:17:54,241
ఇంకా రేగన్స్ బర్గ్ లో మెసర్ ష్మిత్ కర్మాగారాల మీద

297
00:17:54,324 --> 00:17:58,203
ఈ గ్రూప్ జంట దాడుల్ని నిర్వహించింది.

298
00:17:58,287 --> 00:18:01,498
రేగన్స్ బర్గ్ ఫోర్స్ బాధ్యతల్ని 100వ గ్రూప్ కి అప్పగించారు.

299
00:18:02,165 --> 00:18:04,960
వాళ్లు ఆ మ్యాప్ మీద కర్టెన్ ని తొలగించినప్పుడు,

300
00:18:05,043 --> 00:18:07,963
ఒక ఎర్ర గీత జర్మనీ వరకూ ఉండటం చూసి,

301
00:18:08,046 --> 00:18:10,048
{\an8}మేము, "ఓరి దేవుడా" అనుకున్నాము.

302
00:18:10,716 --> 00:18:13,427
ఒక వ్యూహంగా దాన్ని ఆలోచించిన తీరు చూస్తే
నిజంగా అద్భుతంగా అనిపించింది.

303
00:18:13,510 --> 00:18:14,344
కాబట్టి, అప్పుడు...

304
00:18:14,428 --> 00:18:15,929
{\an8}జనరల్ కర్టిస్ లీమే
కమాండర్

305
00:18:16,013 --> 00:18:19,057
{\an8}...కర్టిస్ లీమేకి చెందిన మూడో బంబార్డ్మెంట్ డివిజన్

306
00:18:19,141 --> 00:18:23,270
రేగెన్స్ బర్గ్ లోని మెసర్ ష్మిత్ ఫ్యాక్టరీల మీద దాడులు చేసి
తరువాత ఆఫ్రికాకి వెళ్లాలని నిర్ణయించారు.

307
00:18:23,353 --> 00:18:27,232
వాళ్లకి పది నిమిషాల వెనుకగా,
మొదటి బంబార్డ్మెంట్ డివిజన్ బయలుదేరాలి,

308
00:18:27,316 --> 00:18:30,068
{\an8}ఇంకా వాళ్లు ష్వెయిన్ఫర్ట్ లో
బాల్ బేరింగ్ ఫ్యాక్టరీల మీద దాడులు చేయాలి,

309
00:18:30,152 --> 00:18:31,653
{\an8}ఆ తరువాత ఇంగ్లండ్ తిరిగి రావాలి.

310
00:18:31,737 --> 00:18:35,032
{\an8}కాబట్టి, ఈ రెండు గ్రూపులలో ఎవరి మీద దాడి చేయాలో
జర్మన్లు నిర్ణయించుకోవాలి.

311
00:18:35,115 --> 00:18:37,784
{\an8}ఇక్కడ సమస్య... సర్ ప్రైజ్, అది ఆగస్టు మాసం,
గ్రేట్ బ్రిటన్ లో పొగమంచు తీవ్రంగా ఉంటుంది.

312
00:18:37,868 --> 00:18:39,703
{\an8}డాక్టర్ కోన్రాడ్ సి. క్రేన్ - ఎస్ఎస్ఐ సీనియర్
చరిత్రకారుడు, వార్ కాలేజ్

313
00:18:41,205 --> 00:18:42,623
మేము ఆ ఉదయం బయటకు వచ్చాం.

314
00:18:42,706 --> 00:18:47,169
{\an8}నా దగ్గర రెండు లాంతర్లు ఇంకా ఫ్లాష్ లైట్లు ఉండగా
వాటితో విమానాలను బయటకు తీసుకువచ్చాం.

315
00:18:48,086 --> 00:18:51,423
నేను పది నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాను,
కానీ మేము బయలుదేరాం.

316
00:18:51,507 --> 00:18:54,426
కర్టిస్ లీమే తన బంబార్డ్మెంట్ డివిజన్ ని

317
00:18:54,510 --> 00:18:56,512
ఇంగ్లీష్ పొగమంచులో సైతం టేకాఫ్ చేయడానికి శిక్షణ పొందాడు.

318
00:18:56,595 --> 00:18:59,014
మరొక బంబార్డ్మెంట్ డివిజన్ కి ఆ శిక్షణ లేదు.

319
00:18:59,097 --> 00:19:02,643
దానితో, హఠాత్తుగా, లీమే తన సిబ్బందిని సిద్ధం చేసి
అందరినీ సంసిద్ధం చేశాడు,

320
00:19:02,726 --> 00:19:05,020
కానీ మరొక బంబార్డ్మెంట్ డివిజన్ ఇంకా టేకాఫ్ కాలేకపోయింది.

321
00:19:05,771 --> 00:19:08,774
దానితో, పది నిమిషాలు వెనుకగా వెళ్లాల్సిన డివిజన్
రెండు గంటల ఆలస్యంగా బయలుదేరింది.

322
00:19:11,235 --> 00:19:14,112
ఈ స్వాధీనం చేసుకున్న జర్మన్ చిత్రాన్ని చూస్తే
హెచ్చరిక తరువాత

323
00:19:14,196 --> 00:19:17,157
వాటి 109 యుద్ధవిమానాలు, ఫోక్-వుల్ఫ్ 190 విమానాలు
ఎంత వేగంగా రంగంలోకి దిగాయో తెలుస్తుంది.

324
00:19:17,658 --> 00:19:21,036
ఈ దాడి జరిగే సమయంలో తమ యుద్ధవిమానాలనీ,
సైన్యాన్ని సమాయత్తం చేయడానికి వాళ్లకి కావాల్సినంత సమయం చిక్కింది

325
00:19:21,119 --> 00:19:24,790
ఇంకా ప్రతి అమెరికన్ విమానానికీ రెండు జర్మన్ యుద్ధవిమానాలు
లేదా ఒక విమానానికి పది జర్మన్ విమానాలు సిద్ధమయ్యాయి.

326
00:19:27,960 --> 00:19:30,963
ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా ప్రయాణించాం.
ఆ రోజు ఆ దృశ్యం అందంగా ఉంది.

327
00:19:31,755 --> 00:19:32,840
వాళ్లు డచ్ తీరంలో దాడులు చేశారు,

328
00:19:32,923 --> 00:19:35,133
దానితో హఠాత్తుగా మొత్తం ప్రపంచం ఉలిక్కిపడింది.

329
00:19:36,176 --> 00:19:38,136
ఆ దాడులు మరో రెండు గంటల పాటు కొనసాగాయి.

330
00:19:41,014 --> 00:19:44,184
మాకు అంతకుముందు ఇచ్చిన ట్రెయినింగ్ ప్రకారం

331
00:19:44,268 --> 00:19:46,728
జర్మన్ ఫైటర్ విమానాలని మేము ప్రతిఘటించగలం అని అనుకున్నాం.

332
00:19:46,812 --> 00:19:50,107
కానీ తరువాత, అది నిజం కాదని తెలుసుకున్నాం.

333
00:19:50,983 --> 00:19:55,153
{\an8}విమాన విధ్వంసక దాడులు ఉన్నాయి,
ఫైటర్ జెట్లు ఉన్నాయి, మరిన్ని దాడులు, మరిన్ని ఫైటర్ జెట్లు.

334
00:19:55,237 --> 00:19:59,867
{\an8}ఎగువ భాగంలో గన్నర్ నిరాటంకంగా
మెషీన్ గన్ తో కాల్పులు చేయడం నేను విన్నాను.

335
00:20:00,534 --> 00:20:04,246
క్లెవెన్ విమానం ఆరు చోట్ల దెబ్బతింది.

336
00:20:04,329 --> 00:20:07,249
వాళ్లు హైడ్రాలిక్ వ్యవస్థని ధ్వంసం చేశారు.
ఒక ఇంజన్ ని కూడా ధ్వంసం చేశారు.

337
00:20:07,833 --> 00:20:09,501
కాక్ పిట్ లో మంటలు చెలరేగాయి.

338
00:20:09,585 --> 00:20:13,589
క్లెవెన్ వెనక్కి తిరిగి, రేడియో గన్నర్ వైపు చూశాడు,

339
00:20:13,672 --> 00:20:15,883
రేడియో గన్నర్ కి రెండు కాళ్లూ లేవు.

340
00:20:15,966 --> 00:20:17,050
అవి ఛిద్రం అయిపోయాయి.

341
00:20:19,887 --> 00:20:22,014
ఒక విమానంలో, దాని ముందు భాగంలో ప్రతి కిటీకీ గుండా

342
00:20:22,097 --> 00:20:24,808
మంటలు బయటకి చెలరేగడం నాకు ఇంకా గుర్తుంది.

343
00:20:26,810 --> 00:20:29,521
చాలా కాలం పాటు నాకు ఆ దృశ్యం కలల్లోకి వచ్చేది.

344
00:20:30,564 --> 00:20:32,399
ఆ విమాన సిబ్బందిలో ప్రతి ఒక్క సభ్యుడూ పోరాడాడు

345
00:20:32,482 --> 00:20:35,611
ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా స్వాతంత్య్రం
మనుగడ సాగించాలన్నదే వారి లక్ష్యం.

346
00:20:35,694 --> 00:20:39,198
కానీ మనం యుద్ధం చేసే సమయంలో,
ఎవరి కోసం పోరాడతామో తెలుసా?

347
00:20:39,281 --> 00:20:41,992
మన ఎడమ పక్క ఉన్న వ్యక్తి కోసం
ఇంకా మన కుడి వైపు ఉన్న వ్యక్తి కోసం.

348
00:20:42,075 --> 00:20:44,328
మన ముందు ఉన్న వ్యక్తి కోసం
ఇంకా మన వెనుక ఉన్న వ్యక్తి కోసం.

349
00:20:44,411 --> 00:20:45,746
మనం యుద్ధం చేసేది వారి కోసమే.

350
00:20:48,707 --> 00:20:53,545
క్లెవెన్ కాక్ పిట్ లో కూర్చుని ఉన్నాడు,
ఇంకా అతని కోపైలెట్, క్లుప్తంగా ఇలా చెప్పాడు,

351
00:20:53,629 --> 00:20:55,672
"మనం విమానం నుండి బయటపడాలి.
హెచ్చరిక గంటని మోగిద్దాం."

352
00:20:55,756 --> 00:20:57,841
అప్పుడు క్లెవెన్ ఏమన్నాడంటే,
"మనం లక్ష్యాన్ని చేరుకోవాలి.

353
00:20:57,925 --> 00:21:00,093
మనం బాంబు దాడిని పూర్తి చేయాలి."

354
00:21:00,177 --> 00:21:05,432
లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐదు నిమిషాల ముందు,
ప్రతి దాడులు అన్నీ ఆగిపోయాయి.

355
00:21:05,516 --> 00:21:07,392
ఫైటర్ జెట్లు, విమాన విధ్వంసక కాల్పులు లేవు, ఏమీ లేవు.

356
00:21:08,227 --> 00:21:10,812
మేము విజయవంతంగా బాంబులు జారవిడిచాం.

357
00:21:13,982 --> 00:21:16,068
ఒక పక్క ఇంధనం అయిపోవచ్చినా,

358
00:21:16,151 --> 00:21:21,240
రేగెన్స్ బర్గ్ గ్రూప్ ఆల్ప్స్ పర్వతశ్రేణుల మీదుగా
పోరాటం చేసి ఉత్తర ఆఫ్రికా చేరుకున్నాయి,

359
00:21:21,323 --> 00:21:25,953
కానీ ష్వెయిన్ఫర్ట్ గ్రూప్ మాత్రం, జర్మన్ వాయుసేన
లుఫ్త్ వాఫే భీకర దాడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

360
00:21:26,828 --> 00:21:30,207
కాబట్టి జర్మన్లకి ఎలాంటి అవకాశం చిక్కిందంటే, వాళ్లు మేలుకొని
లీమే సిబ్బంది మీద తమ ప్రతాపమంతా చూపించవచ్చు,

361
00:21:30,290 --> 00:21:33,544
తరువాత వాళ్ల విమానాల్ని ల్యాండ్ చేసి, డ్రింక్ తాగి,
ఆయుధాల్ని ఇంకా ఇంధనాన్ని కూడా నింపుకోగలుగుతారు.

362
00:21:33,627 --> 00:21:35,420
తరువాత ష్వెయిన్ఫర్ట్ ప్రత్యర్థుల మీద
తీరికగా దాడి చేయగలుగుతారు.

363
00:21:39,174 --> 00:21:44,513
లుఫ్త్ వాఫే వాయుసేన మొత్తం ష్వెయిన్ఫర్ట్ గ్రూప్ మీద
మోహరించి వాళ్లని చెల్లాచెదురు చేసింది.

364
00:21:51,812 --> 00:21:53,939
ఆ రాత్రికల్లా ఉత్తర ఆఫ్రికాకి చేరుకునే సరికి,

365
00:21:54,523 --> 00:21:58,652
100వ బాంబ్ గ్రూప్ సిబ్బంది
యుద్ధం చేసి అలసిపోయి నీరసించిపోయారు,

366
00:21:59,194 --> 00:22:01,530
కానీ ఇంకా సజీవంగా ఉండటం లక్కీ అనుకున్నారు.

367
00:22:02,906 --> 00:22:05,784
ప్రత్యర్థి బలం ఎక్కువగా ఉన్నప్పుడు

368
00:22:05,868 --> 00:22:07,744
తమ దగ్గర సరిపడా ఆయుధాలు, పరికరాలు లేనప్పుడు

369
00:22:07,828 --> 00:22:10,038
ఇంకా తన సిబ్బందికి కనీస శిక్షణ కొరవడినప్పుడు...

370
00:22:10,122 --> 00:22:11,790
{\an8}రిటైర్డ్ లెఫ్టెనెంట్ జనరల్ ఐరా ఈకర్
కమాండర్, ఎయిత్ ఎయిర్ ఫోర్స్

371
00:22:11,874 --> 00:22:15,794
{\an8}...ఏ కమాండర్ అయినా కఠిన నిర్ణయాలకి సిద్ధపడాల్సి వస్తుంది.

372
00:22:16,920 --> 00:22:19,131
అది ఎలాంటిదంటే, తన సిబ్బందికి మరణశిక్ష విధించినట్లే.

373
00:22:23,594 --> 00:22:28,932
{\an8}నేను 1943 వేసవి కాలంలో ఇంగ్లండ్ లో ల్యాండ్ అయ్యాను,

374
00:22:30,184 --> 00:22:33,520
{\an8}అక్కడ నన్ను 100వ బాంబ్ గ్రూప్ కి పంపించారు.

375
00:22:33,604 --> 00:22:36,481
రోసీ రోసెన్థాల్ ఈ గ్రూపులో చేరి

376
00:22:36,565 --> 00:22:40,736
ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది స్థానాన్ని భర్తీ చేశాడు.

377
00:22:41,320 --> 00:22:45,324
రోసీ అనే ఈ కుర్రాడు, చాలా మంచి ఫ్లయర్ అని
ఈగన్ కి సమాచారం అందింది.

378
00:22:45,407 --> 00:22:48,952
దానితో, ఈగన్ అతడిని తీసుకువెళ్లి
అతనితో కొన్ని రిహార్సల్సు చేయించి

379
00:22:49,036 --> 00:22:51,038
"నా స్క్వాడ్రన్ లో నువ్వు ఉండాలి" అని చెప్పాడు.

380
00:22:54,875 --> 00:22:56,668
ఆ రోజు బార్ లో నేను కూడా ఉన్నాను.

