1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:02:44,790 --> 00:02:47,918
{\an8}ఈడీ మెక్ బెయిన్ రచించిన "కింగ్స్ ర్యాన్సమ్" నవల
ఆధారంగా తెరకెక్కించడం జరిగింది

4
00:02:51,755 --> 00:02:55,551
{\an8}అకీరా కురొసావా తీసిన "హై అండ్ లో" సినిమా ఆధారితమైనది

5
00:03:11,233 --> 00:03:14,485
అవును. హా, గేబ్. లేదు, లేదు, లేదు.

6
00:03:14,486 --> 00:03:17,738
అది రిస్క్ కాదు. పునర్జన్మ లాంటిదది.

7
00:03:17,739 --> 00:03:19,782
చూడు, నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే,

8
00:03:19,783 --> 00:03:23,160
"స్టాకింగ్ హిట్స్"లో భాగాలు అమ్మడం.

9
00:03:23,161 --> 00:03:24,662
అవును.

10
00:03:24,663 --> 00:03:28,791
అవును, నిన్న రాత్రే జ్ఞానోదయం అయింది నాకు.
డబ్బులు, వాటా కొనుగోలు, ఓటు.

11
00:03:28,792 --> 00:03:32,712
ఇది ముగింపేమీ కాదు.
కొత్త అధ్యాయం ప్రారంభానికి అవకాశం.

12
00:03:32,713 --> 00:03:35,798
దేవుడు కొత్త అధ్యాయం ప్రారంభానికి
అవకాశం ఇచ్చినప్పుడు, దాన్ని అందిపుచ్చుకోవాలి.

13
00:03:35,799 --> 00:03:37,800
అలా కాకుండా "లేదు" అని దేవుడికి చెప్పకూడదు. మనం...

14
00:03:37,801 --> 00:03:39,928
ఆ అవకాశాన్ని తీసుకొని, దానితో పని కానించుకోవాలంతే.

15
00:03:41,138 --> 00:03:43,973
హా. అంతే.

16
00:03:43,974 --> 00:03:46,768
హా. సరే, సరే. అంతే. అంతే.

17
00:03:47,978 --> 00:03:50,062
సరే. ఏం అవసరమవుతాయో అవి చేర్చు.
అన్నీ తెలిసిన తెలివైనోడివి నువ్వు.

18
00:03:50,063 --> 00:03:53,524
అందుకే నీకు 5% ఇస్తున్నా.
అవసరమైన వాటన్నింటినీ చేర్చు.

19
00:03:53,525 --> 00:03:56,152
పాల్ ని పంపిస్తా, ఓ గంటలో వచ్చి పికప్ చేసుకుంటాడు.

20
00:03:56,153 --> 00:03:59,447
అంతే. అవును, అవును.

21
00:03:59,448 --> 00:04:01,532
అంతే. అంతే. సరే మరి.

22
00:04:01,533 --> 00:04:03,660
మంచిది. మంచిది. మంచిది. సూపర్.

23
00:04:05,037 --> 00:04:06,788
భలే మంచి రోజు, పసందైన రోజు.

24
00:04:19,927 --> 00:04:21,344
నా అందాల బామ్మ.

25
00:04:21,345 --> 00:04:23,596
- గుడ్ మార్నింగ్, మిస్టర్ కింగ్.
- సూపర్ గుడ్ మార్నింగ్.

26
00:04:23,597 --> 00:04:25,848
- అప్పుడే వెళ్ళిపోతున్నావా?
- ఉండమంటే ఉంటా.

27
00:04:25,849 --> 00:04:28,601
ఉదయాన్నే మీటింగ్ ఉంది, కానీ దాన్ని వాయిదా వేయవచ్చులే.

28
00:04:28,602 --> 00:04:31,687
- నేను కూడా ఒక చోటకి వెళ్ళాలి.
- ఎక్కడికి?

29
00:04:31,688 --> 00:04:34,023
"స్థూడియో మ్యూజియమ్ ఇన్ హార్లెమ్" బోర్డుతో లంచ్ ఉంది.

30
00:04:34,024 --> 00:04:35,942
- అవును.
- కిందటేడాది లానే

31
00:04:35,943 --> 00:04:39,195
- అయిదు లక్షల డాలర్లను ప్లెడ్జ్ చేస్తాను.
- అది కాస్త ఆగి చేద్దామా?

32
00:04:39,196 --> 00:04:40,781
డేవిడ్, నేను బోర్డుకి హెడ్ అని తెలుసు కదా.

33
00:04:41,865 --> 00:04:43,951
అయితే, ప్రస్తుతానికి కాస్త తక్కువ అమౌంట్ పెట్టరాదూ?

34
00:04:45,452 --> 00:04:46,452
ఏంటి సంగతి?

35
00:04:46,453 --> 00:04:49,956
ఏమీ లేదు. ప్రస్తుతానికి డబ్బును
కాస్త ఆచితూచి ఖర్చు పెడదాం.

36
00:04:49,957 --> 00:04:52,792
- "ప్రస్తుతానికా"? నాకేదో తేడా కొడుతోంది.
- సరే.

37
00:04:52,793 --> 00:04:55,628
మొదట్నుంచీ మనం యువ నల్లజాతి ఆర్టిస్టులకు
అండగా నిలుస్తూ వస్తున్నాం కదా.

38
00:04:55,629 --> 00:04:57,255
మన సోదరి, థెల్మా

39
00:04:57,256 --> 00:05:00,216
మనకి ఇంకాస్త సమయం తప్పక ఇస్తుంది,
ఒకసారి తనతో మాట్లాడదాం.

40
00:05:00,217 --> 00:05:01,676
- అది నిజమే.
- హా, ఒకవేళ మనకి అవసరమైతే.

41
00:05:01,677 --> 00:05:03,761
ఏం పర్వాలేదు. అంతా ఓకే. అంతా ఓకే.

42
00:05:03,762 --> 00:05:05,389
ఎంత కాలం "ఓకే, ఓకే"?

43
00:05:06,139 --> 00:05:07,933
స్టాకింగ్ హిట్స్ ని పూర్తిగా అమ్మేదాకా?

44
00:05:10,894 --> 00:05:13,272
- ట్రే, మనం బయలుదేరాలి!
- వస్తున్నా.

45
00:05:14,147 --> 00:05:16,692
మీ అమ్మ ఇక్కడ ప్రశ్నలతో
నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

46
00:05:18,986 --> 00:05:22,071
- నా హెడ్ బ్యాండ్ కనిపించలేదు.
- హా, నువ్వు దాన్ని మర్చిపోతేనే మేలు.

47
00:05:22,072 --> 00:05:24,115
అలాంటి పిచ్చిపిచ్చి రంగులవి
ఇంట్లో వేసుకోవద్దని చెప్పానా?

48
00:05:24,116 --> 00:05:26,535
అవి చూస్తే నాకు... నాకు ఆ పేరు కూడా
గుర్తు రావట్లేదు.

49
00:05:27,619 --> 00:05:29,997
- బోస్టన్ సెల్టిక్స్?
- జట్టు ఏంటంటే... హా, సెల్టిక్స్.

50
00:05:30,956 --> 00:05:32,082
నేను వెళ్తున్నా.

51
00:05:32,666 --> 00:05:34,000
త్వరగా రా.

52
00:05:34,001 --> 00:05:35,669
- వస్తున్నా.
- త్వరగా వెళ్ళాలి.

53
00:05:38,255 --> 00:05:40,339
- లవ్ యూ.
- లవ్ యూ డబుల్.

54
00:05:40,340 --> 00:05:42,467
కష్టపడి ఆడు. తెలివిగా ఆడు.

55
00:05:49,892 --> 00:05:51,684
జూదమాడతావా?

56
00:05:51,685 --> 00:05:53,644
- జూదమాడతానా అని అడుగుతున్నావా? లేదు.
- జూదమాడతావా?

57
00:05:53,645 --> 00:05:57,315
ఒక అయిదు నిమిషాలు కూడా నువ్వు ఆ ఫోన్ ని
పక్కకు పెట్టి ఉండలేవని పందెం కాస్తా.

58
00:05:57,316 --> 00:05:59,275
- ఎంత పందెం కాస్తావు?
- నీ దగ్గర ఎంత ఉంది?

59
00:05:59,276 --> 00:06:00,902
నీతో పందెం కాసేంత లేవులే నా దగ్గర.

60
00:06:00,903 --> 00:06:02,863
నువ్వు ఫోన్లో రోజుకు ఎన్నిగంటలు ఉంటావు?

61
00:06:03,447 --> 00:06:05,239
- ఏమో మరి.
- ఓకే, ఊహించి చెప్పు.

62
00:06:05,240 --> 00:06:07,868
సుమారుగా చెప్పు. అంటే, రఫ్ గా.

63
00:06:08,702 --> 00:06:11,454
రఫ్ గా అంటే, ఒక అయిదు గంటలు అనుకో.

64
00:06:11,455 --> 00:06:15,167
సరే. రోజుకు అయిదు గంటలు ఫోన్, పది గంటలు నిద్ర,

65
00:06:15,918 --> 00:06:17,543
మూడు గంటలు తినడం,

66
00:06:17,544 --> 00:06:20,546
రెండు నిమిషాలు నీ లవర్ తో.

67
00:06:20,547 --> 00:06:22,465
అది మరీ ఎక్కువ సమయంలా అనిపించట్లేదా?

68
00:06:22,466 --> 00:06:24,759
- అయిదు గంటలంటే?
- నేను ఫాలోవర్లను పెంచుకోవాలి మరి.

69
00:06:24,760 --> 00:06:27,428
ఫాలోవర్లు ఉండాలంటే, నువ్వు వాళ్లకి దారి చూపాలి.
వాళ్లకి ఏం మార్గనిర్దేశనం చేస్తున్నావు?

70
00:06:27,429 --> 00:06:29,097
అడుగుతున్నానంతే. వాళ్లకి ఏ దారి చూపుతున్నావు?

71
00:06:30,098 --> 00:06:32,725
- స్వప్నాలను సాకారం చేసుకునే చోటికి దారి. హా.
- అవునా? వావ్.

72
00:06:32,726 --> 00:06:35,102
ఫాదర్ వి అయిపోయావా ఏంటి?
స్వప్నాలను సాకారం చేసుకునే చోటికి దారి చూపుతున్నావా?

73
00:06:35,103 --> 00:06:38,690
ఏం బోధిస్తున్నావేంటి వాళ్లకి?
"మీరు దుష్ట సంగీతాన్ని వినకండి" అనా?

74
00:06:40,192 --> 00:06:42,319
మీ నాన్న చెప్పిన మాట విను. దాన్ని పక్కకు పెట్టేయ్.

75
00:06:43,654 --> 00:06:45,739
ఇది కలలను సాకారం చేసుకునే చోటు కాదు.
ఇది భూమి. దాన్ని పక్కకు పెట్టేయ్.

76
00:06:48,200 --> 00:06:50,993
- నేను ఆప...
- ఫోన్ పక్కకు పెట్టేయ్. డేవిడ్ చెప్పాడు కదా.

77
00:06:50,994 --> 00:06:54,748
నా ప్రతీకార జ్వాలలో నువ్వు భస్మం అయిపోతావు...

78
00:06:58,585 --> 00:07:00,504
అలిగాడే. అలిగాడు.

79
00:07:01,505 --> 00:07:05,092
- మా బుడ్డోడు అలిగాడు. హా, అలక వచ్చేసింది.
- కానివ్వు.

80
00:07:13,559 --> 00:07:16,519
సూలా సంగీతం విన్నావా?

81
00:07:16,520 --> 00:07:18,271
- ఏ సూలా?
- భలేవాడివే, నాన్నా.

82
00:07:18,272 --> 00:07:22,275
తెలుసుకోవాల్సిన, వినాల్సిన నీ ప్లేలిస్ట్ కి
ఆ అమ్మాయి పాటలని జోడించా కదా.

83
00:07:22,276 --> 00:07:23,777
సరే, దిగు.

84
00:07:28,532 --> 00:07:31,200
తమ సంగీతాన్ని నాకు వినిపించమని
అమ్మాయిలు నీకు మెసేజ్ చేసి అడుగుతున్నారా?

85
00:07:31,201 --> 00:07:34,453
నాకున్న ప్రయోజనాల్లో అది కూడా ఒకటి.
ఏం చెప్పను? అలా కలిసొచ్చేసింది.

86
00:07:34,454 --> 00:07:36,330
- అలా కలిసొచ్చేసిందా, హా?
- అవును.

87
00:07:36,331 --> 00:07:38,624
మరి ఈ సూలా ఎలాంటి అమ్మాయి?

88
00:07:38,625 --> 00:07:40,710
చాలా గొప్ప అమ్మాయి. పాడగలదు.

89
00:07:40,711 --> 00:07:42,462
సొంతంగా పాటలు రాసుకుంటుంది.

90
00:07:43,797 --> 00:07:46,174
తను తెల్లతోలు జెండేయలా ఉంటుంది.

91
00:07:46,175 --> 00:07:47,885
తెల్లతోలు జెండేయనా?

92
00:07:48,886 --> 00:07:50,428
నువ్వు తన సంగీతాన్ని కాస్త త్వరగా విను,

93
00:07:50,429 --> 00:07:52,472
ఎందుకంటే, నేను ఈ వీకెండ్ తనని కలుస్తున్నాను.

94
00:07:53,098 --> 00:07:56,142
- "కలుస్తున్నాను" అంటే ఆ పనికేనా?
- కాదు, ఆ పని కోసం కాదు.

95
00:07:56,143 --> 00:07:59,270
మామూలు పని గురించి మాట్లాడుకోవడానికి, అంతే.

96
00:07:59,271 --> 00:08:01,647
తను పాడగలదు కాబట్టి తన సంగీతాన్ని వినమంటున్నావా?

97
00:08:01,648 --> 00:08:04,443
లేదా తను నీకు నచ్చింది కాబట్టి వినమంటున్నావా?

98
00:08:05,402 --> 00:08:08,321
- హా, రెండూ.
- సరే, సరే.

99
00:08:08,322 --> 00:08:10,615
బ్రేక్ తీసుకున్నప్పుడు తప్పక తన సంగీతాన్ని వింటా.

100
00:08:10,616 --> 00:08:12,867
"నిదానంగా వెళ్తే, నష్టపోతాం.
కునుకు తీస్తే, బొక్కబోర్లా పడతాం."

101
00:08:12,868 --> 00:08:15,369
కిందటిసారి ఒక ఆర్టిస్ట్ ని మనం అలాగే పోగొట్టుకున్నాం,
అప్పుడు నువ్వన్న మాటలే ఇవి.

102
00:08:15,370 --> 00:08:18,165
తనకి నేను చెప్పాలి, కాబట్టి ఏదోకటి చెప్పు. ఏదోకటి.

103
00:08:22,419 --> 00:08:23,712
నేను వింటా...

104
00:08:24,796 --> 00:08:26,256
బ్రేక్ తీసుకున్నప్పుడు.

105
00:08:28,800 --> 00:08:31,470
నాన్నా, స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్
నా లెగసీ కూడా అని మర్చిపోకు.

106
00:08:32,846 --> 00:08:35,306
ఈ వారంలో మీ ప్రతిభకి,

107
00:08:35,307 --> 00:08:37,307
మీ వైఖరికి, మీ నైపుణ్యానికి పెద్దపీట వేస్తా.

108
00:08:37,308 --> 00:08:39,268
మరీ ముఖ్యంగా మీ వైఖరికి.

109
00:08:39,269 --> 00:08:42,230
ఈ జిమ్ లోకి తప్పుడు వైఖరితో రాకండి.

110
00:08:42,231 --> 00:08:45,441
- కోచ్ ఫాక్స్ బాగా స్ట్రిక్టుగా ఉంటాడు.
- అవును, మరీ స్ట్రిక్టుగా ఉంటాడు.

111
00:08:45,442 --> 00:08:48,152
అదేం లేదులే. అలానే ఉండాలి.
అలా ఉంటేనే పని జరుగుతుంది.

112
00:08:48,153 --> 00:08:50,821
- మిస్టర్ కింగ్ వస్తున్నాడు. పలకరించి వస్తా.
- సరే.

113
00:08:50,822 --> 00:08:53,115
- గుడ్ మార్నింగ్, డేవిడ్.
- ఏమన్నావు?

114
00:08:53,116 --> 00:08:55,785
- గుడ్ మార్నింగ్, మిస్టర్ కింగ్.
- గుడ్ మార్నింగ్, చిట్టి కైల్.

115
00:08:55,786 --> 00:08:58,621
- సరే.
- ఓకే. హా, ఓకే.

116
00:08:58,622 --> 00:09:00,624
- ఎలా ఉన్నావు, గురూ?
- ఎలా ఉన్నావు, బాసూ?

117
00:09:02,751 --> 00:09:04,418
- హలో, మిస్టర్ కింగ్.
- చెప్పండి, సర్.

118
00:09:04,419 --> 00:09:06,754
- అది నా హెడ్ బ్యాండా?
- అవును. నా అరలో పెట్టావు.

119
00:09:06,755 --> 00:09:08,923
- ఇక తీసేసుకున్నా.
- సరే, సరే.

120
00:09:08,924 --> 00:09:10,800
- సరే. ఎలా ఉన్నారు?
- బాగానే ఉన్నా.

121
00:09:10,801 --> 00:09:13,886
- సరే. అవును, సర్. అవును, సర్.
- మరో సమ్మర్ క్యాంప్ సెషన్ మొదలైనందుకు ఉత్సాహంగా ఉందా?

122
00:09:13,887 --> 00:09:17,765
కైల్, ట్రేలు ఒకరికొకరు కాకుండా
వేరొకరికి బాల్ ని పాస్ చేసేలా చేయగలమేమో చూడాలి.

123
00:09:17,766 --> 00:09:20,768
- ఆ విషయంలో గుడ్ లక్.
- నా సామాను ఎక్కడ పెట్టమంటారు?

124
00:09:20,769 --> 00:09:23,354
బ్యాగులను బెంచీల పక్కన పెట్టు,
ఈ ఏడాది ఫోన్లకు అనుమతి లేదు.

125
00:09:23,355 --> 00:09:26,232
- ఓకే, సర్.
- థ్యాంక్యూ. ఆభరణాలకు కూడా అనుమతి లేదు.

126
00:09:26,233 --> 00:09:29,361
ఇక్కడ నువ్వు మెరుగుపరుచుకోవలసింది నీ ఆటను,
టిక్ టాక్ లో రీళ్లను కాదు.

127
00:09:30,028 --> 00:09:32,154
వీటిని లాకర్లో పెడతా.
ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళు.

128
00:09:32,155 --> 00:09:33,824
నువ్వు ఇక్కడే ఉంటున్నావు, కదా?

129
00:09:34,825 --> 00:09:36,659
నేను ఆఫీసుకు వెళ్ళాలి. ఒక ముఖ్యమైన పని పడింది.

130
00:09:36,660 --> 00:09:37,786
పాల్ వచ్చి నన్ను పికప్ చేసుకుంటాడు.

131
00:09:38,579 --> 00:09:40,454
ఒట్టేసి చెప్తున్నా,
ఒట్టేసి చెప్తున్నా, రేపు ఇక్కడే ఉంటా.

132
00:09:40,455 --> 00:09:41,998
నువ్వు ఇక్కడ ఉంటావని నిన్న రాత్రి చెప్పావు.

133
00:09:41,999 --> 00:09:43,541
రేపు ఉంటా. ప్రమాణపూర్తిగా చెప్తున్నా.

134
00:09:43,542 --> 00:09:45,209
వీటిని లాకర్లో పెడతా.

135
00:09:45,210 --> 00:09:47,713
- నీవి కూడా లాకర్లో పెట్టారా?
- అంతేగా.

136
00:09:48,297 --> 00:09:50,631
- సరే, లవ్ యూ, నాన్నా.
- లవ్ యూ డబుల్.

137
00:09:50,632 --> 00:09:54,343
- మీ కుర్రాళ్ళు చక్కగా, బాగున్నారు.
- అవును. ఒకడు కొడుకు సమానుడు, ఇంకొకడు కొడుకు.

138
00:09:54,344 --> 00:09:57,013
- పర్పుల్, గోల్డ్ ఫ్యాన్ ని నేను.
- మీరు చెప్పారు కాబట్టి, చెప్పేస్తున్నా.

139
00:09:57,014 --> 00:09:58,890
- ఆరెంజ్, బ్లూ ఫ్యాన్ ఇక్కడ, ఏమంటారు?
- భలేవారే.

140
00:09:58,891 --> 00:10:01,058
హేయ్, మా వాళ్ళు 17 సార్లు కొట్టారు, మీరు రెండుసార్లే!

141
00:10:01,059 --> 00:10:03,102
గ్రీన్, నా ఫేవరెట్ రంగు,
నేనేమంటున్నానో అర్థమవుతోందా?

142
00:10:03,103 --> 00:10:05,021
- ఎక్కడికి వెళ్తున్నావు?
- పదిహేడులో మీవి ఎన్ని?

143
00:10:05,022 --> 00:10:06,814
మూడు. అది రెండు కంటే ఎక్కువే కదా.

144
00:10:06,815 --> 00:10:08,024
నా నోట మాట రానివ్వకుండా చేసేశారు.

145
00:10:08,025 --> 00:10:10,484
మా జట్టు కన్నా మీ జట్టుకు
పదిహేను కప్స్ ఎక్కువ ఉన్నాయి. సరే.

146
00:10:10,485 --> 00:10:14,030
హేయ్! ఏం చేస్తున్నారు? బేస్ లైన్ దగ్గరికి రండి!

147
00:10:14,031 --> 00:10:17,366
ఇద్దరూ రండి. ఇక్కడ
ఏం జరుగుతోంది అనుకుంటున్నారు?

148
00:10:17,367 --> 00:10:19,285
- సారీ, కోచ్.
- ఇది సర్కస్ అనుకుంటున్నారా?

149
00:10:19,286 --> 00:10:22,079
- లేదు, సర్.
- ట్రే, కైల్, బేస్ లైన్ పై అటూఇటూ పరుగెత్తండి.

150
00:10:22,080 --> 00:10:23,290
కానివ్వండి!

151
00:10:24,499 --> 00:10:27,126
జోర్డన్స్ షూస్ వేసుకున్నారు.
మీ పనితీరు చూసి మైఖెల్ ఏమంటాడు?

152
00:10:27,127 --> 00:10:29,087
- మైఖెల్ ఎవరు?
- మైఖెల్ ఎవరా?

153
00:10:30,506 --> 00:10:32,424
వేగంగా పరుగెత్తండి! వేగంగా!

154
00:10:39,598 --> 00:10:40,681
కింగ్.

155
00:10:40,682 --> 00:10:44,310
- హా. హా.
- సారీ. ట్రాఫిక్ వల్ల ఆలస్యమైంది.

156
00:10:44,311 --> 00:10:46,312
చిటికెలో లోపలికి వెళ్ళేసి, కైల్ కి బై చెప్పేసి వస్తాను.

157
00:10:46,313 --> 00:10:48,482
పర్వాలేదులే, వాడిని
మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దువులే.

158
00:10:49,316 --> 00:10:50,484
ఛ!

159
00:10:54,530 --> 00:10:57,240
ఇది ఇచ్చాడు నాకు అతను.

160
00:10:57,241 --> 00:11:01,370
స్టేట్ మెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయని,
అధికారక ఆఫర్ అన్నింటికన్నా వెనుక ఉందని చెప్పాడు.

161
00:11:05,207 --> 00:11:07,542
- అన్నీ ఉన్నాయా?
- హా. మన జీవితాన్ని అంతా

162
00:11:07,543 --> 00:11:11,754
ఇలా నంబర్ల రూపంలో చూస్తూ ఉంటే, అదోలా ఉందంతే.

163
00:11:11,755 --> 00:11:13,172
అర్థమైంది.

164
00:11:13,173 --> 00:11:17,844
NYSID #12022001K.
జైల్లో నాకు కేటాయించిన నంబర్ అది.

165
00:11:17,845 --> 00:11:19,512
దాని కన్నా నీ నంబర్లు బాగానే ఉన్నాయి కదా.

166
00:11:19,513 --> 00:11:21,097
గేబ్ ఇంకేమన్నాడు?

167
00:11:21,098 --> 00:11:24,767
"ఈ డీల్ ఓకే కావాలని డేవిడ్ చాలా
ప్రయత్నిస్తున్నాడు, అతనికి నా క్లయింట్లలో

168
00:11:24,768 --> 00:11:27,478
- అత్యంత తిక్క క్లయింట్ టైటిల్ ఇవ్వవచ్చు" అన్నాడు.
- అవునా? నువ్వేమంటావు?

169
00:11:27,479 --> 00:11:30,273
- బెనెట్ ని నేను, అది చెప్పే స్థాయిలో లేనే లేను.
- అంత లేదు.

170
00:11:30,274 --> 00:11:33,150
- పాల్ నా పేరు, నేను చెప్పలేను, సారూ.
- భలేవాడివే.

171
00:11:33,151 --> 00:11:36,737
నువ్వు లెజెండ్ వి, నేను కేవలం డ్రైవర్ ని మాత్రమే.
నేను ఒక పెద్ద మనిషి పక్కన ఉండే సాదాసీదా మనిషిని, అంతే.

172
00:11:36,738 --> 00:11:39,866
నీ చెల్లి పేరు రూత్, చెప్పేసేయ్ నీ మన్ కీ బాత్.

173
00:11:39,867 --> 00:11:42,243
నిజంగా అడుగుతున్నా,
నువ్వేం అనుకుంటున్నావు? అనిపించింది చెప్పేసేయ్.

174
00:11:42,244 --> 00:11:45,455
చూడు, మన నిర్ణయాల వల్ల మనం వృద్ధి బాటలో
నడవవచ్చు, లేదా బొక్కబోర్లా పడవచ్చు.

175
00:11:46,123 --> 00:11:48,833
ఈ ప్రపంచంలో మనకి కావాల్సింది
దక్కించుకోవడానికి అప్పుడప్పుడూ

176
00:11:48,834 --> 00:11:49,918
మనం తిక్కలోడిగానే ప్రవర్తించాలి.

177
00:11:52,129 --> 00:11:53,254
థ్యాంక్స్, సోదరా.

178
00:11:53,255 --> 00:11:55,256
కొత్త మిక్సులు కావాలా, లేదా ప్రశాంతమైన సంగీతం కావాలా?

179
00:11:55,257 --> 00:11:57,633
- నాకు థీమ్ మ్యూజిక్ కావాలి.
- థీమ్ మ్యూజిక్.

180
00:11:57,634 --> 00:12:00,137
- థీమ్ మ్యూజిక్.
- థీమ్.

181
00:13:09,665 --> 00:13:13,000
- మళ్ళీ వచ్చావా? ఇవాళ ఇదంతా కుదరదు.
- పర్వాలేదు, లూథర్. మళ్ళీ వచ్చావా?

182
00:13:13,001 --> 00:13:15,294
- అరవై సెకన్లు ఇవ్వండి చాలు.
- అరవై సెకన్లు. అలాగే. కానివ్వు.

183
00:13:15,295 --> 00:13:18,089
మీరు మంచి మాట విన్నారా?

184
00:13:18,090 --> 00:13:20,466
నేను స్వేచ్ఛా జీవిని

185
00:13:20,467 --> 00:13:22,927
నా దగ్గర కావాల్సిన ప్రతిభ ఉంది

186
00:13:22,928 --> 00:13:25,847
పెద్ద పెద్ద వారిని ఓడించేటప్పుడు

187
00:13:25,848 --> 00:13:30,893
ఒక్క తప్పు కూడా చేయలేము
ఎంత మంది పాడినా వినబడే గానం నాదే

188
00:13:30,894 --> 00:13:33,604
రాజ్యంలో నన్ను మించినోళ్లు ఎవరూ లేరు

189
00:13:33,605 --> 00:13:36,274
మీరు మహారాజు

190
00:13:36,275 --> 00:13:41,404
జనాల ప్రతిభని గుర్తించే వారు
అసలైన ప్రతిభని వెలికి తీయగల వారు

191
00:13:41,405 --> 00:13:46,534
మీకు కావాల్సిందల్లా
అచ్చమైన ప్రతిభకు నిలువెత్తు రూపమైన నేనే

192
00:13:46,535 --> 00:13:51,789
మీరు నాకు ఒక నిమిషమే కేటాయించగలరంటే

193
00:13:51,790 --> 00:13:57,128
నా పాటలోని ప్రతీ పదాన్ని మీకు అంకితం చేస్తా

194
00:13:57,129 --> 00:14:02,592
ఇదే నా ఆఖరి అవకాశమైతే
నేను తలవంచి అభ్యర్థిస్తున్నా

195
00:14:02,593 --> 00:14:09,266
మహారాజు కింగ్ డేవిడ్ ముందు
రాజాధిరాజు అయిన డేవిడ్ ముందు

196
00:14:13,228 --> 00:14:14,562
డేవిడ్, డేవిడ్, సర్.

197
00:14:14,563 --> 00:14:17,648
ఈమె పేరు మరిసోల్ సెపేడా.
ఈమె బూగీ డౌన్ బ్రాంక్స్ కి చెందిన యువతి.

198
00:14:17,649 --> 00:14:19,901
- మిమ్మల్ని కలవడం నిజంగా నా భాగ్యం.
- నాదే ఆ భాగ్యం.

199
00:14:19,902 --> 00:14:21,444
మరాయతో కలిసి
మీరు చేసిన సంగీతం నాకు స్ఫూర్తినిచ్చింది.

200
00:14:21,445 --> 00:14:23,779
తను మరాయలానే పాడుతుంది,
ర్యాప్ కూడా చేస్తుంది. చాలా ట్యాలెంట్ ఉంది.

201
00:14:23,780 --> 00:14:25,531
మంచిది, మంచిది. బ్రాంక్స్ లో ఎక్కడ ఉంటారు?

202
00:14:25,532 --> 00:14:26,616
ఫోర్ధమ్ అండ్ డేవిడ్సన్.

203
00:14:26,617 --> 00:14:28,618
- సూపర్. మళ్ళీ కలుస్తామనే ఆశిస్తున్నా.
- హా.

204
00:14:28,619 --> 00:14:30,786
- నేనూ అదే ఆశిస్తున్నా, మిస్టర్ కింగ్.
- నన్ను డేవిడ్ అని పిలవవచ్చు.

205
00:14:30,787 --> 00:14:33,247
- నువ్వు మిస్టర్ కింగ్ అని పిలవనక్కర్లేదు.
- నేనూ అదే ఆశిస్తున్నా, డేవిడ్.

206
00:14:33,248 --> 00:14:34,916
ఓకే, నాకది నచ్చింది. కంగారుపడటం తప్పేం కాదులే.

207
00:14:34,917 --> 00:14:36,626
పర్వాలేదు. నాకు తను నచ్చింది.

208
00:14:36,627 --> 00:14:39,587
- మీరు అన్నట్టే కలుస్తారని అనుకుంటున్నా.
- సరే, తప్పకుండా.

209
00:14:39,588 --> 00:14:41,965
నాకు వేరే మీటింగ్ ఉంది. నిన్ను కలవడం బాగుంది.

210
00:14:42,758 --> 00:14:45,344
- గుడ్ మార్నింగ్, జూలీ.
- గుడ్ మార్నింగ్, మిస్టర్ కింగ్.

211
00:14:49,473 --> 00:14:50,974
- డేవిడ్.
- హేయ్.

212
00:14:52,434 --> 00:14:55,770
కొత్త సింగర్, సూలా గురించి
నువ్వు పంపిన మెసేజ్ అందింది.

213
00:14:55,771 --> 00:14:58,147
హా, రాబోయే కాలంలో కాబోయే పెద్ద స్టార్ తను అని
నా కొడుకు అనుకుంటున్నాడు.

214
00:14:58,148 --> 00:15:01,150
- తనని వచ్చి కలవమంటావా?
- నాకు సమయం ఉన్నప్పుడు కలవమంటాలే.

