1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:03:50,814 --> 00:03:51,648
హేయ్.

4
00:04:16,464 --> 00:04:17,715
జూలై 6న ఒంటిగంటకు
సీ.పెండ్లటన్ కి వెళ్ళండి

5
00:04:17,716 --> 00:04:18,925
12:00కు JFHQDC-JOC నుండి
ఎస్.యూ.వీ పికప్

6
00:04:18,926 --> 00:04:20,427
మెసేజ్ పంపినవారు మీ కాంటాక్ట్ లిస్టులో లేరు.

7
00:04:24,097 --> 00:04:25,348
మెరీన్ కార్ప్స్ బేస్
క్యాంప్ పెండ్లటన్

8
00:04:25,349 --> 00:04:26,266
ఐఎంఈయఫ్ ప్రధాన స్థావరం

9
00:04:28,310 --> 00:04:29,519
ఎంసీబీ క్యాంప్ పెండ్లటన్
ప్రధాన ద్వారం

10
00:04:29,520 --> 00:04:31,063
మీరు ఫెడరల్ రిజర్వేషన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారు

11
00:04:39,530 --> 00:04:41,615
కల్నల్, మేము ఇద్దరమూ మాట్లాడుకుంటాం,
ఇక మీరు బయలుదేరుతారా!

12
00:04:49,331 --> 00:04:51,958
రిటైర్ అయి నాలుగేళ్లయినా రెండుసార్లు సెల్యూట్ చేశావే?

13
00:04:51,959 --> 00:04:54,336
- గౌరవం చూపుతున్నాను.
- కూర్చో.

14
00:04:58,715 --> 00:04:59,967
నేనెవరో తెలుసా?

15
00:05:00,717 --> 00:05:02,009
తెలీదు.

16
00:05:02,010 --> 00:05:03,428
ఊహించి చెప్పడానికి ప్రయత్నించు.

17
00:05:06,056 --> 00:05:07,890
మీ వయస్సు, రూపురేఖలను బట్టి చూస్తే,

18
00:05:07,891 --> 00:05:11,019
ఇంకా, మారు మాట్లాడకుండా ఒక మెరీన్ కల్నల్
మీ ఆదేశాన్ని పాటించడాన్ని బట్టి చూస్తే,

19
00:05:11,854 --> 00:05:14,106
మీరు చాలా ఉన్నత స్థాయికి చెందిన
మిలిటరీ స్పై అయ్యుంటారు.

20
00:05:19,027 --> 00:05:21,530
మీ నాన్న గారు, తాతయ్య గారు సైన్యంలో పని చేశారా?

21
00:05:22,322 --> 00:05:23,240
అవును.

22
00:05:23,991 --> 00:05:27,952
టాప్ స్నైపర్ అయిన నువ్వు పక్కాగా
చంపిన వారి సంఖ్య, 113,

23
00:05:27,953 --> 00:05:30,705
వీరు కాక మరో 81 మంది
నీ తూటాకు బలి అయ్యుండవచ్చు.

24
00:05:30,706 --> 00:05:32,124
ఆ లెక్కలు సరైనవేనా?

25
00:05:32,624 --> 00:05:33,458
కాదు.

26
00:05:34,042 --> 00:05:37,421
- అంటే, అవి ఇంకా ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా?
- ఎక్కువ.

27
00:05:38,755 --> 00:05:41,674
మాజీ సైనిక ఉద్యోగిగా, ఇప్పటి దాకా
ఎంత మంది ప్రైవేట్ కాంట్రాక్టర్ల వద్ద పని చేశావు?

28
00:05:41,675 --> 00:05:42,592
పదకొండు మంది.

29
00:05:42,593 --> 00:05:45,721
అయినా కానీ, ఇప్పటికీ మెరీన్ కార్ప్స్
అప్పజెప్పే పనులు అప్పుడప్పుడూ చేస్తుంటావా?

30
00:05:47,055 --> 00:05:48,389
వాళ్ళు కాల్ చేసినప్పుడల్లా.

31
00:05:48,390 --> 00:05:52,269
ఇప్పుడు నువ్వు ఏదైనా
ప్రైవేట్ లేదా సైనిక కాంట్రాక్టులో ఉన్నావా?

32
00:05:54,146 --> 00:05:54,980
లేదు.

33
00:05:57,191 --> 00:05:59,443
నీకున్న ప్రతిభ కోట్లల్లో ఒకరికి ఉంటుంది, లీవై.

34
00:06:00,944 --> 00:06:01,778
మరి ఏ కాంట్రాక్ట్ లేకపోవడమేంటి?

35
00:06:04,239 --> 00:06:07,450
జూన్ లో ఒక కార్పొరెట్ థెరపిస్ట్, నేను మిషన్లపై
పని చేయడానికి తగిన వాడిని కాదని నాకు చెప్పాడు,

36
00:06:07,451 --> 00:06:09,243
కానీ ఈ విషయం మీకు తెలుసు అనుకుంటా.

37
00:06:09,244 --> 00:06:10,537
కాబట్టి ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు?

38
00:06:13,624 --> 00:06:15,416
మిలిటరీ మిషన్ నువ్వు చేయగలవనే అనుకుంటున్నావా?

39
00:06:15,417 --> 00:06:16,960
నేనేం అనుకుంటున్నాను అన్నది అప్రస్తుతం.

40
00:06:19,796 --> 00:06:22,048
అయితే, ఇప్పుడు నీకు లవర్ ఎవరైనా ఉన్నారా?

41
00:06:22,049 --> 00:06:23,300
బాగా కావలసిన వారు ఎవరైనా?

42
00:06:23,800 --> 00:06:26,011
నువ్వు లేకుండా బతకలేనటువంటి వారు ఎవరైనా?

43
00:06:28,889 --> 00:06:30,349
- లేరు.
- ఎందుకు లేరు?

44
00:06:31,517 --> 00:06:33,060
అవన్నీ నాకు సెట్ అవ్వవు.

45
00:06:35,187 --> 00:06:39,315
ఏవైనా మందులు తీసుకుంటున్నావా?
చట్టవిరుద్ధమైన డ్రగ్స్, మందు అలవాటు ఉందా?

46
00:06:39,316 --> 00:06:40,651
డ్రగ్స్ జోలికి వెళ్ళను.

47
00:06:41,443 --> 00:06:42,568
కానీ సరైన సమయంలో తీసుకుంటే,

48
00:06:42,569 --> 00:06:45,989
పడుకొనే ముందు మూడున్నర ఔన్సుల మందు
పీడ కలలు రాకుండా చూసుకుంటుంది.

49
00:06:46,698 --> 00:06:50,201
నైట్రాజెపామ్ ని కానీ, ప్రాజొసిన్ ని కానీ వాడి చూశావా?

50
00:06:50,202 --> 00:06:52,037
తుపాకీతో సుదూరం నుండి ఎవరినైనా చంపావా?

51
00:06:55,624 --> 00:06:57,084
మందులు తీసుకుంటే, నా గురి దెబ్బతింటుంది.

52
00:07:00,629 --> 00:07:05,049
లీవై, ఆ మానసిక పరీక్షపై నువ్వు అప్పీల్ చేసి ఉండవచ్చు,
లేదా వేరే డాక్టరుకు చూపించుకొని ఉండవచ్చు.

53
00:07:05,050 --> 00:07:05,968
అలా ఎందుకు చేయలేదు?

54
00:07:06,468 --> 00:07:07,593
చేయడానికి నాకు కారణాలేవీ కనిపించలేదు.

55
00:07:07,594 --> 00:07:09,054
కారణాలేవీ కనిపించలేదా?

56
00:07:10,973 --> 00:07:13,642
ఇప్పుడు నాకు పెద్దగా కారణాలేవీ లేవు.

57
00:07:19,606 --> 00:07:20,983
ఆ కారణం నేను నీకు ఇస్తే?

58
00:07:23,527 --> 00:07:26,655
పేర్వాల్కా, లిథువేనియా

59
00:07:43,463 --> 00:07:44,298
హేయ్, నాన్నా.

60
00:07:49,761 --> 00:07:51,680
డొరొతేజ లివేటా కనైట్

61
00:07:57,603 --> 00:07:58,437
సంగీతానికి జయహో.

62
00:07:59,188 --> 00:08:00,856
సంగీతానికి జయహో.

63
00:08:02,191 --> 00:08:04,483
నా యువరాణి...

64
00:08:04,484 --> 00:08:05,651
ఎలా ఉన్నావు?

65
00:08:05,652 --> 00:08:06,570
నీకు తెలుసుగా.

66
00:08:07,237 --> 00:08:08,405
నిన్ను చూశాక మనసు కుదుటపడింది.

67
00:08:08,906 --> 00:08:13,452
బెలారస్ లో నువ్వు ఒక ఫొటోలో
పడ్డావని ఒక పుకారు షికారు చేస్తోంది.

68
00:08:14,369 --> 00:08:16,412
డ్రోన్ తీసిన ఫోటోలో.

69
00:08:16,413 --> 00:08:18,123
అది నిజమయ్యే అవకాశం ఉందా?

70
00:08:18,832 --> 00:08:24,171
సమాజంలో పెద్ద హోదా ఉన్న వ్యక్తి మరణంతో
ఏ విధంగానూ లింక్ ఉండటం మాస్కోకి ఇష్టం ఉండదు.

71
00:08:29,134 --> 00:08:30,511
అతనికి నలుగురు పిల్లలున్నారు.

72
00:08:33,013 --> 00:08:34,014
నాకు ఇచ్చేయ్.

73
00:08:36,099 --> 00:08:37,308
బులెట్ షెల్ ని నాకు ఇచ్చేయ్.

74
00:08:52,908 --> 00:08:58,455
ఆ బెలారస్ వాడు, వైట్ ఫాస్ఫరస్ బాంబులు,
ల్యాండ్ మైన్ల వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తాడు.

75
00:08:59,915 --> 00:09:01,875
దాని కారణంగా ఎంత మంది పిల్లల కాళ్ళు పోయి ఉంటాయి?

76
00:09:02,459 --> 00:09:06,380
ఆ వ్యాపారం వల్ల ఎంత మంది
చిన్నారుల జీవితాలు నాశనమైపోయి ఉంటాయి?

77
00:09:08,882 --> 00:09:10,634
బులెట్ షెల్ ని నాకు ఇచ్చేసి...

78
00:09:17,099 --> 00:09:18,392
నువ్వు ముందుకు సాగిపోవాలి.

79
00:09:19,434 --> 00:09:20,811
ఇప్పడు నా మనస్సుకు చాలా కష్టంగా ఉంది.

80
00:09:22,855 --> 00:09:23,856
నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు.

81
00:09:25,399 --> 00:09:26,482
ఒక్కోసారి కొన్ని రోజులకు కానీ పట్టదు.

82
00:09:26,483 --> 00:09:29,987
ఒకట్రెండు వారాలు నాతో ఉండు.

83
00:09:31,029 --> 00:09:34,407
మంచి నాటుకోడి బిర్యానీ
చేసుకుందాం. ఇద్దరికీ బాగుంటుంది.

84
00:09:34,408 --> 00:09:35,325
నేను ఉండలేను.

85
00:09:36,285 --> 00:09:39,328
రాబినోవిచ్ రేపు ఉదయాన్నే మాస్కోకు రమ్మన్నాడు,
ఏదో మిషన్ గురించి చెప్తారట.

86
00:09:39,329 --> 00:09:41,581
తొక్కలో రాబినోవిచ్. తొక్కలో రష్యా.

87
00:09:41,582 --> 00:09:43,416
నీది రష్యా కాదు, లిథువేనియా.

88
00:09:43,417 --> 00:09:46,628
కనీసం ఒక ఏడాది పాటు అయినా
ప్రపంచానికి దూరంగా ఉండాలట నేను.

89
00:09:47,796 --> 00:09:48,630
ఇంకా ఎక్కువే పట్టవచ్చు.

90
00:09:51,258 --> 00:09:52,092
హేయ్.

91
00:09:52,926 --> 00:09:55,094
నీ కోసం ఒక డాక్టరును మాట్లాడా కదా, కలవడానికి వెళ్ళావా?

92
00:09:55,095 --> 00:09:56,012
అదే, స్పెషలిస్ట్ ని.

93
00:09:56,013 --> 00:09:58,098
- హా, కలిశా.
- ఏమన్నాడు?

94
00:09:58,974 --> 00:10:00,600
చేయగలిగింది ఏమీ లేదట.

95
00:10:00,601 --> 00:10:02,102
నన్ను చూడు, ఎంత దీన స్థితిలో ఉన్నానో.

96
00:10:02,686 --> 00:10:04,813
క్యాన్సర్ నన్ను కబళించేస్తోంది.

97
00:10:05,397 --> 00:10:07,482
లివర్, ప్యాంక్రియాస్.