381
00:22:56,752 --> 00:23:03,258
నేను ఎప్పటిలాగే స్కాచ్ తాగుతుండగా
హఠాత్తుగా నా భుజం మీద ఎవరో తట్టడంతో

382
00:23:03,759 --> 00:23:06,887
నేను వెనక్కి తిరిగి చూడగా
స్క్వాడ్రన్ కమాండర్ అక్కడ నిలబడి ఉన్నాడు.

383
00:23:07,471 --> 00:23:10,390
"లక్కీ, నువ్వు ఇంటికి వెళ్లి కాసేపు నిద్రపో.

384
00:23:11,058 --> 00:23:12,392
రేపు నువ్వు విమానంలో వస్తున్నావు" అన్నాడు.

385
00:23:13,060 --> 00:23:14,561
అక్టోబర్ 1943

386
00:23:15,062 --> 00:23:16,438
డి-డేకి ఎనిమిది నెలల ముందు

387
00:23:16,522 --> 00:23:20,234
అక్టోబర్ ఎనిమిదో తేదీన జర్మనీలో
వాతావరణం అనుకూలించడంతో

388
00:23:20,317 --> 00:23:24,238
అమెరికన్ సేనలు పూర్తి స్థాయిలో వరుస దాడులతో

389
00:23:24,321 --> 00:23:27,366
జర్మన్ విమాన తయారీ కర్మాగారాలని ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యాయి.

390
00:23:28,158 --> 00:23:31,870
కాలక్రమేణా ఆ దాడుల్ని వాయుసైనికులు
బ్లాక్ వీక్ అని పిలవసాగారు.

391
00:23:32,579 --> 00:23:36,375
అక్టోబర్ ఎనిమిదో తేదీన,
855 విమానాలు గ్రేట్ బ్రిటన్ నుండి బయలుదేరి

392
00:23:36,458 --> 00:23:38,877
బ్రెమన్ ఇంకా వేగేసాక్ మీద దాడులకు ఉపక్రమించాయి.

393
00:23:38,961 --> 00:23:41,713
ఆ విమానాలు పదకొండు లక్షల కిలోల బాంబులతో లోడ్ అయ్యాయి.

394
00:23:41,797 --> 00:23:44,591
ఇరవై మూడు లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి.

395
00:23:46,510 --> 00:23:50,013
మేము లక్ష్యానికి దగ్గరగా చేరుకునేసరికి,
నేను ఒక పక్క చూడగా,

396
00:23:50,097 --> 00:23:56,353
రెండు ఎఫ్.డబ్ల్యు. 190 యుద్ధ విమానాలు
నేరుగా మా మీదే గురి పెడుతుండటం కనిపించింది.

397
00:23:56,436 --> 00:23:59,815
నా కళ్ల ముందే అతను ఒక విమానాన్ని నేరుగా నేలకూల్చేశాడు,

398
00:23:59,898 --> 00:24:03,735
అది ఫార్మేషన్ నుండి పక్కకు మళ్లి, తరువాత పేలిపోయింది.

399
00:24:05,070 --> 00:24:06,738
ఆ గ్రూపు ఛిన్నాభిన్నం అయింది.

400
00:24:06,822 --> 00:24:10,617
మేము ఫార్మేషన్ నుండి తప్పుకునేలా మాపై దాడి చేశారు.
మా మూడో నెంబరు ఇంజనుకి మంటలు అంటుకున్నాయి.

401
00:24:11,869 --> 00:24:13,370
క్లెవెన్ ముందుకొచ్చి

402
00:24:13,453 --> 00:24:16,498
గ్రూపుకి సారథ్యం వహించాలని చూశాడు
కానీ అతని విమానం మీద దాడి జరిగింది.

403
00:24:17,833 --> 00:24:18,959
క్లెవెన్ విమానం దెబ్బతినింది.

404
00:24:19,668 --> 00:24:21,670
ఆ విమానంలో చాలా అలజడి రేగింది.

405
00:24:21,753 --> 00:24:23,589
కాక్ పిట్ లోకి మంటలు వ్యాపించాయి. వాళ్లు దూకేయాల్సిన పరిస్థితి.

406
00:24:27,384 --> 00:24:28,927
గేల్ క్లెవెన్ విమానం ధ్వంసం అయింది.

407
00:24:29,011 --> 00:24:33,098
ఆ సమయంలో 100వ బాంబ్ గ్రూప్ లో భారీ లోటు కనిపించింది.

408
00:24:33,182 --> 00:24:36,476
మరీ ముఖ్యంగా అతను చనిపోయాడు అని అంతా అనుకున్నారు.

409
00:24:37,811 --> 00:24:43,317
నేను తిరిగి క్షేమంగా చేరగలనా అనే సందేహం రావడం
నాకు అదే మొదటిసారి.

410
00:24:44,318 --> 00:24:49,114
{\an8}నా విమానం, రోసీ రివెటర్స్, బాగా దెబ్బతినింది,

411
00:24:49,198 --> 00:24:51,325
ఇంకా కొన్ని ఇంజన్లు పనిచేయడం మానేశాయి.

412
00:24:53,160 --> 00:24:54,912
మేము మా బాంబుల్ని జారవిడిచిన తరువాత,

413
00:24:54,995 --> 00:24:58,665
మా ఫార్మేషన్ లో మిగిలిన విమానాలని
నేను స్థావరానికి తిరిగి తీసుకురాగలిగాను,

414
00:24:58,749 --> 00:25:01,084
అప్పటికి కేవలం ఆరు మాత్రమే మిగిలాయి.

415
00:25:04,379 --> 00:25:08,425
అంటే, ఒక్క రోజులో అంతమంది సిబ్బందిని కోల్పోతే,
మన ఆత్మస్థయిర్యం ఎలా ఉంటుందో ఊహించండి.

416
00:25:09,009 --> 00:25:11,303
వాళ్లు ఏం చేస్తారంటే బారాక్స్ ని ఖాళీ చేసేస్తారు.

417
00:25:11,386 --> 00:25:13,388
ఏదైనా విమానం నేలకూలగానే, వాళ్లు బారాక్స్ ని ఖాళీ చేసేస్తారు.

418
00:25:13,472 --> 00:25:15,933
అప్పుడు, మనం వెళ్లినప్పుడు ఖాళీ బారాక్స్ కనిపిస్తాయి.

419
00:25:17,267 --> 00:25:20,771
ఈగన్ సెలవు మీద లండన్ వెళ్లాడు,

420
00:25:20,854 --> 00:25:23,565
అప్పుడు క్లెవెన్ విమానం నేలకూలి చనిపోయాడని
అతనికి సమాచారం అందింది.

421
00:25:24,816 --> 00:25:28,695
ఈగన్ ఎంత వేదన చెందాడంటే
తన సెలవుని తక్షణం రద్దు చేసుకుని

422
00:25:28,779 --> 00:25:33,450
వైమానిక స్థావరానికి తిరిగి వచ్చి,
"తరువాత మిషన్ కి నేనే సారథ్యం వహిస్తా" అన్నాడు.

423
00:25:34,201 --> 00:25:37,162
మంస్టర్ దాడి అనేది రద్దీ నగరం మీద జరిపిన ఆపరేషన్,

424
00:25:37,246 --> 00:25:39,289
ఎయిత్ ఎయిర్ ఫోర్స్ కి అది కొత్త అనుభవం.

425
00:25:39,373 --> 00:25:43,710
నగరం నడిమధ్యలో ఉండే వ్యూహాత్మకమైన రైల్ యార్డు

426
00:25:43,794 --> 00:25:47,589
ఇంకా దానికి ఆనుకుని ఉన్న కార్మికుల భవన సముదాయాలు
అమెరికన్ వాయుసైనికుల టార్గెట్లు.

427
00:25:48,215 --> 00:25:53,345
నాజీ అరాచక పాలనలో మానవ శరీరం ఇంకా ఎముకలు కూడా
టార్గెట్ అయ్యాయి,

428
00:25:53,428 --> 00:25:56,557
జర్మన్ నియంత యుద్ధ వ్యవస్థలో అది కీలకమైన భాగం అయింది.

429
00:25:56,640 --> 00:25:58,559
ఆ గదిలో అంతటా ఉత్కంఠ నెలకొంది.

430
00:25:58,642 --> 00:26:01,645
మొట్టమొదటిసారి, చాలామంది వాయుసైనికులు

431
00:26:01,728 --> 00:26:03,105
మిషన్ తీరుని ప్రశ్నించారు.

432
00:26:03,689 --> 00:26:05,607
ఈగన్ మంచి ప్రసంగం చేశాడు.

433
00:26:05,691 --> 00:26:10,279
వాళ్లు ఈ మిషన్ ని క్లెవెన్ కోసం చేపట్టబోతున్నారు,
ఇంకా ఇది ప్రతీకార దాడి.

434
00:26:13,490 --> 00:26:14,700
{\an8}మంస్టర్

435
00:26:14,783 --> 00:26:19,913
{\an8}మాకు నష్టాలు విపరీతంగా ఉండటం వల్ల,
మా గ్రూప్ పరిస్థితి ఘోరంగా తయారైంది,

436
00:26:20,414 --> 00:26:24,376
{\an8}ఇంకా మేము కేవలం పదమూడు విమానాలని మాత్రమే
దాడులకి పంపించగలిగాం.

437
00:26:26,003 --> 00:26:28,672
{\an8}జర్మన్ ఫైటర్ జెట్ల ఎదురుదాడుల గురించి చెప్పాలంటే,

438
00:26:28,755 --> 00:26:34,136
మన ఫార్మేషన్ పేలవంగా ఉండి, పద్దెనిమిది విమానాలకి బదులు
పదమూడు విమానాలు మాత్రమే దాడులకి వెళితే,

439
00:26:34,219 --> 00:26:36,513
జర్మన్ సైనికులు తక్కువ లక్ష్యాల మీద
తేలికగా దాడి చేయగలుగుతారు.

440
00:26:36,597 --> 00:26:40,767
మా మీద వెంటనే
దాదాపు రెండు వందల జర్మన్ ఫైటర్ విమానాలు దాడి చేశాయి.

441
00:26:41,351 --> 00:26:46,523
రెండు, ఎం.ఇ. 109 యుద్ధవిమానాలు మా వెనుకనే వచ్చి
మా వెనుక భాగం గన్నర్ ని కాల్చి చంపాయి.

442
00:26:46,607 --> 00:26:50,360
ఒక ఫిరంగి గుండు పేలి వాటి రజను నా ఒళ్లంతా పడటంతో

443
00:26:50,444 --> 00:26:51,904
నేను గాయాలతో కింద పడిపోయాను.

444
00:26:51,987 --> 00:26:54,781
మా విమానం అదుపు తప్పిందని,

445
00:26:54,865 --> 00:26:57,034
మేము నేలకూలబోతున్నామని మాకు స్పష్టం అయింది.

446
00:26:57,576 --> 00:27:00,746
అప్పటికి ఇరవై ఒకటి... ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో
మా విమానం ఉండటం నాకు గుర్తుంది.

447
00:27:00,829 --> 00:27:04,833
భూమి కొన్ని లక్షల మైళ్ల దూరంలో ఉన్నట్లు అనిపించింది,
కానీ నాకు మరో దారి లేదు.

448
00:27:04,917 --> 00:27:07,252
నేను విమానం నుండి దూకేయాల్సి వచ్చింది,
దానితో దూకేశాను.

449
00:27:15,719 --> 00:27:20,140
మేము మా వైమానిక స్థావరానికి చేరుకుని,
తిరిగి వచ్చే విమానాల కోసం ఎదురుచూశాం.

450
00:27:24,478 --> 00:27:26,855
చివరికి, మా విమానం ఒకటి తిరిగి వచ్చింది.

451
00:27:28,023 --> 00:27:30,567
మా 100వ గ్రూప్ విమానాలలో కేవలం ఒకటి మాత్రమే తిరిగి వచ్చింది.

452
00:27:31,068 --> 00:27:33,904
ఆ విమానాన్ని నడుపుతున్న వ్యక్తి రోసెన్థాల్.

453
00:27:33,987 --> 00:27:38,700
అంటే, ఆ కష్టాల్ని అతను కూడా అనుభవించాడు.

454
00:27:40,994 --> 00:27:43,872
మేము ఆఫీసర్స్ క్లబ్ కి తిరిగి చేరుకున్నాం.

455
00:27:43,956 --> 00:27:46,792
అక్కడ ఒక రకమైన విచిత్రమైన నిశ్శబ్దం తాండవించింది.

456
00:27:46,875 --> 00:27:49,920
మిషన్ లో పాల్గొనని వ్యక్తులు చాలా తక్కువమంది ఉన్నారు,

457
00:27:50,546 --> 00:27:53,173
ఇంకా వాళ్లెవరూ మమ్మల్ని సంప్రదించడానికి రాలేదు.

458
00:27:53,257 --> 00:27:55,092
మాకు మేముగా వేరుపడినట్లు అనిపించింది.

459
00:27:55,175 --> 00:27:57,594
అది చాలా విచిత్రమైన ఫీలింగ్.

460
00:27:59,179 --> 00:28:04,268
ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన
మా సిబ్బంది లేని లోటు స్పష్టంగా కనిపించింది.

461
00:28:04,351 --> 00:28:10,899
మరీ ముఖ్యంగా నేను నా ప్రాణమిత్రుడిని
మంస్టర్ మిషన్ లో పోగొట్టుకున్నాను.

462
00:28:14,486 --> 00:28:17,948
బకీ ఈగన్ ఇంకా క్లెవెన్ ల మీద
శత్రువులు కాల్పులు జరిపినప్పుడు,

463
00:28:18,031 --> 00:28:20,993
అది నిజంగా మా ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసింది

464
00:28:21,076 --> 00:28:24,788
ఎందుకంటే వాళ్లకి ఎదురులేదని ప్రతి ఒక్కరం భావించేవాళ్లం.

465
00:28:26,582 --> 00:28:30,544
అప్పటికి మంస్టర్ మిషన్ మాత్రం
వాయు యుద్ధచరిత్రలోనే అత్యంత గొప్ప పోరాటం.

466
00:28:30,627 --> 00:28:33,338
అవి కేవలం వైమానిక దాడులు కాదు,

467
00:28:33,422 --> 00:28:37,009
కానీ రెండు భారీ ఇంకా భయంకరమైన
వాయుసేనల మధ్య భీకరమైన పోరాటం.

468
00:28:37,092 --> 00:28:40,888
100వ గ్రూపు మంస్టర్ మిషన్ కి నాలుగు నెలల ముందు

469
00:28:40,971 --> 00:28:43,807
నూట నలభై మంది ఆఫీసర్లతో ఇంగ్లండ్ చేరుకుంది.

470
00:28:43,891 --> 00:28:48,854
మంస్టర్ తరువాత, కేవలం ముగ్గురు మాత్రమే
విమానాన్ని నడపగలిగి పోరాటం చేయగలిగే స్థితిలో మిగిలారు.

471
00:28:49,354 --> 00:28:52,065
{\an8}ఈ రకమైన వివరాలు అందరికీ తెలిసి,

472
00:28:52,149 --> 00:28:54,359
{\an8}జనం మా గురించి ఆందోళన చెందడం మొదలుపెట్టారు.

473
00:28:54,443 --> 00:28:56,361
{\an8}మమ్మల్ని The Bloody Hundredth అని పిలిచేవారు.

474
00:28:58,697 --> 00:29:00,407
మీరు వాయుసైనికులు అయితే, ఇంకా యుద్ధరంగంలోకి వెళితే,

475
00:29:00,490 --> 00:29:02,534
మీరు నాలుగు గంటల పాటు
పూర్తి భయానక పరిస్థితుల్ని ఎదుర్కొంటారు.