215
00:15:01,151 --> 00:15:04,947
నీకు సమయం వచ్చేసరికి,
"స్ట్రే డాగ్ ఎంటర్ప్రైజెస్" మన కంపెనీని కొనేసి ఉంటుంది.

216
00:15:05,656 --> 00:15:06,740
నేను ఉండగానా?

217
00:15:10,202 --> 00:15:13,329
నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు.

218
00:15:13,330 --> 00:15:16,500
"వాళ్లు చేసేది నీటి వ్యాపారం ఒక్కటే కాదు."

219
00:15:17,417 --> 00:15:19,252
వాళ్లకి నీటి వ్యాపారాలు కాక, ఇంకా చాలా ఉన్నాయి.

220
00:15:19,253 --> 00:15:21,629
వాళ్ళది హోల్డింగ్ కంపెనీ. మల్టీ నేషనల్ కంపెనీ.

221
00:15:21,630 --> 00:15:24,423
వాళ్ళు స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ బ్రాండ్ ని
పట్టించుకుంటారా అసలు?

222
00:15:24,424 --> 00:15:25,925
దాని లెగసీ గురించి పట్టించుకుంటారా?

223
00:15:25,926 --> 00:15:27,718
పట్టించుకుంటున్నారు కాబట్టే కదా,
డీల్ తో సిద్ధంగా ఉన్నారు!

224
00:15:27,719 --> 00:15:29,346
మన వద్ద మెజారిటీ వాటా కొనుగోలు చేసిన మరుక్షణం,

225
00:15:30,097 --> 00:15:33,015
మనం వృద్ధి బాటలోకి తీసుకురావడానికి
ప్రయత్నిస్తున్న కొత్త ఆర్టిస్టులను సాగనంపేస్తారు.

226
00:15:33,016 --> 00:15:38,313
టాంపన్లు, వయాగ్రాల యాడ్స్ కోసం
మన క్యాటలాగ్ మొత్తాన్ని పక్కకు పడేస్తారు.

227
00:15:40,232 --> 00:15:45,278
నేను గత పాతికేళ్ళుగా కష్టపడి నిర్మించిన
నల్లజాతి సంస్కృతిని తొక్కేస్తారు,

228
00:15:45,279 --> 00:15:48,448
ఆర్టిస్ట్ కి కళ పట్ల ఉండే ప్రేమని నాశనం చేస్తారు.

229
00:15:49,199 --> 00:15:51,534
ఇక నాకు అస్సలు మాట్లాడాలని కూడా లేదు...
ఏంటది?

230
00:15:51,535 --> 00:15:54,787
తొక్కలో ఏఐనో, ఐఏనో ఏదో ఉంది కదా.

231
00:15:54,788 --> 00:15:59,125
వాళ్ళు అసలు సంగీతం గురించి పట్టించుకుంటారా, ప్యాట్రిక్?
మన సంగీతం గురించి పట్టించుకుంటారా?

232
00:15:59,126 --> 00:16:01,377
- సంగీత రంగంలో భవిష్యత్తు అంతా ఏఐదే, డేవిడ్.
- అవునా?

233
00:16:01,378 --> 00:16:06,966
మెషిన్లు సంగీతాన్ని ఒక ఫీల్ లేకుండా,
ఒక ఎమోషన్ లేకుండా కంపోజ్ చేస్తాయి.

234
00:16:06,967 --> 00:16:09,760
- నిన్ను సలహాదారుడిగా ఉంచుకుంటారట.
- ఉంచుకుంటారులే.

235
00:16:09,761 --> 00:16:12,847
- డేవిడ్, ఈ డీల్ ద్వారా చాలా డబ్బు వస్తుంది.
- అది నాకు తెలుసు.

236
00:16:12,848 --> 00:16:15,058
- తెలుసా? నిజంగా తెలుసా నీకు?
- హా! తెలుసు!

237
00:16:16,685 --> 00:16:18,020
మనం దీనికి ఓకే అంటే,

238
00:16:18,812 --> 00:16:22,482
మనకి చాలా డబ్బు లభిస్తుంది.

239
00:16:23,108 --> 00:16:26,904
జీవితమంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు.

240
00:16:27,613 --> 00:16:29,989
నైతికత అనేది ఒకటి ఉంటుంది. దానికి కట్టుబడి ఉండాలి.

241
00:16:29,990 --> 00:16:31,365
నువ్వు నిజంగా నమ్మేది కూడా దాన్నే.

242
00:16:31,366 --> 00:16:34,994
ఈ రంగాన్ని సంగీత వ్యాపారమని అనడానికి బలమైన కారణమే
ఉందన్న ప్రాథమిక విషయాన్ని నేను నమ్ముతాను.

243
00:16:34,995 --> 00:16:37,413
"వ్యాపారం" అనే పదం కీలకమైనది.

244
00:16:37,414 --> 00:16:39,790
ఎడాపెడా సంపాదించిన సొమ్మంతా, సొమ్ము కాదు, ప్యాట్రిక్.

245
00:16:39,791 --> 00:16:41,959
నువ్వేం చేస్తావో నాకు తెలుసు. ఒకవేళ ఓటింగ్ పెడితే,

246
00:16:41,960 --> 00:16:44,086
నువ్వు వాళ్ళ డీల్ కే ఓటేస్తావు, అవును కదా?

247
00:16:44,087 --> 00:16:46,965
హా, నన్ను అడిగితే, అమ్మడానికి సరైన తరుణం ఇది.

248
00:16:49,176 --> 00:16:50,718
అవును. ఆ అమ్మేదేంటో నాకు అమ్ము.

249
00:16:50,719 --> 00:16:52,429
- ఏంటి?
- నాకు అమ్ము.

250
00:16:53,764 --> 00:16:55,389
ఏంటిది?

251
00:16:55,390 --> 00:16:57,517
అది ఆర్థికపరమైన డాక్యుమెంట్.

252
00:16:57,518 --> 00:16:59,602
స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ కి సంబంధించిన ప్రాస్పెక్టస్.

253
00:16:59,603 --> 00:17:03,690
నీ షేర్లను కొనుగోలు చేయడానికి
గేబ్ చేత ఒక అధికారిక ఆఫర్ రాయించా.

254
00:17:04,942 --> 00:17:06,817
- నా వాటా కొనుగోలు చేయాలనుకుంటున్నావా?
- అవును.

255
00:17:06,818 --> 00:17:08,611
స్ట్రే డాగ్ నుండి నీకు అందే డీలే నేను కూడా ఇస్తా.

256
00:17:08,612 --> 00:17:11,364
నీ షేర్లు నావి అయితే,
ఓటింగ్ ని నేను కంట్రోల్ చేయగలను.

257
00:17:11,365 --> 00:17:13,449
సంస్థ ఎలా నడుస్తుందో నీకు తెలుసు కదా.

258
00:17:13,450 --> 00:17:15,242
- మరి మిగతా బోర్డు సభ్యులతో మాట్లాడావా?
- లేదు.

259
00:17:15,243 --> 00:17:18,746
వాళ్లకి ఇది చెప్పాలని లేనప్పుడు,
అసలు అయిదేళ్ల క్రితం ఎందుకు అమ్మావు?

260
00:17:18,747 --> 00:17:20,998
ఆ సమయంలో, ఆ ఆఫర్ బాగుంది అనిపించింది,

261
00:17:20,999 --> 00:17:23,209
అది నేను చేసిన భారీ తప్పిదం. క్షమించు నన్ను.

262
00:17:23,210 --> 00:17:25,962
అప్పటి నుండి నా సంస్థ తిరోగమన బాట పట్టింది,

263
00:17:25,963 --> 00:17:28,506
మళ్ళీ కంట్రోల్ ని
నా చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా.

264
00:17:28,507 --> 00:17:31,509
నేను దీన్ని గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నా,
ఎందుకంటే దీని గురించి ఆలెక్స్ కి చెప్తే,

265
00:17:31,510 --> 00:17:34,387
అతను చటుక్కున స్ట్రే డాగ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి,
ఇంకా మంచి డీల్ సంపాదించగలడు,

266
00:17:34,388 --> 00:17:37,140
బిడ్డింగ్ విషయంలో వాళ్ళతో
నేను పోటీ పడలేనని నీకు తెలుసు కదా.

267
00:17:39,601 --> 00:17:41,936
- ప్యాట్రిక్, ఒప్పుకో.
- లేదు, లేదు, డేవిడ్.

268
00:17:41,937 --> 00:17:45,481
- లేదు, లేదు. ఇది సరైన పనిలా అనిపించట్లేదు.
- ఒప్పుకో. ఒప్పుకో.

269
00:17:45,482 --> 00:17:48,025
అలా అనిపించనక్కర్లేదు. ఏది సరైనది,
ఏది కాదు అనేది నీ దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది,

270
00:17:48,026 --> 00:17:51,487
మనిద్దరి దృష్టి కోణం ఒక్కటే అన్న
నమ్మకంతోనే నేను నీ దగ్గరికి వచ్చాను.

271
00:17:51,488 --> 00:17:52,781
కానీ నేను పొరబడ్డాను అనుకుంటా.

272
00:17:55,951 --> 00:17:57,494
ఒప్పుకో.

273
00:18:00,372 --> 00:18:01,582
ఈ డీల్ కి ఓకే చెప్పు.

274
00:18:03,542 --> 00:18:06,128
ఒప్పుకో. ఒప్పుకో.

275
00:18:12,384 --> 00:18:13,468
ఒప్పుకో.

276
00:18:16,930 --> 00:18:18,389
డబ్బును ఓటింగ్ కి ముందు సిద్ధం చేయగలవా?

277
00:18:18,390 --> 00:18:19,807
హా, తప్పకుండా.

278
00:18:19,808 --> 00:18:22,102
థ్యాంక్యూ. థ్యాంక్యూ, బ్రదర్.

279
00:18:30,319 --> 00:18:33,487
లేదు, నువ్వు చెప్పేది అర్థమైంది, కానీ నేను చెప్పేదే
నీకర్థమవ్వట్లేదు. నేను అన్నది, ఖాతాలో ఉన్నదాన్ని అంతా...

280
00:18:33,488 --> 00:18:36,032
- మిస్టర్ కింగ్, మీకొక ప్యాకేజ్ వచ్చింది.
- ఖాతాలో ఉన్నదాన్ని అంతా నగదుగా మారిస్తే,

281
00:18:36,033 --> 00:18:37,451
ఎంత వస్తుందేంటి?

282
00:18:38,493 --> 00:18:39,786
అంతేనా?

283
00:18:41,246 --> 00:18:43,164
సరే, సరే. సరే, ఆ పని మొదలుపెట్టేయ్.

284
00:18:43,165 --> 00:18:45,458
- మొదలుపెట్టేయ్.
- నేను నా స్టేషన్లో ఉంటా.

285
00:18:45,459 --> 00:18:48,086
- ఓకే. పామ్, ఉన్నావా?
- వంటగదిలో ఉన్నా.

286
00:18:48,837 --> 00:18:51,172
- ఇంటికి వచ్చేశావే?
- ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చా.

287
00:18:51,173 --> 00:18:53,758
- చెప్పు అదేంటో.
- స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ లో షేర్స్ ని బైబ్యాక్ చేస్తున్నా.

288
00:18:53,759 --> 00:18:55,301
స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ లో షేర్స్ ని బైబ్యాక్ చేస్తున్నావా?

289
00:18:55,302 --> 00:18:56,844
ప్రస్తుతానికి నియంత్రణను నా చేతుల్లోకి తెచ్చే వాటిని.

290
00:18:56,845 --> 00:18:59,806
- ఆ విధంగా నేను అమ్మకాన్ని తిరస్కరించగలను.
- ఒక్క నిమిషం, నువ్వు...

291
00:19:02,226 --> 00:19:04,519
ఈ డీల్ చాలా మంచిదని చెప్పావు కదా. అంటే...

292
00:19:04,520 --> 00:19:07,438
అంటే, నువ్వు కాస్త జోరు తగ్గిస్తావని, మెల్లగా
ఈ పోటీ ప్రపంచం నుండి తప్పుకుంటావని అన్నావు కదా.

293
00:19:07,439 --> 00:19:10,149
ట్రే కాలేజీకి వెళ్లాక, మనం
ప్రపంచ యాత్ర చేస్తూ గడపవచ్చని అన్నావు కదా.

294
00:19:10,150 --> 00:19:12,485
- నేను మనస్సు మార్చుకున్నా.
- ఎప్పుడు?

295
00:19:12,486 --> 00:19:15,738
ఎదిగినప్పటి నుండి దేన్ని నిర్మించడానికి అయితే
నా జీవితమంతా కష్టపడ్డానో,

296
00:19:15,739 --> 00:19:18,991
దాన్నే పక్కకు పడేస్తున్నా అని గ్రహించినప్పుడు.

297
00:19:18,992 --> 00:19:22,120
పొద్దున స్థూడియో మ్యూజియమ్ కి
ఆ చెక్ రాయవద్దని అన్నది అందుకేనా?

298
00:19:23,205 --> 00:19:26,541
నిన్ను పెళ్లి చేసుకుంది అందుకే, పాపా.
ఈ విషయం నీకు చెప్పనందుకు సారీ.

299
00:19:26,542 --> 00:19:28,709
ఆ సమయంలో నాకు పక్కాగా తెలీలేదు.

300
00:19:28,710 --> 00:19:30,711
డీల్ కి వ్యతిరేకంగా ఓటేయమని
ప్యాట్రిక్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశా,

301
00:19:30,712 --> 00:19:33,256
కానీ అతనికి ఈ విజన్ లేదు.

302
00:19:33,257 --> 00:19:35,133
కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి?

303
00:19:36,885 --> 00:19:39,262
అదే అసలైన సమస్య. ఈ పెంట్ హౌస్ ని తనఖా పెడదాం,

304
00:19:39,263 --> 00:19:43,140
మన స్టాక్స్, బాండ్స్,
పెట్టుబడుల్లో కొన్నింటిని అమ్మేయవచ్చు.

305
00:19:43,141 --> 00:19:46,310
- ఇంకా శాగ్ హార్బర్లోని మన ఇంటిని అమ్మే...
- మన ఇంటిని తనఖా పెడతావా?

306
00:19:46,311 --> 00:19:48,104
పెద్దగా లాభాలు రాని ఒక రికార్డ్ లేబుల్ కోసం

307
00:19:48,105 --> 00:19:50,815
మన స్టాక్లను, బాండ్లను అమ్మాలనుకుంటున్నావా?

308
00:19:50,816 --> 00:19:52,817
దీన్నే సంగీత రంగం అంటారు, బేబీ.

309
00:19:52,818 --> 00:19:56,654
సంగీత రంగంలో, ఒక్క హిట్ పడితే చాలు,
మళ్ళీ టాప్ స్థానానికి ఎగబాకేయవచ్చు,

310
00:19:56,655 --> 00:19:59,657
స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ లో
మెజారిటీ వాటా నాకు దక్కినప్పుడు,

311
00:19:59,658 --> 00:20:01,909
మనం మళ్ళీ టాప్ స్థానానికి చేరుకుంటాం.
అది మాత్రం పక్కాగా చెప్పగలను.

312
00:20:01,910 --> 00:20:04,620
కానీ, కొన్ని విషయాలు
మళ్ళీ యథాస్థానానికి వెళ్లకపోతేనే మేలేమో.

313
00:20:04,621 --> 00:20:06,915
- బహుశా అవి వెళ్ళలేవేమో.
- అంటే?

314
00:20:07,875 --> 00:20:09,042
బంగారం...

315
00:20:10,836 --> 00:20:13,046
అంటే...

316
00:20:14,339 --> 00:20:16,549
మన జీవితంలో తదుపరి అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి

317
00:20:16,550 --> 00:20:19,761
దీన్ని మనం ఒక సంకేతంలా తీసుకోవాలేమో అని అంటున్నా.

318
00:20:20,846 --> 00:20:22,096
నాకు తదుపరి అధ్యాయాన్ని మొదలుపెట్టాలని లేదేమో.

319
00:20:22,097 --> 00:20:23,891
ఇది నాకు రిస్క్ లా అనిపిస్తోంది.

320
00:20:25,350 --> 00:20:26,517
మనకి.

321
00:20:26,518 --> 00:20:28,811
నా జీవితంలో నేను చేసినవన్నీ, సాధించినవన్నీ

322
00:20:28,812 --> 00:20:30,730
రిస్క్ తీసుకుని చేసినవే. నిన్ను దక్కించుకోవడంతో సహా.

323
00:20:30,731 --> 00:20:35,235
ఆ పార్టీలో, గదిలో అవతలి వైపున్న నిన్ను చూసి,
డ్రింక్ తాగుతావా అని అడిగా కదా,

324
00:20:36,653 --> 00:20:40,698
అప్పుడు నేను రిస్క్ తీసుకోలేదు అనుకుంటున్నావా?
అది రిస్క్ కాదని అంటున్నావా?

325
00:20:40,699 --> 00:20:42,575
నువ్వు అప్పుడే ఒక గ్రామీ అవార్డును గెలుచుకున్నావు.

326
00:20:42,576 --> 00:20:48,456
అది నీ ఆఫ్టర్-పార్టీ, పైగా సంగీత రంగాన్ని
నువ్వు ఏలుతావని క్విన్సీ జోన్స్ అప్పుడే అన్నాడు.

327
00:20:48,457 --> 00:20:51,460
అయినా కానీ నేనప్పుడు కంగారుపడ్డా. ఎందుకో తెలుసా?

328
00:20:52,461 --> 00:20:54,630
నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందుకే.

329
00:20:57,049 --> 00:20:58,425
ఇప్పటికీ అందంగానే ఉన్నావు.

330
00:21:01,386 --> 00:21:02,513
ఇలా రా.

331
00:21:06,475 --> 00:21:08,893
- సరే, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు.
- దేనికి?

332
00:21:08,894 --> 00:21:10,437
ఇంకా నీకు దానిపై ఇష్టం ఉందా?

333
00:21:11,271 --> 00:21:14,983
- ఉంది మరి.
- నేను సంగీతం గురించి మాట్లాడుతున్నా, డేవిడ్.

334
00:21:15,484 --> 00:21:16,943
బ్రహ్మాండంగా ఉంది మరి.

335
00:21:16,944 --> 00:21:18,111
పక్కానా?

336
00:21:20,155 --> 00:21:22,741
ఎందుకంటే, నాకు బాగా గుర్తుంది,
మనం డేటింగ్ మొదలుపెట్టిన కొత్తల్లో,

337
00:21:24,409 --> 00:21:26,245
నువ్వు టౌన్ నడిబొడ్డులో ఉన్న స్టూడియో బయటకు వచ్చి,

338
00:21:27,162 --> 00:21:28,664
హెడ్ ఫోన్స్ పెట్టుకుని,

339
00:21:29,331 --> 00:21:33,501
బ్రుక్లిన్ బ్రిడ్జ్ ఎక్కేసి నడుచుకుంటూ
మా ఇంటి దాకా వచ్చేవాడివి,

340
00:21:33,502 --> 00:21:37,046
దాని వల్ల మనకు ప్రతీ విషయంలో ఆలస్యమయ్యేది,
అందుకని నీతో దాదాపుగా తెగతెంపులు చేసుకోబోయా,

341
00:21:37,047 --> 00:21:38,674
కానీ నిన్ను ఎప్పుడూ క్షమించేసే దాన్ని,

342
00:21:39,883 --> 00:21:43,511
ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడల్లా
నీ ముఖంలో ఉత్సాహం కనిపించేది.

343
00:21:43,512 --> 00:21:48,767
అంటే, నీ దృష్టికి వచ్చిన ఒక కొత్త ఆర్టిస్ట్ గురించి,
లేదా ఒక బ్యాండ్ గురించి సంబరపడిపోయే వాడివి.

344
00:21:50,644 --> 00:21:52,437
నీలో అది ఇప్పుడు కనిపించడం లేదు.

345
00:21:54,189 --> 00:21:56,316
నీ పని గురించి నువ్వు మాట్లాడినప్పుడల్లా, అది...

346
00:21:57,109 --> 00:21:59,694
సంగీత రంగం ఎలా మారిపోయిందనే
దాని గురించి చెప్తున్నావు,

347
00:21:59,695 --> 00:22:03,447
లేదా ఏది ఉత్తమమైనదో తెలుసుకోవడం
ఇంటర్నెట్ వల్ల చాలా కష్టంగా ఉందని చెప్తున్నావు,

348
00:22:03,448 --> 00:22:08,328
కానీ ఎప్పుడూ సంగీతం గురించి చెప్పట్లేదు.

349
00:22:10,664 --> 00:22:14,501
నిన్ను ప్రేమించే సైలెంట్ పార్టనర్ గా చెప్తున్నా,

350
00:22:16,378 --> 00:22:17,838
ఇక నుండి నేను సైలెంట్ గా ఉండను.

351
00:22:19,840 --> 00:22:21,925
నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూ, నీకు అండగానే ఉంటా,

352
00:22:23,302 --> 00:22:24,887
కానీ ఇక సైలెంట్ గా మాత్రం ఉండను.

353
00:22:33,145 --> 00:22:35,396
- దాన్ని ఎత్తుతావా?
- హా. ఫోనునా?

354
00:22:35,397 --> 00:22:37,648
- నువ్వు ఇంకా...
- దీని గురించి వివరంగా తర్వాత మాట్లాడుకుందాం.

355
00:22:37,649 --> 00:22:39,818
- సరే. తప్పకుండా.
- సరే మరి. తప్పకుండా.

356
00:22:45,240 --> 00:22:46,325
చెప్పండి.

357
00:23:05,969 --> 00:23:07,095
పామ్.

358
00:23:08,138 --> 00:23:09,556
ట్రేని ఎవరో ఎత్తుకెళ్లారు.

359
00:23:10,641 --> 00:23:13,142
- అంటే?
- ఎవరో ఎత్తుకెళ్లారు ట్రేని.

360
00:23:13,143 --> 00:23:16,062
వాళ్ళు... వాళ్ళు ట్రేని కిడ్నాప్ చేశారు అనుకుంటా.

361
00:23:16,063 --> 00:23:17,855
- ఏమంటున్నావు నువ్వు?
- నాకే తెలీట్లేదు.

362
00:23:17,856 --> 00:23:20,942
వాళ్ళు నాకు మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు.
డబ్బు కావాలని చెప్పారు. నాకు...

363
00:23:20,943 --> 00:23:23,737
పాల్! పాల్!

364
00:23:25,155 --> 00:23:26,989
- మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు. పాల్.
- ఏమైంది?

365
00:23:26,990 --> 00:23:29,951
ఇప్పుడే ఒకరు కాల్ చేసి, ట్రేని కిడ్నాప్ చేశామని చెప్పారు.

366
00:23:29,952 --> 00:23:32,371
- ఏంటి?
- కైల్ కి ఒకసారి ఫోన్ చేసి చూడు.

367
00:23:34,206 --> 00:23:35,498
దేవుడా.

368
00:23:35,499 --> 00:23:36,583
హలో?

369
00:23:37,960 --> 00:23:40,211
- హా.
- ఛ. కాల్ చేస్తే నేరుగా వాయిస్ మెయిల్ కి వెళ్తోంది.

370
00:23:40,212 --> 00:23:42,256
డేవిడ్ కింగ్, 30 ఫ్రంట్ స్ట్రీట్.

371
00:23:44,800 --> 00:23:46,802
ఎవరో మా కొడుకుని కిడ్నాప్ చేశారు.

372
00:23:49,847 --> 00:23:53,267
అవును. కింగ్. ట్రే కింగ్. టీ-ఆర్-ఈ... టీ-ఆర్...

373
00:23:54,977 --> 00:23:56,520
హా. సరే.

374
00:23:59,314 --> 00:24:00,649
నువ్వు బాగానే ఉన్నావా?

375
00:24:12,327 --> 00:24:13,328
పోలీసు

376
00:24:19,751 --> 00:24:20,961
ఒక్క నిమిషం.

377
00:24:24,715 --> 00:24:25,883
వస్తున్నాం. వస్తున్నాం.

378
00:24:30,929 --> 00:24:33,140
హలో, మిస్టర్ అండ్ మిసెస్ కింగ్.
నేను డిటెక్టివ్ డిల్లన్ ని.

379
00:24:33,640 --> 00:24:34,725
- లోపలికి రావచ్చా?
- హా, తప్పకుండా.

380
00:24:35,475 --> 00:24:36,726
మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు.

381
00:24:36,727 --> 00:24:39,729
టేబుల్ కావాలంటే, క్యాండిల్ స్టిక్స్ ని తీసేసి వాడుకోండి.

382
00:24:39,730 --> 00:24:41,939
పూలను ఫైర్ ప్లేస్ కి ఎడమ వైపున పెట్టేయండి.

383
00:24:41,940 --> 00:24:44,150
- అంతేనా?
- అంతే. మీరు వాళ్ళని లోపలికి పిలవవచ్చు.

384
00:24:44,151 --> 00:24:48,030
సరే, లోపలికి రండి.
మనం ఈ డైనింగ్ రూమ్ లో సెటప్ చేసుకుందాం.

385
00:25:00,292 --> 00:25:02,043
ట్రే చాలా మంచి పిల్లాడు.

386
00:25:02,044 --> 00:25:05,004
యువ తార అని చెప్పవచ్చు.

387
00:25:05,005 --> 00:25:07,924
సమస్యల జోలికి వెళ్లడు.
ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు.

388
00:25:07,925 --> 00:25:12,136
నా కొడుకు కైల్ కి తోడూ నీడగా ఉంటున్నాడు,
వాడి అమ్మ దూరమైనప్పటి నుండి.

389
00:25:12,137 --> 00:25:13,305
అదే, నా భార్య.

390
00:25:18,393 --> 00:25:20,812
- ఏం చెప్పమంటారు?
- నిజం చెప్పండి.

391
00:25:22,981 --> 00:25:24,608
ఇంతకుముందు మనిద్దరం కలుసుకున్నామా?

392
00:25:25,692 --> 00:25:27,528
ఏమో, జూనియర్స్ లో కలుసుకుని ఉంటామేమో.

393
00:25:28,320 --> 00:25:29,862
వాళ్ళు చేసే ఛీజ్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం.

394
00:25:29,863 --> 00:25:32,282
లేదు. అక్కడ కాదు.

395
00:25:37,746 --> 00:25:40,039
మిస్టర్ అండ్ మిసెస్ కింగ్, నేను డిటెక్టివ్ బ్రిడ్జెస్ ని.

396
00:25:40,040 --> 00:25:41,916
నేను మేజర్ కేస్ స్క్వాడ్ లో పని చేస్తున్నా.

397
00:25:41,917 --> 00:25:44,710
మీ కొడుకు అపహరణ గురించి
దర్యాప్తు చేసే బాధ్యత నాకు అప్పగించారు.

398
00:25:44,711 --> 00:25:46,754
ఇందాకే, డిటెక్టివ్ హిగ్గిన్స్ నాకు చెప్పారు,

399
00:25:46,755 --> 00:25:49,549
కిడ్నాప్ చేసిన వ్యక్తి,
మీకు ఫోన్లో ఏవో సూచనలు చెప్పాడని, అవునా?

400
00:25:49,550 --> 00:25:51,218
అవును, అవును. ఏమన్నాడంటే...

401
00:25:52,678 --> 00:25:55,722
స్విస్ ఫ్రాంక్స్ లో 1.75 కోట్ల డాలర్లు కావాలట.

402
00:25:56,265 --> 00:25:58,642
ట్రేస్ చేయడానికి మార్క్ చేయని 1,000...

403
00:26:02,020 --> 00:26:05,816
సారీ, అతను 1,000 ఫ్రాంక్ నోట్లలో
కావాలి అన్నాడు, ఇంకా...

404
00:26:08,235 --> 00:26:11,779
- మళ్ళీ ఈరాత్రి కాల్ చేస్తాడట.
- అంతేనా?

405
00:26:11,780 --> 00:26:13,866
- అంతే. ఇక ఫోన్ పెట్టేశాడు.
- వాళ్లకి డబ్బులు ఇస్తాం.

406
00:26:14,867 --> 00:26:18,494
వాళ్లకి ఏం కావాలంటే అది ఇస్తాం.
కానీ ట్రేకి ఏమీ కాకూడదు, మా దగ్గరికి క్షేమంగా రావాలి.

407
00:26:18,495 --> 00:26:20,580
- తప్పకుండా. తప్పకుండా.
- అంతే కదా, డేవిడ్?

408
00:26:20,581 --> 00:26:25,168
- సరే, ఇంకా...
- నా బంగారం వాడి ఇంట్లో ఉండాలి.

409
00:26:25,169 --> 00:26:28,297
- నేను అర్థం చేసుకోగలను.
- ఎవరైనా ఎబొనీ అలర్ట్ ని జారీ చేశారా?

410
00:26:29,381 --> 00:26:31,048
హా, ఎబొనీ అలర్ట్స్. డేవిడ్.

411
00:26:31,049 --> 00:26:33,593
{\an8}"అనుమానాస్పద పరిస్థితుల్లో
కనిపించకుండా పోయిన, లేదా అపహరణకు గురైన

412
00:26:33,594 --> 00:26:35,553
{\an8}నల్లజాతి యువత కోసం ప్రవేశపెట్టిన సిస్టమ్ ని

413
00:26:35,554 --> 00:26:37,805
ఎబొనీ అలర్ట్ అని అంటారు."
అది జారీ చేయాల్సిన అవసరం ఉంది.

414
00:26:37,806 --> 00:26:43,019
సగౌరవంగా చెప్తున్నా, మిసెస్ కింగ్,
ఎబొనీ అలర్ట్ సిస్టమ్ అంటే మా అందరికీ తెలుసు.

415
00:26:43,020 --> 00:26:45,897
కానీ ప్రస్తుతానికి, అది న్యూయార్క్ రాష్ట్రంలో చట్టం కాదు,

416
00:26:45,898 --> 00:26:50,943
కానీ చెప్తున్నా కదా, ట్రే అపహరణని,
కిడ్నాపింగ్స్ అన్నింటినీ చాలా సీరియస్ గా తీసుకుంటాం.

417
00:26:50,944 --> 00:26:52,695
మీ కొడుకును మేము తప్పకుండా కనుగొంటాం.

418
00:26:52,696 --> 00:26:56,866
నేను ట్రే ఫోటోను స్కాన్ చేసి,
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ కి పంపించా.

419
00:26:56,867 --> 00:27:00,703
దాన్ని యాంబర్ అలర్ట్ కోసం
రియల్ టైమ్ క్రైమ్ సెంటర్ కి పంపించాం,

420
00:27:00,704 --> 00:27:03,206
దాన్ని పెట్రోల్ టీమ్ కి కూడా పంపిస్తున్నాం.

421
00:27:03,207 --> 00:27:04,291
ఇక విషయానికి వస్తే...

422
00:27:05,167 --> 00:27:07,544
ఎక్కువసార్లు కిడ్నాప్స్ ని

423
00:27:08,462 --> 00:27:12,632
కుటుంబం గురించి బాగా తెలిసినవాళ్ళే చేస్తుంటారు.

424
00:27:12,633 --> 00:27:14,717
నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఒకవేళ...

425
00:27:14,718 --> 00:27:18,262
మా ఇంట్లో ఉండే వాళ్ళే ఎవరైనా చేసి
ఉంటారేమో అన్న అనుమానంతో అడుగుతున్నారా?

426
00:27:18,263 --> 00:27:20,640
మీ ఉద్దేశం అదేనా? క్షమించాలి.

427
00:27:20,641 --> 00:27:22,975
- లేదు.
- ఇక్కడ అలాంటి వాళ్ళెవరూ లేరు.

428
00:27:22,976 --> 00:27:24,727
- పక్కానా?
- హా, పక్కా.

429
00:27:24,728 --> 00:27:29,398
మా కొడుకును ఎలా కనుగొంటున్నారో
తెలుసుకోవాలని అనుకుంటున్నా.

430
00:27:29,399 --> 00:27:32,818
అవును, మీ కొడుకును వీలైనంత వేగంగా
కనుగొనడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాం.