98
00:10:08,483 --> 00:10:10,485
చావును హాయిగా స్వాగతిస్తా.

99
00:10:10,986 --> 00:10:12,487
ఒకవేళ నేను వెనక్కి రాకపోతే?

100
00:10:14,323 --> 00:10:17,910
నువ్వు ఒక్కడివే ఉంటావు,
అది ఎప్పుడు సంభవిస్తుందో కూడా నాకు తెలీదు.

101
00:10:19,036 --> 00:10:20,370
దానికి సులువైన పరిష్కారం ఉంది.

102
00:10:21,163 --> 00:10:22,581
నేను నిర్ణయించేసుకున్నా.

103
00:10:23,373 --> 00:10:26,167
ఫిబ్రవరి 14, వ్యాలంటైన్స్ డే.

104
00:10:26,168 --> 00:10:27,211
ఏం మాట్లాడుతున్నావు?

105
00:10:27,836 --> 00:10:29,463
నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.

106
00:10:30,088 --> 00:10:32,089
అప్పటికే చావకపోతే అనుకో.

107
00:10:32,090 --> 00:10:33,175
నాన్నా.

108
00:10:36,345 --> 00:10:38,180
- నాన్నా, నువ్వు అలా...
- నా ప్రాణం, నా ఇష్టం.

109
00:10:39,598 --> 00:10:43,060
మీ అమ్మ పక్కన శాశ్వతంగా నిద్రించడానికి సిద్ధంగా ఉంటా.

110
00:10:45,020 --> 00:10:49,982
కాబట్టి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ,
నా కోసం ఒక కొవ్వొత్తి వెలిగించు.

111
00:10:49,983 --> 00:10:53,570
రాత్రి వేళ ఓరియన్ నక్షత్రాల కూటమిని చూడు,
అప్పుడు నీకే అర్థమవుతుంది.

112
00:10:57,324 --> 00:10:59,785
ఇక కానిద్దాం, యువరాణి.

113
00:11:00,410 --> 00:11:01,954
ఒక బీర్ తాగుతూ,

114
00:11:02,829 --> 00:11:03,747
మంచి పాట వింటూ,

115
00:11:05,082 --> 00:11:06,917
సరైన విధంగా వీడ్కోలు పలుకుదాం.

116
00:11:16,468 --> 00:11:19,847
సెప్టెంబర్

117
00:12:03,015 --> 00:12:04,725
ప్యాడ్ మీద మీ ఎడమ చేతిని పెట్టండి.

118
00:12:07,853 --> 00:12:08,853
బయోమెట్రిక్

119
00:12:08,854 --> 00:12:10,021
మ్యాచ్: లీవై కేన్
యాక్సెస్ ఇవ్వబడింది

120
00:12:10,022 --> 00:12:12,482
ఈ సూట్ కేసులో మీ గడియారం,
స్మార్ట్ ఫోన్, ఇంకా మీ ఐడీ పెట్టండి.

121
00:12:13,400 --> 00:12:14,526
ఇది సమయం చూసుకోవడానికే పనికొస్తుంది.

122
00:12:19,448 --> 00:12:21,866
మూడు నిమిషాల్లో, నో ఫ్లై జోన్ అంచుకు చేరుకుంటాం.

123
00:12:21,867 --> 00:12:23,368
అంతకన్నా ముందుకు తీసుకెళ్ళలేం.

124
00:12:23,994 --> 00:12:26,371
దిగిన చోటు నుండి, మీరు
కాలినడకన 38 కిలోమీటర్లు ఉత్తరం వైపుకు వెళ్ళాలి.

125
00:12:27,164 --> 00:12:29,290
రేపు సాయంత్రం నాలుగు గంటలకల్లా
అక్కడికి చేరుకుంటావని భావిస్తున్నాం.

126
00:12:29,291 --> 00:12:30,709
దీన్ని దిగాక తెరవండి.

127
00:12:37,299 --> 00:12:38,717
ఇంతకీ ఇది ఏ ప్రాంతం?

128
00:12:39,801 --> 00:12:41,386
దానికి సమాధానం చెప్పే అధికారం నాకు లేదు.

129
00:14:07,097 --> 00:14:09,892
ఎట్టకేలకు నా యువరాజు వచ్చేశాడు.

130
00:14:10,642 --> 00:14:13,896
అది కూడా సరిగ్గా సమయానికి వచ్చేశాడు.
సూపర్ మీరు అసలు.

131
00:14:14,897 --> 00:14:18,858
జాస్పర్ డీ డ్రేక్, రాయల్ మెరీన్స్ కమాండోస్.
జేడీ అని పిలవండి చాలు.

132
00:14:18,859 --> 00:14:21,986
లీవై కేన్, మాజీ యుఎస్ మెరీన్, స్కౌట్ స్నైపర్ ని.

133
00:14:21,987 --> 00:14:23,154
ప్రైవేట్ సైనికులా మీరు?

134
00:14:23,155 --> 00:14:24,531
ప్రైవేట్ కాంట్రాక్టర్ ని.

135
00:14:25,032 --> 00:14:26,616
ఈ మిషన్ గురించి ఏం చెప్పారేంటి మీకు?

136
00:14:26,617 --> 00:14:27,868
ఒక్క ముక్క కూడా చెప్పలేదు.

137
00:14:28,702 --> 00:14:30,578
ఒక మార్క్ చేయని ప్రాంతీయ మ్యాప్ ఇచ్చారంతే.

138
00:14:30,579 --> 00:14:31,996
అసలు ఏ దేశంలో ఉన్నానో కూడా నాకు తెలీదు.

139
00:14:31,997 --> 00:14:34,666
నేను ఇక్కడ ఒక సంవత్సరం నుండి ఉంటున్నా,
నాకే తెలీదు నేను ఎక్కడ ఉన్నానో.

140
00:14:35,167 --> 00:14:36,335
అంతా పిచ్చిపిచ్చిగా ఉంది కదా?

141
00:14:36,835 --> 00:14:39,213
ఇంకా పిచ్చి ఎక్కించే విషయాలు చాలా ఉన్నాయి.

142
00:14:40,839 --> 00:14:42,632
మిమ్మల్ని చూస్తుంటే ఆనందం తన్నుకొచ్చేస్తోంది.

143
00:14:42,633 --> 00:14:43,966
జనాలతో టచ్ లో ఉండే వీలు ఉండదా?

144
00:14:43,967 --> 00:14:47,012
నేను ఒక వ్యక్తితో నేరుగా మాట్లాడి
ఒక సంవత్సరం అయింది.

145
00:14:47,721 --> 00:14:49,139
మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా?

146
00:14:49,681 --> 00:14:52,017
అధికారికంగా నా షిఫ్ట్ అర్ధరాత్రి కల్లా ముగిసిపోతుంది.

147
00:14:52,809 --> 00:14:54,685
- మీ డ్యూటీ ఇక నేను కొనసాగిస్తానా?
- అవును.

148
00:14:54,686 --> 00:14:57,064
చూడండి, ఒక డ్రింక్ తాగుతూ,
అన్నీ వివరంగా మాట్లాడుకుందాం.

149
00:14:58,190 --> 00:14:59,316
అదుగోండి.

150
00:14:59,942 --> 00:15:01,526
వెస్ట్ టవర్ అబ్జర్వేషన్ పోస్ట్.

151
00:15:01,527 --> 00:15:04,321
ఇక తర్వాతి 365 రోజుల వరకు ఇదే మీ నివాసం.

152
00:15:05,280 --> 00:15:09,575
సదుపాయాలన్నీ ఉన్నాయి, సోలార్ పవర్ ఉంది, బ్యాకప్ జెనరేటర్
కూడా ఉంది, వర్షపు నీటిని నిల్వ చేసే సదుపాయం ఉంది,

153
00:15:09,576 --> 00:15:12,871
ఎప్పుడు కావాలంటే అప్పుడు వేటాడవచ్చు,
అక్కడ గార్డెన్ కూడా ఉంది.

154
00:15:13,455 --> 00:15:14,581
మీకు కావాల్సినవన్నీ ఉంటాయి.

155
00:15:15,415 --> 00:15:16,583
అవతలి వైపు ఏదో ఉంది కదా, ఏంటది?

156
00:15:18,293 --> 00:15:19,836
అది ఈస్ట్ టవర్.

157
00:15:19,837 --> 00:15:21,754
ఈస్ట్ టవరులో ఉన్న వాళ్లతో అస్సలు మాట్లాడకూడదు,

158
00:15:21,755 --> 00:15:25,091
లోయకి ఉత్తరం నుండి దక్షిణం దాకా లెక్కలేనన్ని లాండ్ మైన్స్,
భయంకరమైన ట్యాక్టికల్ బ్యారియర్స్ ఉన్నాయి కాబట్టి,

159
00:15:25,092 --> 00:15:26,801
దాన్ని పట్టించుకునే అవకాశం రాదు.

160
00:15:26,802 --> 00:15:28,594
ఎలాగూ అవతలి వైపుకు వెళ్లడం కుదరని పని.

161
00:15:28,595 --> 00:15:30,680
ఉన్న విషయం చెప్పాలంటే,
ఈస్ట్ టవర్ అసలు సమస్యే కాదు.

162
00:15:30,681 --> 00:15:32,724
వాళ్ళ పని వాళ్ళది. మన పని మనది.

163
00:15:33,225 --> 00:15:35,727
కానీ ఈ ఉదయం అక్కడ కదలికలు గమనించాను.

164
00:15:36,311 --> 00:15:38,564
అక్కడ కూడా వార్షిక షిఫ్ట్ పూర్తి అయి
కొత్త వారు వచ్చారేమో.

165
00:15:39,231 --> 00:15:40,982
మాటల్లో చెప్పాలంటే, పని చాలా తేలికైనది.

166
00:15:40,983 --> 00:15:42,483
ఇక్కడి రక్షణని మీరు చూసుకోనక్కర్లేదు.

167
00:15:42,484 --> 00:15:44,235
మీరు చేయాల్సిందల్లా అన్నీ పని చేసేలా చూసుకోవడం మాత్రమే.

168
00:15:44,236 --> 00:15:45,486
కెప్టెన్ బ్రాడ్ఫర్డ్ షా
మొదటి గార్డియన్

169
00:15:45,487 --> 00:15:47,446
ప్రతిరోజూ, పశ్చిమ అంచున నడవాలి.

170
00:15:47,447 --> 00:15:50,450
సుమారుగా ప్రతి 600 మీటర్లకు
ఆటోమేటిక్ ఫలాంక్స్ గన్ టర్రెట్స్ ఉంటాయి.

171
00:15:50,951 --> 00:15:52,660
ఆ ఆటో గన్స్ లో మందు గుండును నింపుతూ ఉండాలి,

172
00:15:52,661 --> 00:15:55,955
అడ్డుగా ఉన్న కంచెను, క్లోకర్లను,
పాతిపెట్టబడి ఉన్న బాంబులను పరిశీలించాలి.

173
00:15:55,956 --> 00:16:00,001
బయట ఉన్న బంకరులో ఆయుధ సామాగ్రి ఉంది.
ఆయుధాలు, పనిముట్లు, మందుగుండు, బాంబులు.

174
00:16:00,002 --> 00:16:01,086
మీకేం కావాలంటే అవి ఉంటాయి.

175
00:16:02,087 --> 00:16:03,881
ముప్పై రోజులకు ఒకసారి రేడియో చెక్ చేయాలి.

176
00:16:04,548 --> 00:16:05,882
క్లోకర్ అంటే ఏంటి?

177
00:16:05,883 --> 00:16:08,134
క్లోకర్ అనేది శాటిలైట్ ట్రాన్స్ మిటర్ అని చెప్పవచ్చు.

178
00:16:08,135 --> 00:16:10,261
అంచు భాగాన సుమారుగా
ప్రతి కిలోమీటరుకు అది ఒకటి ఉంది,

179
00:16:10,262 --> 00:16:14,182
ప్రతిదానికి విడివిడిగా పవర్ సోర్స్ తో పాటుగా,
బ్యాకప్ పవర్ సోర్స్ కూడా ఉంది.

180
00:16:14,183 --> 00:16:16,393
- అవేం చేస్తాయి?
- అవి ఈ ప్రాంతం కనిపించకుండా చేస్తాయి.

181
00:16:17,436 --> 00:16:19,353
ఉపగ్రహాలు ఏ రోజైనా ఈ ప్రదేశం పై నుండి పోయినప్పుడు

182
00:16:19,354 --> 00:16:20,856
అవి తప్పుడు సిగ్నల్ ని పంపిస్తాయి.