476
00:29:02,618 --> 00:29:04,953
హఠాత్తుగా, మీ సైకిల్ మీద, లోకల్ పబ్ కి వెళ్లి,

477
00:29:05,037 --> 00:29:07,956
ఒక బీర్ తాగి, మీ ప్రియురాలితో కాసేపు గడిపి,
వెంటనే వైమానిక స్థావరానికి వచ్చి,

478
00:29:08,040 --> 00:29:09,291
చక్కగా ఇంకా ప్రశాంతంగా కూర్చోవాలి.

479
00:29:09,374 --> 00:29:12,461
ఆ తరువాత, మరుసటి రోజు, మీరు మేలుకొంటారు,
ఇంకా మీరు మళ్లీ టెర్రర్ లోకి అడుగుపెడతారు.

480
00:29:15,047 --> 00:29:22,012
కొంతమంది పిచ్చివాళ్లు అయిపోవడానికి ఈ ఒత్తిడే అసలైన కారణం.

481
00:29:25,599 --> 00:29:27,100
బ్లాక్ వీక్ ఘటన తరువాత,

482
00:29:27,184 --> 00:29:30,270
ఎయిత్ ఎయిర్ ఫోర్స్ లో స్థయిర్యం అడుగంటిపోయింది,

483
00:29:30,354 --> 00:29:32,856
ఇంకా సిబ్బంది తిరుగుబాటు చేస్తారేమోనని
కమాండర్లు ఆందోళన చెందారు.

484
00:29:33,398 --> 00:29:35,901
ఫ్లయిట్ సర్జన్లు ఇంకా ఎయిర్ ఫోర్స్ మానసిక వైద్యుల నుండి

485
00:29:35,984 --> 00:29:40,906
అందిన ఆందోళన కలిగించే నివేదికల ప్రకారం,
కొందరు సిబ్బంది అసాధారణంగా ప్రవర్తించసాగారు

486
00:29:40,989 --> 00:29:46,578
ఎందుకంటే ఆ యుద్ధ బీభత్సం ఆ వాయుసైనికుల
ఆత్మస్థయిర్యాన్ని ఘోరంగా దెబ్బతీసింది.

487
00:29:46,662 --> 00:29:48,664
నేను కొన్ని సంఘటనల్ని చూశాను

488
00:29:48,747 --> 00:29:53,961
కొందరయితే విమానం నుండి బయటకి రావడానికి కూడా
సాధ్యమయ్యేది కాదు.

489
00:29:54,962 --> 00:29:57,673
యుద్ధం తాలూకు ఒత్తిడి

490
00:29:57,756 --> 00:30:01,051
ఆ వాయుసైనికుల మీద తీవ్ర ప్రభావం చూపింది.

491
00:30:03,345 --> 00:30:06,098
మానసికమైన సమస్యలు ఉన్న
ఈ వాయుసైనికులు యుద్ధవాతావరణం నుండి

492
00:30:06,181 --> 00:30:07,349
తాత్కాలికంగా దూరమైనప్పుడు

493
00:30:07,432 --> 00:30:10,269
వాళ్లు త్వరగా కోలుకోగలరని మేము తెలుసుకున్నాం.

494
00:30:10,769 --> 00:30:13,397
ప్రాథమికంగా, మానసిక రోగులు సొంతంగా కోలుకోగల సామర్థ్యంతో

495
00:30:13,480 --> 00:30:16,108
తిరిగి మామూలు స్థితికి రావడం మీదే మేము ఆధారపడాల్సి ఉంటుంది.

496
00:30:16,191 --> 00:30:19,945
కానీ వారు హాస్పిటల్ వాతావరణానికి దూరంగా ఉంటేనే
మరింత బాగా కోలుకోగలుగుతారు.

497
00:30:20,028 --> 00:30:22,072
ఫ్లాక్ హౌస్
ఆక్స్ ఫర్డ్, ఇంగ్లండ్

498
00:30:22,155 --> 00:30:26,660
అటువంటి వారిని యుద్ధవాతావరణం నుండి తప్పించి

499
00:30:26,743 --> 00:30:30,497
కొద్ది రోజుల పాటు విశ్రాంతి గృహాలకి పంపిస్తుంటాము.

500
00:30:30,581 --> 00:30:32,457
ఆ వసతి గృహాలని మేము ఫ్లాక్ హౌస్ అని పిలిచేవాళ్లం.

501
00:30:33,500 --> 00:30:37,588
కొన్నిసార్లు అది బాగా పని చేసేది, కొన్నిసార్లు పనిచేసేది కాదు.

502
00:30:39,089 --> 00:30:41,967
అందరు కమాండర్లు ఈ సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చేది

503
00:30:42,050 --> 00:30:46,430
ఎందుకంటే కొంతమంది వ్యక్తుల
శారీరక తత్త్వం ఇంకా మానసిక స్థయిర్యం,

504
00:30:46,513 --> 00:30:49,141
ఎలా ఉంటుందంటే వాళ్లు ఇటువంటి ఒత్తిళ్లని తట్టుకోలేరు.

505
00:30:49,808 --> 00:30:53,312
అటువంటి వారిని మేము వెంటనే

506
00:30:53,395 --> 00:30:56,440
మిగతా సిబ్బంది నుండి ఇంకా వైమానిక స్థావరం నుండి
తప్పించాల్సి వస్తుంది

507
00:30:56,523 --> 00:31:00,611
ఎందుకంటే అటువంటి ప్రవర్తన
మిగతా అందరికీ కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది,

508
00:31:00,694 --> 00:31:04,448
ఇంకా ప్రతి రోజూ తమ విధులని
సక్రమంగా నిర్వర్తించే మిగతా సిబ్బంది ఆత్మస్థయిర్యం మీద

509
00:31:04,531 --> 00:31:08,660
వాళ్ల ప్రభావం ఉండకుండా మేము చూసుకోవాలి.

510
00:31:10,954 --> 00:31:13,832
జర్మనీ మీద యూరప్ మీద మిత్రదేశాల వాయుసేనలకి

511
00:31:13,916 --> 00:31:17,002
గగనతలంలో ఆధిపత్యం లేదని మీరు అనవచ్చు,
ఇంకా అసలు వాయు యుద్ధంలో మిత్రదేశాల వాయుసేనలు

512
00:31:17,085 --> 00:31:18,962
ఓడిపోతున్నాయని కూడా మీరు వాదించవచ్చు.

513
00:31:20,422 --> 00:31:23,800
చూడండి, మేము ప్రతీసారి ఖచ్చితంగా
లక్ష్యాల మీదనే దాడులు చేయలేకపోయాం.

514
00:31:23,884 --> 00:31:27,095
{\an8}వాతావరణం స్పష్టంగా, అనుకూలంగా ఉన్న రోజులలో సైతం
మేము బాంబుల్ని అటూ ఇటూగా,

515
00:31:27,179 --> 00:31:29,640
{\an8}అసలైన లక్ష్యాలకు చాలా మైళ్ల దూరంలో
జారవిడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

516
00:31:30,724 --> 00:31:32,351
వాళ్లు లక్ష్యాల మీద బాంబులు వేయలేని సంఘటనల్లో,

517
00:31:32,434 --> 00:31:35,938
ఎక్కువగా వాళ్లే శత్రుదేశమైన
జర్మన్ ఫైటర్ దళాలకి లక్ష్యాలు అయ్యారు.

518
00:31:36,021 --> 00:31:38,273
{\an8}దానితో ఆ వాయుసేన నరమేధానికి గురైంది.

519
00:31:38,357 --> 00:31:39,650
{\an8}రాండల్ హాన్సెన్
రచయిత, ఫైర్ అండ్ ఫ్యూరీ

520
00:31:40,400 --> 00:31:43,779
ఈ కుప్పలో ప్రతి అడుగులో విమాన శకలాలు ఉంటాయి,

521
00:31:43,862 --> 00:31:46,198
ఇంకా అమెరికన్ సిబ్బంది పడిన
ఇరవై రెండు వేల గంటల కష్టం ఉంటుంది.

522
00:31:47,157 --> 00:31:50,869
ప్రతి గజం కనీసం పదిమంది అమెరికన్ కుర్రాళ్లు
మరణించడమో లేదా బందీలు కావడమో సూచిస్తుంది.

523
00:31:56,208 --> 00:31:59,378
బహుశా అత్యంత భయంకరమైనది ఏమిటంటే
శత్రువుల కాల్పుల్లో మరణించడమే.

524
00:31:59,461 --> 00:32:00,379
నాజీ ఆక్రమిత ఫ్రాన్స్

525
00:32:00,462 --> 00:32:02,214
అది జరిగే అవకాశం ఉందని మాకు ఎప్పుడూ తెలుసు.

526
00:32:02,297 --> 00:32:05,175
యుక్తవయసులో ఉండి, మనకి చావు లేదని భావించే దశలో,

527
00:32:05,259 --> 00:32:07,678
శత్రువులు మాలో ప్రతి ఒక్కరినీ చంపే అవకాశం ఉందని
మేము ఎప్పుడూ భావించేవాళ్లం,

528
00:32:07,761 --> 00:32:09,012
కానీ వాళ్లు మమ్మల్ని చంపలేకపోయారు.

529
00:32:09,096 --> 00:32:10,347
కెప్టెన్ ఎఫ్.డి. మర్ఫీ
కనిపించుట లేదు

530
00:32:10,430 --> 00:32:12,683
నా గురించి మా అమ్మ ఎంత ఆందోళన చెందిందో నాకు తెలుసు,

531
00:32:12,766 --> 00:32:14,601
ఇంకా ఆమెకి ఏదో ఒక రోజు

532
00:32:14,685 --> 00:32:18,605
నేను కనిపించడం లేదనే టెలిగ్రాము
మా యుద్ధ విభాగం నుండి అందుతుందని కూడా నాకు తెలుసు,

533
00:32:18,689 --> 00:32:21,149
ఇంకా నాకు అసలు ఏమైందో కూడా ఆమెకి తెలిసే అవకాశం ఉండదు.

534
00:32:23,527 --> 00:32:26,822
వాయుసైనికులకు పారాచూట్లు ఇస్తారు
కానీ వాటిని ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇవ్వలేదు,

535
00:32:26,905 --> 00:32:31,034
అలాగే శత్రువుల చెర నుండి పారిపోవడం లేదా తప్పించుకునే
మెళకువల గురించి వారికి కనీస శిక్షణ కూడా ఇవ్వలేదు.

536
00:32:31,118 --> 00:32:35,247
అలాగే బాంబు దాడులు చేసిన పట్టణాలలో
పొరపాటున వాయుసైనికులు కింద పడిపోయినప్పుడు

537
00:32:35,330 --> 00:32:38,667
పౌరులు చేసే దాడుల గురించి వారికి కనీస హెచ్చరికలు ఉండవు.

538
00:32:40,794 --> 00:32:43,172
క్లెవెన్, అతను నేల మీద పడినప్పుడు,

539
00:32:43,255 --> 00:32:46,717
రైతులు అతడిని చుట్టుముట్టడాన్ని చూశాడు.

540
00:32:46,800 --> 00:32:47,843
ఆ వెంటనే,

541
00:32:47,926 --> 00:32:51,471
ఒక రైతు తన గుండెలోకి మూడు మిల్లీమీటర్ల లోపలికి
గడ్డపారని దించి దాన్ని మరింత లోపలికి పొడవాలని చేసిన ప్రయత్నం

542
00:32:51,555 --> 00:32:52,639
అతనికి గుర్తుంది.

543
00:32:53,307 --> 00:32:56,226
కొంతమంది స్థానిక లుఫ్త్ వాఫే పోలీసులు
అక్కడికి చేరుకున్నారు.

544
00:32:58,312 --> 00:33:01,690
నన్ను జర్మన్ వైమానిక స్థావరానికి తీసుకువెళ్లారు

545
00:33:01,773 --> 00:33:03,066
అక్కడ ఆ రోజు పట్టుబడిన

546
00:33:03,150 --> 00:33:06,236
అమెరికన్ వాయుసైనికులందరినీ ఆ స్థావరానికి చేర్చారు.

547
00:33:08,155 --> 00:33:10,073
డూలాగ్ లుఫ్త్
ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ

548
00:33:11,700 --> 00:33:13,577
నన్ను ఆ వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడు,

549
00:33:13,660 --> 00:33:17,289
ఇంకా నాకు పదోన్నతి వచ్చినందుకు నన్ను అభినందించాడు.

550
00:33:18,290 --> 00:33:22,377
నేను కేవలం మూడు రోజుల ముందే
మొదటి లెఫ్టెనెంట్ గా పదోన్నతి పొందాను.

551
00:33:22,461 --> 00:33:24,963
అది నన్ను కొంత ఆశ్చర్యానికి గురి చేసింది.

552
00:33:25,047 --> 00:33:27,716
అతను నాకు ఏడు సెంటీమీటర్ల పొడవు ఇంకా
పన్నెండు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న కార్డు ఇచ్చాడు,

553
00:33:27,799 --> 00:33:32,638
అందులో నా పేరు, నేను పుట్టిన తేదీ,
నా తల్లిదండ్రుల పేర్లు, మా చిరునామా ఉన్నాయి.

554
00:33:32,721 --> 00:33:34,139
లారెన్స్ వోల్ఫ్
బాక్స్ 54 పాలోస్ వెర్డెస్ ఎస్టేట్స్

555
00:33:34,765 --> 00:33:37,643
అమెరికాలో ఉండే జర్మన్ గూఢచారులు

556
00:33:37,726 --> 00:33:40,145
అమెరికన్ సైనికులకి
తమ సొంత ఊరి న్యూస్ పేపర్లని పంపించేవారు.

557
00:33:40,229 --> 00:33:41,313
కాబట్టి, అవి మాకు స్వాంతన ఇచ్చేవి.

558
00:33:41,396 --> 00:33:43,941
మనం వాళ్లతో సంభాషిస్తున్నామని,

559
00:33:44,024 --> 00:33:46,109
ఇంకా మన గురించి వాళ్లకి అన్నీ తెలుసునే భావన కలిగేది.

560
00:33:46,193 --> 00:33:48,237
ఈ గోప్యమైన ఇంటరాగేషన్ టెక్నిక్

561
00:33:48,320 --> 00:33:51,907
కొన్ని సందర్భాలలో అది ఎంత బాగా పని చేస్తుందంటే,
అది గ్రహించలేని వాయుసైనికులు

562
00:33:51,990 --> 00:33:55,452
పెద్దగా ముఖ్యం కాదనుకుని చెప్పే సమాచారం,

563
00:33:55,536 --> 00:33:58,372
మేధావులైన ఇంటరాగేటర్స్ కి కీలకమైన సమాచారం అయ్యేది.

564
00:33:59,289 --> 00:34:02,626
మరుసటి ఉదయం, వాళ్లు మమ్మల్ని బాక్స్ కారులోకి ఎక్కించేవారు.

565
00:34:02,709 --> 00:34:05,796
ఆ బాక్స్ కారులో మేము ముప్పై నుండి నలబై మంది ఉండేవాళ్లం.

566
00:34:07,089 --> 00:34:09,049
ఏం జరుగుతుందో మాలో ఎవరికీ తెలిసేది కాదు.