431
00:27:32,819 --> 00:27:35,113
- థ్యాంక్యూ.
- మనందరి లక్ష్యం ఒకటే.

432
00:27:36,031 --> 00:27:37,823
సగౌరవంగా చెప్తున్నా,

433
00:27:37,824 --> 00:27:40,953
మీ అంత స్టేటస్ ఉన్న వాళ్ళకి ఇతరులకి
పనులు చెప్పడం తప్ప, పనులను ఫాలో అవ్వడం తెలీదు,

434
00:27:41,745 --> 00:27:44,121
కానీ మీరు మాపై నమ్మకం ఉంచాలి.

435
00:27:44,122 --> 00:27:46,583
దయచేసి నేను చెప్పినట్టు చేయండి.

436
00:27:47,376 --> 00:27:48,794
ట్రే కోసం.

437
00:28:04,017 --> 00:28:06,353
{\an8}"ఇదే సరైన తరుణం"
పీ.ఆర్.కే.ఆర్

438
00:28:11,984 --> 00:28:15,278
చూడండి, మిస్టర్ కింగ్, కిడ్నాపర్ కాల్ చేసినప్పుడు,

439
00:28:15,279 --> 00:28:16,904
దయచేసి ప్రశాంతంగా మాట్లాడండి.

440
00:28:16,905 --> 00:28:20,408
మీరు చాలా ఎమోషనల్ అయిపోతారని తెలుసు,
కానీ కాల్ లో మాట్లాడేటప్పుడు

441
00:28:20,409 --> 00:28:21,618
సంయమనం అస్సలు కోల్పోకూడదు.

442
00:28:22,828 --> 00:28:23,871
అర్థమైంది.

443
00:28:25,163 --> 00:28:28,374
- ఎల్ఐయు అరెనాలోని సిబ్బందిని పిలిపించండి.
- హేయ్, మా అబ్బాయి, కైల్ అక్కడ ఉన్నాడా?

444
00:28:28,375 --> 00:28:30,710
- మిస్టర్ క్రిస్టఫర్, ఆగండి.
- ఏంటంటే, నేను వాడికి కాల్ చేశా, కానీ...

445
00:28:30,711 --> 00:28:33,546
మీ అబ్బాయి క్యాంప్ లోనే ఉన్నాడు.
అక్కడ ఇప్పుడంతా గందరగోళంగా ఉంది.

446
00:28:33,547 --> 00:28:36,383
మీరు నాకు అడ్డుపడుతూ ఉన్నారు.
నా పని నన్ను చేయనివ్వండి, సరేనా?

447
00:28:38,427 --> 00:28:40,053
మీ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు.

448
00:28:40,762 --> 00:28:42,097
మంచి వాడు.

449
00:28:44,057 --> 00:28:46,268
ఈమధ్య అతనిలో ఏమైనా మార్పు గమనించారా?

450
00:28:47,019 --> 00:28:49,187
ఆందోళనకరంగా అనిపించేది ఏదైనా?

451
00:28:49,188 --> 00:28:50,855
ఆందోళనకరంగా అనిపించేదా?

452
00:28:50,856 --> 00:28:54,817
అతని వయస్సు ఎలాంటిదంటే,
అతను తప్పుడు జనంతో కలిసే అవకాశముంది.

453
00:28:54,818 --> 00:28:56,611
నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు,
ఎలా ఉండేదాన్నో నాకు తెలుసు.

454
00:28:56,612 --> 00:28:58,155
లేదు, వాడు చాలా మంచివాడు.

455
00:28:58,947 --> 00:29:00,615
ట్రే చాలా తెలివైన కుర్రాడు.

456
00:29:00,616 --> 00:29:02,491
అతను తెలివైన వాడు కాదని ఎవరూ అనట్లేదు.

457
00:29:02,492 --> 00:29:03,785
విషయం తదుపరి దశకు చేరుకుంది.

458
00:29:05,454 --> 00:29:06,704
- హేయ్.
- హా.

459
00:29:06,705 --> 00:29:09,624
బాస్కెట్ బాల్ అరేనా బయట ఎల్ఐయు సిబ్బందికి
ఇప్పుడే ఒక గ్రీన్ హెడ్ బ్యాండ్ కనిపించింది.

460
00:29:09,625 --> 00:29:11,959
ఏంటి? అది ట్రేది. అది ట్రేది, డేవిడ్.

461
00:29:11,960 --> 00:29:14,754
హిగ్గిన్స్, 1 పోలీస్ ప్లాజాలోని
రియల్ టైమ్ క్రైమ్ సెంటర్ వాళ్లకి కాల్ చేసి,

462
00:29:14,755 --> 00:29:17,965
ఎల్ఐయు బాస్కెట్ బాల్ అరేనా చుట్టుపక్కల ప్రాంతాల
నుండి ఫోటోలను కానీ, వీడియోలను కానీ

463
00:29:17,966 --> 00:29:19,800
- ఏమైనా సంపాదించగలరేమో కనుక్కో.
- సరే.

464
00:29:19,801 --> 00:29:24,681
డిటెక్టివ్ బెల్, నంబర్ ప్లేట్ రీడర్లు గల వాహనాల నుండి
వెంటనే ఫోటోలను డౌన్ లోడ్ చేసి ఇవ్వమని చెప్పు.

465
00:29:25,807 --> 00:29:26,933
మిస్టర్ అండ్ మిసెస్ కింగ్,

466
00:29:26,934 --> 00:29:31,437
ఈ చిక్కుముడి వీడేంత వరకు,
మాకు కనిపించే, మేము రికవర్ చేసే వాటన్నింటినీ

467
00:29:31,438 --> 00:29:34,649
ఆధారాలు కానో,
దర్యాప్తుకు పనికొచ్చే సమాచారం కానో చూస్తాము.

468
00:29:34,650 --> 00:29:36,442
- మేము కాస్త...
- సరే. అలాగే.

469
00:29:36,443 --> 00:29:38,612
- అర్థమైంది.
- థ్యాంక్యూ. పద.

470
00:29:45,035 --> 00:29:46,328
నాకు తెలిసిందంతా చెప్తాను.

471
00:29:47,788 --> 00:29:50,414
- చెప్పండి.
- పిల్లలని ఆపకుండా అటూ ఇటూ పరుగెత్తమని చెప్పా...

472
00:29:50,415 --> 00:29:52,875
- కానివ్వండి!
- ...ట్రే కుంటడం గమనించా.

473
00:29:52,876 --> 00:29:55,003
గాయాలపాలయ్యేంత సమయం లేదు. కానివ్వండి.

474
00:29:56,421 --> 00:29:58,840
కాబట్టి, కూర్చొని, చీలమండకి ఐస్ పెట్టుకోమని చెప్పా.

475
00:29:58,841 --> 00:30:01,092
- కాలిని స్ట్రెచ్ చేయి, స్ట్రెచ్ చేయి.
- సరే.

476
00:30:01,093 --> 00:30:04,721
- దాని తర్వాత అతడిని చూశారా?
- ఆఫీసర్, ఇక్కడ వంద మంది పిల్లలు ఉన్నారు.

477
00:30:05,389 --> 00:30:07,807
అంటే, అతను లంచ్ కి ముందే
చల్లగా జారుకుని ఉండవచ్చు.

478
00:30:07,808 --> 00:30:09,851
- అర్థమైంది.
- ట్రే బాగానే ఉన్నాడా?

479
00:30:09,852 --> 00:30:11,477
మాకు తెలిసినంత వరకు బాగానే ఉన్నాడు.

480
00:30:11,478 --> 00:30:13,271
కైల్ కూడా బాగానే ఉన్నాడా?

481
00:30:13,272 --> 00:30:15,106
అతనికి ఏమైనా అయి ఉంటుందని మాకు అనిపించట్లేదు.

482
00:30:15,107 --> 00:30:16,774
సరే.

483
00:30:16,775 --> 00:30:18,985
- చూడండి, మీకు నా ఫోన్ నంబర్ ఇస్తా.
- అలాగే.

484
00:30:18,986 --> 00:30:21,988
మీకేమైనా తెలిస్తే, దయచేసి నాకు కూడా చెప్పండి.

485
00:30:21,989 --> 00:30:24,240
ప్రస్తుతానికి సమాచారాన్ని
సేకరించే పనిలోనే ఉన్నాం, కోచ్, సరేనా?

486
00:30:24,241 --> 00:30:26,242
కోచ్ ఫాక్స్, నేను మీకు వీరాభిమానిని.

487
00:30:26,243 --> 00:30:27,869
దయచేసి ఒక ఆటోగ్రాఫ్ కూడా చేయగలరా?

488
00:30:27,870 --> 00:30:29,412
మీకు ఇబ్బంది లేకపోతే.

489
00:30:29,413 --> 00:30:32,374
- హా, తప్పకుండా, ఆఫీసర్ బోల్టన్.
- బోల్టన్.

490
00:30:33,166 --> 00:30:35,042
ఆఫీసర్ మెక్ గిల్లికడ్డీ, మీకు కూడా కావాలా?

491
00:30:35,043 --> 00:30:37,128
- వద్దులెండి.
- సెల్టిక్స్ అభిమాని అతను.

492
00:30:37,129 --> 00:30:39,089
అర్థమైందిలెండి.

493
00:30:40,883 --> 00:30:42,717
- థ్యాంక్యూ. రోజంతా కులాసాగా గడపండి, కోచ్.
- థ్యాంక్యూ.

494
00:30:42,718 --> 00:30:44,010
ఏమైనా తెలిస్తే, దయచేసి నాకు చెప్పండి.

495
00:30:44,011 --> 00:30:46,137
- మీకు తప్పకుండా తెలియజేస్తూ ఉంటాం, కోచ్.
- సరే.

496
00:30:46,138 --> 00:30:47,264
ల్యారీ బర్డ్.

497
00:30:49,433 --> 00:30:50,475
హా.

498
00:30:55,480 --> 00:30:56,939
ఇప్పుడే అందిన తాజా వార్త,

499
00:30:56,940 --> 00:31:00,359
స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ వ్యవస్థాపకుడైన,

500
00:31:00,360 --> 00:31:04,572
డేవిడ్ కింగ్ 17 ఏళ్ల కొడుకు,
ట్రే కింగ్ ని ఎవరో కిడ్నాప్ చేశారని

501
00:31:04,573 --> 00:31:06,115
న్యూయార్క్ పోలీసులు తెలిపారు.

502
00:31:06,116 --> 00:31:08,659
{\an8}2000ల ప్రారంభంలో పలు దశాబ్దాల పాటు
ఆధిపత్యం సాగించిన

503
00:31:08,660 --> 00:31:11,662
{\an8}స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ వ్యవస్థాపకులు, సృష్టికర్త,
డేవిడ్ కింగ్ గురించి తెలియని వారుండరు.

504
00:31:11,663 --> 00:31:13,206
{\an8}స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ వ్యవస్థాపకులు,
డేవిడ్ కింగ్ కొడుకు కిడ్నాప్

505
00:31:13,207 --> 00:31:15,917
ఒకప్పటిలా "కింగ్ మేకర్" కాకపోయినా,

506
00:31:15,918 --> 00:31:17,919
ఎప్పుడైనా ఏమైనా సాధించగల సత్తా ఉన్న మనిషి, డేవిడ్.

507
00:31:17,920 --> 00:31:20,963
సంగీత రంగంలో మంచి సంగీతాన్ని
ఇట్టే పసిగట్టేయగలడని ఆయనకి చాలా మంచి పేరు ఉంది.

508
00:31:20,964 --> 00:31:24,592
ఆయన గైడెన్స్, కృషి వలన 50కి పైగా
ఆర్టిస్టులు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు.

509
00:31:24,593 --> 00:31:28,179
బ్రాంక్స్ లో పుట్టి పెరిగిన ఈయన,
మొదట్నుంచీ కుటుంబానికి ప్రాధ్యానత ఇచ్చేవారు,

510
00:31:28,180 --> 00:31:29,847
అలాగే గొప్ప దాత కూడా.

511
00:31:29,848 --> 00:31:32,934
కాబట్టి, ఈ దురదృష్టకర సమయంలో
ఆయనకి ఇంత ప్రేమ, ఆదరణ దక్కడం

512
00:31:32,935 --> 00:31:35,228
పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు.

513
00:31:35,229 --> 00:31:37,188
మన యువ సోదరుడు, ట్రే కింగ్

514
00:31:37,189 --> 00:31:41,067
సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని మనందరం ప్రార్థిద్దాం.

515
00:31:41,068 --> 00:31:44,196
{\an8}ఎత్తు: 5'-10"
బరువు: 75కేజీలు

516
00:31:48,951 --> 00:31:50,159
నా విచారణ అయిందా?

517
00:31:50,160 --> 00:31:52,496
ఏమో. అయిందంటారా?

518
00:31:53,705 --> 00:31:55,957
డిటెక్టివ్, నేను వెళ్లి నా కొడుకు కోసం వెతుకుతా.

519
00:31:55,958 --> 00:31:59,585
అది ఇందులో భాగమైన వారందరికీ
మంచిది అని మాకు అనిపించట్లేదు.

520
00:31:59,586 --> 00:32:02,296
- "మాకు"?
- అవును. మాకు.

521
00:32:02,297 --> 00:32:03,382
మీరందరూ వాడికి తండ్రులా?

522
00:32:04,258 --> 00:32:07,343
నా కొడుకును వెతుక్కోకుండా మీరు నన్ను ఆపలేరు.
నన్నేమైనా అరెస్ట్ చేస్తున్నారా?

523
00:32:07,344 --> 00:32:10,680
- లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటారా?
- మిమ్మల్ని చేయాలా?

524
00:32:10,681 --> 00:32:12,724
మిస్టర్ క్రిస్టఫర్, మీ పరోల్ ఆఫీసర్ ఎవరో మాకు తెలుసు.

525
00:32:13,851 --> 00:32:15,268
ఆయనకి కాల్ చేస్తే మీకే నష్టం.

526
00:32:15,269 --> 00:32:17,144
అతని నంబర్ ఉందా?
నేనిప్పుడు పెరోల్ లో లేను. కాల్ చేసుకోండి.

527
00:32:17,145 --> 00:32:20,147
ఓరి దేవుడా. కాస్త మీ హడావిడి ఆపుతారా? కూర్చోండి.

528
00:32:20,148 --> 00:32:21,691
దయచేసి కూర్చోండి.

529
00:32:21,692 --> 00:32:23,402
నన్ను వదిలేయండి కాస్త.

530
00:32:26,655 --> 00:32:29,156
కైల్ ఇంకా మీకు ఎందుకు
కాల్ చేయలేదో మాకు అర్థం కావట్లేదు.

531
00:32:29,157 --> 00:32:32,035
- "మాకు"? మీరు ఫ్రెంచ్ వాళ్ళా?
- అవును, అవును.

532
00:32:34,705 --> 00:32:36,456
చాలా ప్రేమ, ఆదరణ లభిస్తోంది...

533
00:32:37,165 --> 00:32:39,376
ఆగండి. ఎవరు?

534
00:32:40,252 --> 00:32:42,211
- పాల్.
- లోపలికి రా.

535
00:32:42,212 --> 00:32:43,422
అందరూ...

536
00:32:47,384 --> 00:32:48,427
రాబందులు.

537
00:32:49,845 --> 00:32:52,973
మీ దంపతుల అంతర్గత వ్యవహారాన్ని
నలుగురి ముందు పెడుతున్నారు.

538
00:32:53,849 --> 00:32:55,100
రా, కూర్చో.

539
00:32:56,476 --> 00:32:59,271
దానికి నేనే కారణం, పాల్.
నేను వెలిగిపోతున్న దశలో వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు...

540
00:33:01,315 --> 00:33:04,234
నేను అడ్డు చెప్పలేదు కదా, కాబట్టి... అదన్నమాట.

541
00:33:05,861 --> 00:33:07,571
నేను టౌన్లో వాళ్లకి కాల్ చేశా.

542
00:33:09,198 --> 00:33:10,406
దేనికి?

543
00:33:10,407 --> 00:33:12,825
అక్కడి వాళ్లకి ఏమైనా తెలుసో లేదో కనుక్కోవడానికి.
దాని వల్ల నష్టమేం లేదు కదా.

544
00:33:12,826 --> 00:33:14,161
అర్థం చేసుకోగలను.

545
00:33:15,245 --> 00:33:18,332
- ఇప్పుడు పిచ్చి పనేదీ చేయకు.
- నేను ధోనీ కన్నా కూల్ గా ఉన్నా.

546
00:33:21,335 --> 00:33:22,461
ఎవరిలా కూల్ గా ఉన్నావు?

547
00:33:24,296 --> 00:33:27,131
అందుకే నువ్వంటే నాకు ఇష్టం, బాసూ.
నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలీట్లేదు.

548
00:33:27,132 --> 00:33:28,382
అది నీకూ తెలుసు.

549
00:33:28,383 --> 00:33:31,177
- నేను ఇంకేమైనా చేయాలా?
- ప్రస్తుతానికి ఏమీ వద్దు.

550
00:33:31,178 --> 00:33:32,929
- ఇది నాకేం పెద్ద కష్టం కాదు, కింగ్.
- తెలుసు.

551
00:33:32,930 --> 00:33:35,932
నువ్వు నాకోసం, కైల్ కోసం చాలా చేశావు,
నేను ట్రేతో, ఈ కుటుంబంతో చాలా సన్నిహితంగా గడిపాను,

552
00:33:35,933 --> 00:33:38,017
కాబట్టి నా సొంత కొడుకే
తప్పిపోయాడన్న ఫీలింగ్ కలుగుతోంది.

553
00:33:38,018 --> 00:33:40,061
అతడిని ఇక్కడికి తీసుకురావడానికి నేనేమైనా చేస్తా, సరేనా?

554
00:33:40,062 --> 00:33:42,231
- అర్థమైంది.
- డేవిడ్!

555
00:33:43,106 --> 00:33:44,524
డేవిడ్! డేవిడ్!

556
00:33:44,525 --> 00:33:47,443
- ఏంటి?
- డేవిడ్! బేబీ, మన కొడుకుని కనిపెట్టేశారు!

557
00:33:47,444 --> 00:33:48,695
వాళ్ళు మన కొడుకును కనిపెట్టేశారు.

558
00:33:49,780 --> 00:33:52,908
వాడిని కనిపెట్టేశారు, ఇప్పుడు ఇంటికే తీసుకొస్తున్నారు.

559
00:33:55,369 --> 00:33:57,412
ఓరి దేవుడా, థ్యాంక్యూ.

560
00:33:58,330 --> 00:34:00,791
- థ్యాంక్యూ!
- మన పిల్లలు సురక్షితంగా ఉన్నారు.

561
00:34:03,126 --> 00:34:04,419
కూల్ ధోనీ.

562
00:34:05,379 --> 00:34:07,630
- కూల్ ధోనీ. చెప్పా కదా. చెప్పా కదా.
- కూల్ ధోనీ.

563
00:34:07,631 --> 00:34:09,048
చెప్పా కదా.

564
00:34:09,049 --> 00:34:10,466
- నీకు చెప్పా కదా.
- అవును.

565
00:34:10,467 --> 00:34:12,552
చెప్పావు. చెప్పావు, బ్రదర్.

566
00:34:12,553 --> 00:34:13,929
చెప్పావు.

567
00:34:41,331 --> 00:34:43,291
- ఎక్కడ వాడు?
- కైల్!

568
00:34:43,292 --> 00:34:45,584
ఎక్కడ వాడు? నా కొడుకు ఎక్కడ? ట్రే?

569
00:34:45,585 --> 00:34:46,879
ట్రే, నా...

570
00:34:48,213 --> 00:34:50,007
ట్రే! నా బంగారం!

571
00:34:51,132 --> 00:34:53,426
నా బంగారం. నా బేబీ.

572
00:34:53,427 --> 00:34:56,721
ఓరి దేవుడా! హమ్మయ్య. థ్యాంక్యూ.

573
00:34:56,722 --> 00:34:59,098
- ట్రే, కైల్ ఎక్కడ?
- బంగారం, ఒకసారి నిన్ను చూడనివ్వు.

574
00:34:59,099 --> 00:35:00,766
- క్షమించు.
- ఓరి దేవుడా. ఎందుకు?

575
00:35:00,767 --> 00:35:03,644
- నా కొడుకు ఎక్కడ? కైల్ ఎక్కడ?
- నన్ను క్షమించు.

576
00:35:03,645 --> 00:35:05,813
- ఏమైంది? ట్రే?
- క్షమించు.

577
00:35:05,814 --> 00:35:07,899
- క్షమించు.
- మిస్టర్ క్రిస్టఫర్, పొరపాటు జరిగింది.

578
00:35:07,900 --> 00:35:10,484
- కైల్ ఎక్కడ?
- ఒక పొరపాటు జరిగింది.

579
00:35:10,485 --> 00:35:12,737
పొరపాటా? ఏం మాట్లాడుతున్నారు? నా కొడుకు ఎక్కడ?

580
00:35:12,738 --> 00:35:14,280
- అతను కిడ్నాపర్ చెరలో ఉన్నాడు.
- కింగ్!

581
00:35:14,281 --> 00:35:16,324
- ఆగు!
- అతను పొరపాటున కైల్ ని ఎత్తుకెళ్లాడు.

582
00:35:16,325 --> 00:35:17,408
ఒక్క నిమిషం, లేదు, లేదు...

583
00:35:17,409 --> 00:35:20,120
ట్రే, కైల్ జిమ్ నుండి బయటకు వచ్చినప్పుడు,
కైల్ తన హెడ్ బ్యాండ్ వేసుకున్నాడని ట్రే చెప్పాడు.

584
00:35:21,705 --> 00:35:23,539
కాబట్టి కిడ్నాపర్, ట్రే అనుకుని
మీ కొడుకుని కిడ్నాప్ చేసినట్టున్నాడు.

585
00:35:23,540 --> 00:35:26,417
నా కొడుకును కిడ్నాప్ చేశాడా?
లేదు, లేదు. ఆగండి, ఆగండి.

586
00:35:26,418 --> 00:35:28,085
- ట్రే!
- మిస్టర్ క్రిస్టఫర్...

587
00:35:28,086 --> 00:35:29,879
- కాస్త వెనక్కి...
- ఏం జరుగుతోంది?

588
00:35:29,880 --> 00:35:32,798
- ఏం జరుగుతోంది? నన్ను అదుపులోకి తీసుకుంటున్నారా?
- ఆగండి. ఆగండి.

589
00:35:32,799 --> 00:35:35,301
- నన్ను అదుపులోకి తీసుకుంటున్నారా?
- లేదు. అదేం లేదు!

590
00:35:35,302 --> 00:35:37,261
- ఏ చట్టం కిందో చెప్పండి!
- లేదు, మిస్టర్ క్రిస్టఫర్...

591
00:35:37,262 --> 00:35:39,639
- నన్ను అదుపులోకి తీసుకుంటున్నారా?
- చట్టం లేదు, ఏమీ లేదు!

592
00:35:39,640 --> 00:35:41,015
లేదు, మిస్టర్ క్రిస్టఫర్,

593
00:35:41,016 --> 00:35:43,560
- మిమ్మల్ని అదుపులోకి తీసుకోవట్లేదు!
- అవును!

594
00:35:44,394 --> 00:35:46,688
పంపించేయండి. పంపించేయండి. ఆయనకి దారి ఇవ్వండి.

595
00:35:49,942 --> 00:35:51,276
దరిద్రులు.

596
00:35:58,617 --> 00:36:01,870
కైల్ కి, నాకు క్యాంప్ లోని
లంచ్ అంటే ఇష్టం ఉండడు, కాబట్టి...

597
00:36:03,163 --> 00:36:04,872
మేము ఏమైనా తినడానికి చల్లగా బయటకు జారుకున్నాం.

598
00:36:04,873 --> 00:36:08,584
నాకు పిజ్జా తినాలనిపించింది, అతను
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చికెన్ శాండ్విచ్ తింటానని చెప్పాడు.

599
00:36:08,585 --> 00:36:09,795
సరే అని అన్నా.

600
00:36:10,796 --> 00:36:14,090
"నా పిజ్జా తినేసి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వస్తా" అని చెప్పా.

601
00:36:14,091 --> 00:36:16,677
- అలా మీరు తలోదారి వెళ్ళారా?
- అవును.

602
00:36:17,761 --> 00:36:20,346
నేను ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి, నేను...

603
00:36:20,347 --> 00:36:22,223
నేను వాడి కోసం చాలా సేపు ఎదురుచూశా.

604
00:36:22,224 --> 00:36:24,267
ఇక లోపలికి వెళ్లి చూస్తే,
వాడు కనిపించలేదు. లేడు అక్కడ.

605
00:36:24,268 --> 00:36:25,853
ఎవరికైనా చెప్పి ఉండవచ్చు కదా?

606
00:36:26,812 --> 00:36:28,479
వచ్చేస్తాడని అనుకున్నా.

607
00:36:28,480 --> 00:36:31,023
అంటే, మా దగ్గర ఫోన్లు లేవు, నేనేమో...

608
00:36:31,024 --> 00:36:33,442
- నువ్వు అరగంట ఆగావా?
- వాడిని వదిలి రావాలని అనిపించలేదు నాకు.

609
00:36:33,443 --> 00:36:35,403
- ఏం చేయాలో నాకు తెలీలేదు.
- పర్వాలేదు.

610
00:36:35,404 --> 00:36:37,989
ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.

611
00:36:37,990 --> 00:36:39,657
- వాడికి ఏమీ కాదు, కదా?
- ఏమీ కాదు.

612
00:36:39,658 --> 00:36:43,077
- అతనికి ఏమీ కాదు.
- పామ్, ఇక చాలేమో.

613
00:36:43,078 --> 00:36:45,830
- నాకు కూడా అదే అనిపిస్తోంది.
- కాస్త బ్రేక్ తీసుకుందామా?

614
00:36:45,831 --> 00:36:47,623
ఒక్క నిమిషం. ట్రే, నీకు ఇంకేం కనిపించలేదా?

615
00:36:47,624 --> 00:36:50,209
- పాల్, ఇవాళ్టికి ఇది చాలు అని చెప్పాడు కదా.
- ఇంకెప్పుడైనా కొనసాగిద్దాం.

616
00:36:50,210 --> 00:36:52,837
మిస్టర్ క్రిస్టఫర్, అతను
మొదట ఇచ్చిన వాంగ్మూలం ఉంది మా దగ్గర.

617
00:36:52,838 --> 00:36:55,506
- దాని ఆధారంగా పని చేయగలం.
- ఎలా? నా కొడుకు ఎక్కడ?

618
00:36:55,507 --> 00:36:58,050
- మీ అబ్బాయి కోసమే వెతుకుతున్నాం.
- ఒక్క నిమిషం.

619
00:36:58,051 --> 00:36:59,969
- రా, బాసూ. రా నువ్వు.
- ఆగు.

620
00:36:59,970 --> 00:37:03,848
నా భార్య... చనిపోయిన భార్య మీద ఒట్టేస్తున్నా!

621
00:37:03,849 --> 00:37:06,142
- చనిపోయిన నా భార్య మీద ఒట్టు!
- ఓయ్!

622
00:37:06,143 --> 00:37:07,727
ఇక్కడి నుండి పో.

623
00:37:07,728 --> 00:37:09,229
జార్జ్ ఫోర్మన్
ముహమ్మద్ ఆలి

624
00:37:10,689 --> 00:37:12,065
ఎలా ఉంది ఇప్పుడు?

625
00:37:13,567 --> 00:37:14,693
నిజం చెప్పు.

626
00:37:17,446 --> 00:37:18,488
నాకు తెలీదు.

627
00:37:19,198 --> 00:37:20,240
అర్థం చేసుకోగలం.

628
00:37:21,158 --> 00:37:22,784
ఏమైనా అవసరమైతే, మాకు కాల్ చేయి, సరేనా?

629
00:37:23,493 --> 00:37:25,078
- మీరంటే నాకు ప్రాణం.
- సరే, బాబూ.

630
00:37:28,665 --> 00:37:29,916
కైల్ కి ఏమీ కాదు కదా?

631
00:37:29,917 --> 00:37:31,709
కాకూడదనే కోరుకుంటున్నాం.

632
00:37:31,710 --> 00:37:33,669
కానీ, ఏదైనా జరిగితే, మనం...

633
00:37:33,670 --> 00:37:36,255
మనం కిడ్నాపర్ అడిగిన డబ్బు ఇచ్చేస్తాం, కదా?

634
00:37:36,256 --> 00:37:39,926
అలా జరగకుండా ఉండటానికి, చాలా మంది నిష్ణాతులు

635
00:37:39,927 --> 00:37:41,636
ఈ కేసుపై చాలా కష్టపడి పని చేస్తున్నారు.

636
00:37:41,637 --> 00:37:42,970
కానీ మీరు...

637
00:37:42,971 --> 00:37:46,307
బంగారం, ఈ విషయం గురించి నువ్వు ఆందోళన
చెందాల్సిన పని లేదు. విశ్రాంతి తీసుకో, సరేనా?

638
00:37:46,308 --> 00:37:49,645
అంటే, ఒకవేళ వాడికి మనం తప్ప వేరే దిక్కు లేకపోతే.

639
00:37:50,229 --> 00:37:52,731
మిస్టర్ అండ్ మిసెస్ కింగ్, కిందికి రండి! ఫోన్ వస్తోంది!

640
00:37:56,818 --> 00:38:00,239
రండి! కిందికి రండి.

641
00:38:01,198 --> 00:38:04,200
సరే, ఇంకా మోగుతూనే ఉంది. ఓకే,
కొన్ని కుర్చీలు తీసుకురండి, కుర్చీలు తీసుకురండి.

642
00:38:04,201 --> 00:38:06,327
ఓకే, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి.

643
00:38:06,328 --> 00:38:08,079
అతడిని లైన్లోనే ఉంచాలి, కాబట్టి నిదానంగా మాట్లాడండి,

644
00:38:08,080 --> 00:38:10,581
దృష్టి తప్పవద్దు, అతడిని మాట్లాడేలా చేయండి.

645
00:38:10,582 --> 00:38:12,750
అతను నోరు జారి,
మనకి కావాల్సిన ఆధారం ఇచ్చే అవకాశం ఉంది.

646
00:38:12,751 --> 00:38:14,669
అతను కిడ్నాప్ చేసింది వేరే కుర్రాడినని వాడికి తెలియాలి.

647
00:38:14,670 --> 00:38:16,963
కిడ్నాపర్లకి అంతిమంగా కావాల్సింది డబ్బే.

648
00:38:16,964 --> 00:38:19,215
మనకి కావాల్సింది ఎత్తుకెళ్ళి,
అది కావాలంటే డబ్బులు ఇమ్మని డిమాండ్ చేస్తారు.

649
00:38:19,216 --> 00:38:21,676
- వాడికి చెప్పు, కింగ్.
- మిస్టర్ కింగ్, ఫోన్ ఎత్తండి.

650
00:38:21,677 --> 00:38:23,469
దయచేసి ఫోన్ ఎత్తండి.

651
00:38:23,470 --> 00:38:27,140
సరే. శాంతించండి.

652
00:38:27,891 --> 00:38:28,933
హలో.

653
00:38:28,934 --> 00:38:31,894
కింగ్ డేవిడ్. ఇది చాలా గొప్ప విషయం కదా?

654
00:38:31,895 --> 00:38:34,230
- ఏమన్నావు?
- ఇప్పుడు నీ సంపూర్ణ దృష్టి నాపై ఉంది, కదా?

655
00:38:34,231 --> 00:38:35,898
ఇప్పటికి నా మాటని వింటున్నావు.

656
00:38:35,899 --> 00:38:37,567
- హా, వింటున్నా.
- మంచిది.

657
00:38:37,568 --> 00:38:40,403
- నువ్వు కిడ్నాప్ చేసింది నా కొడుకును కాదని తెలుసు, కదా?
- హా, అదే తెలిసింది.

658
00:38:40,404 --> 00:38:42,823
మనం పనికి పెట్టుకున్న వాళ్ళని
పూర్తిగా నమ్మలేమని కూడా తెలుసుకున్నా.