183
00:16:21,398 --> 00:16:24,442
నిఘా ఉపగ్రహాలకు ఇక్కడి లోయ
కనిపించకుండా చేసేలా రూపొందించబడ్డాయి అవి,

184
00:16:24,443 --> 00:16:26,278
కానీ అవి గూగుల్ ఎర్త్ లాంటి వాటితో
కలిసి పని చేస్తాయి కూడా.

185
00:16:28,780 --> 00:16:31,115
ఇక్కడి నుండి బయటి వారితో మాట్లాడే వీలు ఉండదు.

186
00:16:31,116 --> 00:16:32,910
మొబైల్ ఫోన్, శాటిలైట్ లాంటివేవీ ఉండవు.

187
00:16:33,410 --> 00:16:35,411
ఎమర్జెన్సీ సమయాల కోసమని ఒక ప్యానిక్ బటన్ ఉంటుంది,

188
00:16:35,412 --> 00:16:38,581
నెలవారీ రేడియో చెక్స్ కోసమని ఉపయోగించే
షార్ట్ వేవ్ రేడియోలో అది ఉంటుంది.

189
00:16:38,582 --> 00:16:40,541
బటన్ ఒక సిగ్నల్ ని పంపుతుంది,
అది వాళ్లకి తెలియజేస్తుంది...

190
00:16:40,542 --> 00:16:41,543
వాళ్లంటే ఎవరు?

191
00:16:42,586 --> 00:16:44,545
ఇదంతా నడిపే వారు.

192
00:16:44,546 --> 00:16:45,464
వాళ్ళు ఎవరైనా కానీ.

193
00:16:46,048 --> 00:16:48,509
టవర్ పైన పాత వైమానిక దాడుల సంబంధిత
సైరన్లు ఉన్నాయి, గమనించారా?

194
00:16:49,259 --> 00:16:53,387
ఒకవేళ క్లోకర్లన్నీ ఒకేసారి విఫలమైనా,
లేదా లోయలో అల్లకల్లోలం నెలకొన్నా,

195
00:16:53,388 --> 00:16:57,099
ఆటోమేటెడ్ సిస్టమ్,
స్ట్రేడాగ్ ప్రోటోకాల్ ని అమలు చేసేస్తుంది.

196
00:16:57,100 --> 00:16:58,768
స్ట్రేడాగ్ ప్రోటోకాల్.

197
00:16:58,769 --> 00:17:00,145
- అంటే ఏంటి?
- తెలీదు.

198
00:17:00,687 --> 00:17:03,899
కానీ వైమానిక దాడుల సంబంధిత సైరన్లు
వినిపించగానే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవాలి.

199
00:17:05,192 --> 00:17:06,275
అలాగే.

200
00:17:06,276 --> 00:17:07,860
అసలు విషయం చెప్తా వినండి.

201
00:17:07,861 --> 00:17:09,154
ఈ చోటు చాలా పాతది.

202
00:17:09,863 --> 00:17:12,323
అంటే, రెండవ ప్రపంచ యుద్ధం చివరి కాలం,
ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభ కాలం నాటిది.

203
00:17:12,324 --> 00:17:13,783
ఇది రహస్యమైన ప్రదేశం కూడా.

204
00:17:13,784 --> 00:17:15,535
ఆరోజుల్లో, ఈ చోటును రహస్యంగా ఉంచడానికి,

205
00:17:15,536 --> 00:17:17,787
ఒక ఒప్పందం కుదిరి, ఓ కూటమి ఏర్పడింది.

206
00:17:17,788 --> 00:17:20,914
దాని ప్రకరాం, ఇప్పుడు ప్రతి ఏడాది,
పశ్చిమ దేశాల నుండి ఒక కొత్త ప్రతినిధి,

207
00:17:20,915 --> 00:17:24,418
అంచుకు పశ్చిమ వైపున, అలాగే అవతలి వారు
తూర్పు వైపున పహారా కాస్తూ ఉంటారు.

208
00:17:24,419 --> 00:17:25,503
అక్కడ మీలా ఒకరు పనిచేస్తుంటారు.

209
00:17:26,755 --> 00:17:28,631
తూర్పు దేశాల నాయకులు, పశ్చిమ దేశాల నాయకులు

210
00:17:28,632 --> 00:17:31,008
గత 75 ఏళ్లుగా ఈ విషయంలో
రహస్యంగా పని చేస్తున్నారని అంటున్నారా?

211
00:17:31,009 --> 00:17:35,471
లేదు. కూటములు ఏర్పాటయ్యాక
సోవియెట్ రష్యన్లకు తొమ్మిది మంది అధ్యక్షులు మారారు,

212
00:17:35,472 --> 00:17:38,183
యుఎస్ విషయంలో 13 మంది
అధ్యక్షలు మారారు అని చెప్తున్నా.

213
00:17:38,767 --> 00:17:40,435
వాళ్లలో ఎవరికీ లోయ గురించి తెలీదు.

214
00:17:41,019 --> 00:17:42,020
అదొకసారి తాగి చూడండి.

215
00:17:47,067 --> 00:17:49,403
ఆలు వోడ్కా అది. డిస్టిలరీ ఆయుధాగారంలో ఉంది.

216
00:17:51,196 --> 00:17:52,030
చాలా బాగుంది.

217
00:17:53,532 --> 00:17:56,159
ఆ తయారీ పధ్ధతి ఎన్నో దశాబ్దాల నుండి
పాస్ అవుతూ వస్తోంది, కాబట్టి దాన్ని చెడగొట్టవద్దు.

218
00:17:58,537 --> 00:18:01,582
క్షమించండి. కానీ ఇంకా
ఏదో మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది.

219
00:18:02,082 --> 00:18:05,794
ఈ చోటును రహస్యంగా ఉంచడం కాకుండా,
అసలు మన మిషన్ ఏమిటి?

220
00:18:07,004 --> 00:18:08,671
లోయలోకి వెళ్లకుండా జనాలను అడ్డుకోవాలా?

221
00:18:08,672 --> 00:18:09,590
లేదు.

222
00:18:10,674 --> 00:18:13,552
లోయలో ఉండేవి బయటకు రాకుండా చూసుకోవాలి.

223
00:18:16,305 --> 00:18:19,974
ఒక ఏడాది క్రితం, నేను కూడా మీలానే ఇక్కడికి వచ్చా,
నా ముందు ఇక్కడ ఉండిన వ్యక్తి కూడా ఇదే చెప్పాడు.

224
00:18:19,975 --> 00:18:21,435
అతని గురించి నేను ఏమనుకున్నానో చెప్పనా?

225
00:18:22,769 --> 00:18:25,314
- సోది చెప్తున్నాడు అనే కదా.
- అంతే.

226
00:18:26,064 --> 00:18:28,316
కానీ చెప్తున్నా కదా, లోయ మధ్యలో ఉండే
గోడలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

227
00:18:28,317 --> 00:18:29,567
వాటినే సులభంగా ఎక్కేయవచ్చు.

228
00:18:29,568 --> 00:18:32,153
మిగతా వాటి సంగతి, దక్షిణం,
ఉత్తరం వైపు ఉండే మినీ గన్లు చూసుకుంటాయి.

229
00:18:32,154 --> 00:18:33,739
ఎక్కడం... వేటి సంగతి చూసుకుంటాయి?

230
00:18:43,582 --> 00:18:44,666
ఆ శబ్దం ఎంటి?

231
00:18:45,167 --> 00:18:47,377
వాటిని హాలో మెన్ అని అంటాం.

232
00:18:47,961 --> 00:18:49,712
అవేంటో ఎవరికీ తెలీదు.

233
00:18:49,713 --> 00:18:51,924
వాటిని అలా ఎందుకు పిలుస్తారో కూడా నాకు తెలీదు.

234
00:18:52,424 --> 00:18:56,260
- అది టీ.యస్. ఎలియట్ రాసిన కవిత పేరు.
- నాకు అది తెలీదులే.

235
00:18:56,261 --> 00:18:59,388
నాకు తెలిసిందల్లా, చాలా కాలం క్రితం
మన డ్యూటీ చేసిన వారెవరో, వాటిని అలా పిలిచారు,

236
00:18:59,389 --> 00:19:00,474
ఇక అది అలా ఉండిపోయింది, అంతే.

237
00:19:01,391 --> 00:19:03,726
ఇంకో విషయం ఏంటంటే, 1940ల చివర్లో,

238
00:19:03,727 --> 00:19:06,187
మొత్తం మూడు బలగాలను అక్కడికి పంపారు,

239
00:19:06,188 --> 00:19:09,149
ఆ హాలో మెన్ ని చంపడానికి,
2,400 మందితో కూడిన అశ్వసేన అక్కడికి వెళ్ళింది.

240
00:19:09,816 --> 00:19:11,360
కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా తిరిగి రాలేదు.

241
00:19:12,027 --> 00:19:14,780
ఆ తర్వాత, దీన్ని నియంత్రించాలన్న పనికే
పరిమితం అయిపోయారు.

242
00:19:16,365 --> 00:19:18,491
- ఇవన్నీ మీకు ఎలా తెలుసు?
- మీకెలా తెలుసో, నాకూ అలానే తెలుసు.

243
00:19:18,492 --> 00:19:20,034
మనందరికీ మన ముందు డ్యూటీ చేసినవారే చెప్తారు.

244
00:19:20,035 --> 00:19:23,371
- అలాంటప్పుడు ఆ సందేశం కాస్తా...
- చాలా దశాబ్దాల కిందటిది కాబట్టి అటూ ఇటూ అయ్యుండొచ్చు.

245
00:19:23,372 --> 00:19:24,289
అవును.

246
00:19:27,751 --> 00:19:30,712
జేడీ, అసలు ఇక్కడేం జరుగుతోందని మీకు అనిపిస్తోంది?

247
00:19:31,296 --> 00:19:35,300
నా సిద్ధాంతం ప్రకారం, ఒక ముక్కలో చెప్పాలంటే,

248
00:19:36,677 --> 00:19:41,682
ఈ లోయ నరకానికి ముఖద్వారం,
మనం ఆ ద్వారానికి కాపలాగా ఉంటున్నాం.

249
00:19:47,980 --> 00:19:49,648
- జాగ్రత్త, మిత్రమా.
- గుడ్ లక్, బాసూ.

250
00:20:44,077 --> 00:20:46,747
తోక చుక్క కనుమరుగైపోతూ బాధతో ఆర్తనాదాలు చేసింది

251
00:22:05,868 --> 00:22:07,660
మిమ్మల్ని చూస్తుంటే ఆనందం ఆగట్లేదు.

252
00:22:07,661 --> 00:22:08,786
అర్థం చేసుకోగలను, బాసూ!

253
00:22:08,787 --> 00:22:12,290
మీ గుర్తింపు వివరాలు చెప్పండి.

254
00:22:12,291 --> 00:22:15,793
జాస్పర్ డీ డ్రేక్. సీక్రెట్ కోడ్: నీలి బాణం.

255
00:22:15,794 --> 00:22:17,546
మీ సేవకు ధన్యవాదాలు.

256
00:22:28,557 --> 00:22:30,141
షిఫ్ట్ పని పూర్తయింది.

257
00:22:30,142 --> 00:22:31,310
సరే.

258
00:22:46,533 --> 00:22:48,702
అక్టోబర్

259
00:23:05,135 --> 00:23:06,762
సిస్టమ్ యాక్టివ్ గా ఉంది

260
00:23:10,432 --> 00:23:11,934
సిస్టమ్ల పరిశీలన

261
00:23:25,489 --> 00:23:27,074
ల్యాండ్ మైన్స్

262
00:23:41,880 --> 00:23:43,840
నేను వెస్ట్ టవర్ నుండి రేడియో చెక్ చేస్తున్నాను.

263
00:23:43,841 --> 00:23:44,925
నా మాటలు వినిపిస్తున్నాయా?

264
00:23:47,135 --> 00:23:49,428
మళ్ళీ చెప్తున్నా, నేను వెస్ట్ టవర్ నుండి
రేడియో చెక్ చేస్తున్నాను.

265
00:23:49,429 --> 00:23:50,972
మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? ఓవర్.

266
00:23:50,973 --> 00:23:52,807
అధికార కోడ్ చెప్పండి.

267
00:23:52,808 --> 00:23:53,724
సిస్టమ్ డీకోడ్ చేస్తోంది...

268
00:23:53,725 --> 00:23:56,103
ఆల్ఫా, బ్రావో, నైన్, సెవెన్, ఒమేగా.

269
00:23:56,979 --> 00:23:59,438
- శత్రువులు ఎవరైనా ఎదురయ్యారా?
- లేదు.

270
00:23:59,439 --> 00:24:00,774
క్లోకర్ ఎలా ఉంది?

271
00:24:01,275 --> 00:24:02,358
బాగానే ఉంది.

272
00:24:02,359 --> 00:24:03,777
ప్రక్రియ పూర్తయింది.