567
00:34:11,510 --> 00:34:13,178
మూడో స్టాలాగ్ లుఫ్త్
సాగన్, జర్మనీ

568
00:34:15,556 --> 00:34:17,558
ఆ గేటు గుండా నడవడం నాకు గుర్తుంది,

569
00:34:17,641 --> 00:34:19,935
అక్కడ పెద్ద పెద్ద, చెక్క కంచెలు ఉన్నాయి,

570
00:34:20,018 --> 00:34:22,688
ఇంకా ఆ ప్రదేశం అంతటా ఇనుప వైర్లు చుట్టి ఉన్నాయి,

571
00:34:22,771 --> 00:34:25,732
ఇంకా అన్ని మూలల్లోనూ గార్డు టవర్లు ఉన్నాయి.

572
00:34:25,815 --> 00:34:30,152
పెద్ద కంచెకీ, ఇంకా ఆ తరువాత మరొక చిన్న కంచెకీ మధ్య,

573
00:34:30,237 --> 00:34:32,322
పది నుండి పన్నెండు అడుగుల దూరం ఉంది.

574
00:34:32,406 --> 00:34:35,324
ఆ చిన్న కంచె దాటి వెళ్లద్దని, వెళితే కాల్చి వేస్తామని
వాళ్లు మాకు చెప్పారు.

575
00:34:36,577 --> 00:34:38,911
అక్కడ ఉన్న అమెరికన్ యుద్ధ ఖైదీలు,

576
00:34:38,996 --> 00:34:41,456
వారిలో ఎక్కువమంది 100వ బాంబ్ గ్రూప్ సభ్యులే

577
00:34:41,540 --> 00:34:44,501
ఇంకా నాకన్నా ముందే నేలకొరిగి పట్టుబడిన వారే.

578
00:34:44,585 --> 00:34:46,378
మేము రావడం చూసిన మరుక్షణం, అంటే, వాళ్లు...

579
00:34:46,460 --> 00:34:49,089
వాళ్లలో కొందరు నవ్వుతూ ఏమన్నారంటే,
"అవును, మీరు వస్తారని ఎదురుచూస్తున్నాం.

580
00:34:49,172 --> 00:34:50,174
మీరు మొత్తానికి ఇక్కడికి వచ్చారు."

581
00:34:50,257 --> 00:34:51,507
{\an8}ఈగన్, జాన్ సి.
క్లెవెన్, గేల్ డబ్ల్యు.

582
00:34:51,592 --> 00:34:56,096
{\an8}క్లెవెన్ ఇంకా ఈగన్ కొద్ది రోజుల వ్యవధిలో
మూడో స్టాలాగ్ లుఫ్త్ కి వచ్చి చేరారు.

583
00:34:56,179 --> 00:34:59,683
గాయపడిన ఈగన్ వచ్చిన దగ్గర నుంచి
క్లెవెన్ అతడిని ఆటపట్టించేవాడు,

584
00:34:59,766 --> 00:35:02,269
ఆ తరువాత, ఆ ఇద్దరూ మళ్లీ రూమ్ మేట్స్ అయిపోయారు

585
00:35:02,352 --> 00:35:05,564
ఇంకా ఆ శిబిరంలో చాలా వేగంగా
నాయకత్వపు బాధ్యతల్ని స్వీకరించారు.

586
00:35:05,647 --> 00:35:08,275
మేము కలిసి ఉండేవాళ్లం, కలిసి వండుకునే వాళ్లం,

587
00:35:08,358 --> 00:35:11,236
కలిసి దుస్తులు ఉతుక్కునే వాళ్లం,
కలిసి స్నానాలు చేసేవాళ్లం.

588
00:35:11,320 --> 00:35:14,781
వారంలో ఒక రోజు షవర్ స్నానాలు ఉండేవి, అది కూడా లక్కీగా.

589
00:35:15,782 --> 00:35:18,243
స్టాలాగ్ లుఫ్త్ శిబిరాలలో

590
00:35:18,327 --> 00:35:19,953
జీవనం చాలా, చాలా అణచివేతతో కూడుకుని ఉండేది.

591
00:35:20,037 --> 00:35:23,248
మా ఆలోచనలు పక్కదారి పట్టనివ్వకుండా,
మేము క్రమశిక్షణతో ఉండే విధంగా,

592
00:35:23,332 --> 00:35:26,335
ఇంకా అందరం సజీవంగా ఉండేలా
ప్రతీ పనీ మిలటరీ పద్ధతిలో ఉండేది.

593
00:35:27,377 --> 00:35:28,378
టెహ్రాన్, ఇరాన్

594
00:35:29,338 --> 00:35:30,923
నవంబర్ 1943

595
00:35:31,882 --> 00:35:34,092
నవంబర్ 1943లో జరిగిన టెహ్రాన్ సదస్సులో

596
00:35:34,176 --> 00:35:36,094
ఒక రహస్య సమావేశం జరిగింది,

597
00:35:36,178 --> 00:35:41,767
రూస్వెల్ట్, చర్చిల్ ఇంకా స్టాలిన్ కలిసి నాజీ జర్మనీకి వ్యతిరేకంగా
రెండో కూటమిగా ఏర్పడాలనే ప్రతిపాదనని అంగీకరించారు

598
00:35:41,850 --> 00:35:45,521
ఆ వ్యూహాలని రచించి, అమలు చేసే బాధ్యతని ప్రాథమికంగా
అమెరికన్ ఇంకా బ్రిటీష్ సేనలు చేపడతాయని నిర్ణయించారు.

599
00:35:45,604 --> 00:35:46,813
ఉటా బీచ్ - ఒమాహా బీచ్
గోల్డ్ బీచ్

600
00:35:46,897 --> 00:35:47,898
జూనో బీచ్ - స్వార్డ్ బీచ్ - నార్మాండీ

601
00:35:47,981 --> 00:35:49,483
నేల, సముద్రం, వాయు మార్గాలలో,

602
00:35:49,566 --> 00:35:50,984
చరిత్రలోనే అత్యంత గొప్పగా,

603
00:35:51,068 --> 00:35:55,656
నార్మాండీ, ఫ్రాన్స్ దేశాలలోని ఐదు బీచ్ లలో
"ఓవర్ లార్డ్" అనే కోడ్ భాషలో భారీ దాడికి సంకల్పించారు.

604
00:35:55,739 --> 00:36:00,911
అది అప్పటికి ఆరు నెలల వ్యవధిలో,
మే 1944 నాటికి జరపాలని నిర్ణయించారు.

605
00:36:01,787 --> 00:36:04,331
జనరల్ ఐసన్ హోవర్ ని లండన్ కి ఆహ్వానించారు.

606
00:36:05,666 --> 00:36:09,837
జర్మన్ వాయుసేన లుఫ్త్ వాఫేని ధ్వంసం చేయకుండా
తాము నౌకాదళాల్ని పంపించలేమని ఆయన అన్నారు.

607
00:36:09,920 --> 00:36:10,921
మిషన్ బోర్డ్
యుద్ధ క్రమం

608
00:36:11,004 --> 00:36:12,381
అదే ఇప్పుడు మా మిషన్.

609
00:36:12,464 --> 00:36:17,803
గగనతలంలో ఆధిపత్యం సంపాదించే వరకూ

610
00:36:17,886 --> 00:36:20,722
భూమార్గంలో ఆక్రమణ అసాధ్యమని మేము గ్రహించాము.

611
00:36:22,266 --> 00:36:25,102
మా అంతిమ లక్ష్యం ఏమిటంటే
వీలైనన్ని జర్మన్ ఫైటర్ విమానాలను ధ్వంసం చేసి

612
00:36:25,185 --> 00:36:27,646
వాళ్లు తిరిగి యుద్ధవిమానాల రక్షణ పొందకుండా చేయడం.

613
00:36:30,858 --> 00:36:34,945
{\an8}యుద్ధవిమానాల పోరాటంలో మేము చాలా భారీగా నష్టపోతున్నాం.

614
00:36:35,028 --> 00:36:36,280
{\an8}రిటైర్డ్ జనరల్ జేమ్స్ డూలిటిల్
వాయిస్

615
00:36:36,363 --> 00:36:37,614
{\an8}కమాండర్, ఎయిత్ ఎయిర్ ఫోర్స్,
1944-45

616
00:36:37,698 --> 00:36:42,661
దానితో, స్వదేశంలో ఇంకా ఇంకా ఫైటర్ జెట్లని
సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యాం.

617
00:36:43,370 --> 00:36:46,331
1943 చివరి కాలంలో,
ఇంగ్లండ్ కి ఒక యుద్ధవిమానం చేరుకుంది,

618
00:36:46,415 --> 00:36:49,334
ఇంకా ఎయిత్ ఎయిర్ ఫోర్స్ ఇంతకాలంగా
ఎదురుచూస్తున్న యుద్ధ విమానం అది.

619
00:36:49,418 --> 00:36:51,170
అది పి-51 మస్టాంగ్.

620
00:36:51,253 --> 00:36:52,087
{\an8}ప్రోబోసిస్

621
00:36:52,171 --> 00:36:54,423
{\an8}అది మస్టాంగ్. పి-51వ విమానం.

622
00:36:54,506 --> 00:36:56,884
ప్రపంచంలోనే సుదీర్ఘమైన రేంజ్ ఉన్న యుద్ధవిమానం.

623
00:36:56,967 --> 00:37:01,305
వేగం, ఎత్తుకు వేగంగా వెళ్లే సామర్థ్యం, త్వరగా డైవ్ చేయగల,
మలుపులు తిరిగే సత్తా ఉన్న విమానం అది.

624
00:37:01,847 --> 00:37:03,891
పి-51 విమానాలు వచ్చాక,

625
00:37:03,974 --> 00:37:08,645
మమ్మల్ని లక్ష్యాల వరకూ తీసుకువెళ్లి
తిరిగి వెనక్కి తీసుకురాగల రేంజ్ వాటికి ఉండేది.

626
00:37:08,729 --> 00:37:11,857
ఇంకా వాళ్లు పి-47 యుద్ధవిమానాలని కూడా మరమ్మత్తులు చేసి

627
00:37:11,940 --> 00:37:15,485
వాటి రెక్కలకి ట్యాంకులు అమర్చి
మాతో పాటు రక్షణగా రావడానికి సిద్ధం చేశారు.

628
00:37:17,613 --> 00:37:21,491
మేము ఎండెన్ కి వెళ్లినప్పుడు,
నేను ఆ చక్కని పి-51 యుద్ధవిమానాలని చూశాను,

629
00:37:21,575 --> 00:37:23,869
అప్పుడు అనుకున్నాను, బహుశా మొదటిసారేమో,
"నేను క్షేమంగా తిరిగి వస్తాను" అని.

630
00:37:25,746 --> 00:37:26,872
మా ప్రాథమిక మిషన్ వచ్చి

631
00:37:26,955 --> 00:37:28,790
ఆ బాంబర్లకు రక్షణ ఇచ్చి,
వాటిని క్షేమంగా తీసుకురావడం కాదు.

632
00:37:28,874 --> 00:37:33,086
ఆకాశంలోనూ, ఇంకా భూమి మీద లుఫ్త్ వాఫే ని ధ్వంసం చేయడం.

633
00:37:37,508 --> 00:37:40,135
ఆదివారం ఉదయం, ఫిబ్రవరి 20వ తేదీ...

634
00:37:40,219 --> 00:37:41,553
ఫిబ్రవరి 20, 1944
డి-డేకి నాలుగు నెలల ముందు

635
00:37:41,637 --> 00:37:42,930
...అమెరికన్ వ్యూహాత్మక వాయుసేన చరిత్రలో

636
00:37:43,013 --> 00:37:46,808
అప్పటికి అత్యంత భారీ దాడికి మేము సంసిద్ధం అయ్యాము.

637
00:37:47,976 --> 00:37:50,729
అది ఆక్రమణకి ముందస్తు చర్య.

638
00:37:52,022 --> 00:37:57,027
రోజు విడిచి రోజు నిరాటంకంగా దాడులు చేయడానికి
వాళ్లు వ్యూహాలు రచించారు.

639
00:37:57,110 --> 00:37:58,987
అది మొత్తం యుద్ధ ఫలితాన్ని నిర్ణయించగలుగుతుంది.

640
00:38:05,744 --> 00:38:07,788
రోజు విడిచి రోజు, నెల తరువాత నెల,

641
00:38:08,288 --> 00:38:13,460
మస్టాంగ్, థండర్బోల్ట్ విమానాలు శత్రువిమానాలైన ఎం.ఇ. 109,
ఎఫ్.డబ్ల్యు. 190 యుద్ధవిమానాల్ని ఢీకొంటున్నాయి.

642
00:38:13,544 --> 00:38:16,630
మా ఫైటర్ జెట్లు దాడి చేశాయి, దాడి చేశాయి, దాడి చేశాయి.

643
00:38:17,339 --> 00:38:20,592
మా విజయాల రేటు 4-1గా భారీగా పెరిగింది.

644
00:38:21,885 --> 00:38:25,222
పశ్చిమ సరిహద్దులలో జర్మన్ పైలెట్ల మరణాల రేటు

645
00:38:25,305 --> 00:38:29,726
1944 జనవరి నుండి మే నెల మధ్య కాలంలో
99 శాతానికి పెరిగింది.

646
00:38:29,810 --> 00:38:31,812
అంటే, వాళ్లు దారుణంగా చంపబడ్డారు.

647
00:38:33,981 --> 00:38:36,650
మస్టాంగ్ ఈ యుద్ధంలో పాల్గొనే వరకూ

648
00:38:36,733 --> 00:38:39,903
అమెరికా ఇంకా ఇంగ్లండ్ దేశాల కూటమి
జర్మనీ మీద గగనతలంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది.

649
00:38:41,238 --> 00:38:42,865
శత్రుదేశపు భూభాగం మధ్యలోకి జొరబడాలంటే

650
00:38:42,948 --> 00:38:45,868
{\an8}లుఫ్త్ వాఫేని ఆకాశమార్గంలో నిలువరించగలిగితేనే,
బెర్లిన్ వరకూ వెళ్లగలం.

651
00:38:45,951 --> 00:38:47,202
{\an8}డాక్టర్ టామి డేవిస్ బిడెల్
రచయిత్రి

652
00:38:48,245 --> 00:38:50,789
{\an8}వాళ్లకి వ్యూహాలని వివరించాక, కర్టెన్ ని తిరిగి మూసివేసేవారు,

653
00:38:50,873 --> 00:38:53,458
{\an8}ఇంకా ఆ ఎర్ర టేపు బెర్లిన్ వరకూ ఉండేది,

654
00:38:54,168 --> 00:38:57,754
అది చూసి మొదటగా ఆశ్చర్యంతో కూడిన నిశ్శబ్దంతో ఉండి,
తరువాత అరుపులతో హోరెత్తించేవారు.

655
00:39:01,425 --> 00:39:03,427
ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల అడుగున

656
00:39:03,510 --> 00:39:05,095
జరుగుతున్న భీకరమైన దాడులలో

657
00:39:05,637 --> 00:39:09,683
రైల్వే యార్డులు, రసాయన ట్యాంకులు, నౌకలు, గిడ్డంగులు,
ఇంజన్ విడిభాగాలు, బాల్ బేరింగ్ ఫ్యాక్టరీలు

658
00:39:09,766 --> 00:39:14,313
విధ్వంసం అవుతూ కుప్పలుగా మారిపోతున్న శబ్దాలు తప్ప
మరేమీ వినిపించడం లేదు.

659
00:39:15,522 --> 00:39:20,110
బెర్లిన్ మీద అమెరికా బాంబులతో దాడులు చేయడం ఇదే మొదటిసారి.