659
00:38:43,657 --> 00:38:44,866
కానీ అదృష్టం కొద్దీ,

660
00:38:44,867 --> 00:38:47,368
నా టార్గెట్ అబ్బాయి కాదు, నువ్వే.

661
00:38:47,369 --> 00:38:49,245
కరెక్టే, కానీ నేను టార్గెట్ అయితే,

662
00:38:49,246 --> 00:38:52,248
వేరే వాళ్ళ అబ్బాయికి కోటి డెబ్బై అయిదు లక్షల డాలర్లను
ఎలా చెల్లిస్తానని అనుకున్నావు,

663
00:38:52,249 --> 00:38:54,458
టార్గెట్ నేను అయితే.

664
00:38:54,459 --> 00:38:56,961
అయితే, అతని చావుకు నువ్వే కారణం అవుతావు మరి.

665
00:38:56,962 --> 00:39:00,131
- ఏమంటావు?
- లేదు. భలేవాడివే.

666
00:39:00,132 --> 00:39:03,594
బాసూ, నేనేం బేరసారాలు ఆడట్లేదు.
శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చేసింది.

667
00:39:04,386 --> 00:39:07,722
- నువ్వు దేవుడివి కాదు, బాసూ, నేను దేవుడిని!
- సరే, చెప్పేది విను.

668
00:39:07,723 --> 00:39:10,766
దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు అనుకోవద్దు.
దేవుడు నీకు అవసరమైనవే ఇస్తాడు.

669
00:39:10,767 --> 00:39:13,186
కాబట్టి నీకు అవసరమైనది ఏంటో చెప్పు.
నీకు ఏ విధంగా సాయపడగలను?

670
00:39:13,187 --> 00:39:15,563
నేనేం దేవుడినని చెప్పట్లేదు, కానీ నేను సాయపడగలను.

671
00:39:15,564 --> 00:39:19,150
- నాకు సాయపడగలవా? అంత లేదు.
- సాయపడగలను. నేను... నువ్వు ఆలకించట్లేదు.

672
00:39:19,151 --> 00:39:20,902
లేదు. అస్సలు లేదు.

673
00:39:20,903 --> 00:39:22,820
- దానికి ఆలస్యమైపోయింది, బ్రో.
- చెప్పేది విను.

674
00:39:22,821 --> 00:39:25,698
వాడిని వదిలేయ్, నీకేం కాకుండా నేను చూసుకుంటా.

675
00:39:25,699 --> 00:39:28,284
దొబ్బేయ్. నేనెవరు అనుకుంటున్నావు?

676
00:39:28,285 --> 00:39:30,912
నిజమే చెప్తున్నా. ఈ ఊర్లో
నాకు చాలా పలుకుబడి ఉంది, బాసూ.

677
00:39:30,913 --> 00:39:33,289
నేను నీకు సాయపడతా,
నువ్వు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించవచ్చు.

678
00:39:33,290 --> 00:39:35,791
- నువ్వు కొత్త జీవితం ప్రారంభించవచ్చు.
- దానికి బాగా ఆలస్యమైపోయిందిలే.

679
00:39:35,792 --> 00:39:38,503
- ఇప్పటికీ మించిపోయిందేం లేదు. సరే, చెప్పేది విను.
- ఒకటి చెప్పనా?

680
00:39:38,504 --> 00:39:42,048
జాగ్రత్తగా విను, సరేనా?
ఒక పాత జోర్డన్ బ్రాండ్ బ్యాగ్ లో

681
00:39:42,049 --> 00:39:45,801
కోటి డెబ్బై అయిదు లక్షల డాలర్లను ఇవ్వాలి,
అవి 1,000 స్విస్ ఫ్రాంక్ నోట్లలో ఇవ్వాలి,

682
00:39:45,802 --> 00:39:49,055
లేదంటే, ఈ పిల్ల బచ్చాగాడు చస్తాడు.
నేను తమాషా చేస్తున్నానని పొరపాటున కూడా అనుకోవద్దు.

683
00:39:49,056 --> 00:39:53,017
బాసూ, అతను నా కొడుకు కాదు, సామీ.
తోటి సోదరునికి సాయపడు.

684
00:39:53,018 --> 00:39:55,895
రేపు ఉదయం కాల్ చేసి,
డబ్బు ఎక్కడ పెట్టాలో చెప్తారా, పిరికోడా!

685
00:39:55,896 --> 00:39:57,397
నా దగ్గర...

686
00:40:00,692 --> 00:40:01,777
పిరికోడా!

687
00:40:06,073 --> 00:40:08,491
- ఆ కాల్ ని ట్రేస్ చేయగలరా?
- యూజ్ & త్రో ఫోన్లని ట్రేస్ చేయలేము.

688
00:40:08,492 --> 00:40:11,118
- ఎందుకని చేయలేరు?
- వాటికి యూనిక్ ఇడెంటిఫయర్లు ఉండవు...

689
00:40:11,119 --> 00:40:12,578
- దాన్ని ట్రేస్ చేయలేరా?
- ...సిమ్ కార్డు ఉండదు.

690
00:40:12,579 --> 00:40:14,247
ఇది 2025, మీరు కనీసం...

691
00:40:14,248 --> 00:40:16,833
అందరూ టీవీల్లో పోలీస్ షోలు చూడండి. దేవుడా!

692
00:40:16,834 --> 00:40:18,877
దొబ్బేయండి ఇక్కడి నుండి.

693
00:40:32,599 --> 00:40:36,561
డబ్బును స్విస్ ఫ్రాంక్లలోనే ఎందుకు ఇవ్వమని
ఈ దరిద్రుడు అడుగుతున్నాడో ఎవరైనా చెప్పగలరా?

694
00:40:36,562 --> 00:40:38,563
నాకు కూడా అర్థం కావట్లేదు. తెలీదు.

695
00:40:38,564 --> 00:40:43,359
హేయ్. మిత్రులారా,
నన్ను మేజర్ కేస్ స్క్వాడ్ లోకి వేయక ముందు

696
00:40:43,360 --> 00:40:45,362
నేను ఓ.సీ.సీ.బీలో పని చేసే దాన్ని.

697
00:40:46,071 --> 00:40:48,114
ఆస్థులను స్వాధీనపరుచుకోవడం, మనీ లాండరింగ్.

698
00:40:48,115 --> 00:40:50,116
ఇక్కడ మనం సైజ్ ని గమనించాలి.

699
00:40:50,117 --> 00:40:54,996
వెయ్యి స్విస్ ఫ్రాంక్ నోట్లని వాడినప్పుడు
ప్యాకేజీ బరువు సుమారుగా 16 కేజీలే ఉంటుంది,

700
00:40:54,997 --> 00:40:59,792
అదే 100 యుఎస్ డాలర్ల నోట్లని వాడినప్పుడు
బరువు, సుమారుగా 175 కేజీలు ఉంటుంది.

701
00:40:59,793 --> 00:41:04,172
మరి 175 కేజీల బరువున్న బ్యాగ్ ని మిస్టర్ కింగ్
ఎలా మోసుకుని వెళ్లి ఇవ్వగలడు? అది కష్టం కదా.

702
00:41:04,173 --> 00:41:08,676
ఒక్క 1,000 స్విస్ ఫ్రాంక్ నోట్,
పది 100 యుఎస్ డాలర్ల నోట్లతో సమానం.

703
00:41:08,677 --> 00:41:10,761
వావ్, ఏ కాలేజీలో చదువుకున్నావు?

704
00:41:10,762 --> 00:41:13,891
స్పెల్మెన్ కాలేజ్. నల్లజాతి మహిళతో పెట్టుకోవద్దమ్మా.

705
00:41:18,896 --> 00:41:20,855
- ఎవరు?
- పాల్ ని.

706
00:41:20,856 --> 00:41:23,275
లోపలికి రా. లోపలికి రా.

707
00:41:31,533 --> 00:41:32,534
మనం...

708
00:41:33,660 --> 00:41:35,746
- మనం ఒక నిమిషం మాట్లాడుకోవచ్చా?
- తప్పకుండా.

709
00:41:39,791 --> 00:41:42,503
నీకు అబద్ధాలాడటం అస్సలు చేతకాదు, పాల్,
కాబట్టి నేరుగా విషయానికి వచ్చేయ్.

710
00:41:43,754 --> 00:41:47,257
అతను కైల్ ని చంపుతానని బెదిరించాడు, కదా?

711
00:41:49,676 --> 00:41:51,344
నా కొడుకును చంపేస్తా అన్నాడు, కదా?

712
00:41:51,345 --> 00:41:54,222
నేనెంత కష్టపడుతున్నానో నీకు తెలుసు.

713
00:41:54,223 --> 00:41:55,431
నాకు వాడు తప్ప ఇంకెవరూ లేరు.

714
00:41:55,432 --> 00:41:57,099
నాకెవరూ లేరు. నేను, వాడు, అంతే.

715
00:41:57,100 --> 00:42:00,520
చూడు, వాళ్లకి కోటి డెబ్బై అయిదు లక్షల డాలర్లు కావాలట.

716
00:42:00,521 --> 00:42:04,190
ఆ పోలీసు, బ్రిడ్జెస్, డబ్బును ఎక్కడికీ పోనివ్వం అని
అన్నాడు. నా మీద ఒట్టేసి చెప్తున్నా...

717
00:42:04,191 --> 00:42:06,527
నా మీద ఒట్టేసి చెప్తున్నా, కింగ్,
దాన్ని నేను అప్పుగానే భావిస్తా.

718
00:42:09,404 --> 00:42:12,073
ఏంటి... నువ్వు దాన్ని
అప్పుగా భావించి, మళ్ళీ నాకు ఇచ్చేస్తానని అంటున్నావా?

719
00:42:12,074 --> 00:42:13,491
దేవుని కృపతో నీకు ఎలాగోలా చెల్లించేస్తా.

720
00:42:13,492 --> 00:42:16,953
అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తావు? నువ్వు అసలు
కోటి డెబ్బై అయిదు లక్షల డాలర్లను ఎప్పుడైనా చూశావా?

721
00:42:16,954 --> 00:42:19,830
నీకు ఒక లక్షలో సున్నాలు ఎన్ని ఉంటాయో తెలీదు.
అలాంటిది కోటి డెబ్బై అయిదు లక్షలంటే ఎలా తెలుస్తుంది!

722
00:42:19,831 --> 00:42:21,834
- దేవుని కృపతో ఎలాగోలా కట్టేస్తాను.
- ఎలా?

723
00:42:24,920 --> 00:42:26,003
నీకు...

724
00:42:26,004 --> 00:42:29,966
ఈ విషయంలో నీకు కొంచెం కూడా బాధ్యతగా అనిపించట్లేదా?

725
00:42:29,967 --> 00:42:32,343
దేనికి? కిడ్నాపర్ చేసిన తప్పుకా?

726
00:42:32,344 --> 00:42:35,805
వాళ్లకి కావాల్సింది కైల్ కాదు, ట్రే.
అసలు దీనికి, నాకు ఏ సంబంధమూ లేదు.

727
00:42:35,806 --> 00:42:38,391
నీ కొడుకుని కిడ్నాప్ చేసి, నిన్ను బెదిరించాలనుకున్నారు.

728
00:42:38,392 --> 00:42:41,811
వాళ్ళకి కావాల్సింది
నా కొడుకు కూడా కాదు, నేను. వాళ్లకి కావాల్సింది నేను,

729
00:42:41,812 --> 00:42:45,357
కిడ్నాపర్ చేసిన తప్పుకు,
నేను చెల్లించి నష్టం భరించాలంటున్నావా?

730
00:42:48,151 --> 00:42:49,402
ఆ పని నేను చేయను.

731
00:42:49,403 --> 00:42:51,446
ట్రే విషయంలో ఎలాగోలా కట్టాలని ప్లాన్ చేసే వాడివే కదా.

732
00:42:54,700 --> 00:42:55,784
అవును, చేసేవాడినే.

733
00:42:58,745 --> 00:43:00,079
అంత డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో చెప్పు.

734
00:43:00,080 --> 00:43:02,373
- స్టాకింగ్ హిట్స్.
- దానితో ఎలాగో చెప్పు.

735
00:43:02,374 --> 00:43:04,876
- నాకు డీల్స్ అన్నీ తెలుసు, కింగ్.
- ఏ డీల్స్?

736
00:43:04,877 --> 00:43:08,337
నేనేం వారెన్ బఫెట్ అంత పిస్తాని కాదు, కానీ
దాని ద్వారా సరిపడా డబ్బు సర్దవచ్చని మాత్రం తెలుసు.

737
00:43:08,338 --> 00:43:09,505
ఎప్పుడైనా తెరచాటుగా జరిగేదేంటో చూశావా?

738
00:43:09,506 --> 00:43:11,174
చూడు, తెరచాటుగా ఏం జరుగుతుందో ఎవరూ చూడరు.

739
00:43:11,175 --> 00:43:13,843
అందరూ తెర ముందు కనిపించేది మాత్రమే
చూస్తారు, అదే కనిపిస్తుంది అందరికీ.

740
00:43:13,844 --> 00:43:17,054
నా డబ్బును లెక్కిస్తున్నావా? ఇప్పుడు మొత్తం
లెక్కపెట్టు. నా మీద అసహనం చూపకు, పాల్.

741
00:43:17,055 --> 00:43:19,599
నాకెంత మంది అప్పు ఉన్నారో నీకు తెలుసా?
నేనెంత మందికి చెల్లిస్తానో తెలుసా?

742
00:43:19,600 --> 00:43:21,267
నేను పన్ను ఎంత కడతానో తెలుసా? నీకు...

743
00:43:21,268 --> 00:43:23,729
చూడు, చూడు, నువ్వు చేసేవన్నీ నాకు తెలుసు.

744
00:43:24,438 --> 00:43:28,107
నువ్వు నాకు చేసిన మేలుకు
ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది.

745
00:43:28,108 --> 00:43:30,026
కానీ నేనెప్పుడూ నిన్నేమీ అడగలేదు.

746
00:43:30,027 --> 00:43:31,986
- అడగాల్సిన అవసరం నీకు రాలేదు, పాల్.
- అవును, అది నిజమే.

747
00:43:31,987 --> 00:43:34,281
నాకు ఏమీ అడగకుండానే ఇచ్చేశావు.
అందుకు నీకు రుణపడి ఉంటా.

748
00:43:34,948 --> 00:43:38,201
ఇప్పుడు, నాకు అంతా కావాలని అడుగుతున్నా.

749
00:43:38,202 --> 00:43:41,037
- నా జీవితాన్ని ప్రసాదించమని అడుగుతున్నా.
- లేదు, నువ్వు అడిగేది అది కాదు.

750
00:43:41,038 --> 00:43:43,372
ఇప్పుడు కోటి డెబ్బై అయిదు లక్షల డాలర్లు
ఇవ్వమని అడుగుతున్నావు.

751
00:43:43,373 --> 00:43:45,500
జనాలు ఎప్పుడూ నన్ను
ఏదోకటి చేసి పెట్టమనే అడుగుతుంటారు.

752
00:43:45,501 --> 00:43:47,752
- "నాకు ఇది ఇవ్వగలరా?"
- నా కొడుకును కాపాడు. వాడు నా కొడుకు.

753
00:43:47,753 --> 00:43:50,505
నన్ను డబ్బులు కట్టమనే అడుగుతుంటారు.
"హిట్స్ కావాలి. దీనికి కట్టు.

754
00:43:50,506 --> 00:43:52,507
అది ఇవ్వు. ఇది ఇవ్వు.

755
00:43:52,508 --> 00:43:55,510
దీని మీద అది పెట్టు,
దాని మీద ఇది పెట్టు, దీని మీద అది పెట్టు,

756
00:43:55,511 --> 00:43:57,095
దాని మీద అది పెట్టు, ఇక అంతే."

757
00:44:02,100 --> 00:44:03,268
ఇది చూశావా?

758
00:44:06,522 --> 00:44:10,025
దీన్ని పేల్చి పారేయాలని నాకు చాలాసార్లు అనిపించింది.

759
00:44:11,735 --> 00:44:13,445
కానీ అంత ధైర్యం చాల్లేదు.

760
00:44:17,533 --> 00:44:18,784
నా దగ్గర ఉన్నదంతా ఇదే.

761
00:44:19,868 --> 00:44:22,037
నీకు పనికి వచ్చేది ఇక్కడ ఏమైనా ఉందేమో చూడు.

762
00:44:57,781 --> 00:44:58,991
నేను చూస్తాలే. నేను చూస్తా.

763
00:45:06,832 --> 00:45:10,710
మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి, మిస్టర్ కింగ్.
మిస్టర్ బెథేయ కింద ఉన్నారు. మిమ్మల్ని కలవాలని వచ్చారు.

764
00:45:10,711 --> 00:45:13,671
మీకు రెండు-మూడు సార్లు కాల్ చేశారట,
మీరు ఎత్తలేదట, కాబట్టి నన్ను పైకి పంపారు.

765
00:45:13,672 --> 00:45:14,756
సరే.

766
00:45:20,637 --> 00:45:22,639
పామ్, ట్రేలు ఎలా ఉన్నారు?

767
00:45:23,640 --> 00:45:26,017
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే,
బాగానే ఉన్నారని చెప్పవచ్చు.

768
00:45:26,018 --> 00:45:28,269
అంటే, కిడ్నాపర్ ఇప్పటికీ డబ్బు అడుగుతున్నాడుగా.

769
00:45:28,270 --> 00:45:32,398
నేను డబ్బులు ఇవ్వకపోతే, పాల్ కొడుకుని చంపేస్తాడట.

770
00:45:32,399 --> 00:45:34,942
కోటి డెబ్బై అయిదు లక్షల డాలర్ల పొరపాటు.

771
00:45:34,943 --> 00:45:37,196
- ఇంకా డబ్బులు కట్టమంటున్నాడా?
- అవును.

772
00:45:39,489 --> 00:45:41,158
నేను కట్టలేనేమో అనిపిస్తుంది.

773
00:45:42,743 --> 00:45:44,328
డేవిడ్, కట్టకుండా ఎలా ఉంటావు?

774
00:45:45,996 --> 00:45:47,788
నేను కడితే, మన డీల్ అటకెక్కినట్టే.

775
00:45:47,789 --> 00:45:50,416
పైగా, స్టాకింగ్ హిట్స్ లో వాటాను
అమ్మాల్సి ఉంటుంది. అప్పుడు నాకు డబుల్ బొక్క.

776
00:45:50,417 --> 00:45:52,502
నీకు వేరే దారి ఉన్నట్టు అనిపించట్లేదు.

777
00:45:52,503 --> 00:45:54,505
హా, దారి ఎందుకు లేదు? అది నా డబ్బు.

778
00:45:56,131 --> 00:45:58,633
స్టాకింగ్ హిట్స్ లోని వాటాను
తిరిగి కొనుగోలు చేయడానికి పాల్ కొడుకుని

779
00:45:58,634 --> 00:46:00,302
బలి చేశావని నలుగురికి తెలిస్తే, ఏమంటారు?

780
00:46:05,974 --> 00:46:09,770
- ఏమో. ఈ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది.
- పరిస్థితి.

781
00:46:10,479 --> 00:46:14,191
జనాలకు సంక్లిష్టంగా ఉందా లేదా అనేది ముఖ్యం కాదు.

782
00:46:15,442 --> 00:46:17,485
ఒక ఆర్టిస్టును జనాలు తిరస్కరిస్తే,
ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా.

783
00:46:17,486 --> 00:46:19,779
- హా.
- నువ్వు పాల్ కొడుకుని వదిలేశావని

784
00:46:19,780 --> 00:46:22,073
సోషల్ మీడియాకి తెలిసిందనుకో,

785
00:46:22,074 --> 00:46:24,408
వాళ్లకి ఖచ్చితంగా తెలిసిపోతుందిలే,

786
00:46:24,409 --> 00:46:26,994
ఇక దాన్నే హైలైట్ చేస్తారు.
ఆ కథనం ప్రపంచమంతా మార్మోగిపోతుంది.

787
00:46:26,995 --> 00:46:29,289
అంతా రచ్చరచ్చ అయిపోతుంది. అంతే.

788
00:46:30,165 --> 00:46:32,083
నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది.

789
00:46:32,084 --> 00:46:35,002
ఖతమ్ అయిపోతావు. నిన్ను శత్రువులా చూస్తారు.
నీ కథకు శుభం కార్డు పడుతుంది.

790
00:46:35,003 --> 00:46:38,005
- అలా పక్కాగా జరుగుతుందని చెప్పలేం కదా.
- చెప్పలేమా? నువ్వు నిజంగానే అంటున్నావా?

791
00:46:38,006 --> 00:46:40,759
అంటే, నువ్వన్నది నిజమే, కానీ...

792
00:46:43,095 --> 00:46:45,305
నేను ఇలా చెప్తున్నానంటే, నాకే ఆశ్చర్యంగా ఉంది, కానీ...

793
00:46:46,974 --> 00:46:50,476
ఈరోజుల్లో వార్తలు ఎంత వేగంగా
మారిపోతాయో మనకి తెలిసిందే కదా.

794
00:46:50,477 --> 00:46:52,937
అంటే, ఒక వారం గడిచాక
వాళ్లకి ఇంకో బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుంది.

795
00:46:52,938 --> 00:46:55,189
- మరో కథనం హల్ చల్ చేస్తుంది.
- డేవిడ్.

796
00:46:55,190 --> 00:46:56,816
మరో యుద్ధం గురించి కథనమో...

797
00:46:56,817 --> 00:46:59,486
- ఏంటి?
- నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా?

798
00:47:01,905 --> 00:47:05,658
హా. అంటే, అర్థమవుతోంది, కానీ
నేను ప్రాక్టికల్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా.

799
00:47:05,659 --> 00:47:07,369
అంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నావా?

800
00:47:08,203 --> 00:47:10,455
నువ్వు ఏది సరైనదో, అదే చేయాలని నా కోరిక.

801
00:47:15,878 --> 00:47:17,212
థ్యాంక్యూ.

802
00:47:19,590 --> 00:47:21,091
- కొంచెం నిద్రపో.
- హా.

803
00:47:25,429 --> 00:47:30,851
కిడ్నాపర్ అడిగిన డబ్బు మనం ఇవ్వకపోతే,
జనం ఏమనుకుంటారు అంటావు?

804
00:47:33,187 --> 00:47:37,107
మన జీవితంలో మనకి ఎవరైతే ముఖ్యమో,
వారు మన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారనుకుంటా.

805
00:47:38,066 --> 00:47:39,568
కానీ జనం సంగతేంటి?

806
00:47:41,153 --> 00:47:42,862
మనం కనుక డబ్బులు ఇవ్వకపోతే,

807
00:47:42,863 --> 00:47:47,326
జనాల్లో వ్యతిరేకత పెరిగి, మిగిలి ఉన్న
నా కెరీర్ కూడా నాశనమైపోతుందని ప్యాట్రిక్ అంటున్నాడు.

808
00:47:48,911 --> 00:47:50,579
ఇప్పుడు విషయం క్లియర్ అయిందిగా.

809
00:47:51,246 --> 00:47:52,456
ఏమంటున్నావు?

810
00:47:53,248 --> 00:47:56,125
ఇవాళ ఉదయం, స్టాకింగ్ హిట్స్ కోసం
నీ కుటుంబ భద్రతని సైతం పణంగా పెట్టడానికి సిద్ధమయ్యావు.

811
00:47:56,126 --> 00:47:57,543
ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చు కదా.

812
00:47:57,544 --> 00:47:59,837
హా, కానీ ఇందాక పరిస్థితి వేరు,
ఇప్పుడు పరిస్థితి వేరు.

813
00:47:59,838 --> 00:48:02,006
ఇప్పుడన్నీ పెనవేసుకుపోయి ఉన్నాయి.
అందరి జీవితాలూ ముడిపడి ఉన్నాయి.

814
00:48:02,007 --> 00:48:04,091
నువ్వు. స్టాకింగ్ హిట్స్.

815
00:48:04,092 --> 00:48:07,261
ఇంకా... కైల్, ట్రే, పాల్.

816
00:48:07,262 --> 00:48:09,014
డేవిడ్, అది చిన్న అమౌంట్ కాదు.

817
00:48:10,474 --> 00:48:12,517
చెప్పాలంటే, మనకి ఉన్నదంతా అర్పించుకోవాలి, అంతే కదా?

818
00:48:12,518 --> 00:48:14,228
దాదాపుగా అంతే.

819
00:48:19,107 --> 00:48:20,358
మరి మనం ఇప్పుడేం చేద్దాం?

820
00:48:20,359 --> 00:48:22,026
తెలీట్లేదు.

821
00:48:22,027 --> 00:48:23,362
నాకు కూడా.

822
00:48:25,113 --> 00:48:27,741
నిర్ణయం ఏదైనా కానీ,
దాన్ని మనిద్దరం కలిసి తీసుకోవాలి, సరేనా?

823
00:48:31,328 --> 00:48:32,621
ట్రే ఎలా ఉన్నాడు?

824
00:48:33,247 --> 00:48:34,330
నీకోసం అడుగుతున్నాడు.

825
00:48:34,331 --> 00:48:35,791
- అవునా?
- హా.

826
00:48:42,756 --> 00:48:44,090
లవ్ యూ.

827
00:48:44,091 --> 00:48:45,299
మీడియా టేక్ అవుట్

828
00:48:45,300 --> 00:48:48,554
సెలబ్రిటీ కొడుకు, ట్రే కింగ్, తనకి బదులుగా
తన స్నేహితుడిని కిడ్నాపింగ్ కి బలిపశువు చేశాడు!

829
00:49:02,985 --> 00:49:04,152
ట్రే.

830
00:49:17,749 --> 00:49:18,876
అదన్నమాట.

831
00:49:22,796 --> 00:49:24,256
ఇప్పుడు ఎలా ఉంది, పోటుగాడా?

832
00:49:25,090 --> 00:49:26,341
పిచ్చోడిలా అనిపిస్తోంది నాకు.

833
00:49:30,137 --> 00:49:32,096
కోర్టుకు అటు నుండి ఇటువైపుకు పరుగులు తీయడం వల్ల

834
00:49:32,097 --> 00:49:34,474
నా చీలమండ కాస్త నొప్పిగా ఉంది,
దయచేసి ఇది అమ్మకు చెప్పకు.

835
00:49:35,642 --> 00:49:37,144
అదేమంత సీరియస్ కాదు, కానీ...

836
00:49:37,811 --> 00:49:39,270
కాస్తంత ఇబ్బందిగా ఉందంతే.

837
00:49:39,271 --> 00:49:41,190
ఆ విషయం ఎవరికీ చెప్పనులే.

838
00:49:42,274 --> 00:49:45,736
నీకు సారీ చెప్తున్నా...

839
00:49:47,196 --> 00:49:51,574
నువ్వు బాస్కెట్ బాల్ బాగా ఆడేదాకా ఉండి,
చూసిపోతానని చెప్పినందుకు.

840
00:49:51,575 --> 00:49:54,827
- హా, ఇప్పుడు చెప్పి లాభమేంటి.
- లేదు, చెప్పాలి. అది చెప్పడం ముఖ్యం.

841
00:49:54,828 --> 00:49:59,583
ఒక విషయం చెప్తున్నా,
నేను ఏం చేసినా, అంటే ఏం చేసినా కానీ,

842
00:50:00,542 --> 00:50:02,711
అది నీ కోసం...

843
00:50:04,588 --> 00:50:06,924
మీ అమ్మ కోసం, మన కోసమే.

844
00:50:08,842 --> 00:50:10,010
కుటుంబానికే తొలి ప్రాధాన్యత.

845
00:50:13,138 --> 00:50:16,350
కైల్ కోసం కిడ్నాపర్ అడిగిన డబ్బును
చెల్లించకపోవడమే అందరికీ మంచిది అంటావా?

846
00:50:17,643 --> 00:50:19,394
నాకు, అమ్మకి, పాల్ అంకుల్ కి అదే మంచిదా?

847
00:50:21,605 --> 00:50:23,439
అదెలా నాన్నా?

848
00:50:23,440 --> 00:50:25,608
నీకు ఇప్పుడు అది అర్థం కాదులే,

849
00:50:25,609 --> 00:50:28,819
కానీ అదంత తేలికైన విషయం కాదు.

850
00:50:28,820 --> 00:50:30,405
చాలా సంక్లిష్టమైనది.

851
00:50:31,448 --> 00:50:34,492
కానీ పాల్ అంకుల్ అన్నది నిజమే కదా.
మన వల్లే కదా ఇది జరిగింది.

852
00:50:34,493 --> 00:50:36,410
అది నిజం కాదు. ఇది జరిగింది మన వల్ల కాదు...

853
00:50:36,411 --> 00:50:40,082
అలా అంటున్నది పాల్ అంకుల్ ఒక్కడే కాదు.

854
00:50:41,959 --> 00:50:46,170
"న్యూయార్క్ డైలీ న్యూస్", "న్యూయార్క్ పోస్ట్"లలోని
మొదటి పేజీలో అదే రాశారు.

855
00:50:46,171 --> 00:50:50,842
సోషల్ మీడియా, టిక్ టాక్, వాయిస్ మెయిల్,
ఆన్ లైన్లో ఎక్కడ చూసినా ఇదే.

856
00:50:50,843 --> 00:50:53,636
అసలు కిడ్నాప్ నన్ను చేసి ఉంటే బాగుండేదని
నాకు మెసేజీలు వస్తున్నాయి.

857
00:50:53,637 --> 00:50:56,138
- బాబూ, చెప్పా కదా...
- నాన్నా, నీకు అర్థం కావట్లేదు.

858
00:50:56,139 --> 00:50:58,808
"మీడియా టేకవుట్," బ్లాక్ ట్విట్టర్ లలో
నాపై భయంకరమైన దాడి జరుగుతోంది, నాకు...

859
00:50:58,809 --> 00:51:02,311
నువ్వు... నువ్వు ఆ సోదినంతా వినకూడదు.
అది విషం లాంటిది.

860
00:51:02,312 --> 00:51:04,481
- అదంతా ఉత్త చెత్త.
- నాన్నా, ఎక్కడ చూసినా అదే కనిపిస్తోంది.

861
00:51:05,649 --> 00:51:06,899
నీకు అర్థం కావట్లేదు.

862
00:51:06,900 --> 00:51:10,278
దీన్ని పట్టించుకోకుండా ఉండటానికి, ఇదేమీ
అంతగా బాగా లేని "రోలింగ్ స్టోన్" ఆల్బమ్ రివ్యూ కాదు.

863
00:51:10,279 --> 00:51:12,155
అయినా కానీ దాన్ని పట్టించుకోకూడదు.

864
00:51:12,781 --> 00:51:14,616
నేను పట్టించుకోకుండా ఎలా ఉండగలను!

865
00:51:19,079 --> 00:51:22,498
నా ప్రాణ స్నేహితుడి దారుణమైన హత్యకు
కారణం నేనేనని నా స్నేహితులు అనుకుంటారు.

866
00:51:22,499 --> 00:51:24,751
- భలేవాడివే.
- అంటే ఎలా ఉంటుందో తెలుసా?

867
00:51:25,794 --> 00:51:28,129
అంటే, నేను మళ్ళీ హై స్కూల్ కి
ఎలా వెళ్ళగలను, దాన్ని ఎలా పూర్తి చేయగలను?

868
00:51:28,130 --> 00:51:30,090
నాకు ఏ కాలేజ్ సీట్ ఇస్తుంది, నాన్నా?

869
00:51:36,763 --> 00:51:38,348
మనం ఏదోకటి ఆలోచించాలి.

870
00:51:39,433 --> 00:51:40,976
మనం ఏదోకటి ఆలోచించాలి.

871
00:51:43,061 --> 00:51:45,188
మనం ఏదోకటి తప్పక ఆలోచించాలి.

872
00:51:45,189 --> 00:51:46,732
సరే, నేను...

873
00:51:49,943 --> 00:51:51,235
నాకు తెలీట్లేదు, బాబూ.