273
00:24:04,319 --> 00:24:05,863
తర్వాతి రేడియో చెక్ 30 రోజుల తర్వాత జరుగుతుంది.

274
00:24:06,363 --> 00:24:08,407
- ఒక్క నిమిషం. నేను ఒకటి అడగాలి...
- ప్రక్రియ పూర్తయింది.

275
00:24:29,636 --> 00:24:30,971
రాబర్ట్ ఫ్రాస్ట్.

276
00:24:59,875 --> 00:25:02,877
"ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరిగా
అనిపిస్తోందంటే, అది మంచిది కాదు.

277
00:25:02,878 --> 00:25:03,962
సార్ట్.

278
00:25:04,546 --> 00:25:06,173
జాస్పర్ 'జేడీ' డ్రేక్."

279
00:25:09,092 --> 00:25:13,596
"వాస్తవికతతో పోల్చితే ఎంతటి ప్రమాదకరమైన డ్రగ్
అయినా చిన్నదే, దాన్ని భరించడం చాలా కష్టం.

280
00:25:13,597 --> 00:25:16,934
కానలీ. కెప్టెన్ గెట్టీ ఫ్రెడెరిక్. 1986."

281
00:25:26,985 --> 00:25:31,615
"ఎంతటి దూరమైనా వెళ్లే ధైర్యం చేసే వారే,
తాము ఎంత దూరం వెళ్లగలమో తెలుసుకోగలరు.

282
00:25:32,241 --> 00:25:33,408
టీ.యస్. ఎలియట్.

283
00:25:34,868 --> 00:25:37,704
కెప్టెన్ బ్రాడ్ఫర్డ్ షా. 1947."

284
00:27:35,322 --> 00:27:36,490
అబ్బా.

285
00:28:31,545 --> 00:28:33,505
నవంబర్

286
00:28:38,468 --> 00:28:41,847
నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాము

287
00:28:42,389 --> 00:28:45,475
చిరంజీవిగా

288
00:28:45,809 --> 00:28:47,686
నిలిచిపోవాలని

289
00:28:48,020 --> 00:28:51,148
ప్రార్ధిస్తున్నాము

290
00:28:53,400 --> 00:28:58,197
భలే, భలే, భలే భలే

291
00:30:09,726 --> 00:30:12,521
{\an8}నీ పేరేంటి?

292
00:30:32,916 --> 00:30:35,961
{\an8}మనం మాట్లాడుకోకూడదు.

293
00:31:02,196 --> 00:31:05,406
{\an8}నా పేరు డ్రాసా. ఇవాళ నా పుట్టినరోజు.

294
00:31:05,407 --> 00:31:09,036
{\an8}కాబట్టి నాకు ఇష్టమొచ్చింది చేసుకుంటా.

295
00:31:29,973 --> 00:31:31,098
{\an8}నా పేరు లీవై

296
00:31:31,099 --> 00:31:34,019
{\an8}నీ పుట్టిన రోజు సందర్భంగా చిన్న పార్టీ చేసుకుందామా?

297
00:32:02,506 --> 00:32:03,590
రమోన్స్

298
00:32:32,369 --> 00:32:34,621
{\an8}ఓసారి డ్యాన్స్ చేసి చూపించు, లీవై

299
00:32:42,004 --> 00:32:44,047
{\an8}వద్దు. నేను డ్యాన్స్ చేస్తే హడలిపోతావు

300
00:32:47,801 --> 00:32:50,804
ఏదోక విషయంలో పిస్తావి అయ్యుంటావు కదా.
ఏం వచ్చు నీకు?

301
00:32:55,309 --> 00:32:57,186
{\an8}నేను షూటింగ్ బాగా చేస్తాను

302
00:33:01,732 --> 00:33:04,484
ఎంత బాగా?

303
00:39:43,133 --> 00:39:44,885
పుట్టిన రోజు. అదిరింది.

304
00:41:19,521 --> 00:41:21,481
డిసెంబర్

305
00:41:30,073 --> 00:41:32,910
డిసెంబర్
సేకరించాలి - సిద్ధం చేయాలి - పూర్తి చేయాలి

306
00:42:43,355 --> 00:42:45,357
క్రిస్మస్ శుభాకాంక్షలు
డ్రాసా

307
00:43:17,431 --> 00:43:18,389
డ్రాసా

308
00:43:18,390 --> 00:43:20,142
{\an8}లీవై

309
00:43:36,200 --> 00:43:37,492
మంత్రిని ఏనుగు 5 స్థానంలోకి తరలించు

310
00:43:59,765 --> 00:44:00,766
గుర్రం, గుర్రాన్ని ఓడించేసింది

311
00:44:42,724 --> 00:44:44,685
ఫిబ్రవరి

312
00:46:17,152 --> 00:46:17,985
{\an8}ఫిబ్రవరి 14

313
00:46:17,986 --> 00:46:19,488
{\an8}ఎంత తేలిక అంటే...
నేను నిన్ను చూశాక ఒక...

314
00:46:49,935 --> 00:46:52,271
పహారా డ్యూటీకి రాలేదు
ఏమైంది?

315
00:47:05,284 --> 00:47:06,742
{\an8}ఈరోజు చాలా భారంగా ఉంది.

316
00:47:06,743 --> 00:47:09,329
{\an8}నువ్వు నా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తోంది.

317
00:47:28,056 --> 00:47:32,728
"ఎంతటి దూరమైనా వెళ్లే ధైర్యం చేసే వారే,
తాము ఎంత దూరం వెళ్లగలమో తెలుసుకోగలరు."

318
00:48:24,446 --> 00:48:26,615
ఏం చేస్తున్నావు నాయనా?

319
00:48:29,785 --> 00:48:30,869
అయ్య బాబోయ్.

320
00:48:40,170 --> 00:48:41,547
ఓరి నాయనోయ్.

321
00:49:45,402 --> 00:49:48,030
{\an8}రాత్రి డిన్నర్ కలిసి చేద్దామా?

322
00:51:30,507 --> 00:51:31,592
గుడ్ ఈవినింగ్, డ్రాసా.

323
00:51:32,718 --> 00:51:34,761
నేను ఇక్కడికి రాకూడదు అని తెలుసు.

324
00:51:35,971 --> 00:51:37,055
గుడ్ ఈవినింగ్, లీవై.

325
00:51:37,639 --> 00:51:40,601
ఈ చోటు బయట ప్రపంచానికి కనిపించదు.
మనం ఎవరికీ కనిపించము కదా?

326
00:51:44,605 --> 00:51:46,857
నేను ర్యాబిట్ పై చేశాను.

327
00:51:47,983 --> 00:51:49,151
అదంటే నీకు ఇష్టమేనా?

328
00:51:50,777 --> 00:51:51,862
ఇష్టం పెంచుకోవాలన్నదే నా ప్లాన్.

329
00:51:53,989 --> 00:51:54,990
ఏవో పెంచుతున్నట్టున్నావే?

330
00:51:58,118 --> 00:51:59,244
నీకు పూలు తీసుకొచ్చా.

331
00:52:01,205 --> 00:52:02,289
సూపర్.

332
00:52:03,332 --> 00:52:04,374
థ్యాంక్యూ.

333
00:52:10,297 --> 00:52:11,297
కళ్ళార్పకుండా చూస్తున్నావు.

334
00:52:11,298 --> 00:52:13,634
క్షమించు. అంటే, అదీ...

335
00:52:14,218 --> 00:52:15,302
ఏంటో చెప్పు.

336
00:52:18,430 --> 00:52:21,517
నీ కనుపాపలు నేను అనుకున్నదాని కన్నా పచ్చగా ఉన్నాయి.

337
00:52:25,646 --> 00:52:26,980
నీ దగ్గర వాసన వస్తోంది.

338
00:52:28,273 --> 00:52:29,191
భయంకరంగా.

339
00:52:31,151 --> 00:52:32,151
నాకు తెలుసు.

340
00:52:32,152 --> 00:52:33,569
కేబుల్ ఎక్కువ సాగింది.

341
00:52:33,570 --> 00:52:35,363
సగం దూరం చేతులతో లాక్కుంటూ వచ్చా.

342
00:52:35,364 --> 00:52:38,533
హా. కానీ ఇంత వాసన వస్తే లోపలికి ఎలా రానివ్వను?

343
00:52:38,534 --> 00:52:41,411
బాత్ రూమ్ కి వెళ్లి త్వరగా స్నానం చేసి వచ్చేయ్.

344
00:52:41,954 --> 00:52:44,581
ఇక్కడ ఇంతకుముందు ఉన్న వారి
ఉతికిన బట్టలను తలుపు బయట పెట్టి ఉంచుతా.

345
00:53:47,853 --> 00:53:53,107
యుకాన్? సైబీరియా? స్కాండినేవియాలోని
మారుమూల ప్రాంతం కూడా అయ్యుండవచ్చేమో?

346
00:53:53,108 --> 00:53:54,817
ఏమో మరి. విమానం ఎక్కగానే మత్తు మందు ఇచ్చేశారు.

347
00:53:54,818 --> 00:53:57,154
- ఎంత సేపు స్పృహలో లేనో కూడా తెలీదు.
- నా పరిస్థితి కూడా అంతే.

348
00:53:57,863 --> 00:53:59,864
అయినా, ఉత్తర భాగంలో ఎక్కడో దూరంగా ఉన్నాం.

349
00:53:59,865 --> 00:54:00,948
అది మాత్రం చెప్పగలను.

350
00:54:00,949 --> 00:54:02,408
అంత పక్కాగా ఎలా చెప్పగలవు?

351
00:54:02,409 --> 00:54:03,869
ఋతువులను బట్టి.

352
00:54:04,578 --> 00:54:06,162
ఆకురాలు కాలం మొదలైనప్పుడు అమెరికా నుండి బయలుదేరా.

353
00:54:06,163 --> 00:54:07,331
ఇక్కడా ఆకురాలు కాలమే ఉండింది.

354
00:54:08,290 --> 00:54:09,291
సైన్యంలో పని చేశావా?

355
00:54:10,667 --> 00:54:11,667
మెరీన్స్ లో చేశా.

356
00:54:11,668 --> 00:54:12,627
ఒకప్పుడులే.

357
00:54:12,628 --> 00:54:14,880
నువ్వు కాల్చి చంపిన షాట్స్ లో
అత్యంత దూరమైన షాట్ ఏది?

358
00:54:15,881 --> 00:54:17,298
తెలీదని మాత్రం చెప్పకు.

359
00:54:17,299 --> 00:54:19,509
టాప్ స్నైపర్లందరికీ, తాము తుపాకీతో కాల్చి చంపినప్పుడు,

360
00:54:19,510 --> 00:54:21,302
ఆ దూరమెంతో తెలిసిపోతుంది, కాబట్టి చెప్పేయ్.

361
00:54:21,303 --> 00:54:22,762
3,241 మీటర్లు.

362
00:54:22,763 --> 00:54:23,972
మూడు వేల రెండు వందల...

363
00:54:24,640 --> 00:54:25,474
వాళ్ళు చనిపోయారా?

364
00:54:26,558 --> 00:54:27,809
హా.

365
00:54:29,895 --> 00:54:30,979
అంటే, అప్పుడు నీ స్థానం, ప్రపంచంలో...

366
00:54:31,730 --> 00:54:32,814
టాప్ అయిదుగురులో ఒకడిని అవుతా.

367
00:54:33,982 --> 00:54:36,902
గత ఏడాది మేలో, యెమెన్ లో చాలా కష్టమైన షాట్ తో
ఎవరినో చంపారు కదా. అది కాల్చింది నువ్వేనా?

368
00:54:39,696 --> 00:54:41,072
గత ఏడాది మేలో, యెమెన్ లో జరిగిన

369
00:54:41,073 --> 00:54:44,200
ఏ ఆపరేషన్ లోనూ నేను పాల్గొనలేదు,
అసలు దాని గురించి తెలీదు కూడా.

370
00:54:44,201 --> 00:54:48,246
ఆ సమయంలో గంటకు 45 కీ.మీ. వేగంతో గాలులు, 75 కీ.మీ.
వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయని పుకారు.

371
00:54:48,247 --> 00:54:51,082
అది కదా అసలైన షాట్ అంటే.

372
00:54:51,083 --> 00:54:53,000
3,800 మీటర్లు.

373
00:54:53,001 --> 00:54:53,919
ప్రపంచ రికార్డ్ అది.

374
00:54:54,503 --> 00:54:56,421
ఆ షాట్ కాల్చిన వ్యక్తికి జీవితాంతం గులాంగా ఉండిపోతా.

375
00:54:57,714 --> 00:54:58,882
ఆ వ్యక్తివి నువ్వు కాకపోవడం బాధాకరం.

376
00:55:02,845 --> 00:55:03,720
ఏంటి?