660
00:39:20,194 --> 00:39:23,197
ఎయిత్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడులలో
అత్యంత కఠినమైన లక్ష్యం ఇదే అవుతుంది,

661
00:39:23,780 --> 00:39:25,115
కానీ అది చేయడం అనివార్యం.

662
00:39:27,242 --> 00:39:29,453
నేనే గనుక జర్మనీలో ఉండి ఉంటే

663
00:39:29,536 --> 00:39:35,083
ప్రతి రోజూ భారీ సంఖ్యలో బాంబర్ జెట్లు హోరుగా వచ్చి
బాంబులు జారవిడుస్తుంటే,

664
00:39:35,167 --> 00:39:37,753
అది నా ఆత్మస్థయిర్యం మీద తీవ్రమైన ప్రభావం చూపి ఉండేది.

665
00:39:37,836 --> 00:39:41,798
అక్కడి పౌరుల మీద ఇంకా మిలటరీ మీద కూడా
అదే విధమైన తీవ్ర ప్రభావం ఉండే ఉంటుంది.

666
00:39:43,926 --> 00:39:45,177
మూడో స్టాలాగ్ లుఫ్త్

667
00:39:47,763 --> 00:39:50,974
యుద్ధఖైదీగా ఉన్నప్పుడు అత్యంత ఘోరంగా అనిపించేది ఏమిటంటే

668
00:39:51,475 --> 00:39:54,728
మనం అక్కడ ఎంతకాలం బందీగా ఉంటామో తెలియకపోవడం.

669
00:39:54,811 --> 00:39:57,731
మనకి ఒక నిర్ణీత శిక్షని విధించినట్లుగా ఉండదు.

670
00:39:57,814 --> 00:40:01,401
మనం తప్పించుకోవడమో లేదా యుద్ధం ముగిసిపోవడమో
జరిగే వరకూ అక్కడే ఉండాలి.

671
00:40:02,194 --> 00:40:03,904
నేను ఒక సొరంగం తవ్వడం మొదలుపెట్టాను.

672
00:40:04,404 --> 00:40:07,449
అక్కడ ఒక పాడుబడిన టాయిలెట్ లో టైల్స్ తో చేసిన నేల ఉండేది

673
00:40:07,533 --> 00:40:10,327
అది చూసి, అంటే, ఇక్కడ ఏమైనా ప్రయత్నం చేయవచ్చేమో
చూద్దాం అనుకున్నాను.

674
00:40:10,410 --> 00:40:14,665
మేము ఆ టైల్స్ ని తొలగించి

675
00:40:14,748 --> 00:40:16,166
తవ్వకం ప్రారంభించాలన్నది నా ఉద్దేశం.

676
00:40:16,250 --> 00:40:18,627
దానిని గార్డులు వెంటనే పసిగట్టేశారు.

677
00:40:18,710 --> 00:40:20,087
{\an8}టన్నల్ హ్యారీ

678
00:40:20,170 --> 00:40:25,133
{\an8}మాకు పక్కనే ఉండే బారాక్స్ లో
బ్రిటీష్ ఖైదీలు డెబ్బై ఆరుమంది

679
00:40:25,217 --> 00:40:28,846
ఒక సొరంగం తవ్వి అందులో నుంచి తప్పించుకుని పారిపోయారు.

680
00:40:28,929 --> 00:40:31,139
దానినే 'గ్రేట్ ఎస్కేప్' అని అంటారు.

681
00:40:31,223 --> 00:40:37,312
వారిలో ఇద్దరు తప్ప మిగతా అందరూ తిరిగి పట్టుబడ్డారు,
కాగా వారిలో యాభై మందిని జర్మన్లు కాల్చి చంపేశారు.

682
00:40:38,397 --> 00:40:41,358
అంతవరకూ జర్మన్లతో మాకు ఉన్న కొద్దిపాటి పరిచయం కూడా

683
00:40:41,441 --> 00:40:43,318
ఆ సంఘటనతో పూర్తిగా ఆవిరైపోయింది.

684
00:40:46,655 --> 00:40:49,950
ఒక రోజు నేను ఒక టెలిఫోన్ కాల్ అందుకున్నప్పుడు,
వాళ్లు చెప్పారు,

685
00:40:50,033 --> 00:40:52,202
"జనరల్ లీమే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు" అని.

686
00:40:52,286 --> 00:40:55,289
ఆయన ఏం అన్నారంటే, "జెఫ్రీ, నాకు ఒక గ్రూప్ కమాండర్ కావాలి

687
00:40:55,372 --> 00:40:58,208
95వ బాంబ్ గ్రూప్ కీ ఇంకా 100వ బాంబ్ గ్రూప్ కీ.

688
00:40:58,292 --> 00:40:59,960
ఆ రెండింటిలో నువ్వు ఏదైనా ఎంచకోవచ్చు."

689
00:41:00,043 --> 00:41:01,044
ప్రధానకార్యాలయం
95వ బాంబ్ గ్రూప్ హెచ్

690
00:41:01,128 --> 00:41:03,172
ఆ 95వ బాంబ్ గ్రూప్ పెద్దగా పొరపాట్లు ఏమీ చేయలేదు.

691
00:41:03,255 --> 00:41:05,174
వాళ్లు తక్కువ సంఖ్యలో విమానాలని కోల్పోయారు.

692
00:41:05,257 --> 00:41:09,469
వాళ్ల బాంబింగ్ రికార్డు బాగుంది,
అందువల్ల నేను ఏం ఆలోచించానంటే

693
00:41:09,553 --> 00:41:11,430
95వ గ్రూప్ కంటే 100వ గ్రూప్ కోసం
ఏదైనా చేయాలి అనుకున్నాను.

694
00:41:11,513 --> 00:41:15,142
దానితో, నేను ఆయనకి తిరిగి ఫోన్ చేసి ఆయన అనుమతితో,

695
00:41:15,225 --> 00:41:17,269
100వ బాంబ్ గ్రూప్ కమాండర్ పదవిని స్వీకరిస్తానని చెప్పా.

696
00:41:17,352 --> 00:41:19,396
అప్పుడు అడిగాను,
"నన్ను ఎప్పుడు వచ్చి రిపోర్ట్ చేయమంటారు?" అని.

697
00:41:19,479 --> 00:41:20,689
ఆయన, "ఈ మధ్యాహ్నం వచ్చేయ్" అన్నారు.

698
00:41:25,194 --> 00:41:30,324
నేను జనరల్ లీమేని మొదటగా కోరింది ఏమిటంటే
100వ గ్రూప్ కార్యకలాపాలని

699
00:41:30,407 --> 00:41:33,869
ఒక రెండు రోజుల పాటు నిలిపివేయాలని అడగగా
అందుకు ఆయన ఒప్పుకున్నారు.

700
00:41:33,952 --> 00:41:35,621
దానితో, ఆ తరువాత రెండు రోజులూ,

701
00:41:35,704 --> 00:41:37,706
ఉదయం నాలుగు గంటలు, మధ్యాహ్నం నాలుగు గంటలు,

702
00:41:37,789 --> 00:41:42,085
100వ బాంబ్ గ్రూప్ లో ఉన్న ప్రతి విమానాన్ని
మేము ఫార్మేషన్ లో నడిపాము.

703
00:41:42,920 --> 00:41:49,301
టామ్ జెఫ్రీ చాలా ఉత్సాహంగా,
సమ్మోహనంగా ఇంకా పూర్తి అవగాహనతో ఉండేవారు,

704
00:41:49,384 --> 00:41:53,138
ఆయనకి విమానాల గురించి మాత్రమే కాదు,
యుద్ధ విమానాల వ్యూహాల గురించి కూడా తెలుసు.

705
00:41:54,681 --> 00:41:56,725
నేను లీడ్ విమానంలో మనుషుల్ని ప్రత్యేకంగా నియమించి

706
00:41:56,808 --> 00:41:58,060
మా ఫార్మేషన్ ని ఫోటోలు తీయమని అడిగాను

707
00:41:58,143 --> 00:42:01,522
దాని వల్ల ఎవరు బాగా విమానం నడుపున్నారు,
ఎవరు నడపడం లేదనేది మేము గుర్తించడానికి ఉపయోగపడేది.

708
00:42:01,605 --> 00:42:05,359
ఆ తరువాత నేను ఒక పాత విమానం తీసుకుని,
ఆ ఫార్మేషన్ చుట్టూ,

709
00:42:05,442 --> 00:42:08,403
ఇంకా ముందుకూ, వెనక్కీ తిరుగుతూ
వాళ్లంతా సరైన స్థానాలలో వెళుతున్నదీ లేనిదీ గమనించేవాడిని.

710
00:42:08,487 --> 00:42:10,989
{\an8}మా ఫార్మేషన్లు పకడ్బందీగా ఉండేలా చేస్తున్నా కూడా

711
00:42:11,073 --> 00:42:13,992
{\an8}మా కమాండింగ్ ఆఫీసర్లు చాలా విసుక్కునేవారు.

712
00:42:14,076 --> 00:42:16,787
మేము పకడ్బందీగా ఫార్మేషన్ లో ఉన్నామని అనుకున్నా
ఇంకా దగ్గరగా ఉండమని అడిగేవారు.

713
00:42:17,788 --> 00:42:19,831
రెండు రోజుల తరువాత,

714
00:42:19,915 --> 00:42:23,961
100వ గ్రూపు నేను మునుపెన్నడూ చూడనంత గొప్పగా,
చక్కని ఫార్మేషన్ ని సాధించింది.

715
00:42:25,087 --> 00:42:30,300
జెఫ్రీ వచ్చాకే మా గ్రూప్ అద్భుతంగా రాణించింది.

716
00:42:31,093 --> 00:42:33,679
వాయుసేనలోనే మాది అత్యంత ఉత్తమ బృందం అయింది.

717
00:42:37,766 --> 00:42:42,271
ఎయిత్ ఎయిర్ ఫోర్స్ బాంబర్ సిబ్బందికి
ఇరవై ఐదు మిషన్ల డ్యూటీ టూర్ ఉండేది.

718
00:42:42,354 --> 00:42:44,314
ఒకసారి ఇరవై ఐదు మిషన్లు పూర్తి చేస్తే,

719
00:42:44,398 --> 00:42:46,441
వాళ్లని తిరిగి అమెరికాలోని తమ స్వస్థలాలకి పంపించేవారు.

720
00:42:47,693 --> 00:42:52,322
నేను పాతిక మిషన్లు పూర్తి చేశాక
ఇక్కడే కొనసాగి స్క్వాడ్రన్ ఆదేశాల్ని స్వీకరిస్తావా

721
00:42:52,406 --> 00:42:58,120
లేదా తిరిగి అమెరికాలో స్వస్థలానికి వెళతావా అని
అధికారులు అడిగారు.

722
00:42:58,203 --> 00:43:04,376
నేను ఏం ఆలోచించానంటే నేను చాలా అదృష్టవంతుడిని

723
00:43:04,459 --> 00:43:09,756
ఇంకా లక్కీగా సజీవంగా కూడా ఉన్నాను కాబట్టి
ఇక ఇంతకుమించి కొనసాగించకూడదు అనుకున్నాను.

724
00:43:09,840 --> 00:43:13,051
దానితో, నేను తిరిగి వెళ్లడానికే నిర్ణయించుకున్నాను.

725
00:43:14,845 --> 00:43:17,222
రోసీ రోసెన్థాల్ తన 25 మిషన్లు పూర్తి చేశాడు

726
00:43:17,306 --> 00:43:21,143
బెర్లిన్ మీద మార్చి 8వ తేదీన జరిగిన దాడితో
అతను పాతిక మిషన్ల లక్ష్యాన్ని సాధించాడు.

727
00:43:21,852 --> 00:43:25,606
మేము తిరిగి వస్తుండగా
మా అధికారుల్ని ఆటపట్టించమని మా సిబ్బంది ఒత్తిడి చేశారు.

728
00:43:25,689 --> 00:43:29,109
కానీ నేను చాలా సాంప్రదాయవాదినైన పైలెట్ ని
కాబట్టి, "నేను అలా చేయలేను" అని చెప్పాను.

729
00:43:29,860 --> 00:43:33,363
కానీ మేము తిరిగి వస్తుండగా,
నేను అనుకున్నాను, "ఏం అవుతుంది" అని.

730
00:43:33,447 --> 00:43:38,035
అంతే, నేరుగా టవర్ మీదకి దూసుకువెళ్లాను
దానితో అక్కడ ఉన్నవారంతా నేల మీదకి ఒరిగిపోయారు

731
00:43:38,619 --> 00:43:42,414
ఇంకా నేను ఎయిర్ ఫీల్డ్ లో కూడా
మూడు నాలుగుసార్లు కిందికి దిగుతూ పైకి విమానాన్ని పోనిచ్చాను.

732
00:43:42,497 --> 00:43:44,416
అప్పుడు ఎవరో నా దగ్గరకి వచ్చి అడిగారు,

733
00:43:44,499 --> 00:43:48,504
"రోసీ, జనరల్ హగ్లిన్ అక్కడే ఉన్నాడన్న విషయం నీకు తెలుసా?

734
00:43:49,004 --> 00:43:52,424
ఆయన డెక్ మీద పడ్డాడు ఇంకా దానితో...
ఆయన దుస్తులన్నీ మాసిపోయాయి" అని చెప్పారు.

735
00:43:52,508 --> 00:43:56,220
ఇంకా డీబ్రీఫింగ్ రూమ్ కి వచ్చిన వారిలో
జనరల్ హగ్లిన్ కూడా ఉన్నారు.

736
00:43:56,303 --> 00:43:58,597
ఆయన నా దగ్గరకి వచ్చి నా చేయి పట్టుకుని

737
00:43:58,680 --> 00:44:01,391
"మా మీదకి భలేగా దూసుకువచ్చావు, రోసీ" అన్నారు.

738
00:44:02,476 --> 00:44:05,437
డి-డే దగ్గరలోనే ఉందని ప్రతి ఒక్కరికీ తెలుసు

739
00:44:05,521 --> 00:44:10,192
ఇంకా నియంత పాలనని అంతం చేయడం రోసీ ప్రధాన లక్ష్యం.

740
00:44:10,692 --> 00:44:14,613
ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్లడం అంటే
విశ్వం కేంద్రాన్ని విడిచి వెళ్లినట్లే.

741
00:44:14,696 --> 00:44:17,991
ఇంకా అప్పుడు నేను వాయుసేనలో
విమానాలు నడపడం కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.

742
00:44:18,075 --> 00:44:22,621
ఇంకా అంతిమంగా నన్ను స్క్వాడ్రన్ కమాండర్ గా నియమించారు.

743
00:44:23,539 --> 00:44:27,709
ఈ రోజు, ఆరు వందల యాభై అమెరికన్ ఎగిరే కోటలు

744
00:44:27,793 --> 00:44:31,463
సముద్ర తీర ప్రాంతాలలో జర్మన్ రక్షణ వ్యవస్థల్ని
తీవ్రంగా ధ్వంసం చేశాయి.

745
00:44:35,843 --> 00:44:39,137
నేను ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించి
కొన్ని లక్ష్యాల మీద బాంబులు జారవిడిచాను.

746
00:44:39,221 --> 00:44:42,516
ఇంకా నేను తిరిగి వచ్చాక,
విమానం దగ్గర నన్ను అధికారులు కలిసి

747
00:44:42,599 --> 00:44:48,272
వెంటనే ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ సాయంత్రం
జనరల్ లీమేని కలవాలని చెప్పారు.