874
00:51:51,236 --> 00:51:53,988
- తెలీట్లేదు అంటే?
- అంటే... ఇప్పుడు...

875
00:51:53,989 --> 00:51:57,575
- నీకు అన్నీ తెలుసు, అందరూ తెలుసు.
- నాకు... హా, కానీ ఇప్పుడు, నాకేం...

876
00:51:57,576 --> 00:52:01,705
లేదు, లేదు, నాన్నా, నీకు తెలుసు!
ఆ తొక్కలో కోటి డెబ్బై అయిదు లక్షలను వాడికి ఇచ్చేయ్!

877
00:52:02,623 --> 00:52:04,249
అది తొక్కలో డబ్బే కదా!

878
00:52:08,420 --> 00:52:10,838
అయితే, మీ నాన్న మీద అలా నోరు పారేసుకుంటావా?

879
00:52:10,839 --> 00:52:12,591
నాతో అలా మర్యాద లేకుండా మాట్లాడతావా?

880
00:52:13,300 --> 00:52:14,510
అది కూడా నా ఇంట్లో.

881
00:52:15,761 --> 00:52:16,803
సరే మరి.

882
00:52:18,138 --> 00:52:19,890
అపోహలేమైనా ఉన్నాయేమో నీకు, ఒకటి స్పష్టంగా చెప్తున్నా.

883
00:52:24,186 --> 00:52:27,105
ఈ ఇంట్లో ఒక్కడే మగాడు ఉన్నాడు,
వాడు ఇప్పుడు నీ కళ్లెదుటే ఉన్నాడు.

884
00:52:30,984 --> 00:52:33,277
ఇంకెప్పుడైనా అలా మాట్లాడితే,

885
00:52:33,278 --> 00:52:36,155
ఉత్త పుణ్యానికే ఇంట్లో ఉంటున్న నీ మక్కెలు విరగ్గొడతా.

886
00:52:36,156 --> 00:52:37,449
అర్థమైందా?

887
00:52:40,869 --> 00:52:42,411
మళ్ళీ చెప్తున్నా.

888
00:52:42,412 --> 00:52:43,789
నేను చెప్పింది అర్థమైందా?

889
00:52:46,875 --> 00:52:48,377
- అర్థమైంది.
- నిజంగా?

890
00:52:49,962 --> 00:52:50,963
అర్థమైంది, సర్.

891
00:52:52,381 --> 00:52:53,423
నిజంగా?

892
00:52:54,758 --> 00:52:56,552
- అర్థమైంది, సర్.
- సరే మరి.

893
00:52:58,929 --> 00:53:00,347
డేవిడ్ కింగ్.

894
00:53:02,057 --> 00:53:05,143
మా నాన్న, సంగీత రంగంలో
మంచి సంగీతాన్ని ఇట్టే పసిగట్టేయగలడు...

895
00:53:09,106 --> 00:53:10,482
కానీ ఆయనకి హృదయం మాత్రం లేదు.

896
00:53:28,584 --> 00:53:30,377
ఈ తలుపును బాగు చేయించాలి.

897
00:54:24,264 --> 00:54:25,431
టైమ్ - ఈ ఏటి మేటి వ్యక్తి

898
00:54:25,432 --> 00:54:26,767
రోలింగ్ స్టోన్
కింగ్ కి జయహో

899
00:54:40,489 --> 00:54:42,573
నువ్వు అయితే ఏం చేసేవాడివి, జేమ్స్?

900
00:54:42,574 --> 00:54:44,451
నువ్వు అయితే ఏం చేసేవాడివి, స్టీవీ?

901
00:54:46,286 --> 00:54:47,496
జిమీ?

902
00:54:48,247 --> 00:54:50,582
అరీతా, నువ్వు అయితే ఏం చేసి ఉండేదానివి?

903
00:54:58,882 --> 00:55:00,508
నువ్వేం చేస్తావు?

904
00:55:00,509 --> 00:55:01,676
నాకు తెలీదు.

905
00:55:01,677 --> 00:55:02,802
ఏదోకటి తేల్చు.

906
00:55:02,803 --> 00:55:04,263
ఆ పనిలోనే ఉన్నా, గురూ.

907
00:55:05,222 --> 00:55:06,473
నా కొడుకును దూరం చేసేసుకున్నా.

908
00:55:07,182 --> 00:55:08,559
వాడికేమని చెప్పాలి, హా?

909
00:55:09,852 --> 00:55:12,980
వాడికేం చెప్పాలి? మీరందరూ ఒకరితో ఒకరు
మాట్లాడుకుని చెప్పండి, ఎందుకంటే నేను వాడితో మాట్లాడలేను.

910
00:55:13,730 --> 00:55:17,150
ట్రే బంగారం. ఓరి దేవుడా.

911
00:55:18,360 --> 00:55:19,528
నన్ను క్షమించు.

912
00:55:21,280 --> 00:55:22,948
హా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.

913
00:55:26,994 --> 00:55:28,412
హా, రండి.

914
00:55:30,122 --> 00:55:31,163
సారీ. చెప్పండి.

915
00:55:31,164 --> 00:55:34,501
- వేసవిలో వేడికి జలుబు చేసింది.
- ఎలా ఉన్నారు?

916
00:55:40,090 --> 00:55:41,716
- మీరు బాగానే ఉన్నారా?
- వావ్.

917
00:55:41,717 --> 00:55:43,926
- హా, బాగానే ఉన్నాను.
- హా, అర్థం చేసుకోగలను.

918
00:55:43,927 --> 00:55:45,012
మీకేం కావాలి?

919
00:55:45,721 --> 00:55:47,513
రేపు ఏం చేయాలా అని ప్లాన్స్ ఆలోచిస్తూ ఉన్నాం.

920
00:55:47,514 --> 00:55:49,725
- చెప్పండి.
- హా, అంటే...

921
00:55:51,018 --> 00:55:54,813
కిడ్నాపర్ కి డబ్బులు ఇస్తానని చెప్పడం మీకు ఓకేనా?

922
00:56:01,361 --> 00:56:03,155
దాని వల్ల మనకి ఇంకాస్త సమయం దక్కుతుంది.

923
00:56:26,261 --> 00:56:27,888
పర్వాలేదు. ఓకే.

924
00:56:28,764 --> 00:56:29,932
బేరసారాలు ఆడుతూ ఉండండి.

925
00:56:30,849 --> 00:56:32,434
తప్పకుండా. థ్యాంక్యూ.

926
00:56:33,894 --> 00:56:35,812
"తప్పకుండా. థ్యాంక్యూ."

927
00:56:49,993 --> 00:56:51,328
పాల్.

928
00:56:52,955 --> 00:56:54,039
పాల్.

929
00:56:57,626 --> 00:56:58,752
చెప్పు, ట్రే.

930
00:57:00,379 --> 00:57:02,463
మేము డబ్బులిస్తాం. కిడ్నాపర్ అడిగిన డబ్బు ఇస్తాం.

931
00:57:02,464 --> 00:57:04,466
గట్టిగా చెప్పు. ఏమన్నావు?

932
00:57:05,300 --> 00:57:07,594
కిడ్నాపర్ అడిగిన డబ్బు ఇస్తాం, పాల్ అంకుల్.

933
00:57:08,595 --> 00:57:09,679
నిజంగానా?

934
00:57:09,680 --> 00:57:11,849
సందేహమే అక్కర్లేదు.

935
00:57:16,770 --> 00:57:19,438
- థ్యాంక్యూ.
- మరేం పర్వాలేదు.

936
00:57:19,439 --> 00:57:22,484
చల్లగా ఉండండి.

937
00:57:23,026 --> 00:57:24,569
నాకు కూడా కావాలి.

938
00:57:24,570 --> 00:57:25,654
చల్లగా ఉండండి.

939
00:57:27,614 --> 00:57:28,699
డిటెక్టివ్.

940
00:57:29,867 --> 00:57:31,159
రేపు ఉదయం...

941
00:57:31,785 --> 00:57:34,537
నేను బ్యాంక్ కి వెళ్తా...

942
00:57:34,538 --> 00:57:37,999
ఆ తర్వాత... ఏం చేయగలమో చూద్దాం.

943
00:57:38,000 --> 00:57:39,542
- సరే.
- ఇంకేమైనా అవసరం అవుతాయా?

944
00:57:39,543 --> 00:57:41,419
లేదు, ఇది ఓకే. హా.

945
00:57:41,420 --> 00:57:43,005
ఇలాంటి పరిస్థితులని ఎదుర్కొనేలా
మాకు ట్రెయినింగ్ ఇస్తారు.

946
00:57:43,964 --> 00:57:45,507
మేము కైల్ ని మీకు అప్పగిస్తాము.

947
00:57:46,425 --> 00:57:48,134
మీరు ఇచ్చే డబ్బుతో పాటుగా.

948
00:57:48,135 --> 00:57:51,220
సరే మరి, అందరం కాసేపు పడుకుందాం.
అది మనకి చాలా అవసరం.

949
00:57:51,221 --> 00:57:52,471
సరే.

950
00:57:52,472 --> 00:57:54,056
- గుడ్ నైట్.
- గుడ్ నైట్.

951
00:57:54,057 --> 00:57:55,184
కానిద్దాం.

952
01:00:29,213 --> 01:00:30,214
హలో?

953
01:00:31,048 --> 01:00:32,882
యో. చికెన్ సిద్ధంగా ఉందా?

954
01:00:32,883 --> 01:00:34,717
ఎలా కావాలి? బిర్యానీ కావాలా? కర్రీ కావాలా?

955
01:00:34,718 --> 01:00:36,969
పిచ్చి పిచ్చి జోకులేసే సమయం కాదు ఇది.

956
01:00:36,970 --> 01:00:40,097
నేను డబ్బు గురించి మాట్లాడుతున్నానని
తెలుసు కదా. ఎక్కడ ఉంది అది?

957
01:00:40,098 --> 01:00:41,599
- హా, సిద్ధంగా ఉంది.
- సరే.

958
01:00:41,600 --> 01:00:45,186
ఉదయం పదకొండు గంటలకి,
బరో హాల్ లో, బలిసినోళ్లు ఉండే మాన్హాటన్ కి వెళ్లే

959
01:00:45,187 --> 01:00:46,979
హై-స్పీడ్ ట్రెయిన్ ఎక్కు.

960
01:00:46,980 --> 01:00:50,525
మొదటి బోగీ ఎక్కు. నీ ఫోన్ తెచ్చుకో.
నీకు ఎలా వెళ్ళాలి, ఏంటి అన్నది మెసేజ్ చేస్తూ ఉంటా.

961
01:00:50,526 --> 01:00:52,902
కైల్ సంగతేంటి? నేను ముందు కైల్ ని చూడాలి.

962
01:00:52,903 --> 01:00:55,154
హా, సమయం వచ్చినప్పుడు చూస్తావు.

963
01:00:55,155 --> 01:00:56,822
కంగారుపడకు, సోదరా.

964
01:00:56,823 --> 01:00:58,366
ఇంకో విషయం,

965
01:00:58,367 --> 01:01:01,786
ఆ డబ్బుతో పాటు నీ భార్య వేసుకునే
కార్టియేర్ బ్రేస్ లెట్ కూడా వేయి.

966
01:01:01,787 --> 01:01:03,246
దాని గురించి నీకెలా తెలుసు?

967
01:01:03,247 --> 01:01:06,916
ఎందుకంటే, ఆమె ఎప్పుడూ దాన్ని ఆన్ లైన్లో చూపిస్తూనే
ఉంటుంది. నీ భార్యకి చూపించుకోవడం అంటే భలే ఇష్టం, కదా?

968
01:01:06,917 --> 01:01:09,669
గ్రామీ అవార్డ్స్ ఫంక్షన్లో రెడ్ కార్పెట్ మీద
తెగ చూపించేసుకుంది.

969
01:01:09,670 --> 01:01:12,296
ఈరోజుల్లో ప్రైవేట్ అంటూ ఏమీ లేదు, డేవిడ్.

970
01:01:12,297 --> 01:01:13,881
అది ఇవ్వలేను. అది నేను ఇవ్వలేను, బ్రదర్.

971
01:01:13,882 --> 01:01:15,633
భలేవాడివే. అడిగినంత డబ్బులు ఇస్తున్నా కదా.

972
01:01:15,634 --> 01:01:17,386
డబ్బులు ఇస్తా, కానీ అది...

973
01:01:18,512 --> 01:01:21,264
అది మా పెళ్లయి 15 ఏళ్ళైన సందర్బంగా
ఎంతో ప్రేమతో తీసుకున్న కానుక అది.

974
01:01:21,265 --> 01:01:23,015
ఏం చేయాలో, ఎలా చేయాలో నువ్వు కాదు చెప్పాల్సింది.

975
01:01:23,016 --> 01:01:24,934
నేను చెప్తా, నువ్వు విను, అంతే!

976
01:01:24,935 --> 01:01:26,979
ముసలి పిరికి సన్నాసి!

977
01:01:30,941 --> 01:01:31,984
అదన్నమాట సంగతి.

978
01:01:41,702 --> 01:01:45,246
వీడు సబ్వేలో ఎక్స్ ఛేంజీ చేసేంత
పిచ్చోడని ఎవరికైనా అనిపిస్తోందా?

979
01:01:45,247 --> 01:01:46,873
బహుశా ఏదైనా స్టేషన్లో చేస్తాడేమో.

980
01:01:46,874 --> 01:01:49,417
మిస్టర్ కింగ్ ని అటూఇటూ తిప్పాలని
ఇలా చేస్తున్నట్టున్నాడు.

981
01:01:49,418 --> 01:01:51,669
బహుశా ఎక్స్ ఛేంజీకి, సబ్వేకి సంబంధం లేదేమో?

982
01:01:51,670 --> 01:01:53,087
ఎక్కడైతే ఏంటి?

983
01:01:53,088 --> 01:01:55,424
- మాకు అది ముఖ్యం.
- హా.

984
01:02:17,070 --> 01:02:18,237
ఏంటి ప్లాన్?

985
01:02:18,238 --> 01:02:22,992
డబ్బును నల్ల జోర్డన్ బ్రాండ్ బ్యాగ్లో పెడతాం,
అందులో ఒక ట్రాకింగ్ పరికరం కూడా ఉంటుంది.

986
01:02:22,993 --> 01:02:25,286
మీ అందరూ మీ ఐ-ఫోన్లతో ఫాలో అవ్వండి.

987
01:02:25,287 --> 01:02:28,247
మిస్టర్ కింగ్ డబ్బును ఇచ్చిన వెంటనే,
కిడ్నాపర్ ని మేము ట్రాక్ చేస్తాం,

988
01:02:28,248 --> 01:02:30,082
వెంటనే అతడిని పట్టుకుంటాం.

989
01:02:30,083 --> 01:02:32,460
నేను మిస్టర్ కింగ్ తోనే ఉంటాను.

990
01:02:32,461 --> 01:02:34,921
మిగతా రైలును ఒక టీమ్ కవర్ చేస్తుంది.

991
01:02:34,922 --> 01:02:39,884
బరో హాల్ లో మనం ఎక్కే స్టేషన్ నుండి, ఆ తర్వాత వచ్చే
ప్రతీ స్టేషన్లో మా రేడియో మోటర్ పెట్రోల్ వాహనాలను

992
01:02:39,885 --> 01:02:41,844
ముందే సెట్ చేసి ఉంటాం, ఆ స్టేషన్ల పేర్లు:

993
01:02:41,845 --> 01:02:43,387
వాల్ స్ట్రీట్,

994
01:02:43,388 --> 01:02:45,473
యూనియన్ స్క్వేర్, గ్రాండ్ సెంట్రల్,

995
01:02:45,474 --> 01:02:51,312
59వ, 86వ, 125వ, 149వ, 161వ స్ట్రీట్,

996
01:02:51,313 --> 01:02:55,399
యాంకీ స్టేడియం, ఇక చివరి స్టాప్ అయిన వుడ్ లాన్.

997
01:02:55,400 --> 01:02:59,153
దీని వలన, స్టేషన్ల బయట పోలీసులు రంగంలోకి దిగాల్సిన
పరిస్థితి ఏర్పడినప్పుడు, వెంటనే దిగే వీలు మాకు లభిస్తుంది.

998
01:02:59,154 --> 01:03:01,989
మిస్టర్ క్రిస్టఫర్, మీరు మా వేరే టీమ్ తో పాటు వస్తారు.

999
01:03:01,990 --> 01:03:04,158
మేము కైల్ ని కనిపెట్టి, అతడిని దక్కించుకున్నప్పుడు,

1000
01:03:04,159 --> 01:03:08,246
మీ ఇద్దరినీ అబ్జర్వేషన్ కోసం, ఇంకా విచారణ కోసం
ఒక చోటికి తీసుకెళ్లడం జరుగుతుంది.

1001
01:03:08,247 --> 01:03:11,749
భద్రతకే తొలి ప్రాధాన్యత అని గమనించాలి.

1002
01:03:11,750 --> 01:03:14,877
ఆ తర్వాతే డబ్బు.

1003
01:03:14,878 --> 01:03:16,712
ఇక షురూ చేద్దాం.

1004
01:03:16,713 --> 01:03:19,049
- కింగ్ పరివారానికి ఒక క్షణం ఏకాంతం ఇద్దాం.
- హా.

1005
01:03:20,801 --> 01:03:22,510
- హేయ్.
- చెప్పు.

1006
01:03:22,511 --> 01:03:23,887
హీరోలా సాహసాలు ఏమీ చేయకు.

1007
01:03:24,930 --> 01:03:26,390
పని కానించుకుని, ఇంటికి వచ్చేయ్, సరేనా?

1008
01:03:30,519 --> 01:03:32,103
- ఇక బయలుదేరుతా.
- లవ్ యూ.

1009
01:03:32,104 --> 01:03:33,355
లవ్ యూ డబుల్.

1010
01:03:36,775 --> 01:03:38,151
ఇక వెళదాం పదండి.

1011
01:03:39,194 --> 01:03:40,236
సరే మరి.

1012
01:03:40,237 --> 01:03:41,989
కంగారుపడకండి. మేము చూసుకుంటాంగా.

1013
01:04:01,633 --> 01:04:02,717
ఆ బండిలో ఎక్కాలి మీరు.

1014
01:04:02,718 --> 01:04:05,554
మీరు, నేను, డిటెక్టివ్ బెల్ ఈ కార్లో వెళదాం.

1015
01:04:06,972 --> 01:04:08,140
తల జాగ్రత్త.

1016
01:05:01,318 --> 01:05:03,445
2025 సీజన్ - యాంకీస్
ఇప్పుడే టికెట్లను సంపాదించండి!

1017
01:05:13,288 --> 01:05:18,085
అత్యవసర సమయాల్లో బయటకు వెళ్ళు మార్గం
అనుమతి లేకుండా ఉపయోగించడం నిషేధం

1018
01:05:28,929 --> 01:05:30,930
మెట్రో సిస్టమ్ లోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నారు.

1019
01:05:30,931 --> 01:05:32,641
బరో హాల్

1020
01:06:00,294 --> 01:06:01,712
అక్కడ కూర్చోండి.

1021
01:06:08,051 --> 01:06:10,678
ఇది మాన్హాటన్ కి వెళ్లే హై-స్పీడ్ ట్రెయిన్.

1022
01:06:10,679 --> 01:06:13,223
తదుపరి స్టాప్, బౌలింగ్ గ్రీన్.

1023
01:06:15,392 --> 01:06:18,312
దయచేసి మూసుకునే తలుపులకి దూరంగా నిలబడండి.

1024
01:06:19,605 --> 01:06:21,439
విద్వేషానికి చోటు లేదన్నది ఆనందకరమైన విషయమే*

1025
01:06:21,440 --> 01:06:22,900
*[ఇది రెడ్ సాక్స్ టీమ్ కి వర్తించదు].

1026
01:07:00,479 --> 01:07:01,772
యూనియన్ స్క్వేర్

1027
01:07:40,018 --> 01:07:43,689
సైరన్లను మోగించండి! పదండి! వేగంగా పోనివ్వండి! ఛ!

1028
01:07:48,402 --> 01:07:49,944
42వ స్ట్రీట్

1029
01:07:49,945 --> 01:07:51,363
గ్రాండ్ సెంట్రల్

1030
01:08:31,904 --> 01:08:33,572
ఇరగదీసేయండి, యాంకీస్!

1031
01:08:34,281 --> 01:08:35,782
ఇరగదీసేయండి, యాంకీస్!

1032
01:08:36,950 --> 01:08:39,535
తొక్కలో బోస్టన్! తొక్కలో బోస్టన్!

1033
01:08:39,536 --> 01:08:41,455
ఇరగదీసేయండి, యాంకీస్!

1034
01:08:42,456 --> 01:08:44,041
ఇరగదీసేయండి, యాంకీస్!

1035
01:08:45,125 --> 01:08:47,335
తొక్కలో బోస్టన్! తొక్కలో బోస్టన్!

1036
01:08:47,336 --> 01:08:48,962
ఇరగదీసేయండి, యాంకీస్!

1037
01:08:49,837 --> 01:08:51,840
ఇరగదీసేయండి, యాంకీస్!

1038
01:08:52,549 --> 01:08:55,135
తొక్కలో బోస్టన్! తొక్కలో బోస్టన్!

1039
01:09:04,520 --> 01:09:09,357
వాళ్ళు ఇప్పుడే 149వ స్ట్రీట్ స్టేషన్ నుండి
బయలుదేరారు, ఇంకా ఉత్తరం వైపుకు వెళ్తూనే ఉన్నారు.

1040
01:09:09,358 --> 01:09:10,692
{\an8}నేషనల్ ప్యూర్టో రికన్ డే పరేడ్ ఇంకార్పొరేటెడ్

1041
01:09:12,569 --> 01:09:15,531
సోదరసోదరీమణులారా, సోదరసోదరీమణులారా, ఇక అల్లాడించండి.

1042
01:09:28,377 --> 01:09:31,421
అందానికే అందమైన, మంచి మనసున్న మన రోసీ పెరేజ్ కి

1043
01:09:32,089 --> 01:09:35,341
అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ టాప్ లేపేయండి.

1044
01:09:37,301 --> 01:09:40,304
అలాగే మన ఆరడుగుల సుందరాంగుడు, ప్రతిభావంతుడైన,

1045
01:09:40,305 --> 01:09:44,393
ఆంథోనీ రామోస్ కి కూడా
గట్టిగా చప్పట్లు కొడుతూ టాప్ లేపేయండి.

1046
01:09:46,270 --> 01:09:49,021
అలాగే ఎదురులేని, లెజెండరీ...

1047
01:09:49,022 --> 01:09:53,694
ఎడ్డీ పాల్మియేర్ తో పాటు సాల్సా ఆర్కెస్ట్రాకి కూడా
చప్పట్లు కొడుతూ టాప్ లేపేయండి!

1048
01:09:57,990 --> 01:10:00,450
ఒకటి, రెండు, ఒకటి, రెండు, మూడు, నాలుగు!

1049
01:10:10,043 --> 01:10:11,795
ఇరగదీసేయండి, యాంకీస్!

1050
01:10:15,215 --> 01:10:17,009
ఇరగదీసేయండి, యాంకీస్!

1051
01:10:19,511 --> 01:10:22,013
- హలో?
- బోగీ వెనుకకు పద.

1052
01:10:22,014 --> 01:10:24,348
- బోగీల మధ్యకు రా.
- బోగీల మధ్యకా?

1053
01:10:24,349 --> 01:10:26,767
- బ్యాగుని కూడా నీతో పాటు తీసుకురా.
- బోగీల మధ్యకు రావాలా?

1054
01:10:26,768 --> 01:10:28,853
అవునురా, సన్నాసి. చెవులు వినబడి చావట్లేదా?

1055
01:10:28,854 --> 01:10:32,356
బుర్ర పని చేయట్లేదా?
నేను మాట్లాడేది సంస్కృతమా అర్థం కాకపోవడానికి?

1056
01:10:32,357 --> 01:10:34,568
- త్వరగా పద.
- వెళ్తున్నా, వెళ్తున్నా.

1057
01:10:37,196 --> 01:10:38,739
అతను బోగీని వదిలి వెళ్తున్నాడు.

1058
01:10:43,535 --> 01:10:44,870
ప్యూర్టో రికో

1059
01:10:47,623 --> 01:10:50,875
హా, ఓకే, నేను వచ్చేశా. ఇప్పుడు బ్యాగ్ ని వదిలేయనా?

1060
01:10:50,876 --> 01:10:52,627
లేదు! ఆ పని చెప్పినప్పుడు చేయి.

1061
01:10:52,628 --> 01:10:54,921
- ఏంటి?
- నేను చెప్పినప్పుడు బ్యాగ్ ని వదిలేయ్.

1062
01:10:54,922 --> 01:10:56,839
- హా, కానీ నేను...
- దగ్గర్లోనే ఉన్నావులే.

1063
01:10:56,840 --> 01:10:59,634
- కైల్ ఎక్కడ?
- ముందు బ్యాగ్ ని వదిలేయాలి.

1064
01:10:59,635 --> 01:11:01,261
ముందు నేను కైల్ ని చూడాలి.

1065
01:11:09,978 --> 01:11:11,522
ఇరగదీసేయండి, యాంకీస్!

1066
01:11:34,837 --> 01:11:36,504
బ్యాగ్ ఎక్కడుందో కనిపిస్తోంది.

1067
01:11:36,505 --> 01:11:39,800
రివర్ అవెన్యూలో 157వ వీధిలో ఉన్నాడు.
యాంకీ స్టేడియమ్ వైపు వెళ్తున్నాడు.

1068
01:11:53,689 --> 01:11:55,481
డబ్బుల బ్యాగ్ దొరికిందా? నాకేం కనిపించలేదు!

1069
01:11:55,482 --> 01:11:58,442
- కంగారుపడకండి! బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ ఉంది!
- నేను దాన్ని వదల్లేదు, అదే జారి పడింది!

1070
01:11:58,443 --> 01:12:00,570
బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ ఉంది!

1071
01:12:00,571 --> 01:12:02,489
- పదండి, వేగంగా పదండి.
- పోలీసులం, దారి ఇవ్వండి!

1072
01:12:10,664 --> 01:12:13,208
బోస్టన్ గాళ్ళు ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు!

1073
01:12:14,418 --> 01:12:16,962
బోస్టన్ గాళ్ళు ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు!

1074
01:12:28,682 --> 01:12:30,099
తప్పుకోండిరా!

1075
01:12:30,100 --> 01:12:31,727
పరేడ్లంటే నాకు మహా చిరాకు! తప్పుకోండి!

1076
01:12:35,856 --> 01:12:37,357
పక్కకు జరగండి!

1077
01:12:43,947 --> 01:12:46,491
ఆ జెండా ఇవ్వండి!
ఇక్కడి నుండి దొబ్బేయండి! తప్పుకోండి!

1078
01:12:47,534 --> 01:12:49,036
కారుకు అడ్డు తప్పుకోండి!

1079
01:13:12,601 --> 01:13:14,394
జరగండిరా! ఛ!

1080
01:13:39,211 --> 01:13:41,338
ఛ!

1081
01:13:45,717 --> 01:13:47,009
మనల్ని ఏమార్చడానికి బ్యాగ్ వేరొకరికి ఇచ్చాడు.

1082
01:13:47,010 --> 01:13:49,137
వీడి సంగతి నేను చూసుకుంటా.
మోటర్ సైకిల్ పై వెళ్తున్నాడు. ఏ సమస్యా లేదు.

1083
01:13:57,437 --> 01:13:58,981
యాంకీ స్టేడియమ్

1084
01:13:59,982 --> 01:14:01,733
{\an8}ఆరన్ జడ్జ్
న్యూయార్క్ యాంకీస్ టీమ్ కెప్టెన్

1085
01:14:14,246 --> 01:14:15,454
జీపీఎస్ సిగ్నల్ పోయింది

1086
01:14:15,455 --> 01:14:17,457
అబ్బా! నీ యెంకమ్మ! ఛ!

1087
01:14:21,837 --> 01:14:23,462
{\an8}డేవిడ్, నీ డబ్బులు
నీకు అప్పగిస్తాం, నేను మాటిస్తున్నా.

1088
01:14:23,463 --> 01:14:25,047
{\an8}- పక్కాగా ఎలా చెప్తున్నారు?
- నాకు తెలుసది.

1089
01:14:25,048 --> 01:14:26,757
నాకు కూడా చెప్పండి ఎలాగో.

1090
01:14:26,758 --> 01:14:30,344
- బ్రిడ్జెస్, ఉన్నావా?
- హా, నేను మిస్టర్ కింగ్ తో ఉన్నా.

1091
01:14:30,345 --> 01:14:33,140
నాకు మోటర్ సైకిల్ కనిపించట్లేదు.
నాకు అతను కనిపించట్లేదు.

1092
01:15:04,713 --> 01:15:06,173
కనిపించాడు చచ్చినోడు!

1093
01:15:08,008 --> 01:15:10,092
వెంటనే మరికొన్ని యూనిట్లను పంపండి!

1094
01:15:10,093 --> 01:15:12,596
కాలినడకన డ్యూటీ చేస్తున్న
పోలీసులు కావాలి! వెంటనే! తక్షణమే!

1095
01:15:26,902 --> 01:15:30,322
దొరికావురా, చచ్చినోడా! దొరికావు నాకు!

1096
01:15:31,323 --> 01:15:33,450
దొరికావురా, ముష్టి వెధవా!

1097
01:15:34,618 --> 01:15:36,745
హా, పారిపో, లేదంటే చస్తావు!

1098
01:15:44,586 --> 01:15:45,587
ఛ!

1099
01:15:46,421 --> 01:15:48,006
అడ్డు జరగండి!

1100
01:15:51,802 --> 01:15:53,929
జరగండి! అడ్డు తప్పుకోండి!

1101
01:16:02,145 --> 01:16:04,231
అడ్డు జరగండి! పట్టుకోండి వాడిని!

1102
01:16:05,440 --> 01:16:07,901
సంకెళ్లు వేయండి! కామెడీ చేస్తున్నావా, హా?

1103
01:16:09,069 --> 01:16:11,238
ఈ బ్యాగ్ ఇవ్వరా! బ్యాగ్ ఇవ్వు!

1104
01:16:11,738 --> 01:16:13,156
మోకాళ్ళ మీద కూర్చో!

1105
01:16:15,158 --> 01:16:17,034
ఏంటి? మజాక్ చేస్తున్నావా? టాంపోన్?

1106
01:16:17,035 --> 01:16:19,245
జోక్ అనుకుంటున్నావా ఇదంతా, హా?

1107
01:16:19,246 --> 01:16:21,247
నీకు పీరియడ్స్ వస్తున్నాయా, దరిద్రుడా?

1108
01:16:21,248 --> 01:16:22,624
దొబ్బేయండి!

1109
01:16:27,045 --> 01:16:29,255
ఎడ్డీ! ఎడ్డీ! ఎడ్డీ! ఎడ్డీ!

1110
01:16:29,256 --> 01:16:40,058
ఎడ్డీ! ఎడ్డీ! ఎడ్డీ! ఎడ్డీ!

1111
01:16:47,024 --> 01:16:49,901
- బ్రిడ్జెస్.
- హిగ్గిన్స్, చెప్పు, చెప్పు.

1112
01:16:49,902 --> 01:16:51,903
- బ్రిడ్జెస్, లైన్లో ఉన్నావా?
- బ్యాగ్ ఎక్కడ?

1113
01:16:51,904 --> 01:16:54,280
బ్యాగులో డబ్బులు లేవు.

1114
01:16:54,281 --> 01:16:56,616
మళ్ళీ చెప్తున్నా, బ్యాగులో డబ్బులు లేవు.

1115
01:16:56,617 --> 01:16:59,369
- అయ్య బాబోయ్!
- ఛ.

1116
01:17:17,638 --> 01:17:19,181
- హేయ్.
- హేయ్.

1117
01:17:21,058 --> 01:17:22,350
- బాగానే ఉన్నారా?
- హా.

1118
01:17:22,351 --> 01:17:24,102
హా. కైల్ ఎలా ఉన్నాడు?