377
00:55:07,349 --> 00:55:10,268
గత ఆరు నెలల నుండి
ప్రతి రోజు ఈ లోయని చూస్తూ ఉన్నా.

378
00:55:10,269 --> 00:55:14,982
కానీ ఇక్కడి నుండి దాన్ని చూడటం చాలా బాగుంది.

379
00:55:18,777 --> 00:55:20,695
నేను ఆ టవరులోని ప్లాట్ ఫామ్ పై కూర్చొని ఉన్నప్పుడు,

380
00:55:20,696 --> 00:55:22,488
ప్రతిరాత్రి ఏం ఆలోచిస్తానో తెలుసా?

381
00:55:22,489 --> 00:55:24,241
నాతో ఎలా పడక పంచుకోవాలి అనా?

382
00:55:30,414 --> 00:55:31,664
దాని గురించి ఆలోచించిన తర్వాత.

383
00:55:31,665 --> 00:55:33,291
హా, దాని గురించి ఆలోచించిన తర్వాతే. సారీ.

384
00:55:33,292 --> 00:55:35,586
దయచేసి చెప్పు. ఏం ఆలోచిస్తూ ఉంటావు?

385
00:55:37,713 --> 00:55:39,298
ఇక్కడ అసలేం జరుగుతోంది?

386
00:55:40,257 --> 00:55:42,801
లోయలో ఉన్న ఆ హాలో మెన్ అసలు ఎవరు?

387
00:55:44,094 --> 00:55:45,220
అంటే,

388
00:55:46,680 --> 00:55:49,224
నేను పుట్టక ముందు, చాలా కాలం క్రితం,

389
00:55:50,475 --> 00:55:51,685
మా నాన్న కేజీబీ ఏజెంటుగా పని చేసేవాడు.

390
00:55:52,311 --> 00:55:56,315
కొన్నేళ్ల తర్వాత, నా చిన్నప్పుడు,
నాతో ఒక మాట అనేవాడు...

391
00:55:57,983 --> 00:56:01,653
"నా చిట్టి యువరాణి, డ్రాసా, నిజాన్ని భరించడం కష్టం.

392
00:56:02,613 --> 00:56:03,988
దాని గురించి తెలుసుకోకపోవడమే మేలు," అని.

393
00:56:03,989 --> 00:56:06,366
నేనేమో మూలుగుతూ, ముక్కుతూ
"ఎందుకు నాన్నా? నిజం గురించి

394
00:56:07,075 --> 00:56:08,619
తెలుసుకోకపోవడం ఎందుకు మేలు?" అని అడిగా.

395
00:56:11,205 --> 00:56:12,039
దానికి ఆయన ఏమన్నారు?

396
00:56:12,998 --> 00:56:14,249
ఆయన అనే వాడు,

397
00:56:14,958 --> 00:56:17,960
"నిజం మరీ ఎక్కువ తెలిస్తే,
మనస్సుకు బాధ కలుగుతుంది,

398
00:56:17,961 --> 00:56:20,005
మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది," అని.

399
00:56:20,923 --> 00:56:21,924
ఏమోలే.

400
00:56:23,467 --> 00:56:25,802
నా అనుభవంలో, నిజాన్ని దాచడం వల్ల
అలా జరుగుతుందని తెలుసుకున్నాను.

401
00:56:26,720 --> 00:56:28,013
ఆ విషయం ఎప్పుడు తెలుసుకున్నావు?

402
00:56:30,766 --> 00:56:32,142
మొదటిసారి తుపాకీని కాల్చినప్పుడు.

403
00:56:34,019 --> 00:56:35,062
దాని గురించి చెప్తావా మరి?

404
00:56:39,399 --> 00:56:40,566
నేను బెలీజ్ బయటే ఉన్నాను,

405
00:56:40,567 --> 00:56:43,153
రెండు కిలోమీటర్ల దూరంలో
ఒక చేపలు పట్టే పడవలో ఉన్నాను.

406
00:56:45,322 --> 00:56:48,784
అప్పటి నుండి నాకు ప్రతిరోజూ అదే,
పీడకల రూపంలో వస్తూ ఉంది.

407
00:56:50,369 --> 00:56:51,370
ఇది ఎవరికైనా చెప్పావా?

408
00:56:53,455 --> 00:56:54,289
నీకు ఒక్క దానికే చెప్పా.

409
00:56:56,500 --> 00:56:58,210
ఇంతకీ ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు?

410
00:57:03,757 --> 00:57:06,635
ఓరెగాన్ లో ఇంట్లోనే నేను చదువుకొనే వాడిని,
అప్పుడు వేట కూడా నా చదువులో భాగంగా ఉండేది,

411
00:57:07,261 --> 00:57:11,682
నా శిక్షకుల్లో మా నాన్నని మించిన వారు
ఎవరూ లేరని చెప్పగలను.

412
00:57:13,141 --> 00:57:13,976
ఆయనకి అది అంటే ప్రాణం.

413
00:57:15,227 --> 00:57:16,311
నాకూ అది ప్రాణంగా ఆయన మార్చేశాడు.

414
00:57:16,812 --> 00:57:17,938
ఏదంటే ప్రాణంగా?

415
00:57:19,314 --> 00:57:20,941
సరిగ్గా షూట్ చేయడం ఎలా అనే దాన్ని.

416
00:57:24,611 --> 00:57:25,445
హా.

417
00:57:25,946 --> 00:57:26,947
ఇప్పటికీ అది నీకు ప్రాణంగానే ఉందా?

418
00:57:27,447 --> 00:57:28,615
ఇది వరకు ఉన్నంత కాదులే.

419
00:57:30,450 --> 00:57:35,372
ఇదివరకులా ఆ ఆలోచనలను దూరంగా ఉంచలేకపోతున్నా.

420
00:57:37,958 --> 00:57:39,710
మా నాన్నకి నా రహస్యాలన్నీ తెలిసిపోయేవి.

421
00:57:40,836 --> 00:57:42,212
ఆయన దగ్గర దాచాల్సిన అవసరం నాకు రాలేదు.

422
00:57:46,383 --> 00:57:51,805
మరీ ఎక్కువ రహస్యాలను దాచి పెట్టుకుంటే, మనలో
అపరాధ భావం పేరుకుపోయి, మనల్ని దహించేస్తుంది.

423
00:57:58,520 --> 00:58:01,190
నీ పరుపును మెట్ల మీద నుండి
ఇక్కడికి తెచ్చుకొని, ఇక్కడే పడుకుంటున్నావా!

424
00:58:02,399 --> 00:58:03,650
వ్యూహాత్మకంగా అది మంచి పని అనిపించింది.

425
00:58:04,401 --> 00:58:05,569
నేను కూడా ఇలాగే చేసుకున్నా.

426
01:00:03,729 --> 01:00:05,063
నాతో అబద్ధం చెప్పావా, లీవై?

427
01:00:05,981 --> 01:00:07,191
దేని గురించి?

428
01:00:08,692 --> 01:00:10,152
డ్యాన్స్ భయంకరంగా వేస్తావనే దాని గురించి.

429
01:00:12,654 --> 01:00:13,822
అది కొంచెం అబద్ధమే అనుకో.

430
01:01:10,087 --> 01:01:11,088
అదుగో.

431
01:01:11,588 --> 01:01:13,882
దగ్గరగా ఉన్న ఆ మూడింటిని చూడు.

432
01:01:15,217 --> 01:01:16,593
ఓరియన్ నక్షత్రాల కూటమి.

433
01:01:17,427 --> 01:01:18,428
కనిపిస్తోంది.

434
01:01:19,388 --> 01:01:22,266
"వ్యాలంటైన్స్ డే"న తను ఆత్మహత్య చేసుకోబోతున్నాడని,

435
01:01:22,766 --> 01:01:24,560
ఆ సందర్భంగా ఓరియన్ నక్షత్రాల కూటమిని
చూడమని చెప్పాడు.

436
01:01:25,185 --> 01:01:26,270
అయ్యయ్యో.

437
01:01:30,816 --> 01:01:34,278
నిన్ను బాధ కమ్మేసినప్పుడు ఏం చేస్తావు?

438
01:01:36,822 --> 01:01:39,575
కొన్నిసార్లు ఏదైనా కవిత చదువుతాను.

439
01:01:42,619 --> 01:01:44,121
ఒక కవితను రాసే ప్రయత్నం చేస్తాను.

440
01:01:45,205 --> 01:01:46,373
నువ్వు కవితలు రాస్తావా?

441
01:01:48,041 --> 01:01:49,293
దాదాపుగా ప్రతిరోజూ రాస్తా.

442
01:01:50,711 --> 01:01:52,004
నిజంగానా?

443
01:01:53,380 --> 01:01:54,882
నేను కోచింగ్ కూడా తీసుకున్నా.

444
01:01:55,757 --> 01:01:59,344
మేసా కమ్యూనిటీ కాలేజీలో బుధవారం సాయంత్రం,
నాలుగు నుండి ఏడు గంటల దాకా.

445
01:02:00,637 --> 01:02:03,515
అయితే, అందులో ఆరితేరిపోయావా?

446
01:02:04,266 --> 01:02:05,516
లేదు, నా కవితలు భయంకరంగా ఉంటాయి.

447
01:02:05,517 --> 01:02:07,686
అబ్బో. నీ డ్యాన్స్ భయంకరంగా
ఉంటుదన్నావు కదా, ఇది కూడా అలాంటిదేనా?

448
01:02:08,187 --> 01:02:09,479
అవును.

449
01:02:09,980 --> 01:02:11,899
మరి నాకొక భయంకరమైన కవితని రాస్తావా?

450
01:02:12,774 --> 01:02:14,109
రాశానేమో.

451
01:02:15,527 --> 01:02:16,695
చెప్పు మరి.

452
01:02:17,487 --> 01:02:19,698
- అస్సలు చెప్పను.
- అబ్బా, చెప్పు.

453
01:02:20,616 --> 01:02:21,949
చెప్పను కాక చెప్పను.

454
01:02:21,950 --> 01:02:23,826
- కనీసం దాని పేరు అయినా చెప్పు.
- చెప్పను.

455
01:02:23,827 --> 01:02:25,620
అయితే నీ మాట నమ్మను.

456
01:02:25,621 --> 01:02:27,830
నాకు నువ్వు భయంకరమైన కవిత ఏదీ రాయలేదు కదా?

457
01:02:27,831 --> 01:02:29,207
రాశా.

458
01:02:29,208 --> 01:02:30,625
కాకపోతే, దాన్ని ఈమధ్యే ప్రారంభించా.

459
01:02:30,626 --> 01:02:32,461
అయితే పేరేంటో చెప్పు.

460
01:02:34,171 --> 01:02:37,049
- అది తాత్కాలిక పేరే.
- ఆ తాత్కాలిక పేరే చెప్పు.

461
01:02:40,427 --> 01:02:42,221
"నాకు దారి చూపిన మహిళ."

462
01:02:49,186 --> 01:02:50,229
పేరు అంత దారుణంగా ఉందా?

463
01:02:50,979 --> 01:02:51,980
నాకు చాలా బాగా నచ్చింది.

464
01:02:53,815 --> 01:02:55,859
అయ్యయ్యో. చాలా నచ్చింది.

465
01:02:56,485 --> 01:02:58,194
అయినా కానీ నువ్వు నాకు చెప్పాల్సిందే.

466
01:02:58,195 --> 01:03:00,071
- అబ్బా. చెప్పు. ప్లీజ్.
- అది...

467
01:03:00,072 --> 01:03:01,657
అది జరగని పని.

468
01:03:05,285 --> 01:03:06,786
ర్యాబిట్ పై నచ్చిందా?

469
01:03:06,787 --> 01:03:07,871
లేదు.

470
01:03:09,206 --> 01:03:11,041
పిచ్చపిచ్చగా నచ్చేసింది.

471
01:03:33,397 --> 01:03:34,565
అయ్యో!

472
01:03:36,775 --> 01:03:37,901
లీవై!

473
01:06:31,825 --> 01:06:34,076
దాన్ని తాకవద్దు. అది కరుచుకుంటుంది.

474
01:06:34,077 --> 01:06:35,162
సరే.

475
01:06:37,122 --> 01:06:38,081
నా కోసం వచ్చావు కదా.

476
01:06:39,333 --> 01:06:40,918
నాకోసం నువ్వు కూడా ఇలాగే చేస్తావుగా.

477
01:06:44,463 --> 01:06:46,590
- ఏం చోటు ఇది?
- ఏమో.

478
01:06:47,216 --> 01:06:49,258
ఆటో అసెండర్ తాడు తెచ్చావు కదా.

479
01:06:49,259 --> 01:06:50,469
తెచ్చా.