748
00:44:49,523 --> 00:44:54,945
{\an8}జనరల్ లీమే లోపలికి వచ్చి
మరుసటి రోజు ఉదయం మిత్రదేశాల వాయుసేనలు

749
00:44:55,028 --> 00:44:58,740
{\an8}నార్మాండీ బీచులలో ల్యాండ్ కావాల్సి ఉంటుందని చెప్పారు.

750
00:44:58,824 --> 00:45:03,120
{\an8}ఆ సందర్భం యొక్క ప్రాముఖ్యతని

751
00:45:03,203 --> 00:45:06,415
{\an8}మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే,

752
00:45:06,498 --> 00:45:11,420
ఎయిత్ ఎయిర్ ఫోర్స్ తన ఆధీనంలో ఉన్న
ప్రతి ఒక్క విమానాన్ని ఉపయోగించి

753
00:45:11,503 --> 00:45:14,882
వాయుసైనికులంతా క్షేమంగా తిరిగి చేరుకునేలా
ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు.

754
00:45:16,133 --> 00:45:18,343
{\an8}ఆ వ్యూహరచన సమావేశానికి నేను వెళ్లినప్పుడు

755
00:45:18,427 --> 00:45:22,723
అధికారులు కర్టెన్ ని తొలగించగానే ఆ మ్యాప్ ని చూసి
సైనికులు కేరింతలు కొట్టడం నాకు గుర్తుంది.

756
00:45:22,806 --> 00:45:25,726
సిబ్బంది నుండి అటువంటి స్పందనని
నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు.

757
00:45:25,809 --> 00:45:27,644
ఎట్టకేలకి, డి-డే రానే వచ్చింది.

758
00:45:28,437 --> 00:45:29,938
జూన్ 6, 1944

759
00:45:30,689 --> 00:45:31,648
డి-డే

760
00:45:31,732 --> 00:45:34,276
సైనికులారా, నావికులారా, వాయుసైనికులారా,

761
00:45:34,359 --> 00:45:36,361
మిత్రదేశాల కూటమి అత్యవసర దళాలకి చెందిన అందరూ,

762
00:45:37,905 --> 00:45:40,073
{\an8}మీరు ఒక గొప్ప పవిత్ర యుద్ధంలో పాల్గొనబోతున్నారు...

763
00:45:40,157 --> 00:45:41,825
{\an8}జనరల్ డ్వైట్ డి. ఐసన్ హోవర్ వాయిస్
మిత్రదేశాల కూటమి సుప్రీమ్ కమాండర్

764
00:45:41,909 --> 00:45:43,660
...దీని కోసం మనం కొన్ని నెలలుగా పాటుపడుతున్నాము.

765
00:45:44,578 --> 00:45:46,538
యావత్ ప్రపంచం యొక్క దృష్టి ఇప్పుడు మన మీద ఉంది.

766
00:45:47,998 --> 00:45:50,125
మీరు చేపట్టే కార్యం అంత తేలికైనది కాదు.

767
00:45:51,001 --> 00:45:54,588
మీ శత్రువు సుశిక్షితుడు, ఆయుధ సంపత్తి కలిగినవాడు
ఇంకా యుద్ధవిద్యలో ఆరితేరిన వాడు.

768
00:45:55,088 --> 00:45:56,757
శత్రువు అమానుషంగా యుద్ధం చేస్తాడు.

769
00:45:57,633 --> 00:46:02,721
మీ ధైర్యసాహసాల మీద, విధి పట్ల మీకున్న భక్తిశ్రద్ధల మీద,
మీ యుద్ధ నైపుణ్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది.

770
00:46:03,680 --> 00:46:06,975
మనం పూర్తి విజయం కన్నా తక్కువగా మరేదీ ఆమోదించబోము.

771
00:46:10,437 --> 00:46:12,022
మేము ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా ప్రయాణిస్తుండగా,

772
00:46:12,105 --> 00:46:16,860
మేము కిందకి చూడగా వేల కొద్దీ నౌకల సమూహం కనిపించింది.

773
00:46:18,570 --> 00:46:25,452
మా సిబ్బందిలో ఒకరు ప్రార్థనలు మొదలుపెట్టగా
మేము కూడా ప్రార్థనల్లో పాల్గొన్నడం చాలాథ్రిల్ అనిపించింది.

774
00:46:30,541 --> 00:46:34,336
న్యూ యార్క్ లోని ఎన్.బి.సి. న్యూస్ రూమ్ నుండి
నేను రాబర్ట్ సెయింట్ జాన్ మాట్లాడుతున్నా.

775
00:46:34,419 --> 00:46:37,339
ప్రపంచ చరిత్రలో ఇది చిరస్మరణీయమైన సంఘటన.

776
00:46:37,923 --> 00:46:42,177
జనరల్ డ్వైట్ ఐసన్ హోవర్ సైన్యం
తమ బల్లకట్టు నౌకల నుండి దిగి,

777
00:46:42,261 --> 00:46:45,889
నాజీ యూరప్ కి కంచుకోటగా ఉన్న బీచుల మీద
దాడులు చేస్తున్నారు.

778
00:46:46,723 --> 00:46:48,517
వాళ్లు సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ

779
00:46:48,600 --> 00:46:52,271
భారీగా మోహరించిన యుద్ధవిమానాల నీడలో
శత్రువు మీద దాడులు చేస్తున్నారు.

780
00:46:53,522 --> 00:46:56,149
ఆకాశ మార్గంలో సైన్యం నిప్పులు చెరగడం కొనసాగింది.

781
00:46:56,233 --> 00:47:01,113
భూమి, సముద్ర మార్గాల సైనికులకు వ్యూహాత్మక రక్షణగా నిలిచిన
మన వాయుసైనికులు ఆ రోజు విశ్రాంతి తీసుకోకుండా పని చేశారు.

782
00:47:01,196 --> 00:47:05,534
ఒక విడత దాడులు జరిపాక, వాళ్లు ఊపిరి పీల్చుకుని,
తిరిగి బాంబులు, మందుగుండు సామగ్రి నింపుకొని

783
00:47:05,617 --> 00:47:08,829
భీకరంగా పదేపదే శత్రుదేశం మీద దాడులు కొనసాగించారు.

784
00:47:12,207 --> 00:47:16,587
మేము నార్మాండీని ఆక్రమించుకున్నప్పుడు
లుఫ్త్ వాఫే నుండి

785
00:47:16,670 --> 00:47:17,880
ఎటువంటి ప్రతిఘటనా ఎదురుకాలేదు.

786
00:47:19,089 --> 00:47:21,466
ఇంగ్లీష్ ఛానెల్ గుండా ఆక్రమించుకోవడానికి

787
00:47:21,550 --> 00:47:24,761
వాయుసైన నిజంగా మార్గాన్ని సుగమం చేసింది.

788
00:47:28,473 --> 00:47:31,018
జర్మనీ ఇప్పుడు రెండు సరిహద్దుల్లో
యుద్ధం చేయాల్సి వచ్చింది,

789
00:47:31,101 --> 00:47:35,314
{\an8}పశ్చిమం వైపు బ్రిటీష్-అమెరికన్ కూటమితో,
ఇంకా తూర్పు ప్రాంతంలో రష్యన్లతో తలపడాల్సి వచ్చింది.

790
00:47:35,397 --> 00:47:36,857
{\an8}ఇంగ్లండ్ - ఫ్రాన్స్ - జర్మనీ
రష్యన్ సైన్యం

791
00:47:36,940 --> 00:47:39,318
ఆగస్టు, 1944లో, మడానెక్ ప్రాంతాన్ని రెడ్ ఆర్మీ కనుగొనింది,

792
00:47:39,401 --> 00:47:44,531
అది పోలాండ్ లోని లుబ్లిన్ సమీపంలో నాజీలు వదిలివేసిన
నిర్బంధ ఇంకా నరహంతక శిబిరం,

793
00:47:44,615 --> 00:47:50,204
యూరప్ లోని యూదులను నరమేధం చేయడం కోసం
హిట్లర్ సాగించిన దారుణకాండకి అది స్పష్టమైన నిదర్శనం.

794
00:47:50,287 --> 00:47:52,247
నాజీ సామూహిక నరమేధం
శిబిరంలో బట్టబయలు

795
00:47:56,084 --> 00:47:58,837
మన ఆక్రమణ సైన్యాలు దూసుకువెళుతున్నాయి

796
00:47:58,921 --> 00:48:01,840
కాగా నాజీ దళాలు వెనక్కి తిరిగి రావడం కన్నా
చనిపోవడం మేలని ఆదేశాలను అందుకొన్నాయి.

797
00:48:01,924 --> 00:48:03,300
మూడో స్టాలాగ్ లుఫ్త్
సాగన్, జర్మనీ

798
00:48:03,967 --> 00:48:08,096
ఏది ఏమైనా, శత్రుసేనకి మరణమో లేదా విరమణో అనివార్యమే అయినా

799
00:48:08,180 --> 00:48:12,684
మిత్రదేశాల కూటమి కమాండ్ తమ శక్తినంతా ఉపయోగించి
యుద్ధరంగంలోకి దిగింది.

800
00:48:12,768 --> 00:48:14,520
{\an8}ఆ ఆర్మీ క్యాంప్ లో మూడు రహస్య రేడియోలు ఉండేవి...

801
00:48:14,603 --> 00:48:16,230
{\an8}విలియం "బిల్" కౌచ్
బంబార్డియర్, 100వ బాంబ్ గ్రూప్

802
00:48:16,313 --> 00:48:19,358
{\an8}...ఇంకా బిబిసికి తెలిసిన ప్రతి విషయం మాకు తెలిసేది.

803
00:48:19,441 --> 00:48:23,362
జూన్, 1944 తేదీన ఆక్రమణ మొదలైనప్పుడు,

804
00:48:23,445 --> 00:48:25,697
మేము ఆ శిబిరంలో ఎంతో కాలం ఉండమని గ్రహించాము.

805
00:48:26,990 --> 00:48:30,577
నేలకూలిన వాయుసైనికులు
ఇంకా మూడో స్టాలాగ్ లుఫ్త్ శిబిరాలకి చేరుతున్నారు.

806
00:48:30,661 --> 00:48:32,412
వారిలో, కొందరు నల్లజాతీయులైన పైలెట్లలో

807
00:48:32,496 --> 00:48:36,875
{\an8}సెకండ్ లెఫ్టెనెంట్లు అలెగ్జాండర్ జెఫర్సన్
ఇంకా రిచర్డ్ మాకన్ ఉన్నారు,

808
00:48:36,959 --> 00:48:41,672
{\an8}వారు రెడ్ టెయిల్స్ గా ప్రసిద్ధమైన 332వ ఫైటర్ గ్రూపులో
పని చేసేవారు.

809
00:48:41,755 --> 00:48:45,008
ఆ టస్కీగీ పైలెట్లు తమ విమానాల వెనుక భాగంలో
ఎర్ర రంగుని పెయింట్ వేసుకునేవారు.

810
00:48:45,092 --> 00:48:47,845
{\an8}ఆ విమానాలని నడిపేది నల్లజాతీయులైన పైలెట్లు అని
జనానికి తెలియకపోయినా...

811
00:48:47,928 --> 00:48:48,929
{\an8}డాక్టర్ మాథ్యూ ఎఫ్. డెల్మాంట్
రచయిత

812
00:48:49,012 --> 00:48:50,556
...వాళ్లు రెడ్ టెయిల్స్ సిబ్బంది అని గుర్తుపట్టేవారు.

813
00:48:51,056 --> 00:48:54,768
శత్రువు భూభాగంలోకి జొరబడటం గురించి
మాకు ఎలాంటి ఆందోళన లేదు

814
00:48:54,852 --> 00:48:57,813
ఎందుకంటే వాళ్ల కన్నా మేము యుద్ధవిమానాల్ని
బాగా నడుపుతామని మాకు తెలుసు,

815
00:48:57,896 --> 00:48:59,022
{\an8}నేను, "రెడీ, ఎయిర్, ఫైర్" తరహా మినిషిని.

816
00:48:59,106 --> 00:49:00,440
{\an8}రిచర్డ్ మాకన్
పైలెట్, 332వ ఫైటర్ గ్రూప్

817
00:49:02,276 --> 00:49:04,653
సాహసికులైన ఈ నల్లజాతి పైలెట్లు

818
00:49:04,736 --> 00:49:09,575
యుద్ధంలో తాము సైతం సేవలందించాలని ఎదురుచూసి
చాలా అద్భుతంగా తమ బాధ్యతల్ని నిర్వర్తించారు.

819
00:49:11,785 --> 00:49:15,622
వాయుసేనలో, ముఖ్యంగా
సుదీర్ఘమైన ప్రమాదకరమైన దాడులు చేసే బాంబర్ సిబ్బంది సైతం

820
00:49:15,706 --> 00:49:20,294
తాము రెడ్ టెయిల్స్ ని మెచ్చుకుంటామని చెబుతారు,
ఎందుకంటే యుద్ధంలో మిగతా స్క్వాడ్రన్ల అందరికన్నా

821
00:49:20,377 --> 00:49:22,796
{\an8}వీరు ప్రత్యేకమని ప్రశంసిస్తారు.

822
00:49:22,880 --> 00:49:23,922
{\an8}జె. టాడ్ మోయే
రచయిత, ఫ్రీడమ్ ఫ్లయర్స్

823
00:49:24,715 --> 00:49:27,134
మాకన్ ఇంకా జెఫర్సన్

824
00:49:27,217 --> 00:49:29,803
అమెరికా ఇంకా ఇటలీలోని
వైమానిక స్థావరాలలో వర్ణవివక్ష కారణంగా వేరు చేయబడ్డారు,

825
00:49:29,887 --> 00:49:31,388
కానీ వారికి ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే

826
00:49:31,471 --> 00:49:34,850
మూడో స్టాలాగ్ లుఫ్త్ లోని బారాక్స్ లో
అందరూ కలిసి ఉండాల్సి వచ్చింది.

827
00:49:34,933 --> 00:49:36,602
ఈ శిబిరంలోకి వచ్చిన వారి సంఖ్య

828
00:49:36,685 --> 00:49:40,022
దాదాపు నూట యాభైమంది ఉంటారు,
ఇంకా మా అందరినీ వరుసలో నిలబెట్టే వారు.

829
00:49:40,105 --> 00:49:44,526
{\an8}చివరికి, ఆ వరుస చివరిలో,
ఒక పొడవాటి కెంటుకీ ఊరి మనిషి...

830
00:49:44,610 --> 00:49:46,111
{\an8}అలెగ్జాండర్ జెఫర్సన్
పైలెట్, 332వ ఫైటర్ గ్రూప్

831
00:49:46,195 --> 00:49:50,991
{\an8}...అతను వెనుకకి నడచి వచ్చి,
"ఖచ్చితంగా, నేను ఈ కుర్రాడిని తీసుకుంటాను" అన్నాడు.

832
00:49:51,074 --> 00:49:54,328
కల్నల్ అక్కడికి వచ్చి, "లెఫ్టెనెంట్,
నువ్వు అతనితో వెళ్లు" అని చెప్పాడు.

833
00:49:55,162 --> 00:49:56,163
"అలాగే, సర్."

834
00:49:57,164 --> 00:49:58,999
జర్మన్లు నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్లి

835
00:49:59,082 --> 00:50:03,086
నేను నివసించబోయే ప్రదేశాన్ని చూపించారు,
అది పైన మూడో వరుసలో ఉన్న పక్క.

836
00:50:03,629 --> 00:50:06,340
నా గాయం ఎంత తీవ్రమైనదో నేను గ్రహించలేదు.