1119
01:17:25,229 --> 01:17:26,395
మనోడికి కొంచెం గాయాలు అయి ఉన్నాయి.

1120
01:17:26,396 --> 01:17:30,942
{\an8}న్యూయార్క్ పోలీసులకు
అతను యాంకీ స్టేడియమ్ దగ్గర కనిపించాడు,

1121
01:17:30,943 --> 01:17:33,361
అబ్జర్వేషన్ కోసం అతడిని ఆసుపత్రికి పంపించారు,

1122
01:17:33,362 --> 01:17:35,404
అక్కడ రెండు రోజులు ఉంచుతారట.

1123
01:17:35,405 --> 01:17:37,823
మంచిది. మంచిది. అది చాలా మంచి విషయం.

1124
01:17:37,824 --> 01:17:40,743
- అతడిని త్వరలోనే చూడగలమని ఆశిస్తున్నా.
- నేను కూడా.

1125
01:17:40,744 --> 01:17:43,163
- నువ్వు ఎలా ఉన్నావు?
- బాగానే ఉన్నా.

1126
01:17:43,789 --> 01:17:45,457
- డబ్బు సంగతేంటి?
- వాళ్ళు...

1127
01:17:47,000 --> 01:17:48,209
దాన్ని సంపాదించే పనిలోనే ఉన్నారట.

1128
01:17:48,210 --> 01:17:50,921
- వార్తలని, సోషల్ మీడియాని చూశావా?
- లేదు.

1129
01:17:53,048 --> 01:17:56,133
ఎక్కడ చూసినా నీ గురించే.
అందరూ నిన్ను సూపర్ హీరో అంటున్నారు.

1130
01:17:56,134 --> 01:17:58,345
బూగీ డౌన్ బ్రాంక్స్ ముద్దు బిడ్డ.

1131
01:18:00,639 --> 01:18:01,640
బాబోయ్.

1132
01:18:03,100 --> 01:18:05,102
- నీకది నచ్చలేదా?
- లేదు. లేదు. నిజానికి...

1133
01:18:06,144 --> 01:18:07,437
నా పేరు కరెక్టుగానే రాశారు.

1134
01:18:10,607 --> 01:18:13,234
సరే. నేను పైకెళ్ళి బట్టలు మార్చుకుంటా.
కాసేపయ్యాక కలుస్తా మిమ్మల్ని.

1135
01:18:13,235 --> 01:18:14,736
- సరే.
- లవ్ యూ.

1136
01:18:17,698 --> 01:18:19,283
బ్రుక్లిన్ హాస్పిటల్ సెంటర్

1137
01:18:20,534 --> 01:18:23,786
మరి నిన్ను కట్టేసి ఉంచిన గది గురించి చెప్పగలవా?

1138
01:18:23,787 --> 01:18:26,623
ఏదైనా శబ్దం వినిపించిందా?
లేదా నీకు ఏమైనా వాసన వచ్చిందా?

1139
01:18:27,624 --> 01:18:29,793
వాసన కాస్త గమ్మత్తుగా అనిపించింది.

1140
01:18:30,878 --> 01:18:34,214
అక్కడ డ్రగ్స్ ఉన్నాయి. గంజాయి.

1141
01:18:35,507 --> 01:18:37,133
నాకు సంగీతం వినిపించింది.

1142
01:18:37,134 --> 01:18:39,385
చాలా సంగీతం అన్నమాట. ర్యాప్ సంగీతం.

1143
01:18:39,386 --> 01:18:41,013
అంటే, ఎవరి గదిలోనైనా,
క్లబ్బులోనైనా ఉన్నట్టు అనిపించిందా?

1144
01:18:42,472 --> 01:18:45,100
ఆ సంగీతం మరో గది నుండి,
అంటే మరో ఇంట్లో నుండి వస్తూ ఉండింది.

1145
01:18:46,643 --> 01:18:49,980
వాళ్ళు నన్ను కట్టేసి బాత్ టబ్బులో కూర్చోపెట్టారు.

1146
01:18:51,356 --> 01:18:53,107
నాకు ఆ సంగీతం స్పష్టంగా వినిపించింది.

1147
01:18:53,108 --> 01:18:54,610
నిర్దిష్టంగా ఏం సంగీతమో చెప్పగలవా?

1148
01:18:56,570 --> 01:18:57,571
అలా చెప్పడం కష్టం.

1149
01:19:01,450 --> 01:19:06,455
కానీ మాటిమాటికీ ఒక పాట ప్లే అవుతూ ఉండింది,
అది నేను వినడం అదే మొదటి సారి. అదేంటంటే...

1150
01:19:07,623 --> 01:19:08,957
ఏంటంటే...

1151
01:19:19,801 --> 01:19:21,594
కైల్, కైల్.

1152
01:19:21,595 --> 01:19:22,638
ఇంకేమైనా చెప్పగలవా?

1153
01:19:24,890 --> 01:19:26,892
మరేం పర్వాలేదు. నిదానంగా ఆలోచించి చెప్పు, కైల్.

1154
01:19:28,769 --> 01:19:30,102
నేను కాస్త బ్రేక్ తీసుకోవచ్చా?

1155
01:19:30,103 --> 01:19:32,314
ఇంకాసేపు కొనసాగిద్దాం.

1156
01:19:33,023 --> 01:19:36,025
- ఇంకాస్త ప్రయత్నించు, కైల్. ఇంకాస్త...
- క్షమించండి.

1157
01:19:36,026 --> 01:19:38,361
- నాకు ఇంకేం గుర్తు లేదు.
- ఓకే.

1158
01:19:38,362 --> 01:19:40,279
- ఇంకాస్త గుర్తు తెచ్చుకో.
- డిటెక్టివ్,

1159
01:19:40,280 --> 01:19:42,574
కొంచెం సేపు బ్రేక్ తీసుకుందామా?

1160
01:19:43,325 --> 01:19:44,660
కైల్, నాకు తెలుసు ఇది కష్టంగా ఉంటుందని,

1161
01:19:45,661 --> 01:19:48,621
కానీ దీనికి కారణమైన వారిని మనం వేగంగా
కనుక్కోవాలి, ఒక్కో క్షణం గడిచే కొద్దీ,

1162
01:19:48,622 --> 01:19:50,790
- వాళ్ళు తప్పించుకొనే అవకాశం పెరుగుతూ ఉంటుంది.
- నేనన్నది వినబడలేదా?

1163
01:19:50,791 --> 01:19:54,836
నిన్న ట్రేకి విశ్రాంతి అవసరం అయినప్పుడు, మీరందరూ
అతని పక్కని సర్దడానికి కూడా సిద్ధమైపోయారు కదా?

1164
01:19:54,837 --> 01:19:57,004
చూడండి, మీ ఉద్దేశం నాకర్థమైంది, మిస్టర్ క్రిస్టఫర్.

1165
01:19:57,005 --> 01:19:59,173
మీరు నాకు అడ్డు తగులుతూ,
నాకు తలనొప్పిగా మారకండి.

1166
01:19:59,174 --> 01:20:01,467
ఆసుపత్రిలో ఉండి మంచి పనైంది.
ఇక్కడ తలనొప్పికి ఆయింట్మెంట్స్ ఉంటాయి.

1167
01:20:01,468 --> 01:20:04,846
- ఆ ఆయింట్మెంట్ మీకే కావాలేమో.
- లేదు, నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నా, బాసూ.

1168
01:20:04,847 --> 01:20:07,682
- అవునా?
- మనందరికీ కొంచెం సేపు బ్రేక్ అవసరమేమో.

1169
01:20:07,683 --> 01:20:12,271
నేను, నా కొడుకు ఒక నిమిషం ఏకాంతంగా గడపవచ్చా?

1170
01:20:12,938 --> 01:20:15,148
కేవలం మేము ఇద్దరమే ఏకాంతంగా?

1171
01:20:16,441 --> 01:20:18,986
- రండి, మిత్రులారా. వాళ్లకి ఒక నిమిషం బ్రేక్ ఇద్దాం.
- థ్యాంక్యూ.

1172
01:20:20,279 --> 01:20:22,071
పద. రా. పార్టనర్.

1173
01:20:22,072 --> 01:20:23,824
పద. రా. వెళదాం రా.

1174
01:20:25,826 --> 01:20:27,077
బ్రిడ్జెస్.

1175
01:20:43,385 --> 01:20:46,471
పర్వాలేదు. మరేం పర్వాలేదు.

1176
01:20:58,942 --> 01:21:00,109
స్టాకింగ్ హిట్స్

1177
01:21:00,110 --> 01:21:01,736
ఎబొనీ - డేవిడ్ కింగ్

1178
01:21:01,737 --> 01:21:03,237
బిల్ బోర్డు
కింగ్ డేవిడ్, మ్యూజిక్ హిట్స్ లో టాప్ పాటలు

1179
01:21:03,238 --> 01:21:04,698
ద న్యూయార్కర్

1180
01:21:07,910 --> 01:21:09,369
హా. లోపలికి రా, గేబ్.

1181
01:21:10,495 --> 01:21:11,580
డేవిడ్.

1182
01:21:12,998 --> 01:21:14,124
గేబ్.

1183
01:21:16,710 --> 01:21:20,255
- మిషెల్ తో మాట్లాడావా?
- మిషెల్ తో మాట్లాడా, బ్యారీ, లిండ్సీతో కూడా మాట్లాడా.

1184
01:21:21,173 --> 01:21:24,218
ప్రధాన రుణదాతలు, వారి పార్టనర్లు అందరితో మాట్లాడా.

1185
01:21:24,968 --> 01:21:26,219
ఏమంటున్నారు?

1186
01:21:26,220 --> 01:21:28,013
నువ్వు చేసిన పనికి వాళ్ళకి నీపై గౌరవం రెట్టింపయింది,

1187
01:21:29,681 --> 01:21:33,060
కానీ వాళ్ళు బాధ్యత వహించలేమని అంటున్నారు.

1188
01:21:35,312 --> 01:21:38,649
- ఏమంటున్నావు నువ్వు?
- ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది.

1189
01:21:39,816 --> 01:21:42,985
అదే, నువ్వు హై-స్పీడ్ ట్రెయిన్ నుండి
కోటి డెబ్బై అయిదు లక్షల డాలర్లను వదిలేయడం.

1190
01:21:42,986 --> 01:21:44,112
సరే. దానికి, దీనికి సంబంధం ఏంటి?

1191
01:21:45,280 --> 01:21:47,782
ఆ డబ్బులను ఉపయోగించి
నువ్వు స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ లో

1192
01:21:47,783 --> 01:21:51,285
మెజారిటీ వాటా కొనుగోలు చేయాలి,
ఆ డీల్ ఆధారపడి ఉంది దీని పైనే.

1193
01:21:51,286 --> 01:21:53,454
- అవును.
- కాబట్టి ఇప్పుడు డీల్ రద్దయింది.

1194
01:21:53,455 --> 01:21:56,999
డీల్ రద్దయిందా?
నేను వడ్డీ కట్టడానికి డబ్బు సర్దుబాటు చేయగలను.

1195
01:21:57,000 --> 01:21:58,751
నేను ఎలాగోలా అది చేయగలను, గేబ్. అది నీకూ తెలుసు.

1196
01:21:58,752 --> 01:22:00,670
- కష్టాన్ని నమ్ముకున్నోడిని. కష్టపడగలను.
- మామూలుగా అయితే.

1197
01:22:00,671 --> 01:22:02,839
- హా. మామూలుగా అయితే సంపాదించగలవు. హా.
- మామూలుగా అయితేనా?

1198
01:22:02,840 --> 01:22:06,342
అవును. కానీ ఇది మామూలు పరిస్థితి కాదు.
ఒప్పంద ఉల్లంఘన జరిగింది.

1199
01:22:06,343 --> 01:22:08,428
- ఒప్పంద ఉల్లంఘనా?
- అవును. మోసమని కూడా అనవచ్చు.

1200
01:22:13,767 --> 01:22:17,436
మోసమా? అంటే పచ్చి మోసమా? జైలుకు వెళ్లవచ్చా?

1201
01:22:17,437 --> 01:22:18,897
- జైలు.
- కారాగారం.

1202
01:22:20,607 --> 01:22:23,067
బాబోయ్. గేబ్. ఏం మాట్లాడుతున్నావు!

1203
01:22:23,068 --> 01:22:25,820
కారణం ఏంటంటే, నీ పెట్టుబడిదారులు

1204
01:22:25,821 --> 01:22:28,865
నిధుల వినియోగంపై ఒక క్లాజ్ ని జత చేసేలా మాట్లాడారు,

1205
01:22:28,866 --> 01:22:31,784
దాని ప్రకారం వారి పెట్టుబడిని

1206
01:22:31,785 --> 01:22:34,745
అనుకున్న పనికే వాడాలి.

1207
01:22:34,746 --> 01:22:38,082
అది, స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ లోని
మెజారిటీ వాటాను తిరిగి కొనుగోలు చేయడం.

1208
01:22:38,083 --> 01:22:39,917
ఇప్పుడు వాళ్ళు
తమ డబ్బును కట్టమని అడుగుతున్నారు.

1209
01:22:39,918 --> 01:22:41,711
- ఎప్పటిలోపు?
- రెండు వారాలు.

1210
01:22:41,712 --> 01:22:43,171
- రెండు వారాలా?
- తడుముకోకుండా చెప్పా కదా.

1211
01:22:43,172 --> 01:22:44,630
- రెండు వారాలా?
- రెండే వారాలు.

1212
01:22:44,631 --> 01:22:46,507
- రెండు వారాలు.
- ఆ తర్వాత,

1213
01:22:46,508 --> 01:22:49,844
వాళ్ళు వసూలు ప్రక్రియ మొదలుపెడతారు.

1214
01:22:49,845 --> 01:22:51,054
నీ పెంట్ హౌస్,

1215
01:22:52,055 --> 01:22:53,807
శాగ్ హార్బర్ లో ఉన్న నీ ఇల్లు,

1216
01:22:54,516 --> 01:22:57,059
నీ బాస్కియాట్ కలెక్షన్. నీ దగ్గర ఉండే కళాకండాలన్నీ.

1217
01:22:57,060 --> 01:22:58,937
నువ్వు చేసింది చాలా మంచి పని...

1218
01:23:01,398 --> 01:23:02,315
ఇలా జరగడం సబబు కాదు.

1219
01:23:02,316 --> 01:23:05,359
నేను మంచి పని చేశా, కానీ నాకు తృప్తే లేదు, గేబ్.

1220
01:23:05,360 --> 01:23:07,945
నాకు తృప్తి ఎలా దక్కుతుంది?
నాకు తృప్తి కలిగేలా చేయి.

1221
01:23:07,946 --> 01:23:09,864
- అర్థం చేసుకోగలను.
- గేబ్రియెల్. కానివ్వు.

1222
01:23:09,865 --> 01:23:12,158
- అర్థం చేసుకోగలను.
- నేనిలా వెళ్లిపోలేను. నీకూ అది తెలుసు.

1223
01:23:12,159 --> 01:23:13,743
ఏ మనిషి అయినా ఎలా అయితే వచ్చాడో, అలానే వెళ్లిపోకూడదు.

1224
01:23:13,744 --> 01:23:15,746
కాస్తంత విలువను అయినా జోడించాలి.
నువ్వు అలాంటి వాడివి.

1225
01:23:20,667 --> 01:23:21,793
రెండు వారాలు.

1226
01:24:14,137 --> 01:24:16,305
- చెప్పు.
- మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ.

1227
01:24:16,306 --> 01:24:18,516
ఆలెక్స్, ప్యాట్రిక్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు.

1228
01:24:18,517 --> 01:24:19,601
లోపలికి పంపించు.

1229
01:24:22,187 --> 01:24:23,813
మిస్టర్ కింగ్ కలవడానికి సిద్ధంగా ఉన్నారు.

1230
01:24:23,814 --> 01:24:25,648
మీ ఇద్దరినే కలవాలని నేనూ అనుకుంటూ ఉన్నా.

1231
01:24:25,649 --> 01:24:27,609
నేను నేను కాకపోయి ఉంటే, మీలా కావాలని కోరుకునే వాడిని.

1232
01:24:28,360 --> 01:24:31,279
చూడండి, గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనల వలన

1233
01:24:31,280 --> 01:24:33,990
స్ట్రే డాగ్ ఎంటర్ ప్రైజ్ డీల్ ని వేరే యాంగిల్ నుండి చూశా.

1234
01:24:33,991 --> 01:24:38,120
అప్పుడు నేనొక్కడినే ఆ డీల్ ని వ్యతిరేకించా,
కానీ ఇప్పుడు మనస్సు మార్చుకున్నా.

1235
01:24:41,331 --> 01:24:43,000
కాబట్టి డీల్ తో ముందుకు వెళదాం. డీల్ కానిద్దాం.

1236
01:24:44,918 --> 01:24:49,005
అలాగా. నాకు ఇది ముందే తెలిసి ఉంటే,
నీకు ముందే చెప్పి ఉండే వాడిని,

1237
01:24:49,006 --> 01:24:52,092
కానీ డీల్ అంతా అక్కుమ్ బక్కుమ్ అయింది.

1238
01:24:53,093 --> 01:24:54,927
ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?

1239
01:24:54,928 --> 01:24:56,304
అది రద్దయిపోయింది.

1240
01:24:56,305 --> 01:24:57,680
రద్దయిపోయింది అంటే?

1241
01:24:57,681 --> 01:25:00,308
నీకు జరిగిన దురదృష్టకర సంఘటన తర్వాత,

1242
01:25:00,309 --> 01:25:02,101
నేను కూడా మనస్సు మార్చుకున్నా.

1243
01:25:02,102 --> 01:25:05,731
మాకు డీల్ ఓకే కాదని స్ట్రే డాగ్ ఎంటర్ప్రైజెస్ కి చెప్పా.

1244
01:25:09,651 --> 01:25:12,445
జరిగిన సంఘటన ఆధారంగా డీల్ ని రద్దు చేశావు. ఎందుకు?

1245
01:25:12,446 --> 01:25:16,449
నువ్వు జనాల్లో హీరో అయిపోవడం వల్ల
మళ్ళీ మన కంపెనీకి భారీ పబ్లిసిటీ వచ్చింది.

1246
01:25:16,450 --> 01:25:19,368
మన కేటలాగ్ లో ఉన్న
ఆర్టిస్టుల ఆల్బమ్స్ అమ్మకాలు జోరందుకున్నాయి.

1247
01:25:19,369 --> 01:25:20,828
కాబట్టి, ఎప్పుడూ చెప్తూ ఉండేవాడివి కదా,

1248
01:25:20,829 --> 01:25:24,081
"ఈరోజుల్లో దృష్టిని ఆకర్షించడం ముఖ్యం.
అదే అసలైన కరెన్సీ," అని.

1249
01:25:24,082 --> 01:25:25,876
నీకు తెలీదా? నువ్వు...

1250
01:25:28,212 --> 01:25:31,339
నువ్వు "బూగీ డౌన్ బ్రాంక్స్ ముద్దు బిడ్డవి."

1251
01:25:31,340 --> 01:25:33,050
డైలీ న్యూస్
బూగీ డౌన్ బ్రాంక్స్ ముద్దు బిడ్డ!

1252
01:25:39,473 --> 01:25:41,599
సరే మరి. దీన్ని చాలా తేలిగ్గా తేల్చేస్తా.

1253
01:25:41,600 --> 01:25:44,393
స్ట్రే డాగ్ వాళ్లకి నేనే కాల్ చేసి, వ్యక్తిగతంగా మాట్లాడతా.

1254
01:25:44,394 --> 01:25:47,271
ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందో
తేలేదాకా ఆ పని చేయకపోవడమే మంచిది.

1255
01:25:47,272 --> 01:25:49,941
మనకి ఎంత డబ్బు రావచ్చో ఎవరికి తెలుసు?

1256
01:25:49,942 --> 01:25:52,068
ఎంత డబ్బు రావచ్చోనా...
చూడు, నాకు ఈ డబ్బులు ఇప్పుడే కావాలి.

1257
01:25:52,069 --> 01:25:55,280
ఈ క్షణమే, ఇప్పటికిప్పుడే కావాలి.
చాలా అర్జంటుగా కావాలి. ఇప్పుడే కావాలి.

1258
01:25:56,406 --> 01:25:57,323
అర్థమైంది.

1259
01:25:57,324 --> 01:25:59,867
ఇది భలే కామెడీగా ఉంది.

1260
01:25:59,868 --> 01:26:03,162
రెండ్రోజుల క్రితం ఈ డీల్ ని ముందుకు
సాగనివ్వకుండా చేయాలని నువ్వు ప్రయత్నించినప్పుడు,

1261
01:26:03,163 --> 01:26:04,581
- నీకు డబ్బుల అవసరం లేదుగా.
- ఆలెక్స్!

1262
01:26:12,714 --> 01:26:14,049
అర్థమైంది.

1263
01:26:14,633 --> 01:26:17,218
ప్యాట్రిక్, ఇతనికి చెప్పేశావు కదా నువ్వు?

1264
01:26:17,219 --> 01:26:18,679
నువ్వు నాకు మరో దారి ఇవ్వలేదు.

1265
01:26:19,471 --> 01:26:22,515
ట్రేకి జరిగినది బయటకు వచ్చినప్పుడు,
ఆలెక్స్ నాకు చాలాసార్లు కాల్ చేశాడు,

1266
01:26:22,516 --> 01:26:24,725
- నా ఉద్దేశం ఏంటో కనుక్కుందామని.
- దేని గురించి?

1267
01:26:24,726 --> 01:26:26,352
మన సంస్థకి వస్తున్న అటెన్షన్ గురించి.

1268
01:26:26,353 --> 01:26:29,647
అయితే, నా కొడుకుని కిడ్నాప్ చేయడం వల్ల
మన సంస్థకి వస్తున్న అటెన్షన్ గురించి

1269
01:26:29,648 --> 01:26:31,524
మీరిద్దరూ మాట్లాడుకున్నారు అన్నమాట.

1270
01:26:31,525 --> 01:26:33,651
లేదు. అలా అర్థం చేసుకోకు.

1271
01:26:33,652 --> 01:26:36,279
ఇంకెలా అర్థం చేసుకోవాలి? వాడిని చంపకుండా,
వాడి పుర్రె పేల్చేయకుండా ఉండటం మంచిదైంది.

1272
01:26:36,280 --> 01:26:37,780
- ధనవంతులైపోయి ఉండేవారు.
- డేవిడ్!

1273
01:26:37,781 --> 01:26:40,116
- హ్యాంప్టన్స్ లో పోష్ ఇల్లు కట్టుకుని ఉండేవారు.
- డేవిడ్, ఆపు!

1274
01:26:40,117 --> 01:26:42,660
- ఏం ఆపాలి?
- నువ్వు చేసేదే కరెక్ట్ అని అనుకోవడం ఆపేయ్.

1275
01:26:42,661 --> 01:26:45,955
మీ ఇంటి లాబీలో కూర్చొని,
కైల్ చనిపోతే, ప్రజల్లో వచ్చే వ్యతిరేకత

1276
01:26:45,956 --> 01:26:48,499
కొంత కాలం తర్వాత
పోతుందని నాకు నచ్చజెప్పలేదా నువ్వు!

1277
01:26:48,500 --> 01:26:50,626
అది వేరు. అప్పుడు నేను...

1278
01:26:50,627 --> 01:26:53,754
అప్పుడు నాలో నేను మాట్లాడుకుంటున్నా,
అది నీకూ తెలుసు. పరిష్కారం కనుగొనే పనిలో ఉన్నా.

1279
01:26:53,755 --> 01:26:55,923
నేను కూడా అదే పనిలో ఉన్నా. అందుకే కాల్ చేశా నీకు.

1280
01:26:55,924 --> 01:26:57,884
నీ పరిస్థితి మారిందని నాకు తెలీదు.

1281
01:26:57,885 --> 01:27:00,094
- కాబట్టి, నన్ను బలి చేస్తున్నావా?
- లేదు.

1282
01:27:00,095 --> 01:27:01,889
నన్ను నేను కాపాడుకునే ప్రయత్నం చేశా.

1283
01:27:02,514 --> 01:27:04,975
ఈ రంగంలో, ఎవరూ కాపాడరని నాకు తెలుసు కాబట్టి.

1284
01:27:22,993 --> 01:27:24,036
ఆలెక్స్!

1285
01:27:45,390 --> 01:27:47,017
ఛ.

1286
01:28:58,172 --> 01:29:00,173
నువ్వు ఆగులే. నేను చూసుకుంటా.

1287
01:29:00,174 --> 01:29:03,217
సరే. త్వరగా కానివ్వండి. త్వరగా కానివ్వాలి.

1288
01:29:03,218 --> 01:29:04,677
సారీ. సారీ.

1289
01:29:04,678 --> 01:29:06,888
- అతనికేం తెలుసో తెలుసుకోవాలని వచ్చానంతే.
- దేవుడా!

1290
01:29:06,889 --> 01:29:10,433
- కింగ్, ఏంటి సంగతి?
- నేను ఇతనికి ఒకటి వినిపించాలి, అంతే.

1291
01:29:10,434 --> 01:29:13,978
మిస్టర్ కింగ్, మిస్టర్ కింగ్, మేము ఇక్కడ
ఇతని నుండి కొత్త సమాచారాన్ని సంపాదించే పనిలో ఉన్నాం.

1292
01:29:13,979 --> 01:29:15,606
హా, అర్థం చేసుకోగలను. అర్థం చేసుకోగలను.

1293
01:29:16,857 --> 01:29:19,735
నువ్వు... నువ్వు బందీగా
ఉన్నప్పుడు విన్న పాట ఇదేనా?

1294
01:29:29,661 --> 01:29:32,121
- దేవుడా. మీకెలా తెలుసు?
- ఇతనే, కదా?

1295
01:29:32,122 --> 01:29:34,790
- ఏంటి?
- ఇతని పేరు యంగ్ ఫెలన్. ఇతనొక ర్యాపర్.

1296
01:29:34,791 --> 01:29:37,460
మా అబ్బాయి ట్రే నాకు ఇచ్చిన ప్లేలిస్టులో
ఇతని పాట కూడా ఉంది.

1297
01:29:37,461 --> 01:29:39,962
ఇదే గొంతు, ఫోన్లో మనం విన్న గొంతు కూడా ఇదే.
ఇతనే మనకి కావాల్సింది.

1298
01:29:39,963 --> 01:29:43,049
పక్కాగా చెప్పలేం, మిస్టర్ కింగ్. ఈరోజుల్లో
కొత్త ర్యాపర్ల గొంతులన్నీ నాకు ఒకేలా వినిపిస్తాయి.

1299
01:29:43,050 --> 01:29:45,801
- ఈ జోకర్ గాడిని ఇంతకుముందు ఒకసారి చూశా.
- ఏంటి?

1300
01:29:45,802 --> 01:29:48,387
- వీడొకసారి నా దగ్గరికి వచ్చాడు.
- ఎక్కడో, ఎప్పుడో గుర్తుందా?

1301
01:29:48,388 --> 01:29:50,765
ముఖం ఒక్కటే గుర్తుంది.
అప్పుడే నాకు ఏదో తేడాగా అనిపించాడు.

1302
01:29:50,766 --> 01:29:52,934
నిన్ను కలవాలని అడిగాడు,
అతను ఉండేది మన ప్రాంతంలోనే అని చెప్పాడు.

1303
01:29:52,935 --> 01:29:54,519
అతని అధికారిక పేరు ఏంటో తెలుసా?

1304
01:29:54,520 --> 01:29:56,521
కింగ్ ని కలవాలని నా దగ్గరికి
ఎప్పుడూ జనాలు వస్తూనే ఉంటారు.

1305
01:29:56,522 --> 01:30:00,525
- వాళ్ళ ఊర్లు పేర్లు నేను పెద్దగా అడగను.
- ఇది కిడ్నాపరే అయ్యుండొచ్చు, డిటెక్టివ్.

1306
01:30:00,526 --> 01:30:03,444
హా, కానీ ర్యాపర్ ఎవరో తెలిసినంత మాత్రాన,
అతనే దోషి అని చెప్పలేం కదా.

1307
01:30:03,445 --> 01:30:06,239
నేను చెప్తున్నా కదా, ఇతనే. ఏ గొంతునైనా
ఇట్టే పసిగట్టేయగలనని నాకు పేరు ఉంది.

1308
01:30:06,240 --> 01:30:09,158
విన్నప్పుడే నాకు అర్థమైపోయింది.
అతని మాటల్లో నాకు తెగింపు కనిపించింది. అతనే.

1309
01:30:09,159 --> 01:30:11,577
గొంతు వినగానే నాకు అర్థమైపోయింది,
మనకి కావాల్సింది ఇతనే.

1310
01:30:11,578 --> 01:30:13,246
ఎవడు వీడు?
నేను అడిగినట్టు ఎవరికీ చెప్పవద్దు

1311
01:30:13,247 --> 01:30:15,122
- ఇతనే. గొంతు తెలిసిపోతోంది.
- కావచ్చు.

1312
01:30:15,123 --> 01:30:16,416
కాదని ఎవరూ అనట్లేదు.

1313
01:30:17,000 --> 01:30:18,918
ఆగు. ఒక్క నిమిషం ఆగు.
మన దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, కదా?

1314
01:30:18,919 --> 01:30:21,128
- హా.
- ఓకే, ఫోరెన్సిక్స్ వాళ్ళు

1315
01:30:21,129 --> 01:30:22,463
ఈ రెంటినీ పోల్చి చెప్పగలరు కదా.

1316
01:30:22,464 --> 01:30:24,048
ఏఐ ద్వారా కూడా చెక్ చేయవచ్చు, కదా?

1317
01:30:24,049 --> 01:30:27,051
హా, మేము ఫోరెన్సిక్స్ కి పంపగలం.
ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు, కానీ పంపుతాం.

1318
01:30:27,052 --> 01:30:29,011
నాకు పక్కాగా తెలుసు,
కాబట్టి ఏఐ మళ్ళీ నిర్ధారించాల్సిన పని లేదు.

1319
01:30:29,012 --> 01:30:31,597
- నాకు సంగీతం బాగా తెలుసు, పక్కాగా ఇతనే.
- మిస్టర్ కింగ్, నాకేం తెలుసో మీకు తెలుసా?

1320
01:30:31,598 --> 01:30:33,808
నాకు పోలీసుల పని తెలుసు, సరేనా?
ఈ కేసులు ఎలా సాగుతాయో కూడా తెలుసు.

1321
01:30:33,809 --> 01:30:36,519
కాబట్టి కైల్ ని ఇంటర్వ్యూ చేసే
మా పనిని మమ్మల్ని చేసుకోనిస్తారా?

1322
01:30:36,520 --> 01:30:39,981
ఆ తర్వాత మీరు ఇచ్చిన క్లూ సంగతి చూస్తాం, ప్రామిస్.
దాన్ని చూడాల్సిన తరుణం వచ్చినప్పుడు చూస్తాం.

1323
01:30:39,982 --> 01:30:41,441
ప్లీజ్. మిమ్మల్ని వేడుకుంటున్నా.

1324
01:30:43,318 --> 01:30:46,153
- ఇది ప్రోటోకాల్.
- ప్లీజ్.

1325
01:30:46,154 --> 01:30:49,365
- వచ్చినందుకు థ్యాంక్స్.
- థ్యాంక్స్, మిస్టర్ కింగ్.

1326
01:30:49,366 --> 01:30:51,577
- థ్యాంక్యూ, మిస్టర్ కింగ్.
- థ్యాంక్యూ.

1327
01:30:58,959 --> 01:31:00,043
కింగ్.

1328
01:31:04,298 --> 01:31:07,008
- పక్కాగా అతనే అని అనుకుంటున్నావా?
- అనుకోవడం కాదు. నాకు తెలుసు. గొంతు పసిగట్టేశా.

1329
01:31:07,009 --> 01:31:09,427
- అతనే అని పక్కాగా తెలుసు.
- ఈ పోలీసులని పట్టించుకోవద్దు.

1330
01:31:09,428 --> 01:31:10,804
వెళ్లి మన డబ్బు తెచ్చుకుందాం పద.