480
01:06:50,969 --> 01:06:53,263
తూర్పు వైపు ఉండే గోడ దగ్గరికి వెళ్లి,
కేబుల్ ఎక్కడ ఉందో చూద్దాం పద.

481
01:07:21,208 --> 01:07:22,209
డ్రాసా.

482
01:08:12,676 --> 01:08:14,011
- నీకేమీ కాలేదు కదా?
- ఏమీ కాలేదు.

483
01:08:15,095 --> 01:08:16,555
వాటికి ఏం కావాలంటావు?

484
01:08:17,264 --> 01:08:21,435
అవి చాలా సన్నగా ఉన్నాయి కదా,
నాకు తెలిసి, అవి మనల్ని తినాలనుకుంటున్నాయి.

485
01:08:22,560 --> 01:08:23,769
వాటిలో ఒకటి గుర్రం మీద వెళ్ళిపోయింది.

486
01:08:23,770 --> 01:08:25,314
హా, చూశా.

487
01:08:30,319 --> 01:08:31,277
అయ్యయ్యో.

488
01:08:31,278 --> 01:08:32,946
- ఏమైంది?
- ఆటో అసెండర్ తాడు.

489
01:08:34,531 --> 01:08:39,077
నదిలో జారి పడిపోయి ఉంటుందేమో,
పైకి 500 మీటర్లు ఎక్కాలి.

490
01:08:42,080 --> 01:08:43,290
మనం ఇక్కడ ఇరుక్కుపోయాం.

491
01:08:49,421 --> 01:08:50,671
దక్షిణం వైపుకు నది వెంబడే పోదాం.

492
01:08:51,423 --> 01:08:53,300
ఈ నీరు లోయను దాటాక, ఏదోక నదిలో కలిసిపోవాలి కదా.

493
01:08:55,551 --> 01:08:56,845
ఇది సైనిక యూనిఫామ్.

494
01:08:59,473 --> 01:09:02,308
సైనికుల పాత యూనిఫామ్.
అమెరికాకి చెందిన మొదటి వాయు దళానికి చెందినది.

495
01:09:02,309 --> 01:09:05,686
నేను అక్కడ బ్రిటిష్ ఎస్ఏఎస్ వారిది,
ఇంకా సోవియెట్ స్పెట్స్ నాజ్ వారిది చూసా.

496
01:09:05,687 --> 01:09:06,897
యుద్ధం తర్వాతివి.

497
01:09:10,192 --> 01:09:12,694
ఈ యూనిఫామ్స్ అన్నీ 1940ల కాలానికి చెందినవి.

498
01:09:15,656 --> 01:09:17,115
అశ్వదళం.

499
01:09:17,783 --> 01:09:19,660
కనిపించకుండా పోయిన బలగాలలోని సైనికులు వీళ్ళే.

500
01:09:20,953 --> 01:09:23,037
లెక్క ప్రకరాం వీళ్లెప్పుడో చనిపోయి ఉండాలి, లీవై.

501
01:09:25,207 --> 01:09:26,500
మనం ఇక్కడ ఉండకూడదు.

502
01:10:07,165 --> 01:10:09,458
"ప్రపంచం అంతా ముగిసిపోయేది ఇలానే.

503
01:10:09,459 --> 01:10:12,004
రెప్పపాటులో కాదు, విషాదంతో ముగుస్తుంది."

504
01:10:13,172 --> 01:10:17,759
జీవనానికి, మరణానికి మధ్య ఉండే ప్రపంచంలో ఇరుక్కుపోయిన
వ్యక్తుల గురించి టీ.యస్. ఎలియట్ రాసిన కవితలోని వాక్యం అది.

505
01:10:18,677 --> 01:10:20,511
ఆ కవిత పేరు "హాలో మెన్."

506
01:10:20,512 --> 01:10:22,097
హాలో మెన్.

507
01:10:24,016 --> 01:10:25,058
అవును.

508
01:11:17,110 --> 01:11:18,904
ఇది భూమి లోపల ఏర్పడిన
పగుళ్ల వల్ల జరిగిన నష్టంలా ఉంది.

509
01:11:19,530 --> 01:11:20,989
భూకంపం కావచ్చు.

510
01:13:10,891 --> 01:13:11,934
సయనైడ్.

511
01:13:12,976 --> 01:13:14,645
వీళ్ళు ఆత్మహత్యకి పాల్పడ్డారు.

512
01:13:17,606 --> 01:13:18,607
చావు కన్నా భయంకరమైనది ఏంటి?

513
01:13:19,358 --> 01:13:20,776
ఈ చోటు మంచిది కాదు.

514
01:15:31,573 --> 01:15:33,075
గోడకి రంధ్రం పెడుతున్నా!

515
01:15:49,633 --> 01:15:53,011
అయ్య బాబోయ్. ఇవి అన్ని చోట్లా ఉన్నాయి.
మనల్ని సులభంగా కనిపెట్టేస్తాయి.

516
01:15:54,179 --> 01:15:55,264
అక్కడ లోయ గోడ ఉంది.

517
01:16:00,477 --> 01:16:01,644
లీవై.

518
01:16:01,645 --> 01:16:03,187
లోపల ఇరుక్కుపోయామంటే, మన బతుకు బస్టాండే.

519
01:16:03,188 --> 01:16:04,648
ఇప్పుడు మన బతుకు ఏదో సూపర్ ఉన్నట్టు.

520
01:16:09,987 --> 01:16:11,029
తలుపుకు అడ్డంగా ఏమైనా పెడదాం.

521
01:18:29,334 --> 01:18:31,295
దేవుడు మమ్మల్ని క్షమించును గాక

522
01:18:35,257 --> 01:18:36,258
లీవై.

523
01:18:43,182 --> 01:18:44,724
ఇది బ్యాకప్ జెనరేటర్.

524
01:18:44,725 --> 01:18:47,227
ప్రొపేన్ ఎంత కాలమైనా స్థిరంగానే ఉంటుంది, కాబట్టి...

525
01:19:18,550 --> 01:19:23,305
ఇవాళ తేదీ జూలై పన్నెండో, పదమూడో, 1946.

526
01:19:24,264 --> 01:19:25,890
తూర్పు దేశాలు, పశ్చిమ దేశాలు

527
01:19:25,891 --> 01:19:28,810
ఒక రహస్య కూటమిగా ఏర్పాటయ్యాయి,
అందులో భాగంగా మా కమ్యూనిటీ ఏర్పడింది.

528
01:19:29,686 --> 01:19:31,395
రెండవ ప్రపంచ యుద్ధంలోని చివరి సంవత్సరాలలో,

529
01:19:31,396 --> 01:19:33,648
రాబర్ట్ ఓపెన్హైమర్, ఇంకా అతని లాస్ ఆలమోస్ కమ్యూనిటీ

530
01:19:33,649 --> 01:19:34,815
అణు బాంబును నిర్మించగా,

531
01:19:34,816 --> 01:19:38,445
మేము అంతే వినాశనాన్ని కలిగించగల
బయో కెమికల్ మిస్సైల్స్ ని తయారు చేసే పనిలో పడ్డాం.

532
01:19:39,196 --> 01:19:43,074
ఆరు రోజుల క్రితం,
ఇక్కడ 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది,

533
01:19:43,075 --> 01:19:46,202
దానితో ఈ కేంద్రం ప్రమాదం ముంగిట పడిపోయింది.

534
01:19:46,203 --> 01:19:51,124
ఇక్కడ ఇప్పుడు మా డ్యూటీ పరిశోధన కాదు,
ఈ ఉపద్రవాన్ని అడ్డుకోవడం.

535
01:19:54,711 --> 01:19:57,171
ఈ విషపదార్థం లోయను దాటి బయటకు పోకుండా చూడటానికి

536
01:19:57,172 --> 01:19:59,883
మేము పగలనకా రాత్రనకా కష్టపడుతున్నాం.

537
01:20:01,301 --> 01:20:03,469
ఈ బయోకెమికల్ విషపదార్థం బారిన పడటం వలన

538
01:20:03,470 --> 01:20:08,057
మా లోయ పరిసరాల్లో ఉండే జీవుల డీఎన్ఏలన్నీ

539
01:20:08,058 --> 01:20:09,393
ఏకమయిపోయాయి.

540
01:20:09,977 --> 01:20:15,774
మానవ డీఎన్ఏ మొక్కలు, జంతువులు,
చివరికి పురుగుల డీఎన్ఏలలో కలిసిపోయింది.

541
01:20:17,651 --> 01:20:20,862
ఈ విష పదార్థాన్ని కొందరి దేహాలు
బాగానే ఎదుర్కొంటున్నాయి,

542
01:20:20,863 --> 01:20:24,283
మరీ ముఖ్యంగా దాని బారిన పడటం అనేది
రోజుల్లో కాకుండా కొన్ని గంటలకే పరిమితం అయ్యున్నప్పుడు.

543
01:20:25,367 --> 01:20:28,744
ఇన్ఫెక్షన్ జరిగితే, మ్యుటేషన్లు
అయిదు రోజుల్లో ప్రత్యక్షం అవుతాయి.

544
01:20:28,745 --> 01:20:29,829
తుది శాంపిల్

545
01:20:29,830 --> 01:20:33,125
అవి భౌతికంగానే ఇలా దర్శనమిస్తాయి.

546
01:20:36,670 --> 01:20:40,173
వ్యూహాత్మకంగా ఈ మారుమూల ప్రాంతాన్ని
ఎంచుకొని మేము చాలా మంచి పని చేశాం,

547
01:20:40,174 --> 01:20:43,718
ఈ ఒక్క కారణమే, మాకు పట్టే దుర్గతి
మిగతా మానవ జాతికి పట్టకుండా

548
01:20:43,719 --> 01:20:45,971
అడ్డుకోవడంలో సహాయపడవచ్చు.

549
01:20:47,514 --> 01:20:48,765
నన్ను క్షమించండి.

550
01:20:49,474 --> 01:20:51,602
మాపై దేవుడు కరుణ చూపు గాక.

551
01:21:00,360 --> 01:21:03,738
విష పదార్థం బారిన కొన్ని గంటలే పడితే,
మనకి ఏమి కాకపోవచ్చు అనిపిస్తోంది.

552
01:21:03,739 --> 01:21:06,325
అయితే త్వరగా బయట పడే మార్గం కనుగొందాం.

553
01:21:07,534 --> 01:21:08,410
ఏంటి?

554
01:21:09,620 --> 01:21:10,954
మనం బయట పడే మార్గం కావచ్చు.

555
01:21:19,588 --> 01:21:21,507
ఇది 1940ల కాలానికి చెందినవి కావు.

556
01:21:22,174 --> 01:21:23,217
ఇవి 2000ల చివరి కాలానికి చెందినవి.

557
01:21:24,718 --> 01:21:26,677
బాంబ్ స్క్వాడ్ ని పంపిస్తే సరిపోతుంది కదా?

558
01:21:26,678 --> 01:21:28,764
ఈ పిచ్చి చోటిని పేల్చి పడేసి,
దీనికి ముగింపు పలకవచ్చు కదా.

559
01:21:30,891 --> 01:21:33,143
"డార్క్ లేక్." పారామిలిటరీ సంస్థ.

560
01:21:34,102 --> 01:21:35,269
ఈ లోయలో ఉండే దానిపై

561
01:21:35,270 --> 01:21:37,189
వీళ్ళు ఇంకా అధ్యయనం చేస్తున్నారు,
అందుకే ఇంకా పేల్చేయలేదు.

562
01:21:38,899 --> 01:21:40,776
మనం పని చేసేది సైన్యం తరఫున కాదు.

563
01:21:45,322 --> 01:21:47,491
దీన్నంతటినీ ఉపయోగించి
వాళ్ళు రీసెర్చ్ డ్రోన్లను ఏర్పాటు చేసుకున్నారు.

564
01:21:48,784 --> 01:21:52,621
డార్క్ లేక్ అనేది చాలా పెద్ద సంస్థ,
వాళ్ళు ప్రధానంగా జెనెటిక్ రీసెర్చ్ సాగిస్తుంటారు.

565
01:21:54,706 --> 01:21:57,501
వాళ్ళ డ్రోన్లు హైబ్రిడ్ డీఎన్ఏ శాంపిళ్లను సేకరిస్తున్నాయి.

566
01:21:58,460 --> 01:22:00,128
వాళ్ళు సూపర్ సోల్జర్లకు శ్రీకారం చుట్టే పనిలో ఉన్నారు.

567
01:22:01,046 --> 01:22:02,840
ఇది కదా దిమ్మతిరిగిపోయే రహస్యం అంటే.

568
01:22:03,507 --> 01:22:06,175
యువ సైనికులపై, శాస్త్రవేత్తలపై
పాశవికంగా పరీక్షలు జరిపారు.