837
00:50:06,423 --> 00:50:09,009
నా నడుము కింది భాగం అంతా పనిచేయకుండా పోయింది.

838
00:50:09,092 --> 00:50:11,595
అయితే, నేను కదలలేని స్థితిలో ఉండటం చూసి,

839
00:50:11,678 --> 00:50:14,431
జర్మన్లు వాళ్లకి నచ్చజెప్పే ప్రయత్నం చేసి

840
00:50:14,515 --> 00:50:17,559
నా కోసం కింది పక్కని ఇవ్వాలని అందరినీ అడిగారు.

841
00:50:17,643 --> 00:50:19,019
కానీ ఎవరూ స్పందించలేదు.

842
00:50:19,102 --> 00:50:23,232
కానీ చివరికి, టెక్సాస్ కి చెందిన ఒక కుర్రాడు వచ్చి,
"తనకి నా మంచం ఇస్తాను, నేను పైకి వెళతా" అన్నాడు.

843
00:50:23,857 --> 00:50:26,443
అతను ఇంకా నేను ప్రాణస్నేహితులం అయ్యాం.

844
00:50:27,361 --> 00:50:30,155
యుద్ధఖైదీల శిబిరంలో మనుగడ సాగించడం కోసం
వీళ్లంతా కలిసికట్టుగా ఉండాల్సి వచ్చింది.

845
00:50:30,239 --> 00:50:34,701
వాళ్లలో ఎటువంటి జాత్యాహంకారాలు ఉన్నా,
వర్ణవివక్ష భావాలు ఉన్నా వాటిని విడనాడాల్సి వచ్చేది

846
00:50:34,785 --> 00:50:37,371
లేదా ఆ తీవ్రతని తగ్గించాల్సి వచ్చేది ఎందుకంటే
ఆ శిబిరంలో దారుణమైన వాతావరణంలో కలిసి బతకాలంటే

847
00:50:37,454 --> 00:50:38,580
ఒకరినొకరు ప్రోత్సహించుకోవాల్సి వచ్చేది.

848
00:50:40,582 --> 00:50:44,753
ఈ వాయుసేన చివరి మిషన్లలో ఒకటి
నియంత సేనలకి ఇంధనం అందకుండా

849
00:50:44,837 --> 00:50:47,881
జర్మన్ సింథటిక్ ఆయిల్ కర్మాగారాల మీద బాంబు దాడులు చేయడం.

850
00:50:47,965 --> 00:50:52,094
మిత్రదేశాల సేనలు జర్మన్ రవాణా రంగాన్ని
ఇంకా బొగ్గుని నిల్వ చేసే గిడ్డంగులనీ ధ్వంసం చేయాలి

851
00:50:52,177 --> 00:50:55,389
ఎందుకంటే జెట్ ఉత్పత్తి కర్మాగారాలు
బొగ్గు ఆధారిత విద్యుత్ పైనే ఆధారపడి ఉన్నాయి.

852
00:50:55,472 --> 00:50:58,892
ఈ వాయు నియంత్రణ నియంత యుద్ధ యంత్రాంగాన్ని
నిర్వీర్యం చేసింది

853
00:50:58,976 --> 00:51:01,603
ఇంకా జర్మన్ సైన్యానికి సరైన వైమానిక రక్షణ లేకుండా చేసి

854
00:51:01,687 --> 00:51:04,314
యుద్ధం అంతం కావడానికి దోహదపడింది.

855
00:51:04,398 --> 00:51:07,109
{\an8}అర్ధరాత్రి ఒంటి గంట లేదా రెండు గంటల వరకూ
మేము ఆఫీసర్స్ క్లబ్ లో ఉన్నాము.

856
00:51:07,901 --> 00:51:10,112
{\an8}హఠాత్తుగా మేము ఒక ఎనౌన్స్ మెంట్ ని విన్నాము:

857
00:51:10,195 --> 00:51:12,114
"మరుసటి ఉదయమే మిషన్ కి సిద్ధంగా ఉండాలి."

858
00:51:15,033 --> 00:51:18,370
మేము సుమారు రెండు వేలమంది హెవీ బాంబర్స్ ఉన్నాము.

859
00:51:18,453 --> 00:51:22,374
కనుచూపు మేర కనిపించేవన్నీ నాలుగు ఇంజన్ల భారీ బాంబర్లే.

860
00:51:24,918 --> 00:51:27,004
రెండో ప్రపంచ యుద్ధంలో,

861
00:51:27,087 --> 00:51:29,214
మెర్స్ బర్గ్ సమీపంలో లెయూనా ప్రాంతంలో
ఒక ఫ్యాక్టరీని ధ్వంసం చేయడం కోసం,

862
00:51:29,298 --> 00:51:35,262
ఆరు వేల బాంబర్లు వాయుమార్గంలో ప్రయాణించి
నలభై మిషన్లు చేపట్టి చివరికి ఆ ఫ్యాక్టరీని ధ్వంసం చేయగలిగాయి.

863
00:51:36,597 --> 00:51:40,392
బెర్లిన్ మీద అతిపెద్ద బాంబు దాడి మా గ్రూప్ సారథ్యంలో జరిగింది.

864
00:51:40,475 --> 00:51:42,186
అది చాలా అందమైన రోజు.

865
00:51:42,269 --> 00:51:44,938
సూర్యుడు మెరుస్తున్నాడు, కనుచూపు మేరలో
మేఘాలు కనిపించలేదు.

866
00:51:45,606 --> 00:51:49,776
మేము టార్గెట్ ని చేరుకునే సరికి, మా విమానం మీద దాడి జరిగింది,

867
00:51:49,860 --> 00:51:52,863
కానీ మేము ముందుకు దూసుకువెళ్లి
టార్గెట్ మీద బాంబులు వేశాము,

868
00:51:52,946 --> 00:51:56,200
దీని వల్ల మా స్థావరానికి మేము తిరిగి వెళ్లలేమని
అప్పటికి మాకు తెలుసు.

869
00:51:56,783 --> 00:52:00,537
విమానంలో పొగ, మంటలు వ్యాపించాయి,
ఇంకా మేము విమానం వదిలి దూకేయాలని నాకు తెలుసు.

870
00:52:00,621 --> 00:52:03,123
నేను బయటకి దూకేసినప్పుడు,
నేను స్వర్గంలో ఉన్నానేమో అనిపించింది.

871
00:52:04,374 --> 00:52:07,836
ఇంకా హఠాత్తుగా, నేను నేల మీద పడి తల పైకెత్తి చూశాను,

872
00:52:08,629 --> 00:52:11,673
ముగ్గురు సైనికులు తుపాకులతో నా దగ్గరకి వస్తున్నారు.

873
00:52:12,674 --> 00:52:16,803
వాళ్లలో ఒక సైనికుడు తుపాకీ పైకెత్తి నన్ను కాల్చబోయాడు,

874
00:52:16,887 --> 00:52:21,767
కానీ అతని టోపీ మీద రెడ్ ఆర్మీ చిహ్నం ఉండటాన్ని
నేను గమనించాను.

875
00:52:22,434 --> 00:52:25,479
అప్పుడు నేను అరిచాను, నేను అమెరికన్ ని, రూస్వెల్ట్,

876
00:52:25,562 --> 00:52:28,023
స్టాలిన్, చర్చిల్, పెప్సీ కోలా,

877
00:52:28,106 --> 00:52:31,485
కోకో కోలా, లక్కీ స్ట్రయిక్ అంటూ కేకలు పెట్టాను.

878
00:52:32,653 --> 00:52:36,448
బెర్లిన్ మీద జరిపిన దాడి
రోసీకి 52వ మిషన్ ఇంకా అదే చివరిది కూడా.

879
00:52:36,532 --> 00:52:39,826
100వ గ్రూప్ లో ఎక్కువ మిషన్లు చేపట్టిన పైలెట్ అతనే.

880
00:52:39,910 --> 00:52:42,496
రష్యన్ హాస్పిటల్ లో అతను కోలుకున్నాక,

881
00:52:42,579 --> 00:52:44,831
రోసీ తిరిగి థోర్ప్ అబోట్స్ స్థావరానికి చేరుకున్నాడు,

882
00:52:44,915 --> 00:52:49,294
అతను ఏడాదిన్నర కిందట
తన మొదటి మిషన్ చేపట్టిన స్థావరం అది.

883
00:52:52,589 --> 00:52:55,843
రష్యన్లు దాదాపుగా దగ్గరగా వచ్చేశారు.

884
00:52:55,926 --> 00:52:57,970
దూరం నుండి మాకు యుద్ధ శతఘ్నుల హోరు

885
00:52:58,053 --> 00:53:01,431
ఇంకా పోరాటానికి సంబంధించిన శబ్దాలు వినిపించేవి.

886
00:53:02,057 --> 00:53:03,559
హిట్లర్ తీవ్రంగా చర్చించాడు:

887
00:53:03,642 --> 00:53:05,894
{\an8}యుద్ధఖైదీలని శిబిరాల నుండి బయటకి పంపించాలా
లేదా వారిని చంపేయాలా? అని.

888
00:53:05,978 --> 00:53:07,938
{\an8}మెరిలిన్ జెఫర్స్ వాల్టన్ - రచయిత్రి
ఫ్రమ్ ఇంటరాగేషన్ టు లిబరేషన్

889
00:53:08,021 --> 00:53:09,273
{\an8}అక్కడ నిజంగా ఏదైనా జరిగే అవకాశం ఉంది.

890
00:53:09,982 --> 00:53:11,233
ఇంకా హఠాత్తుగా, ఒక రోజు రాత్రి,

891
00:53:11,316 --> 00:53:14,903
జర్మన్లు మా అమెరికన్ సీనియర్ ఆఫీసర్ ని పిలిచి

892
00:53:14,987 --> 00:53:17,364
హుటాహుటిన శిబిరాన్ని ఖాళీ చేయాలని చెప్పారు,

893
00:53:17,447 --> 00:53:21,994
మేము మరొక గంటలో శిబిరాన్ని విడిచి
నడుచుకుంటూ ప్రయాణించాలని చెప్పారు.

894
00:53:22,911 --> 00:53:25,664
మీ రక్షణ కోసం మిమ్మల్ని తరలిస్తున్నాం అని మాత్రం చెప్పారు.

895
00:53:26,248 --> 00:53:28,625
వాళ్లు మాకు చెప్పింది అయితే అది,
కానీ జరిగేది ఏమిటో మాకు బాగా తెలుసు.

896
00:53:30,502 --> 00:53:32,504
తాము ఎక్కడికి వెళ్తున్నామో వాయుసైనికులకు తెలియదు.

897
00:53:32,588 --> 00:53:35,465
అమెరికన్ వాయుసైనికుల్ని హిట్లర్ తరలించి

898
00:53:35,549 --> 00:53:37,676
వారిని మానవ కవచంగా వాడుకుంటాడని అంతా భయపడ్డారు.

899
00:53:37,759 --> 00:53:41,054
అది వందేళ్ళ యూరోపియన్ చరిత్రలోనే
అత్యంత శీతాకాలంగా నమోదయింది.

900
00:53:42,431 --> 00:53:44,016
అక్కడ విపరీతమైన చలిగా ఉంది.

901
00:53:44,099 --> 00:53:46,560
మంచు దాదాపు మోకాలి వరకూ పేరుకుని ఉండేది,

902
00:53:46,643 --> 00:53:50,981
ఇంకా ఆ జర్మన్లు మమ్మల్ని రాత్రంతా, మధ్యమధ్యలో,
కొద్దిపాటి విరామాలతో మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ

903
00:53:51,064 --> 00:53:52,065
నడిపించారు.

904
00:53:52,149 --> 00:53:54,151
{\an8}స్ప్రెమ్ బర్గ్ - సాగన్ - మూస్ బర్గ్

905
00:53:54,234 --> 00:53:55,861
జర్మనీ - చెకొస్లొవేకియా

906
00:53:57,029 --> 00:53:59,239
{\an8}స్ప్రెమ్ బర్గ్ లో, మమ్మల్ని రైలు ఎక్కించారు.

907
00:53:59,323 --> 00:54:01,742
{\an8}ఆ రైలు పెట్టెల్లో మమ్మల్ని తాళం వేసి బంధించారు.

908
00:54:01,825 --> 00:54:04,328
{\an8}ఒక్కొక్క పెట్టెలో అరవై నుండి డెబ్బై మందిని కూరారు.

909
00:54:04,411 --> 00:54:06,079
కనీసం కూర్చోవడానికి కూడా ఖాళీ లేకపోయింది.

910
00:54:06,163 --> 00:54:07,456
నరకం అంటే అదే.

911
00:54:08,165 --> 00:54:10,667
{\an8}ఆ పెట్టెలో, మమ్మల్ని చాలా గట్టిగా కూరేశారు.

912
00:54:10,751 --> 00:54:13,670
{\an8}ఎవరైనా కిందపడితే తొక్కివేయబడతారు.

913
00:54:13,754 --> 00:54:14,922
రైలు ఆగినప్పుడు,

914
00:54:15,005 --> 00:54:17,549
ఆ పెట్టెల నుండి బయటపడటం కోసం
సైనికులు తలుపుల మీద గట్టిగా గుద్దేవారు.

915
00:54:17,633 --> 00:54:19,760
గార్డులు ఎట్టకేలకు తలుపులు తెరిచారు.

916
00:54:20,385 --> 00:54:22,554
ఆ పరిస్థితి మనం ఊహించనంత దారుణంగా ఉండింది.

917
00:54:26,850 --> 00:54:28,101
ఏడవ స్టాలాగ్-ఏ
మూస్ బర్గ్, జర్మనీ

918
00:54:28,185 --> 00:54:31,146
ఆ శిబిరం చూడబోతే

919
00:54:31,230 --> 00:54:34,525
ఎనిమిది నుంచి పదివేల మందిని పెట్టడం కోసం
నిర్మించినదిలా కనిపించింది.

920
00:54:34,608 --> 00:54:36,944
కానీ అక్కడ లక్షమంది ఉన్నారు.

921
00:54:37,027 --> 00:54:38,820
దానికి నరక శిబిరం అని పేరు పెడితే సరిగ్గా సరిపోతుంది.

922
00:54:40,739 --> 00:54:43,033
అక్కడ బారాక్స్ లేవు, ఖైదీలు ఆరుబయట ఉండాల్సి వచ్చేది.

923
00:54:43,116 --> 00:54:44,493
అక్కడి వసతి సౌకర్యాలు ఘోరంగా ఉండేవి.

924
00:54:44,576 --> 00:54:46,245
తరువాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు.

925
00:54:47,621 --> 00:54:49,665
ఏప్రిల్ 29, 1945

926
00:54:49,748 --> 00:54:52,292
{\an8}ఒక రోజు, మేము శిబిరం ఆవరణలో నడుస్తున్నాం.

927
00:54:52,376 --> 00:54:55,420
{\an8}ఎవరో అన్నారు,
"ఒక ట్యాంక్ వచ్చింది. అక్కడ షెర్మన్ ట్యాంక్ వచ్చింది" అని.

928
00:54:55,504 --> 00:54:57,172
అప్పుడు మేము పైకి చూశాము, ఇంకా స్పష్టంగా,

929
00:54:57,256 --> 00:54:59,633
షెర్మన్ ట్యాంక్ కనుచూపు మేరలో నిలిచి ఉంది.

930
00:55:00,634 --> 00:55:02,761
పాటన్ కి చెందిన థర్డ్ ఆర్మీ అక్కడికి చేరుకుంది.