1331
01:31:11,847 --> 01:31:14,516
- హా, కానీ ఈ కుర్రాడి ఆచూకీ ఎలా తెలుస్తుంది?
- బస్తీ వాళ్లకి తెలిసి ఉంటుంది.

1332
01:31:17,853 --> 01:31:19,438
నేను పంపిన మెసేజ్ చూశావా?

1333
01:31:21,148 --> 01:31:22,191
అతనే అని పక్కానా?

1334
01:31:23,483 --> 01:31:24,484
ఎక్కడ?

1335
01:31:25,819 --> 01:31:27,862
సరే. ఈ విషయంలో నీకు రుణపడి ఉంటా.

1336
01:31:27,863 --> 01:31:30,448
- అతను ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ?
- దొరికాడు. 804 ఫారెస్ట్ అవెన్యూ.

1337
01:31:30,449 --> 01:31:32,451
- పాత బస్తీలో ఉన్నాడు.
- అతనే.

1338
01:32:20,874 --> 01:32:21,875
యాంకీ స్టేడియమ్

1339
01:32:35,556 --> 01:32:36,765
ఏంటది?

1340
01:32:38,392 --> 01:32:39,393
ఎందుకైనా మంచిదని.

1341
01:32:40,269 --> 01:32:41,687
ఇది ఉంటే మనకేమీ కాదు.

1342
01:32:45,941 --> 01:32:48,943
ఎక్కడ ఉన్నారు?
నేను ఇక్కడ ఉన్నా. అతడిని చూడలేదు.

1343
01:32:48,944 --> 01:32:51,362
- ఇదిగో 100 డాలర్లు. నా కారును చూసుకో.
- అలాగే, సర్.

1344
01:32:51,363 --> 01:32:54,074
హా. చాలా చాలా థ్యాంక్స్.
నేను చూసుకుంటా. నేను చూసుకుంటా.

1345
01:33:24,438 --> 01:33:27,941
- హలో? మీకేం కావాలి?
- ఎలా ఉన్నారు, మేడమ్?

1346
01:33:30,110 --> 01:33:32,403
దేవుడా. ఓరి దేవుడా.

1347
01:33:32,404 --> 01:33:35,448
మీరెవరో నాకు తెలుసు. నాకు తెలుసు మీరెవరో.

1348
01:33:35,449 --> 01:33:38,701
ఇందాకే మిమ్మల్ని టీవీలో చూశా.
కిడ్నాప్ చేసింది మీ వారినే, కదా?

1349
01:33:38,702 --> 01:33:41,287
- అవును.
- పోలీసులు మీ డబ్బును వెతికి పెట్టారనే ఆశిస్తున్నా.

1350
01:33:41,288 --> 01:33:42,873
నేను కార్లో ఎదురు చూస్తుంటా.

1351
01:33:43,540 --> 01:33:45,791
- చల్లగా ఉండండి. సారీ.
- థ్యాంక్యూ.

1352
01:33:45,792 --> 01:33:49,379
- నేను లోపలికి రావచ్చా?
- హా, నా పేరు రోసా. దయచేసి లోపలికి రండి.

1353
01:33:55,969 --> 01:33:57,471
నేను బిడ్డని పడుకోపెట్టి వచ్చా.

1354
01:33:58,972 --> 01:34:00,515
మా బిడ్డకి ఆర్చీ మీ పేరే పెట్టాడు.

1355
01:34:00,516 --> 01:34:01,724
ఆర్చీ?

1356
01:34:01,725 --> 01:34:03,267
అతని స్టేజీ పేరు, యంగ్ ఫెలన్.

1357
01:34:03,268 --> 01:34:06,354
కానీ అతడిని యంగ్ ఫెలన్ అని
పిలవడం నాకు ఇష్టం లేదు.

1358
01:34:06,355 --> 01:34:08,815
ఇలాగే చట్టవ్యతిరేక పనులు చేస్తుంటే,

1359
01:34:09,566 --> 01:34:11,484
బొక్కలో వేస్తారని చెప్పా.

1360
01:34:11,485 --> 01:34:13,611
- ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
- స్థూడియోలో ఉన్నాడు.

1361
01:34:13,612 --> 01:34:16,155
రెండు వారాల నుండి అక్కడే ఉంటున్నాడని చెప్పవచ్చు.

1362
01:34:16,156 --> 01:34:18,699
ఓరి దేవుడా. అతను పిచ్చోడు అయిపోతాడు.

1363
01:34:18,700 --> 01:34:20,910
- ఆనందం పట్టలేక ఎగిరెగిరి గంతులేస్తాడు.
- ఎందుకలా అంటున్నారు?

1364
01:34:20,911 --> 01:34:22,745
మీరు అతనికి దేవునితో సమానం.

1365
01:34:22,746 --> 01:34:25,206
మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడు.

1366
01:34:25,207 --> 01:34:28,501
మీ పాడ్ కాస్ట్ వింటాడు. మీ ఇంటర్వ్యూలన్నీ చూస్తాడు.

1367
01:34:28,502 --> 01:34:31,254
- మీ గురించి అతనికి అన్నీ తెలుసు.
- నిజంగానా?

1368
01:34:31,255 --> 01:34:34,465
కింగ్ డేవిడ్ అతని కోసం వస్తాడని,
అతడిని గుర్తిస్తాడని, మా జీవితాన్ని మార్చేస్తాడని

1369
01:34:34,466 --> 01:34:37,426
ఎన్నో ఏళ్ళ నుండి చెప్తూనే ఉన్నాడు.
దాన్ని నేను కూడా నమ్మాను.

1370
01:34:37,427 --> 01:34:40,805
జైలు నుండి వచ్చినప్పటి నుండి
సంగీతాన్నే పట్టుకుని కూర్చున్నాడు.

1371
01:34:40,806 --> 01:34:43,140
జైల్లో ఉన్నప్పుడు, నేను కాకుండా

1372
01:34:43,141 --> 01:34:45,602
అతనికి జీవితం మీద ఆశ కలిగేలా చేసింది
సంగీతం మాత్రమే అని అన్నాడు.

1373
01:34:47,062 --> 01:34:49,398
నాకు అతనికి కాల్ చేసి చెప్పేయాలనుంది.
ఇది మామూలు విషయం కాదు.

1374
01:34:50,107 --> 01:34:52,234
నేను అతడిని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నా.

1375
01:34:53,402 --> 01:34:55,903
సూడియోకి వెళ్తా. దాని చిరునామా ఇవ్వండి.

1376
01:34:55,904 --> 01:34:59,490
ఈ వీధి మలుపు దగ్గరే ఉంటుంది అది.
333 ట్రినిటీ అవెన్యూ.

1377
01:34:59,491 --> 01:35:01,742
బేస్మెంట్లోకి వెళ్తే, అక్కడొక ఎర్ర తలుపు కనిపిస్తుంది.

1378
01:35:01,743 --> 01:35:04,036
- ఓకే.
- ఇప్పుడు అతను అక్కడే ఉన్నాడు.

1379
01:35:04,037 --> 01:35:08,208
ఓకే. అది చాలా బాగుంది.

1380
01:35:08,917 --> 01:35:10,043
నిన్న తెచ్చిచ్చాడు.

1381
01:35:10,669 --> 01:35:12,461
- నిన్ననా?
- అవును.

1382
01:35:12,462 --> 01:35:15,798
ఇది ఎక్కడి నుండి తెచ్చాడో నాకు తెలీదు,
అది నేను అడగలేదు కూడా,

1383
01:35:15,799 --> 01:35:19,594
- కానీ ఇది కార్టియేర్ కాదని మాత్రం నాకు పక్కాగా తెలుసులే.
- మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా?

1384
01:35:19,595 --> 01:35:21,888
నా భార్యకి అలాంటిదే తీసుకుందామని అనుకుంటున్నా...

1385
01:35:21,889 --> 01:35:24,223
- దేవుడా. తప్పకుండా. ఫోటో తీసుకోండి.
- ...మా మ్యారేజ్ యానివర్సరీకి.

1386
01:35:24,224 --> 01:35:25,559
నా చేయి బాగా కనిపించేలా తీయండి.

1387
01:35:27,644 --> 01:35:28,644
థ్యాంక్యూ.

1388
01:35:28,645 --> 01:35:31,397
మీ భార్యని ఆన్ లైన్లో చూశా.
తను చాలా అందంగా ఉంటుంది.

1389
01:35:31,398 --> 01:35:32,940
మీరు అదృష్టవంతులు.

1390
01:35:32,941 --> 01:35:34,151
థ్యాంక్యూ.

1391
01:35:35,027 --> 01:35:36,611
నేను అదృష్టవంతుడినే.

1392
01:35:36,612 --> 01:35:40,740
మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది,
ఎందుకంటే ఆర్చీ చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు.

1393
01:35:40,741 --> 01:35:42,366
ఈమధ్య తేడాగా ప్రవర్తిస్తున్నాడు.

1394
01:35:42,367 --> 01:35:44,160
అతను ఆశ కోల్పోతున్నాడేమో అనిపిస్తోంది.

1395
01:35:44,161 --> 01:35:47,080
అతడిని చాలా కాలం నుండి నడిపిస్తోంది ఆశ మాత్రమే.

1396
01:35:47,789 --> 01:35:51,542
నేను ఈమధ్యే తల్లిని అవ్వడం, మీరు నా ఇంటికి రావడం,

1397
01:35:51,543 --> 01:35:53,253
ఇవన్నీ సంకేతాలుగా అనిపిస్తున్నాయి.

1398
01:35:54,796 --> 01:35:57,716
మీరు చాలా మంది జీవితాలను వృద్ధి బాటలోకి తెచ్చారు.

1399
01:35:59,718 --> 01:36:01,011
దేవుడు మంచి వాడు.

1400
01:36:13,357 --> 01:36:14,441
అది ఇలా ఇవ్వు.

1401
01:36:15,275 --> 01:36:17,694
- అదా? అదంటే?
- ...45 క్యాలిబర్ తుపాకీ.

1402
01:36:26,954 --> 01:36:28,330
అదేంటి?

1403
01:36:29,581 --> 01:36:31,249
యమపాశం.

1404
01:36:31,250 --> 01:36:32,709
దేవుడా.

1405
01:36:57,317 --> 01:36:58,735
ఈ పని ఎలా చేద్దాం?

1406
01:37:02,906 --> 01:37:05,658
- కింగ్, నన్ను ఫాలో అవుతావా?
- నువ్వు రావట్లేదు.

1407
01:37:05,659 --> 01:37:08,369
- అంటే?
- అంటే, దీనిలో నేను ఇరుక్కోవడానికి కారణం నేనే.

1408
01:37:08,370 --> 01:37:10,413
కాబట్టి బయటకు కూడా
నా అంతట నేనే వస్తా. నువ్వు రాకు.

1409
01:37:10,414 --> 01:37:12,748
ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నేను నీతో వచ్చా.

1410
01:37:12,749 --> 01:37:14,417
ఇక్కడికి మనిద్దరం కలిసే వచ్చాం.

1411
01:37:14,418 --> 01:37:17,045
అతను కైల్ ని ఏం చేశాడో చూశావుగా. నేను...

1412
01:37:18,672 --> 01:37:20,716
ఉన్న మాట చెప్పేస్తున్నా.
వీడి మక్కెలు విరగ్గొట్టాలని ఉంది నాకు.

1413
01:37:24,595 --> 01:37:27,681
- ముందు భాగానికి వచ్చి ఉండు.
- పనయ్యాక నేను అక్కడికే వస్తా.

1414
01:38:07,221 --> 01:38:09,056
పిట్ బుల్ ఉంది జాగ్రత్త

1415
01:40:19,811 --> 01:40:21,230
ఓయ్, ఏమైంది?

1416
01:40:24,942 --> 01:40:27,777
అయితే, నా కోసం బయట పోలీసులేమైనా వేచి ఉన్నారా?

1417
01:40:27,778 --> 01:40:29,195
నన్నెలా కనిపెట్టావు?

1418
01:40:29,196 --> 01:40:32,241
నిన్ను పెద్ద కష్టపడకుండానే కనిపెట్టేశాలే.
నీ మంచి పాట ఒకటి విన్నా.

1419
01:40:32,783 --> 01:40:35,701
ఓకే, మరి ఎలా అనిపించింది?

1420
01:40:35,702 --> 01:40:38,163
- నువ్వు చాలా ఎత్తుకు ఎదగగలవు.
- ఎదగగలనా?

1421
01:40:38,872 --> 01:40:40,498
ఏం మాట్లాడుతున్నావయ్యా? చెవులు పని చేస్తున్నాయా?

1422
01:40:40,499 --> 01:40:43,668
నా సంగీతం కత్తిలా ఉంటుంది.
బయట అలజడి సృష్టిస్తోంది.

1423
01:40:43,669 --> 01:40:46,337
ఎదగగలను కాదు, ఎదిగేశా.
నా సంగీతానికి వచ్చే ఆదరణే దానికి రుజువు.

1424
01:40:46,338 --> 01:40:49,924
నా ఏరియాలో నాకు సన్నిహితులైన నా జాతి వాళ్ళున్నారు,
ఇంకా ముఠాలు, వీధి రౌడీలుగా కూడా కొందరు ఉన్నారు.

1425
01:40:49,925 --> 01:40:52,426
వాళ్ళు నా పట్ల అసలు సిసలైన ప్రేమ చూపిస్తారు,
తోటి సోదరునిగా ఆదరిస్తారు.

1426
01:40:52,427 --> 01:40:54,929
వాళ్ళు నా ప్రధాన అభిమానులు. నాకు అది చాలు.

1427
01:40:54,930 --> 01:40:57,098
నీ అభిమానుల పరిధిని పెంచుకోవాలనుందా?
ఒకసారి ఆలోచించి చూడు.

1428
01:40:57,099 --> 01:40:58,975
వాళ్ళు మహా అయితే 50 మంది ఉంటారు.

1429
01:40:58,976 --> 01:41:00,185
వాళ్ళు నీ పట్ల ప్రేమ కురిపిస్తారు.

1430
01:41:01,061 --> 01:41:02,144
కానీ నీకు డబ్బులేమైనా ఇస్తారా?

1431
01:41:02,145 --> 01:41:04,606
వాళ్ళ వల్ల నీకు ఆర్థికంగా
ఏమైనా లాభం ఉందా? ఉందో, లేదో చెప్పు.

1432
01:41:05,232 --> 01:41:07,692
వాళ్ళు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, బాసూ.
నా దగ్గర ఇప్పుడు డబ్బులు బాగానే ఉన్నాయి.

1433
01:41:07,693 --> 01:41:09,485
ఎన్ని ఉన్నాయేంటి? పదిహేడున్నరనా?

1434
01:41:09,486 --> 01:41:11,696
- కరెక్టుగా చెప్పావు.
- పక్కానా?

1435
01:41:11,697 --> 01:41:13,531
- పక్కా.
- పదిహేడున్నర లాభమా?

1436
01:41:13,532 --> 01:41:15,784
- స్విస్ ఫ్రాంక్స్.
- వాటితో ఇక్కడి నుండి వెళ్లిపోగలనని అనుకుంటున్నావా?

1437
01:41:16,535 --> 01:41:18,494
- నువ్వే చూస్తావుగా.
- తప్పు చేయడం ఎవరు నేర్పారు, బ్రదర్?

1438
01:41:18,495 --> 01:41:21,415
నీలో సత్తా లేదని ఎవరు చెప్పారు?
నీ మనస్సు విరగ్గొట్టింది ఎవరు?

1439
01:41:22,457 --> 01:41:25,501
- మీ నాన్న ఎక్కడ?
- వాడి ప్రస్తావన ఎందుకు!

1440
01:41:25,502 --> 01:41:27,545
అయితే, అతను కూడా
నువ్వు చేసిన పనులే చేశాడా, అంతేనా?

1441
01:41:27,546 --> 01:41:29,714
అతడిని తలదన్నాలనుకుంటున్నావా?
అతనికన్నా పిస్తా అవ్వాలనుందా?

1442
01:41:29,715 --> 01:41:31,383
అతనికన్నా ఎక్కువ కాలం
జైల్లో గడపాలనుకుంటున్నావా?

1443
01:41:32,009 --> 01:41:34,051
ఎంత కాలం గడపాలనుకుంటున్నావు?
దశాబ్దాలా? ఏళ్లా? ఎంత కాలం?

1444
01:41:34,052 --> 01:41:37,138
- ఏం చెప్పమంటావు, గురూ?
- నాకేం కావాలన్నది ముఖ్యం కాదు.

1445
01:41:37,139 --> 01:41:39,515
నీకేం కావాలన్నది ముఖ్యం. ఒక సలహా ఇవ్వనా?

1446
01:41:39,516 --> 01:41:42,268
సలహానా? చెప్పు ఏంటో.

1447
01:41:42,269 --> 01:41:44,770
ఎలాగూ ఇక్కడే ఉన్నాం కదా, చెప్పేయ్. విని పెడతా.

1448
01:41:44,771 --> 01:41:47,273
కోరస్ లో, కాస్తంత స్వేచ్ఛ తీసుకో.

1449
01:41:47,274 --> 01:41:49,776
వోకల్స్ ని వేరుగా లేయర్ చేయి. ఉదాహరణకు...

1450
01:41:50,652 --> 01:41:52,653
నా డబ్బులు ఎక్కడరా?

1451
01:41:52,654 --> 01:41:54,655
నా దగ్గర ఒక బుల్లి తుపాకీ ఉంది

1452
01:41:54,656 --> 01:41:56,073
పిచ్చి పిచ్చి వేషాలు వేయకు

1453
01:41:56,074 --> 01:41:58,869
అలాంటిదేమైనా ప్రయత్నించు.
1993, 94లలో నజీర్ చేసినట్టు.

1454
01:42:00,329 --> 01:42:02,079
బాసూ, నువ్వు అంతా
పాతకాలపు ట్రెండ్ గురించి చెప్తున్నావు...

1455
01:42:02,080 --> 01:42:03,831
లేదమ్మా. ఇప్పుడెలా ఉండాలంటే...

1456
01:42:03,832 --> 01:42:07,835
నా దగ్గర కూడా ఒక తుపాకీ ఉంది, పెద్ద పిస్తా బాబూ
కాబట్టి నా దగ్గర తోక జాడించకు, పెద్ద పిస్తా బాబూ

1457
01:42:07,836 --> 01:42:10,379
నా దగ్గర కూడా తుపాకీ ఉంది, చిన్న పిస్తా బాబూ
తొమ్మిది మిల్లీమీటర్ల క్యాలిబర్

1458
01:42:10,380 --> 01:42:12,965
నా దగ్గర కూడా తోక జాడించకుండా ఉంటే మంచిది
చాలా కారణాలున్నాయి దానికి

1459
01:42:12,966 --> 01:42:14,091
నువ్వు సంపాదించేలా చేయగలను

1460
01:42:14,092 --> 01:42:15,760
అలా కాకుండా నిన్ను చంపే పరిస్థితికి తీసుకురాకు

1461
01:42:15,761 --> 01:42:17,803
బాబోయ్, ఇప్పుడు మన మధ్య ర్యాప్ పోటీ నడుస్తోందా?

1462
01:42:17,804 --> 01:42:19,597
నేను మహా క్రూరుడిని

1463
01:42:19,598 --> 01:42:21,641
నేను దైవ సమానుడిని
అన్నింటినీ నడిపించేది నేనే

1464
01:42:21,642 --> 01:42:23,684
నీ ఎదుగుదలకి అడ్డు పడాలని నాకు లేదు

1465
01:42:23,685 --> 01:42:26,103
కానీ ఒక్కోసారి ఈ ర్యాప్ ఆటలు
నాకు జూదాన్ని గుర్తుకు తెప్పిస్తాయి

1466
01:42:26,104 --> 01:42:28,564
నేను ధగధగలాడే సూటు
నిగనిగలాడే నల్ల కళ్లద్దాలు వేసుకునే వాడిని

1467
01:42:28,565 --> 01:42:30,692
ఇప్పుడు కొత్త పోర్లు
తుపాకులు, బీర్లు వెంట పడుతున్నా

1468
01:42:31,443 --> 01:42:33,653
కానివ్వు, నువ్వు కూడా చెప్పు. ఏదోకటి చెప్పు.

1469
01:42:33,654 --> 01:42:38,157
నేను నా మనుషులని
ఇంకా నా పెళ్ళాన్ని, బిడ్డని పోషించాలి

1470
01:42:38,158 --> 01:42:40,993
మళ్ళీ జైలుకు వెళ్ళలేను, అర్థమైందా?

1471
01:42:40,994 --> 01:42:43,247
అయితే నీ పనిని సరిగ్గా చేసుకో, ఏది సరైనదో అదే చేయి.

1472
01:42:44,540 --> 01:42:46,207
తల ఎత్తుకుని జీవించు.

1473
01:42:46,208 --> 01:42:48,460
అబ్బో, ఇప్పుడు నువ్వు ర్యాపర్ వి
అయిపోయావా ఏంటి!

1474
01:42:50,170 --> 01:42:51,171
నేనేం ర్యాపర్ ని కాదు.

1475
01:42:53,215 --> 01:42:55,716
- నేను అవకాశం ఇచ్చేవాడిని.
- అవకాశాన్నా?

1476
01:42:55,717 --> 01:42:57,969
దానికి చాలా ఆలస్యమైపోయింది, గురూ.

1477
01:42:57,970 --> 01:43:01,347
నాకు అవకాశం ఇవ్వమని ఎప్పుడో
నీకు అవకాశం ఇచ్చా. కానీ నువ్వు అపహాస్యం చేశావు.

1478
01:43:01,348 --> 01:43:04,433
ఇప్పుడు అక్కర్లేదులే.
ఇప్పుడు బాగానే ఉన్నా. అది ముగిసిన అధ్యాయం.

1479
01:43:04,434 --> 01:43:08,020
మనకి కావాల్సిన దాని కోసం అన్నింటినీ
రిస్కులో పడేయడం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.

1480
01:43:08,021 --> 01:43:09,480
ఆ ఫీలింగ్ నాకు సుపరిచితమే.

1481
01:43:09,481 --> 01:43:12,024
ఏమీ లేకుండా ఉండి, అన్నింటినీ కావాలనుకోవడం.

1482
01:43:12,025 --> 01:43:14,318
- నీ భార్యను కలిశా.
- ఏమంటున్నావు?

1483
01:43:14,319 --> 01:43:15,820
నీ ఇంటికి వెళ్ళా,

1484
01:43:15,821 --> 01:43:18,489
నీ కొడుక్కి నా పేరు పెట్టినందుకు
గర్వంగా ఫీల్ అవుతున్నా.

1485
01:43:18,490 --> 01:43:22,076
దేవుడా! ఆ తిక్కది లొడలొడా వాగుతూనే ఉంటుంది, బ్రదర్.

1486
01:43:22,077 --> 01:43:25,956
- తిక్కది అని ఎందుకు అన్నావు?
- ఛ.

1487
01:43:27,457 --> 01:43:29,542
- తిక్కది అని ఎందుకు అన్నావు?
- ఇక ఆపవయ్యా.

1488
01:43:29,543 --> 01:43:32,336
చూడు, నేను కూడా కొన్ని తప్పులు చేశా.
చాలా పెద్దవి. తప్పులు అందరూ చేస్తారు.

1489
01:43:32,337 --> 01:43:36,216
- నీకు సాయపడాలన్నదే నా ప్రయత్నం.
- నాకు సాయపడతావా? మైండ్ దొబ్బిందా?

1490
01:43:37,009 --> 01:43:39,760
సరే, ఇప్పుడేంటి? నేనెక్కడ ఉంటానో
నీకు తెలుసు. నువ్వెక్కడ ఉంటావో నాకు తెలుసు.

1491
01:43:39,761 --> 01:43:41,804
అయితే ఏంటయ్యా? ఏం చేయాలని నీ ప్లాన్? ఏంటి?

1492
01:43:41,805 --> 01:43:44,098
- ఏంటి?
- నువ్వు డొల్ల మనిషివి.

1493
01:43:44,099 --> 01:43:45,850
లోపల ఒంటరితనంతో నలిగిపోతున్నావు.

1494
01:43:45,851 --> 01:43:47,560
నీ లోపల అంతా నిశ్శబ్దం ఆవరించి ఉంది.

1495
01:43:47,561 --> 01:43:50,229
నీ మనస్సు విరిగి ఉంది. నాకు అది ఫీల్ అవ్వాలనుంది.

1496
01:43:50,230 --> 01:43:52,857
నాకు అది చూడాలనుంది.
నాకు దాని గురించి తెలుసుకోవాలనుంది.

1497
01:43:52,858 --> 01:43:54,525
నీ లోపల ఏముందో నాకు తెలియాలి.

1498
01:43:54,526 --> 01:43:56,569
బయట నువ్వు ఇచ్చే బిల్డప్ అంతా పక్కకు పెట్టేయ్.

1499
01:43:56,570 --> 01:43:58,237
ఎవరు నువ్వు?

1500
01:43:58,238 --> 01:43:59,990
ఒక గమ్మత్తైన విషయం చెప్పనా?

1501
01:44:00,782 --> 01:44:03,242
ఈ క్షణం కోసం ఎంత కాలం
ఎదురుచూశానో నీకు తెలీను కూడా తెలీదు.

1502
01:44:03,243 --> 01:44:06,495
మనిద్దరం ఇలా ల్యాబ్ లో కూర్చుని పని చేసే క్షణం కోసం.

1503
01:44:06,496 --> 01:44:08,456
నేను జైలు నుండి బయటకు వచ్చాక,

1504
01:44:08,457 --> 01:44:11,584
స్టాకింగ్ హిట్స్ ఆఫీసులు,

1505
01:44:11,585 --> 01:44:14,462
రికార్డింగ్ స్థూడియోలు, బిజినెస్ మీటింగ్స్
బయట ఎంతలా నిలబడ్డానో తెలుసా!

1506
01:44:14,463 --> 01:44:17,423
మీ అబ్బాయి ట్రేని సోషల్ మీడియాలో
ఫాలో అవుతున్నా కూడా.

1507
01:44:17,424 --> 01:44:19,509
మీరందరూ ఎక్కడ తింటారు,
ఎక్కడ తిరుగుతుంటారు వంటివి తెలుసుకోవడానికి.

1508
01:44:19,510 --> 01:44:22,011
నిన్ను కలవాలన్న ఆశతో.
నువ్వు ఎదురవుతావు అన్న ఆశతో.

1509
01:44:22,012 --> 01:44:23,638
ఒక్క క్షణం అయినా నా కోసం వెచ్చిస్తావన్న ఆశతో.

1510
01:44:23,639 --> 01:44:24,931
నా సంగీతాన్ని వింటావన్న ఆశతో.

1511
01:44:24,932 --> 01:44:26,934
నేను బ్రుక్లిన్ బ్రిడ్జ్ మీదకి వస్తూ ఉండేవాడిని,

1512
01:44:27,643 --> 01:44:29,644
నిన్ను, నీ టెర్రెస్ ని చూస్తూ ఉండేవాడిని.

1513
01:44:29,645 --> 01:44:31,103
అదే, నువ్వుండే డంబో ఒలింపియా బిల్డింగ్ ని, బాసూ.

1514
01:44:31,104 --> 01:44:33,147
నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలుసని చెప్పా కదా, బాసూ.

1515
01:44:33,148 --> 01:44:34,565
కానీ ఇంత చేసి లాభం లేకుండా పోయింది.

1516
01:44:34,566 --> 01:44:38,528
సంగీత రంగంలో మంచి సంగీతాన్ని
గుర్తించడం నీకు అస్సలు చేత కాదని తెలుసుకున్నా.

1517
01:44:38,529 --> 01:44:41,822
కానీ ఇప్పుడు నా సంగీతాన్ని విన్నావు కదా?
ఇప్పుడు విన్నావు కదా?

1518
01:44:41,823 --> 01:44:44,575
అయితే ఇప్పుడేంటి? ఏం చేద్దామంటావు? ఇప్పుడేం చేద్దాం?

1519
01:44:44,576 --> 01:44:46,954
చేతులని దించు, గురూ. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు.

1520
01:44:47,663 --> 01:44:49,455
పిస్తావా? భయపడాలా ఇప్పుడు నేను?

1521
01:44:49,456 --> 01:44:51,457
నీ మోచేతులు కనిపిస్తున్నాయి, తుపాకీ కూడా కనిపిస్తోంది.

1522
01:44:51,458 --> 01:44:53,334
నీ దగ్గరే కాదు, నా దగ్గర కూడా ఉంది తుపాకీ.

1523
01:44:53,335 --> 01:44:54,502
ఏం చేద్దామనుకుంటున్నావు, బాసూ?

1524
01:44:54,503 --> 01:44:56,003
నువ్వో నేనో తేల్చుకుందాం.

1525
01:44:56,004 --> 01:44:57,505
నీ సత్తా ఏంటో చూపు, బాసూ.

1526
01:44:57,506 --> 01:45:00,926
ఒకటి చెప్పనా, సోదరా?
అనుకున్నవి సాధించడం అనేది చాలా కష్టం.

1527
01:45:02,302 --> 01:45:04,972
ప్రార్థనకి ఉన్న శక్తిని
ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు, బాసూ.

1528
01:45:41,592 --> 01:45:43,010
కింగ్! కింగ్!

1529
01:45:49,766 --> 01:45:53,603
నా కన్ను. నా కన్ను.
నా కంటిలో గాజుముక్క గుచ్చుకుంది!

1530
01:45:53,604 --> 01:45:54,688
నువ్వు వెళ్లి డబ్బు తీసుకురా!

1531
01:45:55,355 --> 01:45:58,108
ఆ దరిద్రుడిని పట్టుకో! ఆ ముష్టి వెధవని పట్టుకో!

1532
01:45:59,568 --> 01:46:00,694
నా కంటిలో గాజుముక్క గుచ్చుకుంది!

1533
01:49:31,697 --> 01:49:33,656
వదులు! నన్ను వదులు, బాసూ!

1534
01:49:33,657 --> 01:49:36,742
ఏం చేస్తున్నావు? నన్ను వదిలేయ్!

1535
01:49:36,743 --> 01:49:39,370
- నిన్ను వదిలి పారేయాలి అసలు!
- కానివ్వు, బాసూ. నాకు ఇక్కడ ఉండాలని లేదు.

1536
01:49:39,371 --> 01:49:40,621
- వదిలేయ్!
- ఏంటి?

1537
01:49:40,622 --> 01:49:42,415
- నన్ను చావనివ్వు!
- నా డబ్బులు ఎక్కడ ఉన్నాయి?

1538
01:49:42,416 --> 01:49:45,126
- నన్ను చావనివ్వు, బాసూ!
- నీ కొడుక్కి నా పేరు పెట్టి బతికిపోయావు.

1539
01:49:45,127 --> 01:49:46,503
పైకి రా.

1540
01:50:01,059 --> 01:50:02,227
కానివ్వు!

1541
01:50:23,081 --> 01:50:25,501
- హిగ్గిన్స్ బాబూ!
- డిటెక్టివ్ బెల్.

1542
01:50:27,503 --> 01:50:29,421
- ఏంటి సంగతి?
- అంతా దైవ కృప.

1543
01:50:30,005 --> 01:50:31,756
మొట్టమొదటగా చూడాల్సింది బెడ్ కిందే అని

1544
01:50:31,757 --> 01:50:34,217
మా వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో, ఏమో!

1545
01:50:34,218 --> 01:50:36,636
మీ వాళ్ళ గురించి నన్ను అడగకు, సరేనా?

1546
01:50:36,637 --> 01:50:38,679
నోరు జాగ్రత్త, పిల్లాడా.

1547
01:50:38,680 --> 01:50:40,057
"పిల్లాడా" అట.

1548
01:50:58,325 --> 01:50:59,701
లోపలికి రండి.

1549
01:51:02,579 --> 01:51:04,747
హేయ్, లోపలికి రండి, మిత్రులారా.
సంకోచించాల్సిన పనే లేదు.