569
01:22:06,176 --> 01:22:08,678
ప్రైవేట్ డిఫెన్స్ కాంట్రాక్టర్లు ఎన్నో దశాబ్దాల నుండి,

570
01:22:08,679 --> 01:22:11,265
జన్యుపరంగా సైనికులను మెరుగుపరచడం
ఎలా అనేదానిపై పని చేస్తున్నారు,

571
01:22:12,015 --> 01:22:14,059
ఇక్కడ ఉండేదంతా జన్యుపరంగా సరికొత్తది కదా.

572
01:22:15,561 --> 01:22:17,479
వాళ్ళ రహస్యాలను కాపాడటానికే మనల్ని ఇక్కడికి పంపారు.

573
01:22:23,151 --> 01:22:26,237
{\an8}'స్ట్రేడాగ్'

574
01:22:26,238 --> 01:22:27,614
"స్ట్రే-డాగ్"

575
01:22:38,208 --> 01:22:39,292
అత్యంత రహస్యమైనది
స్ట్రేడాగ్:

576
01:22:39,293 --> 01:22:40,794
లోయకు సంబంధించి, స్వీయ వినాశక ప్రోటోకాల్

577
01:22:42,337 --> 01:22:43,505
{\an8}స్ట్రే డాగ్ మిస్సైల్ ప్రభావం,
మొత్తం నాశనం:

578
01:22:44,548 --> 01:22:47,800
లోయను శాటిలైట్లు పసిగట్టే పరిస్థితి వస్తే,
ప్రోటోకాల్ ఆటోమేటిక్ గా అమలైపోతుంది

579
01:22:47,801 --> 01:22:49,468
థర్మల్ రేడియేషన్ సేఫ్ జోన్:

580
01:22:49,469 --> 01:22:51,054
4.2 కిలోమీటర్లు

581
01:23:01,481 --> 01:23:04,067
మనం బయటకు వెళ్లే ముందు,
నీకు నేనొకటి చెప్పాలి.

582
01:23:04,693 --> 01:23:06,068
అదేంటో ఊహించి చెప్పనా!

583
01:23:06,069 --> 01:23:07,196
నీ కవిత గురించా?

584
01:23:08,405 --> 01:23:10,073
కాదు, నా కవిత గురించి కాదు.

585
01:23:13,202 --> 01:23:16,954
ఏదైనా జరగరానిది జరిగి,
మనం ఇక్కడి నుండి తప్పించుకోలేకపోయి,

586
01:23:16,955 --> 01:23:19,833
ఈ లోకానికి, మనకి నూకలు చెల్లిపోతే,

587
01:23:21,418 --> 01:23:22,878
నాకు ఆనందమే తప్ప బాధ ఉండదు,

588
01:23:24,129 --> 01:23:25,589
ఎందుకంటే, నువ్వు నా జీవితంలోకి వచ్చావు.

589
01:23:26,507 --> 01:23:27,883
మన మధ్య ఈ బంధం

590
01:23:28,967 --> 01:23:30,511
అంత సులువుగా ఏర్పడలేదు.

591
01:23:31,011 --> 01:23:32,012
అవును, అది నిజం.

592
01:23:43,023 --> 01:23:44,274
దీనికి నువ్వు సిద్ధమేనా?

593
01:23:46,777 --> 01:23:48,237
భయంకరంగా విరుచుకుపడదాం.

594
01:23:55,953 --> 01:23:59,248
నా గేర్ బ్యాగ్. దాన్ని ఇక్కడే పెట్టా.
మందు గుండు అంతా దానిలోనే ఉంది.

595
01:24:06,046 --> 01:24:08,090
ఇవి తెలివిగా ఆలోచించగలవు.

596
01:24:23,397 --> 01:24:24,982
మనతో ఆటలాడుకుంటున్నాయి.

597
01:24:25,607 --> 01:24:27,526
మనకి ఏమీ కనిపించదని వాటికి తెలుసు.

598
01:24:31,405 --> 01:24:32,948
వాటికి కూడా ఏమీ కనిపించకుండా చేద్దాం.

599
01:25:26,293 --> 01:25:27,628
డ్రాసా!

600
01:26:45,706 --> 01:26:48,208
డ్రాసా!

601
01:27:32,669 --> 01:27:37,299
అసలే చండాలంగా ఉన్న
నీ ముఖాన్ని ఇంకా చండాలంగా చేసి పడేస్తా.

602
01:29:22,362 --> 01:29:23,447
నీకేమీ కాలేదు కదా?

603
01:29:25,741 --> 01:29:27,534
- నాకేం కాలేదు. ఏమీ కాలేదు.
- సరే.

604
01:29:33,665 --> 01:29:35,292
"బీ. షా."

605
01:29:36,585 --> 01:29:37,669
బ్రాడ్ఫర్డ్.

606
01:29:40,756 --> 01:29:43,050
వెస్ట్ టవరులో డ్యూటీ చేసిన మొదటి సైనికుడు ఇతనే.

607
01:29:44,510 --> 01:29:46,345
హాలో మెన్ అనే పేరు ఇతను పెట్టిందే.

608
01:29:51,475 --> 01:29:52,309
లీవై.

609
01:29:57,231 --> 01:29:58,315
మనం ఎక్కడ ఉన్నాం?

610
01:30:07,449 --> 01:30:09,617
కెమికల్ మిస్సైల్ కేంద్రంలో ఉన్నాం.

611
01:30:09,618 --> 01:30:11,619
మిస్సైల్ టవరు ద్వారా కిందికి వచ్చా నేను.

612
01:30:11,620 --> 01:30:13,247
మనం బయటకు వెళ్ళాలన్నా ఆ దారి గుండానే వెళ్ళాలి.

613
01:30:25,926 --> 01:30:29,179
భూకంపం వల్ల మిస్సైల్స్ దెబ్బతిన్నాయి,
వాటి నుండి రసాయన పదార్థాలు లీక్ అవ్వడం మొదలైంది.

614
01:30:32,057 --> 01:30:34,309
పొగలో దానికి విరుగుడు ఉంది.

615
01:33:32,112 --> 01:33:34,114
నిర్వహణ

616
01:33:46,293 --> 01:33:47,878
ఇక్కడి నుండి ఎలా బయటపడాలో నాకొక ఐడియా వచ్చింది.

617
01:33:48,378 --> 01:33:50,505
ఈ పాత జీపులకు చాలా శక్తిమంతమైన వించులు ఉంటాయి.

618
01:33:50,506 --> 01:33:52,508
వాటిని సరిగ్గా వాడుకుంటే
ఆటో అసెండర్ తాడులా ఉపయోగించుకోవచ్చు.

619
01:34:30,420 --> 01:34:31,963
తూర్పు గోడ దగ్గరికి పద.

620
01:34:31,964 --> 01:34:33,549
జిప్ లైన్ దగ్గర్లోనే ఉండాలి.

621
01:34:36,593 --> 01:34:38,262
అదుగో. అక్కడ ఉంది.

622
01:35:03,996 --> 01:35:05,289
బుల్లెట్స్ అయిపోయాయి.

623
01:36:01,803 --> 01:36:03,180
లీవై.

624
01:36:10,979 --> 01:36:11,980
లీవై!

625
01:36:22,741 --> 01:36:23,659
టూల్ బాక్స్ ఇవ్వు.

626
01:37:22,718 --> 01:37:23,844
అయ్యయ్యో!

627
01:37:28,515 --> 01:37:29,349
ప్రొపేన్ ని వదిలేయ్!

628
01:38:12,518 --> 01:38:13,852
తాడును తెంపేయ్.

629
01:38:14,520 --> 01:38:15,521
లీవై.

630
01:38:45,217 --> 01:38:46,760
కింద ఓ వింత లోకం ఉన్నట్టుగా ఉంది.

631
01:38:48,929 --> 01:38:50,931
భయంకరమైన పీడకలలా అన్నమాట.

632
01:38:53,600 --> 01:38:55,894
నా దృష్టిలో అది నరక లోకమే.

633
01:38:58,272 --> 01:39:00,065
ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి,
మనం వేరుగా ఉండాలి.

634
01:39:02,359 --> 01:39:03,443
అయిదు రోజులు.

635
01:39:08,365 --> 01:39:09,783
ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ సోకితే?

636
01:39:12,578 --> 01:39:14,371
తుపాకీతో కాల్చుకుని చనిపోతా.

637
01:39:19,835 --> 01:39:20,878
నేను కూడా.

638
01:39:22,504 --> 01:39:24,339
రేపు నాకు రేడియో చెక్ ఉంది.

639
01:39:25,132 --> 01:39:26,091
నాకు కూడా.

640
01:39:26,967 --> 01:39:29,553
కానీ ఆ టవరుకు ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు.

641
01:39:30,053 --> 01:39:32,389
వెనుక పక్క, సీ19 గ్రాప్లింగ్ గన్ ఉంది.

642
01:39:33,974 --> 01:39:35,184
దానితో దాటవచ్చు.

643
01:39:36,059 --> 01:39:38,769
రష్యన్ల దగ్గర మంచి ఆయుధ సామాగ్రే ఉన్నట్టుంది.

644
01:39:38,770 --> 01:39:41,815
వాళ్ళ వోడ్కా కూడా కత్తిలా ఉంటుంది.

645
01:39:42,733 --> 01:39:43,734
ఇదుగో.

646
01:39:45,152 --> 01:39:47,237
ప్రాణాలతో బయటపడినందుకు చీర్స్.

647
01:39:56,079 --> 01:39:58,248
అసలు నాకు ఈ పని ఎందుకు అప్పగించారో తెలుసా?

648
01:39:58,790 --> 01:40:01,043
యెమెన్ లో నువ్వు షూట్ చేసిన ఆ అద్భుతమైన షాట్ వల్లనా?

649
01:40:02,419 --> 01:40:04,546
లేదు, దాని గురించి నేను చెప్పింది నిజమే.

650
01:40:05,297 --> 01:40:06,631
అది కాల్చింది నేను కాదు.

651
01:40:06,632 --> 01:40:07,841
నాకు తెలుసు.

652
01:40:08,342 --> 01:40:10,260
ఆ షాట్ కాల్చింది ఎవరో నాకు తెలుసు.

653
01:40:13,347 --> 01:40:14,598
నీకు ఈ పని ఎందుకు అప్పగించారంటావు?

654
01:40:16,850 --> 01:40:19,436
నన్ను "యూజ్ అండ్ త్రో"గా
వాడుకోవచ్చనే వాళ్ళు ఎంచుకున్నారు.

655
01:40:20,312 --> 01:40:21,563
"యూజ్ అండ్ త్రో"గానా?

656
01:40:22,523 --> 01:40:23,774
ఏ అనుబంధాలూ లేవు.

657
01:40:24,274 --> 01:40:26,944
నేను ఏమైపోయినా పట్టించుకొనే నాథుడే ఉండదు.

658
01:40:29,029 --> 01:40:31,365
తర్వాతి మిషన్ కోసం ఎదురుచూసి
అది చేయడం తప్ప జీవితంలో పీకడానికి ఏం లేదు.

659
01:40:34,576 --> 01:40:36,328
కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఉంది నా పరిష్టితి.

660
01:40:38,205 --> 01:40:40,290
ఇప్పుడు నా జీవితానికి ఒక అర్థం ఉంది.

661
01:40:45,254 --> 01:40:46,380
మనం అజ్ఞాతవాస జీవితం గడపవచ్చు.

662
01:40:47,047 --> 01:40:50,467
ఫ్రాన్స్ లో నాకొక చోటు తెలుసు,
అక్కడ మనం సురక్షితంగా ఉంటాం.

663
01:40:50,968 --> 01:40:52,427
మనం ఎంత కాలం కావాలనుకుంటే అంత కాలం.

664
01:40:53,220 --> 01:40:58,599
డ్రాసా, నీతో నరకానికైనా రాగలను నేను.

665
01:40:58,600 --> 01:41:00,643
కానీ ఈ ప్రాంతం సంగతేంటి?

666
01:41:00,644 --> 01:41:03,271
మన తర్వాత ఇంకో ఇద్దరు సైనికులని
ఇక్కడికి పంపిస్తారు కదా,

667
01:41:03,272 --> 01:41:06,817
వాళ్లకి వీళ్ళ రహస్యాలు, అబద్ధాలు
తెలియవచ్చు, మరి వాళ్ళ సంగతి ఏంటి?

668
01:41:09,319 --> 01:41:11,697
పైగా, ప్రతి హాలో మ్యాన్ కూడా నడిచే మృత్యువే.

669
01:41:12,406 --> 01:41:13,866
కాబట్టి, ఒక హాలో మ్యాన్ బయటకు వచ్చినా...

670
01:41:18,412 --> 01:41:20,247
మనం లోయని ధ్వంసం చేయాలి.