931
00:55:02,845 --> 00:55:07,599
నేను పాటన్ ని చూశాను, ఒక ట్యాంక్ మీద నిలబడి
అతను ఏడవ స్టాలాగ్-ఏ గేటు గుండా లోపలికి వచ్చాడు.

932
00:55:07,683 --> 00:55:08,684
మేము విముక్తులం అయ్యాం.

933
00:55:10,936 --> 00:55:15,941
మా సైనికులు జెండా స్తంభం దగ్గరకి వెళ్లి
స్వస్తికాని కిందికి దించారు

934
00:55:16,024 --> 00:55:21,154
మరోవంక అమెరికన్ జెండాని ఎగురవేశారు,
ఆ తరువాత మేము అటెన్షన్ లో నిలబడ్డాము.

935
00:55:21,238 --> 00:55:24,241
మేము యూనిఫారాలలో లేము.
చిరిగిపోయి ఇంకా మాసిపోయిన దుస్తులలో ఉన్నాం.

936
00:55:24,324 --> 00:55:26,910
బహుశా నేను చేసిన అతి గొప్ప శాల్యూట్ అదే కావచ్చు.

937
00:55:29,830 --> 00:55:31,665
అది ఎంతో భావేద్వేగానికి గురైన సందర్భం.

938
00:55:31,748 --> 00:55:33,750
మేము ఎట్టకేలకు విముక్తులం అవుతున్నాం

939
00:55:33,834 --> 00:55:38,630
యుద్ధఖైదీలుగా నెలలు ఇంకా సంవత్సరాలు గడిపిన తరువాత
మాకు స్వేచ్ఛ లభిస్తోంది.

940
00:55:38,714 --> 00:55:42,634
అనేక విధాలుగా, మేము ఇంటికి వెళ్తున్నామంటే
మేమే నమ్మలేని పరిస్థితి అది.

941
00:55:43,760 --> 00:55:45,929
ఇది లండన్ కాలింగ్.

942
00:55:46,013 --> 00:55:47,973
మీ కోసం తాజా వార్త.

943
00:55:48,473 --> 00:55:53,270
హిట్లర్ చనిపోయాడని జర్మన్ రేడియో ఇప్పుడే ప్రకటించింది.

944
00:55:53,353 --> 00:55:55,147
శాన్ మాటియో టైమ్స్
హిట్లర్ మృతి, నాజీల ప్రకటన

945
00:55:55,230 --> 00:56:00,110
మే ఒకటి, 1945,
హిట్లర్ ఆత్మహత్య వార్త ప్రపంచానికి తెలిసిన రోజున,

946
00:56:00,194 --> 00:56:02,446
100వ గ్రూప్ చివరి మిషన్ చేపట్టింది,

947
00:56:02,529 --> 00:56:05,490
ఆపరేషన్ చౌహౌండ్ లో అది ఒక భాగం.

948
00:56:05,574 --> 00:56:09,745
సిబ్బంది పారాచూట్ల ద్వారా బాంబులు కాకుండా
ఆహార పొట్లాలని నేల మీదకి జారవిడిచారు.

949
00:56:09,828 --> 00:56:12,956
నెదర్లాండ్స్ లో ఆకలితో అలమటించిన
సుమారు యాభై లక్షలమంది పౌరులకు ఆహారాన్ని అందించారు,

950
00:56:13,040 --> 00:56:15,709
ఆ ప్రాంతాలు అప్పటికీ కరడుగట్టిన నాజీల ఆక్రమణలోనే ఉన్నాయి.

951
00:56:16,210 --> 00:56:19,588
బాంబర్లు ఆంస్టర్ డామ్ శివార్లకు చేరుకుని,

952
00:56:19,671 --> 00:56:22,841
{\an8}అందమైన రంగులలో టులిప్ తోటల మీదుగా ప్రయాణించారు.

953
00:56:22,925 --> 00:56:23,926
{\an8}చాలా థాంక్స్

954
00:56:24,009 --> 00:56:25,469
{\an8}వాటిల్లో ఒక తోటలో, ప్రత్యేకంగా,

955
00:56:25,552 --> 00:56:29,389
{\an8}"చాలా థాంక్స్, అమెరికన్స్" అనేలా పువ్వుల్ని అమర్చారు.

956
00:56:35,020 --> 00:56:37,731
{\an8}ద స్టార్స్ అండ్ స్ట్రయిప్స్
మిత్రదేశాల కూటమి ప్రకటన: యుద్ధం ముగిసింది

957
00:56:37,814 --> 00:56:39,650
{\an8}యూరప్ లో యుద్ధం ముగిసింది.

958
00:56:39,733 --> 00:56:43,028
వాయుసేనలో 100వ గ్రూప్ సిబ్బంది
తమ సంచుల్ని సర్దుకోగా,

959
00:56:43,111 --> 00:56:46,073
థోర్ప్ అబోట్స్ చుట్టుపక్కల గ్రామల ప్రజలు,

960
00:56:46,156 --> 00:56:48,242
వారి ఆదివారపు అందమైన దుస్తులు ధరించి,

961
00:56:48,325 --> 00:56:51,620
స్వదేశానికి సుదీర్ఘ ప్రయాణం చేయబోయే అమెరికన్ సైనికులకు
వీడ్కోలు చెప్పడానికి గుమిగూడారు.

962
00:56:57,835 --> 00:57:00,003
స్వదేశానికి స్వాగతం

963
00:57:00,087 --> 00:57:02,548
నేను అట్లాంటా చేరుకోగానే, పబ్లిక్ టెలిఫోన్ దగ్గరకి వెళ్లి

964
00:57:02,631 --> 00:57:05,676
మా అమ్మకి ఫోన్ చేసి, నేను ఇంటికి వస్తున్నానని చెప్పాను.

965
00:57:06,218 --> 00:57:07,845
సహజంగానే, ఆమె ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది,

966
00:57:09,513 --> 00:57:11,181
ఇంకా వాళ్లంతా బయటకి వచ్చారు...

967
00:57:11,265 --> 00:57:15,769
వాళ్లంతా ఫోర్ట్ మెక్ ఫెర్సన్ వరకూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి
నన్ను కారులో ఇంటికి తీసుకువెళ్లారు.

968
00:57:18,438 --> 00:57:20,065
మేము తిరిగి కాలిఫోర్నియా చేరుకున్నాం.

969
00:57:20,148 --> 00:57:21,984
మా అమ్మా, నాన్నా అక్కడికి వచ్చారు.

970
00:57:22,067 --> 00:57:25,696
అక్కడ భారీగా కుటుంబాల కలయిక జరిగింది, ఇంకా సహజంగానే,
నేను సంతోషంగా గాలిలో తేలిపోతున్నాను.

971
00:57:26,822 --> 00:57:30,284
ఇంకా అక్కడ నా కాబోయే భార్య, బార్బరాని కలిశాను.

972
00:57:30,367 --> 00:57:33,078
మూడు వారాల తరువాత, మేము పెళ్లాడాము.

973
00:57:34,788 --> 00:57:37,958
"The Bloody Hundredth" సిబ్బంది
ఎట్టకేలకి సొంత ఇళ్లకి చేరుకున్నారు,

974
00:57:38,834 --> 00:57:41,086
తమ కుటుంబ సభ్యుల్నీ

975
00:57:41,753 --> 00:57:43,130
ఇంకా తమ భార్యలనీ

976
00:57:44,006 --> 00:57:45,674
ఇంకా తమ ప్రియురాళ్లనీ కలుసుకోగలిగారు.

977
00:57:46,175 --> 00:57:49,720
కొందరయితే యుద్ధం కోసం వెళ్లినప్పటి నుండి
వారెవరినీ కలుసుకోలేదు.

978
00:57:50,762 --> 00:57:54,808
నేను సర్వీస్ ని విడిచిపెట్టినప్పుడు, చాలా అలసిపోయాను.

979
00:57:54,892 --> 00:57:57,186
నేను ఎన్నో కష్టమైన అనుభవాలను చవిచూశాను,

980
00:57:57,269 --> 00:58:00,772
ఇంకా వాటిని పక్కన పెట్టి
సాధారణమైన పౌరుడిగా జీవనం సాగించాలని నిర్ణయించుకున్నాను.

981
00:58:01,982 --> 00:58:05,652
నేను అంతకుముందు పని చేసిన సంస్థలోనే ఉద్యోగిగా చేరాను,

982
00:58:05,736 --> 00:58:09,198
కానీ అప్పటికి, నిజానికి, నేను పని చేయడానికి సిద్ధంగా లేను.

983
00:58:09,281 --> 00:58:11,408
కానీ చివరికి, అక్కడ ఆరు నెలలు గడిపిన తరువాత...

984
00:58:11,491 --> 00:58:12,743
హిట్లర్ రాజ్యంపై
మిత్రదేశాల హత్యానేరారోపణలు

985
00:58:12,826 --> 00:58:18,123
{\an8}...ప్రాసిక్యూటర్ గా న్యూరెంబర్గ్ కి వెళ్లే
అవకాశం గురించి విన్నాను.

986
00:58:18,207 --> 00:58:19,917
{\an8}రాబర్ట్ రోసెన్థాల్
యుద్ధ నేరాల కమిషన్

987
00:58:20,584 --> 00:58:23,545
అక్కడికి నౌకలో ప్రయాణిస్తున్న సమయంలో,
ఒక అందమైన మహిళని కలుసుకున్నాను

988
00:58:23,629 --> 00:58:27,549
ఆమె కూడా ఒక లాయర్,
ప్రాసిక్యూటర్ గా ఆమె కూడా వస్తోంది.

989
00:58:27,633 --> 00:58:31,178
కేవలం పది రోజుల వ్యవధిలోనే
పెళ్లికి మా నిశ్చితార్థం జరిగిపోయింది,

990
00:58:31,720 --> 00:58:33,722
ఆ తరువాత మేము న్యూరెంబర్గ్ లో వివాహం చేసుకున్నాము.

991
00:58:35,557 --> 00:58:40,437
అక్కడ అధికారం కోల్పోయి ప్రతివాదులుగా ఉన్న వారిని చూశాను,

992
00:58:40,521 --> 00:58:44,149
దీనావస్థలో కూర్చుని విచారణ ఎదుర్కొని
తాము చేసిన నేరాలకి శిక్షలు ఎదుర్కొంటున్నారు.

993
00:58:44,691 --> 00:58:48,779
నేను అదంతా చూసిన తరువాత,
నిజానికి, యుద్ధం నా దృష్టిలో అప్పుడు ముగిసింది అనిపించింది.

994
00:58:53,867 --> 00:58:57,454
మానవ చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం
అత్యంత విధ్వంసకరమైన సంఘటన.

995
00:58:58,664 --> 00:59:02,125
అంతకుముందు ఎన్నడూ లేని విధంగా
అనేకమంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.

996
00:59:03,126 --> 00:59:08,131
ఆ యుద్ధంలో, అమెరికన్ సైనిక దళాలలో,
అందరికన్నా ఎక్కువగా ఎయిత్ ఎయిర్ ఫోర్స్

997
00:59:08,215 --> 00:59:11,176
భారీ సంఖ్యలో సిబ్బందిని కోల్పోయింది.

998
00:59:14,304 --> 00:59:16,765
నేను ఆ యుద్ధంలో సజీవంగా బయటపడ్డాను కాబట్టి

999
00:59:16,849 --> 00:59:22,354
ఆ తరువాత నేను వెనక్కి తిరిగి
ఆనాటి కాలాన్ని గుర్తు చేసుకుంటే,

1000
00:59:23,313 --> 00:59:25,524
ఆ యుద్ధం నా జీవితాన్ని మార్చిందని భావిస్తాను.

1001
00:59:27,025 --> 00:59:28,318
ఒకవేళ, ఈ కాలంలో,

1002
00:59:28,402 --> 00:59:32,489
ఒక విధమైన ఉద్వేగం, రొమాన్స్ ఇంకా ఇతిహాసం అనేవి ఉంటే,
అది ఇదే.

1003
00:59:32,573 --> 00:59:36,994
ఆ కాలంలో నాకు దొరికిన స్నేహితులు
ఎన్నోసార్లు నా ప్రాణాలు కాపాడారు.

1004
00:59:37,077 --> 00:59:40,080
వాళ్లు మిగతా అందరు ఫ్రెండ్స్ లో చాలా ప్రత్యేకమైన స్నేహితులు.

1005
00:59:40,664 --> 00:59:43,584
సైన్యంలో మాతో కలిసి పనిచేసిన వ్యక్తులు,
వాళ్లంతా దేశానికి అంకితమైన వారు,

1006
00:59:43,667 --> 00:59:46,587
వాళ్లు త్యాగాలు చేశారు, గొప్ప ధైర్యసాహసాలని ప్రదర్శించారు.

1007
00:59:47,129 --> 00:59:50,048
మేము బాధలనీ, నవ్వులనీ పంచుకున్నాం.

1008
00:59:50,132 --> 00:59:54,511
మా తోటి సైనికులు నేలకూలడం ఇంకా చనిపోవడాన్ని
కళ్లారా చూశాం,

1009
00:59:54,595 --> 00:59:57,848
వారు గాయపడటాన్ని, యుద్ధ ఖైదీలు కావడాన్ని చూశాం.

1010
00:59:57,931 --> 01:00:01,643
{\an8}ఇంకా మేము పరస్పరం విపరీతంగా గౌరవించుకుంటాం
ఇంకా విజయంలో భాగస్వాములం అయ్యాం.

1011
01:00:01,727 --> 01:00:03,353
{\an8}351వ స్క్వాడ్రన్
100వ బాంబ్ గ్రూప్ తొలి వార్షికోత్సవం

1012
01:00:03,437 --> 01:00:07,191
{\an8}మా సైనికులందరి అనుభవం బహుశా ఇదే కావచ్చు.

1013
01:00:07,274 --> 01:00:09,902
అదృష్టవశాత్తూ, ప్రజలంతా కలిసికట్టుగా నిలిచారు.

1014
01:00:12,696 --> 01:00:16,241
నియంతృత్వ పాలన నుండి ప్రపంచాన్ని కాపాడటం కోసం

1015
01:00:16,325 --> 01:00:21,246
తమ ప్రాణాలను త్యాగం చేసిన మగవారు, ఆడవారందరికీ
ఈ ఘనతని ఆపాదించాలి.

1016
01:00:23,749 --> 01:00:28,378
మనం ఆస్వాదిస్తున్న ఈ స్వేచ్ఛ
ఏదో అదృష్టవశాత్తూ దక్కింది కాదు.

1017
01:00:28,462 --> 01:00:32,049
మా తరం ఇంకా ఆ తరువాత ఎన్నో తరాలు

1018
01:00:32,132 --> 01:00:35,302
ఎన్నో త్యాగాలు చేసి స్వేచ్ఛని సాధించింది.

1019
01:00:35,385 --> 01:00:36,720
ఆ ఒక్క కారణం వల్ల,

1020
01:00:36,803 --> 01:00:42,601
రెండో ప్రపంచ యుద్ధం నాటి తరాన్ని
ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.

1021
01:00:50,776 --> 01:00:53,278
వ్యాఖ్యానం
టామ్ హాంక్స్

1022
01:02:01,138 --> 01:02:02,139
అమెరికా రక్షణ శాఖ

1023
01:02:02,222 --> 01:02:03,265
మాక్స్ వెల్ వైమానిక స్థావరంలోని

1024
01:02:03,348 --> 01:02:04,349
అమెరికా వాయుసేన చారిత్రక అధ్యయన సంస్థకి
ప్రత్యేక ధన్యవాదాలు

1025
01:02:10,355 --> 01:02:12,357
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్