1550
01:51:04,748 --> 01:51:08,417
- ఎలా ఉన్నావు?
- నా పరిస్థితికి బాగానే ఉన్నాను.

1551
01:51:08,418 --> 01:51:11,212
ఆ రోల్స్ రాయిస్ బండికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు
వేయించమని ఎన్నిసార్లు చెప్పా నీకు?

1552
01:51:11,213 --> 01:51:15,342
గుడ్డోళ్ళ రాజ్యంలో ఒంటి కన్నోడే రాజు అవుతాడులే.

1553
01:51:16,468 --> 01:51:17,718
అది నిజమే.

1554
01:51:17,719 --> 01:51:19,971
కానీ అన్నింటినీ గమనించేది మూడో కన్నే.

1555
01:51:19,972 --> 01:51:21,682
అది నిజమే, ఒంటి కన్ను రాక్షసుడా.

1556
01:51:24,268 --> 01:51:25,477
నువ్వు మళ్ళీ...

1557
01:51:26,478 --> 01:51:28,354
నా దగ్గరికి వచ్చి పని చేయడమే
నాకు కావాలని నీకూ తెలుసు కదా.

1558
01:51:28,355 --> 01:51:30,148
అందుకు కృతజ్ఞుడిని, కింగ్.

1559
01:51:31,233 --> 01:51:35,028
కానీ నా కోసం, కైల్ కోసం
నేను ఇంకేదైనా కొత్త పని వెతుక్కుంటే...

1560
01:51:36,530 --> 01:51:37,780
మంచిది అనిపిస్తోంది.

1561
01:51:37,781 --> 01:51:39,282
కాబట్టి, సగౌరవంగా తిరస్కరిస్తున్నా.

1562
01:51:39,283 --> 01:51:40,576
అర్థం చేసుకోగలను.

1563
01:51:41,201 --> 01:51:42,869
- హా.
- అర్థమైంది.

1564
01:51:42,870 --> 01:51:45,371
- నువ్వు బాగానే ఉన్నావా?
- హా. చిన్న చిన్న గాయాలయ్యాయి, అంతే,

1565
01:51:45,372 --> 01:51:47,957
కానీ, బాగానే ఉన్నా.

1566
01:51:47,958 --> 01:51:51,252
నీకు... ధన్యవాదాలు చెప్పే అవకాశం
నాకు ఎప్పుడూ రాలేదు.

1567
01:51:51,253 --> 01:51:53,546
భలేవాడివే. అవసరమైతే
ఇలా మళ్ళీ చేయడానికి ఏ మాత్రం వెనుకాడను.

1568
01:51:53,547 --> 01:51:55,299
నా అండ నీకు ఎప్పుడూ ఉంటుంది.

1569
01:51:55,924 --> 01:51:57,259
నా అండ కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది.

1570
01:51:58,177 --> 01:51:59,635
నాన్నా, ఇది చూశావా?

1571
01:51:59,636 --> 01:52:03,015
బిల్ బోర్డు హాట్ 100 లిస్టులో
టాప్ పది పాటల్లో నాలుగు పాటలు,

1572
01:52:03,682 --> 01:52:05,559
స్టాకింగ్ హిట్స్ ఆర్టిస్టులకి చెందినవే ఉన్నాయి.

1573
01:52:06,768 --> 01:52:08,478
మళ్ళీ 2004 నాటి పరిస్థితినే చూస్తున్నట్టుంది.

1574
01:52:10,731 --> 01:52:12,398
- 2004.
- హా.

1575
01:52:12,399 --> 01:52:14,901
- లేదు.
- టాప్ పది పాటల్లో నాలుగు పాటలంటే మంచి విషయమే అది.

1576
01:52:14,902 --> 01:52:16,028
మంచి విషయమే.

1577
01:52:17,821 --> 01:52:20,656
పాల్, నువ్వు త్వరగా కోలుకుంటావని ఆశిస్తున్నా, సరేనా?
వీళ్ళకి ఒక నిమిషం ఏకాంతం ఇద్దాం.

1578
01:52:20,657 --> 01:52:21,908
సరే.

1579
01:52:21,909 --> 01:52:24,411
హా, కైల్ మాకొక నిమిషం ఏకాంతం ఇవ్వు.

1580
01:52:25,412 --> 01:52:27,748
- హా, రెండు నిమిషాలు ఇవ్వు.
- హా.

1581
01:52:42,638 --> 01:52:44,805
- ఎప్పటికీ.
- చచ్చేదాకా.

1582
01:52:44,806 --> 01:52:46,099
కలకాలం.

1583
01:52:51,021 --> 01:52:52,940
- సరే మరి, బ్రదర్.
- హా.

1584
01:52:54,733 --> 01:52:56,985
- నల్లవాడిగా గర్వంగా బతుకు.
- తప్పకుండా, డార్లింగ్.

1585
01:53:05,869 --> 01:53:07,161
యంగ్ ఫెలన్
దోషి కాదు

1586
01:53:07,162 --> 01:53:28,266
యంగ్ ఫెలన్ ని విడుదల చేయాలి!
యంగ్ ఫెలన్ ని విడుదల చేయాలి!

1587
01:53:28,267 --> 01:53:30,977
పద. త్వరగా రా. పక్కకు తప్పుకో.

1588
01:53:30,978 --> 01:53:32,728
నేను అమాయకుడిని! అమాయకుడిని నేను!

1589
01:53:32,729 --> 01:53:34,438
- అడ్డు జరుగు. ఆపు.
- ఏ తప్పూ చేయలేదు.

1590
01:53:34,439 --> 01:53:37,400
- తప్పుకోండెహె.
- నన్ను వదిలేయండి! హా.

1591
01:53:37,401 --> 01:53:38,902
నేను ఏ తప్పూ చేయలేదు.

1592
01:53:40,028 --> 01:53:41,904
- నేను అమాయకుడిని.
- ఇక చాల్లే, పద.

1593
01:53:41,905 --> 01:53:43,614
- పదవయ్యా, హీరో.
- శాంతి, ప్రేమలదే విజయం.

1594
01:53:43,615 --> 01:53:44,699
యంగ్ ఫెలన్ కి న్యాయం చేయాలి

1595
01:53:44,700 --> 01:53:47,076
సంగీతం కొనసాగుతుంది
కానీ యంగ్ ఫెలన్ జైల్లోనే ఉంటాడు

1596
01:53:47,077 --> 01:53:48,160
న్యాయం కావాలి

1597
01:53:48,161 --> 01:53:50,580
- పద. త్వరగా పద. త్వరగా.
- శాంతి, ప్రేమలదే అంతిమ విజయం.

1598
01:53:50,581 --> 01:53:52,749
- పద. కానివ్వు.
- శాంతి, ప్రేమలదే అంతిమ విజయం, జనులారా!

1599
01:53:53,834 --> 01:53:56,170
నేను తప్పు చేశానా లేదా అన్నది ఆ దేవుడే నిర్ణయిస్తాడు.

1600
01:53:56,795 --> 01:53:59,213
యంగ్ ఫెలన్ ని విడుదల చేయాలి!

1601
01:53:59,214 --> 01:54:01,757
- యంగ్ ఫెలన్ ని విడుదల చేయాలి!
- వెనక్కి తిరిగి, నీ అభిమానులకి బై చెప్పుకో.

1602
01:54:01,758 --> 01:54:03,801
యంగ్ ఫెలన్ ని విడుదల చేయాలి!

1603
01:54:03,802 --> 01:54:05,596
- ఇక పద.
- నేను ఏ నేరమూ చేయలేదు!

1604
01:54:06,889 --> 01:54:08,807
మీరు ఇలా వచ్చినందుకు ధన్యవాదాలు.

1605
01:54:09,516 --> 01:54:12,101
యంగ్ ఫెలన్ లాయర్,
ఇంకా డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసు వాళ్ళు,

1606
01:54:12,102 --> 01:54:14,980
అతని ప్లీ అగ్రిమెంట్లోని వివరాల గురించి
కూలంకషంగా చర్చించుకోవడం ఇప్పుడే ముగించారు.

1607
01:54:15,814 --> 01:54:17,024
విచారణ ఏమీ ఉండదు.

1608
01:54:17,733 --> 01:54:20,151
అయితే, అప్పీల్ కానీ, మీడియా హడావిడి కానీ ఏమీ ఉండదా?

1609
01:54:20,152 --> 01:54:23,571
అతను అడిగిందల్లా ఒక్కటే,
మీతో మాట్లాడే అవకాశం మరొక్కసారి ఇవ్వాలని.

1610
01:54:23,572 --> 01:54:26,158
- నాతో మాట్లాడే అవకాశమా?
- అతను అదే కోరాడు.

1611
01:54:28,994 --> 01:54:31,205
- అతనికి ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది?
- పాతికేళ్ళు.

1612
01:54:33,916 --> 01:54:34,917
చాలదు అది.

1613
01:56:02,045 --> 01:56:03,046
కింగ్ డేవిడ్.

1614
01:56:04,006 --> 01:56:06,049
నిన్ను కలిసి చాలా కాలమైంది. నిన్ను చూడటం బాగుంది.

1615
01:56:06,758 --> 01:56:09,385
- మళ్ళీ.
- ఏం కావాలి నీకు?

1616
01:56:09,386 --> 01:56:11,555
నిజానికి, ఇప్పుడు సీన్ రివర్స్ అన్నమాట,

1617
01:56:12,139 --> 01:56:13,764
నేనే నీకు ఒకటి చేసి పెడతాను.

1618
01:56:13,765 --> 01:56:16,100
- నాకా?
- అవునబ్బా.

1619
01:56:16,101 --> 01:56:18,394
నేను స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ తో డీల్ కుదుర్చుకుని,

1620
01:56:18,395 --> 01:56:20,731
నీ జన్మధన్యం చేయాలని ఫిక్స్ అయ్యా.

1621
01:56:21,315 --> 01:56:23,108
చాలా పెద్ద బిజినెస్ డీల్ ఇది.

1622
01:56:23,901 --> 01:56:27,403
త్వరలోనే నా లాయర్ నిన్ను సంప్రదిస్తాడు.

1623
01:56:27,404 --> 01:56:28,488
ఎక్స్ క్యూజ్ మీ?

1624
01:56:32,075 --> 01:56:35,119
ప్రపంచంలోని కొత్త ఆర్టిస్టుల్లో
ఇప్పుడు నా పాటలే టాప్ స్థానాల్లో నిలుస్తున్నాయి.

1625
01:56:35,120 --> 01:56:38,039
- నిజంగానా?
- అరెస్ట్ తర్వాత నాకు 100 కోట్లకు పైగా స్ట్రీమ్స్ వచ్చాయి.

1626
01:56:38,040 --> 01:56:40,208
అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా.

1627
01:56:40,209 --> 01:56:41,709
అది నిజమా?

1628
01:56:41,710 --> 01:56:43,753
అది నిజంగానే నీకు తెలీదా?

1629
01:56:43,754 --> 01:56:45,838
భలే వింతగా అనిపిస్తోంది నాకు,

1630
01:56:45,839 --> 01:56:48,675
నువ్వు తాజా అప్ డేట్స్ ని ఫాలో అవ్వాలి.
ఈలోకంలోనే ఉన్నావా ఇంతకీ?

1631
01:56:49,384 --> 01:56:51,178
నీ ఇండస్ట్రీ గురించి
అన్నీ తెలుసుకుంటూ ఉండాలి, కింగ్ డేవిడ్.

1632
01:56:52,221 --> 01:56:55,473
ఉన్న విషయం చెప్పేస్తున్నా,
ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.

1633
01:56:55,474 --> 01:56:58,017
అసలు నా నోట మాట రాట్లేదంటే నమ్ము.

1634
01:56:58,018 --> 01:57:00,521
ఈ క్షణం కోసం నేను ఎప్పట్నుంచి
ఎదురుచూస్తున్నానో తెలుసా?

1635
01:57:01,188 --> 01:57:02,648
నాకు ఊహ తెలిసినప్పటి నుండి, బాసూ.

1636
01:57:03,482 --> 01:57:05,650
చడ్డీలు వేసుకుంటున్నప్పటి నుండి
నీలా కావాలని కలలు కన్నా.

1637
01:57:05,651 --> 01:57:07,152
మేమందరం నిన్ను ఆదర్శంగా తీసుకున్నాం.

1638
01:57:08,028 --> 01:57:11,948
చెప్తే అస్సలు నమ్మవు కానీ, నేను అచ్చం నీలా
ఉండేవాడినని, నీకు కవలనేమో అని అమ్మ అనేది.

1639
01:57:11,949 --> 01:57:15,118
- నువ్వు నాకు తండ్రివి అయ్యే అవకాశం కూడా ఉంది.
- కావచ్చు.

1640
01:57:16,245 --> 01:57:18,329
ఇద్దరం ఒకే ప్రాంతంలో, ఒకే కాలనీలో ఉంటాం.

1641
01:57:18,330 --> 01:57:19,665
ఆ అవకాశం ఉంది మరి.

1642
01:57:20,916 --> 01:57:24,126
ఈ ర్యాపింగ్ ని నేను ఎప్పట్నుంచి
చేస్తున్నానో కూడా నాకు గుర్తులేదు, బాసూ.

1643
01:57:24,127 --> 01:57:26,255
చిన్నప్పటి నుండి చేస్తూ ఉన్నా.

1644
01:57:27,005 --> 01:57:28,924
కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.

1645
01:57:29,675 --> 01:57:32,928
నా పెళ్ళాం కూడా, "ఇది మనకి సెట్ కాదు" అనేసింది.

1646
01:57:34,221 --> 01:57:38,057
ఇక నేను సంగీతాన్ని వదిలేద్దామనుకున్నా, బాసూ, తెలుసా?

1647
01:57:38,058 --> 01:57:40,101
నువ్వు కనిపించినప్పుడల్లా
నిన్ను కలవాలని ప్రయత్నించేవాడిని,

1648
01:57:40,102 --> 01:57:42,604
అప్పుడు నువ్వు ఆకాశంలో ఉన్నావు,
నేనేమో పాతాళంలో ఉన్నాను.

1649
01:57:44,398 --> 01:57:46,567
నిన్ను కూడా నాతో పాటు
అధఃపాతాళానికి లాక్కుపోవాలని నిర్ణయించుకున్నా.

1650
01:57:47,860 --> 01:57:50,237
ఇక ఆ తర్వాత, సీన్ కట్ చేస్తే...

1651
01:57:51,280 --> 01:57:53,991
మ్యాజిక్ లా, మాయలా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

1652
01:57:55,033 --> 01:57:57,410
ఇప్పుడు నన్ను సంప్రదించడానికి
ప్రయత్నించని లేబుల్ లేదు,

1653
01:57:57,411 --> 01:58:00,329
నాతో డీల్ కుదుర్చుకోవడానికి,
నా వెంట పడుతున్నారు అందరూ.

1654
01:58:00,330 --> 01:58:03,541
కలలో కూడా సాధ్యం కాని అదిరిపోయే బిజినెస్ ఆఫర్లతో,

1655
01:58:03,542 --> 01:58:07,129
డీల్స్ తో నా లాయర్ ని సంప్రదిస్తున్నారు.
కానీ "అవేం అక్కర్లేదు" అన్నాను.

1656
01:58:08,714 --> 01:58:09,881
నాకు నీతో డీల్ కుదుర్చుకోవాలనుంది.

1657
01:58:09,882 --> 01:58:13,134
నేను నీతో, స్టాకింగ్ హిట్స్ రికార్డ్స్ తో డీల్
కుదుర్చుకోవాలనుకుంటున్నా. ఇద్దరం కలిసి పని చేద్దాం.

1658
01:58:13,135 --> 01:58:16,345
చూడు, నువ్వు నాతో చేతులు కలిపి
ఫరేల్, టింబల్యాండ్ లాంటి వారి స్టయిల్ లో

1659
01:58:16,346 --> 01:58:19,141
సంగీతాన్ని స్వరపరచడంలో సహాయపడవచ్చు...

1660
01:58:19,933 --> 01:58:21,559
బాసూ, మనం...

1661
01:58:21,560 --> 01:58:23,562
వీజీ, బర్డ్ మెన్ లా అల్లాడించవచ్చు.

1662
01:58:24,438 --> 01:58:28,065
డీల్ పై సంతకం చేసి, దాన్ని సీల్ చేసేసి పక్కకు పెట్టేద్దాం,
నీకు ఓకే అయితే ఇద్దరం షేక్ చేద్దాం.

1663
01:58:28,066 --> 01:58:30,818
స్టీవీ వండర్ పాటని ఎలా ప్రస్తావించానో చూశావా, హా?

1664
01:58:30,819 --> 01:58:33,030
హా. కానీ నువ్వు మొత్తం పాటని వినలేదులే.

1665
01:58:35,532 --> 01:58:38,243
నా జీవితంలో నీకు ప్రాముఖ్యతేమీ లేదు,
అది మాత్రం చెప్పగలను.

1666
01:58:41,788 --> 01:58:43,040
నేను...

1667
01:58:44,666 --> 01:58:46,209
నేను స్టాకింగ్ హిట్స్ ని వదిలి వెళ్లిపోతున్నా.

1668
01:58:46,210 --> 01:58:48,336
ఏంటి? నువ్వే కదా స్టాకింగ్ హిట్స్ అంటే.

1669
01:58:48,337 --> 01:58:51,214
నేను సొంతంగా ఒక లేబుల్ ని ప్రారంభిస్తున్నా.
అంటే, కాస్త చిన్నదిలే.

1670
01:58:51,215 --> 01:58:55,092
నా చేతుల్లో ఉండగలిగేది, కుటుంబంతో
కాస్తంత ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఇచ్చేది అన్నమాట.

1671
01:58:55,093 --> 01:58:58,429
కానీ మరింత ముఖ్యంగా, లేదా
అంతే ముఖ్యంగా అని అయినా అనవచ్చు, సంగీతంపై...

1672
01:58:58,430 --> 01:59:00,682
సంగీతంపై మరింత దృష్టిపెట్టగలిగే
అవకాశం ఇచ్చేది అన్నమాట, అంటే...

1673
01:59:01,767 --> 01:59:03,100
మళ్ళీ సంగీతం దగ్గరికి నన్ను చేర్చేది.

1674
01:59:03,101 --> 01:59:06,562
సంగీతంపై దృష్టి పెట్టాలని,
మళ్ళీ దాని దగ్గరికి చేరుకోవాలని చూస్తున్నావా?

1675
01:59:06,563 --> 01:59:08,439
డబ్బు కంటే ముఖ్యమైనది ఏముంటుంది?

1676
01:59:08,440 --> 01:59:10,067
ఆ పని చేస్తే, చేతిలో చిప్ప మిగులుతుంది.

1677
01:59:13,445 --> 01:59:14,612
అవును.

1678
01:59:14,613 --> 01:59:18,116
ఈరోజుల్లో దృష్టిని ఆకర్షించడం ముఖ్యం.
అదే అసలైన కరెన్సీ, బాసూ.

1679
01:59:18,742 --> 01:59:23,663
నాతో డీల్ సెట్ చేసుకుంటే,
సంగీత చరిత్రలో అతిపెద్ద డీల్ కుదుర్చుకున్నట్టే.

1680
01:59:23,664 --> 01:59:24,957
ఒకసారి ఆలోచించు.

1681
01:59:25,707 --> 01:59:27,334
ఎడాపెడా సంపాదించిన సొమ్మంతా, సొమ్ము కాదు.

1682
01:59:35,801 --> 01:59:38,511
అరె. నేనేదో పిచ్చోడిలా, లేదా

1683
01:59:38,512 --> 01:59:42,056
పనికిమాలినోడిలా నన్ను అలా చూడకు.

1684
01:59:42,057 --> 01:59:45,268
మీ దరిద్రులు కనిపెట్టిన ఆటనే నేనూ ఆడుతున్నా.

1685
01:59:45,269 --> 01:59:48,897
అవకాశాన్ని అందిపుచ్చుకో, బాసూ.
ఆలస్యమైపోక ముందే, అవకాశాన్ని వాడుకో.

1686
01:59:54,945 --> 01:59:55,946
నాకు ఆసక్తి లేదు.

1687
01:59:57,614 --> 01:59:58,698
ఆసక్తి లేదా?

1688
01:59:58,699 --> 02:00:01,242
నీ సంగీతంతో నేనేం చేయలేను. అది నాకు సెట్ కాదు.

1689
02:00:01,243 --> 02:00:03,287
ఏంటి? తోటి నల్లవాడు టాప్ స్థానానికి చేరుకుంటే చూడలేవా?

1690
02:00:06,123 --> 02:00:08,249
నీకు నల్లవాళ్ళు ఎదుగుతుంటే
అసూయ కలుగుతుంది అన్నమాట.

1691
02:00:08,250 --> 02:00:11,502
చచ్చిపోరా ముసలి నక్కా. చచ్చిపో.

1692
02:00:11,503 --> 02:00:12,753
బాసూ, ఒకసారి ఆలోచించు.

1693
02:00:12,754 --> 02:00:15,756
కిడ్నాపింగ్ కి ముందు,
నిన్ను పట్టించుకున్న నాథుడే లేడు.

1694
02:00:15,757 --> 02:00:18,009
నీ ముసలి ముఖాన్ని అందరూ మర్చిపోయారు, బాసూ.

1695
02:00:18,010 --> 02:00:21,262
నీ కెరీర్ ని కాపాడా నేను. మళ్ళీ నీ స్టేటస్ ని పెంచా నేను.

1696
02:00:21,263 --> 02:00:23,973
అది నేనే. నీకు మళ్ళీ జీవితం ఇచ్చా.
ఈ యంగ్ ఫెలన్ ఇచ్చాడు నీకు.

1697
02:00:23,974 --> 02:00:26,184
ఇంకెవరూ కాదు. చచ్చిపోరా!

1698
02:00:26,185 --> 02:00:28,477
నీ కొడుకుని కిడ్నాప్ చేసి ఉండాల్సింది.
వాడిని షూట్ చేయకుండా...

1699
02:00:28,478 --> 02:00:30,062
అదృష్టవంతుడివి.

1700
02:00:30,063 --> 02:00:32,607
అందుకే నీ పెళ్ళాన్ని
నేను అప్పుడప్పుడూ కలుస్తుంటా, చచ్చినోడా!

1701
02:00:32,608 --> 02:00:36,402
చచ్చిపో! వెళ్లి గంగలోకి దూకి చచ్చిపోరా!

1702
02:00:36,403 --> 02:00:38,988
నేను లేకుంటే నువ్వు లేవు,
నీకు ఓ జీవితం ఇచ్చా! చచ్చిపోరా!

1703
02:00:38,989 --> 02:00:40,908
నన్ను వదలండి!

1704
02:00:45,787 --> 02:00:47,164
తథాస్తు.

1705
02:00:50,292 --> 02:00:54,504
- మనకి నిజంగానే ఏమీ కాదు కదా?
- హా, ఏమీ కాదు.

1706
02:00:54,505 --> 02:00:56,881
మనం కంగారుపడాల్సిన పని లేదు,
మనకంతా మంచే జరుగుతుంది.

1707
02:00:56,882 --> 02:01:00,009
బేబీ, అంతా బాగానే ఉంది.

1708
02:01:00,010 --> 02:01:01,761
నేను నిజంగానే అడుగుతున్నా.

1709
02:01:01,762 --> 02:01:04,388
- నేను కూడా నిజంగానే చెప్తున్నా.
- ప్లీజ్. జోక్స్ వద్దు.

1710
02:01:04,389 --> 02:01:06,517
- మనం బాగానే ఉన్నామా?
- జేమ్స్ బ్రౌన్ బానే ఉన్నాడా?

1711
02:01:07,518 --> 02:01:10,269
బ్యారీ వైట్? ఆల్ గ్రీన్?

1712
02:01:10,270 --> 02:01:12,063
నువ్వు ఉన్నావే!

1713
02:01:12,064 --> 02:01:14,107
- అరీతా ఫ్రాంక్లిన్ బాగానే ఉందా?
- అరీతా ఫ్రాంక్లిన్ బాగానే ఉందా?

1714
02:01:15,692 --> 02:01:18,403
మరి ట్రే కింగ్?

1715
02:01:35,254 --> 02:01:36,421
అయితే...

1716
02:01:38,966 --> 02:01:40,508
నిన్ను కలవడం బాగుంది.

1717
02:01:40,509 --> 02:01:42,761
- తను నా భార్య, పామ్.
- హలో.

1718
02:01:43,428 --> 02:01:47,515
అతనెవరో నీకు తెలుసు, నా కొడుకు, ట్రే.
నువ్వు గొప్ప సూపర్ స్టార్ అవుతావని అంటున్నాడు వాడు.

1719
02:01:47,516 --> 02:01:52,019
మీ అందరినీ కలవడం బాగుంది.

1720
02:01:52,020 --> 02:01:55,565
ఇతను నా పియానిస్ట్, రికీ.

1721
02:01:55,566 --> 02:01:57,860
- ఎలా ఉన్నారు, రిక్?
- మిమ్మల్ని కలవడం బాగుంది.

1722
02:02:02,739 --> 02:02:04,031
{\an8}"సూలా..."

1723
02:02:04,032 --> 02:02:05,366
{\an8}ఆర్టిస్ట్/గాయని

1724
02:02:05,367 --> 02:02:06,659
"సూలా జేనీ జిమ్మీ."

1725
02:02:06,660 --> 02:02:11,080
అవును. మా అమ్మకి టోనీ మోరిసన్,
ఇంకా జోరా నీల్ హర్స్టన్ అంటే చాలా ఇష్టం.

1726
02:02:11,081 --> 02:02:13,207
నాకు "బ్లూయెస్ట్ ఐ" అంటే చాలా ఇష్టం.

1727
02:02:13,208 --> 02:02:15,877
మీ కుటుంబమంతా సాహిత్య ప్రేమికులతో నిండిపోయినట్టుంది.

1728
02:02:15,878 --> 02:02:18,796
అదేం కాదు. మా నాన్న రోలింగ్ స్టోన్ అన్నమాట.

1729
02:02:18,797 --> 02:02:20,674
అంటే, ఒక చోట కుదురుగా ఉండడని సరదాగా అలా చెప్పా.

1730
02:02:22,426 --> 02:02:24,177
మా కుటుంబంలో సంగీతం
ఎప్పట్నుంచో అంతర్భాగంగా ఉంది.

1731
02:02:24,178 --> 02:02:26,762
గాయకులు, కంపోజర్లు, సంగీతకారులు.

1732
02:02:26,763 --> 02:02:28,681
నేను ఇప్పుడు పాడబోయే పాటని కూడా
నేనే స్వయంగా రాసుకున్నా.

1733
02:02:28,682 --> 02:02:30,808
ఓకే. నీకు స్టేజీ పేరు ఏమైనా ఉందా?

1734
02:02:30,809 --> 02:02:34,896
సూలా, ఇనీషియల్ 'సీ', సింగ్.

1735
02:02:34,897 --> 02:02:36,314
'సీ' అంటే ఏంటి?

1736
02:02:36,315 --> 02:02:37,357
"కెన్."

1737
02:02:41,028 --> 02:02:43,196
సరే, సూలా "కెన్" సింగ్.

1738
02:02:43,197 --> 02:02:45,573
అదే నీ పేరు అయితే కనుక, నువ్వు బాగా పాడాలి మరి.

1739
02:02:45,574 --> 02:02:47,200
అది మీరే విని చెప్పాలి.

1740
02:02:47,201 --> 02:02:48,327
పాడు మరి.

1741
02:05:23,774 --> 02:05:24,775
అంతే.

1742
02:05:44,419 --> 02:05:46,129
కానివ్వు, కానివ్వు, అంతే.

1743
02:06:30,132 --> 02:06:31,924
ఇక అందరం అనేయవచ్చు, పాట...

1744
02:06:31,925 --> 02:06:33,426
బాగుందని, బాగుందని.

1745
02:06:33,427 --> 02:06:36,180
బాగుంది. సూలా...

1746
02:06:37,431 --> 02:06:40,058
నువ్వు...

1747
02:06:40,851 --> 02:06:41,852
పాడగలవని అర్థమైంది.

1748
02:06:43,937 --> 02:06:45,396
ఇంతకీ ఈ పాట పేరేంటి?

1749
02:06:45,397 --> 02:06:46,857
"హైయెస్ట్ 2 లోయెస్ట్."

1750
02:06:50,986 --> 02:06:52,904
సూలా, నీపై నీకు నమ్మకం ఉందా?

1751
02:06:52,905 --> 02:06:54,947
- ఉంది.
- నాపై నమ్మకం ఉందా?

1752
02:06:54,948 --> 02:06:56,908
- ఉంది.
- నువ్వు విజయం సాధిస్తావని నమ్మకం ఉందా?

1753
02:06:56,909 --> 02:07:00,244
- ఉంది?
- కష్టకాలం ఎదురవుతుందని నమ్ముతావా?

1754
02:07:00,245 --> 02:07:01,621
ఎందుకంటే అది తప్పక ఎదురవుతుంది.

1755
02:07:01,622 --> 02:07:03,623
ఆనందంగా గడిపేలోపే కష్టకాలం వచ్చేస్తుంది.

1756
02:07:03,624 --> 02:07:06,835
విజయం కష్టాలను తెచ్చి పెడుతుంది.
డబ్బు కష్టాలను తెచ్చి పెడుతుంది.

1757
02:07:07,753 --> 02:07:09,212
ఇక అంతా అల్లకల్లోలమే.

1758
02:07:09,213 --> 02:07:11,506
కాబట్టి, నువ్వు ఆ అల్లకల్లోల్లాన్ని హ్యాండిల్ చేయగలవా?
డబ్బును హ్యాండిల్ చేయగలవా?

1759
02:07:11,507 --> 02:07:13,758
విజయాన్ని హ్యాండిల్ చేయగలవా?
వైఫల్యాన్ని హ్యాండిల్ చేయగలవా?

1760
02:07:13,759 --> 02:07:16,135
ప్రేమించే వారిని హ్యాండిల్ చేయగలవా?
మీమ్స్ ని హ్యాండిల్ చేయగలవా?

1761
02:07:16,136 --> 02:07:18,596
వీటన్నింటి మధ్యలో సాగే జీవితాన్ని హ్యాండిల్ చేయగలవా?

1762
02:07:18,597 --> 02:07:20,932
నేను నిన్ను అడగాలనుకున్నది ఇదే.
నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవా?

1763
02:07:20,933 --> 02:07:22,100
చేయగలను.

1764
02:07:26,939 --> 02:07:28,065
నీపై నాకు నమ్మకం ఉంది.

1765
02:07:28,815 --> 02:07:31,318
- ట్రే?
- రేపు మనం స్థూడియోకి వెళ్లిపోవచ్చు అనుకుంటా.

1766
02:07:32,194 --> 02:07:34,570
- నువ్వు సిద్ధంగా ఉన్నావా?
- మిస్టర్ కింగ్, సిద్ధం అనే మాటకి అర్థమే నేను.

1767
02:07:34,571 --> 02:07:36,906
ఒక్క నిమిషం. ముందు
మనం నా వాటా గురించి మాట్లాడుకోవాలి, నాన్నా.

1768
02:07:36,907 --> 02:07:38,783
- తనని కనుగొంది నేనే.
- నీ వాటా గురించా?

1769
02:07:38,784 --> 02:07:40,660
పామ్, నీ కొడుకుతో మాట్లాడు.

1770
02:07:40,661 --> 02:07:43,205
మన కొత్త లేబుల్ తాలూకు బోర్డుకి
నేను కో-చెయిర్మన్ అయ్యాక...

1771
02:07:44,540 --> 02:07:45,748
సంగతి చూస్తా.

1772
02:07:45,749 --> 02:07:48,794
- కుటుంబ వ్యాపారం.
- బాగుంది. కుటుంబ వ్యాపారం.

1773
02:07:49,670 --> 02:07:51,046
"హైయెస్ట్ 2 లోయెస్ట్."

1774
02:07:53,966 --> 02:07:55,342
ఇక పని మొదలుపెడదాం.

1775
02:12:26,905 --> 02:12:28,907
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్