671
01:41:28,130 --> 01:41:31,757
మ్యుటేషన్లు అయిదు రోజుల్లో
బయటపడతాయని గుర్తుంచుకో.

672
01:41:31,758 --> 01:41:35,094
కాబట్టి, ఆరవ రోజు కూడా
మనకి ఏమీ కాకపొతే, మనకేమీ ప్రమాదం లేనట్టే.

673
01:41:35,095 --> 01:41:37,180
- కానీ మనకి ఏమైనా అయితే...
- అప్పుడు మనం చనిపోవాల్సిందే.

674
01:41:37,181 --> 01:41:40,058
కానీ మనకి ఏమీ కాకపోతే, వచ్చే వారం కలుసుకుందాం.

675
01:41:42,019 --> 01:41:43,020
ధైర్యంగా ముందుకు సాగుదాం.

676
01:41:43,604 --> 01:41:45,606
- అంతే కదా?
- అంతేగా మరి.

677
01:41:49,026 --> 01:41:51,069
- చూడు...
- వీడ్కోలు మాత్రం చెప్పకు.

678
01:41:52,571 --> 01:41:54,113
నువ్వు ఆ మాట అనడం నాకు ఇష్టం లేదు.

679
01:41:54,114 --> 01:41:55,656
నేనేమీ వీడ్కోలు చెప్పట్లేదు.

680
01:41:55,657 --> 01:41:58,702
సరే. మరేం చెప్పబోతున్నావు?

681
01:42:07,586 --> 01:42:08,879
ఐ లవ్ యూ అని చెప్పబోతున్నా.

682
01:42:15,260 --> 01:42:18,013
నేను వెస్ట్ టవర్ నుండి రేడియో చెక్ చేస్తున్నాను.
నా మాటలు వినిపిస్తున్నాయా?

683
01:42:19,473 --> 01:42:21,474
మళ్ళీ చెప్తున్నా, నేను వెస్ట్ టవర్ నుండి
రేడియో చెక్ చేస్తున్నాను.

684
01:42:21,475 --> 01:42:23,392
నా మాటలు వినిపిస్తున్నాయా? ఓవర్.

685
01:42:23,393 --> 01:42:24,853
అధికార కోడ్ చెప్పండి.

686
01:42:25,812 --> 01:42:27,980
డెల్టా, థీటా, ఫోర్, వన్, ఒమేగా.

687
01:42:27,981 --> 01:42:29,191
లైనులో ఉండండి.

688
01:42:30,943 --> 01:42:34,363
లీవై? నన్ను గుర్తుపట్టావా?

689
01:42:36,657 --> 01:42:37,990
హా.

690
01:42:37,991 --> 01:42:41,370
మా రీసెర్చ్ డ్రోన్ కంప్యూటర్ సిస్టమ్ ని ఎవరో ఆన్ చేశారు.

691
01:42:42,412 --> 01:42:44,248
నువ్వు లోయలోకి వెళ్ళావా?

692
01:42:44,998 --> 01:42:48,794
లేదు. కానీ ఇక్కడి నుండి
మీ డ్రోన్ ఒకటి ఎగిరిపోతుండగా చూశా.

693
01:42:49,336 --> 01:42:51,672
చూస్తుంటే మీరంత గొప్ప స్పైలా అనిపించట్లేదు.

694
01:42:52,965 --> 01:42:54,465
సైన్స్ రంగంలో పురోగతి అంటే,

695
01:42:54,466 --> 01:42:58,095
అది ఈ రోజుల్లో ప్రైవేట్ రంగంలోనే సాధ్యమవుతుంది.

696
01:42:58,679 --> 01:43:01,347
నేను ఇక్కడ చేసే పని ఎలాంటిదో నీకు తెలుసా?

697
01:43:01,348 --> 01:43:03,350
బాగా డబ్బులు ముట్టే పనిలానే ఉంది.

698
01:43:03,934 --> 01:43:06,561
మా పరిశోధన తాలూకు ప్రధాన లక్ష్యం ఏంటంటే,

699
01:43:06,562 --> 01:43:09,522
అమెరికా పదాతి దళాలను ప్రపంచంలోని సైన్యాలన్నింటి కన్నా

700
01:43:09,523 --> 01:43:12,567
శక్తిమంతమైనవిగా చేయడం.

701
01:43:12,568 --> 01:43:16,113
అలాంటి సైన్యం ఉంటే, మనం ఏమేం చేయవచ్చో
నీకు బాగానే తెలుసు అనుకుంటా.

702
01:43:17,906 --> 01:43:19,116
బాగా తెలుసు.

703
01:43:21,577 --> 01:43:27,541
లీవై, ఈస్ట్ టవరులో ఉండే వ్యక్తి
ఏమైనా పనులు చేస్తున్నట్టు నువ్వు గమనించావా?

704
01:43:31,670 --> 01:43:32,671
లేదు.

705
01:43:33,297 --> 01:43:37,426
ఎందుకంటే, లోయలోని కంప్యూటర్ సిస్టమ్ ని
ఆన్ చేసింది నువ్వు కాకపోతే,

706
01:43:38,010 --> 01:43:40,637
ఆ పని ఈస్ట్ టవరులో ఉండే వ్యక్తి చేసినట్టుగా
నేను భావించాల్సి ఉంటుంది.

707
01:43:42,347 --> 01:43:45,601
ఎంతైనా, అక్కడ ఉండేది మీ ఇద్దరే కదా.

708
01:43:48,228 --> 01:43:50,772
ఆ ఈస్ట్ టవరులో ఉండే వ్యక్తిని నువ్వు హతమార్చాలి.

709
01:43:52,733 --> 01:43:54,151
తక్షణమే.

710
01:43:55,152 --> 01:43:56,612
అర్థమైందా?

711
01:43:58,363 --> 01:43:59,906
ఆ సంగతి నాకు వదిలేయండి.

712
01:43:59,907 --> 01:44:03,243
అలాగే. థ్యాంక్యూ, లీవై.

713
01:44:15,589 --> 01:44:18,550
డార్క్ లేక్ కంప్యూటర్ గది
కమాండ్ సెంటర్ - కెమెరా 2

714
01:44:23,722 --> 01:44:27,808
కమాండర్, లీవై కేన్ అదుపు తప్పాడు.

715
01:44:27,809 --> 01:44:30,228
నీ బృందాన్ని సిద్ధంగా ఉంచు.
రేపు ఉదయాన్నే మనం బయలుదేరుతున్నాం.

716
01:44:30,229 --> 01:44:32,146
మీరు కూడా మాతో వస్తారా, మేడమ్?

717
01:44:32,147 --> 01:44:33,732
అతడిని ఎంచుకొని తప్పు చేసింది నేనే కదా.

718
01:44:34,608 --> 01:44:37,027
అవసరమైతే, నా చేతులతోనే అతడిని చంపుతాను.

719
01:45:33,208 --> 01:45:35,502
ఐ లవ్ యూ టూ.

720
01:45:56,648 --> 01:45:58,650
డార్క్ లేక్

721
01:46:00,235 --> 01:46:01,486
పారిపో!

722
01:46:34,686 --> 01:46:37,104
టవరులో కానీ, చుట్టు పక్కల కానీ

723
01:46:37,105 --> 01:46:39,148
లీవై కేన్ జాడే లేదు.

724
01:46:39,149 --> 01:46:40,859
ఒకవేళ అతను పారిపోవాలని అనుకుంటే?

725
01:46:43,737 --> 01:46:45,196
క్వాడ్ కాప్టర్స్ ని యాక్టివేట్ చేయండి.

726
01:46:45,197 --> 01:46:47,406
ఈస్ట్ టవరులో ఉండాల్సిన వ్యక్తి కూడా లేదు.

727
01:46:47,407 --> 01:46:50,452
లీవై, తనకి అప్పగించిన పోస్టులో లేనప్పుడు,
ఆమెని చంపివుంటాడని నమ్మకం ఏంటి?

728
01:46:52,454 --> 01:46:53,622
వాటిని తలోదిక్కుకు పంపండి.

729
01:46:54,122 --> 01:46:56,667
డ్రోన్ ప్రోటోకాల్, క్వాడ్ కాప్టర్స్, ధృవీకరణ...

730
01:47:12,015 --> 01:47:13,058
3.6 కిలోమీటర్లు

731
01:48:09,198 --> 01:48:10,741
3.8 కిలోమీటర్లు

732
01:49:25,816 --> 01:49:27,734
కమాండర్, గోడ మీద ఏవో ఉన్నాయి, ఏంటవి?

733
01:49:56,430 --> 01:49:59,433
"మూడు విషయాలను ఎక్కువ కాలం దాచలేము:

734
01:50:00,225 --> 01:50:04,771
సూర్యుడిని, చంద్రుడిని, నిజాన్ని.

735
01:50:06,273 --> 01:50:07,191
బుద్ధుడు.

736
01:50:09,568 --> 01:50:11,028
లీవై కేన్"

737
01:50:45,354 --> 01:50:46,772
ఆ శబ్దాలు ఏంటి?

738
01:51:08,585 --> 01:51:12,381
క్లోకర్స్. అతను క్లోకర్స్ ఫంక్షనాలిటీని
ప్రభావితం చేశాడు.

739
01:51:15,759 --> 01:51:17,135
లోయ గుట్టు బయటపడిపోయింది.

740
01:51:26,520 --> 01:51:27,980
స్ట్రేడాగ్.

741
01:51:30,107 --> 01:51:31,483
మనకి రెండే నిమిషాల సమయం ఉంది.

742
01:51:37,281 --> 01:51:39,408
తక్షణమే టేకాఫ్ అవ్వాలి. సిద్ధం కండి.

743
01:51:54,840 --> 01:51:56,884
వెంటనే టేకాఫ్ చేయండి.

744
01:52:17,821 --> 01:52:20,949
మనకి కావాల్సింది ఎత్తు కాదు! దూరం!

745
01:52:43,555 --> 01:52:45,057
త్వరగా!

746
01:54:04,970 --> 01:54:09,183
నా ప్రాణాలు పోతే
సూర్యాస్తమయ సమయంలో తెరువు

747
01:54:28,702 --> 01:54:31,205
ఏజ్, ఫ్రాన్స్

748
01:55:13,205 --> 01:55:14,121
{\an8}నాకు దారి చూపిన మహిళ

749
01:55:14,122 --> 01:55:15,581
{\an8}నేను ఆశపడవచ్చన్న విషయం నాకు తెలీదు.

750
01:55:15,582 --> 01:55:16,916
{\an8}ఒక ఆశ నన్ను వేధించగలదన్న విషయం తెలీదు.

751
01:55:16,917 --> 01:55:18,627
{\an8}నిన్ను హత్తుకోవాలని,
నీ కౌగిలిలో బాధలన్నీ మర్చిపోవాలని.

752
01:55:56,707 --> 01:55:59,293
ఏప్రిల్

753
01:56:30,032 --> 01:56:33,285
{\an8}నాకు ర్యాబిట్ పై కావాలి

754
01:56:53,305 --> 01:56:54,680
హలో, డ్రాసా.

755
01:56:54,681 --> 01:56:57,768
హలో, లీవై. నువ్వు బాగా ఆలస్యంగా వచ్చావు.

756
01:56:58,727 --> 01:57:01,854
క్షమించు. పాత పని చేసేటప్పుడు గాయమైంది.

757
01:57:01,855 --> 01:57:05,316
కొత్త పని కోసం చూస్తున్నట్లయితే,
కిచెన్ లోకి మనుషులు కావాలి.

758
01:57:05,317 --> 01:57:06,735
ప్రత్యేకమైన నైపుణ్యాలు ఏవైనా ఉన్నాయా?

759
01:57:08,237 --> 01:57:09,487
షూటింగ్ లో నేను పిస్తాని.

760
01:57:09,488 --> 01:57:10,863
ఎంత పిస్తావి?

761
01:57:10,864 --> 01:57:12,824
చివరిసారి 3,900 మీటర్ల దూరం నుండి కాల్చా.

762
01:57:13,617 --> 01:57:15,410
నా రికార్డును చెరిపివేయాలని ఆత్రం కదా నీకు.

763
01:57:17,037 --> 01:57:18,497
నీ దగ్గరకి రావాలని ఆత్రం.

764
01:58:01,206 --> 01:58:04,293
{\an8}పుట్టిన రోజు. అదిరింది.

765
01:58:06,920 --> 01:58:08,379
{\an8}"మూడు విషయాలను ఎక్కువ కాలం దాచలేము:

766
01:58:08,380 --> 01:58:09,965
{\an8}సూర్యుడిని, చంద్రుడిని, నిజాన్ని.

767
01:58:23,395 --> 01:58:24,855
దేవుడు మమ్మల్ని క్షమించును గాక

768
02:07:41,620 --> 02:07:43,622
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్



